చదువులతో పాటు జీవన నైపుణ్యాలు
విభిన్న రంగాల్లో రాణింపు
క్రీడలు, కళల్లో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు
చి్రల్డన్స్ డే నేపథ్యంలో వండర్ కిడ్స్ అభిప్రాయాలు
బాల్యం అనేది ప్రతీ ఒక్కరి జీవితానికి భవిష్యత్ పాఠశాల. చిన్నారులు ఎదిగే క్రమంలో వారి ఆలోచనలపై చూపించే ప్రభావమే వారి జీవిత గమ్యాలను నిర్దేశిస్తాయి. పిల్లల చిన్నప్పటి అభిరుచులే వారి లక్ష్యాలుగా మార్పు చెందుతాయి. ఈ ప్రయాణంలో కొందరు చిన్నారులు చదువులపై ఆసక్తి కనబరిస్తే మరి కొందరు సంగీతం, క్రీడలు, డాన్స్, పెయింటింగ్, సాహస కృత్యాలు ఇలా తదితర అంశాలపై మక్కువ చూపుతుంటారు. ఒకవైపు వారి చదువులను కొనసాగిస్తూనే ఇలాంటి ఎక్స్‌ట్రా కరిక్యులం యాక్టివిటీస్‌లో రాణిస్తుంటారు. పసిప్రాయంలోనే ఇలాంటి విభిన్న రంగాల్లో అత్యుత్తమ నైపుణ్యాలతో రాణించిన కొందరు చిన్నారులను చిల్డ్రన్స్ డే సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. బాల్యం నుంచే తమకంటూ కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకుని అటు చదువులను ఇటు వారి ప్రయత్నాలను కొనసాగిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న బాలతారల ఆలోచనలను తడిమి చూద్దామా..?
చిన్న వయసులో..
పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతకు అచ్చు గుద్దినట్టు ఈ పాప సరిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే 9 ఏళ్ల వయసులోనే తన కంటే నాలుగేళ్లు పెద్ద వాళ్లతో తలపడి, గెలుపొంది ఔరా అనిపించుకుంటోంది. బ్యాడ్మింటన్ ఆటలో అద్భుతాలు సృష్టిస్తోంది లట్టాల శాన్వి. నగరంలోని మణికొండకు చెందిన శాని్వకి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న శాని్వ.. ఆటపై పూర్తిగా ఫోకస్ పెట్టేందుకు చదువు కూడా మానేసింది. రోజులో కనీసం 8 గంటల పాటు ఆటపైనే శ్రద్ధ పెడుతూ ప్రాక్టీస్ చేస్తోంది. ఒలంపిక్స్‌లో దేశం తరఫున ఆడి బంగారు పతకాన్ని సాధించడమే తన జీవిత లక్ష్యమని చెబుతోంది. ఇటీవల అసోంలో జరిగిన జాతీయస్థాయి అండర్–13 ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో సింగిల్స్, డబుల్స్ విభాగంలో మెయిన్ డ్రాకు అర్హత పొంది సంచలనం సృష్టించింది.
హైదరాబాద్‌నునంబర్ వన్ స్థానంలో..
అతి సాధారణ కుటుంబం మాది. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. మేము ఏది చేసినా మా కుటుంబానికి గుర్తింపు రావాలి. మా అమ్మా నాన్నలకు మంచి పేరు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నగరంలోని యాచ్ క్లబ్ ఆధ్వర్యంలో సుహేమ్ షేక్ అందిస్తున్న సహకారంతో ఈ సెయిలింగ్‌లో రాణించాను. వైఎఐ నార్త్ ఈస్ట్ రేగట్ట 2023 ఆప్టిమిస్టిక్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాను. వైఎఐ సికింద్రాబాద్ యూత్ క్లబ్ రేగట్ట 2023లో సిల్వర్ పతకం సాధించాను. వైఏఐ యూత్ నేషనల్‌లో ఆప్టిమిస్టిక్ విభాగంలో కాంస్యం గెలుపొందాను. మా ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ను నంబర్ వన్ స్థానంలో తీసుకువచ్చారు. నాతోపాటు నా సహోదరి కూడా సేలింగ్లోనే జాతీయ స్థాయిలో పలు పతకాలను సాధించింది.
– లహరి, జాతీయస్థాయి సెయిలర్
టీం ఇండియాకు ఆడటమే..
క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం.. ప్రస్తుతం నేను హిమాయత్‌నగర్‌లోని స్లేట్ ది స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాను. బాగ్‌లింగంపల్లిలోని స్పాట్ లైట్ అకాడమీలో క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. ఈ మధ్యనే స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అండర్–17 విభాగంలో ఎంపికయ్యాను. ఇండియన్ క్రికెట్ టీమ్‌కు ఆడటమే లక్ష్యంగా క్రికెట్‌లో రాణిస్తున్నాను. సిటీలో జరిగిన పలు టోర్నమెంట్‌లలో మంచి స్కోర్ సాధించాను. అందరిలా కాకుండా విభిన్న క్రీడల్లో రాణించడానికి నాన్న అందించే ప్రోత్సాహం మాటల్లో చెప్పలేను. ఇటు చదువులు, అటు క్రికెట్‌లో సమస్వయం చేసుకుంటూ ముందుకు సాగడానికి నాన్న విశేషంగా కృషి చేస్తున్నాడు.
– వరీష
సలార్ సినిమాతో గుర్తింపు..
ప్రతి విషయాన్ని వినూత్నంగా ఆలోచించడం నాకిష్టం. చిన్నప్పటి నుంచి విభిన్న కళల్లో ఆసక్తి కనబర్చేవాడిని. అనంతరం సినిమాలు, నటనపై మక్కువ పెరిగింది. ఏ చిన్న ఆడిషన్స్ ఉన్నా వెళ్లేవాడిని. ఈ ప్రయత్నంలో పలు మంచి ప్రాజెక్టుల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించే అవకాశం వచి్చంది. ప్రముఖ సినీ హీరో అజిత్, త్రిష నటించిన గుడ్, బాడ్, అగ్లీ సినిమా, ప్రభాస్ సలార్ వంటి సినిమాలు మంచి గుర్తింపునిచ్చాయి. మరికొద్ది రోజుల్లో రానున్న వరుణ్ తేజ్ సినిమా మట్కాలో మంచి రోల్ చేస్తున్నారు. అంతేగాకుండా జగపతిబాబు తదితర టాలీవుడ్ స్టార్స్‌తో మరికొన్ని ప్రాజెక్ట్‌లు చేస్తున్నాను. సినిమాలతో పాటు చదువులోనూ రాణిస్తున్నాను. సినిమాల ప్రభావం నా చదువులపై పడకుండా చూసుకుంటున్నాను. భవిష్యత్తులో వైవిధ్యమైన క్యారెక్టర్లు చేసే మంచి హీరోగా రాణించాలని ఉంది.
– కార్తికేయ దేవ్, ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్
హ్యాపీగా.. సాగుతున్న కెరీర్
ఓరి దేవుడా, సలార్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో చైల్డ్ ఆరి్టస్ట్‌గా నటించాను. ప్రభాస్ వంటి ప్యాన్ ఇండియన్ స్టార్‌తో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలతో పాటు చదువు, క్రీడల్లోనూ ముందంజలో ఉన్నాను. సినిమాలతో మొదలై కెరీర్ హ్యాపీగా ముందు సాగుతోంది. సామాజిక బాధ్యతలను ప్రతిబింబించేలా, చిన్నారుల హక్కులను తెలియజేసేలా మంచి ప్రాజెక్టులను చేసే యోచనలో ఉన్నాను. ప్రస్తుతం మరో రెండు పెద్ద ప్రాజెక్టుల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాను. మ్యాథ్స్ ఇంగ్లిష్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. అంతేగాకుండా సంగీతంపైన కూడా ఆసక్తి. నేను పాటలు చాలా బాగా పాడగలను.
– ఫర్జానా, చైల్డ్ ఆర్టిస్ట్
Comments
Please login to add a commentAdd a comment