Children's Day
-
రాష్ట్రపతితో ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల భేటీ
ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు అరుదైన అవకాశం లభించింది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో ఫ్యూజన్ స్కూల్ విద్యార్థులు అర్హత సాధించారు. బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ సందర్భంగా ఆమె చూపిన ఆప్యాయతపై ఫ్యూజన్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఫ్యూజన్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీదేవి రావు మాట్లాడుతూ,రాష్ట్రపతిని కలవడం ఎంతో గర్వకారణం. ఇది జీవితకాల జ్ఞాపకం’అని అన్నారు.కాగా, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం, ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అరుదైన అవకాశం కేంద్రం కల్పిస్తుంది. ఇందుకోసం విద్యార్థులు శారీరక, మానసిక, నాయకత్వ నైపుణ్యాల వంటి పరీక్షల్లో ప్రతిభను చాటాల్సి ఉంటుంది. -
చెదరనీకు ఆ చిరునవ్వు..!
రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఉత్సాహంగా పాల్గొన్న బాలసదన్, రిహాబిలిటేషన్ సెంటర్ల బాలలు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పులకింత చిన్నారులకు బహుమతులు అందించిన ఉన్నతాధికారులుసంగారెడ్డి/నారాయణపేట రూరల్/నిజామాబాద్ నాగారం/కామారెడ్డి: వసంతకాలంలో పువ్వులను.. పసి మోముల్లోని నవ్వులను ఎంత చూసినా తనివి తీరదు. పసి బిడ్డల ముఖాల్లోని నవ్వులు స్వచ్ఛతకే కాదు.. కొన్నిసార్లు సహజ స్థితిగతులకూ అద్దంపడతాయి. తల్లిదండ్రుల సంరక్షణ ఉంటేనే పిల్లలు తమ బాల్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలరు. కానీ, ఎంతో మంది బాలలు తమకు తెలియకుండానే అనాథాశ్రమాల్లో, రిహాబిలిటేషన్ సెంటర్లలో మగ్గిపోతున్నారు. అలాంటి బాలల ముఖాల్లో చిరునవ్వులు పూయించాలని ‘సాక్షి’ మీడియా సంకలి్పంచింది. బాలల దినోత్సవం సందర్భంగా వివిధ జిల్లాల్లో పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి గురువారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. పలువురు ప్రముఖులు కార్యక్రమాల్లో పాల్గొని బహుమతులు అందించి బాలలను ఉత్సాహపరిచారు.నిజామాబాద్‌లో ‘సాక్షి లిటిల్ స్టార్స్’.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతీనగర్‌లో ఉన్న స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్స్లో ‘సాక్షి లిటిల్‌స్టార్స్’కార్యక్రమం ఘనంగా జరిగింది. సాక్షి మీడియా, అగ్గు భోజన్న నారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ముఖ్య అథితిగా హాజరై సాక్షి మీడియా ప్రత్యేకంగా బాలల దినోత్సవం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. వేడుకల్లో చిన్నారుల దేశభక్తి గేయాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్శనగా నిలిచాయి. వేడుకల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, జిల్లా సంక్షేమాధికారి షేక్ రసూల్‌బీ, అగ్గు భోజన్న నారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అగ్గు భోజన్న, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.కామారెడ్డిలో..కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలసదనంలో సాక్షి మీడియా, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధుశర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను తమ జీవిత లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో కేక్ కట్ చేయించారు. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటలు, పాటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్, జిల్లా పరిషత్ సీఈవో, ఇన్చార్జ్ డీడబ్ల్యూవో చందర్‌నాయక్, మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలసదనం అధికారులు, ఉద్యోగులు, సాక్షి విలేకరులు పాల్గొన్నారు. నారాయణపేటలో..నారాయణపేటలోని బాలసదన్‌లో సాక్షి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ సిక్తా పటా్నయక్ పాల్గొన్నారు. చిన్నారులు గులాబీ పువ్వులతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. బాలసదన్‌లోని పిల్లలతో ఆమె సరదాగా గడిపారు. క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందించడంతో పాటు, నృత్యాలు చేసి అలరించిన చిన్నారులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ, మైనారిటీ శాఖ అధికారి రషీద్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు యాదయ్య, కమలమ్మ, డీసీపీఓ తిరుపతయ్య, చి్రల్డన్ హోం ఇన్చార్జ్ నిహారిక, సాక్షి సిబ్బంది ఆనంద్, రాజేష్ పాల్గొన్నారు. సంగారెడ్డిలో..‘సాక్షి’మీడియా గ్రూపు, సహారా సొసైటీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని సహారా ప్రైమరీ రిహాబిలిటేషన్ సెంటర్లో గురువారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హాజరై చిన్నారులతో ఉల్లాసంగా గడిపారు. వివిధ రకాల ఆటల పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న సహారా సెంటర్‌ను అభినందించారు. -
బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన YSRCP అధినేత YS జగన్
-
అప్పుడే డిసైడ్ అయ్యా...జేసీ మయూర్ అశోక్..
సాక్షి, విశాఖపట్నం: రంగుల ప్రపంచంలో స్వేచ్ఛా విహంగం బాల్యం. కొత్త ప్రపంచంలోకి నడిపించే శైశవదశలో ప్రతి విషయం ఓ మధుర జ్ఞాపకమే అన్నారు జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్. బాలల దినోత్సవం సందర్భంగా తన చిన్న నాటి జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. బాల్యంలో జరిగిన ఒక సంఘటన తన జీవితాన్ని మలుపుతిప్పిందని చెప్పారు. ‘మా సొంతూరు మహారాష్ట్రలోని బీడ్. నేను 6వ తరగతి చదువుతున్న రోజులవి. స్కూల్లో ఉన్న సమయంలో గుజరాత్‌లోని భుజ్‌లో భారీ భూకంపం వచ్చిందని మా టీచర్లు చెప్పారు. స్కూల్లో ఉదయం ప్రతిజ్ఞ సమయంలో వార్తలు చదివేవాళ్లం. దేశం యావత్తూ భుజ్ భూకంప బాధితులకు సహాయం చేసేందుకు ముందుకొస్తోందని.. మనం కూడా సాయమందిద్దామని టీచర్లు చెప్పారు. ఫండ్ కలెక్ట్ చేసేందుకు టీమ్ లీడర్‌గా నన్ను ఎంపిక చేశారు. ప్రతి విద్యార్థి నుంచి ఫండ్ కలెక్ట్ చేస్తూ.. దానికి సంబంధించిన లెక్కలను ఎప్పటికప్పుడు హెడ్ సర్కి చెప్పేవాడిని. అప్పుడే ఒక ఆర్థిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, సమయపాలన అలవర్చుకున్నాను. ఫండ్ ఎంత ఎక్కువగా ఇస్తే.. అంత మందికి సాయం చేయగలమన్న ఆలోచన నాలో వచ్చింది. అందుకే ప్రతి విద్యార్థీ వీలైనంత పెద్ద మొత్తంలో డబ్బులు అందించేలా ప్రోత్సహించాను. ప్రతి క్లాస్‌కు వెళ్లి మోటివేషన్ స్పీచ్ ఇచ్చేవాడిని. అది అందర్నీ ఆకట్టుకుంది. అప్ప ట్లోనే మా స్కూల్ తరఫున దాదాపు రూ.5లక్షల వరకు సేకరించగలిగాం. దీంతో నన్ను టీచర్లు అభినందించారు. ఈ మొత్తాన్ని జిల్లా కలెక్టర్‌కు అప్పగించే బాధ్యతను నాకే అప్పగించారు. అప్పుడే మొదటిసారి కలెక్టరేట్‌కు వెళ్లాను.అక్కడ కలెక్టర్ చాంబర్ చూశాను. ఐఏఎస్ అధికారి ఎలా ఉంటారన్నది చూసిన నాకు అక్కడ వాతావరణం ప్రేరేపించింది. నాలో కొత్త ఆలోచనలను రేకెత్తించేలా చేసింది. ఐఏఎస్ అధికారి కావాలన్న లక్ష్యాన్ని నాలో కలిగించిందీ ఆ సంఘటనే.. అప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలని మా టీచర్లను, తల్లిదండ్రులను అడిగేవాడిని. వారు చెప్పినదానికనుగుణంగా ప్లాన్ చేసుకున్నాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాను. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా చదివాను. తర్వాత 2018లో సివిల్స్‌కు ఎంపికై .. నా కలను నెరవేర్చుకున్నాను. ప్రణాళికాబద్ధంగా శైశవదశను ఆస్వాదిస్తే.. ప్రతి ఒక్కరి బాల్యం మనకు కథ అవుతుంది. భావితరాలకు చరిత్రగా మారుతుంది’ అని జేసీ మయూర్ అశోక్ చెబుతూ.. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఆ సంఘటనే మలుపు తిప్పిందిచిల్డ్రన్స్ డే రోజున ఏదో ఒక గేమ్‌లో ప్రైజ్‌లు వచ్చేవి. నాకు బాగా గుర్తుంది.. ఒకటో తరగతిలో స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలపై పోటీలు నిర్వహించారు. నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ గెటప్‌లో వెళ్లి డైలాగ్‌లు చెప్పాను. నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని జేసీ గుర్తు చేసుకుంటూ సంబరపడ్డారు. -
బాల్యమొక స్ఫూర్తి
బాల్యం అనేది ప్రతీ ఒక్కరి జీవితానికి భవిష్యత్ పాఠశాల. చిన్నారులు ఎదిగే క్రమంలో వారి ఆలోచనలపై చూపించే ప్రభావమే వారి జీవిత గమ్యాలను నిర్దేశిస్తాయి. పిల్లల చిన్నప్పటి అభిరుచులే వారి లక్ష్యాలుగా మార్పు చెందుతాయి. ఈ ప్రయాణంలో కొందరు చిన్నారులు చదువులపై ఆసక్తి కనబరిస్తే మరి కొందరు సంగీతం, క్రీడలు, డాన్స్, పెయింటింగ్, సాహస కృత్యాలు ఇలా తదితర అంశాలపై మక్కువ చూపుతుంటారు. ఒకవైపు వారి చదువులను కొనసాగిస్తూనే ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్‌లో రాణిస్తుంటారు. పసిప్రాయంలోనే ఇలాంటి విభిన్న రంగాల్లో అత్యుత్తమ నైపుణ్యాలతో రాణించిన కొందరు చిన్నారులను చిల్డ్రన్స్ డే సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. బాల్యం నుంచే తమకంటూ కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకుని అటు చదువులను ఇటు వారి ప్రయత్నాలను కొనసాగిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న బాలతారల ఆలోచనలను తడిమి చూద్దామా..? చిన్న వయసులో..పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతకు అచ్చు గుద్దినట్టు ఈ పాప సరిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే 9 ఏళ్ల వయసులోనే తన కంటే నాలుగేళ్లు పెద్ద వాళ్లతో తలపడి, గెలుపొంది ఔరా అనిపించుకుంటోంది. బ్యాడ్మింటన్ ఆటలో అద్భుతాలు సృష్టిస్తోంది లట్టాల శాన్వి. నగరంలోని మణికొండకు చెందిన శాని్వకి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న శాని్వ.. ఆటపై పూర్తిగా ఫోకస్ పెట్టేందుకు చదువు కూడా మానేసింది. రోజులో కనీసం 8 గంటల పాటు ఆటపైనే శ్రద్ధ పెడుతూ ప్రాక్టీస్ చేస్తోంది. ఒలంపిక్స్‌లో దేశం తరఫున ఆడి బంగారు పతకాన్ని సాధించడమే తన జీవిత లక్ష్యమని చెబుతోంది. ఇటీవల అసోంలో జరిగిన జాతీయస్థాయి అండర్–13 ర్యాంకింగ్ టోర్నమెంట్లో సింగిల్స్, డబుల్స్ విభాగంలో మెయిన్ డ్రాకు అర్హత పొంది సంచలనం సృష్టించింది.హైదరాబాద్నునంబర్ వన్ స్థానంలో.. అతి సాధారణ కుటుంబం మాది. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. మేము ఏది చేసినా మా కుటుంబానికి గుర్తింపు రావాలి. మా అమ్మా నాన్నలకు మంచి పేరు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నగరంలోని యాచ్ క్లబ్ ఆధ్వర్యంలో సుహేమ్ షేక్ అందిస్తున్న సహకారంతో ఈ సెయిలింగ్‌లో రాణించాను. వైఎఐ నార్త్ ఈస్ట్ రేగట్ట 2023 ఆప్టిమిస్టిక్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాను. వైఎఐ సికింద్రాబాద్ యూత్ క్లబ్ రేగట్ట 2023లో సిల్వర్ పతకం సాధించాను. వైఏఐ యూత్ నేషనల్లో ఆప్టిమిస్టిక్ విభాగంలో కాంస్యం గెలుపొందాను. మా ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ను నంబర్ వన్ స్థానంలో తీసుకువచ్చారు. నాతోపాటు నా సహోదరి కూడా సేలింగ్లోనే జాతీయ స్థాయిలో పలు పతకాలను సాధించింది. – లహరి, జాతీయస్థాయి సెయిలర్టీం ఇండియాకు ఆడటమే..క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం.. ప్రస్తుతం నేను హిమాయత్‌నగర్‌లోని స్లేట్ ది స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. బాగ్‌లింగంపల్లిలోని స్పాట్ లైట్ అకాడమీలో క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్నాను. ఈ మధ్యనే స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అండర్–17 విభాగంలో ఎంపికయ్యాను. ఇండియన్ క్రికెట్ టీమ్‌కు ఆడటమే లక్ష్యంగా క్రికెట్లో రాణిస్తున్నాను. సిటీలో జరిగిన పలు టోర్నమెంట్లలో మంచి స్కోర్ సాధించాను. అందరిలా కాకుండా విభిన్న క్రీడల్లో రాణించడానికి నాన్న అందించే ప్రోత్సాహం మాటల్లో చెప్పలేను. ఇటు చదువులు, అటు క్రికెట్లో సమస్వయం చేసుకుంటూ ముందుకు సాగడానికి నాన్న విశేషంగా కృషి చేస్తున్నాడు. – వరీష సలార్ సినిమాతో గుర్తింపు.. ప్రతి విషయాన్ని వినూత్నంగా ఆలోచించడం నాకిష్టం. చిన్నప్పటి నుంచి విభిన్న కళల్లో ఆసక్తి కనబర్చేవాడిని. అనంతరం సినిమాలు, నటనపై మక్కువ పెరిగింది. ఏ చిన్న ఆడిషన్స్ ఉన్నా వెళ్లేవాడిని. ఈ ప్రయత్నంలో పలు మంచి ప్రాజెక్టుల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించే అవకాశం వచి్చంది. ప్రముఖ సినీ హీరో అజిత్, త్రిష నటించిన గుడ్, బాడ్, అగ్లీ సినిమా, ప్రభాస్ సలార్ వంటి సినిమాలు మంచి గుర్తింపునిచ్చాయి. మరికొద్ది రోజుల్లో రానున్న వరుణ్ తేజ్ సినిమా మట్కాలో మంచి రోల్ చేస్తున్నారు. అంతేగాకుండా జగపతిబాబు తదితర టాలీవుడ్ స్టార్స్‌తో మరికొన్ని ప్రాజెక్ట్‌లు చేస్తున్నాను. సినిమాలతో పాటు చదువులోనూ రాణిస్తున్నాను. సినిమాల ప్రభావం నా చదువులపై పడకుండా చూసుకుంటున్నాను. భవిష్యత్తులో వైవిధ్యమైన క్యారెక్టర్లు చేసే మంచి హీరోగా రాణించాలని ఉంది. – కార్తికేయ దేవ్, ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్హ్యాపీగా.. సాగుతున్న కెరీర్ ఓరి దేవుడా, సలార్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో చైల్డ్ ఆరి్టస్ట్‌గా నటించాను. ప్రభాస్ వంటి ప్యాన్ ఇండియన్ స్టార్‌తో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలతో పాటు చదువు, క్రీడల్లోనూ ముందంజలో ఉన్నాను. సినిమాలతో మొదలై కెరీర్ హ్యాపీగా ముందు సాగుతోంది. సామాజిక బాధ్యతలను ప్రతిబింబించేలా, చిన్నారుల హక్కులను తెలియజేసేలా మంచి ప్రాజెక్టులను చేసే యోచనలో ఉన్నాను. ప్రస్తుతం మరో రెండు పెద్ద ప్రాజెక్టుల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాను. మ్యాథ్స్ ఇంగ్లిష్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. అంతేగాకుండా సంగీతంపైన కూడా ఆసక్తి. నేను పాటలు చాలా బాగా పాడగలను. – ఫర్జానా, చైల్డ్ ఆర్టిస్ట్ -
Sakshi Little Stars: తారే జమీన్ పర్
