tv channel
-
Sakshi Little Stars: తారే జమీన్ పర్
‘మేం పాటలు పాడతాం. డైలాగ్స్ గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తాం. పొడుపుకథలు వేస్తాం, ప్రశ్నలతో తికమక పెట్టేస్తాం. స్కూల్లో చదువుకుంటాం, సినిమాల్లో నటిస్తాం, డ్యాన్స్‌లే కాదు అల్లరి కూడా చేస్తాం ...’ అంటూ బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం ‘సాక్షి’ మీడియా హౌస్ హైదరాబాద్ ఆఫీసులో ఏర్పాటు చేసిన వేదిక ద్వారా పలువురు బాల తారలు తమ ఆనందాలను పంచుకున్నారు. స్కూల్ విద్యార్థులు అడిగిన పొడుపు కథలకు ఈ ‘లిటిల్ స్టార్స్’ ఆన్సర్ చేయడం, లిటిల్ స్టార్స్ కోరిన పాటలను స్కూల్ విద్యార్థులు పోటీ పడుతూ పాడటంతో కార్యక్రమం సందడిగా మారింది.స్కూల్లో రన్నింగ్, ఖోఖో, కబడ్డి, క్రికెట్, బాస్కెట్ బాల్... వంటి ఆటలన్నీ ఆడతాం అంటూ మొదలు పెట్టిన పిల్లలు కరెంట్ షాక్ ఎందుకు తగులుతుంది? బాల్ని కొడితే ముందుకు ఎలా వెళుతుంది? అంటూ సైన్స్ పాఠాలనూ వినిపించారు. లెక్కలు ఇష్టం అంటూనే డాక్టర్లం అవుతాం అనే భవిష్యత్తు ప్రణాళికలనూ చెప్పారు. సోషల్ మీడియాలో తమకున్న ఫాలోవర్స్ గురించి, చేస్తున్న రీల్స్ గురించి వివరించారు. ‘సాక్షి’ మీడియా హౌస్ వారం రోజుల పాటు జరిపిన ‘లిటిల్ స్టార్స్’ కార్యక్రమంలో భాగంగా కలిసిన చిన్నారులను గుర్తుకు తెచ్చుకొని, ‘మరో ప్రపంచం తెలుసుకున్నాం’ అంటూ తమ స్పందనను తెలియజేశారు బాల తారలు. టీవీ చానల్‌కి సంబంధించిన న్యూస్‌రూమ్, పీసీఆర్ వంటి వాటిని చూసి సంభ్రమాశ్చర్యాలను వెలిబుచ్చారు.మేమిద్దరం కవలలం. కలిసే చదువుకుంటాం. సినిమాల్లోనూ కలిసే వర్క్ చేస్తాం. మేం ఇద్దరం పెద్దయ్యాక సాఫ్ట్వేర్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం. ఈ ్రపోగ్రామ్ ద్వారా మా ఇద్దరి ఆలోచనలను, మా ప్రతిభను షేర్ చేసుకునే అవకాశం లభించింది. ఇక్కడ న్యూస్ ఎలా రెడీ అవుతుందో తెలుసుకొని ఆశ్చర్యపోయాం. ఈ చిల్డ్రన్స్ డే మాకు వెరీ వెరీ స్పెషల్. – అర్జున్, అర్విన్నాకు నటుడిగా గుర్తింపు వచ్చిందంటే మా అమ్మే కారణం. ఇప్పటి వరకు పది సినిమాల్లో బాల నటుడిగా నటించే అవకాశం వచ్చింది. సినిమా చూసిన తరువాత స్కూల్లో ఫ్రెండ్స్ నీ క్యారెక్టర్ సూపర్‌గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. రెండు మూడు పేజీల డైలాగ్‌లు కూడా ఒకేసారి చెప్పగలను. ఈ కార్యక్రమం ద్వారా నేను సినిమాల్లోని డైలాగ్స్ చెప్పే అవకాశం లభించింది. అలాగే, న్యూస్ ఎలా రెడీ అవుతుందో తెలుసుకున్నాను. ఈ పోగ్రామ్ మాకు పాఠంలా కొత్తదనాన్ని పరిచయం చేసింది. థాంక్యూ సాక్షి.– కె. హర్షచదవండి: చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!ఏడేళ్ల వయసు నుంచి సినిమాలలో నటిస్తున్నాను. చదువు, సినిమాలతో పాటు బాస్కెట్ బాల్, క్రికెట్, డ్యాన్స్ కూడా చాలా ఇష్టం. స్కూల్, సినిమా షూటింగే కాదు ‘సాక్షి’ ఏర్పాటు చేసిన ‘లిటిల్‌స్టార్స్’లో భాగంగా నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలను కలిసినప్పుడు చాలా బాధపడ్డాను. తలస్సేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలను చూసి, అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాను. అలాగే ఈ ఫైనల్ ఈవెంట్లో ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలోని డైలాగ్ చెప్పినప్పుడు అందరూ గ్రేట్ అంటూ మెచ్చుకుంటే చాలా ఆనందంగా అనిపించింది. మమ్మల్ని ఎంకరేజ్ చేసే ఈ ్రపోగ్రామ్ చాలా బాగుంది. అందరికీ థ్యాంక్స్. – మోక్షజ్ఞతలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను కలవడానికి ‘సాక్షి’ మీడియా ద్వారా వెళ్లాను. చిన్న చిన్న పిల్లలు ఆ వ్యాధితో బాధపడుతుండటం చూసి, చాలా బాధగా ఫీలయ్యాను. కాసేపు వాళ్ల బాధని మరచిపోయేలా చేయాలని వాళ్లు అడిగిన డైలాగ్స్ చెప్పాను. వాళ్లను ఎంకరేజ్ చేసేలా మాట్లాడాను. మామూలుగా నేను చదువుకుంటాను, సినిమాలు చేస్తుంటాను. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాను. అలాంటి నాకు ఇలాంటి పిల్లలతో కాసేపు టైమ్ స్పెండ్ చేయడం ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి వెళ్లినట్లు అనిపించింది. ఇక ‘సాక్షి మీడియా’ హౌస్‌లో ఏర్పాటు చేసిన ‘‘లిటిల్‌స్టార్స్’లో నాతోటి యాక్టర్స్‌తో కలిసి ఎంజాయ్ చేయడం చాలా బాగుంది. – అనన్య ఈగ3చేసే పనిపై ఇష్టం ఉంటుంది కాబట్టి చదువు–సినిమా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటాను. ఈ ్రపోగ్రామ్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ‘స్పర్శ్’ హాస్పిస్ కేంద్రంలో సేవలు పొందుతున్న చిన్నారులను కలిశాం. వారి పరిస్థితి చూశాక చాలా బాధ అనిపించింది. వారి ముఖాల్లో నవ్వులు తెప్పించాలని డ్యాన్స్‌లు చేశాం, పాటలు పాడాం... ఈ ఎక్స్‌పీరియన్స్‌ను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ చిల్డ్రన్స్ డే మాకు సాక్షి ఇచ్చిన ఓ పెద్ద గిఫ్ట్. – సయ్యద్ ఫర్జానారైతు స్వరాజ్య వేదిక ద్వారా అక్కడి పిల్లలను కలిసినప్పుడు వాళ్లు ఎంత కష్టపడుతున్నారో అనిపించింది. వాళ్ల నాన్న చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ బాగా చదువుకుని, అమ్మను బాగా చూసుకుంటాం అని వారు చెప్పినప్పుడు ‘గ్రేట్’ అనిపించింది. అలాగే కలెక్టర్ అవుతామని, డాక్టర్ అవుతామని వాళ్లు తమ భవిష్యత్తు గురించి, తమ ప్లాన్స్ గురించి చెప్పినప్పుడు వారి ధైర్యం చూసి భేష్ అనిపించింది. ఈ కార్యక్రమం ద్వారా ఓ కొత్త ప్రపంచాన్ని చూశాం. – హనీషఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న పిల్లలను చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. తర్వాత వాళ్లను హ్యాపీగా ఉంచాలనిపించింది. అందుకే మాటలు, పాటలతో వారితో కలిసిపోయాను. ఇంటికి వెళ్లాక మా నాన్నతో ఆ విషయాలన్నీ పంచుకున్నాను. ‘సాక్షి మీడియా’ వల్ల వాళ్లను కలిసి, నా వంతుగా కాసేపు వాళ్లని సంతోషపెట్టడానికి ట్రై చేశాను. ఈ చిల్డ్రన్స్ డే నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. – సాన్వికమూడేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నాను. భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నాను. నేను కోపం, బాధ, హ్యాపీ సీన్లలో బాగా నటిస్తాను అని చెబుతారు. ఏడుపు సీన్లలో గ్లిజరిన్ లేకుండా నటించడం చూసి, అందరూ మెచ్చుకున్నారు. టీవీలో అందరి ముందు నా టాలెంట్‌ను ప్రదర్శించే అవకాశం లభించింది. ఇప్పుడు స్వయంగా టీవీ న్యూస్‌రూమ్, స్టూడియో... ఇవన్నీ చూడటం కొత్తగా అనిపించింది. – ఖుషీ రెడ్డిమూడేళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు 25 యాడ్స్, 30 సినిమాల్లో నటించాను. హిందీ మూవీలో కూడా నటించాను. డ్యాన్స్, సంగీతం నేర్చుకుంటున్నాను. బాలరత్న అవార్డు కూడా వచ్చింది. ‘సాక్షి’ మీడియాతో కలిసి రైతు స్వరాజ్య వేదికకి వెళ్లి అక్కడి పిల్లలతో మాట్లాడటం బాగా అనిపించింది. ‘మా నాన్న లేరు’ అని వాళ్లు చెప్పినప్పుడు ఏడుపొచ్చింది. ఇక ఫైనల్ ఈవెంట్లో గోగో (బొమ్మ)తో మాటలు బాగా నచ్చాయి. ఎంత టైమ్ స్పెండ్ చేశామో తెలియనే లేదు. – శ్రేష్ట కోటకేంద్రీయ విద్యాలయాలో చదువుకుంటున్నాను. సినిమాల్లో నటిస్తున్నాను. తబలా వాయిస్తాను. డ్యాన్స్, మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. సీరియల్స్‌లో కూడా నటిస్తున్నాను. ‘బాలోత్సవం’లో నాకు వచ్చిన పాటలు పాడాను. అందరూ సూపర్ అని మెచ్చుకున్నారు. – శ్రేయాన్ కోటఈ కార్యక్రమం ద్వారా తలసేమియాతో బాధపడుతున్నవారిని కలిశాను. వారిని నవ్వించాను కూడా... పాటలు పాడాను, డ్యాన్సులు చేశాను. అలాగే బుధవారం జరిగిన వేడుకలో నాలా సినిమాల్లో నటిస్తున్న మిగతా అన్నయ్యలు, అక్కలను కలుసుకోవడం హ్యాపీగా అనిపించింది. మా ఇష్టాలు, చదువు, ఆటలు, పాటలు, డైలాగ్స్ మీ అందరికీ చెప్పడం.. అన్ని విషయాలను షేర్ చేసుకోవడం బాగుంది. గోగో (బొమ్మ)తో బాగా ఎంజాయ్ చేశాం. – తనస్విఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్లో చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్లని చూడగానే ఫస్ట్ చాలా ఏడుపొచ్చింది. అయితే మేం వాళ్లని హ్యాపీ చేయడానికి వెళ్లాం కాబట్టి, వాళ్లతో జోక్‌గా మాట్లాడాను. వాళ్లు నవ్వడం హ్యాపీ అనిపించింది. అలాగే ‘సాక్షి’ టీవీకి వచ్చి, అందరితో మాకు క్లాసులు చెప్పినవి, మేం సినిమాల్లో చేసినవి షేర్ చేసుకోవడం హ్యాపీ. పెద్దయ్యాక మహేష్‌బాబులాగా పెద్ద హీరోని అవుతాను. ఇక్కడ గోగో (బొమ్మ)తో కలిసి చేసిన అల్లరి బాగుంది. అలాగే, మాకు అన్ని న్యూస్ రూమ్‌లు చూపించారు. చాలా కొత్తగా అనిపించింది. – స్నితిక్చిన్ని మనసులు కదిలిన వేళ...పసి హృదయాలు కదిలిపోయాయి. చిన్న మనసులే అయినప్పటికీ తోటి చిన్నారులు పడుతున్న బాధ చూసి, చలించిపోయాయి. బాలల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ‘సాక్షి’ మీడియా హౌస్ జరిపిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా కేన్సర్, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను, మృత్యువుతో పోరాడుతున్న పసిబాలలకు, తండ్రిని కోల్పోయిన వారిని, అనాథ బాలలను కలిశారు పలువురు బాల తారలు. కాసేపు ఆ చిన్నారులు తమ కష్టాన్ని మరచిపోయేలా చేసి, వారితో ఆడి పాడారు... నవ్వించారు. చివరగా ‘సాక్షి’ మీడియా హౌస్‌లో జరిగిన వేడుకలో స్కూల్ విద్యార్థులతో కలిసి ఈ బాల తారలు సందడి చేశారు. ఈ ‘బాలల దినోత్సవం’ ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.టీవీలో న్యూస్ చదువుతారు కదా.... ఆ రూమ్ ఎలా ఉంటుందో చూస్తారా? ఎడిటింగ్ ఎలా జరుగుతుందో చూడాలని ఉందా? అసలు టీవీ స్టూడియో ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా? అనడమే ఆలస్యం ‘ఓ’ అంటూ ఆసక్తి కనబరిచారు లిటిల్ స్టార్స్. ‘సాక్షి టీవీ’ న్యూస్ రూమ్, పీసీఆర్ (ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్) వంటివి చూసి, ఆశ్చర్యపోయారు. టీవీ స్టూడియోలో జరుగుతున్న పనులను నిశితంగా గమనించారు.ఈ వారమంతా లిటిల్ స్టార్స్ సందడిని సాక్షి యూట్యూబ్‌లో చూడటానికి ఈ QRకోడ్‌ను స్కాన్ చెయ్యండి -
టీవీ ఛానెల్ ప్రసారాలకు కొత్త ఓటీటీ
ప్రసార భారతి త్వరలో ప్రారంభించబోయే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో తమ టీవీ ఛానెల్‌లను ప్రసారం చేయడానికి ఆసక్తి ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ప్రస్తుతం దాదాపు అన్ని బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు ఓటీటీను ప్రారంభిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రసారభారతి కూడా ఓటీటీను మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది.త్వరలో ప్రారంభించబోయే ఈ ఓటీటీలో ఏడాదిపాటు తమ టీవీ ఛానెల్ ప్రసారం చేయడానికి ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 12లోపు దరఖాస్తులు సమర్పించాలని ప్రసార భారతి కోరింది. అయితే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) లైసెన్స్ పొందిన ఛానెల్‌లు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపింది.ఇదీ చదవండి: బంగారం పరిశ్రమకు కొత్త సంఘం!కుటుంబ సమేతంగా ఓటీటీను చూసేలా భారతీయ విలువలు, విజ్ఞానాన్ని ప్రోత్సహించే ప్రసారాలను ఇందులో అందిచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఛానెల్‌లను ప్రసార చేయాలనుకునేవారు ప్రకటన విరామ సమయాలను సూచించాలని చెప్పారు. ఛానెల్ ‘ఎస్సీటీఈ -35/ యాడ్ మార్కర్’ ప్రకారం ప్రకటన ఫీడ్లను అందించాలని తెలిపారు. ప్రకటనల ద్వారా వచ్చే రెవెన్యూలో 65:35 ఆదాయ వాటాను ప్రసార భారతి ప్రతిపాదించింది. అంటే 65 శాతం ఛానెల్‌కు, 35 శాతం ఓటీటీకు వెళుతుంది. ట్రాన్స్‌కోడింగ్, సీడీఎన్ ఖర్చులు, ఏజెన్సీ కమీషన్లతో సహా ఛానెల్ ప్రసార ఖర్చులను సర్దుబాటు చేసిన తర్వాత ఆదాయ వాటా లెక్కిస్తారు. -
బ్లాక్మెయిల్ ఛానల్స్‌ని బహిష్కరించాలి: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: మహా న్యూస్ ఛానెల్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మహా చెత్త న్యూస్..‘కాకినాడ రైస్ మిల్లర్ల దందా’ ప్రోమో సంగతి ఏమైందని ప్రశ్నించారు. బ్లాక్మెయిల్ ఛానళ్లను ప్రజలు బహిష్కరించాలని కోరారు.కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘మహా చెత్త న్యూస్.. టాల్కమ్ డబ్బా పౌడర్ బ్లాక్ మైలర్కి కాకినాడ రైస్ మిల్లర్లు, ఎక్స్‌పోర్టర్లు నుండి 50 లక్షలు వెళ్లాయి. ‘కాకినాడ రైస్ మిల్లర్ల దందా’ అని చెప్పి ఒక ప్రోమో రిలీజ్ చేసి, నేనే వస్తున్నా, అక్రమాలన్నీ బయట పెడుతున్నా అని బెదిరించి.. వారి నుండి 50 లక్షలు తీసుకున్నాడు. ఇలాంటి బ్లాక్ మెయిల్ ఛానళ్లని ప్రజలు బహిష్కరించి సంబంధిత బ్లాక్ మెయిల్ రిపోర్టర్లకు తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి’ అని కామెంట్స్ చేశారు. "మహా చెత్త న్యూస్" టాల్కమ్ డబ్బా పౌడర్ బ్లాక్ మైలర్ కి కాకినాడ రైస్ మిల్లర్లు, ఎక్సపోర్టర్లు నుండి 50 లక్షలు వెళ్లాయి.. ‘కాకినాడ రైస్ మిల్లర్ల దందా’ అని చెప్పి ఒక ప్రోమో రిలీజ్ చేసి, నేనే వస్తున్నా, అక్రమాలన్ని బయట పెడుతున్నా అని బెదిరించి.. వారి నుండి 50 లక్షలు తీసుకున్నాడు.…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 22, 2024 -
‘సాక్షి’ టీవీ ప్రసారాల నిలిపివేత రాజ్యాంగ ఉల్లంఘనే: ఎన్బీడీఏ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడంపై ‘బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్’ (ఎన్బీడీఏ) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సాక్షి టీవీతోపాటు మరో మూడు ఛానళ్ల ప్రసారాలనూ ఏపీలోని కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ నిలిపివేయడానికి సరైన కారణాలు చూపకపోవడం ట్రాయ్ నిబంధనలకు విరుద్ధమని ఎన్బీడీఏ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్బీడీఏ సోమవారం(జూన్24) మీడియా ప్రకటన విడుదల చేసింది.మీడియాతో పాటు ప్రజల ప్రయోజనాలకు భంగం..ఏపీలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీపై విమర్శనాత్మక కథనాలు ప్రసారం చేయడం వల్లనే ఆయా టీవీ ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసినట్లు చెబుతున్నారని, కొందరు కేబుల్ టీవీ ఆపరేటర్లు తీసుకున్న ఈ చర్యలు బ్రాడ్కాస్టర్లు, మీడియా, ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని ప్రకటించింది. కొన్ని టీవీ ఛానళ్ల ప్రసారాలు ఆపడం ప్రమాదకరమైన సంకేతాలు పంపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే..ఛానెళ్లలో ఎలాంటివి ప్రసారం చేయాలన్నది బ్రాడ్కాస్టర్ల ఇష్టమన్నది రాజకీయ పార్టీలు గుర్తించాలని, మీడియా స్వేచ్ఛలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా పేర్కొంది. ఇతరుల జోక్యంతో మీడియా తన స్వతంత్రతను కోల్పోయే పరిస్థితి కల్పిస్తుందని తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ), ఆర్టికల్ 19(1)(జీ)లను ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది. మీడియా స్వేచ్ఛపై ప్రభావం..ఛానళ్లపై నిషేధం సరైన పద్ధతి కాదని,మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేదని ఎన్బీడీఏ పునరుద్ఘాటించింది. ఏకపక్ష నిర్ణయాలు బ్రాడ్కాస్టర్ల వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీస్తాయని, వ్యూయర్షిప్పై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఇది చివరికి ఛానళ్ల రేటింగ్ తద్వారా ఆదాయంపైనా ప్రభావం చూపుతుందని వివరించింది. ప్రభుత్వానిదే బాధ్యత..దీర్ఘకాలంలో బ్రాడ్కాస్టర్లు, ప్రకటనకర్తల మధ్య సంబంధాలు దెబ్బతినేందుకు చర్యలు కారణమవుతాయని తెలిపింది. ఏపీలో మీడియా స్వతంత్రంగా, స్వేచ్ఛగా వ్యవహరించేలా కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎన్బీడీఏ అభ్యర్థించింది. ఇతరుల జోక్యం ఏమాత్రం లేకుండా మీడియా తమ కార్యకలాపాలు నిర్వహించుకునేలా చూడాలని కోరింది.సమాచారం పొందడం ప్రజల హక్కు..ప్రజాస్వామ్య వ్యవస్థలో వేర్వేరు మార్గాల ద్వారా సమాచారం పొందే హక్కు ప్రజల మౌలిక హక్కు అని, మీడియా నోరు నొక్కేందుకు చేసే ఏ ప్రయత్నాన్ని అయినా వెంటనే అడ్డుకోవాలని సూచించింది. సాక్షి టీవీతోపాటు మరో మూడు ఛానళ్ల ప్రసారాలను నిలిపి వేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, కొందరు కేబుల్ ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే సమీక్షించి ఘర్షణ పూర్వక పరిస్థితిని నివారించాలని ఎన్బీడీఏ కోరింది. -
టీవీ ఛానళ్ల సబ్స్క్రిప్షన్ రేట్లు పెంపు.. ఎంతంటే..
టీవీ ఛానళ్ల సబ్స్క్రిప్షన్ రేట్లు 5-8 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిస్నీ స్టార్, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా వంటి బ్రాడ్కాస్టర్లు తమ బొకే(ఛానళ్ల సమూహం) రేట్లు పెంచనున్నట్లు తెలిపాయి.కొత్త టారిఫ్ ఒప్పందాలపై సంతకం చేయని డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్ ఆపరేటర్లకు (డీపీఓ) సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు సిగ్నళ్లను తొలగించకూడదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) బ్రాడ్కాస్టర్లను ఆదేశించింది. దాంతో ఎన్నికలు ముగిసే వరకు కంపెనీలు ఈమేరకు చర్యలు తీసుకోలేదు. తాజాగా ఎన్నికల ఫలితాలు సైతం వెలువడడంతో తిరిగి సబ్స్క్రిప్షన్ రేట్ల పెంపు అంశం వెలుగులోకి వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: జూన్ 14 తర్వాత ఆధార్ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐజనవరిలో ప్రముఖ బ్రాడ్కాస్టర్లు తమ బేస్ బొకే రేట్లను సుమారు 10 శాతం పెంచారు. భారతీయ క్రికెట్ హక్కులను చేజిక్కించుకోవడంతో సాధారణ ఎంటర్టైన్మెంట్ ఛానెళ్ల కంటే వయోకామ్18 అత్యధికంగా 25 శాతం పైగా రేట్లును పెంచింది. అయితే పెరిగిన ధరలు ఫిబ్రవరి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ట్రాయ్ నిబంధనల వల్ల వాటికి బ్రేక్ పడింది. -
వివాహేతర సంబంధం పెట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపుతాం
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో మధ్యయుగాల నాటి ఛాందసవాద పాలనకు తెరలేపిన తాలిబాన్లు ప్రజల పట్ల మరింత దారుణంగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా మహిళలపై కఠిన ఆంక్షల కొరడాను మరోసారి ఝులిపించారు. వివాహేతర సంబంధం, వ్యభిచారానికి ఒడిగట్టే మహిళలను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపుతామని తాలిబాన్లు హెచ్చరించారు. ఈ మేరకు తాలిబాన్ల సుప్రీం లీడర్ ముల్లా హిబాతుల్లా అకుంద్‌జాదా అఫ్గాన్లనుద్దేశిస్తూ ప్రభుత్వ టీవీ చానెల్లో శనివారం ఒక ఆడియో సందేశం ఇచ్చారు. ‘‘అంతర్జాతీయ సమాజం చెబుతున్నట్లు మహిళలకు హక్కులు ఉండాలంటారా? అవి మన ఇస్లామిక్ షరియా చట్టాలు, మన మతాధికారుల నియమాలకు వ్యతిరేకం. మేం చాయ్ తాగుతూ చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారేమో! ఈ నేలపై షరియా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి తీరతాం. వివాహేతర సంబంధాలు, వ్యభిచారం ఘటనల్లో మహిళలను అందరూ చూస్తుండగా కొయ్యకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతాం’’ అని అకుంద్‌జాదా హెచ్చరించారు. -
HYD: టీవీ ఛానల్ యాంకర్‌ను కిడ్నాప్ చేసిన యువతి
సాక్షి, హైదరాబాద్: ఓ టీవీ ఛానల్ యాంకర్‌ను యువతి కిడ్నాప్ చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. యాంకర్‌ను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగిన త్రిష్ణ అనే యువతి కిడ్నాప్‌కు పాల్పడింది. తనను వివాహం చేసుకోవాలని రూమ్‌లో బంధించింది. త్రిష్ణ చెర నుంచి తప్పించుకున్న ప్రణవ్ పోలీసులను ఆశ్రయించాడు. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్‌ను నడుపుతున్న త్రిష్ణ.. భారత్ మాట్రిమోన్లో ప్రణవ్ ఫోటోలు చూసి ఇష్టపడింది. ప్రణవ్ పేరుతో నకిలీ ఐడిని సైబర్ కేటుగాళ్లు క్రియేట్ చేయగా, నిజంగానే ప్రణవ్ ఐడి అనుకున్న త్రిష్ణ ఇష్టపడింది. ప్రణవ్‌పై మనసు పడ్డ ఆమె కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని భావించింది. చివరికి కథ అడ్డం తిరిగింది. త్రిష్ణను అరెస్ట్ చేసిన ఉప్పల్ పోలీసులు రిమాండ్‌కు పంపించారు. ఐదు స్టార్టప్ కంపెనీలకు త్రిష్ణ ఎండిగా ఉంది. ఇదీ చదవండి: నిన్ను లవ్ చేస్తున్నా.. ఫ్యాకల్టీ నో చెప్పాడని.. ఎంత పనిచేసిందంటే.. -
ఏది సత్యం? ఏదసత్యం?
‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’ అనేది ఉపనిషత్ వాక్యం. ఉన్నది ఒకటే సత్యం. దానినే పండితులు అనేక రకాలుగా చెబుతారని దీని అర్థం. వెలుతురు ఉన్న లోకంలో చీకటి ఉన్నట్లే,వసంతం ఉన్న ప్రకృతిలో శిశిరం ఉన్నట్లే సత్యం ఉన్న ప్రపంచంలో అసత్యం కూడా ఉనికిలో ఉంటుంది. అది సహజం. ‘సత్యమేవ జయతే’– ఇది కూడా ఉపనిషత్ వాక్యమే! మన దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజున ఈ వాక్యాన్ని జాతీయ ఆదర్శంగా స్వీకరించాం. ‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్/ నబ్రూయాత్ సత్యమప్రియం/ ప్రియంచ నానృతం బ్రూయాత్/ ఏష ధర్మ స్సనాతనః’– ఇది సుభాషిత శ్లోకం. ఎప్పుడూ సత్యాన్నే పలకాలి. సత్యాన్ని ప్రియంగా పలకాలి. సత్యమే అయినప్పటికీ అప్రియంగా పలుకరాదు. ప్రియమైనదే అయినంత మాత్రాన అసత్యాన్ని పలుకరాదు. ఇదే సనాతన ధర్మం అని ఈ శ్లోకానికి అర్థం. అనాదిగా ప్రచారంలో ఉన్న ఉపనిషత్ వాక్యాలను, సుభాషిత శ్లోకాలను గమనిస్తే, అవన్నీ సత్యం పట్ల నిబద్ధతకు అద్దం పడతాయి. సత్యం కోసం సర్వస్వాన్నీ వదులుకున్న సత్యహరిశ్చంద్రుడి కథ మన జాతిపిత మహాత్మా గాంధీ సహా ఎందరికో ఆదర్శప్రాయం. మరి సత్యసంధతపై ఇంత కట్టుదిట్టమైన పునాదులు ఉన్న మన దేశం నలుచెరగులా నిరంతరం సత్య వాక్కులే వినిపిస్తూ ఉండాలి కదా! సత్యమే వర్ధిల్లుతూ ఉండాలి కదా! అలా అనుకుంటే అది అమాయకత్వమే! దీపం కింద నీడలా సత్యాన్ని అంటిపెట్టుకుని అసత్యమూ ఉంటుంది. సత్యానిదే అంతిమ విజయం కావచ్చు గాక, కాని అప్పుడప్పుడు అసత్యం బలం పుంజుకుని లోకంలో అనర్థాలకు కారణమవుతుంది. అసత్యం తెచ్చిపెట్టే అనర్థాలకు ఉదాహరణలు మన రామాయణ, మహాభారతాల్లో దొరుకు తాయి. రామబాణం తాకినప్పుడు మాయలేడి రూపంలోని మారీచుడు ‘హా సీతా! హా లక్ష్మణా!’ అంటూ రాముడి గొంతుతో ఆర్తనాదాలు చేసి, సీతాపహరణానికి కారకుడయ్యాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మరాజు ‘అశ్వత్థామ హతః’ అని బిగ్గరగా పలికి, భేరీనాదాలు మోగే సమయంలో ‘కుంజరః’ అని గొణిగి ద్రోణాచార్యుడి మరణానికి కారకుడయ్యాడు. అబద్ధం చేసే అలజడి మార్మోగే సమయంలో మనకు మెదడు పనిచేయదు. వెనువెంటనే నిజాన్ని తెలుసుకోగల వ్యవధి ఉండదు. నిజాన్ని తెలుసుకునే వ్యవధిలోగానే అబద్ధం నానా అనర్థాలను కలిగిస్తుంది. అసత్య ప్రచారం అట్టహాసంగా సాగుతున్నప్పుడు సత్యమేదో, అసత్యమేదో తేల్చుకోవడం దుస్సాధ్యంగా మారుతుంది. పత్రికలు మొదలయ్యాక ఆధునిక ప్రపంచంలో అసత్య ప్రచారం బలం పుంజుకోవడం మొదలైంది. అబద్ధాలకు పత్రికలు ఊతమివ్వగల అవకాశాలను తొలి తరాల్లోనే కొందరు రాజకీయవేత్తలు గుర్తించారు. పత్రికల ద్వారా అబద్ధాలను ప్రచారం చేయడాన్ని హిట్లర్ అనుయాయి గోబెల్స్ ఒక కళలా సాధన చేశాడు. ‘ప్రజాభిప్రాయాన్ని మలచే కార్యక్రమాన్ని పర్యవేక్షించే పూర్తి అధికారం రాజ్యానికి ఉంది’ అనేది గోబెల్స్ జ్ఞానగుళిక. రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీ నిరంకుశ రాజ్యానికి గొంతునిచ్చిన గోబెల్స్‌ను ఆరాధించేవారు ప్రపంచంలో నేటికీ ఉన్నారు. నిజానికి ఇప్పుడు గోబెల్స్‌కు బాబుల్లాంటి వాళ్లు పుట్టుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులను చూడటం వల్లనే కాబోలు ‘ఏది పుణ్యం, ఏది పాపం/ ఏది సత్యం, ఏదసత్యం? / ఏది నరకం, ఏది నాకం?/ ఓ మహాత్మా, ఓ మహర్షీ!’ అని వాపోయాడు మహాకవి. ఇది హైటెక్కు టమారాల యుగం. ఇది సమాచార విప్లవశకం. స్మార్ట్ఫోన్ల ఆవిష్కరణతో ప్రపంచం పిడికిట్లో ఇమిడిపోయిన కాలం. క్షీరనీర న్యాయంగా అబద్ధాల నుంచి నిజాలను వేరు చేయగల హంసలు బొత్తిగా కరవైపోతున్న రోజులివి. నిజం వేషాన్ని ధరించిన అబద్ధాన్ని గుర్తించడం అగ్నిపరీక్షగా మారిన రోజులివి. సమాచార ప్రచారానికి ఒకప్పుడు వార్తాపత్రికలు, రేడియో మాత్రమే ఆధారంగా ఉండేవి. ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ ప్రసారాలతో ఊదరగొడుతున్న టీవీ చానళ్లు, నిరంతర కథనాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వార్తా వెబ్సైట్లు, వీటికి తోడుగా సామాజిక మాధ్యమ సాధనాలు అనుక్షణం జనాల మీదకు పుంఖాను పుంఖాలుగా సమాచారాన్ని వదిలిపెడుతున్నాయి. వరద ఉద్ధృతి ఉప్పొంగినప్పుడు జలప్రవాహంతో పాటు చెత్తా చెదారం కొట్టుకొస్తుంటాయి. నిర్విరామంగా సాగే నిరంతర సమాచార ప్రవాహంలో సత్యంతో పాటు అర్ధసత్యాలు, అసత్యాలు కూడా అలాగే కొట్టుకొస్తుంటాయి. గుట్టలు గుట్టలుగా పోగుపడుతున్న అసత్యాలు, అర్ధసత్యాల అడుగున సత్యం కనుమరుగుగా ఉంటుంది. సత్యాన్ని మరుగుపరచేలా సాగుతున్న అసత్యాల, అర్ధసత్యాల సమాచార ప్రవాహం సమాచార కాలుష్యాన్ని పెంచుతోంది. సమాచార కాలుష్యం ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమిస్తోంది. అబద్ధాల రణగొణల మధ్య నిజాల గొంతు వినిపించకుండా పోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు ప్రమాదకరంగా మారుతోందని ఇటీవల ప్రపంచ ఆర్థిక వేదిక తన ‘గ్లోబల్ రిస్క్ రిపోర్ట్–2024’లో వెల్లడించింది. అసత్యాలు, అర్ధసత్యాలతో హోరెత్తిస్తున్న తప్పుడు సమాచారం ప్రపంచ దేశాల్లో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడమే కాకుండా, రాజకీయ అస్థిరతకు, అశాంతికి, హింసకు, ఉగ్రవాదానికి దారితీస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక సమర్పించిన ఈ నివేదిక హెచ్చరించింది. ‘సత్యమేవ జయతే’ అని జాతీయ ఆదర్శంగా చెప్పుకుంటున్న మన భారతదేశమే తప్పుడు సమాచారం వ్యాప్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవడం వర్తమాన విషాదం. -
నూహ్ అల్లర్లు: ప్రముఖ టీవీ ఛానల్ ఎడిటర్ అరెస్టు..
