స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను ఆ అమ్మాయి ఫ్యాషన్ షోగా భావించేది. పోటీదారులకు దుస్తుల డిజైనింగే కాదు స్టయిలింగ్ కూడా చేసేది! ఫ్యాషన్ మీద ఆమెకున్న ఇష్టాన్ని అమ్మ, అమ్మమ్మ కూడా గుర్తించి, ప్రోత్సహించడంతో అతి చిన్న వయసులోనే పలువురు మెచ్చే ఫ్యాషన్ డిజైనర్‌గా మారింది! బ్రాండ్‌నీ క్రియేట్ చేసింది! ఆ లిటిల్ స్టయిలిస్టే బ్రూక్ లారెన్ సంప్టర్.
బ్రూక్ లారెన్ సంప్టర్ చిన్నప్పటి నుంచి దుస్తులు, నగలు, పాదరక్షలు.. ఏవైబుల్లి డిజైనర్ బ్రూక్...నా సరే తనకిష్టమైనవే వేసుకునేది. బర్త్‌డేలు, పండుగలప్పుడే కాదు మామూలు రోజుల్లోనూ అదే తీరు! ఇంకా చెప్పాలంటే నైట్ గౌన్స్ పట్ల కూడా శ్రద్ధ చూపేది. ఈ తీరును మొదట్లో వాళ్లమ్మ ఎర్రిస్ ఆబ్రీ.. కూతురి మొండితనంగా భావించింది. కానీ రెండేళ్ల వయసు నుంచే బ్రూక్ తనకి స్టయిలింగ్‌లో సలహాలు ఇవ్వటం, ఫ్రెండ్స్ కోసం పిక్నిక్ టేబుల్, ఫ్లవర్ పాట్స్, గిఫ్ట్ బాక్స్‌ను డిజైన్ చేయడం వంటివి చూసి.. కూతురిలో ఈస్తటిక్ సెన్స్, క్రియేటివిటీ మెండు అని గ్రహించింది. బ్రూక్ చూపిస్తున్న ఆసక్తిని ఆమె అమ్మమ్మా గమనించి మనమరాలికి దుస్తులు కుట్టడం నేర్పించింది.
దాంతో స్కూల్ నుంచి రాగానే ఫ్యాబ్రిక్‌ని ముందేసుకుని డిౖజñ న్ చేయడం మొదలుపెట్టేది. అలా కేవలం ఐదేళ్ల వయసులోనే బ్రూక్ తన మొదటి ఫ్యాషన్ షోను నిర్వహించింది. దాని ద్వారా వచ్చిన డబ్బుతో రెండు కుట్టుమిషన్లను కొనిపించుకుంది. అమ్మా, అమ్మమ్మను తన అసిస్టెంట్లుగా పెట్టుకుంది. వందకు పైగా డిజైన్స్‌ను క్రియేట్ చేసేసింది. అవి ఆమెకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2022 చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఎమ్మీ అవార్డు వేడుక కోసం ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, నటి తబితా బ్రౌన్‌కి బ్రూక్ సంప్టర్ ఒక అందమైన గౌన్‌ను డిజైన్ చేసింది. దీంతో ఎమ్మీ వేడుకల కోసం దుస్తులను డిజైన్ చేసిన అతి పిన్న వయస్కురాలిగా బ్రూక్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు.
బార్బీ సంస్థకు బేస్ బాల్ బార్బీ, ఫొటోగ్రాఫర్ బార్బీ అనే రెండు థీమ్ డిజైన్స్‌నూ అందించింది. ఈ మధ్యనే తన పేరు మీద ‘బ్రూక్ లారెన్’ అనే ఫ్యాషన్ బ్రాండ్‌నూ స్థాపించింది. ఇప్పుడు ఆ బ్రాండ్ టర్నోవర్ కోటి డాలర్లకు (రూ.84 కోట్లు) పైమాటే! చిన్నపిల్లల కోసం ఈ బ్రాండ్.. చక్కటి దుస్తులను డిజైన్ చేస్తోంది. ఇవి ఎంత ఫ్యాషనబుల్‌గా కనిపిస్తాయో అంతే కంఫర్ట్‌గానూ ఉంటాయి. అదే బ్రూక్ ‘బ్రాండ్’ వాల్యూ! కొన్ని నెలల కిందటన్ బ్రూక్ ‘టామ్రాన్ హాల్’ షోలోనూ కనిపించింది. అందులో తన డిజైన్స్, ఫ్యాషన్ పరిశ్రమలో తనకెదురైన అనుభవాలు, సాధించిన విజయాలను వివరించింది. కలను సాకారం చేసుకోవడానికి కావాలసింది పట్టుదల అని, లక్ష్య సాధనలో వయసు ఏ రకంగానూ అడ్డు కాదని నిరూపించింది బ్రూక్ లారెన్.
స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో గెలవటం కంటే ఆడియన్స్ నా డిజైన్స్‌ను చూసి, కేరింతలతో ఇచ్చే ప్రశంసలే నాకు ఉత్సాహాన్నిస్తాయి. అందుకే ఆ పోటీల్లో నాతో పాటు నా ఫ్రెండ్స్‌కీ డ్రెసెస్ డిజైన్ చేసేదాన్ని.
– బ్రూక్ లారెన్ సంప్టర్
Comments
Please login to add a commentAdd a comment