Sakshi Little Stars: తారే జమీన్‌ పర్‌ | Sakshi Special: Little Stars Visited To Hyderabad Sakshi Media Group Head Office | Sakshi
Sakshi News home page

Sakshi Little Stars: తారే జమీన్‌ పర్‌

Published Thu, Nov 14 2024 5:06 AM | Last Updated on Thu, Nov 14 2024 7:01 AM

Sakshi Special: Little Stars Visited To Hyderabad Sakshi Media Group Head Office

బాలల దినోత్సవం సందర్భంగా సాక్షి కార్యాలయంలో సందడిచేసిన లిటిల్‌ స్టార్స్‌

నేటి మధ్యాహ్నం 12.00 గంటలకు సాక్షి టీవీలో

‘మేం పాటలు పాడతాం. డైలాగ్స్‌ గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తాం. పొడుపుకథలు వేస్తాం, ప్రశ్నలతో తికమక పెట్టేస్తాం. స్కూల్లో చదువుకుంటాం, సినిమాల్లో నటిస్తాం, డ్యాన్స్‌లే కాదు అల్లరి కూడా చేస్తాం ...’ అంటూ బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం ‘సాక్షి’ మీడియా హౌస్‌ హైదరాబాద్‌ ఆఫీసులో ఏర్పాటు చేసిన వేదిక ద్వారా పలువురు బాల తారలు తమ ఆనందాలను పంచుకున్నారు. స్కూల్‌ విద్యార్థులు అడిగిన పొడుపు కథలకు ఈ ‘లిటిల్‌ స్టార్స్‌’ ఆన్సర్‌ చేయడం, లిటిల్‌ స్టార్స్‌ కోరిన పాటలను స్కూల్‌ విద్యార్థులు పోటీ పడుతూ పాడటంతో కార్యక్రమం సందడిగా మారింది.

స్కూల్లో రన్నింగ్, ఖోఖో, కబడ్డి,  క్రికెట్, బాస్కెట్‌ బాల్‌... వంటి ఆటలన్నీ ఆడతాం అంటూ మొదలు పెట్టిన పిల్లలు కరెంట్‌ షాక్‌ ఎందుకు తగులుతుంది? బాల్‌ని కొడితే ముందుకు ఎలా వెళుతుంది? అంటూ సైన్స్‌  పాఠాలనూ వినిపించారు. లెక్కలు ఇష్టం అంటూనే డాక్టర్లం అవుతాం అనే భవిష్యత్తు ప్రణాళికలనూ చెప్పారు. సోషల్‌ మీడియాలో తమకున్న ఫాలోవర్స్‌ గురించి, చేస్తున్న రీల్స్‌ గురించి వివరించారు. ‘సాక్షి’ మీడియా హౌస్‌ వారం రోజుల పాటు జరిపిన ‘లిటిల్‌ స్టార్స్‌’ కార్యక్రమంలో భాగంగా  కలిసిన చిన్నారులను గుర్తుకు తెచ్చుకొని, ‘మరో ప్రపంచం తెలుసుకున్నాం’ అంటూ తమ స్పందనను తెలియజేశారు బాల తారలు. టీవీ చానల్‌కి సంబంధించిన న్యూస్‌రూమ్, పీసీఆర్‌ వంటి వాటిని చూసి సంభ్రమాశ్చర్యాలను వెలిబుచ్చారు.


మేమిద్దరం కవలలం. కలిసే చదువుకుంటాం. సినిమాల్లోనూ కలిసే వర్క్‌ చేస్తాం. మేం ఇద్దరం పెద్దయ్యాక సాఫ్ట్‌వేర్‌ బిజినెస్‌ పెట్టాలనుకుంటున్నాం. ఈ ్రపోగ్రామ్‌ ద్వారా మా ఇద్దరి ఆలోచనలను, మా ప్రతిభను  షేర్‌ చేసుకునే అవకాశం లభించింది. ఇక్కడ న్యూస్‌ ఎలా రెడీ అవుతుందో తెలుసుకొని ఆశ్చర్యపోయాం. ఈ చిల్డ్రన్స్‌ డే మాకు వెరీ వెరీ స్పెషల్‌. 
– అర్జున్, అర్విన్‌

నాకు నటుడిగా గుర్తింపు వచ్చిందంటే మా అమ్మే కారణం. ఇప్పటి వరకు పది సినిమాల్లో బాల నటుడిగా నటించే అవకాశం వచ్చింది. సినిమా చూసిన తరువాత స్కూల్లో ఫ్రెండ్స్‌ నీ క్యారెక్టర్‌ సూపర్‌గా ఉందంటూ కాంప్లిమెంట్స్‌ ఇస్తుంటారు. రెండు మూడు పేజీల డైలాగ్‌లు కూడా ఒకేసారి చెప్పగలను. ఈ కార్యక్రమం ద్వారా నేను సినిమాల్లోని డైలాగ్స్‌ చెప్పే అవకాశం లభించింది. అలాగే, న్యూస్‌ ఎలా రెడీ అవుతుందో తెలుసుకున్నాను. ఈ ్రపోగ్రామ్‌ మాకు పాఠంలా కొత్తదనాన్ని పరిచయం చేసింది. థాంక్యూ సాక్షి.
– కె. హర్ష

ఏడేళ్ల వయసు నుంచి సినిమాలలో నటిస్తున్నాను. చదువు, సినిమాలతో పాటు బాస్కెట్‌ బాల్, క్రికెట్, డ్యాన్స్‌ కూడా చాలా ఇష్టం. స్కూల్, సినిమా షూటింగే కాదు ‘సాక్షి’ ఏర్పాటు చేసిన ‘లిటిల్‌స్టార్స్‌’లో భాగంగా నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలను కలిసినప్పుడు చాలా బాధపడ్డాను. తలస్సేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలను చూసి, అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాను. అలాగే ఈ ఫైనల్‌ ఈవెంట్‌లో ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలోని డైలాగ్‌ చెప్పినప్పుడు అందరూ గ్రేట్‌ అంటూ మెచ్చుకుంటే చాలా ఆనందంగా అనిపించింది. మమ్మల్ని ఎంకరేజ్‌ చేసే ఈ ్రపోగ్రామ్‌ చాలా బాగుంది. 
అందరికీ థ్యాంక్స్‌. 
– మోక్షజ్ఞ

తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను కలవడానికి ‘సాక్షి’ మీడియా ద్వారా వెళ్లాను. చిన్న చిన్న పిల్లలు ఆ వ్యాధితో బాధపడుతుండటం చూసి, చాలా బాధగా ఫీలయ్యాను. కాసేపు వాళ్ల బాధని మరచిపోయేలా చేయాలని వాళ్లు అడిగిన డైలాగ్స్‌ చెప్పాను. వాళ్లను ఎంకరేజ్‌ చేసేలా మాట్లాడాను. మామూలుగా నేను చదువుకుంటాను, సినిమాలు చేస్తుంటాను. రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటాను. అలాంటి నాకు ఇలాంటి పిల్లలతో కాసేపు టైమ్‌ స్పెండ్‌ చేయడం ఓ డిఫరెంట్‌ వరల్డ్‌లోకి వెళ్లినట్లు అనిపించింది. ఇక ‘సాక్షి మీడియా’ హౌస్‌లో ఏర్పాటు చేసిన ‘‘లిటిల్‌స్టార్స్‌’లో నాతోటి యాక్టర్స్‌తో కలిసి ఎంజాయ్‌ చేయడం చాలా బాగుంది. 
– అనన్య ఈగ

చేసే పనిపై ఇష్టం ఉంటుంది కాబట్టి చదువు–సినిమా రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటాను. ఈ ్రపోగ్రామ్‌ ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ‘స్పర్శ్‌’ హాస్పిస్‌ కేంద్రంలో సేవలు పొందుతున్న చిన్నారులను కలిశాం. వారి పరిస్థితి చూశాక చాలా బాధ అనిపించింది. వారి ముఖాల్లో నవ్వులు తెప్పించాలని డ్యాన్స్‌లు చేశాం, పాటలు పాడాం... ఈ ఎక్స్‌పీరియన్స్‌ను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ చిల్డ్రన్స్‌ డే మాకు సాక్షి ఇచ్చిన ఓ పెద్ద గిఫ్ట్‌. 
– సయ్యద్‌ ఫర్జానా