చంఢీగర్: నూహ్ అల్లర్లలో అసత్యాలను ప్రచారం చేశారనే ఆరోపణలపై హిందీ ఛానల్ సుదర్శన్ టీవీ ఎడిటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లను మరింత పెంచేంతగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు ఆరోపించారు. సుదర్శన్ టీవీ ఛానల్ ఎడిటర్ ముఖేష్ కుమార్‌ను గురుగ్రామ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. కొంతమంది గుండాలు అతన్ని అరెస్టు చేసినట్లు సుదర్శన్ ఛానల్ పేర్కొంది. దీనిపై వివరణ ఇచ్చిన పోలీసులు.. సైబర్ క్రై విభాగం అరెస్టు చేసినట్లు చెప్పారు. गुड़गांव की पुलिस कमिश्नर को @AJENews (अल जजीरा न्यूज चैनल) से फ़ोन किया जा रहा है हिंदुओं के खिलाफ कार्रवाई के लिए दबाव बनाया जा रहा है। और @DC_Gurugram फोन आने के बाद इतने दबाव में आ जाती हैं कि कहीं से भी हिंदूवादी कार्यकर्ताओं को उठा ले रही है@cmohry कृपया संज्ञान लें pic.twitter.com/bIjVYfR0Di — Mukesh Kumar (@mukeshkrd) August 8, 2023 ఆల్ జజిరా ఛానల్ ఒత్తిడి మేరకు గురుగ్రామ్ పోలీసులు.. హిందు కార్యకర్తల మీద చర్యలు తీసుకుంటున్నారని ట్వీట్టర్లో ముఖేష్ కుమార్ పోస్టు చేశారు. గురుగ్రామ్ పోలీసులకు విదేశీ మీడియా కాల్ చేసిందని ఈ మేరకు హిందువులపై చర్యలు తీసుకుంటున్నారని ఎడిటర్ ఆరోపణలు చేస్తూ పోస్టులు చేశారు. pic.twitter.com/FbtdApa5zq — Gurugram Police (@gurgaonpolice) August 11, 2023 దీనిపై స్పందించిన పోలీసులు..కుమార్ పోస్టులు నిరాధారమైనవని కొట్టిపడేశారు. తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని అన్నారు. ఐటీ చట్టం కింద అతనిపై చర్యలకు ఉపక్రమించినట్లు చెప్పారు. అయితే.. విధుల్లో భాగంగా కుమార్ మేవాత్ ప్రాంతానికి వెళ్లినట్లు సుదర్శన్ టీవీ తెలిపింది. కొందరు దుండగులు ఆయన్ను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. పోలీసుల చర్యలను తప్పుబడుతూ సుదర్శన్ టీవీ ఛానల్ చీఫ్ ఎడిటర్ సురేష్ వాంఖడే ట్వీట్ చేశారు. అయితే.. కొన్ని గంటల తర్వాత ముఖేష్ కుమార్‌ను విడుదల చేసినట్లు సమాచారం. मुकेश कुमार को छोड़ा नहीं गया तो कल बड़ी घोषणा करेंगे। देखते है कौन- कौन मर्द हिंदू साथ है। नपुंसक तो जान कर भी मौन हैं। किसी अधिकारी की इतनी हिंम्मत और सभी असहाय…? हम तो असहाय नहीं है… #ReleaseMukeshKunar — Suresh Chavhanke “Sudarshan News” (@SureshChavhanke) August 11, 2023 హర్యానాలోని నూహ్‌లో జులై 31న అల్లర్లు చెలరేగాయి.విశ్వహిందూ పరిషత్ రథయాత్ర సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమై.. రాష్ట్రం మొత్తం వ్యాపించాయి. ఈ ఆందోళనల్లో ఆరుగురు మరణించారు. ఇదీ చదవండి: తప్పుడు వాగ్దానంతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు.. -
Banjara Hills: టీవీ చానల్లో అర్థరాత్రి అశ్లీల దృశ్యాల ప్రసారం
హైదరాబాద్: బంజారాహిల్స్రోడ్నెం 12, ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఓ తెలుగు చానల్లో ఈ నెల 28న అర్థరాత్రి దాటిన తర్వాత అకస్మాత్తుగా అశ్లీల వీడియోలు ప్రసారమయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు తమ చానల్‌కు చెందిన సర్వర్‌ను హ్యాక్‌చేసి వీడియోలు అప్లోడ్ చేశారంటూ సదరు చానల్ నిర్వాహకులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైవ్ చానెల్‌గా నడిచే తమ చానల్లో అర్ధరాత్రి 15 నిమిషాల పాటు అశ్లీల వీడియోలు ప్రసారం అయ్యాయని, తమ సిబ్బంది అప్రమత్తమై వాటి ని తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. -
సంసద్ టీవీకి లేఖ రాసిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: సంసద్ టీవీలో చర్చలకు వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ రఘురామకృష్ణరాజును పిలవద్దని ఆ టీవీ సీఈవోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆ టీవీ సీఈవోకి లేఖ రాశారు. సంసద్ టీవీ చర్చల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ రఘురామ పాల్గొనడం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనపై అనర్హత వేటు వేయాలని తాము ఇచ్చిన పిటిషన్‌పై స్పీకర్ విచారిస్తున్నారని లేఖలో గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు విశ్వసనీయత ఉండదని, ఆయన మాటలు వైఎస్సార్సీపీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత 17వ లోక్‌సభ గడువు పూర్తయ్యేవరకు ఆయన్ని సంసద్ టీవీ షోలు, చర్చలకు పిలవద్దని విజయసాయిరెడ్డి కోరారు. చదవండి: (ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ) -
ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయి.. ఇంటికి చేరిన బాలిక
వెంగళరావునగర్: దాదాపు ఎనిమిదేళ్ల కిందట తప్పిపోయిన ఓ బాలిక సోమవారం తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఓ టీవీ కార్యక్రమం ఆ బాలిక పాలిట వరంలా మారి..అనాథ జీవితానికి తెర పడింది. వివరాల్లోకి వెళ్తే..ఈసీఐఎల్ కమలానగర్‌కు చెందిన పిన్నమోని కృష్ణ, అనూరాధ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో ఇందు, సింధు కవలలు. 2014లో వినాయక ఉత్సవాలకు వెళ్ళిన సందర్భంగా ఇందు అనే మూడున్నరేళ్ల కుమార్తె తప్పిపోయింది. ఆ సమయంలో ఆ పాపను ఓ మహిళ తీసుకెళ్లినట్టుగా సీసీ టీవీలో కూడా కనిపించింది. దాంతో తల్లిదండ్రులు నాటి నుంచి చాలా ప్రాంతాల్లో గాలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇటీవల ఓ టీవీ చానల్ కార్యక్రమంలో ఆ పాప కనిపించడంతో తల్లిదండ్రులు గుర్తించి తమ కుమార్తెలాగానే ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఆరా తీశారు. టీవీ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు. ఎక్కడ నుంచి వచ్చారనే విషయాన్ని తెలుసుకున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ కమిటీ అధికారులను కలిసి విషయం తెలిపారు. వారి సాయంతో కిస్మిత్పూర్లోని చెరిస్ అనాథ బాలికల సంరక్షణ కేంద్రాన్ని చేరుకున్నారు. అక్కడ ఉన్న పిల్లల్లో తమ కుమార్తె ఉండటంతో తల్లిదండ్రులు గుర్తించి అధికారులకు తెలియజేశారు. దాంతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రంగారెడ్డి, జిల్లా బాలల హక్కుల చైర్మన్ నరేందర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ అధికారి ప్రవీణ్‌కుమార్, మహిళా శిశుసక్షేమశాఖ అధికారులు తల్లిదండ్రుల వద్ద వివరాలను, ఆ బాలిక వివరాలను పరిశీలించారు. ఎనిమిదేళ్ల కిందట తప్పిపోయిన పాప, అనాథాశ్రమంలో ఉన్న పాప ఒక్కరే అని నిర్ధారణకు వచ్చారు. సోమవారం స్థానిక మధురానగర్‌లో ఉన్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రధాన కార్యాలయంలో తల్లిదండ్రులకు తమ కుమార్తెను అప్పజెప్పారు. తప్పిపోయిన తమ కుమార్తె తిరిగి తమ వద్దకు చేరడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి.. వంట విషయంలో గొడవపడి) -
మతిమరుపు బైడెన్‌పై స్పూఫ్ వీడియో.. నెట్టింట వైరల్
