Prasar Bharati
-
కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఇవన్నీ ఉచితం..
ఇప్పుడు చాలామంది సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాల కోసం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడతారు. అయితే దీని కోసం సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఇండియా పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్.. ప్రసార భారతి ఓటీటీ ప్లాట్‌ఫామ్ తీసుకు వచ్చింది. ఇందులో కొన్ని కార్యక్రమాలు ఉచితం అంటూ ప్రకటించింది.గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)లో ప్రసార భారతి కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'వేవ్స్'ను ఆవిష్కరించింది. దీని ద్వారా రామాయణం, మహాభారతం వంటి వాటిని ఉచితంగా చూడవచ్చు. దీనిని ఆండ్రాయిడ్‌లో గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్‌లో యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.రామాయణ, మహాభారతం వంటి వాటితో పాటు.. రేడియో ప్రోగ్రామ్స్, గేమ్స్ వంటి వాటిని కూడా దీని ద్వారా ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం ఈ వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో 65 లైవ్ ఛానెల్స్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. తెలుగు, హిందీ, తమిళ వంటి 12 కంటే ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ ప్లాట్‌ఫామ్ 10 కంటే ఎక్కువ కేటగిరీలలో కంటెంట్ అందిస్తోంది.ప్రసార భారతి కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'వేవ్స్' కేవలం పెద్ద వారికి మాత్రమే కాకుండా.. పిల్లల కోసం కూడా చోటా భీమ్, అక్బర్ బీర్బల్, మ్యూజిక్ షోలు వంటి అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో అయోధ్య నుంచి రామ్ లల్లా హారతి లైవ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వంటి ప్రత్యక్ష లైవ్ ఈవెంట్లను కూడా చూడవచ్చు. కొన్ని కార్యక్రమాలకు మినహా ఇతర కార్యక్రమాలకు డబ్బు చెల్లించి ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.WAVES is finally here!Explore WAVES, the new OTT platform by Prasar Bharati, for FREE. Stream old Doordarshan favourites like Ramayan and Mahabharat and the latest releases like Fauji 2.O. What’s more? You can now listen to radio programs & devotional songs, read books, play… pic.twitter.com/MwBOZpuIKc— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) November 20, 2024 -
దూరదర్శన్‌లో కాపీ ఎడిటర్ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం
సాక్షి,హైదరాబాద్: ఆకాశవాణి-దూరదర్శన్ కేంద్రంలో కాంట్రాక్టు,పూర్తికాలపు ప్రాతిపదికన కాపీ ఎడిటర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులకు ఆహ్వానించారు. ఆసక్తిగలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ప్రసార భారతి వెబ్సైట్ https://applications.prasarbharati.org ద్వారా నిర్ణీత గడువులోగా సమర్పించాల్సి ఉంటుంది.కాపీ ఎడిటర్ ఉద్యోగానికి అవసరమైన విద్యార్హతలు, వయసు..జీత,భత్యాలు వంటి అదనపు సమాచారం కోసం ప్రసార భారతి వెబ్‌సైట్‌లోని ‘వేకెన్సీ’ https://prasarbharati.gov.in/pbvacancies/ విభాగంలో ఉన్న నోటిఫికేషనులో చూడొచ్చని ప్రసార భారతి తెలిపింది. -
టీవీ ఛానెల్ ప్రసారాలకు కొత్త ఓటీటీ
