కొందరు చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుంది. దాంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలువుతుంది. తమకు దగ్గరి వాళ్లలో లేదా తమ బంధువుల్లో ఇలాగే జరిగిందనీ, మాటలు రావడం కొందరిలో ఇలాగే ఆలస్యమవుతుంటుందని సముదాయించడం మామూలే. ఇలా పిల్లలకు మాటలు రావడంలో ఆలస్యం జరగడానికి కారణాలేమిటి, ఆ సమస్యలను అధిగమించడం ఎలా అన్న అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.
పిల్లల్లో సాధారణంగా 10 నెలలు లేదా ఏడాది నాటికి కొన్ని కొన్ని ముద్దుమాటలు (బాబ్లింగ్) మొదలవుతుంది. రెండేళ్ల వయసు నాటికి తమ భావాలను చాలావరకు కమ్యూనికేట్ చేయ గలుగుతుంటారు. మూడేళ్లకు దాదాపుగా అన్ని మాటలూ వచ్చేస్తాయి. కానీ కొందరు పిల్లల్లో మాట రావడం కాస్త ఆలస్యమవుతుంది. వినికిడి వ్యవస్థ బాగుందని తెలిశాక... అలా మాటలు రావడం ఆలస్యమైన పిల్లల్లో చాలామంది సాధారణంగా స్కూల్లో చేర్చే వయసు నాటికి తమంతట తామే మాట్లాడగలుగుతారు.
కారణాలు...
పిల్లల్లో మాటలు రావడం ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిల్లో... వినడానికి అవసరమైన వినికిడి వ్యవస్థ, అలాగే మాట్లాడటానికి అవసరమైన వోకల్ కార్డ్స్, మాట్లాడేందుకు ఉపయోగపడే గొంతులోని కండర నిర్మాణం... ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ, కొందరిలో సహజంగానే మాటలు రావడం ఆలస్యమవుతుంటుంది. అలాగే చిన్నారుల్లో వారి భాష ఓ స్థాయి పరిణతికి రావడంలో జరిగే ఆలస్యం (లాంగ్వేజ్ మెచ్యురేషన్ డిలే) కావడం కూడా దీనికి కారణం. చాలావరకు వంశ΄ారంపర్యంగా ఇలా జరుగుతుంటుంది. అమ్మాయిలతో ΄ోలిస్తే ఈ సమస్య అబ్బాయిల్లోనే ఎక్కువ.
కొన్ని సందర్భాల్లో అనారోగ్యాలకు సూచిక...
కొందరు చిన్నారుల్లో మాటలు రావడంలో ఆలస్యం జరగడం అనేది కొన్ని సందర్భాల్లో అండర్‌లైయింగ్ ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఇలా మాటలు రాక΄ోవడం చాలా రకాల ఆరోగ్య సమస్యలను సూచించే ఒక లక్షణం కావచ్చు. ఉదా: వినికిడి లోపాలు, మానసికమైన సమస్యలూ, ఆటిజం వంటి కండిషన్, భాషను అర్థం చేసుకోవడం, అభివ్యక్తీకరించడంలో సమస్యలు... మొదలైనవాటిల్లో ఏదో ఒకదానివల్ల మాటలు రావడం ఆలస్యం కావచ్చు.
కొన్నిసార్లు అది ఎదుగుదల సమయంలో వచ్చే ఇతర ఆరోగ్య లోపాల వల్ల కూడా అయి ఉండవచ్చు. ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ డిజార్డర్ ఉన్న పిల్లలు భాషను ఒక కమ్యూనికేటివ్ సాధనంగా వాడటంలో విఫలమవుతారు.
అయితే వారిలోని తెలివితేటలు, వినికిడి, ఉద్వేగభరితమైన ఫీలింగ్స్... తదితర విషయాల్లోనూ మామూలుగానే ఉంటారు. తమ సంజ్ఞలు, సైగల ద్వారా కమ్యూనికేషన్ అంతా సాధారణంగానే చేస్తు్తంటారుగానీ, మాటలు లేదా పదాలు పలకడం (వర్బల్ ఎక్స్‌ప్రెషన్స్) ద్వారా తమ అభి్ర΄ాయాలను వెల్లడించడం మాత్రం చాలా పరిమితంగా ఉంటుంది.
ఈ పిల్లల విషయంలో పరిష్కారాలేమిటి?
ఇలాంటి పిల్లల విషయంలో... వారు మాటలు నేర్చుకోవడం / మాట్లాడటం అనే ప్రక్రియ ఎందుకు ఆలస్యం అవుతోందో తెలుసుకోవడం తప్పనిసరి. ఇందుకు పూర్తిస్థాయి ఇవాల్యుయేషన్ అవసరం. ఇందుకోసం... ‘ఎర్లీ లాంగ్వేజ్ మైల్‌స్టోన్ స్కేల్ టెస్ట్’, ‘స్టాన్‌ఫోర్డ్ ఇంటెలిజెన్స్ టెస్ట్’, ఆడియోమెట్రీ, బ్రెయిన్ స్టిమ్యులస్ రెస్పాన్స్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.
ఈ పరీక్షల వల్ల మాటలు రాక΄ోవడానికి కారణాలేమిటి, ఆ కారణాల తీవ్రత ఎంత, వాటి ప్రభావాలు ఏ మేరకు ఉన్నాయన్న పలు విషయాలు తెలుస్తాయి. ఇలాంటి పిల్లలున్నవారు ఒకసారి మీ కుటుంబ పిల్లల డాక్టర్‌కూ అటు తర్వాత అవసరాన్ని బట్టి స్పీచ్ థెరపిస్ట్‌కూ చూపించాలి. ఒకసారి సమస్యనూ, తీవ్రతనూ తెలుసుకుంటే... ఆ తర్వాత ‘స్పీచ్ పాథాలజిస్ట్’లు పిల్లలకు మాటలు వచ్చే శిక్షణను మొదలుపెడతారు.
తల్లి దండ్రులకూ కొంత శిక్షణ అవసరం...
ఇలాంటి పిల్లలకు మాటలు నేర్పే విషయంలో తల్లిదండ్రులు చాలా ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. వాళ్లకూ కొంత శిక్షణ అవసరమవుతుంది. తల్లిదండ్రులు పూర్తి సహనంతో ఉంటూ, భాష విషయంలోతామూ పిల్లల స్థాయికి చేరుకుని, వాళ్లకు మాటలు నేర్పాలి. తల్లిదండ్రులు నిత్యం ఆ పిల్లలను ఉత్సాహపరుస్తూ... వారికి భాషతోటు ఇతర నైపుణ్యాలూ నేర్పడానికి సంసిద్ధంగా ఉండాలి.
(చదవండి: నలుపు తగ్గేదెలా..?)
Comments
Please login to add a commentAdd a comment