రైతు స్వరాజ్య వేదిక ద్వారా అక్కడి పిల్లలను కలిసినప్పుడు వాళ్లు ఎంత కష్టపడుతున్నారో అనిపించింది. వాళ్ల నాన్న చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ బాగా 
చదువుకుని, అమ్మను బాగా చూసుకుంటాం అని వారు చెప్పినప్పుడు ‘గ్రేట్‌’ అనిపించింది. అలాగే 
కలెక్టర్‌ అవుతామని, డాక్టర్‌ అవుతామని వాళ్లు తమ భవిష్యత్తు గురించి, తమ ΄్లాన్స్‌ గురించి చెప్పినప్పుడు వారి ధైర్యం చూసి భేష్‌ అనిపించింది. ఈ కార్యక్రమం ద్వారా ఓ కొత్త ప్రపంచాన్ని చూశాం. 
– హనీష

ఎం.ఎన్‌.జె. క్యాన్సర్‌ హాస్పిటల్‌లో ఉన్న పిల్లలను చూసినప్పుడు చాలా ఎమోషనల్‌ అయ్యాను. తర్వాత వాళ్లను హ్యాపీగా ఉంచాలనిపించింది. అందుకే మాటలు, పాటలతో వారితో కలిసిపోయాను. ఇంటికి వెళ్లాక మా నాన్నతో ఆ విషయాలన్నీ పంచుకున్నాను. ‘సాక్షి మీడియా’ వల్ల వాళ్లను కలిసి, నా వంతుగా కాసేపు వాళ్లని సంతోçషపెట్టడానికి ట్రై చేశాను. ఈ చిల్డ్రన్స్‌ డే నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. 
– సాన్విక

మూడేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నాను. భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నాను. నేను కోపం, బాధ, హ్యాపీ సీన్లలో బాగా నటిస్తాను అని చెబుతారు. ఏడుపు సీన్లలో గ్లిజరిన్‌ లేకుండా నటించడం చూసి, అందరూ మెచ్చుకున్నారు. టీవీలో అందరి ముందు నా టాలెంట్‌ను ప్రదర్శించే అవకాశం లభించింది. ఇప్పుడు స్వయంగా టీవీ 
న్యూస్‌రూమ్, స్టూడియో... ఇవన్నీ చూడటం కొత్తగా అనిపించింది.  
– ఖుషీ రెడ్డి

మూడేళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు 25 యాడ్స్, 30 సినిమాల్లో నటించాను. హిందీ మూవీలో కూడా నటించాను. డ్యాన్స్, సంగీతం నేర్చుకుంటున్నాను. బాలరత్న అవార్డు కూడా వచ్చింది. ‘సాక్షి’ మీడియాతో కలిసి రైతు స్వరాజ్య వేదికకి వెళ్లి అక్కడి పిల్లలతో మాట్లాడటం బాగా అనిపించింది. ‘మా నాన్న లేరు’ అని వాళ్లు చెప్పినప్పుడు ఏడుపొచ్చింది. ఇక ఫైనల్‌ ఈవెంట్‌లో గోగో (బొమ్మ)తో మాటలు బాగా నచ్చాయి. ఎంత టైమ్‌ స్పెండ్‌ చేశామో తెలియనే లేదు. 
– శ్రేష్ట కోట

కేంద్రీయ విద్యాలయాలో చదువుకుంటున్నాను. సినిమాల్లో నటిస్తున్నాను. తబలా వాయిస్తాను. డ్యాన్స్, మ్యూజిక్‌ నేర్చుకుంటున్నాను. సీరియల్స్‌లో కూడా 
నటిస్తున్నాను. ‘బాలోత్సవం’లో నాకు వచ్చిన పాటలు పాడాను.  అందరూ సూపర్‌ అని మెచ్చుకున్నారు. 
– శ్రేయాన్‌ కోట

