ఈ ప్రపంచంలో అన్నింటి కంటే విలువైనది బాలల ముఖాల్లో విరిసే చిరునవ్వు. సూర్యుడు, చంద్రుడు ఈ భూమ్మీదకు తొంగి చూసేది పిల్లల ముఖాన చిరునవ్వును చూడటానికే. గాలి వీచేది వారి ముంగురులను అల్లరి పెట్టి ఆడటానికే. నీరు ప్రవహించేది వారు కేరింతలు కొట్టడానికే. పిల్లల్ని సంతోష పెట్టడానికే అడవులు ఆకుపచ్చను పులుముకుంటాయి. పిల్లల్ని కళ్లు ఇంతింత చేసుకుని చూడటానికే మృగాలు వింత ఆకారాలు ధరిస్తాయి. నడయాడే ఈ బుజ్జి దేవతల కోసమే భూమి క్రమం తప్పకుండా తిరుగుతూ విరగకాసే పంటలను ఇస్తూ వారి నోటికి గోరు ముద్దలు అందేలా చూడటానికి తపన పడేది. పిల్లల కోసమే కదా తల్లిదండ్రులు ఆజన్మాంతం కష్టపడేది.
అయితే అందరు పిల్లలకూ అన్ని భాగ్యాలు దొరకవు. ప్రకృతి వారికి పరీక్షలు పెడుతుంది. వారికి సవాళ్లు విసురుతుంది. అందరితోపాటే మీరు కూడా అన్నట్టుగా వారి వాటాకు తగ్గ కష్టాలు ఇస్తుంది. అయితే పిల్లలకు మించిన వీరులు ఉండరు. వారిని మించిన శూరులు ఉండారు. కాసేపు చిన్నబుచ్చుకుంటారు కాబోలు. ఆ తర్వాత వారు తమ లోపలి శక్తిని వెలికి తెస్తారు. సవాళ్లకు జవాబు చెబుతారు. పెద్దవాళ్లకే స్ఫూర్తిపాఠాలు నేర్పిస్తారు.
నవంబర్ 14 బాలల దినోత్సవం.
ఈ సందర్భంగా రేపటి నుంచి తమ జీవితాల్లోని సవాళ్లను, అనారోగ్యాలను, ఏకాకితనాలను తట్టుకుని నిలబడ్డ బుల్లి హీరోలను కలిసి వారి ఉత్సాహాన్ని తోడు చేసుకుని ఆ సంతోషాన్ని పాఠకులకు పంచాలని సంకల్పించింది సాక్షి. సినిమా రంగంలోని ఛైల్డ్ సెలబ్రిటీలను వారివద్దకు తీసుకెళ్లి సందడి చేసింది. ఆ సందడి రేపటి నుంచి.
ఈ కథనాలు సాక్షి ఫ్యామిలీలో, సాక్షి టీవీలో, సాక్షి డిజిటల్ మీడియాలో వెలువడతాయి. పాఠకులు ఈ చిన్నారి సైనికులను కలవాలని, వారి బాటకు మీదైన ప్రోత్సాహం అందించాలని మా కోరిక. రేపటి నుంచి వాటికి సంబంధించిన ప్రత్యేక కథనాలందిస్తాం. ఆలస్యం చేయకుండా చదివేయండి.
(చదవండి: మనసుంటే మార్గం ఉంటుందంటే ఇదే..! వారానికి 90 గంటలు పనిచేస్తూ కూడా..)
Comments
Please login to add a commentAdd a comment