టీవీ ఛానళ్ల సబ్‌స్క్రిప్షన్ రేట్లు 5-8 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిస్నీ స్టార్, వయాకామ్ 18, జీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా వంటి బ్రాడ్‌కాస్టర్లు తమ బొకే(ఛానళ్ల సమూహం) రేట్లు పెంచనున్నట్లు తెలిపాయి.
కొత్త టారిఫ్ ఒప్పందాలపై సంతకం చేయని డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్ ఆపరేటర్లకు (డీపీఓ) సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు సిగ్నళ్లను తొలగించకూడదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) బ్రాడ్‌కాస్టర్లను ఆదేశించింది. దాంతో ఎన్నికలు ముగిసే వరకు కంపెనీలు ఈమేరకు చర్యలు తీసుకోలేదు. తాజాగా ఎన్నికల ఫలితాలు సైతం వెలువడడంతో తిరిగి సబ్‌స్క్రిప్షన్ రేట్ల పెంపు అంశం వెలుగులోకి వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: జూన్ 14 తర్వాత ఆధార్ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐ
జనవరిలో ప్రముఖ బ్రాడ్‌కాస్టర్లు తమ బేస్ బొకే రేట్లను సుమారు 10 శాతం పెంచారు. భారతీయ క్రికెట్ హక్కులను చేజిక్కించుకోవడంతో సాధారణ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్ల కంటే వయోకామ్18 అత్యధికంగా 25 శాతం పైగా రేట్లును పెంచింది. అయితే పెరిగిన ధరలు ఫిబ్రవరి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ట్రాయ్ నిబంధనల వల్ల వాటికి బ్రేక్ పడింది.
Comments
Please login to add a commentAdd a comment