ప్రసార భారతి త్వరలో ప్రారంభించబోయే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో తమ టీవీ ఛానెల్‌లను ప్రసారం చేయడానికి ఆసక్తి ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ప్రస్తుతం దాదాపు అన్ని బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు ఓటీటీను ప్రారంభిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రసారభారతి కూడా ఓటీటీను మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది.త్వరలో ప్రారంభించబోయే ఈ ఓటీటీలో ఏడాదిపాటు తమ టీవీ ఛానెల్ ప్రసారం చేయడానికి ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 12లోపు దరఖాస్తులు సమర్పించాలని ప్రసార భారతి కోరింది. అయితే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) లైసెన్స్ పొందిన ఛానెల్‌లు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపింది.ఇదీ చదవండి: బంగారం పరిశ్రమకు కొత్త సంఘం!కుటుంబ సమేతంగా ఓటీటీను చూసేలా భారతీయ విలువలు, విజ్ఞానాన్ని ప్రోత్సహించే ప్రసారాలను ఇందులో అందిచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఛానెల్‌లను ప్రసార చేయాలనుకునేవారు ప్రకటన విరామ సమయాలను సూచించాలని చెప్పారు. ఛానెల్ ‘ఎస్సీటీఈ -35/ యాడ్ మార్కర్’ ప్రకారం ప్రకటన ఫీడ్లను అందించాలని తెలిపారు. ప్రకటనల ద్వారా వచ్చే రెవెన్యూలో 65:35 ఆదాయ వాటాను ప్రసార భారతి ప్రతిపాదించింది. అంటే 65 శాతం ఛానెల్‌కు, 35 శాతం ఓటీటీకు వెళుతుంది. ట్రాన్స్‌కోడింగ్, సీడీఎన్ ఖర్చులు, ఏజెన్సీ కమీషన్లతో సహా ఛానెల్ ప్రసార ఖర్చులను సర్దుబాటు చేసిన తర్వాత ఆదాయ వాటా లెక్కిస్తారు. -
దూరదర్శన్‌కు కొత్త లోగో: గెలిస్తే బంపర్ ప్రైజ్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్రాడ్ కాస్టింగ్ ఛానల్ దూరదర్శన్ ఐకానిక్ లోగో మారబోతుంది. కాలానుగుణంగా, యువ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి లోగో మార్పునకు దూరదర్శన్ ముందుకు వచ్చింది. ఇందు కోసం ప్రజల నుంచి దరఖాస్తులను కూడా దూరదర్శన్ ఆహ్వానిస్తోంది. కొత్త లోగో కోసం ఐడియాలు ఇస్తూ దరఖాస్తులను ఆగస్టు 14 వరకు సమర్పించాలని, గెలిచిన వారికి లక్ష రూపాయల వరకు బహుమానం కూడా ఇవ్వనున్నట్టు దూరదర్శన్ వెల్లడించింది. 30 ఏళ్ల కంటే తక్కువ వయసున యువతరాన్ని ఆకట్టుకోవడంతో దూరదర్శన్ విఫలమవుతుందని, ఈ నేపథ్యంలో లోగో మార్పు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వచ్చిందని దూరదర్శన్ నడిపే ప్రసారభారతీ సీఈవో శశి శేఖర్ వెంపటి తెలిపారు. దాదాపు 58 ఏళ్ల తర్వాత లోగో మార్చబోతున్నట్టు చెప్పారు. ఇది దేశంలోని యువతరంతో సంభాషించడానికి తాజా ప్రయత్నంగా వెంపటి అభివర్ణించారు. డీడీ బ్రాండును సరికొత్తగా తీసుకొస్తామన్నారు. బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దూరదర్శన్ను 1959లో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీన్ని ఏర్పాటుచేసినట్టు మనుషుల కన్ను రూపంలో ఉండే ఇప్పటి లోగోను ఎంపిక చేశారు. అప్పటి నుంచీ అదే లోగో ప్రచారంలో ఉంది. ప్రస్తుత ప్రజల ఇష్టాలకు అనుగుణంగా, యువతను ఆకర్షించేలా కొత్త లోగో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మనదేశంలో 30 ఏళ్లలోపు యువతీయువకులు చాలామంది ఉన్నారని, వీరంతా దూరదర్శన్ కంటే చాలా చిన్నవారని, అప్పటి ప్రజల మనోభావాలకు, ఇష్టాలకు అనుగుణంగా ఆ లోగోను ఎంచుకున్నారని చెప్పారు. కానీ, ప్రస్తుత యువత ఆసక్తివేరుగా ఉందని, అందువల్ల వారిని అందరినీ ఆకట్టుకునేలా లోగో ఉండాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దూరదర్శన్ నేషనల్, రీజనల్, స్పోర్ట్స్ వంటి 21 చానళ్లను ఆపరేట్ చేస్తోంది. ప్రస్తుతం దేశంలో 65 శాతం మంది 35 ఏళ్లకు తక్కువగా ఉన్న వారే. -
సునీల్ ఆరోరా నియామకంపై విమర్శలు
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ మాజీ చైర్మన్, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ రిటైర్డ్ కార్యదర్శి సునీల్ అరోరాను ప్రసార భారతి సలహాదారుగా కేంద్రం నియమించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే నీరా రాడియా టేపుల కుంభకోణంలో ఆయన పేరు ఎక్కువగా వినిపించడమే కారణం. రతన్ టాటా, తరుణ్ దాస్‌లకు ఎయిర్‌లైన్స్ పరిశ్రమకు సంబంధించిన కావాల్సిన సమాచారాన్ని చేరవేసేందుకు నీరా రాడియాతో అరోరా మాట్లాడిన అంశాలు రాడియా టేపుల్లో రికార్డయి ఉన్నాయి. 1980వ బ్యాచ్, రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సునీల్ అరోరాను కేంద్ర ప్రభుత్వ ప్రసారాల సంస్థ ‘ప్రసార భారతి’కి సలహాదారుగా నియమించబోతున్నట్లుగా ముందుగానే వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలను నిజయం చేస్తూ ఇప్పుడు ఖరారు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అరోరాను ఎందుకు నియమించాల్సి వచ్చిందో పీఎంవో వివరణ ఇవ్వాలంటూ కొందరు డిమాండ్ చేయగా, దాదా, తమరంటే తమకెంతో గౌరవమని, అలాంటిప్పుడు ఆరోరా మళ్లీ సలహాదారుగా ఎలా తీసుకొచ్చారని మరి కొందరు ప్రశ్నించారు. ఇంతవరకు వచ్చిన వ్యక్తి ప్రసార భారతిలో ఎంతవరకైనా ఎదగగలరంటూ ఇంకొందరు వ్యాఖ్యానించారు. -
డీడీలో ప్రపంచ కప్ మ్యాచ్‌లు.. తొలగిన అడ్డంకి
న్యూఢిల్లీ: ప్రపంచ కప్ మ్యాచ్‌లను ప్రసారం చేయడంలో తలెత్తిన వివాదం విషయంలో దూరదర్శన్‌కు ఊరట లభించింది. దూరదర్శన్ కేబుల్ ఆపరేటర్లతో కలసి ప్రపంచ కప్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ప్రపంచ కప్ ప్రసార హక్కులు కలిగి ఉన్న స్టార్ స్పోర్ట్స్.. కేబులు ఆపరేటర్లతో సహా దూరదర్శన్ మ్యాచ్‌లను ప్రసారం చేయడంపై కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని, హక్కుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించామని స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం వాదించింది. సుప్రీం కోర్టు ఈ వాదనలను తోసిపుచ్చుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టులో మొదట స్టార్ స్పోర్ట్స్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రసార భారతి ఈ విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించి ఊరట పొందింది. -
ప్రసారభారతిని చిక్కుల్లో పడేసిన యాంకర్
న్యూఢిల్లీ: 'గవర్నర్ ఆఫ్ ఇండియా'- దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారంలో యాంకరమ్మ నోటి నుంచి జాలువారిన మాట ఇది. ఈ మాటే ఇప్పుడు దూరదర్శన్ కు తలనొప్పి తెచ్చిపెట్టింది. అంతేకాదు మహిళా గవర్నర్ ను 'అతడు' గా సంబోధించి ప్రసారభారతిని చిక్కుల్లో పడేసింది. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్(ఇఫీ) నవంబర్ 20న గోవాలో ప్రారంభమైంది.ఈ సందర్భంగా దూరదర్శన్ యాంకర్ అతిథులను పలకరిస్తూ అటుగా వచ్చిన గోవా గవర్నర్ మృదులా సిన్హాను చూసి... 'గవర్నర్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. ఆయన అభిప్రాయాలు మనతో పంచుకుంటారు' అని వ్యాఖ్యానించింది. ఈ వీడియా సోషల్ మీడియాకు ఎక్కడంతో దూరదర్శన్ పై విమర్శలు రేగాయి. అయితే పొరపాటును సరిచేసి నాలుగు నిమిషాల తర్వాత పునఃప్రసారం చేశామని డీడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జరిగిన తప్పుకు గల కారణాలు తెలుసుకునేందుకు ఏడీజీ స్థాయి అధికారిని ఆదేశించినట్టు చెప్పారు. 'గవర్నర్ ఆఫ్ ఇండియా' వ్యాఖ్య చేసిన యాంకర్ కాంట్రాక్టు ఉద్యోగిని అని వెల్లడించారు. ఇంతకుముందు కూడా దూరదర్శన్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పేరులోని ఎక్స్ఐ(XI)ని రోమన్ సంఖ్య అనుకుని ఓ యాంకర్ ఎలెవన్ గా పలకడంతో డీడీపై విమర్శలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనకు సంబంధించిన వార్తలు చదువుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంబంధించిన దృశ్యాలు ప్రసారం చేసి ప్రసారభారతి అభాసుపాలైంది.