quiz master
-
నవ్వుల మాస్టర్... ఇకపై క్విజ్ మాస్టర్!
తొలి సినిమా ‘అష్టా చెమ్మా’తోనే తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపారేశాడు అవసరాల శ్రీనివాస్. కామెడీతో కడుపుబ్బ నవ్వించాడు అందరినీ. సరదాగా కాసేపు, పిల్ల జమిందార్, అంతకుముందు ఆ తర్వాత, చందమామలో అమృతం వంటి చిత్రాలతో తన నట ప్రతిభను కళ్లకు కట్టిన శ్రీనివాస్... మంచి రచయిత, దర్శకుడు కూడా. ఇప్పుడు సరికొత్తగా... టీవీ హోస్ట్ కూడా కాబోతున్నాడు. ఓ టీవీ చానెల్ రూపొందిస్తోన్న క్విజ్ ప్రోగ్రామ్ ద్వారా టెలివిజన్ రంగంలోనూ అడుగిడుతున్నాడు శ్రీనివాస్. నిజానికిది పెద్ద వెరైటీ షో ఏం కాదు. హైస్కూల్ స్థాయి విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించే ఓ క్విజ్ షో. అయితే శ్రీనివాస్ ఈ మామూలు క్విజ్ షోకి, తన స్టయిల్లో వినోదాన్ని మేళవించి ప్రత్యేకతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడని వినికిడి. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ షో, త్వరలోనే మొదలవ బోతోందట. చూద్దాం... ఆ షోకి శ్రీనివాస్ ప్లస్ అవుతాడో, లేక అతడి కెరీర్‌కి ఈ షో ప్లస్ అవుతుందో! -
హ్యూమరం: బాబు క్విజ్ షో
చంద్రబాబు క్విజ్‌పోటీలో పాల్గొన్నాడు. ‘‘సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు?’’ అని అడిగాడు క్విజ్ మాస్టర్. ‘‘తూర్పున అనేది నిజం కాదు. పడమర కావచ్చు. ఒక్కోసారి ఈశాన్యం, నైరుతిలు కూడా కావచ్చు. కొన్నిసార్లు ఉదయించకపోవచ్చు. సూర్యుడు లేకుండా పగలు రావచ్చు. పగలు లేకుండా సూర్యుడు ఉండొచ్చు’’ అని ఆలోచించి మరీ చెప్పాడు బాబు. క్విజ్ మాస్టర్ కంగారు పడి ‘‘ఇలాంటి సమాధానం ఇంతవరకూ వినలేదే’’ అన్నాడు. బాబు పీఏ రంగప్రవేశం చేసి ‘‘ఆయనేం చెబితే అదే సమాధానం, ఏమీ చెప్పకపోతే అది సమాధానం లేని ప్రశ్న అని అర్థం’’ అన్నాడు. క్విజ్ మాస్టర్ సర్దుకుని ‘‘ప్రజాస్వామ్యమంటే ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘ప్రజలు లేకుండా ప్రజాస్వామ్యముండొచ్చు. ప్రజాస్వామ్యమంటే తెలియని ప్రజలుండొచ్చు. ప్రజలు, ప్రజాస్వామ్యం లేకుండా ప్రభుత్వాలు ఉండొచ్చు. ప్రభుత్వమంటే తెలియని ప్రజలు ఉండొచ్చు. వాస్తవానికి ప్రజాస్వామ్యం గురించి ఏళ్ల తరబడి మాట్లాడ్డమే కానీ అది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు’’ అన్నాడు బాబు. ‘‘రాజకీయమంటే ఏమిటి?’’ అని క్విజ్ మాస్టర్ అడిగాడు. వెంటనే బాబు గాల్లోకి చేతిని ఊపి ‘‘ఇదిగో ఈ గిన్నెలోని పాయసం తాగు’’ అన్నాడు. ‘‘గిన్నె ఏంటి? పాయసమెక్కడుంది?’’ ఆశ్చర్యపోతూ అడిగాడు క్విజ్ మాస్టర్. పీఏ వచ్చి ‘‘కనబడని పాయసాన్ని ప్రజలతో తాగించడమే రాజకీయం. నోర్మూసుకుని తాగు’’ అన్నాడు. మాస్టర్ భయపడిపోయి పాయసాన్ని తాగి మూతి తుడుచుకున్నాడు. ‘‘చివరగా మీకిష్టమైన సామెత చెప్పండి.’’ ‘‘నిదానమే ప్రధానం, ఆలస్యం అమృతం విషం’’. క్విజ్మాస్టర్ మూర్ఛపోతే పీఏ నీళ్లు చిలకరించి ‘‘ఆయనంతే. వడ్లు లేకుండా బియ్యాన్నీ, గుడ్లు లేకుండా కోళ్లనీ సృష్టించగలడు’’ అని చెప్పాడు. మాస్టర్‌కి మళ్లీ స్పృహ తప్పింది. - జి.ఆర్.మహర్షి మహర్షిజం చిరంజీవి సమస్యల పరిష్కారం కోసం తీర్థయాత్రలు తిరుగుతున్నాడు. కాంగ్రెస్ ప్రత్యేకత ఇరువైపులా తానే పందెం కాసి ఫైటింగ్ నడిపిస్తుంది. కోడిని ఉచితంగా ఇచ్చి నీ ఇంట్లోని మేకల మందను తోలుకుపోవడమే రాజకీయం.