‘మేం పాటలు పాడతాం. డైలాగ్స్ గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తాం. పొడుపుకథలు వేస్తాం, ప్రశ్నలతో తికమక పెట్టేస్తాం. స్కూల్లో చదువుకుంటాం, సినిమాల్లో నటిస్తాం, డ్యాన్స్‌లే కాదు అల్లరి కూడా చేస్తాం ...’ అంటూ బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం ‘సాక్షి’ మీడియా హౌస్ హైదరాబాద్ ఆఫీసులో ఏర్పాటు చేసిన వేదిక ద్వారా పలువురు బాల తారలు తమ ఆనందాలను పంచుకున్నారు. స్కూల్ విద్యార్థులు అడిగిన పొడుపు కథలకు ఈ ‘లిటిల్ స్టార్స్’ ఆన్సర్ చేయడం, లిటిల్ స్టార్స్ కోరిన పాటలను స్కూల్ విద్యార్థులు పోటీ పడుతూ పాడటంతో కార్యక్రమం సందడిగా మారింది.స్కూల్లో రన్నింగ్, ఖోఖో, కబడ్డి, క్రికెట్, బాస్కెట్ బాల్... వంటి ఆటలన్నీ ఆడతాం అంటూ మొదలు పెట్టిన పిల్లలు కరెంట్ షాక్ ఎందుకు తగులుతుంది? బాల్ని కొడితే ముందుకు ఎలా వెళుతుంది? అంటూ సైన్స్ పాఠాలనూ వినిపించారు. లెక్కలు ఇష్టం అంటూనే డాక్టర్లం అవుతాం అనే భవిష్యత్తు ప్రణాళికలనూ చెప్పారు. సోషల్ మీడియాలో తమకున్న ఫాలోవర్స్ గురించి, చేస్తున్న రీల్స్ గురించి వివరించారు. ‘సాక్షి’ మీడియా హౌస్ వారం రోజుల పాటు జరిపిన ‘లిటిల్ స్టార్స్’ కార్యక్రమంలో భాగంగా కలిసిన చిన్నారులను గుర్తుకు తెచ్చుకొని, ‘మరో ప్రపంచం తెలుసుకున్నాం’ అంటూ తమ స్పందనను తెలియజేశారు బాల తారలు. టీవీ చానల్‌కి సంబంధించిన న్యూస్‌రూమ్, పీసీఆర్ వంటి వాటిని చూసి సంభ్రమాశ్చర్యాలను వెలిబుచ్చారు.మేమిద్దరం కవలలం. కలిసే చదువుకుంటాం. సినిమాల్లోనూ కలిసే వర్క్ చేస్తాం. మేం ఇద్దరం పెద్దయ్యాక సాఫ్ట్వేర్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం. ఈ ్రపోగ్రామ్ ద్వారా మా ఇద్దరి ఆలోచనలను, మా ప్రతిభను షేర్ చేసుకునే అవకాశం లభించింది. ఇక్కడ న్యూస్ ఎలా రెడీ అవుతుందో తెలుసుకొని ఆశ్చర్యపోయాం. ఈ చిల్డ్రన్స్ డే మాకు వెరీ వెరీ స్పెషల్. – అర్జున్, అర్విన్నాకు నటుడిగా గుర్తింపు వచ్చిందంటే మా అమ్మే కారణం. ఇప్పటి వరకు పది సినిమాల్లో బాల నటుడిగా నటించే అవకాశం వచ్చింది. సినిమా చూసిన తరువాత స్కూల్లో ఫ్రెండ్స్ నీ క్యారెక్టర్ సూపర్‌గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. రెండు మూడు పేజీల డైలాగ్‌లు కూడా ఒకేసారి చెప్పగలను. ఈ కార్యక్రమం ద్వారా నేను సినిమాల్లోని డైలాగ్స్ చెప్పే అవకాశం లభించింది. అలాగే, న్యూస్ ఎలా రెడీ అవుతుందో తెలుసుకున్నాను. ఈ పోగ్రామ్ మాకు పాఠంలా కొత్తదనాన్ని పరిచయం చేసింది. థాంక్యూ సాక్షి.– కె. హర్షచదవండి: చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!ఏడేళ్ల వయసు నుంచి సినిమాలలో నటిస్తున్నాను. చదువు, సినిమాలతో పాటు బాస్కెట్ బాల్, క్రికెట్, డ్యాన్స్ కూడా చాలా ఇష్టం. స్కూల్, సినిమా షూటింగే కాదు ‘సాక్షి’ ఏర్పాటు చేసిన ‘లిటిల్‌స్టార్స్’లో భాగంగా నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలను కలిసినప్పుడు చాలా బాధపడ్డాను. తలస్సేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలను చూసి, అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాను. అలాగే ఈ ఫైనల్ ఈవెంట్లో ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలోని డైలాగ్ చెప్పినప్పుడు అందరూ గ్రేట్ అంటూ మెచ్చుకుంటే చాలా ఆనందంగా అనిపించింది. మమ్మల్ని ఎంకరేజ్ చేసే ఈ ్రపోగ్రామ్ చాలా బాగుంది. అందరికీ థ్యాంక్స్. – మోక్షజ్ఞతలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను కలవడానికి ‘సాక్షి’ మీడియా ద్వారా వెళ్లాను. చిన్న చిన్న పిల్లలు ఆ వ్యాధితో బాధపడుతుండటం చూసి, చాలా బాధగా ఫీలయ్యాను. కాసేపు వాళ్ల బాధని మరచిపోయేలా చేయాలని వాళ్లు అడిగిన డైలాగ్స్ చెప్పాను. వాళ్లను ఎంకరేజ్ చేసేలా మాట్లాడాను. మామూలుగా నేను చదువుకుంటాను, సినిమాలు చేస్తుంటాను. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాను. అలాంటి నాకు ఇలాంటి పిల్లలతో కాసేపు టైమ్ స్పెండ్ చేయడం ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి వెళ్లినట్లు అనిపించింది. ఇక ‘సాక్షి మీడియా’ హౌస్‌లో ఏర్పాటు చేసిన ‘‘లిటిల్‌స్టార్స్’లో నాతోటి యాక్టర్స్‌తో కలిసి ఎంజాయ్ చేయడం చాలా బాగుంది. – అనన్య ఈగ3చేసే పనిపై ఇష్టం ఉంటుంది కాబట్టి చదువు–సినిమా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటాను. ఈ ్రపోగ్రామ్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ‘స్పర్శ్’ హాస్పిస్ కేంద్రంలో సేవలు పొందుతున్న చిన్నారులను కలిశాం. వారి పరిస్థితి చూశాక చాలా బాధ అనిపించింది. వారి ముఖాల్లో నవ్వులు తెప్పించాలని డ్యాన్స్‌లు చేశాం, పాటలు పాడాం... ఈ ఎక్స్‌పీరియన్స్‌ను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ చిల్డ్రన్స్ డే మాకు సాక్షి ఇచ్చిన ఓ పెద్ద గిఫ్ట్. – సయ్యద్ ఫర్జానారైతు స్వరాజ్య వేదిక ద్వారా అక్కడి పిల్లలను కలిసినప్పుడు వాళ్లు ఎంత కష్టపడుతున్నారో అనిపించింది. వాళ్ల నాన్న చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ బాగా చదువుకుని, అమ్మను బాగా చూసుకుంటాం అని వారు చెప్పినప్పుడు ‘గ్రేట్’ అనిపించింది. అలాగే కలెక్టర్ అవుతామని, డాక్టర్ అవుతామని వాళ్లు తమ భవిష్యత్తు గురించి, తమ ప్లాన్స్ గురించి చెప్పినప్పుడు వారి ధైర్యం చూసి భేష్ అనిపించింది. ఈ కార్యక్రమం ద్వారా ఓ కొత్త ప్రపంచాన్ని చూశాం. – హనీషఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న పిల్లలను చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. తర్వాత వాళ్లను హ్యాపీగా ఉంచాలనిపించింది. అందుకే మాటలు, పాటలతో వారితో కలిసిపోయాను. ఇంటికి వెళ్లాక మా నాన్నతో ఆ విషయాలన్నీ పంచుకున్నాను. ‘సాక్షి మీడియా’ వల్ల వాళ్లను కలిసి, నా వంతుగా కాసేపు వాళ్లని సంతోషపెట్టడానికి ట్రై చేశాను. ఈ చిల్డ్రన్స్ డే నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. – సాన్వికమూడేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నాను. భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నాను. నేను కోపం, బాధ, హ్యాపీ సీన్లలో బాగా నటిస్తాను అని చెబుతారు. ఏడుపు సీన్లలో గ్లిజరిన్ లేకుండా నటించడం చూసి, అందరూ మెచ్చుకున్నారు. టీవీలో అందరి ముందు నా టాలెంట్‌ను ప్రదర్శించే అవకాశం లభించింది. ఇప్పుడు స్వయంగా టీవీ న్యూస్‌రూమ్, స్టూడియో... ఇవన్నీ చూడటం కొత్తగా అనిపించింది. – ఖుషీ రెడ్డిమూడేళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు 25 యాడ్స్, 30 సినిమాల్లో నటించాను. హిందీ మూవీలో కూడా నటించాను. డ్యాన్స్, సంగీతం నేర్చుకుంటున్నాను. బాలరత్న అవార్డు కూడా వచ్చింది. ‘సాక్షి’ మీడియాతో కలిసి రైతు స్వరాజ్య వేదికకి వెళ్లి అక్కడి పిల్లలతో మాట్లాడటం బాగా అనిపించింది. ‘మా నాన్న లేరు’ అని వాళ్లు చెప్పినప్పుడు ఏడుపొచ్చింది. ఇక ఫైనల్ ఈవెంట్లో గోగో (బొమ్మ)తో మాటలు బాగా నచ్చాయి. ఎంత టైమ్ స్పెండ్ చేశామో తెలియనే లేదు. – శ్రేష్ట కోటకేంద్రీయ విద్యాలయాలో చదువుకుంటున్నాను. సినిమాల్లో నటిస్తున్నాను. తబలా వాయిస్తాను. డ్యాన్స్, మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. సీరియల్స్‌లో కూడా నటిస్తున్నాను. ‘బాలోత్సవం’లో నాకు వచ్చిన పాటలు పాడాను. అందరూ సూపర్ అని మెచ్చుకున్నారు. – శ్రేయాన్ కోటఈ కార్యక్రమం ద్వారా తలసేమియాతో బాధపడుతున్నవారిని కలిశాను. వారిని నవ్వించాను కూడా... పాటలు పాడాను, డ్యాన్సులు చేశాను. అలాగే బుధవారం జరిగిన వేడుకలో నాలా సినిమాల్లో నటిస్తున్న మిగతా అన్నయ్యలు, అక్కలను కలుసుకోవడం హ్యాపీగా అనిపించింది. మా ఇష్టాలు, చదువు, ఆటలు, పాటలు, డైలాగ్స్ మీ అందరికీ చెప్పడం.. అన్ని విషయాలను షేర్ చేసుకోవడం బాగుంది. గోగో (బొమ్మ)తో బాగా ఎంజాయ్ చేశాం. – తనస్విఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్లో చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్లని చూడగానే ఫస్ట్ చాలా ఏడుపొచ్చింది. అయితే మేం వాళ్లని హ్యాపీ చేయడానికి వెళ్లాం కాబట్టి, వాళ్లతో జోక్‌గా మాట్లాడాను. వాళ్లు నవ్వడం హ్యాపీ అనిపించింది. అలాగే ‘సాక్షి’ టీవీకి వచ్చి, అందరితో మాకు క్లాసులు చెప్పినవి, మేం సినిమాల్లో చేసినవి షేర్ చేసుకోవడం హ్యాపీ. పెద్దయ్యాక మహేష్‌బాబులాగా పెద్ద హీరోని అవుతాను. ఇక్కడ గోగో (బొమ్మ)తో కలిసి చేసిన అల్లరి బాగుంది. అలాగే, మాకు అన్ని న్యూస్ రూమ్‌లు చూపించారు. చాలా కొత్తగా అనిపించింది. – స్నితిక్చిన్ని మనసులు కదిలిన వేళ...పసి హృదయాలు కదిలిపోయాయి. చిన్న మనసులే అయినప్పటికీ తోటి చిన్నారులు పడుతున్న బాధ చూసి, చలించిపోయాయి. బాలల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ‘సాక్షి’ మీడియా హౌస్ జరిపిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా కేన్సర్, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను, మృత్యువుతో పోరాడుతున్న పసిబాలలకు, తండ్రిని కోల్పోయిన వారిని, అనాథ బాలలను కలిశారు పలువురు బాల తారలు. కాసేపు ఆ చిన్నారులు తమ కష్టాన్ని మరచిపోయేలా చేసి, వారితో ఆడి పాడారు... నవ్వించారు. చివరగా ‘సాక్షి’ మీడియా హౌస్‌లో జరిగిన వేడుకలో స్కూల్ విద్యార్థులతో కలిసి ఈ బాల తారలు సందడి చేశారు. ఈ ‘బాలల దినోత్సవం’ ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.టీవీలో న్యూస్ చదువుతారు కదా.... ఆ రూమ్ ఎలా ఉంటుందో చూస్తారా? ఎడిటింగ్ ఎలా జరుగుతుందో చూడాలని ఉందా? అసలు టీవీ స్టూడియో ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా? అనడమే ఆలస్యం ‘ఓ’ అంటూ ఆసక్తి కనబరిచారు లిటిల్ స్టార్స్. ‘సాక్షి టీవీ’ న్యూస్ రూమ్, పీసీఆర్ (ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్) వంటివి చూసి, ఆశ్చర్యపోయారు. టీవీ స్టూడియోలో జరుగుతున్న పనులను నిశితంగా గమనించారు.ఈ వారమంతా లిటిల్ స్టార్స్ సందడిని సాక్షి యూట్యూబ్‌లో చూడటానికి ఈ QRకోడ్‌ను స్కాన్ చెయ్యండి -
బ్యాగ్ బరువు తగ్గేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: బాలల దినోత్సవం రోజైనా.. చిన్నారుల భవితవ్యంపై చర్చ జరగాలని పలువురు విద్యారంగ నిపుణులు కోరుతున్నారు. కంప్యూటర్ల కాలంలోనూ బ్యాగ్‌ల బరువు మోత తప్పడం లేదంటున్నారు. ఆధునిక బోధన విధానంలోనూ చిన్నారులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం లేదన్న విమర్శలున్నాయి. ఉల్లాసాన్నిచ్చే క్రీడలు కనిపించడం లేదు. ఉత్సాహాన్నిచ్చే వాతావరణానికీ దూరమవుతున్నారు. కేంద్ర విద్యాశాఖ సైతం ఈ వాస్తవాలను ఒప్పుకుంది. చిన్నారులను బరువుల మోత నుంచి బయట పడేయాలని సూచనలు చేసింది. కానీ ఎక్కడా ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఇదీ మన చిన్నారుల పరిస్థితి.. కేంద్ర విద్యాశాఖ అధ్యయనం ప్రకారం..70 శాతం మంది విద్యార్థులు పుస్తకాల బరువుతో అనారోగ్యం పాలవుతున్నారు. కండరాలు, మోకాళ్లపై ఒత్తిడి పడుతోంది. 22 శాతం మందిని వెన్నెముక నొప్పి వెంటాడుతోంది. అతి చిన్న వయసులోనే నీరసం, భుజాలు వంగి పోవడం సర్వసాధారణమైంది. 90 శాతం మందికి ఏడు గంటల నిద్ర కరువే. దీంతో తరగతి గదిలో చురుకుదనం తగ్గుతోంది. బహుళ అంతస్తు భవనాల్లో ప్రైవేట్ స్కూళ్లుంటున్నాయి. బరువు వేసుకొని మెట్లు ఎక్కడంతో అనేక అనారోగ్య సమస్యలొస్తున్నాయి. ఏవీ ఆ రూల్స్...? పుస్తకాల బరువుపై కేంద్ర విద్యాశాఖ ఐదేళ్ల క్రితమే హెచ్చరించింది. చిన్నపిల్లల బరువులో పది శాతమే పుస్తకాల బరువు ఉండాలంది. ఇలాంటి పరిస్థితి మరే దేశంలోనూ లేదని బరువులపై అధ్యయనం చేసిన యశ్పాల్ కమిటీ చెప్పింది. అధిక బరువుల వల్ల కండరాలపై ఒత్తిడి పడి, భవిష్యత్‌లో దీర్ఘకాల సమస్యలు వెంటాడుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. డిజిటల్ బోధన మేలని సూచించాయి. ఇవేవీ పట్టించుకున్నట్టు లేదు. కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం డిజిటల్ విద్య వైపు మళ్లుతున్నా..మనం ఆ దిశగా అడుగులేయడం లేదు. మార్కుల కోసం గంటల కొద్దీ చదివించే ప్రైవేట్ స్కూళ్లను కట్టడి చేసే దిక్కేలేదు. భుజాలు నొప్పిగా ఉంటాయి రోజూ 40 పుస్తకాలను స్కూలుకు తీసుకెళ్లాల్సి వస్తోంది. పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్, వర్క్ïÙట్స్, నోట్‌బుక్స్ ఉంటాయి. లంచ్ బాక్స్, నీళ్లబాటిల్ అన్నీ బ్యాగులో ఉంటాయి. మూడు అంతస్తులు బరువు వేసు కొని ఎక్కాలి. భుజాలు నొప్పిగా ఉంటాయి. –సుంకర నవీన్, ఐదవ తరగతి కూకట్పల్లి మానసికోల్లాసం ముఖ్యం చదువుతో పాటు చిన్నారుల్లో మానసిక ఉల్లాసం పెంచాలి. అప్పుడే వారిలో ఆలోచన శక్తి వస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో తక్కువ పుస్తకాలతో బోధన ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్లు ఇష్టానుసారం పుస్తకాలు సిఫార్సు చేస్తున్నాయి. ఇలా చెబితేనే మంచి విద్య అని తల్లిదండ్రులూ నమ్ముతున్నారు. వారి ఆలోచన విధానంలో మార్పు రావాలి. – పణితి రామనాథం, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బరువు తగ్గించాల్సిందే పుస్తకాల బరువు వల్ల అనారోగ్య వాతావరణం కనిపిస్తోంది. బోధన విధానంలో ప్రపంచ వ్యాప్తంగా మార్పులు వస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో అధిక బరువుల మోతను అరికట్టే యంత్రాంగం ఉండాలి. దీనివల్ల జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారుల మానసిక వ్యథపై ప్రభుత్వాలు స్పందించాలని కోరుతున్నాం. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పీఆర్టీయూటీఎస్ రాష్ట్రఅధ్యక్షుడు -
Sakshi Little Stars: డాటర్ ఆఫ్ డైరెక్టర్ సుకుమార్
పిల్లలకు బంధువులంటే ఇష్టం. బాబాయ్, మావయ్య, పెదనాన్న, పిన్ని, అత్తయ్య, అమ్మమ్మ... బంధువులొస్తే వీరికి సంబరం. కాని దురదృష్టవశాత్తు కొందరు పిల్లలకు బంధువులుండరు. ఒకోసారి అమ్మో, నాన్నో కూడా వారితో వీరికి బంధువుగా మారి ఆదుకుంటోంది ‘వాల్మీకి గురుకులం’ అనే శరణాలయం. ‘బాలల దినోత్సవం’ సందర్భంగా దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి ఈ పిల్లలనుతానొక బంధువుగా కలిసింది. ఈ సమాజమే ఇటువంటి బాలలకు బంధుగణం అని మాట కలిపింది.అక్కడున్న పిల్లలు చాలా హుషారుగా ఉంటారు. స్కూల్‌కు వెళ్లి చదువుకుంటారు. అందరూ కలిసి ఆడుకుంటూ భోజనం చేస్తూ ఒకేచోట గడుపుతూ మనమంతా ఒకరికొకరం అనే స్థయిర్యంతో బతుకుతారు. అయితే ఒక్కోసారి వారిని దిగులు కమ్ముకోవచ్చు. అమ్మో నాన్నో గుర్తుకు రావచ్చు. ఆ సమయాన్ని మనం దాటించగలగాలి. ఇలాంటి చోటుకు వీలున్న సమయాలలో వెళుతూ పలకరిస్తూ ఉంటే, వారితో సమయం గడుపుతూ ఉంటే వారి లోకం మనకు పరిచయం అవుతుంది. వారి చిరునవ్వుకు మన చిరునవ్వు తోడైతే కారే కన్నీరు తోక ముడుస్తుంది.అందుకే రంగారెడ్డి జిల్లా మోకిలా సమీపానప్రొద్దుటూరులో ఉన్న వాల్మీకి ఫౌండేషన్‌లో సుమారు 50 మంది చిన్నారులు దర్శకుడు సుకుమార్ కుమార్తె, చైల్డ్ సెలబ్రిటీ అయిన సుకృతిని చూసి కేరింతలు కొట్టారు. షేక్హ్యాండ్లు ఇచ్చారు. సరదా కబుర్లతో సమయమే తెలియలేదు అన్నట్టుగా గడిపారు.నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా సాక్షి మీడియా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఇక్కడి పిల్లల కోసం సుకృతి తెచ్చిన పండ్లు, చాక్లెట్లతో తియ్యని వేడుకగా మారింది. వంటి తియ్యటి కార్యక్రమమిది. ఇక సుకృతి తెచ్చిన పుస్తకాలు ఒక మంచి కానుక వారికి. ఈ సందర్భంగా ఇక్కడి పిల్లలు తమ గురించి తాము సుకృతితో మనసువిప్పి మాట్లాడారు.ఈ బాధ్యత మనందరిదీ...‘సాక్షి’ ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి రావడం వల్లే ఇలాంటి చిన్నారుల సామాజిక, మానసిక స్థితిగతులపైన అవగాహన వచ్చింది. వీళ్లూ నాలాంటి చిన్నారులే.. వీళ్లలో ఎన్ని నైపుణ్యాలున్నాయో చూస్తే ఆశ్చర్యమేసింది. చదువులతో పాటు డ్యాన్సులు చేస్తున్నారు, క్రీడల్లో రాణిస్తున్నారు. వారు వచ్చిన నేపథ్యం వేరు.. ఇక్కడ పొందిన పరిపక్వత వేరు. వారి మదిని తడిమి చూస్తే మాత్రం ఊహించని వేదన దాగుంది. అది మనం తీర్చలేనిది. కానీ వీలైనంత ఆత్మీయత,ప్రోత్సాహం అందించడం మనందరి బాధ్యత.నేను ఇక్కడ పిల్లలు అందరితో కలిసి డ్యాన్సులు చేశాను. వారు నాకిష్టమైన అల్లు అర్జున్ గురించి, నా ఫేవరెట్ హాలిడే స్పాట్ పారిస్ గురించి, నా బెస్ట్ ఫ్రెండ్ సితార గురించి, నా చదువులు, లక్ష్యాలు ఇలా అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి పచ్చని పొలాల మధ్య ఉన్న వాల్మీకి గురుకులం నాకో మధుర ఙ్ఞాపకం గా నిలిచిపోతుంది. నాన్న తెరకెక్కిస్తున్న పుష్ప–2 విషయాలు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనుంది. నా ఆలోచనల్లో చాలా మార్పులకు ఈ విజిట్ కారణమైంది. – సుకృతిలైబ్రరీ... కల్చరల్ టూర్మా దగ్గర 55 మంది చిన్నారులు సేవలు పొందుతున్నారు. సీడబ్ల్యూసీ నియమాల ప్రకారం యుక్త వయసు వచ్చిన చిన్నారుల్ని అనాథ ఆశ్రమంలో ఉంచకూడదు... కాబట్టి ఆ వయసుకొచ్చిన 15 మందిని ఉన్నత చదువుల కోసం మంచి కాలేజీల్లో చదివిస్తూ, హాస్టల్స్‌లో చేర్చాం. అనాథలు, నిరుపేద పిల్లలు, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకు సేవలందిస్తున్నాం. ఆర్ట్ ఆఫ్ స్టైల్ పేరుతో వంద మందికి సరిపడేలా మంచి భవనాన్ని నిర్మించుకున్నాం. డైనింగ్, ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేశాం. అధునాతన కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీని నిర్మిస్తున్నాం. మా సేవలన్నీ దాతల విరాళాలపైనే నిర్వహిస్తున్నాం. పిల్లలకు చదువులు మాత్రమే కాదు... వినూత్న అనుభవాలు, ఆలోచనలు కల్పించాలనే లక్ష్యంతో కల్చరల్ టూర్‌ను ప్లాన్ చేశాం. ఇందులో భాగంగా చెన్నైలోని ఓ అనాథ ఆశ్రమానికి చెందిన పిల్లలకు ఇక్కడ 4 రోజుల విడిది కల్పించి విభిన్నప్రాంతాల సాంస్కృతిక, చారిత్రక, అధునాతన జీవనశైలి పై అవగాహన కల్పించాం. మరికొద్ది రోజుల్లో మా చిన్నారులను కూడా చెన్నైకు తీసుకెళ్లనున్నాం. అంతేకాకుండా మా పిల్లలందరినీ విమానంలో గగనతల విహారం చేయించాం. న్యూట్రిషన్ కోసం ఎగ్ బ్యాంక్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా వాల్మీకి పిల్లల కోసమే కాకుండా దేశవ్యాప్తంగా ఇలాంటి చిన్నారులకు గుడ్లు అందిస్తున్నాం. గ్రామీణప్రాంతాల్లోని నిరుపేదల విద్యకు 500కు పైగా సైకిళ్లను అందించాం. – హరి కిషన్ వాల్మీకి, సంస్థ నిర్వాహకులుస్ఫూర్తిదాయకమైనదినేను ఆమెరికాలో ఆంకాలజీ డాక్టర్ గా పని చేశాను. గత కొన్నేళ్లుగా ఇక్కడి పిల్లల చదువులకు స్కూల్ ఫీజులు చెల్లిస్తున్నాను. ఇలాంటి వారికి ఇంగ్లీష్ మీడియం చదువులు చదివించాలనే ఆలోచన స్ఫూర్తిదాయకమైనది. ఏడాదికి సరిపడా ఫీజులు ఒకేసారి చెల్లిస్తాను. ఇక్కడి విద్యార్థులు ఉన్నత చదువులకు బయటకు వెళుతుంటే కాస్త బాధగానూ, అంతకు మించిన సంతోషంగానూ ఉంటుంది. – డా. రోహిణీ , సంస్థకు ప్రధాన సహాయకురాలుఎప్పుడూ చిల్డ్రన్స్ డేనేమాకెప్పుడూ చిల్డ్రన్స్డేలానే ఉంటుంది. ఇక్కడ అన్ని విషయాల్లో సహకారం అందిస్తారు. బాగా చదువుకుని సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. వీరు అందించిన ఏ సహకారాన్ని వృ«థాగా పోనివ్వను. – మారుతిమాదో కుటుంబంమేముంటున్న ‘వాల్మీకి గురుకులం’ అనా«థ ఆశ్రమంలా అనిపించదు. మాదో పెద్ద కుటుంబం. సౌకర్యాలు, వసతులే కాదు.. ఇక్కడ ప్రేమ, ఆప్యాయతలకు కొదువ లేదు. మాకెప్పుడూ ఒంటరి అనే ఫీలింగ్ రాకుండా చూసుకుంటారు. కాకపోతే రోజూ 14 కిలోమీటర్లు స్కూల్‌కు వెళ్లి రావడం కష్టంగా ఉంది. ఈ విషయంలో ఎవరైనా దాతలు సహకారమందిస్తే వెహికిల్ ఏర్పాటు చేసుకుంటాం. – గౌతమ్ సాయిఇదే గురుకులానికి హెల్ప్ చేస్తానేను బాగా చదువుకుని, మంచి జాబ్ చేస్తూ ఇదే గురుకులంలోని మరి కొందరు చిన్నారులకు సహకారం అందించాలనుంది. ఇవాళ వచ్చిన సుకృతి అక్క మాతో చాలా బాగా కలిసిపోయింది. చాలా విషయాలు చెప్పింది. సినిమా హీరోలు ఎలా ఉంటారు... వారి జీవితాలు ఎలా గడుస్తాయి.. ఇలా ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాను. – అనిల్ప్రేమ, తోడ్పాటు కావాలిఅప్పుడప్పుడు బాధ అనిపించినా ఇక్కడ ఆ ఆలోచనలకు తావు లేదు. మేం చాలా గౌరవంగా, ఆరోగ్యంగా మంచి చదువులను పొందుతున్నాం. జాలి, దయ కన్నా ప్రేమ, తోడ్పాటు జీవితాన్ని ముందుకు తీసుకెళతాయని తెలుసుకున్నాను. – భాను ప్రసాద్ -
పిల్లలూ దేవుడూ చల్లని వారే
పాటలు హీరో, హీరోయిన్ల సొంత సొత్తు కాదు. ఒకప్పుడు సినిమాల్లో పిల్లల పాత్రలు ఉండేవి. వారికి పాటలు ఉండేవి. పిల్లలు కథను నడిపించేవారు. పాటలు పాడి కథను నిలబెట్టేవారు. పిల్లల పాటల కోసం సినిమాలు హిట్ అయిన సందర్భాలున్నాయి. పిల్లల పాటలతో స్టార్స్ అయిన బాల నటీనటులు ఉన్నారు. కాని నేటి సినిమాల్లో పిల్లల పాటలు కనుమరుగయ్యాయి. వారి గొంతును వినపడనివ్వడం లేదు.పిల్లల పాట మళ్లీ బతకాలి. పిల్లల పాత్ర మళ్లీ నిలవాలి.‘లేరు కుశలవుల సాటి...సరి వీరులు ధారుణిలో’....‘లవ కుశ’లో లవుణ్ణి, కుశుణ్ణి చూడటానికి పల్లెల నుంచి జనం బండ్లు కట్టుకుని వచ్చేవారు. వారి నోటి నుంచి రామాయణ గాథను పాటలుగా విని పరవశించి పోయేవారు. ఉద్వేగంతో ఆనందబాష్పాలు రాల్చేవారు. పెద్దలు రామాయణం చెప్తేనే ఎంతో రుచిగా ఉంటుందే, మరి పిల్లలు చెప్తే ఇంకెంత రుచి!శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా!ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా!చెప్పాలంటే మనవాళ్లు చాలా గొప్పోళ్లోయి! ఏమంటే 1934లోనే లవకుశ తీశారు. అందులోని బాలనటులను, వారి పాటలను చూసి డబ్బులు కుమ్మరించారు. దాంతో దర్శకుడు సి.పుల్లయ్య పిల్లలు ప్రధాన పాత్రలుగా అంటే పిల్లలే అన్ని పాత్రలు చేసేలా ‘సతీ అనసూయ’ (1936) సినిమా తీసి దాంతో పాటు మరో పిల్లల సినిమా ‘ధ్రువ విజయం’ తీసి ఒకే టికెట్ మీద ఈ రెండు సినిమాలు ప్రదర్శించి రికార్డు స్థాపించారు. ఇలా మరో భాషలో జరగలేదు. ఈ విషయం మనవారు ప్రచారం చేసుకోరు. అన్ని పాత్రలను బాలలే ధరించిన సినిమాను దేశంలో తొలిగా తీసింది మనమే.చిన్నప్పుడు పెద్దప్పుడు:పాఠకులు ప్రేక్షకులుగా మారుతున్న కాలం. చదివే కథ నుంచి చూసే కథకు మారాలంటే వారికి ‘సినిమా’ అనే మీడియం మెల్లగా అలవాటు చేయాలి. అందుకని దర్శకులు కథను మెల్లగా చెప్పేవారు. కథానాయిక, నాయకుల జీవితాన్ని బాల్యం నుంచి మొదలుపెట్టి వారు పెద్దయ్యాక ఏం జరుగుతుందో చూపేవారు. అందువల్ల నాటి సినిమాల్లో పిల్లల పాత్రలు తప్పనిసరిగా ఉండేవి. ‘మల్లీశ్వరి’ సినిమాలో చిన్నప్పటి ఎన్టీఆర్, చిన్నప్పటి భానుమతిగా నటించిన మాస్టర్ వెంకటరమణ, బేబీ మల్లిక –‘రావిచెట్టు తిన్నె చుట్టు రాతి బొమ్మలు చెక్కాలోయ్మంచి బొమ్మలు చెక్కాలోయ్ నీ మల్లి బొమ్మలు చెక్కాలోయ్’అని పాడుకుంటే చూడటం ముచ్చటగా ఉంటుంది. మరి ఇవాళ రావిచెట్టు ఎంతమంది పిల్లలకు తెలుసో, తిన్నె అనే మాట ఎంతమంది పిల్లలకు అర్థమవుతోందో!అక్కినేని ‘దేవదాసు’లో చిన్నప్పటి దేవదాసు, చిన్నప్పటి పార్వతి పాడుకుంటారు. స్కూల్ ఎగ్గొట్టి తిరిగే దేవదాసును పార్వతి ఆ పాటలో ఆట పట్టిస్తుంది.‘ఓ దేవదా.. చదువు ఇదేనాఅయ్యవారు నిదరోతే తమరు ఇలాగే దౌడుదౌడా’...ఇక నేటికీ నిలిచి వెలుగుతున్న ‘నిదురపోరా తమ్ముడా’ పాట సంతానంలో రెండు సందర్భాల్లో వస్తుంది. ఒకటి చిన్నప్పుడు, ఒకటి పెద్దప్పుడు. చిన్నప్పటి పాటలో లతా మంగేశ్కర్ మూడు చరణాలు పాడితే, పెద్దప్పటి పాటలో ఒక చరణం ఘంటసాల పాడారు. చిన్నప్పటి పాటలో లతా–‘కలలు పండే కాలమంతా కనుల ముందే కదిలిపోయేలేత మనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే నిదురపోరా తమ్ముడా’... అని పాడుతుంటే కలత నిద్రలతో బతుకుతున్న వారంతా కన్నీరు కారుస్తారు.బొమ్మల పెళ్లి:నాటి సినిమాలు పిల్లల్నే కాదు పిల్లల ఆటపాటల్ని కూడా పట్టించుకున్నాయి. అప్పటి పిల్లలకు బొమ్మల పెళ్లి చేయడం ఒక పెద్ద సరదా. ఈ బొమ్మల పెళ్లిళ్లు పిల్లల మధ్య నిజం పెళ్లిళ్లుగా మారి కథలు మలుపు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు వీడియో గేమ్‌లు ముంచెత్తే ఈ రోజుల్లో పిల్లలు బొమ్మలు అనే మాట ఎత్తడం లేదు. పెద్దలు కూడా సెల్‌ఫోన్ నే బొమ్మగా చేతిలో పడేస్తున్నారు. బొమ్మలు పిల్లలకు నేస్తాలు. వాటినే సర్వస్వంగా భావించి ఆలనా పాలనా చూసి పెళ్లిళ్లు చేసేవారు పిల్లలు. ‘కన్యాశుల్కం (1955)’లో బొమ్మల పెళ్లి కోసం పిల్లలు పాడే పాట చాలా బాగుంటుంది.చేదాము రారే కల్యాణము... చిలకా గోరింక పెళ్లి సింగారము...‘మాంగల్యబలం’ (1959)లో పిల్లలు పాడే బొమ్మల పెళ్లి పాట వైవాహిక జీవితానికి ఒక వ్యాఖ్యానం లాంటిది. ఈ పాటను శ్రీశ్రీ రాశారంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత సంప్రదాయ భావనలను ఇంత బాగా ఎలా రాశాడా అని.హాయిగా ఆలుమగలై కాలం గడపాలివేయేళ్లు మీరనుకూలంగా ఒకటై బతకాలి...తర్వాతి రోజుల్లో అక్కినేని పక్కన హీరోయిన్ గా ‘ప్రేమాభిషేకం’ వంటి సూపర్‌హిట్‌ను సాధించిన శ్రీదేవి బాలనటిగా అదే అక్కినేని ‘శ్రీమంతుడు (1971)’ లో బొమ్మల పెళ్లి పాట పాడింది. అంత చిన్న వయసులో ఆమె ఎక్స్ప్రెషన్ ్స చూడాలి ఇప్పుడైనా. భలే ఉంటాయి. మరి పాటో?చిట్టిపొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలుబుల్లిబుల్లి రాధకు ముద్దుముద్దు రాజుకుపెళ్లండీ పెళ్లి ముచ్చటైన పెళ్లిమర్యాదలు చెప్తూ... అల్లరి చేస్తూ:పిల్లలు అల్లరి చేస్తే ముద్దు. అలాగే వారు బుద్ధిమంతులుగా ఉంటే మరీ ముద్దు. అల్లరి చేయడం పిల్లల హక్కు అనేది మర్చిపోయి, ఇవాళ వాళ్లను ఊపిరి సలపని హాస్టళ్లలో పడేసి తెగ తోమిస్తున్నారు తల్లిదండ్రులు. పరీక్షల భయం ఇవాళే కాదు ఆవాళ కూడా ఉంది. అందుకే ‘పెళ్లి చేసి చూడు’ (1952)లో స్టేజి నాటకంలో చిన్నారి బాలుడు పరీక్షలు ఎగ్గొట్టడానికి దొంగ కడుపునొప్పి తెచ్చుకుని పాడే పాట అల్లరి... చాలా వల్లరి.అమ్మా నొప్పులే అమ్మమ్మ నొప్పులేఫస్టుక్లాసులో పాసవుదామని పట్టుబట్టి నే పాఠాల్ చదివితేపరీక్షనాడే పట్టుకున్నదే బడికెట్లా నే వెళ్లేదే?ఇలా అల్లరి చేసే పిల్లలే సుద్దులు కూడా చెబుతారు. కె.వి.రెడ్డి తీసిన ‘దొంగరాముడు’ అల్లరి చేసే చిన్న అక్కినేనికి, చిన్న సావిత్రి సుద్దులు చెబుతుంది. ఎలా మసలుకోవాలో హితబోధ చేస్తుంది.తెలిసిందా బాబూ ఇపుడు తెలిసిందా బాబు అయవారు తెలిపే నీతులు ఆలించకపోతే వాతలే...కె.విశ్వనాథ్ తొలి సినిమా ‘ఆత్మగౌరవం’లో ఆయన ఎంత మంచి పాట పెట్టారంటే ఇంటికి వచ్చిన అతిథులను ఆ ఇంటి పిల్లలు ఎలా గౌరవించి ఆహ్వానించాలో అందులో ఉంటుంది. ఇంటి సంస్కారం పిల్లల ప్రవర్తనలోనే తెలుస్తుంది. ఇవాళ ఇంటికి బంధువులొస్తే పిల్లలు పలకరించనైనా పలకరించట్లేదు– నమస్కారం పెట్టే సంగతి తర్వాత. అంతే కాదు తమ గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్నారు. తల్లిదండ్రులు వారిని అందుకు ఎంకరేజ్ చేస్తున్నారు. కాని ఆత్మగౌరవంలో రేలంగి, గుమ్మడి అతిథులుగా వస్తే పిల్లలు ఎంత బాగా పాడతారో!మారాజులొచ్చారు మహరాజులొచ్చారు మా ఇంటికొచ్చారుమామంచి వారంట మనసున్న వారంట మాకెంతో నచ్చారు...భక్తి... దైవభక్తి:పిల్లలకు దేవుడు మంచి స్నేహితుడు. పిల్లలు దేవుని మీద సందేహం లేని భక్తి పెట్టుకుంటారు. పిల్లల ద్వారా భక్తిని చెప్పేందుకు ‘యశోదకృష్ణ’, ‘భక్త ప్రహ్లాద’, ‘భక్త ధ్రువ మార్కండేయ’లాంటి సినిమాలు వచ్చి ప్రజాదరణ పొందాయి. ‘యశోదకృష్ణ’తో శ్రీదేవి, ‘భక్త ప్రహ్లాద’తో రోజా రమణి పెద్ద స్టార్స్ అయ్యారు. ‘భక్త ప్రహ్లాద’లో ప్రహ్లాదుడు పాడిన పాటలు హిట్.నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనంమరోపాట–జీవము నీవే కదా...నేటికీ నిలిచి ఉన్నాయి.ఇక ‘లేత మనసులు (1966)’తో స్టార్ అయిన ‘కుట్టి పద్మిని’ పాడిన ఈ పాట 60 ఏళ్ల తర్వాత కూడా చల్లదనాన్ని కురిపిస్తూనే ఉంది.పిల్లలూ దేవుడూ చల్లని వారేకల్లకపటమెరుగని కరుణామయులే...‘మూగనోము’లో–తల్లివి నీవే తండ్రివి నీవేచల్లగ కరుణించే దైవము నీవే....సంభ్రమం... సందేహం:పిల్లలకు సందేహాలు జాస్తి. అలాగే ప్రతిదానికీ వారు వింత పడతారు. ఇప్పటి పిల్లల్లా అన్నీ గుగుల్ ద్వారా తెలుసుకొని నిమ్మళంగా ఉండిపోరు. పెద్దలను విసిగించేవారు. అలా పిల్లలకూ పెద్దలకూ ఒక సంభాషణ జరిగేది. ‘బాలరాజు కథ’లో ఈ పాట చూడండి–అడిగానని అనుకోవద్దు చెప్పకుండా దాటేయొద్దుఏమిటీ రహస్యం స్వామి ఏమిటీ విచిత్రంఆ రోజుల్లో ఫోన్ ఒక వింత. ఇంట్లో ఫోన్ ఉండటం ఒక హోదా. ఇరుగింటి పొరుగింటి వారికి అది పి.పి. నంబర్. ఇంట్లో పిల్లలకు ‘ట్రింగ్ ట్రింగ్’మన్నప్పుడల్లా సరదా. ఫోన్ రాకపోయినా రిసీవర్ చెవిన పెట్టుకుని మాట్లాడతారు. పాట పాడతారు ‘బడి పంతులు’లో బుల్లి శ్రీదేవి పాడింది.బూచాడమ్మ బూచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడుకళ్లకెపుడు కనపడడు కబురులెన్నో చెబుతాడు...అనుబంధాల పాట:పెద్దవాళ్ల సమస్యలు పిల్లలకూ కష్టాలు తెస్తాయి. పిల్లలు చలించిపోతారు. ఆ అనుబంధాల కోసం పరితపిస్తారు. తమ లోపలి భావాలను పాట ద్వారా చెబుతారు. తల్లిదండ్రులను కోల్పోయి చెల్లెలితో మిగిలిన అన్న పాడే ఈ జోలపాట ఎంత ఆర్ద్రమైనది... ‘చిట్టి చెల్లెలు’లో.అందాల పసిపాప అన్నయ్యకు కనుపాపబజ్జోవే... బుజ్జాయి... నేనున్నది నీ కొరకే...నీకన్నా నాకెవరే...‘భార్యాబిడ్డలు’ సినిమాలో కన్నతండ్రయిన అక్కినేనిని దూరం చేసుకుని అతణ్ణి వెతుకుతూ వీధుల్లో తిరుగుతూ అతడి పిల్లలు పాడే పాట... ఇందులో కూడా శ్రీదేవి ఉంది...చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావునీవు లేక దిక్కులేని చుక్కలయ్యాముఎక్కడైనా తల్లిదండ్రులు పిల్లలకు జోకొడతారు. కాని ‘రాము’లో తల్లిదండ్రులకు జోకొడుతూ చిన్నారి కొడుకు పాడే పాట హిట్.పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండుపాటలు పాడి జోకొట్టాలి జోజోజో...ఇక పిల్లలకు ఫ్రెండ్స్ అంటే ఇష్టం కదా. స్నేహంలో వారికి అంతరాలు ఉండవు, అభిమానం తప్ప! అందుకే స్నేహాన్ని నిర్వచిస్తూ ‘బాల మిత్రుల కథ’లోని ఈ పాట గొప్పగా ఉంటుంది.గున్నమామిడి కొమ్మ మీద గూళ్లు రెండున్నాయిఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది...పాపం పసివాడు:ఒక పాట... అమ్మానాన్నల కోసం తప్పి పోయిన పిల్లవాడు పరితపిస్తూ పాడే పాట సినిమాను సూపర్‌హిట్ చేయగలదు. ‘లాస్ట్ ఇన్ ద డెజర్ట్’ అనే ఇంగ్లిష్ సినిమా ఆధారంగా తెలుగులో తీసిన ‘పాపం పసివాడు’ సినిమా చూసిన మహిళా ప్రేక్షకులు కన్నీరు మున్నీరయ్యారు. కారణం తప్పిపోయిన పిల్లాడిలో తమ పిల్లల్ని చూసి ఇలాంటి పరిస్థితి వస్తే అనుకోవడమే. మాస్టర్ రాము నటించిన ఈ పాట ఆత్రేయ రాసిన తేలిక మాటల పాట పిల్లల భావోద్వేగాన్ని గొప్పగా చూపుతుంది.అమ్మా చూడాలి... నిన్నూ నాన్నను చూడాలినాన్నకు ముద్దులు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దుర పోవాలి...అంజలి అంజలి అంజలి:ఆ తర్వాత కూడా పిల్లల పాత్రలు, వారి పాటలు కొనసాగాయి. ‘బాల భారతం’ తీశారు. టి.కృష్ణ ‘రేపటి పౌరులు’ సినిమా తీశారు. ‘మణిరత్నం ‘అంజలి’ తీసి హిట్ కొట్టారు. గుణశేఖర్ ‘బాల రామాయణం’ తీశారు. ‘లిటిల్ సోల్జర్స్’ పిల్లల కోసం తీసిన చివరి హిట్ సినిమాగా నిలిచింది. ‘స్వాతి కిరణం’లో మాస్టర్ మంజునాథ్ బాల సంగీతకారుడుగా ‘ఆనతినియ్యరా హరా’...లాంటి క్లాసిక్ ఇచ్చాడు. ‘మనసంతా నువ్వే’ సినిమాలోని ‘తూనీగా... తూనీగా’ పాట ఇంటింటి పాటైంది. ‘అమ్మ రాజీనామా’, ‘దేవుళ్లు’ తదితర చిత్రాల్లో పిల్లలు పాటలు పాడి మెప్పించారు.అయితే ఆ తర్వాత ఫ్యాక్షన్ సినిమాలు వచ్చి తొడ గొట్టే పిల్లలు, కత్తి పట్టే పిల్లలు వచ్చారు. ఇవాళ టీవీల నిండా పిల్లలు అశ్లీల నృత్యాలు చేసే పెద్దల పాటలే తప్ప పిల్లల పాటలంటూ లేకుండా పోయాయి. కనీసం పిల్లలతో పాటు పెద్దలు పాడే పాటలైనా.పిల్లల పాటలు మళ్లీ బతకాలని కోరుకుందాం.ముద్దు ముద్దు నవ్వు... బజ్జోమ్మ నువ్వుతెలుగు సినిమాల్లో పిల్లలు తాముగా పాటలు పాడితే పిల్లల కోసం పెద్దలు తమంతట తాముగా పాడిన పాటలు చాలా ఉన్నాయి. అందరూ ఇష్టపడేవి ఉన్నాయి. ఆ పాటలు ఇప్పటికీ వినపడుతూనే ఉన్నాయి. ‘బంగారు పాప’లో ఎస్వీ రంగారావు అంతటి నిలువెత్తు మనిషి ఒక చిన్నారి పాపను చూసి పాడే ‘తాధిమి తకధిమి తోల్బొమ్మ’ పాట ఎందరికో ఇష్టం. ఆర్ద్రమయం. ‘ఖైదీ కన్నయ్య’లో ‘ఈ నిజం తెలుకో తెలివిగా నడుచుకో’ ఇప్పుడు కూడా ప్రతి బాలబాలికలకు బోధ చేసే గీతం. తర్వాతి రోజుల్లో ‘మంచి మనుషులు’లో శోభన్‌బాబు పాడిన ‘ఇది నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట’ కూడా ఇదే కోవలో హిట్‌గా నిలిచింది. ‘పండంటి కాపురం’లో ‘బాబూ... వినరా అన్నాదమ్ముల కథ ఒకటి’ పాట పిల్లలకు అనుబంధాలు చెప్తే, ‘ఎదగడానికెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందర వందర’ అని బాల్యాన్ని అనుభవించాల్సిన వయసులో భవిష్యత్తు గురించి కోచింగ్‌లు తీసుకుంటున్న నేటి బాలల కోసం అన్నట్టుగా ‘అందాల రాముడు’లో అక్కినేని పాడుతారు. ఇక పిల్లల పుట్టిన రోజులకు అందరూ పాడేవారే. ‘వెలుగు నీడలు’లో ‘చిట్టిపొట్టి చిన్నారి పుట్టిన రోజు చేరి మనం ఆడిపాడే పండుగరోజు’లో సావిత్రి హుషారుగా పిల్లవాడితో పాటు గెంతడం కనిపిస్తుంది. ‘బంగారు కలలు’లో ‘పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి’, ‘తాత మనవడు’లో మనవడిని పట్టుకుని అంజలీ దేవి ఉద్వేగంగా పాడే ‘ఈనాడే బాబూ నీ పుట్టిన రోజు’ గొప్ప ఆశీర్వాద వచనం. ఇక పిల్లలను బుజ్జగించే, ఊరడించే పాటలు సినిమాల్లో బోలెడు. గంభీరంగా ఉండే ఎన్.టి.ఆర్ కూడా పసిపిల్లాడిని చూసి ‘ఆడబ్రతుకు’లో ‘బుజ్జిబుజ్జి పాపాయి.. బుల్లిబుల్లి పాపాయి.. నీ బోసి నవ్వులలో పూచే పున్నవి వెన్నెలలోయి’ అని పాడతాడు. ఇదే పి.బి.శ్రీనివాస్ ‘ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు జాజిమల్లె పువ్వు బజ్జొమ్మ నువ్వు’ పాట ‘సత్తెకాలపు సత్తెయ్య’లో చలం గొంతులో పాడతాడు. ఈ హీరో చలమే ‘సంబరాల రాంబాబు’లో చిన్నారి బాబుకు జోల పాడుతూ చందమామను సాయమడుగుతూ ‘మామా.. చందమామా.. వినరావా నా కథ’ అని అందుకుంటాడు. ‘జీవన తరంగాలు’లో శోభన్‌బాబు పాపకు జూ మొత్తం చూపుతూ ‘ఉడతా ఉడతా ఉచ్’ పాడటం రేడియో శ్రోతలు ఇప్పుడూ వింటారు. ‘స్వయంకృషి’లో చిరంజీవి ‘పారా హుషార్.. పారా హుషార్... తూరుపమ్మ ఉత్తరమ్మ పడమరమ్మ దక్షిణమ్మ పారా హుషార్’ అని పాడి వీపున కట్టుకున్న చిన్నారికి ఉల్లాసం కలిగిస్తాడు. ‘కలిసి పాడుదాం తెలుగు పాట కలిసి సాగుదాం వెలుగుబాట’ (బలిపీఠం), ‘భారత మాతకు జేజేలు బంగరుభూమికి జేజేలు’ (బడిపంతులు) అని పాడే ఉపాధ్యాయులు ఇప్పటి సినిమాల్లో ఎక్కడ? ఏమైనా ఆ రోజులే వేరు ఆ పాటలే వేరు. -
మనసైన మరో ప్రపంచంలోకి... ప్రకృతి అనేది మనిషికి అతి పెద్ద పాఠశాల.
జలపాతాల నుంచి పంటచేల వరకు ప్రతిదీ ఏదో ఒక పాఠం చెబుతూనే ఉంటుంది. అందుకే ప్రకృతి పిల్లలకు నచ్చిన ప్రపంచం. ‘చిల్ట్రన్–ఫ్రెండ్లీ వరల్డ్’ అంశంపై రిజు వేసిన పెయింటింగ్... పిల్లలకూ ప్రకృతి ప్రపంచానికి మధ్య ఉండే అనుబంధానికి అద్దం పడుతుంది. ఈ పెయింటింగ్ చిల్డ్రన్స్ డే స్పెషల్ స్టాంప్ కోసం ఎంపికైంది... కేరళ స్టేట్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక స్టాంప్‌ను విడుదల చేస్తుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అయిదు నుంచి పదకొండవ తరగతి విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటారు. ఈ స్టాంపుల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని పిల్లల సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తుంటారు. ఈ సంవత్సరం రిజు వేసిన పెయింటింగ్ చిల్డ్రన్స్ డే స్టాంప్ కోసం ఎంపికైంది. ‘చిల్డ్రన్–ఫ్రెండ్లీ వరల్డ్ థీమ్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ప్రకృతి కూడా గురువులాంటిదే అనే ఐడియాతో ఈ బొమ్మ వేశాను. ప్రకృతి, విద్యాప్రపంచం రెండూ కలిసిపోయి కనిపించేలా బొమ్మ వేశాను’ అంటుంది కోచిలోని సెయింట్ థామస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న రిజు. ‘రిజు పెయింటింగ్ అద్భుతమైన ఊహతో భావగర్భితంగా ఉంది’ అని జ్యూరీ ప్రశంసించింది. ‘నిజంగా చెప్పాలంటే బహుమతి వస్తుంది అనుకోలేదు. నేనే కాదు నా తల్లిదండ్రులు, టీచర్లు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ పోటీలో పాల్గొనడంలో భాగంగా రకరకాల స్కెచ్‌లు వేశాను. అయితే అవేమీ నాకు నచ్చలేదు. ఆలోచిస్తున్న కొద్దీ కొత్త కొత్త ఆలోచనలు వచ్చేవి. ఆలోచిస్తున్న క్రమంలో ప్రకృతి ప్రపంచాన్ని పుస్తకంగా అనుకున్నాను. ఆ పుస్తకం తెరుచుకున్నప్పుడు ఆ దారుల్లో పిల్లలు ఉత్సాహంగా పరుగులు తీస్తుంటారు. ఈ ఊహతో పెయింటింగ్ వేసినప్పుడు చాలా సంతృప్తిగా అనిపించింది. నేను వేసిన పెయింటింగ్ స్టాంప్‌గా ఎంపిక కావడం, స్టాంప్‌లు నాన్న వృత్తిలో భాగం కావడం ఆనందంగా ఉంది ’ అంటుంది రిజు. రిజు తండ్రి రాజేష్ పరక్కాడవు పోస్ట్ ఆఫీసులో పోస్ట్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. ‘రోజూ తప్పకుండా ఏదో ఒక పెయింటింగ్ వేస్తుంటుంది రిజు. చిత్రకళకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటుంది. తన పెయింటింగ్ స్టాంప్‌గా ఎంపిక కావడం రిజూకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. భవిష్యత్తు్తలో ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను’ అంటున్నారు రిజు తండ్రి రాజేష్. బాలల దినోత్సవం సందర్భంగా తిరువనంతపురంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమక్షంలో ‘చిల్డ్రన్–ఫ్రెండ్లీ వరల్డ్’ స్టాంప్‌ను అధికారికంగా విడుదల చేస్తారు. -
‘ఫన్’టాస్టిక్ సితార .. ‘తగ్గేదే లే’అంటున్న అర్హ.. ‘స్టార్’లా ఎదిగిన కిడ్స్ వీరే
ఇవ్వాళ్టి పిల్లలు పెద్దల నీడన దాగుండిపోవడం లేదు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల పిల్లలు.. తల్లిదండ్రుల పాపులారిటీతో పరిచయం అవడానికి ఇష్టపడట్లేదు. ఆ పేరుప్రఖ్యాతులను ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగించుకుని సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారు. తమ టాలెంట్‌ను చాటుకుంటున్నారు. ఆ లిస్ట్‌లో ఉన్న కొంతమంది లిటిల్ స్టార్స్ గురించి.. ‘ఫన్’టాస్టిక్ సితార చిన్న వయసు నుంచే తనలోని బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకుంటోంది మహేశ్ బాబు–నమ్రతా శిరోడ్కర్ వారసురాలు సితార! ‘ఫన్’టాస్టిక్ తార అనే వెబ్ సిరీస్‌కు సితార బ్రాండ్ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది. ‘జన్యాస్ క్లోజట్’ బ్రాండ్ కోసం మోడలింగ్ కూడా చేసింది. దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలసి ఓ యూట్యూబ్ చానెల్‌నూ నిర్వహిస్తోంది. తగ్గేదే లే... ఈ మాట అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హకి సరిగ్గా సరిపోతుంది. సూపర్ యాక్టివ్నెస్తో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ని క్రియేట్ చేసుకుంది. ముద్దు ముద్దు మాటలు.. ముద్దొచ్చే రూపంతో తన తండ్రి సినిమాల్లోని కొన్ని సీన్స్‌కి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, డైలాగ్స్ చెప్తూ, పాటలు..డ్యాన్స్‌లతో డిజిటల్ మీడియా వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంటోంది అర్హ. ఇలా చిన్న వయసులోనే స్టార్ స్టేటస్‌ని సొంతం చేసుకున్న అర్హ మంచి చెస్ ప్లేయర్ కూడా! ‘మంచు’ సింగర్స్... మంచు విష్ణు కూతుళ్లు అరియానా–వివియానా.. ఇన్‌స్టా స్టార్స్. ఈ ట్విన్ సిస్టర్స్ ఫొటోలు, వీడియోలకు ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందం, అభినయమే కాదు.. మధురమైన గాత్రం కూడా వీరి సొంతం. వాళ్ల నాన్న విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా కోసం ‘ఇదే స్నేహం.. యే హై దోస్తీ’ అనే గీతాన్ని ఆలపించారీ అక్కాచెల్లెళ్లు. ఈ పాట విడుదలైన ఒక్క రోజులోనే 40 లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించి ట్రెండింగ్‌లో ఉంది. ఇంకోవైపు మంచు లక్ష్మి కూతురు విద్య నిర్వాణ కూడా మై కిసీ సే కమ్ నహీ అంటోంది. పేరుకు తగ్గట్టే చదువులో దిట్ట ఈ బిడ్డ. కరోనా సమయంలో తల్లితో కలసి యూట్యూబ్ వీడియోలు చేసి తన టాలెంట్‌ను ప్రదర్శించింది. అన్నట్టు విద్య కూడా మంచి చెస్ ప్లేయర్. ఇంటి చిరు కొమ్మ.. అమ్మ, నాన్న, తాతకు తగ్గకుండా తన పేరునూ పాపులర్ చేసుకుంటోంది ఐశ్యర్య, అభిషేక్ కూతురు ఆరాధ్య బచ్చన్. శ్రావ్యమైన స్వరంతో క్రిస్మస్ జింగిల్స్.. ఇతర పాటలు పాడుతూ తన ఐడెంటిటీ చాటుకుంటోంది. ‘పవర్’ ఫుల్ డాటర్ పవన్ కల్యాణ్–రేణూ దేశాయ్ కూతురు ఆద్యకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆ అమ్మాయి మొన్నామధ్య గిటార్ వాయిస్తూ పాడిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే! ఆమె గాన మాధుర్యానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. తండ్రిలాగే ఆద్యకు పుస్తకాలు చదవడమన్నా ఎంతో ఇష్టం. -
Children's Day 2022: పిల్లలవాణి.. స్కూల్ రేడియో! అంతా వాళ్లిష్టమే
బడి అంటే పాఠాల బట్టీ కాదు.. వినోదం.. విజ్ఞానం కూడా! వాటిని పంచే ఓ సాధనం రేడియో! ఎస్.. ఆకాశ వాణి! కాకపోతే ఇది పిల్లల వాణి.. దీనికి కేంద్రం స్కూల్! అనౌన్సర్లు, రైటర్లు, స్టోరీ టెల్లర్లు, ఆర్టిస్టులు, ప్రోగ్రామ్ డిజైనర్లు.. స్టేషన్ డైరెక్టర్లు అందరూ పిల్లలే! అంటే విద్యార్థులే!! మరి శ్రోతలు..? www.schoolradio.in వెబ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆ కార్యక్రమాలను వినేవాళ్లంతా! అదే స్కూల్ రేడియో! 2015లో.. ఫిబ్రవరి 13న.. అంతర్జాతీయ రేడియో దినోత్సవం సందర్భంగా తన ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకుంది. దీనికి రూపకర్తలు.. కాట్రగడ్డ అరుణ, గాలి ఉదయ్ కుమార్! విశాఖపట్టణం వాస్తవ్యులు! స్కూల్ రేడియో స్థాపన.. దాని విధివిధానాలు, కార్యక్రమాల గురించి ఆ జంట మాటల్లోనే.. ‘మనం బాలలను ఎంతగానో నిర్లక్ష్యం చేస్తున్నాం. వారి ప్రాధాన్యాలేమిటో, వారేం కోరుకుంటున్నారో తెలుసుకోవటం లేదు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని పిల్లలు, యువత కోసం స్కూల్ రేడియోను ప్రారంభించాం. ఇప్పటివరకు శ్రోతలుగా, ప్రేక్షకులుగా మిగిలిపోయిన పిల్లలు, యువతకే పట్టం కడుతూ, వారే వక్తలుగా, కార్యక్రమ నిర్వాహకులుగా.. వాళ్లకేం కావాలో వాళ్ళే నిర్ణయించుకునేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలనూ మొదలుపెట్టాం.. ఈ స్కూల్ రేడియో ద్వారానే! ప్రసారం చేయాలనుకొనే అంశాలకు సంబంధించిన ఇతివృత్తాలను ఎంచుకోవటం, సమాచారాన్ని సేకరించటం, స్క్రిప్ట్ రాయటం, రాసిన స్క్రిప్ట్‌ను సరిదిద్దటం వంటి పనులను విద్యార్థులే చేస్తారు. కార్యక్రమాలను రికార్డు చేస్తారు. రికార్డు చేసిన ఆడియో ఫైల్స్‌ను ఎడిట్ చేసి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ని జత చేస్తారు. ఇలా సిద్ధమైన కార్యక్రమాలను స్కూల్ రేడియోలో ప్రసారం చేస్తాం. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లతో పాటు పలు భారతీయ భాషల్లోనూ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు చిన్నారులు. తాము నివసిస్తున్న గ్రామం లేదా నగరాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను స్వయంగా ఇంటర్వ్యూ చేస్తారు. తమ ప్రాంతంలోని పర్యావరణ, సామాజిక సమస్యలను అధ్యయనం చేసి, సమస్య మూలాలను అర్థం చేసుకొంటూ, ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వమూ ప్రజలూ ఏం చేయాలో సూచిస్తూ కూడా రేడియో కార్యక్రమాలను రూపొంది స్తున్నారు. ఇలా.. సామాజిక స్పృహæ కలిగిన పౌరులుగా వారు ఎదిగేందుకు స్కూల్ రేడియో చేయూత నిస్తోంది. వాళ్లిష్టమే.. స్కూల్ రేడియోలో చిన్నారులు ఏమైనా మాట్లాడవచ్చు. పాఠ్యాంశాలను చెప్పవచ్చు. పుస్తకాలను సమీక్షించవచ్చు. సినిమాలను విశ్లేషించవచ్చు. తాము ఆడే ఆటల గురించి మాట్లాడవచ్చు. పండుగలు, ఉత్సవాలు, ఆచార వ్యవహారాలు, రాజకీయాలు, సామాజిక సమస్యలు, పర్యావరణ అంశాలు ఇలా ఏం మాట్లాడాలనేది వాళ్ళ ఇష్టం. సహ విద్యార్థులతో కలసి చర్చించి, తమకు నచ్చిన అంశాలను ఎంచుకొని కార్యక్రమాలను తయారు చేయవచ్చు. స్కూల్ రేడియో క్లబ్‌లు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ఈ రేడియోను ప్రారంభించేందుకు ముందుగా స్కూల్ రేడియో క్లబ్‌లను ఏర్పాటు చేయాలి. ప్రతి రేడియో క్లబ్లో పది మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు. ఇవి ప్రతినెల రేడియో కార్యక్రమాలను రూపొందిస్తాయి. ఈ కార్యక్రమాలను www.schoolradio.in వెబ్సైట్లో వినవచ్చు. స్కూల్ రేడియో క్లబ్‌ల కోసం ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలను విద్యాసంస్థల్లోనే నిర్వహిస్తారు. కరోనా తదనంతర పరిస్థితులలో ఆన్లైన్లో కూడ శిక్షణ మొదలైంది. చెప్పదలిచిన సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం రాయటం, కథలను చెప్పగలగటం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంచటం, బహిరంగ సభలు, సమావేశాలలో ప్రసంగించటం, నిర్మోహమాటంగా తమ అభిప్రాయాలను వెల్లడించడమెలాగో నేర్పడంతోపాటు వాయిస్ రికార్డింగ్, ఆడియో ఫైల్స్ ఎడిటింగ్ వంటి సాంకేతిక అంశాలలోనూ పిల్లలకు తర్ఫీదు ఉంటుంది. టాక్ షోలు, రేడియో నాటికలు, చర్చా కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు, పాటలు, పద్యాలతో పాఠశాల విద్యార్థులు తామే రేడియో కార్యక్రమాలను రూపొందించుకునేలా వారికి చేయూత ఉంటుంది. వినోదంతో పాటు విజ్ఞానాన్నీ పంచుతూ పిల్లల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తూ.. స్ఫూర్తి నింపే లక్ష్యంతో స్కూల్ రేడియో క్లబ్‌లు ఏర్పాటయ్యాయి. పుస్తకాలు రేడియో కార్యక్రమాలను రూపొందించేందుకు అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని అందించేందుకు స్కూల్ రేడియో ప్రత్యేకంగా ఎన్నో పుస్తకాలను ప్రచురించింది. అలాగే చిన్నారులు రాసిన కథలు, కవితలు, నాటికలకు స్థానం కల్పిస్తూ బాల, చిన్నారి, ప్రతిబింబం, ఆనందాల హరివిల్లు పుస్తకాలను అచ్చువేసింది. ఇది పబ్లిష్ చేసిన ‘చీమా చీమా ఎందుకు కుట్టావు?’ పుస్తకంలోని కథలను ‘పిపీలికే పిపీలికే కిమర్థం దంశసి?’ పేరిట సంస్కృతంలోకి అనువదించారు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని సంస్కృత పాఠశాల విద్యార్థులు. దీన్నీ స్కూల్ రేడియో ప్రచురించింది. ఉన్నత పాఠశాల విద్యార్థులు తెలుగు నుంచి అనువదించిన తొలి సంస్కృత పుస్తకంగా ఇది గుర్తింపు పొందింది. చిన్నారుల భాగస్వామ్యంతో ఆడియో, వీడియో, టెక్ట్స్‌తో కూడిన మల్టీ మీడియా డిజిటల్ పుస్తకాలనూ రూపొందించి, అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ పాఠాలు కరోనా కంటే ముందు నుంచే స్కూల్ రేడియోలో ఆన్లైన్ పాఠాలున్నాయి. ఉపాధ్యాయులు తమకు నచ్చిన అంశాలను స్కూల్ రేడియోలో చెప్పవచ్చు. ఆన్లైన్ విధానంలో తరగతి గదుల నిర్వహణకు సంబంధించి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలనూ నిర్వహించింది స్కూల్ రేడియో. కెరీర్‌కూ దోహదం మెరుగైన ఉపాధి అవకాశాలున్న కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తూ కెరీర్ ఎంపికల గురించి ప్రత్యేక కార్యక్రమాలను వారే రూపొందించేలా చూస్తోంది స్కూల్ రేడియో. ఇప్పటి వరకు కేవలం కార్పొరేట్ లేదా ప్రైవేట్ పాఠశాలలకే పరిమితమైన స్కూల్ రేడియో కార్యక్రమాలను ప్రభుత్వ పాఠశాలలకు విస్తరిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధిస్తూ, ఉన్నత ర్యాంకులను పొందుతున్నప్పటికీ, వారిలో భావ వ్యక్తీకరణ నైపుణ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. కారణం.. ఆత్మ విశ్వాసం కొరవడటమే. ఫలితంగా బహుళ జాతి సంస్థలలో వారు ఉద్యోగాలు సాధించటంలో వెనుకబడుతు న్నారు. కనుక వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొదించేలా ప్రత్యేక కార్యక్రమాలనూ రూపొందిస్తోందీ స్కూల్ రేడియో. ప్రత్యేక దినాలు, ప్రత్యేక కార్యక్రమాలు అంతర్జాతీయ, జాతీయ దినాలనెన్నింటినో జరుపుకొంటూంటాం. అయితే వీటిని మొక్కుబడిగా పాటించటమే తప్ప, వాటి ప్రత్యేకత ఏమిటో ఎక్కువ మందికి తెలియదు. విద్యార్థులకు చెప్పే వారూ ఉండరు. అందుకే ఇలాంటి ప్రత్యేక సందర్భాల కోసం స్కూల్ రేడియో స్లాట్స్‌ను కేటాయిస్తుంది. ఆయా దినాల ప్రత్యేకతను అర్థం చేసుకొనేందుకు విద్యార్థులు ఇంటర్నెట్ను శోధిస్తారు. గ్రంథాలయాలలో పుస్తకాలను చదువుతారు. సంబంధిత నిపుణులతో మాట్లాడతారు. సంబంధిత సమస్యలు, పరిష్కార మార్గాల గురించి ఆలోచిస్తారు. ఫలితంగా వారిలో ఆసక్తితో పాటు అవగాహనా పెరుగుతుంది’ అంటూ స్కూల్ రేడియో ఏర్పాటు గురించి చెప్పింది అరుణ, ఉదయ్ కుమార్ జంట. తప్పిపోయిన కార్డు కథ! వ్యర్థాల నిర్వహణ అంశంపై పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్న మాకు ఒక వింత అనుభవం ఎదురైంది. తడి, పొడి వ్యర్థాలు, జీవ వైద్య వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఇలా రకరకాల వ్యర్థాలతో కూడిన ఫ్లాష్ కార్డులను విద్యార్థులకు ఇచ్చి, వాటి గురించి మాట్లాడమని అడిగే వాళ్ళం. ఆయా వ్యర్థాలను ఎలా తొలగించాలి, వ్యర్థాల నిర్వహణలో పాటించవలసిన విధివిధానాల గురించి విద్యార్థులు తమ అభిప్రాయాలను తెలియజేయాలి. ఈ కార్డులలో శానిటరీ నాప్కిన్ చిత్రంతో కూడిన కార్డు కూడా ఉండేది. కానీ విద్యార్థినీ విద్యార్థులలో ఎవరూ కూడ దీని గురించి అసలేమీ మాట్లాడేవారు కాదు. పైగా ఆ కార్డును మాకు తిరిగి ఇవ్వకుండా, డెస్క్‌ల కిందో, పుస్తకాల మధ్యనో దాచిపెట్టేసేవారు. మానవ జీవితంలోని ఒక సహజమైన ప్రక్రియ గురించి మాట్లాడేందుకు చిన్నారులు, యువత సిగ్గు పడుతున్నారని, వారిలో ఎన్నో అపోహలు ఉన్నాయని ఈ సంఘటన మాకు స్పష్టం చేసింది. దాంతో ది స్టోరీ ఆఫ్ మిస్సింగ్ కార్డ్ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని డిజైన్ చేశాం. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, నెలసరి లేదా పీరియడ్స్ గురించిన శాస్త్రీయమైన అవగాహనను విద్యార్థులలో కలిగించేందుకు, ఈ అంశం చుట్టూ నెలకొన్న అపోహలు, భయాలను తొలగించేందుకు స్కూల్ రేడియోలో ప్రత్యేక కార్యక్రమాలకు చోటు కల్పించాం. చదవండి: Winter Care Tips: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తిన్నారంటే.. -
Children's Day 2022: పిల్లలు తప్పక చూడాల్సిన సినిమాలివే
పిల్లలు చదవాల్సిన కథలే కాదు.. చూడాల్సిన సినిమాలూ ఉన్నాయి. ప్రపంచంలోని పలు భాషల్లో అవి తెరకెక్కుతూనే ఉన్నాయి. అలాంటి వాటిల్లో కాలం, భాషా భేదం లేని.. తప్పక చూడాల్సిన కొన్ని సినిమాల గురించి ఇక్కడ బ్రీఫ్‌గా.. (బాలల దినోత్సవం(నంవబర్ 14) సందర్భంగా) బ్యాగ్ ఆఫ్ రైస్ (ఇరాన్ మూవీ) విడుదలైన సంవత్సరం: 1996, నిడివి: 80 ని.లు. దర్శకుడు: మహ్మద్ అలీ తలేబీ కథా రచయితలు: హోషంగ్ మొరాదీ కెర్మానీ, మహ్మద్ అలీ తలేబీ జైరాన్ అనే ఆరేళ్లపాప.. వాళ్లింటికి ఎదురుగా ఉండే ఓ డెబ్బై ఏళ్ల మామ్మ చుట్టూ తిరిగే కథ ఇది. చేతనైనంతలో ఇతరులకు సహాయం చేయాలనేది ఈ సినిమా సారాంశం. చేయూతను అందించాలనే మనసు.. కలిమి– లేమి, కష్టం – సుఖం, బాల్యం – వృద్ధాప్యం వంటి మిషలేమీ పెట్టుకోదని.. సేవే మనిషి గుణమని చూపిస్తుందీ చిత్రం. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. బారీ థేకే పాలియే (బెంగాలీ) విడుదలైన సంవత్సరం: 1958, నిడివి: 113ని.లు. కథ: శివరామ్ చక్రవర్తి దర్శకత్వం: రిత్విక్ ఘటక్ ప్రిన్సిపల్ అయిన తండ్రి కఠిన క్రమశిక్షణకు భయపడి ఎనిమిదేళ్ల కంచన్ అనే పిల్లాడు.. తనుంటున్న పల్లెటూరు నుంచి మహానగరమైన కలకత్తాకు పారిపోతాడు. అక్కడ రకరకాల మనుషులు, రకరకాల పరిస్థితులతో కలకత్తా నగర జీవితం అతనికి అనుభవంలోకి రావడమే బారీ థేకే పాలియే! కథా కాలం 1958. నాటి కలకత్తాను కళ్లకు కడుతుందీ చిత్రం. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. లునానా ఎ యాక్ ఇన్ ద క్లాస్రూమ్ (భూటాన్) విడుదలైన సంవత్సరం: 2019, నిడివి: 109ని.లు. కథ, దర్శకత్వం: పావో చోయినింగ్ దోర్జీ ఉగ్యాన్ అనే కాంట్రాక్ట్ టీచర్.. ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ సింగర్‌గా స్థిరపడాలను కుంటాడు. అయిదేళ్ల ఆ కంట్రాక్ట్లోని చివరి సంవత్సరం అతనికి భూటాన్‌లోని కుగ్రామమైన ‘లునానా’కు బదిలీ అవుతుంది. కనీసం కరెంట్ కూడా లేని ఆ ఊళ్లో ఒక్క క్షణం కూడా ఉండలేనని మూడు రోజుల్లోనే తిరుగు టపా కావాలనుకుంటాడు. కానీ అక్కడి విద్యార్థుల శ్రద్ధాసక్తులు, ఆ గ్రామప్రజల గౌరవభక్తులు అతణ్ణి కట్టిపడేస్తాయి. ఆ ఏడాదీ పూర్తిచేసుకుని తాను కోరుకున్నట్టే ఆస్ట్రేలియా వెళ్లి సింగర్‌గా స్థిరపడ్తాడు. అక్కడ లునానా జ్ఞాపకాలే వెంటాడుతుంటాయి. ఆ ఊళ్లో నేర్చుకున్న జానపద గీతాలతోనే శ్రోతలను అలరిస్తుంటాడు. మాతృభూమి మట్టి పరిమళాలను పంచుతుంటాడు. ఇదీ ఈ సినిమా కథ క్లుప్తంగా! ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. ది బాయ్ ఇన్ ది స్ట్రైప్డ్ పైజామాస్ (అమెరికా) విడుదలైన సంవత్సరం: 2008, నిడివి: 94ని.లు. కథ: జాన్ బాయ్నే, దర్శకత్వం: మార్క్ హెర్మన్ హిట్లర్ జాత్యహంకారానికి సమిధలైన ఇద్దరు చిన్నారి స్నేహితుల కథ ఇది. నాజీ సైనికాధికారి కొడుకు బ్రూనో, యూదు బానిస కొడుకు షూమెల్ల మధ్య స్నేహం కుదురుతుంది. మంచి స్నేహితులుగా మారుతారు. ఉన్నట్టుండి ఒకసారి షూమెల్ తండ్రి కనిపించకుండా పోతాడు. అతడిని వెదికే క్రమంలో బ్రూనో, షూమేల్ ఇద్దరూ నాజీలు నిర్వహిస్తున్న యూదుల కాన్సన్ట్రేషన్ క్యాంప్‌కి వెళ్తారు. అక్కడ విషవాయువుకి ఇద్దరూ బలి అవుతారు. మనసు పిండేసే ఈ సినిమా కథా కాలం రెండవ ప్రపంచ యుద్ధం నాటిది. జాన్ బాయ్నే రాసిన ‘ద బాయ్ ఇన్ ద స్ట్రైప్డ్ పైజామాస్’ ఆధారంగా అదే పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. బెకాస్ (ఇరాక్) విడుదలైన సంవత్సరం : 2012, నిడివి : 90 నిమిషాలు కథ, దర్శకత్వం: కర్జాన్ కాదర్ యుద్ధంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న ధన, జన అనే ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. కథాకాలం 1990. బూట్ పాలిష్ చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న ఈ ఇద్దరు తోబుట్టువులు ఒకసారి సూపర్‌మ్యాన్ సినిమా చూస్తారు. ఆ సూపర్మ్యాన్కి వీరాభిమానులైపోతారు. ఎలాగైనా ఆ సూపర్‌మ్యాన్‌ని కలవాలని ఆరాటపడ్తారు. అతను అమెరికాలో ఉంటాడని తెలుసుకుని అమెరికా వెళ్లాలనుకుంటారు. ఆ ప్రయాణం కోసం వాళ్లు చేసే ప్రయత్నాలే ఈ సినిమా. చివరకు వాళ్ల సాహసాన్ని వాళ్లే గ్రహించి సూపర్‌మ్యాన్ ఎక్కడో లేడు.. తమలోనే ఉన్నాడని తెలుసుకుంటారు. సమస్యలకు ఎదురీది బతుకున్న ధైర్యమే ఎవరినైనా సూపర్‌మ్యాన్‌గా నిలబెడుతుందని అర్థం చేసుకుంటారు. అమెరికా ప్రయాణం రద్దుచేసుకుంటారు. కుర్దిష్ భాషలో తీసిన ఈ సినిమాకు ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ ఉన్నాయి. పైవాటితోపాటు వీలైనప్పుడు ‘వై వజ్ ఐ బార్న్’ , ‘ది స్పిరిట్ ఆఫ్ ది బీహైవ్’, ‘ది బ్లాక్ స్టాలియన్’, ‘సన్ చిల్డ్రన్’, ‘ఐ వజ్ బార్న్’, ‘బట్’, ‘సడాకో అండ్ ది థౌజెండ్ పేపర్ క్రేన్స్’, ‘పోస్ట్‌మెన్ ఇన్ ది మౌంటెన్స్’, ‘రన్ బాయ్ రన్’, ‘చూరీ’ వంటి చిత్రాలనూ చూడండి. -