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో దీనిపై స్పందిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తన వింతగా ఉంటోంది. వయస్సులో పెద్దవాడు కావడం వల్ల జరుగుతోందో.. ఏమో కానీ ఆయన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. మీడియాతో మాట్లాడే క్రమంలో రష్యా దేశం, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పేరు సైతం మర్చిపోవడం, తనతోపాటు పక్కనే ఉన్న ఆమెరికా ఉపాధ్యక్షురాలను ప్రథమ మహిళ అని సంబోధించి చాలా గందరగోళానికి గురయ్యారు. అప్పుడే నిద్ర నుంచి లేచి మీడియా ముందుకు వచ్చినట్లు కనిపించడం పట్ల పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు సంబంధించిన ఓ స్పూఫ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుతం సమయంలో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులపై అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లు మీడియాతో మాట్లాడుతూ గందరగోళానికి గురైనట్లు చాలా వ్యంగ్యంగా ఓ ఫన్నీ స్కిట్‌ను సౌదీలోని ప్రభుత్వానికి అనుకూల టీవీ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది. ఈ వీడియోలో రెండు పాత్రలు.. జో బైడెన్, కమలా హారిస్‌లు వేదికపై నడుస్తూ వచ్చినట్లు వ్యంగ్యంగా చూపుతారు. వారిద్దరూ మీడియతో మాట్లాడుతూ కనిపిస్తారు. ముందుగా.. బైడెన్ పాత్ర మాట్లాడుతూ.. ఈ రోజు మనం స్పెయిన్ సంక్షోభం గురించి మాట్లాడబోతున్నామని వ్యాఖ్యానిస్తాడు. పక్కనే ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పాత్రదారి కాదు.. కాదు.. అన్నట్లు చెవిలో చెబుతుంది. అయినా కూడా వినని బైడెన్ పాత్రదారి.. ఆఫ్రికాలో సంక్షోభం అంటూ మొదలుపెడతాడు. అది కూడా తప్పు కావడంతో చివరకు రష్యా అని అంటాడు. అక్కడితో ఆగకుండా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరును మర్చిపోయి గుర్తు చేసుకోవడానికి సహాయం తీసుకుంటాడు. ‘పుతిన్, నా మాట వినండి. మీ కోసం నా దగ్గర చాలా ముఖ్యమైన సందేశం ఉంది. ఆ సందేశం ఏమిటంటే..’ అని నిల్చొన్న చోటే ఓ కునుకు తీస్తాడు. వెంటనే నిద్ర లేవగానే పుతిన్ గురించి పూర్తిగా మర్చిపోయి ‘చైనా ప్రెసిడెంట్' తో మాట్లాడుతున్నట్లు ప్రసంగం మొదలుపెట్టాడు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను పట్టుకొని.. తాను మాట్లాడున్న సమయంలో తనను సరిదిద్దినందుకు ధన్యవాదాలు, ఆమెరికా ప్రథమ మహిళా’ అని నవ్వుతూ మాట్లాడుతాడు. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు సంక్షోభం గురించి స్పందించాలన్న అమెరికా అభ్యర్థనను సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇక అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవి స్వీకరించిన తర్వాత సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఒక్కసారిగా కూడా మాట్లాడిన దాఖలు లేకపోవడం గమనార్హం. తాజాగా ప్రసారమైన ఈ ఫన్నీ స్కిట్‌తో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు ఎలా ఉన్నావో తెలుసుకోవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. VIDEO: A prominent Saudi television network has racked up millions of views with a comedy sketch that openly mocks US President Joe Biden, an unusual move that further signals souring ties pic.twitter.com/GRrNXx7Bjo — AFP News Agency (@AFP) April 14, 2022 -
రష్యా టీవీ లైవ్‌షోలో నిరసన.. మహిళా జర్నలిస్ట్‌కు 15 ఏళ్ల వరకు జైలు శిక్ష!
యుద్ధం ఆపాలంటూ రష్యా టీవీ లైవ్ షోలో నిరసన తెలిపిన మహిళా జర్నలిస్ట్‌కు దాదాపు 15 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మాస్కోలోని ఛానల్1లో పనిచేస్తున్న మెరీనా ఓవ్స్యానికోవా యుద్ధం ఆపాలని ప్లకార్డుతో రష్యాకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మెరీనా అనంతరం మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను న్యూయార్క్ టైమ్స్ ట్విటర్లో పోస్టు చేసింది. ఇందులో సదరు ఉద్యోగి ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి తను చేసిన ప్రయత్నాలను వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. తనను 14 గంటలపాటు పోలీసులు విచారించినట్లు తెలిపింది. తన కుటుంబాన్ని కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపింది. అంతేగాక ఘటన తర్వాత పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు న్యాయ సహాయం కూడా అందలేదని వాపోయింది. చదవండి: రష్యాకు కోలుకోలేని దెబ్బ.. ఆవేదనలో పుతిన్..! A Russian state television employee who stormed a live broadcast Monday has been fined by a Moscow court for saying in a video that she was “deeply ashamed” to have helped make “Kremlin propaganda." She still faces a prison sentence over the protest. https://t.co/fFmgkyvmP6 pic.twitter.com/wb2FanGFsa — The New York Times (@nytimes) March 16, 2022 ‘ఉక్రెయిన్ రష్యా యుద్ధం భయంకరంగా సాగుతోంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, సహోద్యోగులకు ధన్యవాదాలు. నా జీవితంలో ఇవి చాలా కఠినమైన రోజులు. రెండు రోజులుగా నిద్రపోలేదు’ అని తెలిపింది. అయితే రష్యా మహిళా జర్నలిస్ట్ నిరసన విషయం తెలిసిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా రష్యాలోని ఓ వార్తా ఛానెల్లో జర్నలిస్ట్ లైవ్‌లోనే యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. మరో జర్నలిస్ట్ వార్తలు చదువుతుండగా యుద్ధానికి వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకుని నిరసనను తెలిపింది. ‘యుద్ధం వద్దు.. యుద్ధాన్ని ఆపండి.. వాళ్లు ఇక్కడ అబద్దం చెబుతున్నారు. తప్పుడు ప్రచారాలను అసలు ఎవరూ నమ్మోద్దు’ అని నిరసన వ్యక్తం చేసింది. దీంతో రష్యా టీవీ జర్నలిస్టు నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెరీనా తండ్రి యుక్రెయిన్ దేశస్థుడు కావడంతో ఆమె మద్దతుగా నిరసన వ్యక్తం చేసింది. చదవండి: యుద్దం వేళ రష్యాతో భారత్ డీల్.. మోదీపై అక్కసు వెళ్లగక్కిన అమెరికా -
సంసద్ టీవీ యూట్యూబ్ చానల్ హ్యాక్
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారాలు చేసే సంసద్ టీవీకి చెందిన యూట్యూబ్ చానల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్‌చేశారు. దీంతో అప్రమత్తమైన యూట్యూబ్ సంస్థ.. సమస్యకు కొద్ది గంటల్లోనే చెక్ పెట్టింది. సోమవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకు సంసద్ టీవీ యూట్యూబ్ చానల్‌ను హ్యాకర్లు హ్యాక్ చేసి చానెల్ పేరును ఇథీరియం( ఒక క్రిప్టో కరెన్సీ పేరు)గా మార్చారు. హ్యాకింగ్ జరిగిన విషయాన్ని ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే సంసద్ టీవీ సంబంధిత అధికారులకు తెలిపామని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ–ఇన్) తెలిపింది. చానెల్ హ్యాక్‌కు గురైందని తెలిపే స్క్రీన్షాట్లను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. చదవండి: (ప్రఖ్యాత గాయని సంధ్యా ముఖర్జీ కన్నుమూత) -
ఏబీఎన్ ఛానల్‌పై సుబ్రమణ్యస్వామి మరో పిటిషన్
సాక్షి, చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్న ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానెల్‌పై పరువు నష్టం దావా వేసిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గురువారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. 4వ అదనపు జిల్లా సెషన్ కోర్టులో ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం స్వామి మరో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం సుబ్రహ్మణ్యం స్వామి తరుపున సబర్వాల్ హాజరుకానున్నారు. టీటీడీపై అసత్య కథనాలు ప్రసారంపై సుబ్రహ్మణ్యం స్వామి ఎబీఎన్‌పై రూ.100 కోట్లు పరువు నష్టం వేశారు. టీటీడీ వేసిన పిటిషన్‌పై అనుకూలంగా తీర్పు ఇవ్వాలని ఆయన మరో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతి అసత్య కథనాలు కేసుపై తన తరుపున సబర్వాల్ కోర్టుకు హాజరవుతారని పేర్కొన్నారు. శుక్రవారం కోర్టును ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. -
అయ్యయ్యో.. టీవీ చానెల్ ఎంత పనిచేసింది!
