Sakshi Little Stars
-
వీడియో గేమ్స్ చరిత్ర తెలుసా?
పిల్లలూ! వీడియో గేమ్స్ ఆడటమంటే మీకు చాలా ఇష్టమా? సెలవుల్లో ఇంట్లో కూర్చుని గంటల తరబడి ఆడుతుంటారా? మరి వాటి చరిత్రేమిటో తెలుసుకుందామా?వీడియో గేమ్స్ పుట్టి దాదాపు 66 ఏళ్లు దాటుతోంది. 1958లో విలియం ఆల్ఫ్రెడ్ హిగిన్ బోతమ్ అనే అమెరిన్ భౌతిక శాస్త్రవేత ‘టెన్నిస్ ఫర్ టూ’ అనే వీడియోగేమ్ తయారు చేశారు. 1960 తర్వాత కంప్యూటర్ల వాడకం పెరుగుతున్న సమయంలో కంప్యూటర్ శాస్త్రవేత్తలు గ్రాఫిక్స్ ఆధారంగా గేమ్స్ తయారు చేశారు. అనంతరం 1962లో అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు ‘స్టార్‌వార్’ అనే వీడియో గేమ్ తయారు చేశారు. ఆ తర్వాత 1970లో ఇళ్లల్లో వీడియో గేమ్స్ ఆడుకునేందుకు గేమ్ కన్సోల్‌ని తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ వీడియో గేమ్స్ అమెరికా అంతటా ప్రాచుర్యం పొందాయి. ఆ తర్వాత మరికొన్ని కంపెనీలు సైతం కొత్తగా వీడియోగేమ్స్ తయారు చేశాయి.వీడియో గేమ్స్ ప్రధానంగా పిల్లల కోసమే తయారు చేసినా పెద్దలు కూడా వీటిని ఇష్టపడుతున్నారని కంపెనీలు గుర్తించాయి. మరిన్ని కొత్త గేమ్స్‌ని అందుబాటులోకి తెచ్చాయి. ఒకానొక దశలో చాలా గేమ్స్‌కి కాపీలు, పైరసీ వెర్షన్లు వచ్చేశాయి. దీంతో జనానికి నాణ్యమైన గేమ్స్ అందుబాటులో లేకుండా ΄ోయాయి. 1983 నుంచి 1985 మధ్యలో అమెరికాలోని వీడియో గేమ్స్ తయారీ సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఆ తర్వాత వీడియో గేమ్స్ మార్కెట్లోకి జ΄ాన్ దూసుకొచ్చింది. కొత్త కొత్త గేమ్స్‌ని అందుబాటులోకి తెస్తూ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఏర్పడేలా చేసింది. దీంతో సంస్థలు కొత్త టెక్నాలజీ ఉపయోగించి మరిన్ని నాణ్యమైన, క్రియేటివ్ గేమ్స్ తయారు చేయడం మొదలుపెట్టాయి. ఇంటర్నెట్ వాడకం మొదలయ్యాక వీడియోగేమ్స్ మరింతగా అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్స్ వచ్చాక అందరూ సులభంగా వీడియో గేమ్స్ ఆడేస్తున్నారు. వీటికోసం ప్రత్యేకమైన యాప్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీడియో గేమ్స్ మార్కెట్ రూ.1.5 లక్షల కోట్లతో నడుస్తోంది. వేల మంది ఈ రంగంలో పని చేస్తున్నారు. వీడియో గేమ్స్ తయారు చేసేందుకు ప్రత్యేకంగా గేమ్ డిజైనర్లు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా రెండు వేల వీడియో గేమింగ్ స్కూల్స్ ఉన్నాయి. అందులో వీడియో గేమింగ్ తయారీ గురించి నేర్పిస్తారు. వీడియో గేమ్స్‌లో ఎక్కువమంది యాక్షన్, స్పోర్ట్స్, సాహసయాత్రలు వంటివి ఇష్టపడుతుంటారుఅయితే చదువు పక్కన పెట్టి వీడియో గేమ్స్ ఆడటం ఏమాత్రం మంచిది కాదు. గంటల తరబడి ఆడటం కూడా చాలా ప్రమాదకరం. అదొక వ్యసనం అవుతుంది. రాత్రి పగలూ ఆడాలనిపిస్తుంది. భవిష్యత్తుకే ప్రమాదం. కాబట్టి సెలవు రోజుల్లో కొద్దిసేపు మాత్రమే వీడియో గేమ్స్ ఆడండి. సరేనా? -
సాక్షి మీడియా హౌస్ లో..తారే జమీన్ పర్ లిటిల్ స్టార్స్ (ఫొటోలు)
-
చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!
నెల నెలా వచ్చే చందమామ లేదు. బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు లేవు. ఇంట్లో కథలు వినిపించే వారు లేరు. స్కూళ్లలో బుక్ రీడింగ్ అవర్ కనిపించడం లేదు. పిల్లల ఊహను పెంచి ఆలోచనను పంచే బాలసాహిత్యం వారికి అందకపోతే బూస్టు, హార్లిక్సు, ఆర్గానిక్ ఆహారం ఇవి ఏమిచ్చినా ఉపయోగం లేదు. శరీరం ఎదిగే ఆహారంతోపాటు బుద్ధి వికసించే ఆహారం ఇవ్వాలి. అది కథల్లో దొరుకుతుంది. కనీసం డిజిటల్ మీడియాలోని కథలైనా వారికి చేరువ చేయాలి.ఏమిటి, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు వీటిని ‘ప్రశ్నాపంచకం’ అంటారు. ఏ మనిషి జిజ్ఞాస అయిన అడుగంటి΄ోకుండా ఉండాలంటే ఈ ఐదు ప్రశ్నల్ని సజీవంగా ఉంచుకోవాలి. పిల్లలు అనుక్షణం ఈ పంచ ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. గతంలో ప్రశ్నలు అడిగే పిల్లలను తెలివైన వారుగా భావించి మెచ్చుకునేవారు. నేడు ప్రశ్నిస్తే విసుక్కుంటున్నారు. కథ చెప్పమంటే తీరిక లేదంటున్నారు. మారాం చేస్తే సెల్ చేతికిస్తున్నారు. మరీ గొడవ చేస్తే సినిమాకు పంపిస్తున్నారు. కాని వారి చేత కథ చదివించడం లేదు. దాని వల్ల పిల్లల్లో ప్రశ్నించే కుతూహలం చచ్చి΄ోతుంది. కుతూహలం లేని బాలబాలికలు బాధ్యతాయుతులైన పౌరులుగా వికసించలేరు. కనుక ఇది అంతిమంగా సమాజానికే నష్టం.అసలు మన సమాజంలో పిల్లలను గౌరవించడం ఉందా? వారి ఎదుగుదల గురించి చింత ఉందా?వారికి ఎలాంటి జ్ఞానం అందుతోందన్న ఆలోచన ఉందా? ఆలోచించడం, ప్రశ్నలు వేసుకోవడం, ప్రశ్నించడం, జవాబులు వెదుక్కోవడం, సమాధానాలు సృష్టించుకోవడం ఇవన్నీ పిల్లలు నిరంతరం చేయాలంటే పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవడం ఎంత చిన్నవయసులో అలవడితే అంత త్వరగా వాళ్ళు స్వతంత్రులవుతారు. అయితే మన దగ్గర బాలసాహిత్యంగా చలామణి అయ్యేది పూర్తిగా బాల సాహిత్యం కాదు. పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టుగా శాస్త్రీయంగా ఫలానా వయసు వారు ఫలానా స్థాయి పుస్తకాలు చదవాలని వాటిని రాసి, ప్రచురించరు. ఉన్నవల్లా ఏవో కొన్ని కథలే. అయితే అవన్నా వారు చదవకుండా బాలల పత్రికలన్నీ మూతపడటం విషాదం. ఇళ్లల్లో పెద్దలు కథలు వినిపించే ఆనవాయితీ ΄ోవడం మరో విషాదం. అందుకే కనీసం పిల్లలు అలవాటు పడ్డ సెల్‌ఫోన్ ద్వారా అయినా వారికి కథలు అలవాటు చేయాలి. ఇంటర్నెట్లో పిల్లల కోసం సైట్లు, యాప్‌లు, యూట్యూబ్ చానెళ్లు ఉన్నాయి. కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ కూడా పిల్లల కోసం నిర్వహించేవి, పిల్లలకే ప్రధాన భూమికను పోషించేవిగా ఉన్నాయి. వాటిలో https://manchipustakam.inని చూడటం పిల్లలకు అలవాటు చేయాలి. ఇక్కడ మంచి బాలల పుస్తకాలు ఉంటాయి. అలాగే ttps://storyweaver.org.in/పిల్లల ఉచిత ఆన్లైన్ పుస్తకాలతోపాటు రాయడం, చదవడం, అనువదించడం పట్ల ఆసక్తి వున్న వారికి సహకరించే వేదిక. యూట్యూబ్‌లో పిల్లల కథల వీడియోలు చాలానే వున్నాయి. Geethanjali Kids&Telugu అనే యూట్యూబ్ చానల్లో 375 వీడియోలు వున్నాయి. MintuTelugu Rhymes అనే యూట్యూబ్ చానల్లో 178 కథల వీడియోలు దొరుకుతాయి. ‘పిల్లల కంటెంట్’ అనే ప్రత్యేకమైన ఆప్షన్ కూడా యూట్యూబ్ లో వుంది. పిల్లలు తమ తమ ఊహలకు కొంత సాంకేతికతను జోడిస్తే అద్భుతమైన కథల వీడియోలతో వారే ఒక చానెల్ నిర్వహించవచ్చు. ఇప్పుడు ఏఐ టూల్స్ కూడా అందుబాటులోకి రావడంతో రకరకాల యానిమేషన్ థీమ్స్‌తో కథలను క్రియేట్ చేసేందుకు పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అలాంటి వీడియోలు యూట్యూబ్‌లో చాలానే వున్నాయి. వీడియోలు ఎలా క్రియేట్ చేయాలో తెలిపే ట్యుటోరియల్స్ కూడా వున్నాయి. ఎవరు ఏ అంశంపై వీడియోలు చేయాలన్నా, వినాలన్నా, నేర్చుకోవాలన్నాం. యూట్యూబ్‌లోని సెర్చ్ ఆప్షన్ ద్వారా వాటిని పొందవచ్చు. పల్లెలకు చేరుతున్న కథలుసెల్ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయ్యాక నేను బాలల కథల వ్యాప్తికి దానినే సాధనంగా మలచుకున్నాను. మొదట అడుగు పెట్టింది ఫేస్బుక్లో. ఆ తరువాత వాట్సప్, ప్రతి లిపి, కహానియా.కాం, టెలిగ్రాం, ఇన్స్టాగ్రాం, డైలీహంట్, షేర్ చాట్, కూ, బ్లూపాడ్, స్టోరీ మిర్రర్.. ఇలా ప్రతిదానిలో బాలసాహిత్యాన్ని వాటి నిబంధనల మేరకు పోస్ట్ చేస్తుంటాను. ఈ మధ్య కోరాలో కొత్తగా అడుగుపెట్టాను. అంతేగాక కథలు, గేయాలు, బొమ్మలతో సామెతలు, పొడుపు కథలు సింగల్ పేజీలుగా మార్చి అందమైన బొమ్మలతో ఆకర్షణీయంగా తయారు చేస్తుంటాను. వీటిని ఆర్కైవ్స్‌లో కూడా అప్లోడ్ చేశాను. కథలు రాయడం ఎంత ముఖ్యమో వాటిని పాఠకులకు చేర్చడం కూడా అంతే ముఖ్యం. అందుకే రోజూ కొంత సమయం వీటికోసం కేటాయిస్తా. మారుతున్న కాలానికి తగినట్లుగా మనమూ మారక తప్పదు. నిజానికి సామాజిక మాధ్యమాల వల్లనే కొత్త పాఠకులు విపరీతంగా పెరిగారు. నగరాలను దాటి పల్లెలకు కూడా సాహిత్యాన్ని చేర్చగలుగుతున్నా. పుస్తకాల అమ్మకాలు కూడా వీటివల్ల విపరీతంగా పెరిగాయి. అడిగి మరీ కొంటున్నారు. ‘హరి కథలు కర్నూల్’ అనే పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించి కథలను అక్కడ స్వయంగా చెప్పి పోస్ట్ చేస్తున్నాను. ఇవి కాకుండా ‘వంద రోజులు – వంద కథలు’ వాట్సాప్ గ్రూప్‌లో కథలు పోస్ట్ చేస్తుంటాను. ఇప్పుడు ఇందులో 38 వేల మంది సభ్యులు ఉన్నారు. – డా. ఎం.హరికిషన్, బాలల రచయిత (చదవండి: బాలల దినోత్సవం స్పెషల్: నెహ్రూ హైదరాబాద్‌లో ఎక్కడ అల్పాహారం తినేవారో తెలుసా..!) -
బాల్యమొక స్ఫూర్తి
బాల్యం అనేది ప్రతీ ఒక్కరి జీవితానికి భవిష్యత్ పాఠశాల. చిన్నారులు ఎదిగే క్రమంలో వారి ఆలోచనలపై చూపించే ప్రభావమే వారి జీవిత గమ్యాలను నిర్దేశిస్తాయి. పిల్లల చిన్నప్పటి అభిరుచులే వారి లక్ష్యాలుగా మార్పు చెందుతాయి. ఈ ప్రయాణంలో కొందరు చిన్నారులు చదువులపై ఆసక్తి కనబరిస్తే మరి కొందరు సంగీతం, క్రీడలు, డాన్స్, పెయింటింగ్, సాహస కృత్యాలు ఇలా తదితర అంశాలపై మక్కువ చూపుతుంటారు. ఒకవైపు వారి చదువులను కొనసాగిస్తూనే ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్‌లో రాణిస్తుంటారు. పసిప్రాయంలోనే ఇలాంటి విభిన్న రంగాల్లో అత్యుత్తమ నైపుణ్యాలతో రాణించిన కొందరు చిన్నారులను చిల్డ్రన్స్ డే సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. బాల్యం నుంచే తమకంటూ కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకుని అటు చదువులను ఇటు వారి ప్రయత్నాలను కొనసాగిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న బాలతారల ఆలోచనలను తడిమి చూద్దామా..? చిన్న వయసులో..పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతకు అచ్చు గుద్దినట్టు ఈ పాప సరిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే 9 ఏళ్ల వయసులోనే తన కంటే నాలుగేళ్లు పెద్ద వాళ్లతో తలపడి, గెలుపొంది ఔరా అనిపించుకుంటోంది. బ్యాడ్మింటన్ ఆటలో అద్భుతాలు సృష్టిస్తోంది లట్టాల శాన్వి. నగరంలోని మణికొండకు చెందిన శాని్వకి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న శాని్వ.. ఆటపై పూర్తిగా ఫోకస్ పెట్టేందుకు చదువు కూడా మానేసింది. రోజులో కనీసం 8 గంటల పాటు ఆటపైనే శ్రద్ధ పెడుతూ ప్రాక్టీస్ చేస్తోంది. ఒలంపిక్స్‌లో దేశం తరఫున ఆడి బంగారు పతకాన్ని సాధించడమే తన జీవిత లక్ష్యమని చెబుతోంది. ఇటీవల అసోంలో జరిగిన జాతీయస్థాయి అండర్–13 ర్యాంకింగ్ టోర్నమెంట్లో సింగిల్స్, డబుల్స్ విభాగంలో మెయిన్ డ్రాకు అర్హత పొంది సంచలనం సృష్టించింది.హైదరాబాద్నునంబర్ వన్ స్థానంలో.. అతి సాధారణ కుటుంబం మాది. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. మేము ఏది చేసినా మా కుటుంబానికి గుర్తింపు రావాలి. మా అమ్మా నాన్నలకు మంచి పేరు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నగరంలోని యాచ్ క్లబ్ ఆధ్వర్యంలో సుహేమ్ షేక్ అందిస్తున్న సహకారంతో ఈ సెయిలింగ్‌లో రాణించాను. వైఎఐ నార్త్ ఈస్ట్ రేగట్ట 2023 ఆప్టిమిస్టిక్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాను. వైఎఐ సికింద్రాబాద్ యూత్ క్లబ్ రేగట్ట 2023లో సిల్వర్ పతకం సాధించాను. వైఏఐ యూత్ నేషనల్లో ఆప్టిమిస్టిక్ విభాగంలో కాంస్యం గెలుపొందాను. మా ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ను నంబర్ వన్ స్థానంలో తీసుకువచ్చారు. నాతోపాటు నా సహోదరి కూడా సేలింగ్లోనే జాతీయ స్థాయిలో పలు పతకాలను సాధించింది. – లహరి, జాతీయస్థాయి సెయిలర్టీం ఇండియాకు ఆడటమే..క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం.. ప్రస్తుతం నేను హిమాయత్‌నగర్‌లోని స్లేట్ ది స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. బాగ్‌లింగంపల్లిలోని స్పాట్ లైట్ అకాడమీలో క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్నాను. ఈ మధ్యనే స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అండర్–17 విభాగంలో ఎంపికయ్యాను. ఇండియన్ క్రికెట్ టీమ్‌కు ఆడటమే లక్ష్యంగా క్రికెట్లో రాణిస్తున్నాను. సిటీలో జరిగిన పలు టోర్నమెంట్లలో మంచి స్కోర్ సాధించాను. అందరిలా కాకుండా విభిన్న క్రీడల్లో రాణించడానికి నాన్న అందించే ప్రోత్సాహం మాటల్లో చెప్పలేను. ఇటు చదువులు, అటు క్రికెట్లో సమస్వయం చేసుకుంటూ ముందుకు సాగడానికి నాన్న విశేషంగా కృషి చేస్తున్నాడు. – వరీష సలార్ సినిమాతో గుర్తింపు.. ప్రతి విషయాన్ని వినూత్నంగా ఆలోచించడం నాకిష్టం. చిన్నప్పటి నుంచి విభిన్న కళల్లో ఆసక్తి కనబర్చేవాడిని. అనంతరం సినిమాలు, నటనపై మక్కువ పెరిగింది. ఏ చిన్న ఆడిషన్స్ ఉన్నా వెళ్లేవాడిని. ఈ ప్రయత్నంలో పలు మంచి ప్రాజెక్టుల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించే అవకాశం వచి్చంది. ప్రముఖ సినీ హీరో అజిత్, త్రిష నటించిన గుడ్, బాడ్, అగ్లీ సినిమా, ప్రభాస్ సలార్ వంటి సినిమాలు మంచి గుర్తింపునిచ్చాయి. మరికొద్ది రోజుల్లో రానున్న వరుణ్ తేజ్ సినిమా మట్కాలో మంచి రోల్ చేస్తున్నారు. అంతేగాకుండా జగపతిబాబు తదితర టాలీవుడ్ స్టార్స్‌తో మరికొన్ని ప్రాజెక్ట్‌లు చేస్తున్నాను. సినిమాలతో పాటు చదువులోనూ రాణిస్తున్నాను. సినిమాల ప్రభావం నా చదువులపై పడకుండా చూసుకుంటున్నాను. భవిష్యత్తులో వైవిధ్యమైన క్యారెక్టర్లు చేసే మంచి హీరోగా రాణించాలని ఉంది. – కార్తికేయ దేవ్, ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్హ్యాపీగా.. సాగుతున్న కెరీర్ ఓరి దేవుడా, సలార్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో చైల్డ్ ఆరి్టస్ట్‌గా నటించాను. ప్రభాస్ వంటి ప్యాన్ ఇండియన్ స్టార్‌తో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలతో పాటు చదువు, క్రీడల్లోనూ ముందంజలో ఉన్నాను. సినిమాలతో మొదలై కెరీర్ హ్యాపీగా ముందు సాగుతోంది. సామాజిక బాధ్యతలను ప్రతిబింబించేలా, చిన్నారుల హక్కులను తెలియజేసేలా మంచి ప్రాజెక్టులను చేసే యోచనలో ఉన్నాను. ప్రస్తుతం మరో రెండు పెద్ద ప్రాజెక్టుల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాను. మ్యాథ్స్ ఇంగ్లిష్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. అంతేగాకుండా సంగీతంపైన కూడా ఆసక్తి. నేను పాటలు చాలా బాగా పాడగలను. – ఫర్జానా, చైల్డ్ ఆర్టిస్ట్ -
Sakshi Little Stars: తారే జమీన్ పర్
‘మేం పాటలు పాడతాం. డైలాగ్స్ గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తాం. పొడుపుకథలు వేస్తాం, ప్రశ్నలతో తికమక పెట్టేస్తాం. స్కూల్లో చదువుకుంటాం, సినిమాల్లో నటిస్తాం, డ్యాన్స్‌లే కాదు అల్లరి కూడా చేస్తాం ...’ అంటూ బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం ‘సాక్షి’ మీడియా హౌస్ హైదరాబాద్ ఆఫీసులో ఏర్పాటు చేసిన వేదిక ద్వారా పలువురు బాల తారలు తమ ఆనందాలను పంచుకున్నారు. స్కూల్ విద్యార్థులు అడిగిన పొడుపు కథలకు ఈ ‘లిటిల్ స్టార్స్’ ఆన్సర్ చేయడం, లిటిల్ స్టార్స్ కోరిన పాటలను స్కూల్ విద్యార్థులు పోటీ పడుతూ పాడటంతో కార్యక్రమం సందడిగా మారింది.స్కూల్లో రన్నింగ్, ఖోఖో, కబడ్డి, క్రికెట్, బాస్కెట్ బాల్... వంటి ఆటలన్నీ ఆడతాం అంటూ మొదలు పెట్టిన పిల్లలు కరెంట్ షాక్ ఎందుకు తగులుతుంది? బాల్ని కొడితే ముందుకు ఎలా వెళుతుంది? అంటూ సైన్స్ పాఠాలనూ వినిపించారు. లెక్కలు ఇష్టం అంటూనే డాక్టర్లం అవుతాం అనే భవిష్యత్తు ప్రణాళికలనూ చెప్పారు. సోషల్ మీడియాలో తమకున్న ఫాలోవర్స్ గురించి, చేస్తున్న రీల్స్ గురించి వివరించారు. ‘సాక్షి’ మీడియా హౌస్ వారం రోజుల పాటు జరిపిన ‘లిటిల్ స్టార్స్’ కార్యక్రమంలో భాగంగా కలిసిన చిన్నారులను గుర్తుకు తెచ్చుకొని, ‘మరో ప్రపంచం తెలుసుకున్నాం’ అంటూ తమ స్పందనను తెలియజేశారు బాల తారలు. టీవీ చానల్‌కి సంబంధించిన న్యూస్‌రూమ్, పీసీఆర్ వంటి వాటిని చూసి సంభ్రమాశ్చర్యాలను వెలిబుచ్చారు.మేమిద్దరం కవలలం. కలిసే చదువుకుంటాం. సినిమాల్లోనూ కలిసే వర్క్ చేస్తాం. మేం ఇద్దరం పెద్దయ్యాక సాఫ్ట్వేర్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం. ఈ ్రపోగ్రామ్ ద్వారా మా ఇద్దరి ఆలోచనలను, మా ప్రతిభను షేర్ చేసుకునే అవకాశం లభించింది. ఇక్కడ న్యూస్ ఎలా రెడీ అవుతుందో తెలుసుకొని ఆశ్చర్యపోయాం. ఈ చిల్డ్రన్స్ డే మాకు వెరీ వెరీ స్పెషల్. – అర్జున్, అర్విన్నాకు నటుడిగా గుర్తింపు వచ్చిందంటే మా అమ్మే కారణం. ఇప్పటి వరకు పది సినిమాల్లో బాల నటుడిగా నటించే అవకాశం వచ్చింది. సినిమా చూసిన తరువాత స్కూల్లో ఫ్రెండ్స్ నీ క్యారెక్టర్ సూపర్‌గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. రెండు మూడు పేజీల డైలాగ్‌లు కూడా ఒకేసారి చెప్పగలను. ఈ కార్యక్రమం ద్వారా నేను సినిమాల్లోని డైలాగ్స్ చెప్పే అవకాశం లభించింది. అలాగే, న్యూస్ ఎలా రెడీ అవుతుందో తెలుసుకున్నాను. ఈ పోగ్రామ్ మాకు పాఠంలా కొత్తదనాన్ని పరిచయం చేసింది. థాంక్యూ సాక్షి.– కె. హర్షచదవండి: చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!ఏడేళ్ల వయసు నుంచి సినిమాలలో నటిస్తున్నాను. చదువు, సినిమాలతో పాటు బాస్కెట్ బాల్, క్రికెట్, డ్యాన్స్ కూడా చాలా ఇష్టం. స్కూల్, సినిమా షూటింగే కాదు ‘సాక్షి’ ఏర్పాటు చేసిన ‘లిటిల్‌స్టార్స్’లో భాగంగా నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలను కలిసినప్పుడు చాలా బాధపడ్డాను. తలస్సేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలను చూసి, అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాను. అలాగే ఈ ఫైనల్ ఈవెంట్లో ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలోని డైలాగ్ చెప్పినప్పుడు అందరూ గ్రేట్ అంటూ మెచ్చుకుంటే చాలా ఆనందంగా అనిపించింది. మమ్మల్ని ఎంకరేజ్ చేసే ఈ ్రపోగ్రామ్ చాలా బాగుంది. అందరికీ థ్యాంక్స్. – మోక్షజ్ఞతలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను కలవడానికి ‘సాక్షి’ మీడియా ద్వారా వెళ్లాను. చిన్న చిన్న పిల్లలు ఆ వ్యాధితో బాధపడుతుండటం చూసి, చాలా బాధగా ఫీలయ్యాను. కాసేపు వాళ్ల బాధని మరచిపోయేలా చేయాలని వాళ్లు అడిగిన డైలాగ్స్ చెప్పాను. వాళ్లను ఎంకరేజ్ చేసేలా మాట్లాడాను. మామూలుగా నేను చదువుకుంటాను, సినిమాలు చేస్తుంటాను. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాను. అలాంటి నాకు ఇలాంటి పిల్లలతో కాసేపు టైమ్ స్పెండ్ చేయడం ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి వెళ్లినట్లు అనిపించింది. ఇక ‘సాక్షి మీడియా’ హౌస్‌లో ఏర్పాటు చేసిన ‘‘లిటిల్‌స్టార్స్’లో నాతోటి యాక్టర్స్‌తో కలిసి ఎంజాయ్ చేయడం చాలా బాగుంది. – అనన్య ఈగ3చేసే పనిపై ఇష్టం ఉంటుంది కాబట్టి చదువు–సినిమా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటాను. ఈ ్రపోగ్రామ్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ‘స్పర్శ్’ హాస్పిస్ కేంద్రంలో సేవలు పొందుతున్న చిన్నారులను కలిశాం. వారి పరిస్థితి చూశాక చాలా బాధ అనిపించింది. వారి ముఖాల్లో నవ్వులు తెప్పించాలని డ్యాన్స్‌లు చేశాం, పాటలు పాడాం... ఈ ఎక్స్‌పీరియన్స్‌ను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ చిల్డ్రన్స్ డే మాకు సాక్షి ఇచ్చిన ఓ పెద్ద గిఫ్ట్. – సయ్యద్ ఫర్జానారైతు స్వరాజ్య వేదిక ద్వారా అక్కడి పిల్లలను కలిసినప్పుడు వాళ్లు ఎంత కష్టపడుతున్నారో అనిపించింది. వాళ్ల నాన్న చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ బాగా చదువుకుని, అమ్మను బాగా చూసుకుంటాం అని వారు చెప్పినప్పుడు ‘గ్రేట్’ అనిపించింది. అలాగే కలెక్టర్ అవుతామని, డాక్టర్ అవుతామని వాళ్లు తమ భవిష్యత్తు గురించి, తమ ప్లాన్స్ గురించి చెప్పినప్పుడు వారి ధైర్యం చూసి భేష్ అనిపించింది. ఈ కార్యక్రమం ద్వారా ఓ కొత్త ప్రపంచాన్ని చూశాం. – హనీషఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న పిల్లలను చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. తర్వాత వాళ్లను హ్యాపీగా ఉంచాలనిపించింది. అందుకే మాటలు, పాటలతో వారితో కలిసిపోయాను. ఇంటికి వెళ్లాక మా నాన్నతో ఆ విషయాలన్నీ పంచుకున్నాను. ‘సాక్షి మీడియా’ వల్ల వాళ్లను కలిసి, నా వంతుగా కాసేపు వాళ్లని సంతోషపెట్టడానికి ట్రై చేశాను. ఈ చిల్డ్రన్స్ డే నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. – సాన్వికమూడేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నాను. భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నాను. నేను కోపం, బాధ, హ్యాపీ సీన్లలో బాగా నటిస్తాను అని చెబుతారు. ఏడుపు సీన్లలో గ్లిజరిన్ లేకుండా నటించడం చూసి, అందరూ మెచ్చుకున్నారు. టీవీలో అందరి ముందు నా టాలెంట్‌ను ప్రదర్శించే అవకాశం లభించింది. ఇప్పుడు స్వయంగా టీవీ న్యూస్‌రూమ్, స్టూడియో... ఇవన్నీ చూడటం కొత్తగా అనిపించింది. – ఖుషీ రెడ్డిమూడేళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు 25 యాడ్స్, 30 సినిమాల్లో నటించాను. హిందీ మూవీలో కూడా నటించాను. డ్యాన్స్, సంగీతం నేర్చుకుంటున్నాను. బాలరత్న అవార్డు కూడా వచ్చింది. ‘సాక్షి’ మీడియాతో కలిసి రైతు స్వరాజ్య వేదికకి వెళ్లి అక్కడి పిల్లలతో మాట్లాడటం బాగా అనిపించింది. ‘మా నాన్న లేరు’ అని వాళ్లు చెప్పినప్పుడు ఏడుపొచ్చింది. ఇక ఫైనల్ ఈవెంట్లో గోగో (బొమ్మ)తో మాటలు బాగా నచ్చాయి. ఎంత టైమ్ స్పెండ్ చేశామో తెలియనే లేదు. – శ్రేష్ట కోటకేంద్రీయ విద్యాలయాలో చదువుకుంటున్నాను. సినిమాల్లో నటిస్తున్నాను. తబలా వాయిస్తాను. డ్యాన్స్, మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. సీరియల్స్‌లో కూడా నటిస్తున్నాను. ‘బాలోత్సవం’లో నాకు వచ్చిన పాటలు పాడాను. అందరూ సూపర్ అని మెచ్చుకున్నారు. – శ్రేయాన్ కోటఈ కార్యక్రమం ద్వారా తలసేమియాతో బాధపడుతున్నవారిని కలిశాను. వారిని నవ్వించాను కూడా... పాటలు పాడాను, డ్యాన్సులు చేశాను. అలాగే బుధవారం జరిగిన వేడుకలో నాలా సినిమాల్లో నటిస్తున్న మిగతా అన్నయ్యలు, అక్కలను కలుసుకోవడం హ్యాపీగా అనిపించింది. మా ఇష్టాలు, చదువు, ఆటలు, పాటలు, డైలాగ్స్ మీ అందరికీ చెప్పడం.. అన్ని విషయాలను షేర్ చేసుకోవడం బాగుంది. గోగో (బొమ్మ)తో బాగా ఎంజాయ్ చేశాం. – తనస్విఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్లో చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్లని చూడగానే ఫస్ట్ చాలా ఏడుపొచ్చింది. అయితే మేం వాళ్లని హ్యాపీ చేయడానికి వెళ్లాం కాబట్టి, వాళ్లతో జోక్‌గా మాట్లాడాను. వాళ్లు నవ్వడం హ్యాపీ అనిపించింది. అలాగే ‘సాక్షి’ టీవీకి వచ్చి, అందరితో మాకు క్లాసులు చెప్పినవి, మేం సినిమాల్లో చేసినవి షేర్ చేసుకోవడం హ్యాపీ. పెద్దయ్యాక మహేష్‌బాబులాగా పెద్ద హీరోని అవుతాను. ఇక్కడ గోగో (బొమ్మ)తో కలిసి చేసిన అల్లరి బాగుంది. అలాగే, మాకు అన్ని న్యూస్ రూమ్‌లు చూపించారు. చాలా కొత్తగా అనిపించింది. – స్నితిక్చిన్ని మనసులు కదిలిన వేళ...పసి హృదయాలు కదిలిపోయాయి. చిన్న మనసులే అయినప్పటికీ తోటి చిన్నారులు పడుతున్న బాధ చూసి, చలించిపోయాయి. బాలల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ‘సాక్షి’ మీడియా హౌస్ జరిపిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా కేన్సర్, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను, మృత్యువుతో పోరాడుతున్న పసిబాలలకు, తండ్రిని కోల్పోయిన వారిని, అనాథ బాలలను కలిశారు పలువురు బాల తారలు. కాసేపు ఆ చిన్నారులు తమ కష్టాన్ని మరచిపోయేలా చేసి, వారితో ఆడి పాడారు... నవ్వించారు. చివరగా ‘సాక్షి’ మీడియా హౌస్‌లో జరిగిన వేడుకలో స్కూల్ విద్యార్థులతో కలిసి ఈ బాల తారలు సందడి చేశారు. ఈ ‘బాలల దినోత్సవం’ ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.టీవీలో న్యూస్ చదువుతారు కదా.... ఆ రూమ్ ఎలా ఉంటుందో చూస్తారా? ఎడిటింగ్ ఎలా జరుగుతుందో చూడాలని ఉందా? అసలు టీవీ స్టూడియో ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా? అనడమే ఆలస్యం ‘ఓ’ అంటూ ఆసక్తి కనబరిచారు లిటిల్ స్టార్స్. ‘సాక్షి టీవీ’ న్యూస్ రూమ్, పీసీఆర్ (ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్) వంటివి చూసి, ఆశ్చర్యపోయారు. టీవీ స్టూడియోలో జరుగుతున్న పనులను నిశితంగా గమనించారు.ఈ వారమంతా లిటిల్ స్టార్స్ సందడిని సాక్షి యూట్యూబ్‌లో చూడటానికి ఈ QRకోడ్‌ను స్కాన్ చెయ్యండి -
బాలల దినోత్సవం: నెహ్రూ హైదరాబాద్‌లో ఎక్కడ అల్పాహారం తినేవారో తెలుసా..!
మన భాగ్యనగరం, హైదరాబాద్ అనగానే బిర్యానీ, కేఫ్‌లు, వివిధ కమ్మని వంటకాలు ఒక్కసారిగా గుర్తొస్తాయి. అలాంటి హైదరాబాద్‌లో భారత తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ ఓ బేకరీలోని బ్రేక్‌ఫాస్ట్‌ని ఇష్టంగా తినేవారట. ఆయన మెనూలో తప్పనిసరిగా ఆ బేకరీ అల్పాహారం ఉంటుందట. బాలల దినోత్సవం సందర్భంగా పండిట్ నెహ్రూ ఇష్టపడే హైదరాబాద్ బేకరీ, దాని విశేషాలు గురించి చూద్దామా..!మన భారత మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) గారి జన్మదినం రోజున ఈ బాలల దినోత్సవం జరుపుకుంటామనే విషయం మనందరికీ తెలిసిందే. చిన్న పిల్లలంటే నెహ్రూ గారికి ఎంతో ఇష్టం. అందుకే వీలున్నప్పుడల్లా పిల్లలతో గడపడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. నేటి బాలలే రేపటి మన దేశ భవిష్యత్తు అని బలంగా విశ్వసించేవారు. ఆ నేపథ్యంలోనే ప్రత్యేకంగా పిల్లల కోసం చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీని ప్రారంభించారు. పిల్లల అభివృద్ధికి వారి సంక్షేమానికి ఎంతో కృషి చేయడంతో ఆయన పుట్టిన రోజు అయిన నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయన మన భాగ్యనగరంలో మెచ్చిన బేకరీ, దాని కథాకమామీషు ఏంటో చూద్దాం.హైదరాబాద్ బిర్యానీ, హలీమ్‌ల తోపాటు ఉస్మానియా బిస్కెట్లుకు ఫేమస్. ఇక్కడ లాబొనెల్ బేకరీ, కరాచీ బేకరీ వంటి అనేక రకాల బేకరీలు కూడా ప్రసిద్ధిగాంచినవే. వాటిలో మన జవహర్లాల్ నెహ్రూ అల్పాహారంలో భాగమైన బేకరీ బ్రెడ్ ఒకటి ఉంది. అదే సుభాన్ బేకరీ. దీన్ని 1948లో సయ్యద్ ఖాదర్ స్థాపించారు. ఇది ఐకానిక్ బేకరీ దమ్ కే రోట్, ఖరీస్, క్లాసిక్ ఉస్మానియా బిస్కెట్లకు పేరుగాంచింది.ఈ సయ్యద్ బేకరీ ప్రారంభించడానికి ముందు సికింద్రాబాద్‌లో బ్రిటిష్ రెజిమెంట్‌కు బ్రెడ్ సరఫరా చేసే బేకరీలో పనిచేశాడు. ఆ తర్వాత చిన్న గ్యారేజీలో బ్రెడ్ అమ్ముతూ హైదరాబాద్‌లోని రెడ్ హిల్స్‌కు వెళ్లాడు. అతడి బ్రెడ్ తయారీలోని నాణ్యతకు విపరీతమైన ప్రజాదరణ రావడంతో ఖాదర్ వ్యాపారం బాగా పెరిగింది. అలా నాంపల్లిలో బేకరీని స్థాపించే స్థాయికి చేరుకున్నాడు. ఆ బేకరీకి తన కొడుకు సుభాన్ పేరు పెట్టాడు. అలా క్రమంగా ఈ సుభాన్ బేకరీ హైదరాబాద్‌లోనే నెంబర్ వన్ బేకరీగా మంచి పేరుతెచ్చుకుంది. ఔ1950వ దశకంలో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సుభాన్ బేకరీలోని రొట్టెల రుచికి ఫిదా అయ్యారు. అప్పటి నుంచి ఈ బ్రెడ్‌ని తన అల్పాహారంలో భాగంగా చేసుకుని ఆస్వాదించడం ప్రారంభించారు నెహ్రూ. ముఖ్యంగా మన హైదరాబాద్‌కు వస్తే తన రోజువారీ అల్పాహారంలో భాగంగా ఆ బేకరీ బ్రెడ్‌ని తీసుకురావాలని పట్టుబట్టేవారని సమాచారం. దీంతో సుభాన్ బేకరీ మరింత పేరురావడమే గాక నగరంలోని నవాబులు, ఇతర ప్రముఖులు, సెలబ్రిటీలు కస్టమర్ల అవ్వడం మొదలైంది. అయితే 1960లలో విపరీతమైన పోటీ పెరగడంతో పెద్ద బేకరీలు మార్కెట్లోకి ప్రవేశించడంతో సుభాన్ బేకరీకి పెద్ద సవాలుగా మారింది. అయినప్పటికీ ఖాదర్ వారుసులు దీన్ని మరింత మెరుగపరిచి విభిన్నమైన రుచులతో కూడిన ఆహారపదార్థాలను అందిస్తూ ఆహార ప్రియుల మన్ననలను అందుకుంటున్నారు.(చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్..!ఒక మీటర్ ఏకంగా..) -
అనాధ పిల్లలను కలిసిన సుకుమార్ కూతురు సుకృతి
-
Sakshi Little Stars: డాటర్ ఆఫ్ డైరెక్టర్ సుకుమార్
పిల్లలకు బంధువులంటే ఇష్టం. బాబాయ్, మావయ్య, పెదనాన్న, పిన్ని, అత్తయ్య, అమ్మమ్మ... బంధువులొస్తే వీరికి సంబరం. కాని దురదృష్టవశాత్తు కొందరు పిల్లలకు బంధువులుండరు. ఒకోసారి అమ్మో, నాన్నో కూడా వారితో వీరికి బంధువుగా మారి ఆదుకుంటోంది ‘వాల్మీకి గురుకులం’ అనే శరణాలయం. ‘బాలల దినోత్సవం’ సందర్భంగా దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి ఈ పిల్లలనుతానొక బంధువుగా కలిసింది. ఈ సమాజమే ఇటువంటి బాలలకు బంధుగణం అని మాట కలిపింది.అక్కడున్న పిల్లలు చాలా హుషారుగా ఉంటారు. స్కూల్‌కు వెళ్లి చదువుకుంటారు. అందరూ కలిసి ఆడుకుంటూ భోజనం చేస్తూ ఒకేచోట గడుపుతూ మనమంతా ఒకరికొకరం అనే స్థయిర్యంతో బతుకుతారు. అయితే ఒక్కోసారి వారిని దిగులు కమ్ముకోవచ్చు. అమ్మో నాన్నో గుర్తుకు రావచ్చు. ఆ సమయాన్ని మనం దాటించగలగాలి. ఇలాంటి చోటుకు వీలున్న సమయాలలో వెళుతూ పలకరిస్తూ ఉంటే, వారితో సమయం గడుపుతూ ఉంటే వారి లోకం మనకు పరిచయం అవుతుంది. వారి చిరునవ్వుకు మన చిరునవ్వు తోడైతే కారే కన్నీరు తోక ముడుస్తుంది.అందుకే రంగారెడ్డి జిల్లా మోకిలా సమీపానప్రొద్దుటూరులో ఉన్న వాల్మీకి ఫౌండేషన్‌లో సుమారు 50 మంది చిన్నారులు దర్శకుడు సుకుమార్ కుమార్తె, చైల్డ్ సెలబ్రిటీ అయిన సుకృతిని చూసి కేరింతలు కొట్టారు. షేక్హ్యాండ్లు ఇచ్చారు. సరదా కబుర్లతో సమయమే తెలియలేదు అన్నట్టుగా గడిపారు.నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా సాక్షి మీడియా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఇక్కడి పిల్లల కోసం సుకృతి తెచ్చిన పండ్లు, చాక్లెట్లతో తియ్యని వేడుకగా మారింది. వంటి తియ్యటి కార్యక్రమమిది. ఇక సుకృతి తెచ్చిన పుస్తకాలు ఒక మంచి కానుక వారికి. ఈ సందర్భంగా ఇక్కడి పిల్లలు తమ గురించి తాము సుకృతితో మనసువిప్పి మాట్లాడారు.ఈ బాధ్యత మనందరిదీ...‘సాక్షి’ ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి రావడం వల్లే ఇలాంటి చిన్నారుల సామాజిక, మానసిక స్థితిగతులపైన అవగాహన వచ్చింది. వీళ్లూ నాలాంటి చిన్నారులే.. వీళ్లలో ఎన్ని నైపుణ్యాలున్నాయో చూస్తే ఆశ్చర్యమేసింది. చదువులతో పాటు డ్యాన్సులు చేస్తున్నారు, క్రీడల్లో రాణిస్తున్నారు. వారు వచ్చిన నేపథ్యం వేరు.. ఇక్కడ పొందిన పరిపక్వత వేరు. వారి మదిని తడిమి చూస్తే మాత్రం ఊహించని వేదన దాగుంది. అది మనం తీర్చలేనిది. కానీ వీలైనంత ఆత్మీయత,ప్రోత్సాహం అందించడం మనందరి బాధ్యత.నేను ఇక్కడ పిల్లలు అందరితో కలిసి డ్యాన్సులు చేశాను. వారు నాకిష్టమైన అల్లు అర్జున్ గురించి, నా ఫేవరెట్ హాలిడే స్పాట్ పారిస్ గురించి, నా బెస్ట్ ఫ్రెండ్ సితార గురించి, నా చదువులు, లక్ష్యాలు ఇలా అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి పచ్చని పొలాల మధ్య ఉన్న వాల్మీకి గురుకులం నాకో మధుర ఙ్ఞాపకం గా నిలిచిపోతుంది. నాన్న తెరకెక్కిస్తున్న పుష్ప–2 విషయాలు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనుంది. నా ఆలోచనల్లో చాలా మార్పులకు ఈ విజిట్ కారణమైంది. – సుకృతిలైబ్రరీ... కల్చరల్ టూర్మా దగ్గర 55 మంది చిన్నారులు సేవలు పొందుతున్నారు. సీడబ్ల్యూసీ నియమాల ప్రకారం యుక్త వయసు వచ్చిన చిన్నారుల్ని అనాథ ఆశ్రమంలో ఉంచకూడదు... కాబట్టి ఆ వయసుకొచ్చిన 15 మందిని ఉన్నత చదువుల కోసం మంచి కాలేజీల్లో చదివిస్తూ, హాస్టల్స్‌లో చేర్చాం. అనాథలు, నిరుపేద పిల్లలు, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకు సేవలందిస్తున్నాం. ఆర్ట్ ఆఫ్ స్టైల్ పేరుతో వంద మందికి సరిపడేలా మంచి భవనాన్ని నిర్మించుకున్నాం. డైనింగ్, ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేశాం. అధునాతన కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీని నిర్మిస్తున్నాం. మా సేవలన్నీ దాతల విరాళాలపైనే నిర్వహిస్తున్నాం. పిల్లలకు చదువులు మాత్రమే కాదు... వినూత్న అనుభవాలు, ఆలోచనలు కల్పించాలనే లక్ష్యంతో కల్చరల్ టూర్‌ను ప్లాన్ చేశాం. ఇందులో భాగంగా చెన్నైలోని ఓ అనాథ ఆశ్రమానికి చెందిన పిల్లలకు ఇక్కడ 4 రోజుల విడిది కల్పించి విభిన్నప్రాంతాల సాంస్కృతిక, చారిత్రక, అధునాతన జీవనశైలి పై అవగాహన కల్పించాం. మరికొద్ది రోజుల్లో మా చిన్నారులను కూడా చెన్నైకు తీసుకెళ్లనున్నాం. అంతేకాకుండా మా పిల్లలందరినీ విమానంలో గగనతల విహారం చేయించాం. న్యూట్రిషన్ కోసం ఎగ్ బ్యాంక్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా వాల్మీకి పిల్లల కోసమే కాకుండా దేశవ్యాప్తంగా ఇలాంటి చిన్నారులకు గుడ్లు అందిస్తున్నాం. గ్రామీణప్రాంతాల్లోని నిరుపేదల విద్యకు 500కు పైగా సైకిళ్లను అందించాం. – హరి కిషన్ వాల్మీకి, సంస్థ నిర్వాహకులుస్ఫూర్తిదాయకమైనదినేను ఆమెరికాలో ఆంకాలజీ డాక్టర్ గా పని చేశాను. గత కొన్నేళ్లుగా ఇక్కడి పిల్లల చదువులకు స్కూల్ ఫీజులు చెల్లిస్తున్నాను. ఇలాంటి వారికి ఇంగ్లీష్ మీడియం చదువులు చదివించాలనే ఆలోచన స్ఫూర్తిదాయకమైనది. ఏడాదికి సరిపడా ఫీజులు ఒకేసారి చెల్లిస్తాను. ఇక్కడి విద్యార్థులు ఉన్నత చదువులకు బయటకు వెళుతుంటే కాస్త బాధగానూ, అంతకు మించిన సంతోషంగానూ ఉంటుంది. – డా. రోహిణీ , సంస్థకు ప్రధాన సహాయకురాలుఎప్పుడూ చిల్డ్రన్స్ డేనేమాకెప్పుడూ చిల్డ్రన్స్డేలానే ఉంటుంది. ఇక్కడ అన్ని విషయాల్లో సహకారం అందిస్తారు. బాగా చదువుకుని సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. వీరు అందించిన ఏ సహకారాన్ని వృ«థాగా పోనివ్వను. – మారుతిమాదో కుటుంబంమేముంటున్న ‘వాల్మీకి గురుకులం’ అనా«థ ఆశ్రమంలా అనిపించదు. మాదో పెద్ద కుటుంబం. సౌకర్యాలు, వసతులే కాదు.. ఇక్కడ ప్రేమ, ఆప్యాయతలకు కొదువ లేదు. మాకెప్పుడూ ఒంటరి అనే ఫీలింగ్ రాకుండా చూసుకుంటారు. కాకపోతే రోజూ 14 కిలోమీటర్లు స్కూల్‌కు వెళ్లి రావడం కష్టంగా ఉంది. ఈ విషయంలో ఎవరైనా దాతలు సహకారమందిస్తే వెహికిల్ ఏర్పాటు చేసుకుంటాం. – గౌతమ్ సాయిఇదే గురుకులానికి హెల్ప్ చేస్తానేను బాగా చదువుకుని, మంచి జాబ్ చేస్తూ ఇదే గురుకులంలోని మరి కొందరు చిన్నారులకు సహకారం అందించాలనుంది. ఇవాళ వచ్చిన సుకృతి అక్క మాతో చాలా బాగా కలిసిపోయింది. చాలా విషయాలు చెప్పింది. సినిమా హీరోలు ఎలా ఉంటారు... వారి జీవితాలు ఎలా గడుస్తాయి.. ఇలా ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాను. – అనిల్ప్రేమ, తోడ్పాటు కావాలిఅప్పుడప్పుడు బాధ అనిపించినా ఇక్కడ ఆ ఆలోచనలకు తావు లేదు. మేం చాలా గౌరవంగా, ఆరోగ్యంగా మంచి చదువులను పొందుతున్నాం. జాలి, దయ కన్నా ప్రేమ, తోడ్పాటు జీవితాన్ని ముందుకు తీసుకెళతాయని తెలుసుకున్నాను. – భాను ప్రసాద్ -
హైదరాబాద్ MNJ క్యాన్సర్ హాస్పిటల్లో....
-
చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుందా..?
కొందరు చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుంది. దాంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలువుతుంది. తమకు దగ్గరి వాళ్లలో లేదా తమ బంధువుల్లో ఇలాగే జరిగిందనీ, మాటలు రావడం కొందరిలో ఇలాగే ఆలస్యమవుతుంటుందని సముదాయించడం మామూలే. ఇలా పిల్లలకు మాటలు రావడంలో ఆలస్యం జరగడానికి కారణాలేమిటి, ఆ సమస్యలను అధిగమించడం ఎలా అన్న అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.పిల్లల్లో సాధారణంగా 10 నెలలు లేదా ఏడాది నాటికి కొన్ని కొన్ని ముద్దుమాటలు (బాబ్లింగ్) మొదలవుతుంది. రెండేళ్ల వయసు నాటికి తమ భావాలను చాలావరకు కమ్యూనికేట్ చేయ గలుగుతుంటారు. మూడేళ్లకు దాదాపుగా అన్ని మాటలూ వచ్చేస్తాయి. కానీ కొందరు పిల్లల్లో మాట రావడం కాస్త ఆలస్యమవుతుంది. వినికిడి వ్యవస్థ బాగుందని తెలిశాక... అలా మాటలు రావడం ఆలస్యమైన పిల్లల్లో చాలామంది సాధారణంగా స్కూల్లో చేర్చే వయసు నాటికి తమంతట తామే మాట్లాడగలుగుతారు. కారణాలు... పిల్లల్లో మాటలు రావడం ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిల్లో... వినడానికి అవసరమైన వినికిడి వ్యవస్థ, అలాగే మాట్లాడటానికి అవసరమైన వోకల్ కార్డ్స్, మాట్లాడేందుకు ఉపయోగపడే గొంతులోని కండర నిర్మాణం... ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ, కొందరిలో సహజంగానే మాటలు రావడం ఆలస్యమవుతుంటుంది. అలాగే చిన్నారుల్లో వారి భాష ఓ స్థాయి పరిణతికి రావడంలో జరిగే ఆలస్యం (లాంగ్వేజ్ మెచ్యురేషన్ డిలే) కావడం కూడా దీనికి కారణం. చాలావరకు వంశ΄ారంపర్యంగా ఇలా జరుగుతుంటుంది. అమ్మాయిలతో ΄ోలిస్తే ఈ సమస్య అబ్బాయిల్లోనే ఎక్కువ.కొన్ని సందర్భాల్లో అనారోగ్యాలకు సూచిక... కొందరు చిన్నారుల్లో మాటలు రావడంలో ఆలస్యం జరగడం అనేది కొన్ని సందర్భాల్లో అండర్లైయింగ్ ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఇలా మాటలు రాక΄ోవడం చాలా రకాల ఆరోగ్య సమస్యలను సూచించే ఒక లక్షణం కావచ్చు. ఉదా: వినికిడి లోపాలు, మానసికమైన సమస్యలూ, ఆటిజం వంటి కండిషన్, భాషను అర్థం చేసుకోవడం, అభివ్యక్తీకరించడంలో సమస్యలు... మొదలైనవాటిల్లో ఏదో ఒకదానివల్ల మాటలు రావడం ఆలస్యం కావచ్చు.కొన్నిసార్లు అది ఎదుగుదల సమయంలో వచ్చే ఇతర ఆరోగ్య లోపాల వల్ల కూడా అయి ఉండవచ్చు. ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ డిజార్డర్ ఉన్న పిల్లలు భాషను ఒక కమ్యూనికేటివ్ సాధనంగా వాడటంలో విఫలమవుతారు. అయితే వారిలోని తెలివితేటలు, వినికిడి, ఉద్వేగభరితమైన ఫీలింగ్స్... తదితర విషయాల్లోనూ మామూలుగానే ఉంటారు. తమ సంజ్ఞలు, సైగల ద్వారా కమ్యూనికేషన్ అంతా సాధారణంగానే చేస్తు్తంటారుగానీ, మాటలు లేదా పదాలు పలకడం (వర్బల్ ఎక్స్ప్రెషన్స్) ద్వారా తమ అభి్ర΄ాయాలను వెల్లడించడం మాత్రం చాలా పరిమితంగా ఉంటుంది.ఈ పిల్లల విషయంలో పరిష్కారాలేమిటి? ఇలాంటి పిల్లల విషయంలో... వారు మాటలు నేర్చుకోవడం / మాట్లాడటం అనే ప్రక్రియ ఎందుకు ఆలస్యం అవుతోందో తెలుసుకోవడం తప్పనిసరి. ఇందుకు పూర్తిస్థాయి ఇవాల్యుయేషన్ అవసరం. ఇందుకోసం... ‘ఎర్లీ లాంగ్వేజ్ మైల్స్టోన్ స్కేల్ టెస్ట్’, ‘స్టాన్ఫోర్డ్ ఇంటెలిజెన్స్ టెస్ట్’, ఆడియోమెట్రీ, బ్రెయిన్ స్టిమ్యులస్ రెస్పాన్స్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఈ పరీక్షల వల్ల మాటలు రాక΄ోవడానికి కారణాలేమిటి, ఆ కారణాల తీవ్రత ఎంత, వాటి ప్రభావాలు ఏ మేరకు ఉన్నాయన్న పలు విషయాలు తెలుస్తాయి. ఇలాంటి పిల్లలున్నవారు ఒకసారి మీ కుటుంబ పిల్లల డాక్టర్‌కూ అటు తర్వాత అవసరాన్ని బట్టి స్పీచ్ థెరపిస్ట్కూ చూపించాలి. ఒకసారి సమస్యనూ, తీవ్రతనూ తెలుసుకుంటే... ఆ తర్వాత ‘స్పీచ్ పాథాలజిస్ట్’లు పిల్లలకు మాటలు వచ్చే శిక్షణను మొదలుపెడతారు. తల్లి దండ్రులకూ కొంత శిక్షణ అవసరం... ఇలాంటి పిల్లలకు మాటలు నేర్పే విషయంలో తల్లిదండ్రులు చాలా ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. వాళ్లకూ కొంత శిక్షణ అవసరమవుతుంది. తల్లిదండ్రులు పూర్తి సహనంతో ఉంటూ, భాష విషయంలోతామూ పిల్లల స్థాయికి చేరుకుని, వాళ్లకు మాటలు నేర్పాలి. తల్లిదండ్రులు నిత్యం ఆ పిల్లలను ఉత్సాహపరుస్తూ... వారికి భాషతోటు ఇతర నైపుణ్యాలూ నేర్పడానికి సంసిద్ధంగా ఉండాలి.(చదవండి: నలుపు తగ్గేదెలా..?) -
Sakshi Little Stars: ఆశీస్సులే ఆయువు
ఆశ తొణుకుతున్నప్పుడుఆశీస్సు దానిని నిలబెట్టవచ్చు. ఔషధం ఓడుతున్నప్పుడు ప్రార్థన దానిని గెలిపించవచ్చు. అశ్రువు ఉబుకు తున్నప్పుడు ఆర్ద్రత దానిని మందస్మితం చేయవచ్చు. డబ్బు ఖర్చు లేని అనంత దయ, సేవ, ఆర్ద్రత, సాంత్వన మన వద్ద ఉంటాయి. నిజ హృదయంతో వెచ్చిస్తే పని చేస్తాయి. ఈ పిల్లలకు అవన్నీ కావాలి. ఈ పిల్లలు చిరంజీవులై వెలగాలి. ‘సాక్షి’ మీడియా చైల్డ్ సెలబ్రిటీలతో తనదైన ప్రయత్నం చేసింది. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలలు ఒక పూట కువకువలాడారు. పకపక నవ్వారు.నవంబర్ 14 ‘బాలల దినోత్సవం’ నేపథ్యంలో ఎం.ఎన్.జె. కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 150 మంది చిన్నారులను పలకరించే ప్రయత్నం చేసింది సాక్షి మీడియా. ‘పొట్టేల్’. ‘సరిపోదా శనివారం’, ‘మన్మథుడు–2’ వంటి సినిమాల్లో నటించిన బాలతారలు ఖ్యాతి, సాన్విక, స్నితిక్, జాతీయ క్రీడాకారిణి కార్తీకలను తీసుకొచ్చి వారితో ముచ్చటించేలా చేసింది. చైల్డ్ సెలబ్రిటీలు వారి కోసం ఆటలు, పాటలు, డ్యాన్సులతో అలరించారు. అలాగే తమ ఆరోగ్యస్థితిని చైల్డ్ సెలబ్రిటీలతో పంచుకున్నారు.నాకు ప్రస్తుతం బాగానే ఉంది. డాక్టర్లు బాగా చూసుకుంటున్నారు. నాకు అల్లు అర్జున్ సినిమాలంటే ఇష్టం. నన్ను కలవడానికి వచ్చిన సెలబ్రిటీల కోసం పుష్ప సినిమా పాట పాడాను. నా కోసం సాన్విక కూడా పాట పాడింది. వారితో కలిసి మాట్లాడటం హ్యాపీగా ఉంది.– జశ్వంత్మేం సిద్దిపేట నుంచి వచ్చాం. హాస్పిటల్ అంటే నాకు భయం.. కానీ ఇక్కడ బాగానే ఉంది. సినిమాల్లో నటించే వారు మా కోసం రావడం సంతోషంగా ఉంది. నాకు కూడా సినిమాలంటే ఇష్టం. చివరగా శ్యాం సింగరాయ్ సినిమా చూశాను. త్వరగా నయమైతే స్కూల్‌కు వెళ్లాలనుంది. – రిషి ప్రియ, సిద్దిపేటచాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. నాకు చదువంటే చాలా ఇష్టం, ముఖ్యంగా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. స్పైడర్‌మ్యాన్ నా ఫేవరెట్. సాన్విక అక్కతో ఆడుకున్నాను, లెక్కలు చెప్పాను. – ఓ చిన్నారి, జహీరాబాద్ బద్దీపూర్నాకు ఫుట్‌బాల్, దాగుడుమూతలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అవన్నీ ఆడుకోలేకపోతున్నాను. ఇలా బాధ పడుతున్న సమయంలో వీరంతా వచ్చి నాతో ఆడుకున్నారు. చాలా ముచ్చట్లు చె΄్పారు. నన్ను షూటింగ్‌కు తీసుకెళతానని కూడా చె΄్పారు. – చేతన్విభిన్న పేర్లతో పలు రకాల కేన్సర్లు ఉన్నప్పటికీ అవన్నీ హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సెస్, సాలిడ్ ట్యూమర్స్ అనే రెండు విభాగాల కిందకు వస్తాయి. చిన్నారుల్లో దీర్ఘకాలం పాటు హై ఫీవర్, చలి జ్వరం, బ్లీడింగ్, చిగుర్లలో రక్తస్రావం.. శరీరంలో, చాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వయసుకు తగ్గట్టు బరువు పెరగక పోవడం లేదా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి. సాలిడ్ ట్యూమర్స్‌లో పిల్లలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, ఫిట్స్ రావడం జరుగుతుంది. చికిత్స పొందుతున్న చిన్నారులకు క్యాన్సర్‌కు సంబంధించిన అవగాహన అంతగా ఉండకపోవడం వల్ల ఎక్కువగా భయం ఉండదు. కానీ నిత్యం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం వల్ల మానసిక ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో వారికోసం ప్రత్యేకంగా ప్లే స్టేషన్ ఏర్పాటు చేశాం. ఇలాంటి వ్యాధితోనే ఇబ్బంది పడుతున్న ఇతర చిన్నారులతో మమేకం చేస్తాం. – అనుదీప్, మెడికల్ ఆంకాలజిస్ట్అవగాహన వచ్చిందికేన్సర్ గురించి కొంచెం అవగాహన ఉంది. అందుకే గతంలోనే ఇలాంటి చిన్నారుల కోసం నేను రెండుసార్లు నా హెయిర్ డొనేషన్ చేశాను. కానీ ఇలాంటి ప్లేస్‌కు రావడం ఇదే మొదటి సారి. వీరి విల్ పవర్ చూశాక సమస్య ల నుంచి ఎలా రాణించాలో ఒక అవగాహన వచ్చింది. మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చి ఈ చిన్నారులతో ఆడుకోవాలనుంది.– కార్తీక, నేషనల్ ప్లేయర్హెయిర్ డొనేట్ చేస్తానుఈ హాస్పిటల్లో చిన్నారులను చూశాకే కేన్సర్ ఎంత ప్రమాదకరమైనదో తెలిసింది. వారిని చూస్తుంటే ఏడుపొచ్చేసింది. నేను కూడా గతంలో ఇలాంటి వారి కోసం హెయిర్ డొనేట్ చేశాను. మళ్లీ కూడా చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాను. –ఖ్యాతి, సరిపోదా శనివారం ఫేమ్వీరిని చూశాక లోపల ఎంతో బాధ కలిగినప్పటికీ దానిని దాచి వీరందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశాను. పాటలు పాడాను, నాటు నాటు డ్యాన్స్ చేశాను. – సాన్విక, సరిపోదా శనివారంవీరందరినీ ఇలా చూస్తుంటే భయమేసింది. అందరికీ నయం అయి త్వరగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నాను. అందరితో ఆడుకున్నాను, డ్యాన్సులు చేశాను. – స్నితిక్, పొట్టేల్ ఫేమ్భయం లేదు చికిత్సలు ఉన్నాయిఅనారోగ్యం అని తెలిశాక పరీక్షల నిర్థారణతో పాటు చికిత్సలో భాగంగా అన్ని సేవలు ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో ఉచితంగానే అందుతాయి. వ్యాధి దశను బట్టి చికిత్స కొనసాగుతుంది. ఈ చిన్నారులకు న్యూట్రిషన్ చాలా అవసరం. దీనికోసం కడల్స్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో మంచి న్యూట్రిషన్ అందిస్తున్నారు. చిన్నారుల వయస్సు, బరువును బట్టి ్రపొటీన్ ΄్యాకెట్స్, డ్రై ఫూట్స్ తదితరాలను అందిస్తున్నారు. కీమో, రేడియేషన్ వంటి చికిత్సల కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్న వారికి చుట్టుపక్కల విడిదికి కూడా సహాయం చేస్తున్నారు. కేన్సర్ వ్యాధి జన్యుపరంగా కూడా వస్తున్నప్పటికి అది 15 నుంచి 20 శాతం మాత్రమే. కేన్సర్లకు పలు రకాల కారణాలున్నాయి. కేన్సర్‌కు ఇతర దేశాల్లో అందిస్తున్న అధునాతన చికిత్సకు మనకు వ్యత్యాసం పెద్దగా ఏమీ లేదు. మన దగ్గర కూడా లేటెస్ట్ ట్రయల్స్ మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ వారమంతా లిటిల్ స్టార్స్ సందడిని సాక్షి యూట్యూబ్‌లో చూడటానికి QR కోడ్‌ను స్కాన్ చెయ్యండి – డి.జి. భవాని– హనుమాద్రి శ్రీకాంత్ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల -
Sakshi Little Stars: ఇదీ రక్త బంధమే!
మన సంస్కృతి, సంప్రదాయలు, కుటుంబ విలువల్లో ‘రక్త సంబంధం’ అనే మాట పవిత్రమైనది. సానుకూల శక్తికి నిలువెత్తు అద్దంలాంటిది. సానుకూల శక్తి అనుకున్నది ప్రతికూల శక్తిగా మారితే? వరం అనుకున్నది శాపం అయితే? అది అనుభవిస్తే కాని తెలియని బాధ.చిన్నారుల ఆనందప్రపంచాన్ని జన్యు సంబంధిత వ్యాధి తలసేమియా దూరం చేస్తుంది. ఎప్పుడూ ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేస్తుంది. ‘అందరిలా నేనెందుకు ఉండకలేకపోతున్నాను’ అనే ఆవేదనను వారిలో కలిగిస్తుంది. ‘లేదు... మీరు అందరిలాగే ఉండాలి. నవ్వాలి. ఆడాలి. ఇంద్రధనుస్సుల పల్లకీలో ఊరేగాలి’ అంటూ నడుం కట్టారు చైల్ట్ ఆర్టిస్ట్‌లు.నవంబర్ 14 బాలల దినోత్సవం నేపథ్యంలో... తలసేమియా బారిన పడిన చిన్నారులకు ప్రతి నెల ఉచితంగా రక్తం ఎక్కిస్తూ (బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్), మందులు అందిస్తూ విశేష సేవలు అందిస్తున్న హైదరాబాద్‌లోని ‘తలసేమియా సికిల్ సెల్ సొసైటీ’కి బాలతారలను తీçసుకువెళ్లింది సాక్షి. సలార్, పుష్ప–2లో నటించిన మోక్షజ్ఞ, పొట్టేల్ సినిమాలో నటించిన తనస్వీ, సరిపోదా శనివారంలో నటించిన అనన్యలు తలసేమియా బారిన పడిన చిన్నారులను ఆత్మీయంగా పలకరించడమే కాదు వారిని నవ్వించారు. తమ డ్యాన్స్‌లతో హుషారెత్తించారు. వారిలో ఆత్మస్థైర్యం నింపారు...వారసత్వంగా సంక్రమించే రక్త సంబంధ వ్యాధి (జెనెటికల్ బ్లడ్ డిజార్డర్) తలసేమియా. నివారణ మార్గాలున్నా అవగాహన లేమితో ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులు వేల సంఖ్యలో ఉన్నారు. వారు ప్రతీ రెండు, మూడు వారాలకు ఒకసారి తప్పనిసరిగా వారు రక్తం ఎక్కించుకోవాలి. ఇది అత్యంత ఖరీదైనది. ఇలాంటి పరిస్థితులలో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ‘తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ’ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది. ఇక్కడకి వచ్చిన చైల్డ్ ఆర్టిస్టులు తమలాంటి పసిహృదయాలకు ఎందుకు ఇంతటి కష్టం వచ్చిందని విలవిలలాడిపోయారు. లోపలి నుంచి తన్నుకొస్తున్న బాధను దిగమింగుకొని వారికి సంతోషాలను పంచే ప్రయత్నం చేశారు. వారి ఇష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఇబ్బందుల గురించి ఆరా తీశారు. ‘మీకు మేమున్నాం. మీ సమస్యలపై మా సినిమాల ద్వారా అవగాహన కల్పిస్తాం’ అన్నారు. తల్లడిల్లిపోయే తల్లులు ఎందరో...తన బిడ్డ కోసం ప్రతి నెలా ఖమ్మం నుంచి నుంచి హైదరాబాద్‌కు వస్తుంది ఒక తల్లి. ఆమె ఇద్దరు బిడ్డలకూ తలసేమియా సంక్రమించింది. పెద్దపాప బోన్ మ్యారో చికిత్స విఫలమై చనిపోయింది. చిన్నపాపను కాపాడుకోవాలనే ధృఢసంకల్పం ఆ తల్లిలో కనిపిస్తోంది. ‘ఈ వేదిక నాకు దేవాలయంతో సమానం’ అంటుంది. తన చెల్లి కోసం ప్రతీ నెల కడప జిల్లా నుంచి ఇక్కడికి వస్తుంది అర్ఫాన్. ఇలాంటి తల్లులు ఎంతో మంది తలసేమియా సికిల్ సెల్ సొసైటీలో కనిపిస్తారు. వారి కన్నీళ్లతో మన మనసు తడిసిపోతుంది.డాక్టర్ కావాలని ఉంది...‘‘నేను ఏడో క్లాస్ చదువుతున్నాను. మూడు నెలల నుంచి రక్తం అందిస్తున్నారు. ఈ అవస్థలు చూస్తుంటే..భవిష్యత్‌లో నేను డాక్టర్ అయిపోయి, నాలాంటి పిల్లలకు మంచి వైద్యం అందించాలని ఉంది. గేమ్స్ కూడా బాగా ఆడతాను’ అంటుంది ఖమ్మంకు చెందిన దీపిక.మా గురించి ఆలోచించండి...‘‘నేను ఆరేళ్ల నుంచి ఈ సేవలు పొందుతున్నాను. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాను. మా భోజనం అందరిలానే ఉంటుంది, కానీ పండ్లు తక్కువగా తినాలి. శరీరంలో రక్తం తగ్గినప్పుడు నీరసంగా ఉంటుంది. జ్వరం వస్తుంది. ఒక్కోసారి లేవలేనంతగా కాళ్ల నొప్పులు వస్తాయి. రక్తం తీసుకున్న తరువాత బాగానే ఉంటాం. దయచేసి మా గురించి ఆలోచించండి. మాకు రక్తం అందుబాటులో ఉండాలి. రక్తదాతలు సహకరిస్తేనే మాకు సరిపడా రక్త నిల్వలు ఉంటాయి. ఈ విషయంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమం సాక్షి నిర్వహిస్తున్నందుకు మనసారా కృతఙ్ఞతలు’’ అంటుంది గౌసియా.భయపడితే బతకలేము...నాకు 6 నెలల వయసులోనే తలసేమియా ఉందని గుర్తించారు. గత 21 ఏళ్లుగా ప్రతీ 15, 20 రోజులకు ఒకసారి ఇక్కడ రక్తం ఎక్కించుకుంటున్నాను. మాకు ఐరెన్ లెవల్స్ పెరగకుండా ట్యాబ్లెట్లు ఇస్తారు. దీని గురించి ఆలోచిస్తూ బాధ పడితే జీవితాన్ని ముందుకు సాగించలేను. అందుకే ధైర్యంగా ఉంటాను. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నాను. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. కొన్ని డ్యాన్స్ పోటీల్లో కూడా పాల్గొన్నాను. మాకు ఈ సెంటర్ అండగా ఉంటోంది. – మెహవీన్ ఫాతిమానేను యూకేజీ చదువుతున్నాను. వారం వారం నాన్న రక్తం కోసం ఇక్కడికి తీసుకువస్తాడు. మొదట్లో చాలా భయమేసేది. ఇప్పుడు భయం లేదు. – నిహారికప్రతి 3 వారాలకు రక్తం ఎక్కించుకోవడం అలవాటైంది. భయం లేదు. 7వ తరగతి చదువుతున్నాను. డ్యాన్సింగ్, సింగింగ్ అంటే చాలా ఇష్టం. నా వ్యాధి గురించి స్కూల్లో టీచర్లకు కూడా తెలుసు. చాలా విషయాల్లో సహాయం చేస్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ఇక్కడి వచ్చినప్పుడల్లా ఎందుకొచ్చానని బాధగా అనిపిస్తూనే ఉంటుంది. – సంకీర్తన, కరీంనగర్రక్తదాతలు ముందుకు రావాలి...తలసేమియాతో నాకు బాబు పుట్టాడు. ఆ సమయంలో దక్షిణాదిలో డాక్టర్లకు కూడా ఈ వ్యాధిపైన అంతగా అవగాహన లేదు. దేశంలోని ఎన్నో హాస్పిటల్లు, మెడికల్ కాలేజీలు తిరిగి దీని గురించి తెలుసుకుని మళ్లీ నగరంలోని డాక్టర్లకు అవగాహాన కల్పించి బాబుకు చికిత్ప అందించాను. నాలాంటి మరో 20 కుటుంబాల వారు కలిసి 1998లో డా. ఏఎన్ కృష్ణకుమారి సహాయంతో ఈ సెంటర్‌ను స్థాపించాం. మా ప్రయత్నంలో ఎందరో సామాజికవేత్తలు, డాక్టర్లు సహకారం అందించారు. విరాళంగా అందించిన స్థలంలో దాతల సహాయంతోనే ఈ సెంటర్‌ను నిర్మించాం. ఇప్పటికి 4199 మంది చికిత్న పొందుతున్నారు. ఇప్పటి వరకు 3 లక్షల యూనిట్ల రక్తం అందించాం. ఇంతమందికి సేవలందిస్తున్న ప్రపంచంలో అతి పెద్ద సంస్థ మాదే అని చెప్పడానికి గర్వంగా ఉంది. ప్రస్తుతం నా బాబు లేడు. కానీ నాకు 4199 మంది పిల్లలున్నారు. వీరికి మా సేవలు ఇలానే అందాలంటే రక్తదాతల అవసరం ఎంతో ఉంది. స్వచ్ఛందంగా రక్తదాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. – రత్నావళి, ఫౌండర్, తలసేమియా సికిల్ సెల్ సొసైటీఏడుపొచ్చింది...ఇక్కడి రాగానే ఏడుపొచ్చేసింది. నాలాంటి చిన్నారులే సెలైన్లు పెట్టుకుని రక్తం ఎక్కించు కుంటుంటే బాధగా అనిపించింది. వారికి సంతోషాలను పంచాలని, వారితో ఆడుకున్నాను. నా పొట్టేల్ సినిమాలోని ‘చీమ కాటుకే ఓర్చుకోలేవు ఈ నొప్పి ఎలా భరిస్తావ్’ అనే డైలాగ్ చెప్పాను. వర్షిత నాతో చాలా బాగా ఆడుకుంది, జానీ జానీ రైమ్స్ చెప్పింది. వీరందరినీ దేవుడు మంచిగా చూసుకోవాలి. – తనస్వీ, చైల్డ్ ఆర్టిస్ట్పెద్దయ్యాక సహాయం చేస్తాను...తలసేమియా పిల్లలతో సరదాగా ఆడుకుని ధైర్యం నింపాలని వచ్చాను. ఛత్రపతి డైలాగ్ చెబితే అందరూ చప్పట్లు కొట్టారు. ఇక్కడి అబ్దుల్ నన్ను టీవీలో చూశానని చెప్పాడు. ముఖేష్ నాకు ఫ్రెండ్ అయ్యాడు. తను డాక్టర్ అవుతాడంట. వీరి కోసం నేను డ్యాన్సులు కూడా చేశాను. నేను పెద్దయ్యాక ఇలాంటి వారికి సహాయం చేస్తాను. – మోక్షఙ్ఞ, చైల్డ్ ఆర్టిస్ట్ప్రభుత్వం ఆదుకోవాలి...ఇది జెనెటిక్ డిసీజ్ అయినప్పటికీ నివారించగలిగేదే. ఈ వ్యాధుల్లో నివారించగలిగే అవకాశముండటం చాలా అరుదు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఎంతో ఖరీదైన ప్రక్రియ. ఈ విషయంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సహాయసహకారాలు అందించాలి. – సుమాంజలి, సెక్రటరీ– సీఈఓఈ టెస్ట్ తప్పనిసరి చేయాలి...మేము ఆశ వర్కర్లు, పీహెచ్‌సీలతో కలిసి గర్భిణీ స్త్రీలకు హెచ్‌బీఏ2 టెస్ట్ చేయిస్తున్నాం. ఇప్పటి వరకు 30 వేల మందికి ఈ టెస్టులు చేయించాం. ప్రభుత్వం తరపున ఈ టెస్ట్‌లు అందరికీ తప్పనిసరి చేయాలి. – చంద్రకాంత్ అగర్వాల్, ప్రెసిడెంట్సినిమా ద్వారా అవగాహన కలిగిస్తాను...ఈ పిల్లలను చూడగానే కన్నీళ్లు ఆగలేదు. వీరికి ఏదైనా సహాయం చేయాలని «గట్టిగా అనుకుంటున్నాను. అందరు పిల్లలతో మాట్లాడాను. సరిపోదా శనివారం.. డైలాగ్ చెప్పాను. నా షూటింగ్స్ గురించి వారు అడిగారు. నాకు రక్తం అంటేనే భయం..అలాంటిది వీరు ప్రతీ నెలా ఎక్కించుకుంటుంటే ఊహించడానికే కష్టంగా ఉంది. నా సినిమాల్లో ఈ వ్యాధి గురించే అవగాహన కల్పించే క్యారెక్టర్ చేసే ప్రయత్నం చేస్తాను.– అనన్య, చైల్డ్ ఆర్టిస్ట్ తలసేమియా నివారణకు... హెచ్‌బీఏ–2 అనే పరీక్షను మహిళకు పెళ్లి తర్వాత, గర్భధారణకు ముందు చేయిస్తే తలసేమియాను తేలిగ్గా నివారించవచ్చు.గమనిక: ఈ రోజు రావలసిన ‘సన్నిధి’ పేజీకి బదులుగా బాలల దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ నిర్వహిస్తున్న ‘లిటిల్ స్టార్స్’ పేజీ ఇస్తున్నాం.– డి.జి. భవాని– హనుమాద్రి శ్రీకాంత్ఫొటోలు: అనీల్ మోర్ల -
ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్స్ ప్లే గ్రౌండ్..!
ప్రపంచంలోని చిన్నారుల క్రీడా మైదానాల్లో ఇదే అతిపెద్దది. బ్రిటన్‌లో ఆనిక్ పట్టణంలోని ఆనిక్ గార్డెన్లో ఉన్న ఈ మైదానం పేరు లిలిడోరీ. ఆనిక్ కోటను ఆనుకుని ఉన్న 1300 హెక్టార్ల స్థలంలో ఆనిక్ గార్డెన్‌ను, అందులోని క్రీడామైదానాన్ని నార్తంబర్లండ్ తొలి డ్యూక్ హఫ్ పెర్సీ 1750 సంవత్సరంలో ప్రారంభించారు. ఇందులో పిల్లల వినోదానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, జారుడుబండలు, రోలర్కోస్టర్లు, చరిత్రను ప్రతిబింబించే ముప్పయి కలప ఇళ్లు, ప్రాచీన పురాణ పాత్రల శిల్పాలు వంటి ఆకర్షణలే కాకుండా, పిల్లలకు ప్రత్యేకంగా కథలు చెప్పుకొనే చోటు కూడా ఉండటం విశేషం. (చదవండి: -
లిటిల్ చెఫ్స్: వంటలు నేర్చుకోవడం వల్ల పిల్లలు..!