సౌది అరేబియా కథ: హాస్యగాడు అబునువాస్
పూర్వపు వాళ్లలోను, ఇప్పటి వాళ్లలోను మనం జ్ఞాపకం ఉంచుకో తగిన ఉపాయశాలులందరిలో గొప్పవాడెవడో చెప్పగలరా? కొందరు ఒకడు గొప్పవాడు అంటే మరికొందరు ఇంకొకడు మరీ గొప్పవాడంటారు. కానీ నిజం తెలిసినవాళ్లంతా అబునువాస్ పేరే చెబుతారు. అబునువాస్ జీవితమంతా హాస్యకథలుగా, తమాషాపనులతో, మంచి మంచి ఉపాయాలతో నవ్వుల మాటలతో గడచిపోయింది. అంతేకాదు ఎన్నోసార్లు తన యుక్తితో హాస్యంతో ఎన్నో చిక్కుల్లోంచి బయటపడ్డాడు. ఆయన ఎవ్వరినైనా సరే నవ్వించాలనుకున్నాడా.. తమాషా మాటల్తో కడుపుబ్బేట్టు నవ్వించేవాడు. ఎంత తెలివిగలవాడినైనా చాదస్తుడనిపించాలంటే ఏదో యుక్తిపన్ని బోల్తా కొట్టించేసేవాడు. మామూలు మనుషుల్నే కాదు మహారాజుల్నీ లెక్కలేకుండా హాస్యమాడేవాడు. ఈ అబునువాస్కు ఒక గాడిద ఉండేది. ఆ గాడిదకి నీళ్లు పెట్టటానికి ఒక పెద్దపళ్లెం కావలసివచ్చింది. పొరుగింటి వాళ్లను అడిగాడు. వాళ్లు అబునువాస్కు రాగిపళ్లెం ఇచ్చారు. దాన్ని మూడురోజులు తన వద్దే ఉంచుకున్నాడు. నాలుగోరోజున ఆ రాగిపళ్లెంలో ఇంకో చిన్నపళ్లెం పెట్టి ఆ రెండిటినీ తీసుకెళ్లి పొరుగింటివాళ్లకు ఇచ్చాడు. పక్కింటి పెద్ద మనిషి తమ రాగిపళ్లెంలో ఇంకో చిన్నపళ్లెం కూడా ఉడడం చూసి ‘అయ్యో ఈ చిన్నపళ్లెం మాది కాదే!’ అన్నాడు. దానికి అబునువాస్ ‘మీరిచ్చిందేదో మీకు తిరిగి ఇచ్చేశాను. మీ రాగిపళ్లెం నా దగ్గర ఉన్నప్పుడు దానికి ఈ చిన్నపళ్లెం పుట్టింది. ఇది రాగిపళ్లెం బిడ్డ కాబట్టి ఈ రెండూ మీవే’ అని చెప్పాడు. అబునువాస్ తెలివి తక్కువతనానికి నవ్వుకుని ఇంకో పళ్లెం కూడా వస్తూంటే పోనివ్వటమెందుకని ‘మీరు చెప్పింది నిజమే! మా పళ్లానికి పుట్టిన బిడ్డ కాబట్టి ఇదీ మాదే. పళ్లాలకు కూడా బిడ్డలు పుట్టే చల్లని ఇల్లు మీది’అన్నాడు పొరుగింటాయన. మూడురోజులు పోయాక అబునువాస్ మళ్లీ వాళ్లింటికి వెళ్లి ఆ పళ్లమే ఇంకోసారి అరువడిగాడు. ఈసారి ఇంకో మంచి బిడ్డను తీసుకొస్తుందనే సంతోషంతో వెంటనే ఆ ఇంటి యజమాని ఆ పళ్లాన్ని తెచ్చిచ్చాడు. అబునువాస్ నవ్వుకుంటూ ఆయనకు నమస్కారం పెట్టి రాగిపళ్లెం చంకనబెట్టుకొని ఇంటికి పోయాడు. ఈసారి పళ్లెం తీసుకుపోయి ఎన్నాళ్లయినా తిరిగి ఇవ్వలేదు. పొరిగింటాయన వచ్చి పళ్లెం కావాలని అడిగాడు. అబునువాస్ ఎంతో విచారంగా‘ఏం చేయమంటారు బాబూ.. మీకు పుట్టెడు దుఃఖవార్త చెప్పాల్సి వచ్చింది. మీ పళ్లెం చచ్చిపోయింది బాబూ’ అని చెప్పాడు. ‘ పళ్లెం చచ్చిపోవడమేమిటి?’ విస్తుపోయాడు పొరుగింటి మనిషి. ‘ఈ విషయం మీకు చాలా దుఃఖం కలుగజేస్తుందనే నేను మీకు ఇన్నాళ్లూ చెప్పలేదు. ఏం చెయ్యను? చివరికి చెప్పక తప్పలేదు’ అన్నాడు అబునువాస్. ఆ మాటకు పొరుగింటి పెద్దమనిషికి తగని కోపం వచ్చింది. ‘తమాషాగా ఉందా? రాగిపళ్లెం చావటమేమిటి?నన్ను పిచ్చివాణ్ణనుకుంటున్నావా?’ అంటూ మండిపడ్డాడు. ‘ఆ రాగిపళ్లమే కదండీ ఇంతకుముంద బిడ్డను కనిందీ..’ గుర్తుచేశాడు అబునువాస్.‘అవును’ చెప్పాడు పొరుగింటాయన. ‘ఈ సృష్టిలో బిడ్డల్ని కనేవన్నీ ఏనాడో ఒకనాడు చచ్చిపోకమానవు బాబూ? ఎటొచ్చీ మీ రాగిపళ్లెం పాపం పరాయింట్లో చచ్చిపోవటమే చాలా విచారకరం. ఏం చేస్తాం.. దానికి అలా రాసిపెట్టి ఉంది’ అని ఓదార్చాడు అబునువాస్. అలా ఆ రాగిపళ్లాన్ని తన దగ్గరే ఉంచేసుకున్నాడు. ఇంకోసారి ఒకడు అబునువాస్ దగ్గరకు వచ్చి అతని గాడిదను అరువు అడిగాడు. పని మీద తన గాడిద ఊరికి వెళ్లిందని అబునువాస్ చెప్తూండగానే పెరట్లోంచి గాడిద ఓండ్రపెట్టింది. ‘దొడ్లో గాడిద అరుస్తూంటే ఊరెళ్లిందని చెప్తున్నావ్.. నువ్వేం పెద్దమనిషవయ్యా?’ అంటూ నిలదీశాడతను. ‘నీకు కావలసింది మా గాడిదా? దాని అరుపా? గాడిదైతే ఇక్కడలేదు. దాని అరుపు కావాలంటే తీసుకుపో’ అంటూ గాడిదలాగా ‘ఈ.. ఓర్.. ఈ ..ఓర్’ అంటూ ఓండ్రపెట్టి ‘ఇదిగోనయ్యా.. గాడిద అరుపు. దానిమీద ఎక్కి నీ దారిన నువ్వు పో త్వరగా’ అని చెప్పాడు. తెల్లబోయాడు ఆ పెద్దమనిషి. ఇంకోసారి ఇంకా మంచి తమాషా జరిగింది. అబునువాస్ రెండంతస్తుల మేడ కట్టాడు. అంతా కట్టిన తరువాత ఆ మేడ అమ్మాలని బేరం పెట్టాడు. అంత పెద్దమేడ ఎవరికీ అవసరం లేకపోయింది. అడిగినవాళ్లే లేకపోయారు. చివరికెట్లాగో అబునువాస్ తన మేడ మీది అంతస్తు మాత్రం ఒక వ్యాపారస్తుడికి అమ్మగలిగాడు. వర్తకుడు మేడ మీద ప్రవేశించాక కిందిభాగం కూడా కొనమని అతణ్ణి అడగసాగాడు అబునువాస్. వ్యాపారస్తుడు మాత్రం తనకు అక్కర్లేదని చెప్పేశాడు. ఒకనాటి ఉదయం అబునువాస్ చాలామంది కూలీలను పిలిపించి తన ఇంటి గోడలు పగలగొట్టమన్నాడు. ఈ గడబిడ ఏమిటా అని పైనున్న వర్తకుడు కిటికీలోంచి కిందికి తొంగి చూశాడు. అంతమంది కూలీలు అబునువాస్ చెప్పినట్టే మేడ గోడలను కూలగొట్టసాగారు. కంగారుపడుతూ ఆ వర్తకుడు ‘ఏం చేస్తున్నారు?’ అంటూ అరిచాడు. ‘కింది అంతస్తు అమ్ముతానంటే ఎవరూ కొనలేదు. అందుచేత పగలగొట్టించేస్తున్నాను. నీ పై అంతస్తును జాగ్రత్తగా చూసుకో. నీ మేడ విరిగి నా కూలీల మీద పడి వాళ్లకు దెబ్బలు తగిలితే మాత్రం నేనూరుకోను’ అన్నాడు అబునువాస్. ‘పగలగొట్టించకండి.. కింది అంతస్తు కూడా నేనే కొంటాను’ అంటూ ఆ వర్తకుడు కింది అంతస్తు కూడా కొన్నాడు విధిలేక. ఆఖరికి ఆ ఊరి రాజుకూడా అబునువాస్ హాస్యపుదెబ్బ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఒకనాటి రాత్రి రాజుకి ఒక కల వచ్చింది. అబునువాస్ ఇంటి కింద.. భూమిలో వెండినాణాలతో నిండిన బిందెలు ఉన్నట్టు రాజుకి కలలో కనబడింది. తెల్లవారే ఆ బిందెలను తవ్వుకురమ్మని పదిమంది పనివాళ్లను అబునువాస్ ఇంటికి పంపాడు రాజు. అప్పుడు అబునువాస్ ఇంట్లోలేడు. పనివాళ్లు ఇంటి కింది నేలను తవ్వేస్తూంటే ఏమీ చేయలేక ఏడుస్తూ దూరంగా నిలబడింది అబునువాస్ భార్య. ఎంత పెళ్లగించినా వెండిబిందెలు కనబడలేదు. రాజుగారి కూలీలు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. అబునువాస్ ఇంటికి రాగానే అతని భార్య ఏడుస్తూ సంగతంతా చెప్పింది. ‘మరేమీ పరవాలేదులే. రాజుగారికి తగిన శాస్తి నే చేస్తాగా! నువ్వు దిగులు పడకు’ అంటూ భార్యను ఓదార్చాడు అబునువాస్. వండిన అన్నాన్ని కొంత తీసి ఒక పళ్లెంలో వేసుకుని దాని మీద ఒక తువాలు కప్పాడు. తువాలు మీద చాలా ఈగలు వాలాయి. అందులో కొన్ని లోపలికి దూరి అన్నం తినటానికి ప్రయత్నించాయి. మరునాడు తెల్లవారగానే తువాలు కప్పిన అన్నపు పళ్లాన్ని రాజుగారి కోటకు తీసుకెళ్లాడు. ‘ప్రభూ.. నాదొక ఫిర్యాదు. కొందరు నా ఇంటికి పిలవకుండానే వచ్చి నా ఆహారాన్ని తినేస్తున్నారు. వాళ్లను దండించ కుండా ఎట్లా ఊరుకోమంటారో మీరే చెప్పండి’ అని రాజుగారిని అడిగాడు. అబున్వాస్ ఏదో కట్టుకథలాంటిది చెబుతున్నాడేమో అనుకున్నాడు రాజు. తన పనివాళ్లు అతని ఇంట్లో నేలను పెళ్లగించిన విషయం చెబుతున్నాడేమోనని కూడా రాజుకి అనుమానం కలిగింది. ‘ఇంతకీ నువ్వు ఫిర్యాదు చేస్తున్నది ఎవరి మీద?’ అని అడిగాడు రాజు. తను తెచ్చిన అన్నపు పళ్లెం మీద కప్పిన తువాలు తీశాడు అబునువాస్. వెంటనే మూడు ఈగలు ఎగిరిపోయాయి. ‘వీటి మీదే నా ఫిర్యాదు’ అన్నాడు అబునువాస్ ఆ ఈగలను చూపిస్తూ. రాజుకి నవ్వు వచ్చింది. ‘ఈగల మీదా నీ ఫిర్యాదు? సరే. నన్ను ఏం చేయమంటావో చెప్పు’ అన్నాడు. ‘చట్టంప్రకారం నాకు న్యాయం చెయ్యమంటున్నాను. ఈగల్ని దండించడానికి మీరు నాకు అనుమతి ఇవ్వాలి. అంతే ప్రభూ’ అన్నాడు అబునువాస్. ‘భేష్.. ఈగలను దండించటానికి నీకు అనుమతి ఇచ్చాను. ఈగలు ఎక్కడ కనిపించినా నీ ఇష్టం వచ్చినట్టు దండించు’ అన్నాడు రాజు నవ్వుతూ. రాజుగారు ఈ తీర్పుని ఒక కాగితం మీద కూడా రాసి సంతకం చేసి అబునువాస్కి ఇచ్చాడు. అబునువాస్ ఈగలను దండించటానికి పెద్ద దుడ్డుకర్ర చేయించాడు. ఆ కర్ర చివర గట్టి ఇనుప పొన్ను వేయించాడు. ఎక్కడ ఈగ కంటబడితే అక్కడ కర్రతో కొట్టేసేవాడు. బజారుకు వెళ్లినప్పుడు ఖర్జూరపు పళ్ల బుట్టల మీద ఈగలు వాలటం చూసి దుడ్డుకర్ర విసిరేవాడు. పళ్లన్నీ చితికిపోయేటట్టు కర్రతో బాదేవాడు. అంగడివాళ్లు ‘ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావు?’ అని గదమాయించి అడిగితే ‘నేనేమీ మీ పళ్లను కొట్టటం లేదయ్యా! వాటి మీద వాలిన ఈగల్నే దండిస్తున్నాను’ అని జవాబు చెప్పి రాజుగారు ముద్రవేసి ఇచ్చిన అనుమతి పత్రాన్ని చూపించేవాడు. వాళ్లు ‘ఇదేం మేళంరా!’ అనుకుంటూ ఊరుకునేవాళ్లు. ఇట్లా కొన్ని రోజులు గడిచాయి. అబునువాస్ వెర్రి చేష్టలకు విసుక్కునేవాళ్లు విసుక్కుంటున్నారు. నవ్వుకునేవాళ్లు నవ్వుకుంటున్నారు. రాజుగారు కూడా ఈ వింత చేష్టలన్నీ విని విరగబడి నవ్వాడు. చివరకు ఒకనాడు రాజుగారు రాజసభలో తీర్పులు చెబుతున్నాడు. అబునువాస్ కూడా వెళ్లి రాజుగారికి దగ్గరగా కూర్చున్నాడు. రాజుగారు ఏదో నేరాన్ని విచారణచేశాడు. గంభీరంగా తీర్పు చెబుతుండగా రాజుగారి వీపు మీద ఈగ వాలింది. చటుక్కున తన దుడ్డుకర్రతో రాజుగారి వీపు మీద గట్టిగా బాదాడు అబునువాస్. అతని ఆ చర్యకు సభంతా ఘొల్లుమంది. అబునువాస్ను చుట్టుముట్టి గట్టిగా పట్టుకున్నారు. రాజుగారిని కొట్టినందుకు అతనిని శిక్షించాలని పట్టుబట్టారు. ‘అబునువాస్.. ఏమిటీ పిచ్చి? రాజుగారిని కొడతావా?’ అని అధికార్లు అబునువాస్ మీద మండిపడ్డారు. జంకుగొంకు లేకుండా అబునువాస్ ‘నేను తప్పేం చేయలేదే? నన్ను శిక్షించడం న్యాయంకాదు. నేను రాజుగారి వీపు మీద వాలిన ఈగను కొట్టానుగాని, రాజుగారిని కొట్టలేదు. రాజుగానే ఈగల్ని చంపటానికి నాకు అనుమతి ఇచ్చారు’ అని చెప్పాడు. రాజుగారు స్వయంగా సంతకం చేసి ఇచ్చిన అనుమతి పత్రం జేబులోంచి తీసి అందరికీ చూపించాడు. ఇంకేం మాట్లాడతారు? అతను చెప్పిందంతా నిజమే. అతనిని నిర్దోషిగా వదలక తప్పిందికాదు. ‘వెధవ ఈగలకి తగిన శాస్తి జరిగింది. అవి నా ఇంట్లో ప్రవేశించి దౌర్జన్యంగా నా సొమ్మును తీసుకోటానికి ఎందుకు ప్రయత్నించాలి?’ అన్నాడు అబునువాస్. మరోసారి ఇంకో విచిత్రమైన సంగతి జరిగింది. పట్నంలో ఒక భాగ్యవంతుడైన వర్తకుడు మేకమాంసం వండించి మంచి విందు తయారు చేస్తున్నాడు. విందు భోజనం వండేటప్పుడు ఒక బిచ్చగాడు అక్కడ ఏమి జరుగుతూందో చూద్దామని వచ్చాడు. పాపం.. వాడు కాస్త దూరంగా వంటలు తయారుచేసే చోటు నుంచి వచ్చే ఘుమఘుమలాడే ఆ గాలిని పీల్చుకుంటూ కూచున్నాడు. వాసనే ఇంత కమ్మగా ఉంటే ఆ భోజనం ఇంకెంత రుచిగా ఉంటుందోనని విందు గురించి ఊహించుకోసాగాడు. అయితే ఆ ధనవంతుడు, ఆ బిచ్చగాడికి పిడికెడు అన్నం కూడా పెట్టించలేదు. మరునాడు ఆ వర్తకుడు కనిపించినప్పుడు ‘అయ్యా.. మీరెంత మంచివారో.. మీ వంట పందిరి దగ్గరైనా నన్ను కూచోనిచ్చారు! మీ విందులోని పసందైన మేకమాంసం కూరల కమ్మని వాసన పీల్చేటప్పటికే నాకు సంతృప్తిగా భోజనం చేసినట్టయింది’ అన్నాడు. ‘సరి..సరి.. అందుకేనేమో నిన్న మా మేకమాంసం రుచీపచీ లేకుండా పోయింది. ఆ కమ్మని వాసనంతా నువ్వే పీల్చేసి ఉండాలి సందేహం లేదు’ అన్నాడు వర్తకుడు. అంతటితో ఊరుకోక రాజు వద్దకు వెళ్లి తన మేకమాంసం కూరల కమ్మని వాసనంతా అపహరించుకుపోయాడని బిచ్చగాడి మీద అన్యాయంగా ఫిర్యాదు చేశాడు. రాజు.. వర్తకుల పక్షపాతి కాబట్టి అతడు చెప్పిన ఫిర్యాదు నమ్మి ఆ నేరం చేసినందుకు బిచ్చగాడు పన్నెండు వెండి నాణాలు ఆ వర్తకుడికి ఇచ్చి తీరాలని తీర్పు చెప్పాడు. బిచ్చగాడి చేతిలో పైసా లేదు. పాపం ఏడుస్తూ వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తు వాడికి అబునువాస్ ఎదురుపడ్డాడు. రాజుగారి అన్యాయపు తీర్పు సంగతి చెప్పాడు. అబునువాస్ జాలిపడి ‘నేను నీకు సాయం చేస్తాను దిగులుపడకు. నీ అప్పు తీర్చిపారెయ్యటానికి రేపు ఉదయం కలుసుకుందాంలే’ అని ధైర్యం చెప్పాడు. మరుసటి దినం అబునువాస్ బిచ్చగాడితో సహా రాజసభకు వెళ్లాడు. వర్తకుడు కూడా తన పైకాన్ని తీసుకోటానికి వచ్చాడు. అబునువాస్ వర్తకుణ్ణి చూసి ‘నీ డబ్బు చెల్లిస్తే పుచ్చుకోటానికి సిద్ధంగా ఉన్నావయ్యా?’ అని అడిగాడు. ‘ఆ సిద్ధంగానే ఉన్నాను. ఇవ్వండి’ అన్నాడు వర్తకుడు. అబునువాస్ పన్నెండు వెండి నాణాలు తీసి బిచ్చగాడి చేతికిచ్చాడు. ‘ఇదిగో.. వీటిని భూమి మీద పడెయ్యి’ అన్నాడు అబునువాస్. అట్లాగే బిచ్చగాడు ఆ నాణాల్ని నేల మీద పడేశాడు. అవి రాతి నేల మీద పడగానే గణగణమని మోగాయి. ‘విన్నావా? ఆ నాణాల టింగు టింగు మోత!’ అన్నాడు అబునువాస్. ‘ఆ విన్నాను..’ చెప్పాడు వర్తకుడు. ‘ఆ వెండినాణాల్లో నీకు రావలసిన భాగం ఆ టింగ్ టింగే. తీసుకో’ అన్నాడు అబునువాస్. ‘నీ భోజనం కమ్మదనం వాసన చూసినంత మాత్రాన నువ్వు నష్టపోతే ఆ బిచ్చగాడి డబ్బు గణగణ ధ్వని నువ్వు విన్నావు గనుక అది నీకు ముట్టినట్టే. ఇక వెళ్లు’ అన్నాడు అబునువాస్. అతను చెప్పిన న్యాయం ప్రకారం బిచ్చగాడు వర్తకుడికి పన్నెండు కాసులూ చెల్లించినట్టే అని రాజుగారు కూడా ఒప్పుకున్నారు. తగాదా తీరిపోయింది. (‘వేటగాడి కొడుకు ఇతర విదేశ కథలు’ సంకలనం నుంచి) చదవండి: బాలల దినోత్సవం 2021: బొమ్మలతో ఆటలాడుకునే వయసులో.. ఎన్నెన్ని ఘనతలో..! -
Children's Day 2021 Special: గుత్తివంకాయ కూర.. కథ!
ఒక చిన్నపిల్ల. చాలా చిన్నది. పాపం ఆ పిల్ల సొంత తల్లి చనిపోయేసరికి మారుతల్లి వచ్చింది. ఆమె వచ్చినప్పట్నించి ఆ పిల్ల బాధలు బాధలు గావు. కూర్చుంటే తప్పు. నిలుచుంటే తప్పు. లేస్తే తప్పు. పడుకుంటే తప్పు. పసిదని కూడా చూడకుండా వీపు మీద కట్టె విరిగేలా బాదుతుండేది ఆ మహాతల్లి. ఒకరోజు ఆవిడ ఈ పిల్లకు ఒక పావలా యిచ్చి ‘బజారుకెళ్లి ఫలానా వస్తువు తీసుకురా’ అని చెప్పింది. పాపం చిన్నపిల్ల గదా అంగడికి పోతూ పోతూ పావలాను పోగొట్టుకుంది. పోగొట్టుకోగానే ఆ పిల్లకు అమితమైన భయం పట్టుకుంది. యిప్పుడేం చేసేది యింటికి వెళితే మారుతల్లి కొట్టి చంపేస్తుంది గదా అని ఏడుస్తూ యిల్లు చేరింది. లోపలికి అడుగుపెట్టకుండా బయటనే నిలబడి తల్లిని పిలిచింది. ‘అమా, అమా.. నా చేత పొరపాటు జరిగిపోయింది. పావలా పోగొట్టాను. నన్ను కొట్టొద్దమ్మా. యింకెప్పుడూ పోగొట్టనమ్మా. యింట్లోకొస్తే కొట్టొద్దమ్మా’ అని ఏడ్చింది. ఆ మాటకి మారుతల్లి బుస్సున బుసకొట్టి నేరుగా యింట్లోకి వెళ్లి కారండబ్బా తీసుకొచ్చి నిలబడింది. ‘నువ్వు రా దరిద్రపుదానా. నువు చేసిన పనికి యివాళ నీ కళ్లల్లో చెవుల్లో ముక్కులో నోట్లో కారం కూర్చకపోతే నేను నీ మారుతల్లినే కాదు’ అని శప«థం చేసింది. ఆ శప«థానికి చిన్నపిల్ల యింకా దడుచుకొని గుమ్మానికే అతుక్కుపోయింది. బయట ఆ పిల్ల ఏడ్వను. లోపల ఈ మారుతల్లి శప«థాలు చేయను. ఏడ్చిఏడ్చి వెక్కిళ్లకు వచ్చేసింది చిన్నపిల్ల. యిదంతా చూసీ చూసీ ఆ యింటి ఆరుబయట వున్న ఒక వంగ మొక్కకి మాటలు వచ్చేశాయి. ‘తల్లీ, ఏందిది? నీకు దయా జాలీ అనేవి ఏమైనా వున్నాయా? ఆ పసిదాన్ని ఎందుకు అట్లా రాచి రంపాన పెడ్తున్నావు. ఆ పిల్ల చేసిన తప్పుకు కళ్లల్లో నోట్లో ముక్కుల్లో చెవుల్లో కారం కూర్చాలని నీకు ఉబలాటంగా వుంది కదా. ఆ కారమేదో నాకు కూరు. ఆ బాధేదో నేను పడ్తాను.. పాపం పసిదాన్ని క్షమించి వదిలేయ్’ అని బతిమిలాడింది. అపుడా మారుతల్లి శప«థాలు చాలించి, ఆ చెట్టు వంకాయలు కోసి, వాటిలో కారం కూరి కూరి కూర వండింది. అదే గుత్తి వంకాయ కూర. అట్లా ఆ కూర పుట్టింది. అయితే యిట్లా వంకాయ చేసిన త్యాగం అల్లాకు తెలుస్తుంది గదా. అందుకు ఆయన ఎంతో సంతోషించి ‘ఒసే వంకాయ, యివాళ్టి నుంచి నిన్ను కూరగాయల్లో రాజుని చేస్తున్నాను. నీ నెత్తిన కిరీటం పెడ్తున్నాను. యిక నుంచి నిన్ను పేదోడు యిష్టపడతాడు. ఉన్నోడు యిష్టపడతాడు. వండి తిననివాడు పాపాత్ముడు. అంతేకాదు యివాళ్టి నుంచి నీ కూర లేనిదే విందు భోజనం అనిపించుకోదుపో’ అని వరం యిచ్చాడు. యింక అప్పటి నుంచి రాజా, మహారాజాల విందు భోజనాల్లో కూడా గుత్తివంకాయ కూర వడ్డన చోటుచేసుకుంది. - మహమ్మద్ ఖదీర్‌బాబు (పుప్పుజాన్ కతలు నుంచి) చదవండి: టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!! -
Children's Day 2021 Special: పరమానందయ్య కాళ్లు నరకబోయిన శిష్యులు.. కథ!
పరమానందపురంలో పరమానందయ్య అనే గురువు ఉండేవాడు. ఆయన భార్య సుందరమ్మ. వాళ్లకు పిల్లల్లేరు. ఆయన దగ్గర దద్దమ్మల్లాంటి శిష్యులు ఉండేవారు. పిల్లల్లేకపోవడంతో వాళ్లెంత దద్దమ్మలైనా పరమానందయ్య దంపతులు వాళ్లను సొంత పిల్లల్లాగానే చూసుకునేవాళ్లు. వాళ్ల చేష్టలు పరమానందయ్యకు తరచు చిక్కులు తెచ్చిపెడుతుండేవి. ఒకసారి పరమానందయ్య భార్యతోను, శిష్యులతోను కలసి పొరుగూరుకు బయలుదేరాడు. దారి మధ్యలో ఏరు దాటాల్సి వచ్చింది. చాలా దూరం కాలినడకన ప్రయాణం సాగించడమే కాకుండా, ఏరు కూడా దాటి ఊరికి చేరుకోవలసి రావడంతో పరమానందయ్య బాగా అలసిపోయాడు. ఆయన భార్య పరిస్థితీ అలాగే ఉంది. విపరీతమైన ప్రయాణ బడలిక వల్ల ఒళ్లునొప్పులతో బాధపడసాగాడు. శిష్యులను పిలిచి, ‘నాయనలారా! ప్రయాణ బడలిక వల్ల ఒళ్లంతా నొప్పులుగా ఉంది. కాస్త ఒళ్లు పట్టండి’ అని చెప్పాడు. గురువుగారు ఆజ్ఞాపించడమే తడవుగా, ఆయన ఒళ్లు పట్టడానికి నలుగురు శిష్యులు ముందుకొచ్చారు. ఒక్కొక్క అవయవాన్నీ వంతులు వేసుకున్నారు. ఒకడు కుడిచెయ్యి, ఇంకొకడు ఎడమచెయ్యి, ఒకడు కుడికాలు, మరొకడు ఎడమకాలు పట్టనారంభించారు. శిష్యులు శ్రద్ధగా ఒళ్లుపడుతుండటంతో పరమానందయ్యకు కొంత బడలిక తీరి నిద్ర ముంచుకొచ్చింది. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో కాళ్లు పట్టే శిష్యుల మధ్య గొడవ మొదలైంది. నా కాలు మంచిదంటే, నా కాలే మంచిదంటూ వాదనకు దిగారు. ఒకడు పట్టే కాలిని మరొకడు కొట్టుకునే వరకు వచ్చింది వ్యవహారం. అప్పటికీ గొడవ చల్లారలేదు. ‘నీ కాలిని నరికేస్తా’ అన్నాడొకడు. ‘నేనూరుకుంటానా! నేనూ నీ కాలిని నరికేస్తా!’ బదులిచ్చాడు ఇంకొకడు. ఇల్లంతా గాలించి, ఇద్దరూ చెరో గొడ్డలీ తీసుకొచ్చి, గురువుగారి కాళ్లను నరికి పారేసేందుకు సిద్ధపడ్డారు. వాళ్ల వాలకం చూసి మిగిలిన శిష్యులు హాహాకారాలు ప్రారంభించారు. ఈ గలాటాకు గురువుగారికి తెలివి వచ్చింది. చేతుల్లో గొడ్డళ్లతో శిష్యులిద్దరు కనిపించగానే, ఆయన నిద్ర దెబ్బకు వదిలిపోయింది. మూర్ఖులు పట్టుదలకు పోయి, నిజంగానే తన కాళ్లను ఎక్కడ నరికి పారేస్తారోనని భయం పట్టుకుంది. ‘ఒరే! వెధవల్లారా! మీరూ మీరూ తగవుపడి నా కాళ్లు నరుకుతారేమిట్రా? మీకేం పోయేకాలమొచ్చింది?’ అంటూ లేవబోయాడు. చేతులు పడుతున్న శిష్యులిద్దరూ, గురువుగారిని లేవనివ్వకుండా గట్టిగా నొక్కిపట్టి, ‘గురువుగారూ! ఈ వెధవలిద్దరూ ఎప్పుడూ ఇలాగే గొడవపడుతుంటారు. మీరేమీ వాళ్ల గొడవ పట్టించుకోకండి. మేం మీ చేతులు పడుతున్నాం కదా!’ అని సర్దిచెప్పసాగారు. ఈలోగా కాళ్లు పట్టే శిష్యులిద్దరూ, గొడ్డళ్లు పట్టుకుని ఆవేశంగా గురువుగారి కాళ్లు నరకడానికి సిద్ధమయ్యారు. వారి వాలకం చూసి ఆయనకు గుండె గుభేలుమంది. వెంటనే, ‘సుందరీ! ఒకసారి ఇలారా!’ అంటూ లోపల ఉన్న భార్యను కేకవేసి పిలిచాడు. భర్త పొలికేక విన్న సుందరమ్మ హుటాహుటిన బయటకు వచ్చింది. గొడ్డళ్లు పట్టుకుని భర్త కాళ్లను నరికేందుకు శిష్యుల వాలకం చూసి, ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. ‘మూర్ఖపు వెధవల్లారా! మీరు గొడవపడి, గురువుగారి కాళ్లు నరికేస్తార్రా! ఉండండి మీ పని చెబుతాను’ అంటూ అందుబాటులో ఉన్న దుడ్డుకర్ర తీసుకుని, వాళ్లను చావబాది, ఇంట్లోంచి తరిమేసింది. ఆ రోజంతా వాళ్లకు తిండిపెట్టలేదు. మర్నాడు ఉదయం కూడా వాళ్లకు తిండిపెట్టలేదు. మర్నాడు మధ్యాహ్నం ఇంటి బయట చెట్టుకింద కూర్చుని, ఆకలికి అలమటిస్తూ దుఃఖిస్తున్న శిష్యులను చూసి, పరమానందయ్యకు వాళ్ల మీద జాలి పొంగుకొచ్చింది. భార్య మనసు కరిగితే గాని, వాళ్లకు ఆ పూట కూడా తిండిపుట్టదని ఆయనకు తెలుసు. అందుకే, వెంటనే ఇంట్లోకి వచ్చి, భార్యకు నచ్చచెప్పడం ప్రారంభించాడు. ‘వాళ్లు ఉత్త అమాయకపు వెధవలు. మనల్నే నమ్ముకుని మన ఇంట్లో పడి ఉంటున్నారు. ఏ పని చెప్పినా, కాదనకుండా చేస్తున్నారు. అప్పుడప్పుడు తెలివితక్కువతనంతో పిచ్చిపనులు చేస్తుండవచ్చనుకో! అంతమాత్రాన వాళ్లకు తిండిపెట్టకుండా మాడ్చిచంపడం సరైన పనికాదు. మనం కాకపోతే ఈ ప్రపంచంలో వాళ్లను పట్టించుకునే దిక్కేది? మనకే పిల్లలు ఉండి, వాళ్లే ఇలాంటి పిచ్చిపనులు చేస్తే వాళ్లను వదిలేసుకుంటామా? పాపం ఆకలితో మాడుతున్నారు. వాళ్ల భోజనానికి ఏర్పాట్లు చెయ్యి’ అన్నాడు. భర్త మాటలతో సుందరమ్మ కూడా ఆ పిచ్చి శిష్యులపై జాలిపడింది. నాలుగు కేకలేస్తే సరిపోయేదానికి, అనవసరంగా దుడ్డుకర్రతో బాదిపారేశానే అని బాధపడింది. వెంటనే వంటకు ఉపక్రమించింది. భోజనానికి పిలుపు రావడంతో శిష్యులు మెల్లగా లోపలకు చేరుకుని, సుందరమ్మ వడ్డించిన వంటకాలను ఆవురావురుమంటూ భోంచేశారు. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. -
Children's Day 2021 Special: యముడిని మెప్పించిన నచికేతుడు.. కథ!
నచికేతుడు అక్కడకు చేరుకునే సమయానికి యముడు నరకంలో లేడు. ఏదో పని మీద బయటకు వెళ్లాడు. యముడు తిరిగి వచ్చేంత వరకు నచికేతుడు మూడురోజుల పాటు నరకద్వారం వద్దే నిరాహారంగా పడిగాపులు గాశాడు. బయటకు వెళ్లిన యముడు తిరిగి నరకానికి వచ్చాడు. వాజశ్రవుడు గౌతముడి వంశానికి చెందినవాడు. అతడికి ఉద్ధాలకుడనే పేరు కూడా ఉండేది. ఒకసారి అతడు ‘విశ్వజిత్’ అనే యాగాన్ని తలపెట్టాడు. పురోహితులను, వేదపండితులను ఆహ్వానించి దిగ్విజయవంతంగా యాగాన్ని పూర్తి చేశాడు. యాగం నిర్వహించినవాడు తన సర్వ సంపదలనూ దానం చేయాలనేదే ‘విశ్వజిత్’ యాగ నియమం. వాజశ్రవుడు తన గొడ్లపాకలోని ముసలి గోవులను పురోహితులకు దానం చేయసాగాడు. వాజశ్రవుడి కొడుకు నచికేతుడు బాలకుడు. తండ్రి చేస్తున్న తతంగాన్నంతా అతడు గమనించసాగాడు. ఎలాగైనా తండ్రికి జ్ఞానం కలిగించాలనుకున్నాడు. మెల్లగా తండ్రి దగ్గరకు చేరుకున్నాడు. ‘నాన్నా! నేనూ నీ సంపదనేగా! మరి నన్నెవరికి దానమిస్తావు?’ అని అడిగాడు. కొడుకు ప్రశ్నను పిల్లచేష్టగా భావించి, వాజశ్రవుడు పట్టించుకోలేదు. నచికేతుడు పట్టువీడలేదు. తండ్రి దాన ధర్మాల్లో తలమునకలుగా ఉన్నప్పుడు చీటికి మాటికి అడ్డు తగులుతూ ‘నాన్నా! నన్నెవరికి దానమిస్తావు?’ అని పదే పదే అడగసాగాడు. వాజశ్రవుడికి సహనం నశించి, కొడుకు మీద పట్టరాని కోపం వచ్చింది. ‘నిన్ను యముడికి దానం చేస్తాను! ఫో!’ అని కసురుకున్నాడు. యజ్ఞ తతంగం అంతా ముగిశాక, వాజశ్రవుడికి కాస్త ఊపిరిపీల్చుకునే తీరిక చిక్కింది. ఏదో కోపంలో కొడుకుతో అనేసిన మాటలు గుర్తొచ్చి, బాధపడ్డాడు. ఇంతలో నచికేతుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. ‘నాన్నా! ఆడినమాట నిలుపుకోకుంటే అసత్య దోషం చుట్టుకుంటుంది. అందువల్ల ఏమీ బాధపడకుండా నన్ను యముడి వద్దకు పంపు’ అన్నాడు. వాజశ్రవుడు బదులివ్వలేదు. తండ్రి మాట ప్రకారం నచికేతుడు యముడి వద్దకు బయలుదేరాడు. యముడి కోసం వెదుక్కుంటూ నచికేతుడు నరకలోకానికి చేరుకున్నాడు. నచికేతుడు అక్కడకు చేరుకునే సమయానికి యముడు నరకంలో లేడు. ఏదో పని మీద బయటకు వెళ్లాడు. యముడు తిరిగి వచ్చేంత వరకు నచికేతుడు మూడురోజుల పాటు నరకద్వారం వద్దే నిరాహారంగా పడిగాపులు గాశాడు. బయటకు వెళ్లిన యముడు తిరిగి నరకానికి వచ్చాడు. ‘ఎవరో బాలకుడు మీకోసం వచ్చి, మూడురోజులుగా అన్నపానీయాల్లేకుండా మన నరకద్వారం వద్దే నిరాహారంగా ఎదురుచూస్తున్నాడు’ అని యమభటులు చెప్పారు. ‘అతిథిలా వచ్చిన బాలకుడిని మూడురోజులు నిరాహారంగా ఉంచి పాపం చేశాను’ అనుకుని యముడు బాధపడ్డాడు. వెంటనే నచికేతుని వద్దకు చేరుకున్నాడు. ‘మూడురోజులు నిన్ను నిరాహారంగా ఉంచి పాపం చేశాను. అందుకు పరిహారంగా నీకు మూడు వరాలిస్తాను. కోరుకో!’ అన్నాడు. సరేనన్నాడు నచికేతుడు. ‘నేను తిరిగి ఇంటికి చేరుకునే సరికి, నన్ను మా నాన్న నవ్వుతూ స్వాగతించాలి, అతడి పాపాలన్నీ తొలగిపోవాలి. ఇది నా మొదటి వరం’ అన్నాడు నచికేతుడు. ‘తథాస్తు’ అన్నాడు యముడు. ‘స్వర్గప్రాప్తికి సంబంధించిన యజ్ఞక్రతువు పద్ధతిని నేర్పించాలి. ఇది నా రెండో వరం’ అడిగాడు నచికేతుడు. సంతోషంగా ‘సరేన’న్నాడు యముడు. యజ్ఞక్రతువును నేర్పించి, అప్పటి నుంచి ఆ యజ్ఞానికి నచికేతుడి పేరు మీద ‘నాచికేత యజ్ఞం’ అనే పేరు వస్తుందని కూడా ఆశీర్వదించాడు. ‘మరణానంతర జీవితాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని నాకు వివరించాలి. ఇది నా మూడోవరం’ అన్నాడు నచికేతుడు. బాలకుడి మూడోవరానికి యముడు అవాక్కయ్యాడు. దాని బదులు ధన కనక వస్తువాహనాలింకేవైనా కోరుకోమన్నాడు. నచికేతుడు యముడి ప్రతిపాదనకు ‘ససేమిరా’ అన్నాడు. తనకు ఎలాగైనా బ్రహ్మజ్ఞానం ఉపదేశించాల్సిందేనని పట్టుబట్టాడు. బాలకుడైన నచికేతుడి పట్టుదలకు ముచ్చటపడ్డాడు యముడు. ఎట్టకేలకు అతడికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడు. మరణానంతర జీవన రహస్యాలను వివరించి, సాదరంగా సాగనంపాడు. బ్రహ్మజ్ఞానం పొందిన నచికేతుడు ఇంటికి చేరుకోగా, అతడి తండ్రి సంతోషంగా అతణ్ణి స్వాగతించాడు. – కఠోపనిషత్తులోని కథ -
బాలల దినోత్సవం: వాళ్ల కెపుడు పండగ
-
బాలల దినోత్సవం 2021: బొమ్మలతో ఆటలాడుకునే వయసులో.. ఎన్నెన్ని ఘనతలో..!
Nation Wide Famous Child Prodigies: పసితనం వీడని చిన్నారులు వివిధ రంగాల్లో సాధిస్తున్న ఘనతకు ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే! ఏళ్లతరబడి సాధన చేసిన పెద్దలు సైతం సాధించలేని ఘనకార్యాలను కొందరు చిచ్చరపిడుగులు అలవోకగా ఇట్టే సాధిస్తూ, ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేస్తున్నారు. వివిధ రంగాల్లో విశేషప్రతిభతో రాణిస్తున్న కొందరు చిచ్చరపిడుగుల గురించి బాలల దినోత్సవం సందర్భంగా... మిలియన్ డాలర్ల ‘స్వర’ స్వరఘనత: లిడియన్ నాదస్వరం అత్యంత పిన్నవయసులోనే సంగీతంలో అంతర్జాతీయ స్థాయి ఘనత సాధించాడు లిడియన్ నాదస్వరం. తమిళ సంగీత దర్శకుడు వర్షన్ సతీష్ రెండో కొడుకైన లిడియన్ నాదస్వరం మాటలు వచ్చీరాని వయసులోనే సరిగమలతో చెలిమి ప్రారంభించాడు. రెండేళ్ల వయసులో లయ తప్పకుండా డ్రమ్స్ మోగించడం మొదలుపెట్టాడు. ఎనిమిదో ఏట తనంతట తానే పియానో వాయించడం నేర్చుకున్నాడు. లిడియన్ ఆసక్తి గమనించిన తండ్రి, అతడిని శిక్షణ కోసం మద్రాస్ మ్యూజికల్ అసోసియేషన్ డైరెక్టర్ అగస్టీన్ పాల్ వద్ద చేర్చాడు. అగస్టీన్ వద్ద శిక్షణ తర్వాత చెన్నైలో ఎ.ఆర్.రెహమాన్ నడుపుతున్న కె.ఎం.మ్యూజిక్ కన్జర్వేటరీలో చేరి, నాలుగేళ్లు సంగీత మర్మాలన్నింటినీ ఆపోశన పట్టాడు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ 2019లో తాను తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రంలో లిడియన్‌కు సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. అప్పటికి లిడియన్ వయసు పద్నాలుగేళ్లే! అతి పిన్నవయస్కుడైన సినీ సంగీత దర్శకుడిగా రికార్డులకెక్కిన లిడియన్ ఘనతను అంతర్జాతీయ మీడియా కూడా గుర్తించింది. అమెరికాకు చెందిన సీబీఎస్ చానల్ నిర్వహించిన పోటీలో లిడియన్ ఉత్తమ సంగీతకారుడిగా మిలియన్ డాలర్ల (రూ.7.44 కోట్లు) బహుమతిని గెలుచుకున్నాడు. సంగీత ప్రధానంగా గత ఏడాది నిర్మించిన బాలీవుడ్ చిత్రం ‘అట్కన్–చట్కన్’లో లిడియన్ ఒక కీలకపాత్రలో నటించడం విశేషం. చదవండి: గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా!! శాస్త్రీయ సంగీతంలో ప్రపంచస్థాయి ప్రదర్శనలు: రాహుల్ వెల్లాల్ నాలుగేళ్ల వయసులోనే సరిగమల సాధన మొదలుపెట్టిన రాహుల్ వెల్లాల్ ఘనత అంతర్జాతీయ వేదికల వరకు చేరుకుంది. ప్రధానంగా గాత్రకచేరీలే చేస్తున్నా, వాద్యసంగీత సాధన కూడా కొనసాగిస్తున్నాడు ఈ బెంగళూరు కుర్రాడు. తొలుత కళావతి అవధూత్ వద్ద కర్ణాటక సంగీతంలో స్వరాభ్యాసం చేసిన రాహుల్, తర్వాత కుల్లూర్ జయచంద్రరావు దగ్గర మృదంగం నేర్చుకున్నాడు. ప్రస్తుతం లండన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్‌లో పాశ్చాత్య సంగీతంలో పియానో వాద్యం నేర్చుకుంటున్నాడు. రాహుల్ వెల్లాల్ తన పదకొండేళ్ల వయసులోనే, 2018లో అబుదాబిలో తొలి అంతర్జాతీయ కచేరీ చేశాడు. అబుదాబితో పాటు ఇప్పటి వరకు సింగపూర్, నైజీరియా, మలేసియా, హాంకాంగ్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో పదుల సంఖ్యలో కచేరీలు చేశాడు. సంప్రదాయ సంగీతంలో రాహుల్ వెల్లాల్ సాగిస్తున్న కృషికి గుర్తింపుగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా 2018లో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ఫెలోషిప్ అందుకున్నాడు. ‘టాప్–100 గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీస్’లో ఒకరిగా, గత ఏడాది ఢిల్లీలో జరిగిన వేడుకలో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డు అందుకున్నాడు. బాల నలభీముడు: నిహాల్ రాజ్ సాధారణంగా పది పన్నెండేళ్ల వయసులో ఉన్న పిల్లలేం చేస్తారు? తల్లులు ఓపికగా వండిపెడితే, చక్కగా తినిపెడతారు. కేరళలోని కొచ్చికి చెందిన నిహాల్రాజ్కు తినడమే కాదు, రుచులొలికే వంటలు వండటమన్నా భలే ఇష్టం. నిహాల్ వయసు ఇప్పుడు పదకొండేళ్లు. ఐదేళ్ల వయసులోనే గరిటె తిప్పడం మొదలుపెట్టాడు. తన పాక ప్రావీణ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు యూట్యూబ్ చానల్ పెట్టి, పెద్దసంఖ్యలో సబ్స్క్రైబర్ల ఆదరణను సంపాదించుకున్నాడు. ‘యూట్యూబ్’లో ‘లిటిల్ షెఫ్ కిచ్చా’గా గుర్తింపు పొందిన ఈ బాల నలభీముడు అనతికాలంలోనే ప్రముఖ జాతీయ టీవీచానళ్ల దృష్టినీ ఆకర్షించాడు. పలు చానళ్లలో వంటల కార్యక్రమాల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. సంప్రదాయ వంటకాలను తయారు చేయడమే కాదు, ఈ చిచ్చరపిడుగు ఎప్పటికప్పుడు కొత్తకొత్త వంటకాలనూ తయారు చేస్తుంటాడు. ఇతడు సృష్టించిన ‘మ్యాంగో మౌస్ ఐస్‌క్రీమ్’ బాగా పాపులరైంది. తన పాకప్రావీణ్యానికి గుర్తింపుగా గత ఏడాది ఢిల్లీలో జరిగిన వేడుకలో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డు కూడా అందుకున్నాడు. గూగుల్ బాయ్: కౌటిల్య పండిట్ సివిల్స్‌లాంటి పోటీ పరీక్షలను సాధించిన వారిని సైతం నివ్వెరపరచే పరిజ్ఞానం కౌటిల్య పండిట్ సొంతం. ఏ విషయానికి సంబంధించిన ప్రశ్నలు అడిగినా టకటకా సమాధానాలు చెప్పేస్తూ, ఐదేళ్ల వయసులోనే ‘గూగుల్ బాయ్’గా గుర్తింపు పొందాడు ఈ హర్యానా చిచ్చరపిడుగు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో అమితాబ్‌బచ్చన్‌ను సైతం అబ్బురపరచాడు. కేవలం తన తెలివితేటల ప్రదర్శనతోనే అంతర్జాతీయ టీవీ చానెళ్లనూ ఆకట్టుకున్నాడు. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ ప్రభుత్వాల నుంచి ప్రత్యేక సత్కారాలు, బహుమతులు అందుకున్నాడు. హర్యానా అసెంబ్లీ ద్వారా ప్రత్యేక సత్కారం పొందిన ఏకైక బాలుడిగా రికార్డు సృష్టించాడు. కౌటిల్య పండిట్ పాండిత్యానికి గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన కాశీ విద్వత్ పరిషద్ ‘బాల మనీషి’ బిరుదుతో సత్కరించింది. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉండగా, ఈ చిచ్చరపిడుగును ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్‌కు పిలిపించుకుని, దాదాపు గంటసేపు రకరకాల శాస్త్ర అంశాలపై ఇతడితో మచ్చటించారు. ‘ఫోకస్ టీవీ’ ఎంపిక చేసిన ‘ఎలెవెన్ ఫోకస్ స్టార్స్’లో ఒకరిగా కౌటిల్య పండిట్‌ను ఎంపిక చేసింది. ఎందరో మంత్రులు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మికవేత్తల చేతుల మీదుగా లెక్కలేనన్ని అవార్డులు పొందిన ఈ పద్నాలుగేళ్ల బాలమేధావి గత ఏడాది ఢిల్లీలో గ్లోబల్‘చైల్డ్ ప్రాడిజీ అవార్డును కూడా అందుకున్నాడు. రంగుల కళతో అంతర్జాతీయ గుర్తింపు: అద్వైత్ కోలార్కర్ ఏడాది నిండక ముందే కుంచెపట్టుకున్నాడు. ఊహ తెలిసీ తెలియని వయసుతో రంగులతోను, కుంచెతోను మొదలుపెట్టిన చెలిమి అద్వైత్ కోలార్కర్ను కళారంగంలో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. రంగులపై అద్వైత్ మమకారాన్ని గమనించిన తల్లిదండ్రులు అతడికి ఆటబొమ్మల బదులు రంగులు, కుంచెలు, కాన్వాస్‌లు కొనిచ్చారు. అప్పటి నుంచి రంగుల ప్రపంచమే అతడి లోకమైంది. ఆడుతూ పాడుతూ అలవోకగా కాన్వాస్‌లపై నైరూప్యచిత్రాలను చిత్రించేస్తాడు ఈ బాలకళాకారుడు. మిత్రుల సలహాతో అద్వైత్ తండ్రి అతడి కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించి, ఆన్లైన్లో అతడి చిత్రాలను అమ్మడం ప్రారంభించాడు. ఆన్లైన్లో అతడి చిత్రాలు అనతి కాలంలోనే దేశదేశాలకు చేరడంతో, వివిధ దేశాల్లో జరిగే చిత్రకళా ప్రదర్శనలకు ఆహ్వానాలు రావడం మొదలైంది. అలా చిన్న వయసులోనే దేశదేశాలు తిరిగి చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొన్న అద్వైత్, అంతర్జాతీయ మీడియాకెక్కాడు. రెండేళ్ల వయసులోనే కెనడాలోని సెయింట్ జాన్ ఆర్ట్స్ సెంటర్లో సోలో ప్రదర్శన చేసిన అతి పిన్నవయస్కునిగా రికార్డు సృష్టించాడు. ఎనిమిదేళ్ల అద్వైత్ గత ఏడాది ఢిల్లీలో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డును అందుకున్నాడు. బీబీసీ ఇతడిపై ప్రత్యేకంగా ‘ఆర్ట్ ప్రాడిజీ’ కార్యక్రమాన్ని రూపొందించి, ప్రసారం చేయడం విశేషం. చదరంగంలో చిచ్చరపిడుగు: పరీ సిన్హా చదరంగంలో చిచ్చరపిడుగు ఈ చిన్నారి. బుడిబుడి నడకల వయసులోనే చదరంగంలో నిష్ణాతుల ఆట కట్టించి వార్తలకెక్కింది. బిహార్ చెస్ అసోసియేషన్ 2013లో నిర్వహించిన అండర్–7 పోటీల్లో పాల్గొని, విజేతగా నిలిచింది పరీ సిన్హా. పోటీలో పాల్గొనే నాటికి ఆమె ఇంకా బడిలో కూడా చేరలేదు. అప్పటికి ఆమె వయసు మూడేళ్లు మాత్రమే! ఆ తర్వాత బిహార్ రాష్ట్ర చెస్ ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ విజేతగా నిలిచి, అతి పిన్నవయస్కురాలైన చదరంగ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. పరీ సిన్హా బాబాయి వీల్ప్రకాశ్ సిన్హా జాతీయస్థాయి చదరంగం ఆటగాడు. ఆయనే చిన్నారి పరీకి చదరంగాన్ని పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఆమె చదరంగంలో మెలకువలను చకచకా నేర్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లలో ఇప్పటికే తన సత్తా చాటుకుంది. చదరంగంలో ఆమె శుభేందు చక్రవర్తి వద్ద కోచింగ్ తీసుకుంటోంది. చదవండి: చిలుకలు ఎగరాలి.. నెమళ్లు పురివిప్పాలి! హాయిగా ఆడుకోనిద్దాం! బాల వ్యాపారవేత్త: తిలక్ మెహతా దేశంలోనే అతి పిన్నవయస్కుడైన బాల వ్యాపారవేత్తగా గుర్తింపు పొందాడు తిలక్ మెహతా. నాలుగేళ్ల కిందట– అంటే, తన పదేళ్ల వయసులో తిలక్ మెహతా సెలవుల్లో తన మేనమామ ఇంటికి వెళ్లాడు. సెలవుల్లో చదువుకోవడానికి పుస్తకాలు తీసుకురావడం మరచిపోయాడు. ‘మామా! స్కూలు పుస్తకాలు తెచ్చుకోవడం మరచిపోయాను. రేపటికల్లా ఇక్కడకు ఇంటి నుంచి కొరియర్లో తెప్పించుకోవడానికి వీలవుతుందా?’ అని అడిగాడు. ‘ఇవాళ్టికివాళే కొరియర్లో చేరుకోవడం సాధ్యం కాదు. రేపటికైతే చేరుతాయి గాని, కొరియర్ చార్జీ నీ పుస్తకాల ఖరీదు కంటే ఎక్కువే అవుతుంది’ అని బదులిచ్చాడు. మేనమామ సమాధానంతో తిలక్ ఆలోచనలో పడ్డాడు. ముంబై వాసులకు తక్కువ ఖర్చుతో కొరియర్ సేవలు ప్రారంభించగల అవకాశాలపై క్షుణ్ణంగా సమాచారాన్ని సేకరించాడు. చాలా లెక్కలు వేసుకున్నాడు. చివరకు ‘పేపర్ ఎన్ పార్సెల్’ యాప్ ప్రారంభించి, ముంబై డబ్బావాలాలతో కలసి కొరియర్ సర్వీస్ వ్యాపారం ప్రారంభించాడు. ఈ వ్యాపారానికి ముంబైవాసుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీనివల్ల డబ్బావాలాల ఆదాయం కూడా కొంత పెరిగింది. వ్యాపారరంగంలో రాణిస్తున్న తిలక్ మెహతా గత ఏడాది ఢిల్లీలో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డు అందుకున్నాడు. తబలా వాద్యంతో గిన్నిస్ రికార్డు: తృప్త్‌రాజ్ పాండ్యా బొమ్మలతో ఆటలాడుకునే వయసులో తబలాతో సావాసం మొదలుపెట్టాడు తృప్త్‌రాజ్ పాండ్యా. చిన్నప్పుడు అతడి తల్లి ఆటబొమ్మలతో పాటు ఒక చిన్న ఢోలక్‌ను కూడా తెచ్చిచ్చింది. చిన్నారి తృప్త్‌రాజ్ మిగిలిన బొమ్మలను వదిలేసి, ఢోలక్‌ను వాయించడం మొదలుపెట్టాడు. అతడి వాద్యంలోని లయను గమనించి, ఈసారి తబలానే కొనిచ్చారు తల్లిదండ్రులు. రెండేళ్ల వయసులోనే ముంబైలోని సోమయ్య కాలేజీలో తొలి తబలా కచేరీ చేశాడు. మూడేళ్ల వయసులో ముంబై ఆకాశవాణి కేంద్రం నుంచి లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చాడు. తర్వాత ముంబై దూరదర్శన్ కేంద్రంలోనూ తన తబలా వాద్య విన్యాసాన్ని ప్రదర్శించాడు. దీంతో అతి పిన్న వయస్కుడైన తబలా వాద్య కారుడిగా గిన్నిస్ రికార్డు సాధించాడు. తృప్త్‌రాజ్ వాద్యాన్ని ఆలకించిన తబలా దిగ్గజం జాకిర్ హుస్సేన్ సహా హరిప్రసాద్ చౌరాసియా, ఉస్తాద్ ఇక్బాల్ అహ్మద్‌ఖాన్ వంటి విద్వాంసులు అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. పదిహేనేళ్ల తృప్త్‌రాజ్, దేశ విదేశాల్లో ఇప్పటికే వందలాది కచేరీలు చేశాడు. చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు.. -
ఆర్. కె. నారయణ్: అక్కరకు ఆదుకున్న మిత్రుడు.. కథ!
ఆ గదిలోని ముగ్గురు శత్రువులు తలపునకు వచ్చినపుడు తప్ప తక్కిన సమయంలో వారిసంతోషానికి హద్దులేదు. వాళ్లు ఇలాంటి స్థితిలో ఉండగా రాజం స్నేహం మీద ఉపన్యాసం దంచనారంభించాడు. ‘ఐకమత్యమే బలం’ అనే నీతిని గరిపే ‘ముసలివాడు– కట్టెల మోపు’ అనే కథను ఉదాహరణగా తీసుకుని, అందరికీ నచ్చేట్టు స్నేహాన్ని గురించి మాటాడాడు. మూడువారాల తరువాత ఒకనాటి మధ్యాహ్నం స్వామినాథన్ మణి ఇంటి ముందు నుంచుని సన్నగా ఈలవేశాడు. మణి వచ్చి అతనిని కలుసుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం గనుక వచ్చి తనను కలుసుకుంటే అద్భుతం చూపిస్తానన్నాడు. ఏమిటయి ఉంటుందా అని ఆలోచిస్తూ వాళ్లిద్దరూ రాజం ఇంటికి బయలు దేరారు. ‘‘ ఆ..యేంలేదు’’ అన్నాడు స్వామినాథన్ ‘‘రాజం యేదో యెగతాళికి అని వుంటాడు. వాళ్లయింటికి మనిద్దర్నీ రప్పించుకోవడాని కిదో యెత్తు’’ ఇలా అనుమానం వెలిబుచ్చినందుకు మురికికాలవలోకి తోసేద్దామనుకున్నాడు మణి. ‘‘బహుశా యేకోతినో కొనివుండవచ్చు’’ అని తిరిగీ అన్నాడు స్వామినా«థన్ ధైర్యంగా. మణి అతనిమీద మహాదయ చూపుతున్నట్టు ‘అయి ఉండవచ్చు’ అన్నాడు. వాళ్లకి ఆశ్చర్యంగొలిపే విషయాలు ఒకొకటే ఊహించుకుని చివరకు లాభంలేదని ఊహించడమే మానుకున్నారు. ఆలోచనలు శత్రువులమీదికి మళ్లాయి. ‘‘నే నేం చెయ్యబోతున్నానో తెలుసా?’’ అని అడిగాడు మణి. ‘‘ సోము నడుం విరగొట్టేస్తాను. వాడు యెక్కడ వుంటున్నదీ నాకు తెలుసు. బజారు వెనుక కబీర్వీధిలో వుంటున్నాడు. తమలపాకులు కొనక్కోవడానికి తరచుగా బజార్లో ఒక కొట్టుకు రావడం చూశాను. ముందుగా మునిసిపాలిటీ దీపం మీద రాయి విసిరి దాన్ని ఆర్పేస్తాను. కబీర్ వీధిలో యెంత చీకటో నీకేం తెలుసు?.. దుడ్డుకర్ర పుచ్చుకుని చీకట్లో నుంచుంటాను. వాడు వచ్చీ రావడంతోనే యెముకలు విరగ్గొట్టిపడేస్తాను...’’ ఈ మాటలు వింటూంటే స్వామినాథన్‌కి వణుకు పుట్టింది. ‘‘ అంతటితో అయిందీ’’ అంటూ మళ్లీ మొదలుపెట్టాడు మణి. ‘‘బఠాణీగింజ’’ను కాలికింద నలిపేస్తాను. యిక శంకర్‌ని సరయూనది ఒడ్డుమీది రావి చెట్టుమీద వేలాడగట్టివురేస్తాను.’’ రాజం ఇంటికి చేరుకోగానే మాటాడుకోవడం ఆపేశారు. గేటువేసి ఉంది. గోడఎక్కి లోపలకు దూకారు. ఒక నౌకరు వారివైపు పరిగెత్తుకుంటూ వచ్చి ‘‘గోడ యెందుకు యెక్కారు?’’అని అడిగాడు. ‘‘యీ గోడ నీ అబ్బసొమ్మా యేం?’’ అని మణి విరగబడి నవ్వసాగాడు. ‘‘నడుములు విరిగితే’’– అంటూ మొదలుపెట్టాడు నౌకరు. ‘‘నీకెం? నీ నడుం విరగదుగా’’అని దయాదాక్షిణ్యాలు లేనివాడిలా నవ్వాడు స్వామినాథన్. ‘‘యింకొక్కమాట నువేం పోలీసు సూరెంటు కొడుకువా?’’ అన్నాడు మణి. ‘‘ఉహు.. కాను’’ అని నౌకరు జవాబిచ్చాడు. ‘‘అలాయితే, విను’’ అన్నాడు మణి. ‘‘మేము పోలీసు సూపరెంటుగారి కొడుకుతో మాటాడాలని వచ్చాం.’’ దాంతో నౌకరు వెనక్కి తగ్గాడు. రాజం గది తలుపు మీద దబదబా బాదాడు. గడియ చప్పుడుకాగానే వెళ్లి స్తంభం చాటున దాక్కున్నాడు. రాజం తొంగిచూసి ఎవరూ కనిపించకపోయేసరికి మళ్లీ తలుపు వేసుకున్నాడు. మణి, స్వామినాథన్∙స్తంభం చాటునుంచి ఇవతలకి వచ్చి ఏమిచేయడానికీ తోచక గుమ్మం ముందు నిలబడ్డారు. స్వామినాథన్ తలుపు సందున నోరుపెట్టి పిల్లిలాగా మ్యావ్ అన్నాడు. మణి.. స్వామినాథన్‌ని ఇవతలికి లాగి తాను తలుపుసందున నోరు పెట్టి కుక్కలాగా మొరిగాడు. మళ్లీ గడియచప్పుడయి తలుపు కొద్దిగా తెరుచుకుంది. మణి.. స్వామినాథన్ చెవిలో ‘‘నువు గుడ్డిపిల్లి పిల్లవి, నేను గుడ్డికుక్క పిల్లను’’ అన్నాడు. మణి వంగి చేతులు నేలకు ఆనించి, కళ్లు గట్టిగా మూసుకుని, తలతో తలుపుతోసి గుడ్డికుక్క పిల్లలాగా నటిస్తూ రాజం గదిలో ప్రవేశించాడు. స్వామినాథన్ కళ్లుమూసుకుని మణి వెనకాలే పాక్కుంటూ వెళుతూ మ్యావ్ అని అరవసాగాడు. ఈవిధంగా గది నాలుగుమూలలా తిరగసాగారు. రాజం వాళ్ల కూతలకు జవాబుగా తానూ నిమిషనిమిషానికీ మొరుగుతూ, మ్యావ్ అంటూ ఆ ఆటకు రక్తి కట్టించాడు. గుడ్డికుక్క పిల్లకు మనిషికాలు రాసుకుంది. ఆ కాలు రాజందే అనుకొని మెల్లిగా పిక్క మీద కరిచింది. కాని, కళ్లు తెరిచి చూసేసరికి ఆశ్చర్యం! ఆ కాలు అతని శత్రువు సోముది. గుడ్డిపిల్లి పిల్ల ఒక కాలు దగ్గరికి చల్లగా వెళ్లి పంజాతో గోకసాగింది. కళ్లు తెరిచి చూసేసరికి ఆశ్చర్యం! అది శత్రువు శంకర్ కాలు! మణి అలాగే ఒక్క నిమిషం కొయ్యబారిపోయి, లేచి నుంచున్నాడు. సిగ్గుతో కోపంతో చుట్టూ చూశాడు. ‘బఠాణీగింజ’ ఒకమూల అల్లరికి కళ్లు మిణకరిస్తూ కూర్చున్నాడు. గొంతు పిసికేయాలన్నంత కోపంవచ్చింది మణికి. వెనుకకుతిరిగి చూశాడు. రాజం నవ్వు అణచుకుంటూ అతనికేసి రెప్పలార్పకుండా చూస్తున్నాడు. ఇక స్వామినాథన్ ఏ కుర్చీకిందో బల్లకిందో ఎవరికంటా పడకుండా చీకట్లో దాక్కోవడం ఉత్తమమని తలచాడు. ‘‘రాజం! యేమిటి నీవుద్దేశం?’’ అని అడిగాడు మణి. ‘‘యెందుకలా మండిపడతావ్?’’ ‘‘యిదంతా నీ తప్పు’’ అన్నాడు మణి కఠినంగా. ‘‘నాకు తెలవదు..’’ చుట్టూ చూశాడు. ‘‘బలేబాగుంది! నిన్ను కుక్కలాగా నడుస్తూ మొరగమన్నానా? మొరగమన్నానా?’’ సోము, అతనిజట్టు ఫక్కున నవ్వారు. మణి చుట్టూ తేరిపారజూచి, ‘‘రాజం, నేను వెళ్లిపోతున్నా. యిది నేను వుండదగిన స్థలం కాదు’’ అన్నాడు. ‘‘నువు వెళ్లిపోతే యిక నీతో నేనూ మాటాడను’’ అన్నాడు రాజం. ఏంచేయడానికి మణికి పాలుపోలేదు. రాజం అతనిని పక్కకు తీసుకువెళ్లి శాంతపరచాడు. అంతులేని కష్టంలో చిక్కుకుని ఉన్న స్వామినాథన్ వైపు తిరిగి, తన జీవితంలో కుక్కలా, పిల్లిలా అంత చక్కని నటన ఎన్నడూ చూడలేదని పొగడి, అతనిని కూడా ఓదార్చాడు. ‘కొద్దినిమిషాల వరకు నిజంగానే కుక్కే మొరుగుతోంది, పిల్లే అరుస్తోంది అని భ్రమపడ్డాను. ఏ సంతలోనో ఇలా ప్రదర్శిస్తే మీకు బహుమానాలు వచ్చిపడతాయి.’ అన్నాడు. తిరిగీ అలా నటిస్తే, తానెంతో సంతోషిస్తాననీ, చూడడానికి వాళ్ల నాన్నను కూడా పిలుచుకు వస్తాననీ చెప్పాడు. దీంతో స్వామినాథన్, మణి చల్లబడిపోయి, తమను చూచుకుని తామే గర్వించసాగారు. ఆ తరువాత అంతా ఫలహారాలు చేశారు. ఆ గదిలోని ముగ్గురు శత్రువులు తలపునకు వచ్చినపుడు తప్ప తక్కిన సమయంలో వారిసంతోషానికి హద్దులేదు. వాళ్లు ఇలాంటి స్థితిలో ఉండగా రాజం స్నేహం మీద ఉపన్యాసం దంచనారంభించాడు. ‘ఐకమత్యమే బలం’ అనే నీతిని గరిపే ‘ముసలివాడు– కట్టెల మోపు’ అనే కథను ఉదాహరణగా తీసుకుని, అందరికీ నచ్చేట్టు స్నేహాన్ని గురించి మాటాడాడు. అక్కరకు ఆదుకున్న స్నేహితుడే నిజానికి స్నేహితుడు. శత్రుత్వాన్ని పెంచుకునేవారు ఎటువంటి నరకయాతనలు పడతారో ఒళ్లు గగుర్పొడిచేటట్లు వర్ణించాడు. శత్రుత్వాన్ని పెంచుకున్న వాడిని చనిపోయిన తరువాత ఒక గదిలో పెట్టి తాళం వేస్తారు. బట్టలు ఊడదీసి ఎర్రగాకాలుతున్న ఇనుప దిమ్మెమీద నిలబెడతారు. చుట్టూ తేనెతుట్లు. వాటిల్లో నిమ్మకాయంత తేనెటీగలు. ఆ పాపి దిమ్మెమీద నుంచి కిందకు అడుగుపెడితే, ‘ఆ గదిలో తిరిగే వందలకొలదీ తేళ్లు, జెర్రులమీద కాలు పెట్టాలి. ఇదంతా వేదాలలో రాసుంది’ అని చెప్పాడు రాజం. అంతా గజగజ వణికిపోయారు. నిద్రాహారాలు లేకుండా ఆ పాపి అలా నెల రోజులు నిలబడాలి. ఆపైన అతనిని ఒకవంతెన మీదికి తీసుకువెళతారు. వంతెనె కింద కళపెళకాగే నూనె చెరువు. పైగా వంతెన మహా ఇరుకు. కాలి అడుగు కంటె ఎక్కువ వెడల్పు ఉండదు. ఒకొక్క అడుగు వేసుకుంటూ వెళ్లాలి. ఆ వంతెన మీద కూడా కందిరీగ గూళ్లు, ముండ్లజెముడు పొదలు బోలెడన్ని ఉన్నాయి. వంతెన మీదుగా సాగిపొమ్మని వెనక నుంచి అదమాయిస్తుంటారు. కళపెళకాగే ఆ నూనెలో కాలుజారి పడకుండా ఎల్లకాలం నడవాలంటే ఒక్కొక్క అడుగూ వేసుకుంటూ వెళ్లాలి.. రాజం మాటలు అందరినీ ముగ్ధుల్ని చేశాయి. ముందుకు వచ్చి ‘నేటినుంచీ మాకు శత్రువులంటూ లేరు’ అని చెప్పమని రాజం వారిని ఆహ్వానించాడు. ఆ మాట చెపితే శంకర్‌కి ఒక బైండుబుక్కు, స్వామినాథన్‌కి గడియారంలా పనిచేసే ఇంజను, సోముకి బెల్టు, మణికి చక్కటి చాకూ, ‘బఠాణీగింజ’కు మహాపసందయిన కలం ఇస్తానన్నాడు. బీరువా తెరిచి తాను వారికి బహుమానంగా ఇవ్వదలచిన ఆ వస్తువులన్నింటినీ చూపెట్టాడు. గోళ్లుకొరుక్కుంటూ అంతా మాట్లాడకుండా కొంచెంసేపు నిలబడ్డారు. ఈ రాజీ చేయడంలో హైరాన పడ్డాడేమో రాజంకు ముచ్చెమటలు పట్టాయి. మొట్టమొదట ‘బఠాణీగింజ’ లేచి బీరువా ముందు నిలబడి, ‘‘ఆ కలం యిలా యివ్వు చూస్తాను’’ అన్నాడు. రాజం కలం ఇచ్చాడు. ఆ కలాన్ని అటూ ఇటూ తిప్పిచూసి, ఏమీ అనకుండా తిరిగి ఇచ్చి వేశాడు. ‘‘యేం నచ్చలేదా?’’ అని అడిగాడు రాజం. బఠాణీగింజ బీరువాలోకి తేరిపార జూస్తూ ‘‘నాకు ఆ పెట్టె కావాలి’’ అన్నాడు ఒక చిన్న పెట్టెను చూపిస్తూ. ఆ పెట్టెమీద పసుపుపచ్చటి నల్లటి నమూనా చిత్రాలు, మూతమీద తాజమహల్ బొమ్మ వేసి ఉన్నాయి. ‘‘ఉహూ.. వీల్లేదు. అది నాకు కావాలి’’ అన్నాడు రాజం. ఒక నిమిషం గడిచింది. రాజంకు అలాంటి పెట్టెలు ఇంకా రెండు ఉన్నాయి. మనసు మార్చుకుని ‘‘నా కక్కరలేదులే. కావలిస్తే తీసుకో’’ అన్నాడు. కొద్దిసేపటికి మణి అరచేతితో చాకుకు పదునుపెడుతున్నాడు. సోము బెల్టు పెట్టుకుంటున్నాడు. శంకర్ లావుపాటి బైండుబుక్కు అటూ ఇటూ తిప్పి చూస్తున్నాడు. స్వామినాథన్ ఆకుపచ్చని ఇంజనును ఆప్యాయంగా గుండెకేసి అదుముకుంటున్నాడు. సేకరణ: ‘స్వామి, స్నేహితులు’ అనే పుస్తకంలోంచి.. రచన: ఆర్. కె. నారయణ్ అనువాదం: శ్రీనివాస చక్రవర్తి చదవండి: గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా!! -
పంచతంత్రం: కథన బలం.. కదన నీతి!!
కథ అంటే నీతి.. కథ ఒక రీతి.. కథ అంటే నిజాయితీ! బాల్యంలో కథలే పిల్లలను వేలు పట్టి నడిపిస్తాయి. పంచతంత్రాలను బోధిస్తూ, ప్రపంచంలో ఎవరితో ఎలా నడచుకోవాలో బోధిస్తాయి. చిన్నప్పుడు విన్న కథన బలమే... ఆ కాల్పనిక శక్తే పెద్దయ్యేంతవరకూ...ఆ మాటకొస్తే పెద్దయ్యాక కూడా తెలివితేటలను పెంపొందిస్తాయి. ఊహలతోనే వ్యూహాలను నెరుపుతాయి. ఈ కథల ద్వారానే కదా ఆ నాడు విష్ణుశర్మ.. మూర్ఖులు, ఎందుకూ పనికిరాని వారిగా పేరు పొందిన రాజకుమారులను ప్రయోజకులను చేసింది. వారికి ఆయన బోధించిన మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం, అపరిక్షిత కారకం... అంటే ఏమీ పరీక్ష చేయకుండానే పనిలోకి దిగడం, ఇతరుల చెడు కోరడం. ఈ కథలు వింటూనే పిల్లలు ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోతారు. కథలోని పాత్రల్లో తమను తాము ఊహించుకుంటారు. కథతోబాటు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలా ఎందుకు? ఇలా ఎందుకు? అని అడుగుతారు. దీంతో వారి ఆలోచనా పరిధి పెరుగుతుంది. ప్రశ్నించే తత్త్వంతోబాటు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అలవడుతుంది. అన్నిటికీ మించి వివిధ పదాలను పరిచయం చేస్తూ భాషా సంపత్తిని పెంచడానికి కథలు దోహదం చేస్తాయి. మిత్రలాభం, మిత్రభేదానికి చెందిన ఒక కథ చెప్పుకుందాం ఇప్పుడు.. కలసి ఉంటే కలదు సుఖం మగధ దేశంలో మందారవతి అనే వనం. ఆ వనంలో ఒక లేడిపిల్ల, ఒక కాకి ఎంతో స్నేహంగా కాలం గడుపుతున్నాయి. ఒకసారి ఆ వనంలోకి నక్క ఒకటి వస్తుంది. ఆ వనంలో అటూ, ఇటూ పరుగులు తీస్తున్న నక్కకు లేడిపిల్ల కనిపించింది. బాగా కండపట్టి బలంగా ఉన్న ఆ లేడిపిల్లను చూడగానే ఎలాగైనా సరే దాని మాంసం తినాలనుకుంది నక్క. వెంటనే లేడి దగ్గరకు వెళ్ళి దానితో మాటలు కలిపింది. తనకు ఎవరూ తోడులేరని, తాను ఒంటరినని దొంగేడుపులు ఏడ్చింది నక్క. నిన్ను చూడగానే తనకు తనవారంతా గుర్తుకు వచ్చారని, చాలా సంతోషంగా ఉందని లేడిపిల్లతో నమ్మబలికింది నక్క. నక్క మాటలను నమ్మిన లేడిపిల్ల, దానితో స్నేహం చేసేందుకు ఇష్టపడి, తన నివాస స్థలానికి తీసుకెళ్లింది. వనంలోని మందారం చెట్టుపైన కూర్చున్న లేడిపిల్ల స్నేహితురాలైన కాకి ఇది గమనించింది. నక్కను గురించి వివరాలడిగింది. లేడిపిల్ల ఈ నక్క దిక్కులేనిదని, తనతో స్నేహంకోరి వచ్చిందని కాకితో చెప్పింది. అంతా విన్న కాకి, మంచీ చెడూ విచక్షణ లేకుండా, ఎవరుబడితే వారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తూ... తనకు తెలిసిన గద్ద, పిల్లి కథను చెబుతుంది. కాకి అలా చెబుతుండటంతో పక్కనే ఉన్న నక్కకు పట్టరాని కోపం వచ్చింది. అయినా సరే, తమాయించుకుంటూ... అదేంటి మిత్రమా, అలాగంటావు? నువ్వు మాత్రం లేడిపిల్లను కలుసుకునేటప్పటికి కొత్తదానివే కదా, మరి ఆ తరువాత మంచి స్నేహితులు కాలేదా...? అంటూ కోపాన్ని నిగ్రహించుకుని నిష్ఠూరమాడింది నక్క. కాకి, నక్క అలా వాదులాడుకుంటుండగా... లేడిపిల్ల కలుగజేసుకుని మనలో మనకు తగాదాలెందుకు, వ్యక్తిగత ప్రవర్తనను బట్టే, మిత్రుడైనా, శత్రువైనా ఏర్పడుతుంటారని సర్దిజెప్పింది. ఇక అప్పటి నుంచి లేడి, కాకి, నక్క ఎంతో స్నేహంగా కాలం గడుపసాగాయి. కానీ నక్కకు మాత్రం లేడిపిల్ల మాంసం తినాలన్న కోరిక మాత్రం చావలేదు. దీనికి తగిన సమయం కోసం వేచి చూడసాగింది. ఇలా కొంతకాలం గడిచాక నక్క ఒకసారి లేడి దగ్గరకు వచ్చి తాను ఒకచోట పైరు దట్టంగా పెరిగి ఉన్న పొలాన్ని చూసివచ్చానని, తనతో వస్తే దాన్ని చూపిస్తానని చెప్పింది. నక్క మాటలను నమ్మిన లేడిపిల్ల దానితోపాటు వెళ్లి బాగా ఏపుగా పెరిగిన పైరును చూసి ఎంతో సంతోషించింది. రోజూ ఆ ప్రాంతానికి వెళ్లి పైరును కడుపునిండా మేసి వచ్చేది. అయితే అది ఎంతో కాలం సాగలేదు. ఆ పైరు యజమాని లేడిపిల్ల ఇలా రోజూ వచ్చి పైరును తినేసి వెళ్లటం గమనించాడు. దాన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలని చాటుగా వలపన్నాడు. విషయం తెలియని లేడిపిల్ల మామూలుగానే పొలం మేసేందుకు వచ్చి, వలలో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా, అది వల నుంచి బయటపడలేక పోయింది. కాసేపటికి అక్కడికి వచ్చిన నక్కను చూసి, తనను ఎలాగైనా తప్పించమని నక్కను వేడుకుంటుంది లేడిపిల్ల. అయితే, ఆ వల మొత్తం నరాలతో అల్లి ఉందని, తాను నరాలను నోటితో కొరకలేనని చెప్పి, పక్కనే ఉన్న పొదచాటుకు వెళ్లి నక్కి కూర్చుంటుంది. నక్క ఇలా మోసం చేసినందుకు లేడిపిల్ల చాలా బాధపడుతుంది. మేతకు వెళ్లిన తన మిత్రుడు ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కాకి వెతుక్కుంటూ రాగా, వలలో చిక్కుకుపోయిన లేడిపిల్ల కనిపిస్తుంది. ఇదంతా ఎలా జరిగిందని కాకి ప్రశ్నించగా, నక్క మాటలను నమ్మినందుకు తనకు ఈ రకంగా కీడు జరిగిందని కన్నీళ్ళు పెట్టుకుంటుంది లేడిపిల్ల. ఇవి రెండూ ఇలా మాట్లాడుకుంటున్న సమయంలోనే పొలం యజమాని చేతిలో దుడ్డుకర్రతో అటుగా రావడం గమనించాయి. జరగబోయే అపాయాన్ని గ్రహించిన కాకి, లేడితో వలలో చచ్చినట్లు నటిస్తూ పడుకోమని, తాను చచ్చిన నీ కళ్లను పొడుస్తున్నట్లుగా నటిస్తానని, తాను సమయం చూసి అరవగానే లేచి పరుగుతీయమని, అప్పటికి అంతకుమించిన ఉపాయం మరోటి లేదని లేడికి అభయం ఇచ్చింది కాకి. పొలం యజమాని లేడి చచ్చిపోయిందనుకొని మెల్లగా వలను విడదీశాడు. దీన్ని గమనించిన కాకి పెద్దగా కేక పెట్టడంతో, ఒక్క ఉదటున లేచి పరుగెత్తింది లేడిపిల్ల. లేడి తనను మోసం చేసి పారిపోవడం భరించలేని పొలం యజమాని తన చేతిలోని బడితను లేడి మీదకు విసిరాడు. అయితే, అది గురితప్పి పక్కనే పొదలో దాగివున్న నక్కకు తగిలి చచ్చింది. లేడిపిల్లను కాపాడుకుని దాన్నే అనుసరిస్తూ... వనంలోకి వెళ్లిపోయింది కాకి. ఈ కథ సారాంశం ఏమిటంటే... కొత్తగా వచ్చినవారిని త్వరపడి నమ్మితే ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో చెబుతుంది. అలాగే, ఎవరికైనా అపకారం చేయాలనుకుంటే, అలా అనుకున్న వారికే అపకారం ఎదురౌతుందనే విషయాన్ని కూడా చెప్పకనే చెబుతుంది. పునఃకథనం: డి.వి.ఆర్. చదవండి: గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా!! -
బాలల దినోత్సవం : స్టార్ కిడ్స్‌పై ఓ లుక్కేద్దామా!
Children's Day 2021: సినీ సెలబ్రిటీల పిల్లలంటే ఫాన్స్‌కి ఎంత క్రేజో చెప్పాల్సిన పనేలేదు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల పిల్లలు కూడా అందం, అభినయం, పంచ్ డైలాగులు, ఫైట్లు, డాన్సులతో అదరగొట్టాలని ఆశిస్తుంటారు. అటు సెలబ్రిటీలు కూడా తమ పిల్లలు ఎన్నో విజయాలు సాధించి గొప్ప పేరు తెచ్చుకోవాలని కలలు కంటారు. ఎంతైనా వారుకూడా తల్లితండ్రులే కదా. అయితే కొంతమంది సెలబ్రిటీల పిల్లలు చిన్నతనంలోనే సిసింద్రీల్లా దూసుకుపోతున్నారు. సొంత వ్యక్తిత్వంతో తమకంటూ ఒక ఐడెంటిని క్రియేట్ చేసుకుంటూ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. తమదైన శైలిలో రాణిస్తున్నారు. వివాదాల్లో ఇరుకు్కంటున్నవారు కూడా కూడా ఉన్నారు. నవంబరు 14 ‘చిల్డ్రన్స్ డే’ సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని స్టార్ కిడ్స్‌పై ఒక లుక్కేద్దాం. -
బాలల దినోత్సవం: వాళ్ల కెపుడు పండగ
సాక్షి, హైదరాబాద్: నవంబరు 14 అనగానే చిన్నారులకు ఇష్టమైన పండుగ బాలల దినోత్సవం గుర్తుకొస్తుంది. చేతిలో జెండాలు, గుండెలమీద గులాబీలతో ఉత్సాహం ఉరకలు వేసే చిన్నారులు మన కళ్ల ముందు కదలాడతారు. మరోవైపు గనుల్లో, కార్ఖానాల్లో, ఇటుకబట్టీల్లో, గొడ్ల సావిళ్లలో, టీ దుకాణాల్లో మగ్గిపోతున్న బాల్యం. 75 వసంతాల అమృత మహోత్సవాల వేళ కనీస చదువుకు దూరమై, కట్టుబానిసల్లా బతుకులీడుస్తున్న దైన్యం. మరి వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న భావి భారతానికి నిజమైన బాలల పండుగ ఎపుడు? ఇపుడిదే మిలియన్ డాలర్ల ప్రశ్న. భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు నాడు బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా ప్రత్యేకగా వేడుకలు నిర్వహించు కుంటాం. పిల్లలు స్వాత్రంత్య సమరయోధుల వేషధారణలో తమను తాము చూసుకొని మురిసిపోతారు. భావి భారతంకోసం ఎన్నో కలల్లో మునిగిపోతారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు గడిచిన ఈ శుభవేళ రేపటి పౌరులు కనీస సౌకర్యాలు కూడా లేకుండా దారిద్ర్యంలో మగ్గిపోతున్న వారు చాలామంది ఉన్నారు. మిలియన్లకొద్దీ బాలల భవిష్యత్‌ను కాలరాస్తున్న బాల కార్మిక వ్యవస్థ చాపకింద నీరులా విస్తరిస్తోంది. బడిలో ఉండాల్సిన బాల భారతం వెట్టి చాకిరీలో మగ్గిపోతోంది. ఇక నైనా వారి జీవితాల్లో మార్పు రావాలని, వెలుగులు నిండాలని కోరుకుంటూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. -
Children's Day 2021: తొలి బాలల టాకీ తెలుగువారిదే!
సినిమా అంతా బాల నటీనటులతోనే తీస్తే? భారతదేశంలో మునుపెన్నడూ ఎవరూ చేయని ఈ ప్రయోగాన్ని తెలుగు వాళ్ళు మొదట చేశారు. 85 ఏళ్ళ క్రితం విడుదలైన ఈస్టిండియా వారి ‘సతీ అనసూయ’ ఆ రికార్డును సొంతం చేసుకుంది. నిడివి రీత్యా చిన్నవైన ‘సతీ అనసూయ – ధ్రువవిజయము (1936)– ఈ రెండు వేర్వేరు టాకీలను ఒకే టికెట్‌పై చూపి, దర్శకుడు సి. పుల్లయ్య అప్పట్లో చేసిన విన్యాసం నేటికీ విశేషమే! మన దేశంలో మూగ సినిమాలు పోయి, వెండితెర మాట్లాడడం మొదలుపెట్టిన తొలి రోజులవి. తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (1932 ఫిబ్రవరి 6) రిలీజై, నాలుగేళ్ళవుతోంది. బొంబాయి, కలకత్తా స్టూడియోలలో అక్కడి నిర్మాతలే ఎక్కువగా తెలుగులో సినిమాలు తీస్తున్నారు. కలకత్తా సంస్థ ఈస్టిండియా ఫిల్మ్ కంపెనీ అప్పటికే చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో ‘సతీ సావిత్రి’ (1933 ఫిబ్రవరి 5), ‘లవకుశ’ (1934 డిసెంబర్ 22)– రెండు తెలుగు టాకీలు తీసి, రెండింటితోనూ లాభాలు గడించింది. రామాయణ కథ ‘లవ–కుశ’ తెలుగులో తొలి బాక్సాఫీస్ బంపర్ హిట్. లవ, కుశులుగా నటించిన చిన్న పిల్లలు (మాస్టర్ భీమారావు, మాస్టర్ మల్లేశ్వరరావు) – ఇద్దరూ జనంలో స్టార్లయిపోయారు. ఇద్దరుంటేనే జనం ఇంతగా అక్కున చేర్చుకుంటే, మొత్తం పిల్లలతోనే సినిమా తీస్తేనో? అలా బాలలతో ‘సతీ అనసూయ’కు బీజం పడింది. కలకత్తా ఇంట్లో... పిల్లల తండ్రిలా పుల్లయ్య మూకీల కాలం నుంచి సినీ ప్రదర్శన, నిర్మాణ, దర్శకత్వ శాఖల్లో అనుభవం గడించిన ప్రతిభాశాలి – కాకినాడకు చెందిన సి. పుల్లయ్య. పూర్తిగా పిల్లలతోనే ‘సతీ అనసూయ’ తీస్తే అనే ఆయన ఆలోచన ఓ విప్లవమే. ఆయన డైరెక్టర్ గానే ఉండిపోలేదు. ఆ పిల్లలందరినీ ఆయన, ఆయన భార్య రంగమ్మ సొంత తల్లితండ్రులలాగా చూసుకునేవారు. పిల్లల్లో ఎవరైనా అలిగితే, ఆయన బతిమాలి అన్నం తినిపించేవారు. షూటింగ్ సమయంలో కలకత్తాలో ఆయన ఓ మూడంతస్థుల బంగళా తీసుకున్నారు. చదువు పోకూడదని... పిల్లలకంతా అక్కడే స్కూలు, క్లాసులు ఏర్పాటు చేశారు. ‘‘అనసూయ’లో అందరం పిల్లలమే. ‘ధ్రువ’లో మాత్రం బాలపాత్రలు మినహా మిగతా అందరూ పెద్దవాళ్ళే చేశారు. పద్యాలు, పాటలు మేమే పాడుకొనేవాళ్ళం. మేము పాడుతూ నటిస్తుంటే, పక్కనే ఆర్కెస్ట్రా వాళ్ళు మమ్మల్ని అనుసరిస్తూ సంగీతమందించేవారు’’ అని 90వ పడిలోవున్న నటి, నిర్మాత, అనసూయ పాత్రధారిణి సి. కృష్ణవేణి ‘సాక్షి’తో గుర్తుచేసుకున్నారు. ప్రొడక్షన్ మేనేజర్‌గా... రేలంగి! తరువాతి కాలంలో కమెడియన్ గా పేరుతెచ్చుకున్న రేలంగి అప్పట్లో ‘ధ్రువవిజయము’లో ఇంద్రుడిగా నటించడం మొదలు క్యాస్టింగ్ ఏజెంట్, ప్రొడక్షన్ మేనేజర్, డైరెక్టర్ కి అసిస్టెంట్ – ఇలా అన్నీ అయ్యారు. షూటింగ్ లేనప్పుడు వారానికి రెండుసార్లు పిల్లలందరినీ ‘జూ’కో, సినిమాకో తీసుకెళ్ళేవారు. తొలి ఆర్ట్ డైరెక్టర్ అడివి బాపిరాజు ప్రముఖ రచయిత, చిత్రకారుడు అడివి బాపిరాజు ఈ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. తెలుగు సినిమాలకు ఓ తెలుగు వ్యక్తి పూర్తిస్థాయిలో ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేయడం అదే మొదలు. అలా ‘తొలి తెలుగు ఆర్ట్ డైరెక్టర్’గా చరిత్ర కెక్కారు. అప్పటికే బాపిరాజు మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల ప్రిన్సిపాల్. ‘అనసూయ’ కోసం ఆయన వేసిన కైలాసం సెట్, చాక్పౌడర్తో కైలాసంపై మంచు పడే ఎఫెక్ట్ అపూర్వం. తెరపై తొలిసారి అన్నమయ్య గీతం... తెలుగు తెరపై తొలిసారి అన్నమయ్య కీర్తన వినిపించిన సినిమా కూడా బాలల చిత్రం ‘సతీ అనసూయే’. అన్నమయ్య రచన ‘జో అచ్యుతానంద జోజో ముకుందా...’ను త్రిమూర్తులను పసిపాపలుగా చేసి, అనసూయా సాధ్వి జోల పాడే చోట వాడుకున్నారు. కొన్ని పదాలను మాత్రం రచయిత బలిజేపల్లి లక్ష్మీకాంతం మార్చి, మిగతాదంతా జనబాహుళ్యంలో ఉన్న అన్నమయ్య కీర్తననే యథాతథంగా ఉంచారు. అలా తెరపైకి తొలిసారి అన్నమయ్య కీర్తన ఎక్కింది. ఒకే టికెట్‌పై... రెండు సినిమాలు! భక్తితో దైవప్రార్థన చేస్తే, సాధించలేనిది ఏదీ లేదని ఈ ‘సతీ అనసూయ’, ‘ధ్రువ విజయము’ చిత్రాలు రెండింటిలో చక్కగా చూపెట్టారు. నిజానికి, ఇవి రెండు వేర్వేరు చిత్రాలు. ఆ రెండు చిత్రాలనూ కలిపి, ఒకే పూర్తి ప్రోగ్రామ్‌గా హాళ్ళలో ప్రదర్శించారు. రెండు చిత్రాలూ కలిపినా మొత్తం ప్రదర్శన ‘‘2 గంటల 40 నిమిషా’’లే! ఈ ‘అనసూయ – ధ్రువ’ డబుల్ ప్రోగ్రామ్‌లో ఇంటర్వెల్ దాకా ఒక సినిమా, ఇంటర్వెల్ తరువాత రెండో సినిమా ప్రదర్శించేవారు. గమ్మత్తేంటంటే, ‘1936లో సినీ అద్భుతం’గా పేర్కొన్న ఈ ‘‘డబుల్ ప్రోగ్రాముల’’తో పాటు కాశీ పుణ్యక్షేత్రం, హరిద్వార్ ల గురించి తెలుగు వ్యాఖ్యానంతో ఒక రీలు టాపికల్ చిత్రాన్నీ ప్రదర్శించారు. ఆ సినిమా హాలుకు 105 ఏళ్ళు! తొలివిడతగా బెజవాడ, రాజమండ్రి, కాకినాడల్లో మే 8న ఈ చిత్ర ద్వయం రిలీజైంది. మే 11న మద్రాస్‌లో విడుదలైంది. విశేషమేమిటంటే చెన్నైలో ఇప్పటికి 105 ఏళ్ళుగా నడుస్తున్న ‘మినర్వా’ టాకీస్ (జార్జ్‌టౌన్‌లో నేటికీ ‘బాషా’ ఏ.సి పేరుతో నడుస్తోంది) ఈ డబుల్ ప్రోగ్రామ్‌తోనే టాకీ హాలు అయింది. బాలల చిత్రాల్లో... శోభన, చిన్న ఎన్టీఆర్ ఇలా బాలలతోనే సినిమాలు తీసే ప్రయోగాలు తర్వాత మరికొన్ని జరిగాయి. దర్శక – నిర్మాత కె.ఎస్. ప్రకాశరావు మూడు చిన్న చిత్రాల సమాహారంగా ‘బాలానందం’ (1954 ఏప్రిల్ 24)పేర ఒకే ప్రోగ్రాంగా రిలీజ్ చేశారు. ‘బూరెలమూకుడు’, ‘రాజయోగం’, ‘కొంటె కిష్టయ్య’ అనే ఆ 3 చిత్రాలలోనూ పిల్లలే నటులు. అంతా ‘బాలానందసంఘ’ సభ్యులే! నటి, దర్శక, నిర్మాత భానుమతి ‘భక్త ధ్రువ మార్కండేయ’ (1982 నవంబర్ 19) రూపొందించారు. జాతీయ ఉత్తమ నటి–కళాకారిణి శోభన (చిరంజీవి ‘రుద్రవీణ’ హీరోయిన్)కు ఇదే తొలి తెలుగు చిత్రం. తర్వాత ఎమ్మెస్ రెడ్డి నిర్మాతగా, దర్శకుడు గుణశేఖర్ పూర్తిగా బాలలతోనే ‘రామాయణం’ (1997) తీశారు. రాముడిగా నేటి హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆ చిత్రం జాతీయ అవార్డు గెలిచింది. తర్వాత పెద్ద ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘దానవీరశూర కర్ణ’ (1977) స్ఫూర్తితో, అదే కథ – అదే టైటిల్‌తో 2015 ఆగస్టు 15న ఓ బాలల చిత్రం వచ్చింది. జయాపజయాలెలా ఉన్నా ఇలా మొత్తం బాలనటులతోనే కష్టించి సినిమా తీసిన ఈ ప్రయత్నాలు అభినందనీయం! – రెంటాల జయదేవ -
బాధితుడి భార్యనూ బలవంతంగా తీసుకెళ్లిన వైనం
తిరుపతి మంగళం: మానవత్వం మరచి ఎనిమిదేళ్లుగా గిరిజన బాలికలతో వెట్టిచాకిరీ చేయించాడు ఓ కసాయి. నలుగురు నిరుపేద బాలికల స్వేదాన్ని పీల్చిపిప్పి చేసి చిత్రహింసలకు గురిచేశాడు. బాలల దినోత్సవం రోజున వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. తిరుపతిలో బుధవారం గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు బి.వెంకట్రమణనాయక్ బాధిత బాలికల గురించి విలేకరులకు వివరించారు. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం యానాది కాలనీలో నివసిస్తున్న మేకల చెంచయ్యకు నలుగురు కుమార్తెలున్నారు. రామచంద్రాపురం మండలం రాయల చెరువుపేటకు చెందిన ఎం.తిరుమలరెడ్డి వద్ద 10 సంవత్సరాల క్రితం చెంచయ్య రూ.20 వేలు అప్పుగా తీసుకుని, తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో చెంచయ్య కుమార్తెలు మమత (21), కన్యాకుమారి (19) లను తిరుమలరెడ్డి తన ఇంట్లో, బంధువుల ఇంట్లో 8 సంవత్సరాలుగా వెట్టిచాకిరి చేయిస్తున్నాడు. తర్వాత మూడో కుమార్తె (16)ను రాయచోటిలో, నాలుగో కుమార్తె (13)ను హైదరాబాద్‌లోని తన బావమరిది ఇంట్లో పనుల చేయించేందుకు తిరుమలరెడ్డి పంపించాడు. వేధింపులు తాళలేక పారిపోయి వచ్చిన బాలికలు అప్పు చెల్లించలేదంటూ తన నలుగురు కూతురులను చిత్రహింసలకు గురిచేస్తున్నారని చెంచయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. చిత్ర హింసలు భరించలేక వినాయక చవితి సందర్భంగా పారిపోయి తమ వద్దకు వచ్చేశారని తెలిపాడు. దీంతో ఇంటిపైకి వచ్చిన తిరుమలరెడ్డి తన భార్య మెగిలమ్మను బలవంతంగా వెట్టిచాకిరీ కోసం తీసుకెళ్లారని చెంచయ్య వాపోయారు. అప్పు చెల్లించాలని, లేదా కుమార్తెలను పనులకు పంపాలని తిరుమలరెడ్డి తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో గత్యంతరం లేక మీడియా ముందుకు వచ్చానని తెలిపాడు. ప్రాణహాని ఉండటంతో పిల్లలను తిరుపతి ఎస్పీకి అప్పగిస్తున్నట్లు వెల్లడించాడు. తిరుమలరెడ్డి నుంచి తమకు విముక్తి కల్పించాలని వేడుకున్నాడు. అలాగే నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెంచయ్య విజ్ఞప్తి చేశాడు. సమావేశంలో ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర నాయక్, కె.మోహన్, హరిశివప్ప, బి.వెంకటరమణ, ఎ.కళావతి, వసంతమ్మ తదితరులు పాల్గొన్నారు.