సాక్షి, హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ రాష్ట్రంలో తమ చానెల్ ప్రసారాలను మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ (ఎమ్మెస్‌వో) నిలుపుదల చేయడాన్ని సవాలు చేస్తూ ఆ చానెల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని, సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఎమ్మెస్‌వోలను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కాదని, చట్టబద్ద సంస్థ కాదని, కాబట్టి వారికి ఈ కేసులో తాము ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు.
రవిప్రకాశ్ కోర్టు హాజరు కోసం పిటీషన్...
తెలంగాణ శాసనసభ్యులను కించపరుస్తూ కథనం ప్రసారం చేసినందుకు కోర్టు ఆదేశాల మేరకు ఎల్బీ నగర్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతున్న టీవీ 9 చానెల్ సీఈవో రవిప్రకాశ్‌ను కోర్టు ముందు హాజరయ్యేలా ఆదేశించాలని కోరుతూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 438 (1బి) కింద పీపీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ బి.శివ శంకరరావు శుక్రవారం విచారించారు. పీపీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని రవిప్రకాశ్‌కు స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేశారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి హైకోర్టులో చుక్కెదురు
Published Sat, Jul 26 2014 3:15 AM | Last Updated on Fri, Aug 10 2018 5:09 PM
Advertisement
Advertisement