ఉన్నత లక్ష్యాలను సాధించే తెగువే కాదు.. ప్రాథమిక అవసరాలను తీర్చుకునే నైపుణ్యమూ తెలుసుండాలి! వాటిల్లో వంట మొదటిది! అందుకేనేమో ఇప్పుడు పదసంపదలోకి ఫుడ్ లిటరేట్స్ అనే పదం చేరింది! చదువు, ఆట, పాటలతో పాటు పాకం కూడా తప్పక నేర్చుకోవలసిన విద్య అయింది! అర్బన్ స్కూళ్లలో, న్యూక్లియర్ కుటుంబాల్లో కుకింగ్ అనేది జెండర్ – న్యూట్రల్ యాక్టివిటీ అయింది! ఇదివరకు.. ఏ ఇంట్లో అయినా ఆడుకోవడానికి ఆడపిల్లలకైతే వంట పావులు.. మగపిల్లలకైతే కార్లు, బ్యాట్, బాల్ బొమ్మలుండేవి. ఇప్పుడు ఆ సీన్ అంతగా కనపడట్లేదు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో.. కరోనా తర్వాత. కరోనా లాక్ డౌన్ అందరికీ అన్నీ వచ్చుండాలనే పాఠం నేర్పింది. ఎమ్సెట్ ఎంట్రెన్స్ కంటే ముందు కిచెన్‌లోకి ఎంటర్ కావాలని చెప్పింది. అందుకే కరోనా తర్వాత చాలా కార్పొరేట్ స్కూళ్లు కుకింగ్నీ సిలబస్‌లో చేర్చాయి. అయితే లింగవివక్షను చెరిపేయడానికి చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్ (విద్యారణ్యతోపాటు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు) వంటి నగరాల్లోని చాలా స్కూళ్లు ఎప్పటి నుంచో కుకింగ్ క్లాసెస్‌ను తమ కరిక్యులమ్‌లో భాగం చేశాయి. కరోనా కష్టంతో పట్టణాలు, మధ్యతరగతి కుటుంబాలూ ఈ విషయంలో అలెర్ట్ అయ్యాయి. ఊహ తెలిసినప్పటి నుంచే పిల్లలకు వంట గదిని పరిచయం చేస్తున్నాయి. వంటసామాగ్రితో స్నేహం చేయిస్తున్నాయి. దీనివల్ల పిల్లల పదసంపద పెరుగుతుంది. ప్రయోగాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. వస్తువులను గుర్తించే జ్ఞానం అలవడుతుంది. కొలతలు అర్థమవుతాయి. మోతాదు మించినా, తగ్గినా వచ్చే ఫలితాల పట్ల అవగాహన కుదురుతుంది. బాధ్యత, బ్యాలెన్స్‌లు తెలుస్తాయి. సర్దుబాటు అలవాటవుతుంది. టీమ్ వర్క్, ఆ స్పిరిట్ బోధపడతాయి. ఎదుటివారికి సాయపడే గుణం అబ్బుతుంది. ఇతరులను జడ్జ్ చేయకూడదనే స్పృహా కలుగుతుంది. ఇలా కిచెన్ ఇటు అకడమిక్స్‌కు, అటు జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను బోధిస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కాస్మోపాలిటన్, మెట్రో నగరాల్లో కొన్ని సంస్థలు పిల్లల కోసం కుకింగ్ వర్క్ షాప్స్‌ని కూడా నిర్వహిస్తున్నాయి. లిటిల్ షెఫ్స్‌తో టీవీ చానళ్లు కుకింగ్ షోస్‌నూ ప్రసారం చేస్తున్నాయి. అల్లరి పిల్లల్ని సంభాళించడానికి కిచెన్‌ని మించిన ప్లేస్ లేదంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఇల్లు పీకి పందిరేసే పిల్లలను పేరెంట్స్ తమ అసిస్టెంట్స్‌గా వంటగదిలోకి పట్టుకెళ్లి.. వారి ముందు క్యాబేజ్ లాంటి కూరగాయలను పెట్టి.. దాని ఆకులను వేరు చేయమని పురమాయించాలని చెబుతున్నారు. అలాగే ఒక టబ్‌లో వాళ్ల చేత నీళ్లు పోయించి, అందులో కాసింత ఉప్పు వేయించి.. వాళ్ల చేతికి కూరగాయలిచ్చి ఆ టబ్‌లో వేయించాలి. వాళ్ల చిట్టి చిట్టి అరచేతులతో చిన్న చిన్న ఉల్లిపాయలను ప్రెస్ చేయించాలి. తడిపిన చపాతి పిండిని వాళ్ల ముందు పెట్టి.. చిన్న చిన్న లడ్డూలు చేయమనాలి. ఈ యాక్టివిటీస్‌తో వాళ్లు కుదురుగా ఉండటమే కాకుండా చాలా విషయాలు నేర్చుకుంటారు. చిన్నపాటి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అవుతుందంటున్నారు నిపుణులు. అలా చిన్నప్పుడే వంటింట్లో గరిట పట్టుకుని, తమ వంటల ఘుమఘుమలతో ఇంట్లో వాళ్లనే కాదు ఇరుగు పొరుగునూ ఆశ్చర్యపరుస్తున్న ఆ బాలనలభీములను పరిచయం చేసుకుందాం.. వైభవి మెహ్రోత..ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్‌కు చెందిన ఈ అమ్మాయికిప్పుడు పదహారేళ్లు. కానీ తొమ్మిదేళ్ల వయసులోనే అమ్మ చేయి పట్టుకుని వంటింట్లోకి అడుగుపెట్టింది.. వంటలో అమ్మకు చేయందించేందుకు. పోపు దినుసుల దగ్గర్నుంచి పసుపు, ఉప్పు, కారం వంటివన్నీ ఎంత మోతాదులో పడితే వంటకు రుచి వస్తుందో పర్ఫెక్ట్గా తెలుసుకుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కూర ఉడుకుతుండగానే దాని వాసన చూసి చెప్పగలదు అందులో ఏం తక్కువైంది, ఏం ఎక్కువైందన్నది! బేకింగ్‌లో వైభవీని మించిన వారు లేరు. ‘లాక్డౌన్ టైమ్‌లోనే నాకీ పర్ఫెక్షన్ వచ్చింది. లాక్డౌన్లో మా చుట్టుపక్కల వాళ్లకు, చుట్టాలకు కేక్స్ చేసి పంపేదాన్ని సరదాగా! ఆ ప్రాక్టీస్‌తో కేక్స్ చేయడంలో పర్ఫెక్ట్ అయిపోయాను. నా ఫేవరిట్ అండ్ కంఫర్ట్ ఫుడ్ చాక్లెట్ కేక్!’ అని చెబుతుంది వైభవీ. హోమ్ బేకరీ, తర్వాత ఒక కేఫ్నీ పెట్టాలనేది ఈ యంగ్ షెఫ్ ఆలోచన, లక్ష్యం! ’ 'vabhavi's bake diaries' పేరుతో ఆమెకో యూట్యూబ్ చానల్ కూడా ఉంది. సునిధి మెహతా..మహారాష్ట్ర, పుణేకి చెందిన ఈ అమ్మాయికిప్పుడు పద్నాలుగేళ్లు. కానీ నాలుగేళ్ల వయసులోనే వంట మీద ఆసక్తి పెంచుకుంది. సునిధి వాళ్ల మేనత్త బ్రౌనీస్ చేస్తుంటే కళ్లింతింత చేసుకుని చూస్తుండేదట. ఆ పిల్ల ఇంట్రెస్ట్ గమనించిన మేనత్త ఆ అమ్మాయి చేయి పట్టుకుని అన్నీ చేయించేదట. ఇదంతా చూసి సునిధి వాళ్ల నాన్న .. కూతురికి అక్షరజ్ఞానం వచ్చాక వంటల పుస్తకాన్ని తెచ్చిచ్చాడట. ‘అదే నా ఫస్ట్ అండ్ ఫరెవర్ ఫేవరిట్ గిఫ్ట్’ అంటుంది బ్రౌనీలు, బిస్కట్స్, స్వీట్స్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన సునిధి. ‘బ్రౌన్ సుగర్, దాల్చిన నాకిష్టమైన ఇన్‌గ్రీడియెంట్స్. నా ఫేవరిట్ అండ్ కంఫర్ట్ ఫుడేమో పానీపూరీ. ఎప్పటికైనా కేక్ అండ్ కాఫీ స్టోర్ పెట్టాలన్నదే నా గోల్’ అని చెబుతుంది. రణవీర్ కల్బాగ్..మహారాష్ట్ర, పుణేకి చేందిన రణ్వీర్కిప్పుడు పద్నాలుగేళ్లు. కానీ అయిదేళ్ల వయసులోనే సాస్ తయారీకి ఏప్రాన్ వేసుకున్నాడు. రణ్వీర్ వాళ్ల నాన్న ప్రొఫెషనల్ చెఫ్. ప్రతి ఆదివారం ఇంట్లో వాళ్ల నాన్నే వంట చేస్తాడు. దాంతో రణ్వీర్ కూడా నాన్నకు సాయంగా వంటింట్లోకి దూరేవాడు. అలా వంట మీద ఇష్టం ఏర్పడింది ఆ అబ్బాయికి. ‘మాస్టర్ బేకింగ్ లేదా మిక్సాలజిస్ట్.. నా ఎయిమ్’ అని చెబుతాడు. స్వీట్స్ అంటే ప్రాణం పెడతాడు. ‘అందుకే బటర్ అండ్ సుగర్ అంటే చాలా ఇష్టం. అవి రెండు కలిసి చేసే మ్యాజిక్ అలాంటిది మరి!’ అంటాడు.మేధా భట్..కర్ణాటక, మంగళూరుకు దగ్గర్లోని ఆర్యపు అనే చిన్న పల్లెటూరికి చెందిన ఈ అమ్మాయికిప్పుడు పదిహేనేళ్లు. కానీ మూడవ తరగతిలో ఉన్నప్పుడే డిసైడ్ అయింది పెద్దయ్యాక రెస్టరటర్ అవ్వాలని. తను పెట్టబోయే హోటల్‌కి పేరు కూడా రెడీచేసి పెట్టుకుంది ‘తందురుస్తీ హోటల్’ అని. ఆమెకు స్ఫూర్తి వాళ్లమ్మ చూసే యూట్యూబ్ వంటల చానళ్లు. ఆ చానళ్లలో రకరకాల దినుసులన్నీటితో చక్కటి డిష్‌ని తయారుచేయడం చూసి ఆశ్చర్యపోయేదట మేధా. ‘చిటికెడు ఉప్పుతో వాళ్లు బాండిడు కూరకు రుచి తేవడం నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉండేది’ అంటూ ఇప్పటికీ సర్ప్రైజ్ అవుతుంది. మేధా తన ఎనిమిదో ఏట పోపుల పెట్టె పట్టుకుంది. ‘నిజానికి మేధా హైపర్ యాక్టివ్ కిడ్. వంట వల్లే తను నెమ్మది అయింది. ఇప్పటికీ మేధాను చూస్తుంటే నాకు వండరే! ఒక్క క్షణం కాలు నిలువని పిల్ల.. అంత ఓపిగ్గా వంట ఎలా చేయగలుతుంది అని!’ అంటుంది మేధా వాళ్లమ్మ. చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్‌డేలకు కస్టమైజ్డ్ కేక్స్ చేస్తున్న మేధాకు చాక్లెట్, బంగాళదుంప అంటే ఇష్టం. (చదవండి: ఐదేళ్లకే పుస్తకాన్ని రచించి రికార్డు సృష్టించింది..!) -
ఐదేళ్లకే పుస్తకాన్ని రచించి రికార్డు సృష్టించింది..!
కథలు వినడమే కాదు, చెప్పడానికి కూడా ఇష్టపడుతుంటారు కొంతమంది చిన్నారులు. అయితే ఈ చిన్నారికి మాత్రం కథలు రాయటం కూడా ఇష్టమే! అలా అతిచిన్న వయసులోనే ఏకంగా ఓ పుస్తకాన్ని రచించి, గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఈ ఐదేళ్ల బాలిక పేరు అల్ఫయ్ అల్ మర్జూకీ. ‘ది లాస్ట్ ర్యాబిట్’ అనే పేరుతో పుస్తకాన్ని రచించి గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. జంతువుల మధ్య ఏర్పడిన స్నేహానుబంధాన్ని అందమైన కథగా మలచి ఈ పుస్తకం రాసింది.ఇంగ్లిష్, అరబిక్ బాషలలో ప్రచురించిన ఈ పుస్తకం ఇప్పటికే వెయ్యి కాపీల వరకు అమ్ముడైంది. పుస్తకంలోని పాత్రలన్నింటికీ తన స్నేహితుల పేర్లనే పెట్టిందట! నిద్రపోయే ముందు తన తల్లిదండ్రులు కథలు చదివి వినిపించేవారు. అలా తనకు కథలపై ఆసక్తి పెరిగింది. మూడేళ్ల వయసులో తానే స్వయంగా ఒక పూర్తి కథను తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఆమె ఆసక్తిని గుర్తించి, పుస్తక రచనలో శిక్షణ ఇచ్చారు. అలా కథను రాయడంతో పాటు, వాటికి సంబంధించిన బొమ్మలు వేయడం కూడా నేర్చుకుంది. మరో రెండు కథలు ‘క్యూట్ క్యాట్’, ’ హ్యాపీ ప్రిన్సెస్’ అనే పుస్తకాలు కూడా త్వరలోనే రానున్నాయట! అంతేకాదు, తన తమ్ముడు హమద్‌కు కూడా పుస్తక రచనలో శిక్షణ ఇస్తోంది. రచనలు కొనసాగిస్తూనే, పెద్దయ్యాక ఫ్యాషన్ డిజైనర్ అవుతానని చెబుతోంది ఈ చిన్నారి. (చదవండి: జస్ట్ ఐదేళ్లకే యోగా గురువుగా చిన్నారి..!) -
జస్ట్ ఐదేళ్లకే యోగా గురువుగా చిన్నారి..!
ఫొటోలో కనిపిస్తున్న ఈ బాలుడు ఐదేళ్ల వయసులోనే యోగా గురువు స్థాయికి చేరుకున్నాడు. రాజస్థాన్‌కు చెందిన ప్రత్యక్ష్ విజయ్ అతి పిన్న వయసు యోగా గురువుగా, ప్రతిష్ఠాత్మక గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నాడు. నాలుగేళ్ల వయసు నుంచే ప్రత్యక్ష్ , తన తల్లిదండ్రులతో కలసి యోగా సాధన చేయటం మొదలు పెట్టాడు. రెండువందల గంటల యోగా టీచర్స్ ట్రైనింగ్ కోర్సును పూర్తి చేసిన ఈ బాలుడు, గత ఏడాది జులై 27న ఆనంద్ శేఖర్ యోగా పాఠశాల నుంచి యోగా గురువు ధ్రువపత్రాన్ని అందుకున్నాడు. కోర్సు సమయంలో ప్రత్యేక యోగాకు సంబంధించి అనేక మెలకువలను నేర్చుకున్నాడు. యోగాలోని ‘అలైన్మెంట్, అనాటమిక్ ఫిలాసఫీ’ వంటి క్లిష్టమైన అంశాలను నేర్చుకున్నాడు. ప్రత్యక్ష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, యోగా అనేది శారీరక భంగిమలు, శ్వాస గురించి మాత్రమే కాదు, మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా అని గ్రహించా’ అని తెలిపాడు. ప్రస్తుతం అతడు పెద్దలతోపాటు పిల్లలకు కూడా యోగా నేర్పిస్తున్నాడు. ఆన్లైన్లో వర్చువల్ రియాలిటీ క్లాసులు కూడా తీసుకుంటున్నాడు. వీటితోపాటు కొన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులకు యోగా శిక్షణ ఇస్తున్నాడు. (చదవండి: కిడ్స్ మేకప్ కోసం ఈ బ్యూటీ కిట్..!) -
సాక్షి లిటిల్ స్టార్స్.. మట్టిబిడ్డలు (ఫోటోలు)
-
కిడ్స్ మేకప్ కోసం ఈ బ్యూటీ కిట్..!
చాలామంది చిన్నారులు తమ తల్లుల్లాగానే మేకప్ వేసుకోవడం, స్పాకి వెళ్లడం వంటి పనులను ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఈ పనుల్లో తల్లులను అనుకరించాలని తహతహలాడతారు. అలాంటి వారికి మార్కెట్లో చాలానే డివైస్‌లు, కిట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. హెయిర్ స్టైల్స్ మెషిన్స్ మ్యానిక్యూర్– పెడిక్యూర్ కిట్స్, మేకప్ బాక్సెస్ ఇలా చాలానే ఉన్నాయి. వాటిపై ఓ లుక్ వేద్దామా?చిత్రంలోని ఈ కిట్ వెంట ఉంటే.. చిన్నారులంతా తమ చేతులను, కాళ్లను అందంగా మార్చుకోవచ్చు. ఫుట్ స్పా బాత్ సెట్, ఐ మాస్క్, నెయిల్ ఫ్యాన్ డ్రైయర్, వాటర్ ప్రూఫ్ స్టిక్కర్స్, మసాజ్ స్టోన్స్, గ్లిట్టర్ పౌడర్ ఇలా చాలానే ఈ కిట్‌లో లభిస్తాయి. 3 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ఇది బెస్ట్ బహుమతి అవుతుంది. ఈ కిట్ ఇంట్లో ఉంటే చిన్నారులకు ఇంట్లోనే స్పా ఫీలింగ్ కలుగుతుంది. ఈ కిట్‌తో పిల్లలే చక్కగా నెయిల్స్ని క్లీన్ చేసుకోవచ్చు, నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు, కాళ్లను శుభ్రం చేసుకోవచ్చు. ఇలా తమ అందాన్ని తామే కాపాడుకుంటూ మెరిసిపోవచ్చు.మీ లిటిల్ ప్రిన్సెస్‌కి ఈ కిట్‌ని కొనిచ్చేస్తే.. వారి మేకప్ వారే వేసుకోవడం అలవాటు చేసుకుంటారు. ఇందులో బ్రష్‌లు, ఐ షాడోస్, బ్లష్‌లు, లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్‌లు, నెయిల్ స్టిక్కర్స్, ప్రత్యేకమైన కిరీటం, హెయిర్ యాక్సెసరీస్ వంటివి చాలానే ఉంటాయి. మందపాటి మృదువైన ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఈ కిట్‌ను తేలికగా ఓపెన్, క్లోజ్ చేసుకోవడానికి జిప్ ఉంటుంది. ఇలాంటి కిట్స్ ఆన్లైన్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. క్వాలిటీపైన, వినియోగించే తీరుపైన రివ్యూస్ చదివి చేసుకుంటే మంచిది. చిత్రంలోని ఈ డై హెయిర్ టూల్ బోలెడన్ని జడలల్లేస్తుంది. కొత్తకొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేసే అవకాశాన్నిస్తుంది. ఈ ‘రియలిస్టిక్ డై రోప్ హెయిర్ బ్రైడర్’ అందంగా క్యూట్‌గా కనిపించేందుకు రకరకాల హెయిర్ స్టైల్స్‌ను అందిస్తుంది. ఈ డివైస్ సెట్లో నాణ్యమైన ఎలక్ట్రానిక్ బ్రెయిడింగ్ మెషిన్, హెయిర్ రబ్బర్లు, ఒక దువ్వెన, హెయిర్ స్ప్లిటర్, బ్రెయిడింగ్ మెషిన్లో ఉపయోగించే త్రీ హుక్స్, వివిధ హెయిర్ యాక్సెసరీలు ఉంటాయి. దీన్ని పిల్లలకు బహుమతిగా అందివ్వొచ్చు. ఇలా తేలికగా పిల్లలు వారి జడలను వారే వేసుకునేలా మార్కెట్లో చాలా మెషిన్స్ అందుబాటులోకి వచ్చాయి.(చదవండి: చిన్నారుల ఆరోగ్యకరమైన అలవాట్ల కోసం తల్లిదండ్రులు చేయాల్సినవి..) -
చిన్నారుల ఆరోగ్యకరమైన అలవాట్ల కోసం తల్లిదండ్రులు చేయాల్సినవి..
పిల్లల ఆరోగ్యం కోసం, భవిష్యత్తులో వారిలో ఆరోగ్యకరమైన అలవాట్లు పాదుకునేలా చేయడానికి తల్లిదండ్రులు చేయాల్సినవి, వారికి నేర్పాల్సినవి ఇవి... పళ్లు ఉదయం, సాయంత్రం ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయించాలి. బ్రష్ వెనక్కి ముందుకి కాకుండా, పళ్లపై బ్రష్‌ను గుండ్రంగా తిప్పుతున్నట్లుగా బ్రష్ చేయించడం అలవాటు చేయాలి. స్నానంప్రతిరోజూ స్నానం చేయించాలి. స్నానానికి గోరువెచ్చని నీళ్లు మంచివి. జుట్టుపిల్లల జుట్టును రోజూ పరిశుభ్రమైన దువ్వెనతో దువ్వాలి. అమ్మాయి జుట్టును మరీ టైట్‌గా దువ్వకూడదు. ఒకరి దువ్వెన మరొకరు వాడకూడదు.గోళ్లు చేతివేళ్ల గోళ్లను, కాలివేళ్ల గోళ్లను ప్రతివారం నెయిల్ కట్టర్‌తో కత్తిరిస్తూ ఉండాలి. మరీ లోపలికి కాకుండా చిగురు తగలకుండా జాగ్రత్తగా కత్తిరించాలి.దుస్తులుపిల్లలకు ఎప్పుడూ ఫ్రెష్ దుస్తులు తొడగాలి. ఆడుకుని చెమటతో తడిసినవాటిని ఎప్పటికప్పుడు మార్చాలి. ఉతికిన బట్టలు ఎండలో సరిగా ఆరకపోతే అవి కాస్త వాసన వేస్తుంటాయి. అలాంటివి తొడగకూడదు. నిద్రపిల్లలు ప్రతిరోజూ ఒకేవేళకు నిద్రపోయేలా అలవాటు చేయాలి. వాళ్లను కంటినిండా నిద్రపోనివ్వాలి. నిద్రలోనే వాళ్ల మెదడు వికాసం, చదివినది గుర్తుపెట్టుకునేలా మెదడులో స్థిరపడటం జరుగుతాయి.(చదవండి: నలత లేకుండా చలాకీగా..!) -
పిల్లల కథ: మారిన కల్పకి
రాజాపురంలో రంగయ్య ఆనే వర్తకుడు ఉండేవాడు. అతను కొత్తగా ఓ పెద్ద బంగళా కట్టించాడు. కిటికీలకు ఖరీదైన అద్దాలు పెట్టించాడు. అతని ఇంటి ముందు ఓ వేపచెట్టు ఉండేది. చెట్టుపైన కల్పకి అనే కాకి గూడు కట్టుకుంది.అది ఇతర కాకులతో కలవకపోగా, ఇంకో కాకి అటుగా వస్తే ముక్కుతో పొడుస్తూ తరిమేసేది. ఒకరోజు అది ఉదయాన్నే రంగయ్య ఇంటి గోడ మీద కూర్చొంది. యథాలాపంగా కిటికీ అద్దం వైపు చూసింది. అందులోని తన ప్రతిబింబాన్ని మరో కాకిగా భావించి.. ‘కావ్..కావ్’ మని అరిచింది. తన పదునైన ముక్కుతో కిటికీ అద్దాన్ని పొడవసాగింది. అదే చెట్టు మీద ఒక కోతి ఉండేది. అది కల్పకి అద్దాన్ని పొడవటం చూసి ‘మిత్రమా! అద్దాన్ని పొడవకు. పగిలి నీ ముక్కుకు గాయం కాగలదు’ అంటూ హెచ్చరించింది. కోతి మాటలను కల్పకి పట్టించుకోలేదు. కాకి చర్యను గమనించిన రంగయ్య.. పనివాడిని పిలిచి అద్దం మీద గుడ్డ కప్పమని చెప్పాడు. పనివాడు ‘ఉష్షో.. ఉష్షో..’ అని తరుముతూ కల్పకిని వెళ్లగొట్టాడు. అద్దాన్ని గుడ్డతో కప్పేశాడు. కొంతసేపటికి మళ్లీ వచ్చి గోడపై వాలింది కల్పకి. కిటికీ వైపు చూసింది. అక్కడ కాకి కనపడలేదు. దాంతో అది చెట్టు వైపు తిరిగి కోతితో ‘మన దెబ్బకు దడుచుకొని పారిపోయింది చూడు’ అంది గర్వంగా! ‘మిత్రమా.. అది అద్దం. అందులో కనిపించేది నువ్వే! ఇతర కాకులతో ఐక్యంగా ఉండాలి కానీ, ఇలా పోట్లాడకూడదు. పైగా మీ కాకులు ఐకమత్యానికి పెట్టిన పేరు. నువ్వొక్కదానివే ఇలా ఎందుకున్నావ్?’ అంది కోతి. ‘ఈ చెట్టు చుట్టుపక్కల నేనొక్కదాన్నే ఉండాలి. ఇంకో కాకి ఇటు దిక్కే రాకూడదు’ అంటూ ఎగిరి పోయింది కల్పకి. అలా కాకి ఎగిరిపోవడంతో అద్దం మీది గుడ్డను తీసేయమని పనివాడికి చెప్పాడు రంగయ్య. మరునాడు కల్పకి తిరిగి గోడపై వాలింది. అద్దంలో కాకి కనిపించేసరికి మళ్లీ కోపంతో ఠపీ ఠపీమంటూ అద్దాన్ని పొడవసాగింది. దాంతో అద్దం పగిలింది. ఆ గాజుముక్కలు కోసుకుని కల్పకి ముక్కుకు గాయమైంది. అది చూసిన కోతి గబగబా నాలుగాకులు తెచ్చి.. కాకికి పసరు వైద్యం చేసింది. బుద్ధొచ్చిన కల్పకి కోతికి కృతజ్ఞతలు తెలిపింది. తర్వాత తన కాకుల గుంపును చేరి, క్షమించమని వేడుకుంది. తప్పు తెలుసుకున్న కల్పకిని మిగిలిన కాకులన్నీ క్షమించి తమ గుంపులో కలుపుకున్నాయి. మారిన కల్పకిని చూసి కోతి ఆనందించింది. -
నలత లేకుండా చలాకీగా..!
పిల్లలు తమ తల్లిదండ్రుల కంటి దీపాలు. వాళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో దేదీప్యమానంగా వెలుగుతుండటమే తల్లిదండ్రులు, పెద్దలు కోరుకునేది. ఈ నెల 14వ తేదీ బాలల దినోత్సవం. ఈ సందర్భంగా... పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం పెద్దలు గమనించాల్సిన, అప్రమత్తంగా ఉండాల్సిన కొన్ని అంశాలివి...అప్పుడే పుట్టిన పిల్లలకు ఏడుపే వాళ్ల భాష. తమ తాలూకు బాధలను పెద్దలకు తెలియజెప్పడానికి వాళ్లు ఏడుపునే సాధనంగా ఎంచుకుంటారు. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్లకు ఏదైనా సమస్య ఉందేమోనని తల్లిదండ్రులు అనుమానించాలి. పిల్లలు ఎప్పుడెప్పుడు, ఎందుకు ఏడుస్తారో, అప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాలి. పిల్లల్లో ఏడుపుకు కొన్ని కారణాలు ఆకలి వేసినప్పుడు, భయపడినప్పుడు, ∙దాహం వేసినప్పుడు ఒక్కరే ఉండి బోర్‌గా అనిపించినప్పుడు ∙పక్క తడి అయినప్పుడు, వాతావరణం మరీ చల్లగా లేదా వేడిగా ఉండి అసౌకర్యంగా అనిపిస్తున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినప్పుడు కాంతి బాగా ఎక్కువైనా, పొగలు కమ్ముకున్నా పళ్లు వస్తున్నప్పుడు, ఇన్ఫెక్షన్లు ముఖ్యంగా యూరినరీ ఇన్ఫెక్షను వచ్చినప్పుడు, కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్) జ్వరం జలుబు, చెవినొప్పి వంటి సాధారణ లేదా కొన్ని తీవ్రమైన సమస్యలను పిల్లలు ఏడుపు ద్వారా తెలియజేస్తారు. 1–6 నెలల వయసులో ఉన్న పిల్లలు ఎక్కువగా ఏడవటానికి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు, చెవి నొప్పి, జలుబు వంటివి ప్రధాన కారణాలు.ఇన్ఫెన్టైల్ కోలిక్... చిన్న పిల్లల్లో ఏడుపుకు ముఖ్యమైన కారణం కడుపునొప్పి. దీన్నే ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్ అంటారు. సాధారణంగా మూడు నెలలలోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆకలి వేయడంగానీ, గాలి ఎక్కువగా మింగడం, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్‌కు కొన్ని కారణాలు. ఇటువంటి పిల్లలను ఎత్తుకోవడం (అప్ రైట్ పొజిషన్), లేదా వాళ్ల పొట్టమీద పడుకోబెట్టడం, ప్రాపర్ ఫీడింగ్ టెక్నిక్, కడుపులోని గాలి వెళ్లిపోయేందుకు తేన్పు వచ్చేలా చూడటం అంటే ఎఫెక్టివ్ బర్పింగ్తో ఏడుపు మాన్పించవచ్చు. చికిత్స వరకు వెళ్లాల్సివస్తే... కొందరికి యాంటీస్పాస్మోడిక్స్తో పాటు బాగా అవసరమైన పరిస్థితుల్లో మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనేవి ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే అంటే పదే పదే ఏడవటం, ఆపకుండా ఏడవటం చేస్తుంటే తక్షణం పిల్లల డాక్టర్‌కు చూపించాలి.ఏడాది నుంచి రెండేళ్ల వరకు... ఏడాది వయసు నుంచి పిల్లలు కొద్దికొద్దిగా సపోర్ట్ తీసుకుంటూ నిలబడుతుండటం, కొద్ది కొద్దిగా బుడిబుడి అడుగులు వేసుకుంటూ మళ్లీ పడిపోతూ, మళ్లీ నిలబడుతుండటం చేస్తుంటారు. వీళ్లు నిలబడుతుండటానికి సపోర్ట్ ఇస్తూ ఆడుకునేలా చేస్తుండాలి. ఈ టైమ్‌లోనే పిల్లలు రివాల్వింగ్ చైర్స్ వంటివి పట్టుకుని నిలబడానికి ప్రయత్నించినప్పుడు అవి చక్రాల మీద జారిపోయి, పిల్లలు పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక ఏ వస్తువును పడితే ఆ వస్తువును కదిలించడానికి ప్రయత్నించడం, సొరుగులు లాగేయడం వంటివి చేస్తుంటారు. ఈ సమయాల్లో వారి వెనకే ఉంటూ ప్రోత్సహిస్తూనే, వాళ్లు ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి.రెండేళ్ల వయసు నుంచి స్కూలుకు వెళ్లే సమయం వరకు... ఈ టైమ్‌లో పిల్లలను కాస్త ఆరుబయట ఆడనివ్వాలి. వాళ్లు ఆరుబయటకు వెళ్తుంటే భయపడకుండా కాస్త నీరెండలోకి, మట్టిలోకి వెళ్లడానికి అనుమతించాలి. కాకపోతే ఎండ నేరుగా తగలకుండా హ్యాట్ లాంటిది వాడటం, ఒళ్లంతా కప్పి ఉంచేలా దుస్తులు తొడగడం, అవసరమైతే 30 ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ రాయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే ఆరుబయట ఆడుకుని వచ్చాక వాళ్ల ఒళ్లు తుడిచి, చేతులు శుభ్రంగా కడగాలి. మట్టితో ఆడుకోనివ్వని పిల్లల కంటే అలా ఆడుకున్న చిన్నారులకే ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.మూడు నుంచి ఐదేళ్ల వయసుకు.. ఈ వయసులో చిన్నారులు ఇతర పిల్లలతో కలిసి ఆడుతుంటారు. అలా ఆడేలా వారిని ప్రోత్సహించాలి. ఈ టైమ్‌లో ట్రైసైకిల్ లేదా సైకిల్ నేర్చుకునేలా సపోర్ట్ చక్రాలున్న సైకిల్, బంతిని విసిరి పట్టుకునే ఆటలు (థ్రోయింగ్ అండ్ క్యాచింగ్), గెంతడం, స్కిప్కింగ్, డాన్సింగ్ వంటి యాక్టివిటీస్ చేసేలా ప్రోత్సహించాలి. ఈ వయసు పైబడిన పిల్లలు, వాళ్ల వయసుకు తగినట్లుగా కాస్తంత పెద్ద ఆటలను ఆడేలా చూడాలి.అన్ని టీకాలూ టైముకు ఇప్పించడం... పిల్లలకు ఆయా సమయాల్లో ఇప్పించాల్సిన టీకాలు (వ్యాక్సినేషన్) తప్పక ఇప్పించాలి. ఈ టీకాల షెడ్యూలు చిన్నపిల్లల డాక్టర్లందరి దగ్గరా ఉంటుంది. వారిని సంప్రదించి... డీటీఏపీ, ఫ్లూ, హెచ్ఐబీ, ఎమ్ఎమ్ఆర్, పోలియో, రొటా వైరస్ మొదలైన వ్యాక్సిన్లు అన్నింటినీ ఆయా సమయాలకు ఇప్పిస్తూ ఉండాలి.ఆహారం విషయంలో... పాలు మరిచిన పిల్లలకు మొదట్లో గుజ్జుగా చేసిన అన్నం, పప్పు, నెయ్యి వంటి ఆహారాన్ని అందిస్తూ, క్రమంగా ఘనాహారం వైపు మళ్లించేలా చేయాలి. కాంప్లిమెంటరీ ఫుడ్స్ అంటూ మార్కెట్లో లభ్యమయ్యేవాటి కంటే ఇంట్లో ఆరోగ్యకరమైనన పరిస్థితుల్లో వండిన భోజనాన్ని తాజాగా అందిస్తుండటమే మేలు.‘క్లీన్ ప్లేట్ రూల్’ వద్దు... ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. కొందరు తల్లులు తాము ప్లేట్లో వడ్డించినదంతా పిల్లలు తినేయాలని అనుకుంటుంటారు. పిల్లలను ఘనాహారం వైపు మళ్లించే వీనింగ్ ప్రక్రియ సమయంలో ప్లేట్లో పెట్టిందంతా పిల్లలు తినేయాలని అనుకోవద్దు. కడుపు నిండిన వెంటనే వారు తినడానికి విముఖత చూపుతారు. అప్పుడు ఫీడింగ్ ఆపేయాలి. ఈ ‘క్లీన్ ప్లేట్ రూల్’ బదులుగా చిన్నారులకు చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినిపించడం మేలు. ఇక పిల్లలు కాస్త ఎదిగాక అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు, పీచు పుష్కలంగా ఉండేలా పొట్టుతీయని కాయధాన్యాలతో వండిన అన్నం, మాంసాహారం తినిపించేవారు చికెన్, చేపలు, తాజా పండ్లతో కూడిన ఆహారాలు అందిస్తూ వారికి అన్ని పోషకాలు అందేలా జాగ్రత్త తీసుకోవాలి. వారు మితిమీరి బరువు పెరగకుండా ఉండేందుకు నెయ్యి, వెన్న వంటి శ్యాచురేటెడ్ ఫ్యాట్స్, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, ఉప్పు వంటి వాటిని పరిమితంగా ఇవ్వడం మేలు. పిల్లలకు తినిపించేటప్పుడు తల్లిదండ్రులు చాలా ఓపిగ్గా, వారు ముద్ద నమిలి మింగేవరకు ఆగి, అప్పుడు మరో ముద్ద పెట్టడం, ఆహారం వారికి ఇష్టమయ్యే రీతిలో చాలా రకాల (వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్) ఆహారాలను మార్చి మార్చి రుచిగా, కాస్తంత గుజ్జుగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇక పిల్లలు పెద్దవుతున్న కొద్దీ పెద్దలు వాళ్లతో కమ్యూనికేట్ అవుతూ ఉండటం, వాళ్ల ఫీలింగ్స్ గురించి మాట్లాడటం, ప్రతికూల ఆలోచనలను, ధోరణులను దగ్గరికి రాకుండా చూడటం, వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతుండటం, వాళ్ల సెల్ఫ్ ఎస్టీమ్‌కు భంగం రానివ్వకుండా ప్రోత్సాహపూర్వకంగా మాట్లాడటం, మొదట్లో చిన్న చిన్న లక్ష్యాలు ఏర్పరచి, వాటిని నెరవేర్చగానే చిన్న చిన్న బహుమతులు అందిస్తూ ప్రోత్సాహపూర్వకంగా ప్రశంసించడం, వారికై వారు తమ లక్ష్యాలను మెల్లగా పెద్దవిగా చేసుకునేలా చూడటం, విఫలమైనప్పుడు ఏమాత్రం నిరుత్సాహపరచకుండా మరింత ప్రోత్సహించడం చేస్తూ వాళ్లు అన్నివిధాలా మానసిక, శారీరక ఆరోగ్యాలతో ఎదిగేలా చేయాలి. (చదవండి: పిల్లలూ దేవుడూ చల్లని వారే) -
బుల్లి డిజైనర్ బ్రూక్...