వాషింగ్టన్: ఉన్నట్టుండి అమెరికాలోని ఒక టీవీ చానల్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. వాతావరణ వివరాలను ప్రసారం చేస్తున్న బులిటెన్‌లో ఏకంగా పోర్న్ కంటెంట్‌ను ప్రసారం చేసింది. దీంతో వీక్షకులు ఒక్కసారిగా బిత్తరపోయారు. ఈవినింగ్ న్యూస్కాస్ట్లో ఈ వీడియోను ప్రసారం చేసింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. (kidney transplantation: సంచలనం) స్థానిక వార్తా ఛానెల్ అశ్లీల క్లిప్‌ను ప్రసారం చేయడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. సాయంత్రం వార్తల బులిటెన్‌లో భాగంగా వాతావరణ నిపుణురాలు మిషెల్ బాస్ వాతావరణ అప్డేట్ ఇస్తున్నారు. ఇంతలో పోర్న్క్లిప్ టెలికాస్ట్ కావడం ప్రారంభమైంది. 13 సెకన్ల స్పష్టమైన వీడియో టెలికాస్ట్ అవుతోంటే..యాంకర్, కో యాంకర్, కోడి ప్రోక్టర్ గానీ దీన్ని గమనించనేలేదు. వివరాల అనంతరం బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రాఫిక్ వీడియో వచ్చేదాకా ఇది ప్రసారమైంది. అయితే దీనిపై సంబంధిత టీవీ ఛానెల్ స్పందించింది. పొరపాటు జరిగిందంటూ ఛానెల్ క్షమాపణలు తెలిపింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటామని ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై వీక్షకుల నుండి ఫిర్యాదులు రావడంతో సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తోంది. -
సంసద్ టీవీ హోస్ట్‌లుగా శశిథరూర్, ప్రియాంక
న్యూఢిల్లీ: రాజకీయ రంగంలో వాళ్లిద్దరికీ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అభిప్రాయాలను చెప్పడంలో, ప్రత్యర్థుల్ని ఇరకాటంలో పెట్టేలా సమాధానం ఇవ్వడంలోనూ వారికి వారే సాటి. అయితే ఇప్పుడు వారు తమ స్థానాన్ని మార్చుకొని ప్రశ్నించే స్థానంలోకి వస్తున్నారు. లోక్‌సభ, రాజ్యసభల టీవీలను కలిపేస్తూ కొత్తగా వచి్చన సంసద్ టీవీలో ప్రతిపక్ష ఎంపీలు శశిథరూర్, ప్రియాంక చతుర్వేది యాంకర్లుగా దర్శనమివ్వబోతున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ‘టు ది పాయింట్’ అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేయబోతుండగా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ‘మేరి కహానీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. థరూర్ నిర్వహించే కార్యక్రమంలో ప్రముఖులతో వివిధ అంశాలపై లోతైన చర్చలు ఉంటే, చతుర్వేది మహిళా ఎంపీల రాజకీయ ప్రయాణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. -
ప్రముఖ టీవీ ఛానల్లో ఆయుధాలతో వ్యక్తి హల్చల్
చెన్నె: ప్రముఖ టీవీ ఛానల్ కార్యాలయంలోకి దూరి ఓ వ్యక్తి ఆయుధాలతో హల్చల్ చేశాడు. కత్తి డాలు పట్టుకుని నానా హంగామా సృష్టించాడు. కార్యాలయంలో అద్దాలు, ఫోన్లు, కంప్యూటర్లు ధ్వంసం చేశాడు. దీంతోపాటు సిబ్బందిని పచ్చిబూతులు తిడుతూ బీభత్సం చేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నెలో చోటుచేసుకుంది. తమిళనాడులో ప్రముఖ ఛానల్ సత్యం టీవీ. రోయపురం కామరాజరర్ రోడ్డులో ఉన్న కార్యాలయంలోకి మంగళవారం సాయంత్రం 6-7 గంటల సమయాన అకస్మాత్తుగా ఓ దుండగుడు వచ్చాడు. కత్తి, డాలు చేతపట్టి కార్యాలయంలోని రిసెప్షన్లో కనిపించిన వాటినన్నింటిని ధ్వంసం చేశాడు. ఫోన్లు, అద్దాలు, కంప్యూటర్లు పగులగొట్టాడు. ఒకటో అంతస్తులోని అకౌంట్స్ డిపార్ట్మెంట్లో హల్చల్ చేశాడు. ఆ దుండగుడు కోయంబత్తూరుకు చెందిన డి.శివకుమార్‌గా గుర్తించారు. దుండగుడి దాడిలో ధ్వంసమైన కార్యాలయంలో సామగ్రి అర్ధగంటపాటు బీభత్సం సృష్టించడంతో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. అతడిని అతికష్టంగా సెక్యూరిటీ బంధించింది. సమాచారం అందుకున్న రోయపురం పోలీసులు కార్యాలయానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో ఆ కార్యాలయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిపై సత్యం టీవీ ఎండీ ఇసాక్ లివింగ్స్టన్ స్పందించారు. ‘అతడు ఎవరో తెలియదు. ఎందుకు దాడి చేశాడో కూడా లేదు. మేం ఎవరికీ వ్యక్తిగతంగా విరుద్ధ ప్రసారాలు చేయలేదు.’ అని తెలిపారు. ఈ దాడికి సంబంధించిన సీసీ ఫుటేజీని ఆ ఛానల్ విడుదల చేసింది. శివ కుమార్ కోయంబత్తూర్ నుంచి గుజరాత్‌కు వెళ్లాడు. నిందితుడు గుజరాత్ నంబర్ ప్లేటు ఉన్న కారుతోనే వచ్చాడు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారణ చేపట్టారు. కార్యాలయంపై దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా చెన్నె ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శి భారతి తమిళన్ డిమాండ్ చేశారు. -
ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకో టీవీ ఛానల్
న్యూఢిల్లీ: రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ.. తాము త్వరలో ప్రారంభించనున్న డిజిటల్ టీవీ ప్లాట్‌ఫామ్ ‘ఐఎన్‌సీ టీవీ’కి సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ నెల 24న పార్టీ చానెల్‌ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ చానెల్ ద్వారా తమ పార్టీ సమాచారాన్ని నేరుగా ప్రజలకు తెలియ జేయవచ్చని భావిస్తోంది. బడుగు బలహీన వర్గాల ప్రజలు గొంతుకను వినిపించే తమ చానెల్‌ను పంచాయతీ రాజ్ రోజున విడుదల చేస్తామని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలాలు ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. అందులో రోజూ దాదాపు 8 గంటల పాటు లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయని తెలిపారు. మొదటగా ఆంగ్లం, హిందీ భాషల్లో చానెల్ ప్రసారమవుతుందని, అనంతరం స్థానిక భాషల్లో కూడా అందు బాటులోకి తెస్తామన్నారు. చదవండి: ఇంటి పక్కన కిరాణా దుకాణాదారుడే కింగ్ -
ప్రముఖ టీవీ ఛానెల్‌పై రూ.200 కోట్ల దావా
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితుడు, బాలీవుడ్ నిర్మాత సందీప్ సింగ్ రిపబ్లిక్ టీవీ ఛానల్‌పై 200 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. ఈమేరకు రిపబ్లిక్ టీవీ కార్యాలయానికి, ఆ ఛానల్ ఎడిటర్ అర్నబ్ గోస్వామికి బుధవారం నాడు నోటీసులు పంపించారు. ఛానల్ టీఆర్పీ పెంచుకోవడం కోసం తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార కథనాలను ప్రచారం చేశారని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. సుశాంత్ కేసులో తనను కీలక సూత్రధారిగా, హంతకుడిగా పరిగణించారని మండిపడ్డారు. (చదవండి: సుశాంత్ కేసు : సీబీఐ ఎదుట యూటర్న్) వెంటనే వారు తనకు లిఖితపూర్వకంగా లేదా వీడియో సందేశం ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే నిజానిజాలు సైతం వెల్లడించాలని కోరారు. దాంతో పాటు తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వార్తలను ఛానల్ నుంచి తొలగించాలని పేర్కొన్నారు. కాగా సుశాంత్ కేసు పాట్నా నుంచి సీబీఐ విచారణకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ కోణం బాలీవుడ్‌ను అతలాకుతలం చేస్తోంది. ఈ క్రమంలో పలు మీడియా సంస్థలు బాలీవుడ్‌ను చీల్చి చెండాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారంటూ బాలీవుడ్ నిర్మాతలు.. రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేసిన విషయం విదితమే. (చదవండి: మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి) -
టీవీ కార్యాలయంపై రాళ్ల దాడి
జూబ్లీహిల్స్ : గుర్తు తెలియని వ్యక్తులు బంజారాహిల్స్‌లోని ఓ టీవీ కార్యాలయంపై శుక్రవారం అర్ధరాత్రి రాళ్లతో దాడిచేసినట్లు సంస్థ సీఈవో రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేవారు. వివరాల్లోకి వెళితే.. మూడు ద్విచక్రవాహనాలపై వచ్చిన అగంతకులు రాళ్లతో పలు ఫ్లోర్లపై దాడి చేశారని, ఈ దాడిలో పలు అంతస్తుల అద్దాలు ధ్వంసం అయ్యాయన్నారు. నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న దాదాపు 50 మంది ఉద్యోగులు భయాందోళనకు గురవడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది 100కు ఫోన్ చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన వెనుక పెద్దకుట్ర ఉందని, దర్యాప్తు చేసి దాడికి దిగిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘డబ్బుల్’ మోసం.. టీవీ చానల్ చైర్మన్ అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఫ్లాట్లు కేటాయించేలా చూస్తున్నానని 40 మంది నుంచి దాదాపు రూ.70 లక్షలు వసూలు చేసిన నిందితుడిని సైబరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కేపీహెచ్‌బీ తొమ్మిదో ఫేజ్‌లో నివాసముంటున్న ఈస్ట్ గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం నడిమిలంక గ్రామవాసి, విజన్– టీవీ చానల్ చైర్మన్ గుతుల ప్రశాంత్‌ను నిందితుడిగా గుర్తించి పట్టుకున్నారు. కేసు వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షలపైనే.. డబుల్ బెడ్రూం ఫ్లాట్ల కోసం చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని నిజాంపేట, కైతలాపూర్ గ్రామాల్లో మీడియా వ్యక్తులకు డబుల్ బెడ్రూం ఫ్లాట్లు కేటాయిస్తోదంటూ కొంతమంది అమాయకులతో ప్రశాంత్ పరిచయం పెంచుకున్నాడు. దాదాపు 40 మంది నుంచి ఆధార్ కార్డులు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ప్రస్తుత చిరునామా కరెంట్ బిల్లు తీసుకున్నాడు. అనంతరం ఒక్కో వ్యక్తి వద్ద రూ.1,55,000 నుంచి రూ.1,70,000 వసూలు చేశాడు. కొన్నాళ్లు గడిచాక రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ కాపీ ఇచ్చినట్టుగానే తన ల్యాప్‌టాప్‌లో రెడీ చేసి ఆ తర్వాత బాండ్ పేపర్‌పై కలర్ జిరాక్స్ తీశాడు. దానిపై మేడ్చల్ జిల్లాలోని ఓ సెక్షన్ ఆఫీసర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆర్డర్ కాపీ అందరికీ ఇచ్చాడు. కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, బాచుపల్లి, మియాపూర్ ఠాణా పరిధిలోని వారిని మోసం చేశాడు. ఈ సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు నిందితుడు ప్రశాంత్‌గా గుర్తించి కేపీహెచ్‌బీ పోలీసులతో కలిసి అరెస్టు చేశారు. రూ.8 లక్షల నగదుతో పాటు కారు, ల్యాప్‌టాప్, కలర్ ప్రింటర్, ఎనిమిది డబుల్ బెడ్రూం కేటాయింపు నకిలీ లెటర్లు స్వాధీనం చేసుకున్నారు. ‘గతంలోనూ సైబరాబాద్ పోలీసు కమినరేట్‌లో సబ్ ఇన్స్పెక్టర్గా నకిలీ పోలీసు ఐడీని క్రియేట్ చేసి హైవే టోల్గేట్ల వద్ద డబ్బులు చెల్లించకుండానే తిరుగుతుండటంతో విజయవాడలోని భవానీపురం పోలీసులు ప్రశాంత్‌ను జూన్ 24న అరెస్టు చేశారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఇతగాడు డబుల్బెడ్రూం ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించేలా చూస్తామంటూ చెప్పే దళారులు మాటలు నమ్మవద్దని సీపీ సజ్జనార్ సూచించారు. కార్యక్రమంలో క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిణి తదితరులు పాల్గొన్నారు. -
ప్రణవ్ ఎస్ఐకు పుట్టిన వాడే..
గుంటూరు: ఎస్ఐ ఎస్.జగదీష్‌పై నమోదైన కేసులో సాక్షులను బెదిరిస్తున్నాడంటూ నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన ఓ యువతి సోమవారం రూరల్ ఎస్పీ విశాల్ గున్నీకి ఫిర్యాదు చేసింది. ముప్పాళ్ళ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న జగదీష్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి శారీరకంగా అనుభవించి ఓ బిడ్డకు తల్లిని చేశాడని నరసరావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ నెల 2వ తేదీన కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీని కలసి తనకు, సాక్షులకు రక్షణకల్పించాలని కోరింది. ‘ఎస్ఐపై కేసు నమోదైనప్పటి నుంచి సాక్షులుగా ఉన్న వారికి ఫోన్ చేసి మీరు ఈ కేసులో సాక్ష్యం చెబితే మీ అంతు చూస్తానని హెచ్చరిస్తున్నాడు. ఓ టీవీ చానల్లో (సాక్షి కాదు) నా గురించి అసత్యాలతో కూడిన వీడియోలను చూపించి అసభ్యకరంగా ప్రదర్శించారు. నా మాజీ భర్త పి.సుబ్బారావును సాకుగా చూపి నా మనోభావాలను దెబ్బతీసేలా టీవీలో కథనం వచ్చింది. వారిపై కూడా విచారించి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా నా బిడ్డ ప్రణవ్ ఎస్ఐ జగదీష్‌కు పుట్టిన బిడ్డే కావాలంటే డీఎన్ఏ పరీక్షకు నేను, నాబిడ్డ సిద్ధంగా ఉన్నాం. తమకు ప్రాణరక్షణ కల్పించి ఆదుకోవాలి’ అని కోరింది. కాగా, వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారించిన ఎస్పీ ఫిర్యాదుపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు. ఎస్ఐపై ప్రస్తుతం శాఖాపరమైన విచారణ కొనసాగుతుందని ఎస్పీ విశాల్ గున్నీ వివరించారు. -
అలిపిరి వద్ద మద్యం, మాంసం స్వాధీనం
తిరుమల: అలిపిరి టోల్గేట్ వద్ద బుధవారం మద్యం, మాంసం స్వాధీనం చేసుకున్నట్లు టీటీడీ వీఎస్ఓ ప్రభాకర్ తెలిపారు. తిరుపతికి చెందిన ఒక టీవీ చానల్ వీడియో జర్నలిస్టు కారులో తిరుపతి నుంచి తిరుమలకు వెళుతుండగా అలిపిరి టోల్గేట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. 5 కిలోల చికెన్, సిగ్నేచర్ విస్కీ–4 బాటిళ్లు, ఓట్కా–2 బాటిళ్లు, లూజ్ లిక్కర్–2000 ఎంఎల్ ఉన్నాయి. నిందితుడిని తిరుమలలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అతనిపై గతంలో నమోదైన ఒక కేసు విచారణలో ఉంది.