పిల్లల ఆరోగ్యం కోసం, భవిష్యత్తులో వారిలో ఆరోగ్యకరమైన అలవాట్లు పాదుకునేలా చేయడానికి తల్లిదండ్రులు చేయాల్సినవి, వారికి నేర్పాల్సినవి ఇవి...
పళ్లు
ఉదయం, సాయంత్రం ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయించాలి. బ్రష్ వెనక్కి ముందుకి కాకుండా, పళ్లపై బ్రష్‌ను గుండ్రంగా తిప్పుతున్నట్లుగా బ్రష్ చేయించడం అలవాటు చేయాలి.
స్నానం
ప్రతిరోజూ స్నానం చేయించాలి. స్నానానికి గోరువెచ్చని నీళ్లు మంచివి.
జుట్టు
పిల్లల జుట్టును రోజూ పరిశుభ్రమైన దువ్వెనతో దువ్వాలి. అమ్మాయి జుట్టును మరీ టైట్‌గా దువ్వకూడదు. ఒకరి దువ్వెన మరొకరు వాడకూడదు.
గోళ్లు
చేతివేళ్ల గోళ్లను, కాలివేళ్ల గోళ్లను ప్రతివారం నెయిల్ కట్టర్‌తో కత్తిరిస్తూ ఉండాలి. మరీ లోపలికి కాకుండా చిగురు తగలకుండా జాగ్రత్తగా కత్తిరించాలి.
దుస్తులు
పిల్లలకు ఎప్పుడూ ఫ్రెష్ దుస్తులు తొడగాలి. ఆడుకుని చెమటతో తడిసినవాటిని ఎప్పటికప్పుడు మార్చాలి. ఉతికిన బట్టలు ఎండలో సరిగా ఆరకపోతే అవి కాస్త వాసన వేస్తుంటాయి. అలాంటివి తొడగకూడదు.
నిద్ర
పిల్లలు ప్రతిరోజూ ఒకేవేళకు నిద్రపోయేలా అలవాటు చేయాలి. వాళ్లను కంటినిండా నిద్రపోనివ్వాలి. నిద్రలోనే వాళ్ల మెదడు వికాసం, చదివినది గుర్తుపెట్టుకునేలా మెదడులో స్థిరపడటం జరుగుతాయి.
(చదవండి: నలత లేకుండా చలాకీగా..!)
Comments
Please login to add a commentAdd a comment