స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను ఆ అమ్మాయి ఫ్యాషన్ షోగా భావించేది. పోటీదారులకు దుస్తుల డిజైనింగే కాదు స్టయిలింగ్ కూడా చేసేది! ఫ్యాషన్ మీద ఆమెకున్న ఇష్టాన్ని అమ్మ, అమ్మమ్మ కూడా గుర్తించి, ప్రోత్సహించడంతో అతి చిన్న వయసులోనే పలువురు మెచ్చే ఫ్యాషన్ డిజైనర్‌గా మారింది! బ్రాండ్నీ క్రియేట్ చేసింది! ఆ లిటిల్ స్టయిలిస్టే బ్రూక్ లారెన్ సంప్టర్.బ్రూక్ లారెన్ సంప్టర్ చిన్నప్పటి నుంచి దుస్తులు, నగలు, పాదరక్షలు.. ఏవైబుల్లి డిజైనర్ బ్రూక్...నా సరే తనకిష్టమైనవే వేసుకునేది. బర్త్‌డేలు, పండుగలప్పుడే కాదు మామూలు రోజుల్లోనూ అదే తీరు! ఇంకా చెప్పాలంటే నైట్ గౌన్స్ పట్ల కూడా శ్రద్ధ చూపేది. ఈ తీరును మొదట్లో వాళ్లమ్మ ఎర్రిస్ ఆబ్రీ.. కూతురి మొండితనంగా భావించింది. కానీ రెండేళ్ల వయసు నుంచే బ్రూక్ తనకి స్టయిలింగ్‌లో సలహాలు ఇవ్వటం, ఫ్రెండ్స్ కోసం పిక్నిక్ టేబుల్, ఫ్లవర్ పాట్స్, గిఫ్ట్ బాక్స్‌ను డిజైన్ చేయడం వంటివి చూసి.. కూతురిలో ఈస్తటిక్ సెన్స్, క్రియేటివిటీ మెండు అని గ్రహించింది. బ్రూక్ చూపిస్తున్న ఆసక్తిని ఆమె అమ్మమ్మా గమనించి మనమరాలికి దుస్తులు కుట్టడం నేర్పించింది. దాంతో స్కూల్ నుంచి రాగానే ఫ్యాబ్రిక్‌ని ముందేసుకుని డిౖజñ న్ చేయడం మొదలుపెట్టేది. అలా కేవలం ఐదేళ్ల వయసులోనే బ్రూక్ తన మొదటి ఫ్యాషన్ షోను నిర్వహించింది. దాని ద్వారా వచ్చిన డబ్బుతో రెండు కుట్టుమిషన్లను కొనిపించుకుంది. అమ్మా, అమ్మమ్మను తన అసిస్టెంట్లుగా పెట్టుకుంది. వందకు పైగా డిజైన్స్‌ను క్రియేట్ చేసేసింది. అవి ఆమెకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2022 చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఎమ్మీ అవార్డు వేడుక కోసం ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, నటి తబితా బ్రౌన్కి బ్రూక్ సంప్టర్ ఒక అందమైన గౌన్‌ను డిజైన్ చేసింది. దీంతో ఎమ్మీ వేడుకల కోసం దుస్తులను డిజైన్ చేసిన అతి పిన్న వయస్కురాలిగా బ్రూక్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు. బార్బీ సంస్థకు బేస్ బాల్ బార్బీ, ఫొటోగ్రాఫర్ బార్బీ అనే రెండు థీమ్ డిజైన్స్‌నూ అందించింది. ఈ మధ్యనే తన పేరు మీద ‘బ్రూక్ లారెన్’ అనే ఫ్యాషన్ బ్రాండ్‌నూ స్థాపించింది. ఇప్పుడు ఆ బ్రాండ్ టర్నోవర్ కోటి డాలర్లకు (రూ.84 కోట్లు) పైమాటే! చిన్నపిల్లల కోసం ఈ బ్రాండ్.. చక్కటి దుస్తులను డిజైన్ చేస్తోంది. ఇవి ఎంత ఫ్యాషనబుల్‌గా కనిపిస్తాయో అంతే కంఫర్ట్గానూ ఉంటాయి. అదే బ్రూక్ ‘బ్రాండ్’ వాల్యూ! కొన్ని నెలల కిందటన్ బ్రూక్ ‘టామ్రాన్ హాల్’ షోలోనూ కనిపించింది. అందులో తన డిజైన్స్, ఫ్యాషన్ పరిశ్రమలో తనకెదురైన అనుభవాలు, సాధించిన విజయాలను వివరించింది. కలను సాకారం చేసుకోవడానికి కావాలసింది పట్టుదల అని, లక్ష్య సాధనలో వయసు ఏ రకంగానూ అడ్డు కాదని నిరూపించింది బ్రూక్ లారెన్. స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో గెలవటం కంటే ఆడియన్స్ నా డిజైన్స్‌ను చూసి, కేరింతలతో ఇచ్చే ప్రశంసలే నాకు ఉత్సాహాన్నిస్తాయి. అందుకే ఆ పోటీల్లో నాతో పాటు నా ఫ్రెండ్స్‌కీ డ్రెసెస్ డిజైన్ చేసేదాన్ని.– బ్రూక్ లారెన్ సంప్టర్ -
Manasvi Kottachi: బేబీ మనస్వి
వారసత్వంగా పరిచయమై కొంతమంది పేరు తెచ్చుకుంటే.. మరి కొంతమంది తమ ప్రతిభతో కుటుంబానికి వన్నె తెస్తారు. అలాంటి వారిలో బాల నటి మనస్వి కొట్టాచ్చి ఒకరు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంటరై, తండ్రికే పోటీ ఇచ్చి, వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ లిటిల్ స్టార్ గురించి∙ కొన్ని విషయాలు..⇒ నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. రకరకాల నాన్‌వెజ్ ఐటమ్స్ తినొచ్చనే నాన్నతో కలిసి షూటింగ్స్‌కు వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు నటనపై ఇష్టం, ప్రేమతో పాటు సీరియస్‌నెస్ కూడా పెరిగింది.– మనస్వి కొట్టాచ్చి.⇒∙చెన్నైలో పుట్టి, పెరిగిన మనస్వి తమిళ హాస్య నటుడు కొట్టాచ్చి కుమార్తె. కొట్టాచ్చి తమిళ సినీరంగంలో మంచి గుర్తింపు పొందాడు.⇒ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి సినీ ప్రపంచంలోనే ఉంది మనస్వి. మూడేళ్ల వయసులో ‘సూపర్ డాడీ’ టీవీ షో ద్వారా తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.⇒ చెన్నైలో పుట్టి, పెరిగిన మనస్వి తమిళ హాస్య నటుడు కొట్టాచ్చి కుమార్తె. కొట్టాచ్చి తమిళ సినీరంగంలో మంచి గుర్తింపు పొందాడు.⇒ఈ చిన్నారి నటనకు ముచ్చటపడిన మలయాళ చిత్రపరిశ్రమా చక్కటి అవకాశాలను ఇచ్చింది. అందులో ఒకటే ‘మై శాంటా’ మూవీ. ఇందులో ఆమెది ప్రధాన పాత్ర. శ్రీమణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ చిత్రం ‘కన్మణి పాప’లోనూ ముఖ్య భూమికే! ⇒ తర్వాత ‘ఇమైక్క నొడిగళ్’ అనే చిత్రం ద్వారా బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఇందులో నయనతార కుమార్తెగా నటించింది. ఇది ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆపై ‘దర్బార్’, ‘మామణిదన్’, ‘చంద్రముఖి–2’ వంటి సినిమాల్లోనూ నటించింది.⇒మనస్వి నటించిన ‘మామణిదన్’ను ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దాని ఫలితంగా మనస్వికి బాలీవుడ్‌లోనూ చాన్స్ వచ్చింది. ఆమె నటించిన హిందీ సినిమా ‘బేబీ కాజల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. -
పిల్లలూ దేవుడూ చల్లని వారే
పాటలు హీరో, హీరోయిన్ల సొంత సొత్తు కాదు. ఒకప్పుడు సినిమాల్లో పిల్లల పాత్రలు ఉండేవి. వారికి పాటలు ఉండేవి. పిల్లలు కథను నడిపించేవారు. పాటలు పాడి కథను నిలబెట్టేవారు. పిల్లల పాటల కోసం సినిమాలు హిట్ అయిన సందర్భాలున్నాయి. పిల్లల పాటలతో స్టార్స్ అయిన బాల నటీనటులు ఉన్నారు. కాని నేటి సినిమాల్లో పిల్లల పాటలు కనుమరుగయ్యాయి. వారి గొంతును వినపడనివ్వడం లేదు.పిల్లల పాట మళ్లీ బతకాలి. పిల్లల పాత్ర మళ్లీ నిలవాలి.‘లేరు కుశలవుల సాటి...సరి వీరులు ధారుణిలో’....‘లవ కుశ’లో లవుణ్ణి, కుశుణ్ణి చూడటానికి పల్లెల నుంచి జనం బండ్లు కట్టుకుని వచ్చేవారు. వారి నోటి నుంచి రామాయణ గాథను పాటలుగా విని పరవశించి పోయేవారు. ఉద్వేగంతో ఆనందబాష్పాలు రాల్చేవారు. పెద్దలు రామాయణం చెప్తేనే ఎంతో రుచిగా ఉంటుందే, మరి పిల్లలు చెప్తే ఇంకెంత రుచి!శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా!ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా!చెప్పాలంటే మనవాళ్లు చాలా గొప్పోళ్లోయి! ఏమంటే 1934లోనే లవకుశ తీశారు. అందులోని బాలనటులను, వారి పాటలను చూసి డబ్బులు కుమ్మరించారు. దాంతో దర్శకుడు సి.పుల్లయ్య పిల్లలు ప్రధాన పాత్రలుగా అంటే పిల్లలే అన్ని పాత్రలు చేసేలా ‘సతీ అనసూయ’ (1936) సినిమా తీసి దాంతో పాటు మరో పిల్లల సినిమా ‘ధ్రువ విజయం’ తీసి ఒకే టికెట్ మీద ఈ రెండు సినిమాలు ప్రదర్శించి రికార్డు స్థాపించారు. ఇలా మరో భాషలో జరగలేదు. ఈ విషయం మనవారు ప్రచారం చేసుకోరు. అన్ని పాత్రలను బాలలే ధరించిన సినిమాను దేశంలో తొలిగా తీసింది మనమే.చిన్నప్పుడు పెద్దప్పుడు:పాఠకులు ప్రేక్షకులుగా మారుతున్న కాలం. చదివే కథ నుంచి చూసే కథకు మారాలంటే వారికి ‘సినిమా’ అనే మీడియం మెల్లగా అలవాటు చేయాలి. అందుకని దర్శకులు కథను మెల్లగా చెప్పేవారు. కథానాయిక, నాయకుల జీవితాన్ని బాల్యం నుంచి మొదలుపెట్టి వారు పెద్దయ్యాక ఏం జరుగుతుందో చూపేవారు. అందువల్ల నాటి సినిమాల్లో పిల్లల పాత్రలు తప్పనిసరిగా ఉండేవి. ‘మల్లీశ్వరి’ సినిమాలో చిన్నప్పటి ఎన్టీఆర్, చిన్నప్పటి భానుమతిగా నటించిన మాస్టర్ వెంకటరమణ, బేబీ మల్లిక –‘రావిచెట్టు తిన్నె చుట్టు రాతి బొమ్మలు చెక్కాలోయ్మంచి బొమ్మలు చెక్కాలోయ్ నీ మల్లి బొమ్మలు చెక్కాలోయ్’అని పాడుకుంటే చూడటం ముచ్చటగా ఉంటుంది. మరి ఇవాళ రావిచెట్టు ఎంతమంది పిల్లలకు తెలుసో, తిన్నె అనే మాట ఎంతమంది పిల్లలకు అర్థమవుతోందో!అక్కినేని ‘దేవదాసు’లో చిన్నప్పటి దేవదాసు, చిన్నప్పటి పార్వతి పాడుకుంటారు. స్కూల్ ఎగ్గొట్టి తిరిగే దేవదాసును పార్వతి ఆ పాటలో ఆట పట్టిస్తుంది.‘ఓ దేవదా.. చదువు ఇదేనాఅయ్యవారు నిదరోతే తమరు ఇలాగే దౌడుదౌడా’...ఇక నేటికీ నిలిచి వెలుగుతున్న ‘నిదురపోరా తమ్ముడా’ పాట సంతానంలో రెండు సందర్భాల్లో వస్తుంది. ఒకటి చిన్నప్పుడు, ఒకటి పెద్దప్పుడు. చిన్నప్పటి పాటలో లతా మంగేశ్కర్ మూడు చరణాలు పాడితే, పెద్దప్పటి పాటలో ఒక చరణం ఘంటసాల పాడారు. చిన్నప్పటి పాటలో లతా–‘కలలు పండే కాలమంతా కనుల ముందే కదిలిపోయేలేత మనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే నిదురపోరా తమ్ముడా’... అని పాడుతుంటే కలత నిద్రలతో బతుకుతున్న వారంతా కన్నీరు కారుస్తారు.బొమ్మల పెళ్లి:నాటి సినిమాలు పిల్లల్నే కాదు పిల్లల ఆటపాటల్ని కూడా పట్టించుకున్నాయి. అప్పటి పిల్లలకు బొమ్మల పెళ్లి చేయడం ఒక పెద్ద సరదా. ఈ బొమ్మల పెళ్లిళ్లు పిల్లల మధ్య నిజం పెళ్లిళ్లుగా మారి కథలు మలుపు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు వీడియో గేమ్‌లు ముంచెత్తే ఈ రోజుల్లో పిల్లలు బొమ్మలు అనే మాట ఎత్తడం లేదు. పెద్దలు కూడా సెల్‌ఫోన్ నే బొమ్మగా చేతిలో పడేస్తున్నారు. బొమ్మలు పిల్లలకు నేస్తాలు. వాటినే సర్వస్వంగా భావించి ఆలనా పాలనా చూసి పెళ్లిళ్లు చేసేవారు పిల్లలు. ‘కన్యాశుల్కం (1955)’లో బొమ్మల పెళ్లి కోసం పిల్లలు పాడే పాట చాలా బాగుంటుంది.చేదాము రారే కల్యాణము... చిలకా గోరింక పెళ్లి సింగారము...‘మాంగల్యబలం’ (1959)లో పిల్లలు పాడే బొమ్మల పెళ్లి పాట వైవాహిక జీవితానికి ఒక వ్యాఖ్యానం లాంటిది. ఈ పాటను శ్రీశ్రీ రాశారంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత సంప్రదాయ భావనలను ఇంత బాగా ఎలా రాశాడా అని.హాయిగా ఆలుమగలై కాలం గడపాలివేయేళ్లు మీరనుకూలంగా ఒకటై బతకాలి...తర్వాతి రోజుల్లో అక్కినేని పక్కన హీరోయిన్ గా ‘ప్రేమాభిషేకం’ వంటి సూపర్‌హిట్‌ను సాధించిన శ్రీదేవి బాలనటిగా అదే అక్కినేని ‘శ్రీమంతుడు (1971)’ లో బొమ్మల పెళ్లి పాట పాడింది. అంత చిన్న వయసులో ఆమె ఎక్స్ప్రెషన్ ్స చూడాలి ఇప్పుడైనా. భలే ఉంటాయి. మరి పాటో?చిట్టిపొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలుబుల్లిబుల్లి రాధకు ముద్దుముద్దు రాజుకుపెళ్లండీ పెళ్లి ముచ్చటైన పెళ్లిమర్యాదలు చెప్తూ... అల్లరి చేస్తూ:పిల్లలు అల్లరి చేస్తే ముద్దు. అలాగే వారు బుద్ధిమంతులుగా ఉంటే మరీ ముద్దు. అల్లరి చేయడం పిల్లల హక్కు అనేది మర్చిపోయి, ఇవాళ వాళ్లను ఊపిరి సలపని హాస్టళ్లలో పడేసి తెగ తోమిస్తున్నారు తల్లిదండ్రులు. పరీక్షల భయం ఇవాళే కాదు ఆవాళ కూడా ఉంది. అందుకే ‘పెళ్లి చేసి చూడు’ (1952)లో స్టేజి నాటకంలో చిన్నారి బాలుడు పరీక్షలు ఎగ్గొట్టడానికి దొంగ కడుపునొప్పి తెచ్చుకుని పాడే పాట అల్లరి... చాలా వల్లరి.అమ్మా నొప్పులే అమ్మమ్మ నొప్పులేఫస్టుక్లాసులో పాసవుదామని పట్టుబట్టి నే పాఠాల్ చదివితేపరీక్షనాడే పట్టుకున్నదే బడికెట్లా నే వెళ్లేదే?ఇలా అల్లరి చేసే పిల్లలే సుద్దులు కూడా చెబుతారు. కె.వి.రెడ్డి తీసిన ‘దొంగరాముడు’ అల్లరి చేసే చిన్న అక్కినేనికి, చిన్న సావిత్రి సుద్దులు చెబుతుంది. ఎలా మసలుకోవాలో హితబోధ చేస్తుంది.తెలిసిందా బాబూ ఇపుడు తెలిసిందా బాబు అయవారు తెలిపే నీతులు ఆలించకపోతే వాతలే...కె.విశ్వనాథ్ తొలి సినిమా ‘ఆత్మగౌరవం’లో ఆయన ఎంత మంచి పాట పెట్టారంటే ఇంటికి వచ్చిన అతిథులను ఆ ఇంటి పిల్లలు ఎలా గౌరవించి ఆహ్వానించాలో అందులో ఉంటుంది. ఇంటి సంస్కారం పిల్లల ప్రవర్తనలోనే తెలుస్తుంది. ఇవాళ ఇంటికి బంధువులొస్తే పిల్లలు పలకరించనైనా పలకరించట్లేదు– నమస్కారం పెట్టే సంగతి తర్వాత. అంతే కాదు తమ గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్నారు. తల్లిదండ్రులు వారిని అందుకు ఎంకరేజ్ చేస్తున్నారు. కాని ఆత్మగౌరవంలో రేలంగి, గుమ్మడి అతిథులుగా వస్తే పిల్లలు ఎంత బాగా పాడతారో!మారాజులొచ్చారు మహరాజులొచ్చారు మా ఇంటికొచ్చారుమామంచి వారంట మనసున్న వారంట మాకెంతో నచ్చారు...భక్తి... దైవభక్తి:పిల్లలకు దేవుడు మంచి స్నేహితుడు. పిల్లలు దేవుని మీద సందేహం లేని భక్తి పెట్టుకుంటారు. పిల్లల ద్వారా భక్తిని చెప్పేందుకు ‘యశోదకృష్ణ’, ‘భక్త ప్రహ్లాద’, ‘భక్త ధ్రువ మార్కండేయ’లాంటి సినిమాలు వచ్చి ప్రజాదరణ పొందాయి. ‘యశోదకృష్ణ’తో శ్రీదేవి, ‘భక్త ప్రహ్లాద’తో రోజా రమణి పెద్ద స్టార్స్ అయ్యారు. ‘భక్త ప్రహ్లాద’లో ప్రహ్లాదుడు పాడిన పాటలు హిట్.నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనంమరోపాట–జీవము నీవే కదా...నేటికీ నిలిచి ఉన్నాయి.ఇక ‘లేత మనసులు (1966)’తో స్టార్ అయిన ‘కుట్టి పద్మిని’ పాడిన ఈ పాట 60 ఏళ్ల తర్వాత కూడా చల్లదనాన్ని కురిపిస్తూనే ఉంది.పిల్లలూ దేవుడూ చల్లని వారేకల్లకపటమెరుగని కరుణామయులే...‘మూగనోము’లో–తల్లివి నీవే తండ్రివి నీవేచల్లగ కరుణించే దైవము నీవే....సంభ్రమం... సందేహం:పిల్లలకు సందేహాలు జాస్తి. అలాగే ప్రతిదానికీ వారు వింత పడతారు. ఇప్పటి పిల్లల్లా అన్నీ గుగుల్ ద్వారా తెలుసుకొని నిమ్మళంగా ఉండిపోరు. పెద్దలను విసిగించేవారు. అలా పిల్లలకూ పెద్దలకూ ఒక సంభాషణ జరిగేది. ‘బాలరాజు కథ’లో ఈ పాట చూడండి–అడిగానని అనుకోవద్దు చెప్పకుండా దాటేయొద్దుఏమిటీ రహస్యం స్వామి ఏమిటీ విచిత్రంఆ రోజుల్లో ఫోన్ ఒక వింత. ఇంట్లో ఫోన్ ఉండటం ఒక హోదా. ఇరుగింటి పొరుగింటి వారికి అది పి.పి. నంబర్. ఇంట్లో పిల్లలకు ‘ట్రింగ్ ట్రింగ్’మన్నప్పుడల్లా సరదా. ఫోన్ రాకపోయినా రిసీవర్ చెవిన పెట్టుకుని మాట్లాడతారు. పాట పాడతారు ‘బడి పంతులు’లో బుల్లి శ్రీదేవి పాడింది.బూచాడమ్మ బూచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడుకళ్లకెపుడు కనపడడు కబురులెన్నో చెబుతాడు...అనుబంధాల పాట:పెద్దవాళ్ల సమస్యలు పిల్లలకూ కష్టాలు తెస్తాయి. పిల్లలు చలించిపోతారు. ఆ అనుబంధాల కోసం పరితపిస్తారు. తమ లోపలి భావాలను పాట ద్వారా చెబుతారు. తల్లిదండ్రులను కోల్పోయి చెల్లెలితో మిగిలిన అన్న పాడే ఈ జోలపాట ఎంత ఆర్ద్రమైనది... ‘చిట్టి చెల్లెలు’లో.అందాల పసిపాప అన్నయ్యకు కనుపాపబజ్జోవే... బుజ్జాయి... నేనున్నది నీ కొరకే...నీకన్నా నాకెవరే...‘భార్యాబిడ్డలు’ సినిమాలో కన్నతండ్రయిన అక్కినేనిని దూరం చేసుకుని అతణ్ణి వెతుకుతూ వీధుల్లో తిరుగుతూ అతడి పిల్లలు పాడే పాట... ఇందులో కూడా శ్రీదేవి ఉంది...చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావునీవు లేక దిక్కులేని చుక్కలయ్యాముఎక్కడైనా తల్లిదండ్రులు పిల్లలకు జోకొడతారు. కాని ‘రాము’లో తల్లిదండ్రులకు జోకొడుతూ చిన్నారి కొడుకు పాడే పాట హిట్.పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండుపాటలు పాడి జోకొట్టాలి జోజోజో...ఇక పిల్లలకు ఫ్రెండ్స్ అంటే ఇష్టం కదా. స్నేహంలో వారికి అంతరాలు ఉండవు, అభిమానం తప్ప! అందుకే స్నేహాన్ని నిర్వచిస్తూ ‘బాల మిత్రుల కథ’లోని ఈ పాట గొప్పగా ఉంటుంది.గున్నమామిడి కొమ్మ మీద గూళ్లు రెండున్నాయిఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది...పాపం పసివాడు:ఒక పాట... అమ్మానాన్నల కోసం తప్పి పోయిన పిల్లవాడు పరితపిస్తూ పాడే పాట సినిమాను సూపర్‌హిట్ చేయగలదు. ‘లాస్ట్ ఇన్ ద డెజర్ట్’ అనే ఇంగ్లిష్ సినిమా ఆధారంగా తెలుగులో తీసిన ‘పాపం పసివాడు’ సినిమా చూసిన మహిళా ప్రేక్షకులు కన్నీరు మున్నీరయ్యారు. కారణం తప్పిపోయిన పిల్లాడిలో తమ పిల్లల్ని చూసి ఇలాంటి పరిస్థితి వస్తే అనుకోవడమే. మాస్టర్ రాము నటించిన ఈ పాట ఆత్రేయ రాసిన తేలిక మాటల పాట పిల్లల భావోద్వేగాన్ని గొప్పగా చూపుతుంది.అమ్మా చూడాలి... నిన్నూ నాన్నను చూడాలినాన్నకు ముద్దులు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దుర పోవాలి...అంజలి అంజలి అంజలి:ఆ తర్వాత కూడా పిల్లల పాత్రలు, వారి పాటలు కొనసాగాయి. ‘బాల భారతం’ తీశారు. టి.కృష్ణ ‘రేపటి పౌరులు’ సినిమా తీశారు. ‘మణిరత్నం ‘అంజలి’ తీసి హిట్ కొట్టారు. గుణశేఖర్ ‘బాల రామాయణం’ తీశారు. ‘లిటిల్ సోల్జర్స్’ పిల్లల కోసం తీసిన చివరి హిట్ సినిమాగా నిలిచింది. ‘స్వాతి కిరణం’లో మాస్టర్ మంజునాథ్ బాల సంగీతకారుడుగా ‘ఆనతినియ్యరా హరా’...లాంటి క్లాసిక్ ఇచ్చాడు. ‘మనసంతా నువ్వే’ సినిమాలోని ‘తూనీగా... తూనీగా’ పాట ఇంటింటి పాటైంది. ‘అమ్మ రాజీనామా’, ‘దేవుళ్లు’ తదితర చిత్రాల్లో పిల్లలు పాటలు పాడి మెప్పించారు.అయితే ఆ తర్వాత ఫ్యాక్షన్ సినిమాలు వచ్చి తొడ గొట్టే పిల్లలు, కత్తి పట్టే పిల్లలు వచ్చారు. ఇవాళ టీవీల నిండా పిల్లలు అశ్లీల నృత్యాలు చేసే పెద్దల పాటలే తప్ప పిల్లల పాటలంటూ లేకుండా పోయాయి. కనీసం పిల్లలతో పాటు పెద్దలు పాడే పాటలైనా.పిల్లల పాటలు మళ్లీ బతకాలని కోరుకుందాం.ముద్దు ముద్దు నవ్వు... బజ్జోమ్మ నువ్వుతెలుగు సినిమాల్లో పిల్లలు తాముగా పాటలు పాడితే పిల్లల కోసం పెద్దలు తమంతట తాముగా పాడిన పాటలు చాలా ఉన్నాయి. అందరూ ఇష్టపడేవి ఉన్నాయి. ఆ పాటలు ఇప్పటికీ వినపడుతూనే ఉన్నాయి. ‘బంగారు పాప’లో ఎస్వీ రంగారావు అంతటి నిలువెత్తు మనిషి ఒక చిన్నారి పాపను చూసి పాడే ‘తాధిమి తకధిమి తోల్బొమ్మ’ పాట ఎందరికో ఇష్టం. ఆర్ద్రమయం. ‘ఖైదీ కన్నయ్య’లో ‘ఈ నిజం తెలుకో తెలివిగా నడుచుకో’ ఇప్పుడు కూడా ప్రతి బాలబాలికలకు బోధ చేసే గీతం. తర్వాతి రోజుల్లో ‘మంచి మనుషులు’లో శోభన్‌బాబు పాడిన ‘ఇది నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట’ కూడా ఇదే కోవలో హిట్‌గా నిలిచింది. ‘పండంటి కాపురం’లో ‘బాబూ... వినరా అన్నాదమ్ముల కథ ఒకటి’ పాట పిల్లలకు అనుబంధాలు చెప్తే, ‘ఎదగడానికెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందర వందర’ అని బాల్యాన్ని అనుభవించాల్సిన వయసులో భవిష్యత్తు గురించి కోచింగ్‌లు తీసుకుంటున్న నేటి బాలల కోసం అన్నట్టుగా ‘అందాల రాముడు’లో అక్కినేని పాడుతారు. ఇక పిల్లల పుట్టిన రోజులకు అందరూ పాడేవారే. ‘వెలుగు నీడలు’లో ‘చిట్టిపొట్టి చిన్నారి పుట్టిన రోజు చేరి మనం ఆడిపాడే పండుగరోజు’లో సావిత్రి హుషారుగా పిల్లవాడితో పాటు గెంతడం కనిపిస్తుంది. ‘బంగారు కలలు’లో ‘పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి’, ‘తాత మనవడు’లో మనవడిని పట్టుకుని అంజలీ దేవి ఉద్వేగంగా పాడే ‘ఈనాడే బాబూ నీ పుట్టిన రోజు’ గొప్ప ఆశీర్వాద వచనం. ఇక పిల్లలను బుజ్జగించే, ఊరడించే పాటలు సినిమాల్లో బోలెడు. గంభీరంగా ఉండే ఎన్.టి.ఆర్ కూడా పసిపిల్లాడిని చూసి ‘ఆడబ్రతుకు’లో ‘బుజ్జిబుజ్జి పాపాయి.. బుల్లిబుల్లి పాపాయి.. నీ బోసి నవ్వులలో పూచే పున్నవి వెన్నెలలోయి’ అని పాడతాడు. ఇదే పి.బి.శ్రీనివాస్ ‘ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు జాజిమల్లె పువ్వు బజ్జొమ్మ నువ్వు’ పాట ‘సత్తెకాలపు సత్తెయ్య’లో చలం గొంతులో పాడతాడు. ఈ హీరో చలమే ‘సంబరాల రాంబాబు’లో చిన్నారి బాబుకు జోల పాడుతూ చందమామను సాయమడుగుతూ ‘మామా.. చందమామా.. వినరావా నా కథ’ అని అందుకుంటాడు. ‘జీవన తరంగాలు’లో శోభన్‌బాబు పాపకు జూ మొత్తం చూపుతూ ‘ఉడతా ఉడతా ఉచ్’ పాడటం రేడియో శ్రోతలు ఇప్పుడూ వింటారు. ‘స్వయంకృషి’లో చిరంజీవి ‘పారా హుషార్.. పారా హుషార్... తూరుపమ్మ ఉత్తరమ్మ పడమరమ్మ దక్షిణమ్మ పారా హుషార్’ అని పాడి వీపున కట్టుకున్న చిన్నారికి ఉల్లాసం కలిగిస్తాడు. ‘కలిసి పాడుదాం తెలుగు పాట కలిసి సాగుదాం వెలుగుబాట’ (బలిపీఠం), ‘భారత మాతకు జేజేలు బంగరుభూమికి జేజేలు’ (బడిపంతులు) అని పాడే ఉపాధ్యాయులు ఇప్పటి సినిమాల్లో ఎక్కడ? ఏమైనా ఆ రోజులే వేరు ఆ పాటలే వేరు. -
Sakshi Special: మొక్కవోని మట్టిబిడ్డలు
మట్టి ఎవరికీ అపకారం చేయదు. నాగలితో దున్నినప్పుడల్లా రైతుకు పంట ఇవ్వాలనే అనుకుంటుంది. కాని ఒక్కోసారి రుతువులు మోసం చేస్తాయి. మరోసారి మార్కెట్ మోసం చేస్తుంది. ఇంకోసారి అకాల వర్షం. అప్పుడు ఏమవుతుంది?ప్రతిరోజూ పొలానికి వెళ్లి తిరిగొచ్చే నాన్న ఆ రోజు రాడు. ‘నా పంటను ఎందుకు నాకు దక్కకుండా చేశావ్’ అని దేవుడితో పోట్లాడటానికి వెళ్లిపోతాడు. అప్పుడు అమ్మ ఉంటుంది. ధైర్యం నింపుకో అని చెప్పే మట్టి ఉంటుంది. ఆ పిల్లలు నిలబడతారు. నిలబడాలి. అందరూ తోడైతే వారి ముఖాలలో ఇంద్రధనువులు సాధ్యమే. ఆత్మహత్యలు చేసుకుని మరణించిన రైతుల పిల్లలను రానున్న ‘బాలల దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేకంగా కలిసింది సాక్షి. ఇక సందడి మొదలైంది.‘మీరు ఫ్రెండ్స్‌తో కలిసి నిద్రపోతారా?’‘సెలవుల్లో పొలానికి వెళ్లి వ్యవసాయం చేస్తారా?’‘నైట్‌టైమ్ స్కై అంతా క్లియర్‌గా ఉండి స్టార్స్ కనపడతాయా?‘మీకు లోన్లీగా అనిపించినప్పుడు ఏం చేస్తారు’‘విలేజస్‌లో ఏమేమి ఇంటెరెస్టింగ్‌గా ఉంటాయి’...సినిమాల్లో అందరూ మెచ్చేలా నటించిన లిటిల్ స్టార్స్ జీవితంలో సవాళ్లతో పోరాడుతున్న రియల్స్టార్స్ను ‘సాక్షి’, ‘రైతు స్వరాజ్యవేదిక’ ఉమ్మడి ప్రయత్నం వల్ల కలిశారు. ‘బాలల దినోత్సవం’ సందర్భంగా హైదరాబాద్‌లోని తార్నాకలో రానున్న ప్రత్యేకంగా జరిగిన కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, మెదక్ జిల్లాలకు చెందిన ఐదు రైతు కుటుంబాలకు చెందిన 11 మంది పిల్లలు ముగ్గురు లిటిల్ స్టార్స్‌ను కలిశారు. ‘వాల్తేరు వీరయ్య’లో నటించిన శ్రేష్ట, ‘కేజీఎఫ్’లో నటించిన భాను ప్రకాశ్, స్పైడర్, స్వాగ్ వంటి మూవీస్‌లో చేసిన హనీషాలు ఈ చిన్నారులతో కలిసి కబుర్లు చెప్పారు. ఆ పిల్లలు ఈ పిల్లలు పరస్పరం మాట్లాడుకున్నారు. లిటిల్ స్టార్స్ తమ సినిమాల్లో తాము చెప్పిన డైలాగులు చెప్పారు. డాన్సులు చేశారు. షూటింగ్‌కు తీసుకెళతామన్నారు. అలా ఆ పిల్లల మనసు తేలిక చేశారు. కారణం? వారి నాన్నలు వారితో లేరు. వారి నాన్నలంతా రైతులు. వ్యవసాయంలో వచ్చిన కష్టాలు ఆ నాన్నలను హటాత్తుగా లేకుండా చేశాయి. ఆ క్షణం నుంచి ఆ పిల్లలకు ఆమ్మే నాన్నయినా అమ్మయినా. అయితే పిల్లలు కూడా ధైర్యం తెచ్చుకున్నారు. ఇలాంటి పిల్లలకు సాయం అందించడానికి ‘రైతు స్వరాజ్యవేదిక’ అనే సంస్థ పని చేస్తోంది. ఆ సంస్థ, సాక్షి కలిసి ఈ పిల్లల సందడిని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా ఆ రైతుబిడ్డలు ఏమన్నారు?జీవితం అంటే ఏమిటో తెలిసిందిరైతు బిడ్డలను చూసిన స్టార్ సెలబ్రిటీలు ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. వారి పట్ల స్నేహహస్తం సాచారు. వారి స్పందన తెలియచేశారు. ‘చిన్న చిన్న కష్టాలకే ఎంతో బాధ పడతాం, కానీ వీరి జీవితకాలవేదన చూశాక మేమెంత మంచి జీవితంలో ఉన్నామో తెలుస్తుంది. ఈ ఒక్కరోజు నాకు జీవితాన్ని పరిచయం చేసింది. భవిష్యత్‌లో కూడా వీరి సమస్యలపై దృష్టి సారిస్తాను. సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని నిర్ణయించుకున్నాను’ అని భాను ప్రకాశ్ అంటే ‘నాన్న లేకుంటే జీవితం ఎంత చీకటి మయమో తెలిసింది. నాలాంటి పిల్లలే వారు. కానీ నాకున్న సౌకర్యాల్లో ఒక్కశాతం కూడా వారికి లేవు. వారితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండిపోవాలనుంది’ అన్నది హనీషా రెస్పాన్స్. ‘నా కన్నా పెద్దగా ఉన్న ఆ అక్కలు, అన్నలు ఏడుస్తుంటే నాకు చాలా బాధేసింది. వారి కోసం నేను డ్యాన్స్ చేశాను. ‘నా సినిమా షూటింగ్‌లకు తీసుకెళతానని చెప్పాను. వారి ఊరికి కూడా వెళతాను తొందరలో’ అంది శ్రేష్ట.వారి కాళ్ల మీద వాళ్లే నిలబడాలి‘మాది కౌలు వ్యవసాయం., పంట పండకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయాం. అవి కట్టలేక అదే పత్తి చేనులో పత్తి మందు తాగి చనిపోయడు నా భర్త. అప్పటి నుంచి మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నా కూలీ, ఈ ఆవు పాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాను’ అని దేవరకొండకు చెందిన సరోజ చెప్తే, ‘గుంట భూమి లేదు. 8 లక్షల అప్పు మిగిలింది. అప్పులోళ్ల్ల బాధ భరించలేక ఆయన తనువు చాలించాడు. ఇద్దరూ పాపలే.. వారి కాళ్ల మీద వారు నిలబడి బతకగలగాలనే లక్ష్యంతో చదివిస్తున్నాను’ అని మరో తల్లి అంది. ‘మాది కౌలు వ్యవసాయం. మిర్చి పంటలో వచ్చిన నష్టాలకు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నా కొడుక్కు 2 నెలలు. ఎన్ని ఆఫీసులు తిరిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదు. వ్యవసాయం పై మక్కువ ఉన్నా నా బిడ్డను మాత్రం రైతుగా మారనివ్వను’ జయశంకర్ భూపాల పల్లి జిల్లాకు చెందిన మానస అన్నారు.‘ఒక్కసారన్నా లాభం రాకపోతుందా అని ఎనిమిదేళ్లు కౌలు చేశాం. ఒక్కసారి మిర్చి పంట పండినా ధర లేదు. దాంతో నా భర్త 2019 ఆత్మహాత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు. ఇల్లు కూడా లేక నాన్న వాళ్లింట్లో ఉంటున్నాను’ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన సుమలత అంటే ‘7,8 ఏళ్లు కౌలు చేశాం. రేటు ఉన్నప్పుడు పంట పండలేదు, పండినప్పుడు «దర లేదు. రెండూ ఉంటే వర్షాలు లేవు. ఆయన ఆత్మహాత్య చేసుకున్నప్పుడు నా గుండె కూడా ఆగినంత పనైంది. కానీ రెండేళ్ల బాబు, నాలుగేళ్ల పాప. వారి కోసం బతికి ఉన్నాను’.యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మమత అన్నారు.చదువుకుని ఎంతో ఎదుగుతున్నారు‘రైతు స్వరాజ్య వేదిక’ రైతుల సంక్షేమం కోసం 2011లో ఏర్పడింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు అత్యంత సంక్షోభంలో ఉన్నాయని మా అధ్యయనంలో తెలుసుకుని వారి కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. తెలంగాణ వచ్చాక ఈ పదేళ్లలో 7600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 80 శాతం కౌలు రైతులే. కౌలు రేట్లు పెరగడం, ప్రభుత్వ సహకారం పట్టాదారులకే ఉండటం వంటి కారణాలతో ఈ ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఈ 7600 మందిలో 1600 మందిని మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. మిగతా వారివి రైతు ఆత్మహత్య కాదంటారు. దీనికి కౌలు డాక్యుమెంట్లు, అప్పుల కాగితాలు అడుగుతారు. ఇది భార్యభర్తల గొడవ, బిడ్డ పెళ్లి ఖర్చువల్లే, కొడుకు చదువు, ఇల్లు కట్టుకున్నారు.. ఇలాంటి కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నారంటూ వ్యవసాయ సంబంధ అంశాన్ని దూరం చేస్తున్నారు. కానీ వారి ఆదాయ వనరు మాత్రం వ్యవసాయం అని పరిగణించట్లేదు. వివిధ సంస్థల సహకారంతో ఈ కుటుంబాలకు ఉపాధి కోసం బర్రెలు, మేకలు కొనిస్తున్నాం. పిండి గిర్నీ, షాప్‌లు పెట్టిస్తున్నాం. పిల్లల చదువులకూ సహకారం అందిస్తున్నాం. ఇలా సహకారం అందుకుని ఇంజనీర్లుగా, సాఫ్ట్వేర్లుగా, ఉత్తమ క్రీడా కారులుగా ఎదిగిన రైతు బిడ్డలు ఉన్నారు.– కొండల్ రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కన్వీనర్లాయర్ అవుతాను8వ తరగతి చదువుతున్నాను. అందరూ వారి నాన్నలతో హాయిగా ఆడుకుంటుంటే నేను మాత్రం హాస్టల్లో ఆహారం, నీరు పడక ఎలర్జీలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. మా నాన్న ఉంటే నన్ను కూడా మంచి ప్రైవేటు స్కూల్లో చదివించేవారు అని బాధగా ఉంటుంది. అయినప్పటికీ అమ్మ కష్టాలను దూరం చేయడానికి లాయర్ అవ్వాలనే ఆశయంతో ఉన్నాను. సినిమాల్లో చూసే సెలబ్రిటీలతో ఆడుకోవడం చాలా ఆనందంగా ఉంది. – మింటూఅమ్మను బాగా చూసుకుంటానాన్న మరణం నన్నెంతగానో కుంగదీసింది. కానీ ఆ ఆవేదనను చదువులపై చూపించలేదు. బాగా చదువుకుంటున్నాను. అమ్మను బాగా చూసుకోవాలి అనేది నా కోరిక. నాన్న ఉండగా ఎప్పుడూ పనికెళ్లని అమ్మ నా కోసం కూలి పనికి వెళుతోంది. పైగా తనకు కిడ్నీ ఆపరేషన్ అయ్యింది. మా కష్టాలను తట్టుకునే శక్తి మాకుంది. మీరంతా మాతో ఉన్నారనే భరోసా ఇస్తే చాలు. – తేజస్వినిమేమే తయారవుతాంఉదయాన్నే నాన్న గుర్తుకొస్తాడు. అందరు నాన్నలు వారి పిల్లల్ని స్కూలుకు తీసుకెళుతుంటే చూసి. అమ్మ పొలం పనికి తొందరగా వెళ్లాలని మేమే త్వరగా తయారయ్యి మా స్కూల్‌కు వెళతాం. నాన్నలా కావొద్దని బాగా సంపాదించాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. నాన్న చేసిన అప్పుల కష్టాల్లో అమ్మ ఉంది. అందుకే ఎలాంటి అతి ఖర్చులు చేయం. పెద్దయ్యాక అమ్మను బాగా చూసుకోవాలి. – చింటూ అమ్మ కోసం నవ్వుతాహాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. డాక్టర్ అవ్వాలి, నాన్న చేసిన అప్పులు తీర్చి అమ్మకు భారం తగ్గించాలి. మా హాస్టల్లో ఫ్రెండ్స్ దగ్గరికి అమ్మానాన్నలు వస్తే.. మా దగ్గరికి అమ్మ మాత్రమే వస్తుంది. అప్పుడు ఏడుపొస్తుంది. కాని అమ్మ బాధపడుతుందని నవ్వుతా. – అక్షిత– హనుమాద్రి శ్రీకాంత్– డి.జి. భవానిఫొటోలు: పి. మోహనాచారి