ప్రసార భారతి త్వరలో ప్రారంభించబోయే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో తమ టీవీ ఛానెల్‌లను ప్రసారం చేయడానికి ఆసక్తి ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ప్రస్తుతం దాదాపు అన్ని బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు ఓటీటీను ప్రారంభిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రసారభారతి కూడా ఓటీటీను మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది.
త్వరలో ప్రారంభించబోయే ఈ ఓటీటీలో ఏడాదిపాటు తమ టీవీ ఛానెల్ ప్రసారం చేయడానికి ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 12లోపు దరఖాస్తులు సమర్పించాలని ప్రసార భారతి కోరింది. అయితే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) లైసెన్స్ పొందిన ఛానెల్‌లు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపింది.
ఇదీ చదవండి: బంగారం పరిశ్రమకు కొత్త సంఘం!
కుటుంబ సమేతంగా ఓటీటీను చూసేలా భారతీయ విలువలు, విజ్ఞానాన్ని ప్రోత్సహించే ప్రసారాలను ఇందులో అందిచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఛానెల్‌లను ప్రసార చేయాలనుకునేవారు ప్రకటన విరామ సమయాలను సూచించాలని చెప్పారు. ఛానెల్ ‘ఎస్‌సీటీఈ -35/ యాడ్ మార్కర్’ ప్రకారం ప్రకటన ఫీడ్‌లను అందించాలని తెలిపారు. ప్రకటనల ద్వారా వచ్చే రెవెన్యూలో 65:35 ఆదాయ వాటాను ప్రసార భారతి ప్రతిపాదించింది. అంటే 65 శాతం ఛానెల్‌కు, 35 శాతం ఓటీటీకు వెళుతుంది. ట్రాన్స్‌కోడింగ్, సీడీఎన్ ఖర్చులు, ఏజెన్సీ కమీషన్‌లతో సహా ఛానెల్ ప్రసార ఖర్చులను సర్దుబాటు చేసిన తర్వాత ఆదాయ వాటా లెక్కిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment