డీడీలో ప్రపంచ కప్ మ్యాచ్లు.. తొలగిన అడ్డంకి | SC allows Prasar Bharati to telecast World Cup matches | Sakshi
Sakshi News home page

డీడీలో ప్రపంచ కప్ మ్యాచ్లు.. తొలగిన అడ్డంకి

Published Fri, Feb 20 2015 3:43 PM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

SC allows Prasar Bharati to telecast World Cup matches

న్యూఢిల్లీ: ప్రపంచ కప్ మ్యాచ్లను ప్రసారం చేయడంలో తలెత్తిన వివాదం విషయంలో దూరదర్శన్కు ఊరట లభించింది. దూరదర్శన్ కేబుల్ ఆపరేటర్లతో కలసి ప్రపంచ కప్ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

ప్రపంచ కప్ ప్రసార హక్కులు కలిగి ఉన్న స్టార్ స్పోర్ట్స్.. కేబులు ఆపరేటర్లతో సహా దూరదర్శన్ మ్యాచ్లను ప్రసారం చేయడంపై కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని, హక్కుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించామని స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం వాదించింది.  సుప్రీం కోర్టు ఈ వాదనలను తోసిపుచ్చుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టులో మొదట స్టార్ స్పోర్ట్స్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రసార భారతి ఈ విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించి ఊరట పొందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement