వంట గది చప్పుళ్లు... టీవీ సౌండు... తల్లిదండ్రుల కబుర్లు, వాదనలు,... చిన్న తమ్ముడో, చెల్లెలో మధ్యలో దూరి ఆటలు... ‘మంచి మార్కులు తేవాలి’ అంటారు గాని చదివేందుకు మంచి చోటును చూపిస్తున్నారా? సంక్రాంతి దాటితే పిల్లలందరూ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి.ఇంట్లో మీ పిల్లలు చదివే చోటును చూడండి.వారు శ్రద్ధగా చదువుకునేలా ఆ చోటును ఎలా ఏర్పాటు చేయాలో నిపుణుల మాట వినండి.
ఇల్లు సర్దుకుంటే ఇల్లు ఎంత విశాలమో అర్థమవుతుంది. చిన్న ఇల్లయినా పెద్ద ఇల్లయినా సర్దుకోవడంలోనే స్థలం బయట పడుతుంది. ముంబై వాసులు అతి చిన్న ఇంటిలో కూడా అన్నీ అందంగా అమర్చుకుంటారు. కాని మనకు ఎంత విశాలమైన ఇల్లు ఉన్నా అవసరం లేని సామాను, వాడని సామాను, పారేయని సామాను ఉంచుకుని పిల్లల చదువుకు, పుస్తకాలు పెట్టుకోవడానికి కూడా స్థలం లేనట్టుగా తయారు చేస్తాం. మళ్లీ వాళ్లు బాగా చదవాలని డిమాండ్ చేస్తాం. శుభ్రమైన చోటు చదువు తలకెక్కే చోటు అలాంటి చోటును మీ ఇంట్లో మీ పిల్లలకు చదువు కోసం కేటాయిస్తున్నారా?
అబ్రహం లింకన్ వీధి దీపాల కింద చదివాడు. ఎనభైల నాటి పిల్లలు డాబాల మీద లైట్లు లాగి చదివారు. కాని ఇప్పటి పిల్లలు అలా చదవడం లేదు. ఇంటిలోనే నిశ్శబ్దంగా చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇంట్లో వాళ్లకు యోగ్యమైన చోటును ఏర్పాటు చేయాలి. కామన్ ఏరియాకు సంబంధం లేకుండా ఎవరైనా ఇంటికి వచ్చి వెళుతున్నా కన్ను పడని చోటు ఇంటిలో చదువుకునే పిల్లలకు ఇవ్వాలి. ఆ చోటును పూర్తిగా శుభ్రంగా ఉంచాలి. పిల్లలు కంప్యూటర్‌లో ప్రశ్నాపత్రాలు చూసి చదువుకుంటున్నారు. వారికి డెస్క్‌టాప్ లేదా లాప్‌టాప్ ఏర్పాటు చేయలేకపోతే కనీసం ఫోన్‌లో అన్నా తగినంత డేటా వేయించి ఇవ్వాలి.
పిల్లలు చదివి అలసి పడుకోవాలంటే ఆ దాపునే బెడ్ ఉంటే మరీ మేలు. అది వాలగానే నిద్రపోయేలా తప్పక శుభ్రంగా సౌకర్యంగా ఉండాలి. కష్టపడి చదివి నిద్ర పట్టక ఇబ్బంది పడితే చదివింది నిద్ర లేమి వల్ల వృధా అవుతుంది.
పిల్లలు చదువుతున్నప్పుడు వారి మానసిక ఆరోగ్యం బాగుండాలి. ఇంట్లో తగాదాలు పూర్తిగా బంద్ చేయాలి. తల్లిదండ్రులు మంచి మూడ్‌లో కనిపిస్తూ పిల్లలతో స్నేహంగా మాట్లాడాలి. వారికి ఇష్టమైన పదార్థాలు అందుబాటులో ఉంచాలి. బయట తిండి కాకుండా ఇంటి తిండి ఇవ్వాలి.
∙పిల్లలు చదువుకునే సమయంలో దగ్గర కూచుని అప్పుడప్పుడు పలకరిస్తూ ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ ఉంటే వాళ్లూ ఆ ప్రెజెన్స్ ఇష్టపడతారు. అయితే రోజూ నువ్వు 99 పర్సెంట్ తేవాలి... టాపర్‌గా నిలవాలి అనే మాటలు ఎత్తి స్ట్రెస్ క్రియేట్ చేయకూడదు. న్యాయంగా ఎంత కష్టపడాలో అంత కష్టపడమని మాత్రమే చెప్పాలి.
∙గంటకోసారన్నా చదివే చోట నుంచి లేచి కాస్త అటూ ఇటూ నడిచేలాగా, నీరు తాగేలా, బాల్కనీలోనో కారిడార్‌లోనో కాస్త గాలి పీల్చేలా చూడాలి.
∙
Comments
Please login to add a commentAdd a comment