ఈ కార్యక్రమం ద్వారా తలసేమియాతో బాధపడుతున్నవారిని కలిశాను. వారిని నవ్వించాను కూడా... పాటలు పాడాను, డ్యాన్సులు చేశాను. అలాగే బుధవారం జరిగిన వేడుకలో నాలా సినిమాల్లో నటిస్తున్న మిగతా అన్నయ్యలు, అక్కలను కలుసుకోవడం హ్యాపీగా అనిపించింది. మా ఇష్టాలు, చదువు, ఆటలు, పాటలు, డైలాగ్స్‌ మీ అందరికీ చెప్పడం.. అన్ని విషయాలను షేర్‌ చేసుకోవడం బాగుంది. గోగో 
(బొమ్మ)తో బాగా ఎంజాయ్‌ చేశాం. 
– తనస్వి

ఎం.ఎన్‌.జె. క్యాన్సర్‌ హాస్పిటల్‌లో చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. వాళ్లని చూడగానే ఫస్ట్‌ చాలా ఏడుపొచ్చింది. అయితే మేం వాళ్లని హ్యాపీ చేయడానికి వెళ్లాం కాబట్టి, వాళ్లతో జోక్‌గా మాట్లాడాను. వాళ్లు నవ్వడం హ్యాపీ అనిపించింది. అలాగే ‘సాక్షి’ టీవీకి వచ్చి, అందరితో మాకు క్లాసులు చెప్పినవి, మేం సినిమాల్లో చేసినవి షేర్‌ చేసుకోవడం హ్యాపీ. పెద్దయ్యాక మహేష్‌బాబులాగా పెద్ద హీరోని అవుతాను. ఇక్కడ గోగో (బొమ్మ)తో కలిసి చేసిన అల్లరి బాగుంది. అలాగే, మాకు అన్ని న్యూస్‌ రూమ్‌లు చూపించారు. చాలా కొత్తగా అనిపించింది. 
– స్నితిక్‌

చిన్ని మనసులు కదిలిన వేళ...
పసి హృదయాలు కదిలిపోయాయి. చిన్న మనసులే అయినప్పటికీ తోటి చిన్నారులు పడుతున్న బాధ చూసి, చలించిపోయాయి. బాలల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ‘సాక్షి’ మీడియా హౌస్‌ జరిపిన స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా కేన్సర్, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను, మృత్యువుతో పోరాడుతున్న పసిబాలలకు, తండ్రిని కోల్పోయిన వారిని, అనాథ బాలలను కలిశారు పలువురు బాల తారలు. కాసేపు ఆ చిన్నారులు తమ కష్టాన్ని మరచిపోయేలా చేసి, వారితో ఆడి పాడారు... నవ్వించారు. చివరగా ‘సాక్షి’ మీడియా హౌస్‌లో జరిగిన వేడుకలో స్కూల్‌ విద్యార్థులతో కలిసి ఈ బాల తారలు సందడి చేశారు. ఈ ‘బాలల దినోత్సవం’ ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.

టీవీలో న్యూస్‌ చదువుతారు కదా.... ఆ రూమ్‌ ఎలా ఉంటుందో చూస్తారా? ఎడిటింగ్‌ ఎలా జరుగుతుందో చూడాలని ఉందా? అసలు టీవీ స్టూడియో ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా? అనడమే ఆలస్యం ‘ఓ’ అంటూ ఆసక్తి కనబరిచారు లిటిల్‌ స్టార్స్‌. ‘సాక్షి టీవీ’ న్యూస్‌ రూమ్, పీసీఆర్‌ (ప్రొడక్షన్‌ కంట్రోల్‌ రూమ్‌) వంటివి చూసి, ఆశ్చర్యపోయారు. టీవీ స్టూడియోలో జరుగుతున్న పనులను నిశితంగా గమనించారు.

ఈ వారమంతా లిటిల్‌ స్టార్స్‌ సందడిని సాక్షి యూట్యూబ్‌లో చూడటానికి ఈ QRకోడ్‌ను స్కాన్‌ చెయ్యండి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement