
చెన్నై: సినీ నటుడు రజనీకాంత్ నెలకొల్పిన రాజకీయ ఫోరం రజనీ మక్కల్ మంద్రమ్..టీవీ చానెల్‌ను పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్‌మార్క్స్ వద్ద ఆ చానెల్ పేరును నమోదుచేసేందుకు యత్నిస్తున్నట్లు స్వయంగా రజనీకాంతే తెలిపారు. శనివారం కుటుంబ సభ్యులతో కలసి అమెరికా బయల్దేరే ముందు ఆయన విమానాశ్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. తాము అనుకుంటున్న పేరుతోనే ఎవరో చానెల్ ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిసిందని, వారి కన్నా ముందే ఆ పేరును నమోదుచేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తారా? అని ప్రశ్నించగా, ఇంకా తాను రాజకీయ పార్టీని నెలకొల్పలేదని, ఎన్నికల్లో పోటీపై తరువాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment