నవ్వుల మాస్టర్... ఇకపై క్విజ్ మాస్టర్! | Srinivas Avasarala turns TV host for a quiz show | Sakshi
Sakshi News home page

నవ్వుల మాస్టర్... ఇకపై క్విజ్ మాస్టర్!

Published Sun, Dec 7 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

నవ్వుల మాస్టర్... ఇకపై క్విజ్ మాస్టర్!

నవ్వుల మాస్టర్... ఇకపై క్విజ్ మాస్టర్!

తొలి సినిమా ‘అష్టా చెమ్మా’తోనే తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపారేశాడు అవసరాల శ్రీనివాస్. కామెడీతో కడుపుబ్బ నవ్వించాడు అందరినీ. సరదాగా కాసేపు, పిల్ల జమిందార్, అంతకుముందు ఆ తర్వాత, చందమామలో అమృతం వంటి చిత్రాలతో తన నట ప్రతిభను కళ్లకు కట్టిన శ్రీనివాస్... మంచి రచయిత, దర్శకుడు కూడా. ఇప్పుడు సరికొత్తగా... టీవీ హోస్ట్ కూడా కాబోతున్నాడు.
 
ఓ టీవీ చానెల్ రూపొందిస్తోన్న క్విజ్ ప్రోగ్రామ్ ద్వారా టెలివిజన్ రంగంలోనూ అడుగిడుతున్నాడు శ్రీనివాస్. నిజానికిది పెద్ద వెరైటీ షో ఏం కాదు. హైస్కూల్ స్థాయి విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించే ఓ క్విజ్ షో. అయితే శ్రీనివాస్ ఈ మామూలు క్విజ్ షోకి, తన స్టయిల్లో వినోదాన్ని మేళవించి ప్రత్యేకతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడని వినికిడి. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ షో, త్వరలోనే మొదలవ బోతోందట. చూద్దాం... ఆ షోకి శ్రీనివాస్  ప్లస్ అవుతాడో, లేక అతడి కెరీర్‌కి ఈ షో ప్లస్ అవుతుందో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement