making
-
మట్టికుండ చేసిన స్మృతి మంధాన.. ప్రతి పనిలోనూ పర్ఫెక్ట్ (ఫొటోలు)
-
బుల్లి డిజైనర్ బ్రూక్...
స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను ఆ అమ్మాయి ఫ్యాషన్ షోగా భావించేది. పోటీదారులకు దుస్తుల డిజైనింగే కాదు స్టయిలింగ్ కూడా చేసేది! ఫ్యాషన్ మీద ఆమెకున్న ఇష్టాన్ని అమ్మ, అమ్మమ్మ కూడా గుర్తించి, ప్రోత్సహించడంతో అతి చిన్న వయసులోనే పలువురు మెచ్చే ఫ్యాషన్ డిజైనర్‌గా మారింది! బ్రాండ్నీ క్రియేట్ చేసింది! ఆ లిటిల్ స్టయిలిస్టే బ్రూక్ లారెన్ సంప్టర్.బ్రూక్ లారెన్ సంప్టర్ చిన్నప్పటి నుంచి దుస్తులు, నగలు, పాదరక్షలు.. ఏవైబుల్లి డిజైనర్ బ్రూక్...నా సరే తనకిష్టమైనవే వేసుకునేది. బర్త్‌డేలు, పండుగలప్పుడే కాదు మామూలు రోజుల్లోనూ అదే తీరు! ఇంకా చెప్పాలంటే నైట్ గౌన్స్ పట్ల కూడా శ్రద్ధ చూపేది. ఈ తీరును మొదట్లో వాళ్లమ్మ ఎర్రిస్ ఆబ్రీ.. కూతురి మొండితనంగా భావించింది. కానీ రెండేళ్ల వయసు నుంచే బ్రూక్ తనకి స్టయిలింగ్‌లో సలహాలు ఇవ్వటం, ఫ్రెండ్స్ కోసం పిక్నిక్ టేబుల్, ఫ్లవర్ పాట్స్, గిఫ్ట్ బాక్స్‌ను డిజైన్ చేయడం వంటివి చూసి.. కూతురిలో ఈస్తటిక్ సెన్స్, క్రియేటివిటీ మెండు అని గ్రహించింది. బ్రూక్ చూపిస్తున్న ఆసక్తిని ఆమె అమ్మమ్మా గమనించి మనమరాలికి దుస్తులు కుట్టడం నేర్పించింది. దాంతో స్కూల్ నుంచి రాగానే ఫ్యాబ్రిక్‌ని ముందేసుకుని డిౖజñ న్ చేయడం మొదలుపెట్టేది. అలా కేవలం ఐదేళ్ల వయసులోనే బ్రూక్ తన మొదటి ఫ్యాషన్ షోను నిర్వహించింది. దాని ద్వారా వచ్చిన డబ్బుతో రెండు కుట్టుమిషన్లను కొనిపించుకుంది. అమ్మా, అమ్మమ్మను తన అసిస్టెంట్లుగా పెట్టుకుంది. వందకు పైగా డిజైన్స్‌ను క్రియేట్ చేసేసింది. అవి ఆమెకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2022 చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఎమ్మీ అవార్డు వేడుక కోసం ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, నటి తబితా బ్రౌన్కి బ్రూక్ సంప్టర్ ఒక అందమైన గౌన్‌ను డిజైన్ చేసింది. దీంతో ఎమ్మీ వేడుకల కోసం దుస్తులను డిజైన్ చేసిన అతి పిన్న వయస్కురాలిగా బ్రూక్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు. బార్బీ సంస్థకు బేస్ బాల్ బార్బీ, ఫొటోగ్రాఫర్ బార్బీ అనే రెండు థీమ్ డిజైన్స్‌నూ అందించింది. ఈ మధ్యనే తన పేరు మీద ‘బ్రూక్ లారెన్’ అనే ఫ్యాషన్ బ్రాండ్‌నూ స్థాపించింది. ఇప్పుడు ఆ బ్రాండ్ టర్నోవర్ కోటి డాలర్లకు (రూ.84 కోట్లు) పైమాటే! చిన్నపిల్లల కోసం ఈ బ్రాండ్.. చక్కటి దుస్తులను డిజైన్ చేస్తోంది. ఇవి ఎంత ఫ్యాషనబుల్‌గా కనిపిస్తాయో అంతే కంఫర్ట్గానూ ఉంటాయి. అదే బ్రూక్ ‘బ్రాండ్’ వాల్యూ! కొన్ని నెలల కిందటన్ బ్రూక్ ‘టామ్రాన్ హాల్’ షోలోనూ కనిపించింది. అందులో తన డిజైన్స్, ఫ్యాషన్ పరిశ్రమలో తనకెదురైన అనుభవాలు, సాధించిన విజయాలను వివరించింది. కలను సాకారం చేసుకోవడానికి కావాలసింది పట్టుదల అని, లక్ష్య సాధనలో వయసు ఏ రకంగానూ అడ్డు కాదని నిరూపించింది బ్రూక్ లారెన్. స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో గెలవటం కంటే ఆడియన్స్ నా డిజైన్స్‌ను చూసి, కేరింతలతో ఇచ్చే ప్రశంసలే నాకు ఉత్సాహాన్నిస్తాయి. అందుకే ఆ పోటీల్లో నాతో పాటు నా ఫ్రెండ్స్‌కీ డ్రెసెస్ డిజైన్ చేసేదాన్ని.– బ్రూక్ లారెన్ సంప్టర్ -
చక్కని బొమ్మా.. నిను చెక్కిన చేతులకు సలాం
సాక్షి, అనకాపల్లి: ఏడు దశాబ్దాల కిందట అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో నాలుగు విశ్వకర్మ కుటుంబాలు జీవనోపాధి కోసం లక్కబోమ్మల తయారీ ప్రారంభించాయి. నాడు అవసరం కోసం బీజం పడిన ఈ కళ ఇప్పుడు ఆ గ్రామానికి ప్రపంచపటంలో ఒక గుర్తింపు తీసుకువచ్చిం ది. అంకుడు కర్రలతో లక్కబోమ్మలు తయారు చేసే హస్తకళాకార కుటుంబాలు ఈ గ్రామంలో దాదాపు 150 వరకూ వున్నాయి. మారుతున్న కాలానికి, సాంకేతికతకు అనుగుణంగా ఇక్కడి కళాకారులు కూడా విశేష నైపుణ్యంతో అపురూప కళాఖండాలను తమ మునివేళ్లతో సృష్టించి అబ్బురపరుస్తున్నారు. జార్ఖండ్ నుంచి లక్క దిగుమతి రసాయన రంగులతో పోలిస్తే సహజ రంగులే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే లక్కకి సహజమైన రంగులను కలిపి ఇక్కడి కళాకారులు అనేక ప్రయోగాలు చేస్తుంటారు. చుట్టుపక్కల లభించే ఉసిరి, కరక్కాయ, వేప వంటి వాటితో సహజ రంగులను తయారు చేస్తారు. సహజమైన లక్కను ఎక్కువగా జార్ఖండ్‌లోని రాంచీ నుంచి దిగుమతిచేసుకుంటారు. అక్కడ ఒక రకమైన సూక్ష్మజీవి విసర్జితాల నుంచి ఇది లభిస్తుంది. స్థానిక గిరిజనులు దాన్ని సేకరించి అమ్ముతారు.ఆ లక్కకి తూర్పుకనుమల్లో దొరికే వివిధ రకాల మొక్కలు, వాటి విత్తనాలు, ఆకులు, వేళ్లు, కాండం నుంచి వచ్చే సహజ సిద్ధమైన రంగులను కలుపుతారు. 100 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద లక్కని వేడిచేసి, రంగుని కలిపి... దాన్ని బొమ్మలకు అద్దుతారు. గది ఉష్ణోగ్రతవద్ద వద్ద ఈ రంగులు ఎంత కాలమైనా పాడవకుండా ఉంటాయి. 1990 వరకు ఏటికొప్పాక బొమ్మలకు రసాయన రంగులే పూసేవారు. గ్రామానికి చెందిన సీవీ రాజు (చింతలపాటి వెంకటపతిరాజు) రసాయన రంగుల స్థానంలో సహజ సిద్ధమైన రంగులను వాడటం మొదలుపెట్టారు. క్రమంగా గ్రామంలోని కళాకారులందరూ సహజరంగులు వినియోగించడం ప్రారంభించారు. బొమ్మల తయారీలో మహిళలే ఎక్కువ..ఏటికొప్పాకలో దాదాపు ప్రతి ఇంటిలోనూ బొమ్మల తయారీ కళాకారులుంటారు. ఇందులో మహిళలే అధిక సంఖ్యలో ఉంటారు. ఇంటి పనులు చూసుకుంటూ వీలు దొరికినప్పుడల్లా వీరు బొమ్మలు తయారు చేస్తుంటారు. మరికొందరు దీన్నే వృత్తిగా తీసుకుంటారు. కుంకుమ భరిణెలు, ఆభరణాలు దాచుకునే డబ్బాలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, మహిళలు ధరించే గాజులు, కీచైన్లు, ఫ్లవర్‌వాజ్‌లు, దేవతామూర్తుల బొమ్మలు మొదలుకుని గ్రామీణ వాతావరణం, శ్రీ వేంకటేశ్వరస్వామి, రామాంజనేయ యుద్ధ సన్నివేశాలు,పెళ్లి తంతు, పెళ్లి సారె ఇలా ఎన్నో రకాల బొమ్మలు ఇక్కడి కళాకారుల చేతిలో రూపుదిద్దుకుంటాయి. పొట్టకూటి కోసం తయారుచేసిన లక్క బొమ్మ.. కాలాంతరంలో ఆ గ్రామానికి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిపెట్టింది. వంట చెరకుగా కూడా పనికిరాని అంకుడు కర్ర మూలవస్తువుగా, ఆకులూ అలములే సహజ రంగులుగా, కళాకారుడి సృజనాత్మకతే అతిపెద్ద పెట్టుబడిగా తయారవుతున్న ఏటికొప్పాక లక్కబొమ్మ ప్రపంచం నలుమూలలా గొప్ప ఆదరణ పొందుతోంది. వరాహనది ఒడ్డున ఉన్న ఈ ప్రశాంత గ్రామంలో నిరంతరం ఉలి శబ్ధం వినిపిస్తూనే ఉంటుంది. వైవిధ్యమైన బొమ్మల తయారీ కోసం కళాకారులు తమ సృజనకు పదును పెడుతూనే ఉంటారు. చేయితిరిగిన ఇక్కడి కళాకారుడి ఉలి నుంచి జాలువారిన ఒక్కో బొమ్మా ఒక్కో కళాఖండమే.. వందలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న ఏటికొప్పాక బొమ్మ రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు సైతం అందుకుంది. ఏటికొప్పాక హస్తకళా నైపుణ్యంపై ‘సాగా ఆఫ్ ది విమెన్’ పేరిట ప్రొఫెసర్ బొగాది నీలిమ తీసిన డాక్యుమెంటరీ ప్రపంచ స్థాయిలో రెండో స్థానం దక్కించుకుంది. విదేశాలకు ఎగుమతి ఏటికొప్పాక లక్కబొమ్మలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. సహజసిద్ధమైన రంగులతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించడం ఎన్నాళ్లయినా ఈ రంగులు సహజత్వాన్ని కోల్పోకుండా ఉండటంతో విదేశీయులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా తెప్పించుకునే వెసులుబాటు ఉండటం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో అందుబాటులో ఉండటంతో అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా, ఆ్రస్టేలియా, పోలెండ్, హాలెండ్, స్విట్జర్లాండ్, బ్రిటన్, జర్మనీ, శ్రీలంక, నేపాల్ దేశాలకు ఏటికొప్పాక బొమ్మలు ఎగుమతవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఏటికొప్పాక లక్కబోమ్మలను వినూత్న రీతిలో తయారు చేసిన పలువురు కళాకారులకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ప్రధాని మోదీ “మన్ కీ బాత్ఙ్ కార్యక్రమంలో లక్క బొమ్మల విశిష్టత గురించి ప్రస్తావించారు. భారత నౌకాదళం విశాఖలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2016లో ఏర్పాటు చేసిన ఏటికొప్పాక బొమ్మల స్టాల్‌ని ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ తన ఫొటోతో తయారు చేసిన లక్క డబ్బాని చూసి ముచ్చటపడి దాని మీద సంతకం కూడా చేశారు.సహజసిద్ధమైన రంగులతో ప్రయోగాలు చేసి, ఏటికొప్పాక బొమ్మకి కొత్త కళను తెచ్చినందుకు సీవీ రాజుకి 2002లో రాష్ట్రపతి అవార్డు, 2012 లో నేషనల్ ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఏటికొప్పాకకు చెందిన మరో కళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి మైక్రో ఆర్ట్స్‌లో నిపుణుడు. 2003లో జాతీయ హస్త కళల పోటీలో ఇతను తయారు చేసిన బొమ్మకు ప్రథమ బహుమతి లభించింది. అలాగే బియ్యపు గింజమీద పట్టేంత వీణ, గుండుసూది మీద పట్టేంత తాజ్ మహల్, ఏనుగు, బుద్ధుడు, ఎడ్లబండి, శ్రీరామ పట్టాభిషేకం, తల వెంట్రుక మీద నిలబెట్టగలిగే పక్షులు... ఇలా అనేక మినీయేచర్ ఆర్టులను చిన్నయాచారి తయారుచేసి అవార్డులు పొందారు.కళ అంతరించిపోకూడదనే.. ఒకప్పుడు రూ.400కు దొరికే అంకుడు కర్రల మోపు.. ఇప్పుడు రూ.4వేలకు పెరిగింది. ఇది కళాకారులకు భారంగా మారింది. స్థానికంగా అంకుడు కర్ర డిపో ఏర్పాటు చేస్తే కళాకారులకు ఉపయుక్తంగా ఉంటుంది. అద్భుతమైన లక్కబోమ్మల తయారీ కళ అంతరించిపోకూడదు. ఇది మా పూర్వీకుల నుంచి మాకు వచ్చిన అరుదైన కళ. బొమ్మల తయారీ గిట్టుబాటు కావడం లేదని గతంలో చాలా మంది కళాకారులు ప్రత్యామ్నాయ పనులకు వెళ్లిపోయారు. దీనిని కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు గ్రామంలో సుమారు 100 మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చాం. ప్రస్తుతం వారికి ఇది ఉపాధినిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే మరింత మందికి ఉపాధి దొరుకుతుంది. – శ్రీశైలపు చిన్నయాచారి, కళాకారుడు, జాతీయ అవార్డు గ్రహీత -
హెల్దీ డైట్.. క్యారమెల్ బార్స్!
మన ఆరోగ్యానికి కావలసిన ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఇతర పోషకాలు లభించే ఈ క్యారమెల్ బార్స్‌ని ఎప్పుడైనా ట్రై చేశారా! ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ప్రయత్నించండి...కావలసినవి..కోకో పౌడర్ – అరకప్పు;మొక్కజొన్న పిండి– 1 1/4 కప్పు; చక్కెర పొడి– కప్పు;క్రీమ్– 4 టేబుల్ స్పూన్లు;వేరుశనగ పప్పు పలుకులు– పావు కప్పు;వాల్ నట్ పలుకులు – పావు కప్పు;క్యారమెల్ చిప్స్ – కప్పు;కండెన్స్డ్ మిల్క్ – ఒక టిన్ (14 ఓజెడ్);వెనిలా ఎసెన్స్ – 2 టీ స్పూన్లు;ఉప్పు – టీ స్పూన్;బటర్ – 3 టేబుల్ స్పూన్లు (ఉప్పు లేనిది)తయారీ..– ఒక పాత్రలో 2 టీ స్పూన్ల బటర్, చక్కెర వేసి బీటర్‌తో చిలకాలి. అందులో కోకో, మొక్కజొన్న పిండి కలిపి మళ్లీ చిలకాలి – ఒవెన్‌ను 350 డిగ్రీ ఫారన్‌హీట్‌లో వేడి చేయాలి. బేకింగ్ ట్రేలో మందపాటి పేపర్‌ను పరిచి అంచులకు సరిగ్గా సర్దాలి. – పైన సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని పోసి సమంగా సర్ది ఒవెన్‌లో పెట్టి 15 నిమిషాల సేపు బేక్ చేసి ట్రేని బయటకు తీయాలి. – పాత్రలో 2 టేబుల్ స్పూన్ల బటర్, కండెన్స్డ్ మిల్క్, వెనిల్లా ఎసెన్స్ వేసి కలపాలి.– బేకింగ్ ట్రేలో బేక్ అయిన కోకో మిశ్రమం మీద కండెన్స్డ్ మిల్క్ మిశ్రమాన్ని పోయాలి.– ఇప్పుడు ఆ ట్రేని మళ్లీ ఒవెన్‌లో పెట్టి పదినిమిషాల సేపు బేక్ చేయాలి.– ఇది వేడి తగ్గే లోపు వేరుశనగపప్పు పలుకులు, వాల్నట్ పలుకులను ఒక మోస్తరుగా వేయించి పక్కన పెట్టాలి.– క్యారమెల్ చిప్స్, క్రీమ్‌తో కలిపి కరిగించి అందులో ఉప్పు, వేయించిన గింజలను కలపాలి.– బేక్ చేసిన మిశ్రమం మీద క్యారమెల్, నట్స్ మిశ్రమాన్ని పై నుంచి పోసి చల్లారేలోపు స్లయిస్లుగా కట్ చేయాలి.– ఇవి గోరు వెచ్చగా తినవచ్చు, పూర్తిగా చల్లారిన తర్వాత కూడా తినవచ్చు.పోషకాలు: క్యాలరీలు – 285; ప్రోటీన్ – 4 గ్రాములు; కార్బొహైడ్రేట్లు – 40 గ్రాములు; చక్కెర – 28 గ్రాములు; ఫ్యాట్ – 14 గ్రాములు; సాచురేటెడ్ ఫ్యాట్ – 7 గ్రాములు; ఫైబర్ – 1.5 గ్రాములు; సోడియం – 180 మిల్లీగ్రాములు. – డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ఇవి చదవండి: తప్పును సరిదిద్దుకునే మార్గాలు..! -
కొంప మునిగింది
బిజినెస్ బహానాపసిగట్టలేకపోయిన భార్యబావమరిది నిఘా‘నిన్ననే వచ్చారు.. మళ్లీ ఇవ్వాళ ప్రయాణమవుతున్నారు. ఒక్కపూట కోసం ఇంటి దాకా రావడం ఎందుకు? ఎయిర్‌పోర్ట్‌కి దగ్గర్లోనే ఓ రూమ్ చూసుకోండి’ నిష్ఠూరమాడింది.‘బిజినెస్ పనులు అలాంటివి మరి.. అర్థం చేసుకోకపోతే ఎలా? ఈ కష్టమంతా మీ కోసమే కదా..!’ షూస్ వేసుకుంటూ అన్నాడు. ‘ఆ..ఆ.. ఈ మాటతోనే నోరు మూయిస్తారు’ తను సర్దిన బ్యాగ్‌ను అతని దగ్గర పెడుతూ అంది. పర్స్‌లోంచి చేతికి అందినంత డబ్బు తీసి ఆమెకిస్తూ ‘జాగ్రత్త.. పిల్లలు ఏదడిగినా కొనిపెట్టు. పిసినారితనం చూపించకు’ అన్నాడు.ఆ డబ్బును అక్కడే సోఫాలో పెడుతూ ‘మీరిలా నెలకు ఇరవై రోజులు బిజినెస్ పనంటూ ఊళ్లు తిరిగితే పిల్లలు మీరు కొనిపెట్టే వస్తువులనే గుర్తుంచుకుంటారు.. మిమ్మల్ని కాదు’ చురకంటించింది. ‘అబ్బా.. ఈసారి నుంచి పార్టనర్స్కే అప్పజెప్తాలే.. ఇప్పుడు నన్ను ప్రశాంతంగా వెళ్లనీ!’ కాస్త విసుక్కున్నాడు. ‘హూ.. తిరిగి ఎప్పుడు రాక?’ అడిగింది నిష్ఠూరంగానే!‘నా చేతుల్లో ఉంటుందా చెప్పు పని? ఇల్లు వదిలేసి ఊళ్లు తిరగడం నాకు మాత్రం సరదానా? ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా వచ్చేస్తాలే’ అంటూ లేచాడు బ్యాగ్ పట్టుకుని. ‘త్వరగా అయిపోగొట్టుకుని రండి’ అతని వెనుకే నడిచింది గుమ్మం దాకా!∙∙ ‘ఏ ఊరికి వెళ్లాడు?’‘ఇంట్లో బాంబే అని చెప్పాడు. అతను వాళ్లింటి నుంచి నేరుగా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లలేదు. రైల్వేస్టేషన్‌కీ వెళ్లలేదు. సిటీ ఔట్స్కట్స్లో తన కారులోంచి దిగిపోయి, మరో కారులోకి మారాడు’ చెప్పాడు.‘ఓకే..’ అంటూ అవతల ఫోన్ డిస్కనెక్ట్ చేశారు. ఇవతల వ్యక్తీ రిసీవర్ క్రెడిల్ చేసి.. పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి బయటకు వచ్చాడు. రెండు రోజులకు..ఆ సిటీ పాష్ లొకాలిటీలోని ఓ డూప్లెక్స్ ఇల్లు.. వాచ్‌మన్ చేత గేట్ తెరిపించుకుని ప్రధాన ద్వారం దగ్గర నిలబడి ఉంది ఐటీ టీమ్. కాలింగ్ బెల్ నొక్కాడు ఆఫీసర్. వాళ్ల వెనుకే కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చిన వాచ్మన్ని.. ఆ టీమ్‌లోని ఓ వ్యక్తి ఆపి, ఏదో సర్ది చెబుతూ తీసుకెళ్లి మళ్లీ గేట్ దగ్గరే కూర్చోబెట్టాడు. ఈలోపు ద్వారం తెరుచుకుంది. టీమ్ లోపలికి వెళ్లింది. ‘మేడం.. ఎవరో వచ్చారు’ తలుపు తీసిన పనమ్మాయి యజమానికి చెప్పింది. ‘ఎవరూ..?’ అంటూ యజమాని హాల్లోకి వచ్చింది.‘ఫ్రమ్ ఇన్కమ్ టాక్స్..’ అంటూ తన ఐడీ చూపిస్తూ, తన టీమ్‌కి సైగ చేశాడు సోదా చేయమని!‘మా ఆయన లేనప్పుడు ఎలా వస్తారు? ఆయన ఊర్లో లేరు’ చెప్పింది ఆమె గాభరాగా. ‘తెలుసు.. మీవారు ఎక్కడున్నారో అక్కడికీ వెళ్లింది మా టీమ్!’ అంటూ పై అంతస్తుకు మెట్లెక్కసాగాడు. మూడు బెడ్రూమ్లు, దేవుడి గది, వంటిల్లు అన్నీ సోదా చేశారు. ఎక్కడా ఏమీ దొరకలేదు. ఆ టీమ్‌లోని ఓ మహిళా ఉద్యోగికి ఏదో అనుమానం వచ్చి.. మళ్లీ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్లింది. వార్డ్రోబ్స్కి ఎక్స్‌టెన్షన్‌గా ఉన్న ప్లేస్‌ను పరిశీలనగా చూడసాగింది. ఆమెనే అనుసరించిన యజమాని ‘అది బాత్రూమ్ డోర్’ అంది. దానికి అపోజిట్ వైపు చూపిస్తూ ‘అది కదా బాత్రూమ్?’ అడిగింది ఉద్యోగిని. ‘అంటే... దీనికి రెండు బాత్రూమ్స్ ఉన్నాయి’ చెప్పింది కాస్త తత్తరపడుతూ. ‘చూద్దాం..’ అంటూ ఆమెను పక్కకు తప్పిస్తూ ఆ ఎక్స్‌టెన్షన్‌ను తట్టింది ఉద్యోగిని. తలుపు తెరుచుకుంది. అది బాత్రూమ్ కాదు. వాక్ ఇన్ వార్డ్రోబ్. మిగిలిన టీమ్ కూడా వచ్చింది. వెదికారు. కిలో వరకు బంగారం, మూడు కిలోల వరకు వెండి, క్యాష్, డాక్యుమెంట్స్ అన్నీ అక్కడే దొరికాయి. ఫార్మాలిటీస్ పూర్తి చేస్తుండగా.. ఆ ఇంటి ల్యాండ్‌లైన్ మోగింది. యజమాని రిసీవర్ తీయబోతుండగా.. ఆగమని సైగ చేస్తూ ఐటీ ఆఫీసర్ రిసీవర్ తీశాడు. ‘హలో.. ’ అవతలి నుంచి. ‘యెస్.. ’ ఐటీ ఆఫీసర్. ఆ గొంతును పోల్చుకున్నట్టున్నారు అవతలి వాళ్లు సంభాషణ కొనసాగింది. ‘సర్.. అతను ఇక్కడ హోటల్లో ఉన్నాడు. ఫ్యామిలీతో వచ్చినట్టున్నాడు’ చెప్పాడు అవతలి వ్యక్తి. ‘ఫ్యామిలీతోనా?’ ఐటీ ఆఫీసర్ ఆ మాట అంటూండగా యజమాని భృకుటి ముడిపడింది.‘అవును సర్.. అతనితోపాటు అతని వైఫ్ కూడా ఉంది’ చెప్పాడు అవతలి వ్యక్తి. ‘వైఫా? మరి ఇక్కడ ఎవరూ?’ అంటూ ఆ ఇంటి యజమాని వైపు చూశాడు ఐటీ ఆఫీసర్. అర్థమైనట్టుంది ఆమెకు.. వెంటనే రిసీవర్ లాక్కుని ‘హలో.. ఆయనకు ఫోన్ ఇస్తారా ఒకసారి?’ అడిగింది ఆవేశం ఎగసిపడుతుండగా!ఆయన లైన్లోకి వచ్చాడు ‘హలో..’ అంటూ!‘ఇదా మీ బిజినెస్ పని? ఎవరు ఆ ఫ్యామిలీ?’‘హలో.. వాళ్లేదో అనుమానపడుతున్నారు.. నే..ను..’ అని అతను అంటూండగానే ఇవతల ఫోన్ డిస్కనెక్ట్ అయింది. అవమానం, బాధ ఆమె కళ్లల్లో నిండాయి నీళ్లుగా! ఫార్మాలిటీస్ కూడా పూర్తవడంతో ఐటీ టీమ్ అక్కడ నుంచి నిష్క్రమించింది. ముంబై పేరు బొంబాయిగా ఉన్నప్పుడు జరిగిన రెయిడ్ ఇది. ఆ బిజినెస్‌మన్ పన్ను ఎగ్గొట్టిన సంపద గురించి ఐటీ వాళ్లకు సమాచారమిచ్చింది స్వయాన అతని బావమరిదే. వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఆ బావమరిదీ అందులో భాగస్వామే. కానీ బావగారు మిగతావాళ్లతో చేరి బావమరిదిని బయటకు పంపించేశాడు. అది మనసులో పెట్టుకుని ఐటీ వాళ్లకు టిప్ అందించాడు. పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడింది అతని బావమరిదే! అయితే అతనికీ తెలీదు తన సోదరిని కూడా ఆ బావగారు మోసం చేస్తున్నట్టు! మాటిమాటికీ బిజినెస్ టూర్లకు వెళ్తున్నాడు అంటే అక్కడ కూడా లెక్కాపత్రాల్లేని డబ్బో, స్థిరాస్తులో ఉంటాయనుకుని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వసాగాడు. -
క్యాబేజీతో క్రేజీగా...!
క్యా... బే... జీ! పిల్లలు ఈ జోక్‌ని సరదాగా ఎంజాయ్ చేస్తారు. సిబ్లింగ్స్ ఒకరినొకరు తిట్టుకోనట్లు తిట్టుకుంటారు. పొగడక తప్పనట్లు పొగుడుకుంటారు. క్యాబేజీ తినమంటే మాత్రం ముఖం చిట్లిస్తారు. వారానికి ఒకసారి క్యాబేజ్ తినమంటోంది ఆరోగ్యం. క్యాబేజీతో ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుంది?క్యాబేజ్ కుల్చా..కావలసినవి..గోధుమపిండి– పావు కేజీ;నూనె– 2 టీ స్పూన్లు;నీరు – ము΄్పావు కప్పు;ఉప్పు – పావు టీ స్పూన్;స్టఫింగ్ కోసం... క్యాబేజ్ – పావు కేజీ;నూనె – టేబుల్ స్పూన్;పచ్చిమిర్చి – 2 (తరగాలి);వాము – అర టీ స్పూన్;అల్లం తురుము – టీ స్పూన్;పసుపు – పావు టీ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్;జీలకర్ర పొడి– అర టీ స్పూన్;గరం మసాలా పొడి– అర టీ స్పూన్;ఆమ్చూర్ – అరటీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్;నూనె – టేబుల్ స్పూన్.తయారీ..– గోధుమపిండిలో ఉప్పు, నీరు పోసి ముద్దగా కలిపి పైన నూనె వేసి అద్ది పలుచని వస్త్రాన్ని కప్పి పక్కన పెట్టాలి.– క్యాబేజ్‌ని శుభ్రంగా కడిగి మరుగుతున్న నీటిలో వేసి ఐదు నిమిషాల సేపు ఉంచి తీయాలి. నీరు పోయిన తర్వాత తురమాలి.– వెడల్పు పెనంలో నూనె వేడి చేసి వాము గింజలు వేయాలి.– అవి చిటపటలాడిన తర్వాత క్యాబేజ్ తురుము, ఉప్పు వేసి కలిపి మంట తగ్గించి మూతపెట్టాలి.– ఏడెనిమిది నిమిషాలకు క్యాబేజ్ మగ్గుతుంది. అవసరమైతే కొద్దిగా నీటిని చిలకరించాలి.– ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, అల్లం, పసుపు, ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా పొడులు వేసి కలిపి మూత పెట్టాలి.– రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి దించేయాలి. చల్లారే వరకు పక్కన పెట్టాలి.– ఈ లోపు గోధుమ పిండితో చపాతీలు చేయాలి. ఒక చపాతీ మీద ఒక గరిటె క్యాబేజ్ స్టఫింగ్ పెట్టి ఆ పైన మరో చపాతీ పెట్టి అంచులను చేత్తో అతికించాలి.– ఇప్పుడు క్యాబేజ్ సమంగా విస్తరించడానికి అప్పడాల కర్రతో జాగ్రత్తగా రోల్ చేస్తే అదే కుల్చా. ఇలాగే పిండి అంతటినీ చేయాలి.– ఇప్పుడు చపాతీల పెనం వేడి చేసి ఒక్కో కుల్చాను చపాతీలాగానే నూనె వేస్తూ రెండువైపులా కాలనివ్వాలి.– స్టఫింగ్ బరువుతో కుల్చా విరిగిపోకుండా జాగ్రత్తగా తిరగేయాలి.– వేడి కుల్చాలోకి వెన్న, పెరుగు మంచి కాంబినేషన్. కారంగా తినాలంటే నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి బాగుంటుంది.గమనిక: ఆమ్చూర్ పౌడర్ లేకపోతే తాజా మామిడి తురుము టీ స్పూన్ తీసుకోవాలి.క్యాబేజ్ డ్రై మంచూరియా..కావలసినవి..క్యాబేజ్ – 200 గ్రాములు (తరగాలి);ఉల్లిపాయ – 1 (పెద్దది, తరగాలి);క్యాప్సికమ్ – 1 (తరగాలి);క్యారట్ – 1 (తరగాలి);షెజ్వాన్ సాస్ – అర టేబుల్ స్పూన్;అల్లం తురుము – టీ స్పూన్; కశ్మీరీ మిరపొ్పడి– అర టీ స్పూన్;మిరియాల పొడి– పావు టీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;శనగపిండి – 100 గ్రాములు;మైదా – 50 గ్రాములు;మొక్కజొన్న పిండి– 50 గ్రాములు;నూనె – వేయించడానికి తగినంత;గార్నిష్ చేయడానికి... క్యాబేజ్ తురుము – టేబుల్ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్.తయారీ..– వెడల్పు పాత్ర తీసుకుని అందులో నూనె మినహా మిగిలిన దినుసులన్నీ వేసి కలిపి పక్కన పెట్టాలి.– నీరు అవసరం లేదు, కూరగాయల్లోని నీటితోనే పిండి ముద్దగా అవుతుంది.– అరగంట తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి.– బాణలిలో నూనె మరిగించి పై మిశ్రమాన్ని చేతి నిండుగా తీసుకుని వేళ్లతో కొద్ది కొద్దిగా నూనెలో వదలాలి.– కాలి కొంచెం గట్టి పడిన తర్వాత చిల్లుల గరిటెతో అన్ని వైపులా బాగా కాలే వరకు తిరగేస్తూ కాలనివ్వాలి.– ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పరిచి మంచూరియా దోరగా కాలిన తర్వాత తీసి పేపర్ మీద వేయాలి.– వేడిగా ఉండగానే క్యాబేజ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.ఇవి చదవండి: ఉన్నది ఒకటే.. 'జిమ్'దగీ..! -
దోస స్క్రాపర్ పిచ్చ పిచ్చగా వైరలవుతోంది : మీకూ కావాలా?
పెనానికి అంటుకోకుండా, పేపర్‌లాగా దోస వెయ్యాలంటే అంత ఆషామాషీ కాదు. మరికొంత గృహిణులకు చెయ్యితిరిగిన దోస మాస్టర్లకు మాత్రమే సాధ్యం. ముఖ్యంగా పిండి పెనం మీద,రౌండ్‌గా తిప్ప కాసిన్న ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చిముక్కలు వేసి, కాస్త కాలాక దోస తిరగవెయ్యాలని చూస్తామా.. అప్పుడు ఉంటుంది అసలు కథ. ఒక్క పట్టాన రానే రాదు.. పోనీ.. ఇంకోటి.. సేమ్ సీన్ రిపీట్.. హన్నన్నా.. నీ సంగతి చూస్తా.. అని ఇంకోటి ట్రై చేస్తే.. అదీ విరిగి ముక్కలవుతుంది. View this post on Instagram A post shared by nameisshekhar4 (@nameisshekhar4) చివరికి యూ ట్యూబ్, అదీ ఇదీ వెతికి వెతికి ఉల్లిపాయ కట్ చేసి తవాకి రాసి, నీళ్లు చల్లి తుడిచి, ఇలా నానా కష్టాలు పడ్డాక మొత్తానికి దోస అయ్యిందనిపిస్తాం. ఇపుడిదంతా ఎందుకంటే.. ఈ బాధలేవీ లేకుండా, చక్కగా దోసను మడతబెట్టేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ఏకంగా1.3 కోట్ల వ్యూస్ దక్కించుకుంది. వైరల్ వీడియోలో, పెనం మీద వేసిన దోస అలా అలవోకగా తీస్తున్న స్క్రాపర్‌ని మనం చూడొచ్చు. ఈ అద్భుతమైన స్క్రాపర్ నెటిజన్లు మంత్రముగ్ధులైపోతున్నారు.బ్రో మసాలా దోసపై వేయడం ఇంత ఈజీనా.. సగం టైం క లిసొచ్చింది అని ఒకరు, చాలా బాగుంది. చేతులతో పనిలేకుండా పరిశుభ్రంగా ఉందిని మరొకరు వ్యాఖ్యానించారు. "బహుశా గతంలోబుల్డోజర్ డ్రైవర్’’ ఏమో,ఇన్‌స్టాగ్రామర్ “సిమెంట్ రోలర్” అని కొందరు అభిప్రాయ పడగా, వీటన్నింటికీ మించి ఈ మెషీన్ నాకూ కావాలి అని ఎక్కువ అంది కమెంట్ చేశారు. -
Vinayaka Chavithi 2024: బుజ్జి గణపయ్యకు.. బొజ్జ నిండా!
రేపే వినాయక చవితి. ఉదయం చంద్రుడిని చూడవద్దు. చందమామ లాంటి కుడుములు చేద్దాం. వినాయకుడికి నివేదన చేద్దాం. ఓ బొజ్జ గణపయ్యా! నీ బంటు నేనయ్యా!! ఉండ్రాళ్లపై దండు పంపమని స్తోత్రం చదువుదాం!!ఉండ్రాళ్లు..కావలసినవి..బియ్యపు రవ్వ– కప్పు;నీరు – 2 కప్పులు;పచ్చి శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు;నెయ్యి– టీ స్పూన్;ఉప్పు – పావు టీ స్పూన్;పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు (ఇష్టమైతేనే)తయారీ..– శనగపప్పును కడిగి 20 నిమిషాల సేపు నీటిలో నానబెట్టి నీటిని వంపేసి పక్కన పెట్టాలి.– ఒక పాత్రలో నెయ్యి వేడి చేసి అందులో శనగపప్పు వేసి వేయించాలి.– శనగపప్పు దోరగా వేగిన తర్వాత అందులో నీరు పోసి ఉప్పు వేసి మూత పెట్టాలి.– నీరు మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి, రవ్వ వేసి ఉండలు లేకుండా గరిటెతో కలపాలి.– కొబ్బరి తురుము వేసి సమంగా కలిసే వరకు కలిపి నీరు ఆవిరైపోయి రవ్వ దగ్గరగా అయిన తర్వాత దించేయాలి.– వేడి తగ్గిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని గోళీలుగా చేస్తే ఉండ్రాళ్లు రెడీ.పూర్ణం కుడుములు..కావలసినవి..బియ్యప్పిండి– కప్పు;నీరు – కప్పు;నెయ్యి – టీ స్పూన్;ఉప్పు – చిటికెడు. పూర్ణం కోసం... పచ్చి శనగపప్పు – అర కప్పు; నీరు – కప్పు;బెల్లం పొడి– ముప్పావు కప్పు;పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు;యాలకుల పొడి– అర టీ స్పూన్‌తయారీ..– శనగపప్పును కడిగి రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, చల్లారిన తర్వాత నీటిని వంపేసి శనగపప్పును మిక్సీలో వేసి పొడి చేయాలి.– ఈ పొడి డ్రైగా ఉండదు, కొద్దిపాటి తడిపొడిగా ఉంటుంది.– ఒక పాత్రలో బెల్లం పొడి, రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి కరిగే వరకు మరిగించాలి.– కరిగిన తర్వాత మరొకపాత్రలోకి వడపోయాలి.– బెల్లం నీటిలో శనగపప్పు పొడి, కొబ్బరి తురుము వేసి గరిటెతో కలుపుతూ మిశ్రమం దగ్గరగా అయ్యే వరకు మరిగించాలి.– చివరగా యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి.– చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఎనిమిది భాగాలుగా చేసి, గోళీలుగా చేస్తే పూర్ణం రెడీ.ఇక కుడుముల కోసం..– ఒక పాత్రలో కప్పు నీరు పోసి అందులో ఉప్పు, నెయ్యి వేసి వేడి చేయాలి.– నీరు మరిగేటప్పుడు స్టవ్ ఆపేసి బియ్యప్పిండి వేసి గరిటెతో కలపాలి.– వేడి తగ్గిన తరవాత చేత్తో మర్దన చేస్తూ చపాతీల పిండిలా చేసుకుని ఎనిమిది భాగాలు చేయాలి.– ఒక్కో భాగాన్ని గోళీలాగ చేసి పూరీలా వత్తాలి.– ఇందులో పూర్ణం పెట్టి అంచులు మూసేయాలి. ఇలాగే అన్నింటినీ చేసుకోవాలి.– ఒక వెడల్పు పాత్రకు నెయ్యి రాసి పూర్ణకుడుములను అమర్చాలి.– ప్రెషర్ కుకర్‌లో నీరు పోసి కుడుముల పాత్ర పెట్టి మూత పెట్టి ఎనిమిది నిమిషాల సేపు ఉడికించి స్టవ్ ఆపేయాలి.– చల్లారిన తర్వాత తీసి వినాయకుడికి నివేదన చేయాలి. -
ఈ వంటలను ఎప్పుడైనా వండి చూశారా..!?
పొటాటో–లెమెన్ పోహా..కావలసినవి:బంగాళదుంపలు– 2 (ఉడికించి, చల్లారాక తొక్క తీసి, చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి),జీలకర్ర, ఆవాలు– పావు టీ స్పూన్ చొప్పున,కరివేపాకు,ఎండుమిర్చి– కొద్దికొద్దిగావేరుశనగలు– 2 టేబుల్ స్పూన్లు (దోరగా వేయించి పెట్టుకోవాలి)అల్లం తరుగు– కొద్దిగా, వెల్లుల్లి ముక్కలు– పావు టీ స్పూన్నూనె– సరిపడా,ఉప్పు– రుచికి తగ్గట్టుగాపసుపు, కారం– అర టీ స్పూన్ చొప్పుననిమ్మరసం– 1 టేబుల్ స్పూన్ (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు)కొత్తిమీర తురుము– 4 టేబుల్ స్పూన్లు, అటుకులు– ఒకటిన్నర కప్పులుతయారీ..– ముందుగా అటుకులను జల్లెడ తొట్టెలో వేసుకుని మంచినీళ్లు పోసి, 2 సార్లు కడిగి పెట్టుకోవాలి.– ఆపై ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని తిప్పుతూ, అల్లం తరుగు, వెల్లుల్లి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి.– అందులో పసుపు, కారం, తగినంత ఉప్పు, బంగాళదుంప ముక్కలు వేసుకుని, 2 నిమిషాలు మూత పెట్టి చిన్నమంట మీద ఉడకనివ్వాలి.– అనంతరం కొత్తిమీర తురుము, అటుకులు, నిమ్మరసం వేసుకుని బాగా కలిపి, మూతపెట్టుకుని 2 నిమిషాలు ఉడికించాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది ఈ పోహా.డ్రైఫ్రూట్స్ చాక్లెట్స్..కావలసినవి:కోకో పౌడర్,పంచదార పొడి,కొబ్బరి నూనె (స్వచ్ఛమైనది) – ముప్పావు కప్పు చొప్పున,మిల్క్ పౌడర్ – 5 టేబుల్ స్పూన్లు,పిస్తా, బాదం, జీడిపప్పు, వేరుశనగలు(దోరగా వేయించి, తొక్క తీసేసినవి) – 2 టేబుల్ స్పూన్ల చొప్పునతయారీ:– ముందుగా పిస్తా, జీడిపప్పు, బాదం, వేరుశనగలను కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.– అనంతరం అదే మిక్సీ బౌల్‌ని కాసిన్ని నీళ్లతో క్లీన్ చేసుకుని, దానిలో కోకో పౌడర్, పంచదార పొడి, స్వచ్ఛమైన కొబ్బరి నూనె, మిల్క్ పౌడర్ ఒకదాని తరవాత ఒకటి వేసుకుని క్రీమీగా మారేలా మిక్సీ పట్టుకోవాలి.– అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని, దానిలో డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసుకుని బాగా కలుపుకోవాలి.– అనంతరం నచ్చిన షేప్‌లో ఉన్న ఐస్ క్యూబ్స్ ట్రేని తీసుకుని, వాటికి అడుగున నెయ్యి రాసి, కొద్దికొద్దిగా ఈ మిశ్రమం వేసుకుని, మూడు నుంచి 5 గంటల పాటు ఆ ట్రేను ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం వాటిని ట్రే నుంచి వేరు చేసుకోవచ్చు.ఎల్లో ఎగ్ – కీమా లాలీపాప్స్..కావలసినవి:గుడ్లు– 6 లేదా 7 (పసుపు సొన మాత్రమే, ఉడికించి చల్లారాక పొడిపొడిగా చేసుకోవాలి)మటన్ కీమా– పావుకిలో (మసాలా, ఉప్పు, కారం వేసుకుని కుకర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి)బ్రెడ్ పౌడర్– అర కప్పుఓట్స్ పౌడర్– పావు కప్పు,అల్లం–వెల్లుల్లి పేస్ట్– కొద్దిగాపచ్చిమిర్చి ముక్కలు– ఒకటిన్నర టీ స్పూన్లు,మిరియాల పొడి, జీలకర్ర పొడి– పావు టీ స్పూన్ చొప్పున,ఆమ్చూర్ పౌడర్– 2 టీ స్పూన్లుఉప్పు– తగినంత,గడ్డ పెరుగు– తగినంతనీళ్లు– కొన్ని (అభిరుచిని బట్టి),టమాటో సాస్,కొత్తిమీర తురుము– గార్నిష్‌కి సరిపడా,నూనె– డీప్ ఫ్రైకి సరిపడాతయారీ:– ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో గుడ్ల పసుపు సొన, ఉడికిన మటన్ కీమా, ఓట్స్ పౌడర్, బ్రెడ్ పౌడర్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.– అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా గడ్డ పెరుగు వేసుకుని ముద్దగా చేసుకోవాలి.– ముద్దలా చేసుకోవడానికి పెరుగు చాలకుంటే నీళ్లు కూడా వాడుకోవచ్చు. – ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న బాల్స్‌లా లేదా చిత్రంలో చూపిన విధంగా చేసుకుని, ప్రతి లాలీపాప్‌కు ఒక పుల్లను గుచ్చి పక్కన పెట్టుకోవాలి.– అనంతరం వాటిని మరుగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.– వెంటనే టమాటో సాస్‌లో వాటిని ముంచి, కొత్తిమీర తురుము జల్లుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
Tasty Sweet Corn: గింజ గింజలో.. రుచి!
మార్కెట్లో స్వీట్ కార్న్ రాశులుగా పోగయి ఉన్నాయి. బలవర్ధకమే... కానీ రోజూ ఉడికించి తినాలంటే బోర్. కొంచెం వెరైటీగా ప్రయత్నం చేస్తే... పిల్లలు లంచ్‌బాక్స్‌ను ప్రేమిస్తారు... ఈవెనింగ్ స్నాక్ కోసం ఎదురుచూస్తారు.చీజ్ బాల్స్..కావలసినవి:బంగాళదుంప – 150 గ్రా (పెద్దది ఒకటి);మొక్కజొన్న గింజలు – వంద గ్రాములు (స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న లేతగా ఉండాలి;చీజ్ – 50 గ్రాములు;మిరియాల పొడి– అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్;ఆరెగానో పౌడర్ – అర టీ స్పూన్;వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్;మైదా లేదా శనగపిండి – 4 టేబుల్ స్పూన్లు;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచికి తగినంత;నూనె – 3 టేబుల్ స్పూన్లు;తయారీ..– బంగాళదుంపను ఉడికించి తొక్క తీసి చిదిమి పక్కన పెట్టాలి.– మొక్కజొన్న గింజలను ఉడికించి నీటిని వంపేసి పక్క పెట్టాలి. చీజ్‌ను తురమాలి.– ఒక పాత్రలో బంగాళదుంప, మొక్కజొన్న గింజలు, శనగపిండి, చీజ్ తురుము, వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, ఆరెగానో వేసి కలపాలి.– రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు, మిరియాలపొడి కలుపుకోవచ్చు.– గుంత పొంగనాల పెనం వేడి చేసి ఒక్కో గుంతలో పావు టీ స్పూన్ నూనె వేయాలి.– పెనం, నూనె బాగా వేడయ్యే లోపు బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న గోళీలంత బాల్స్ చేసి పక్కన పెట్టాలి.– నూనె వేడెక్కిన తర్వాత ఒక్కో గోళీని ఒక్కో గుంతలో పెట్టి మూత పెట్టాలి.– మీడియం మంట మీద ఓ నిమిషం పాటు కాలనిచ్చి మూత తీసి ప్రతి బాల్నీ తిరగేయాలి.– తిరగేసిన తర్వాత మూత పెట్టకుండా రెండో వైపు కూడా ఎర్రగా కాలనిచ్చి తీయాలి.– వేడిగా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.గమనిక: గుంత పొంగనాల పెనం లేకపోతే మామూలు బాణలిలో నూనె వేడి చేసి చీజ్ బాల్స్‌ని ఎర్రగా ఆయిల్ రోస్ట్ చేసుకోవాలి.ఫ్రైడ్ రైస్..కావలసినవి:బాసుమతి బియ్యం – 200 గ్రాములు;నూనె – అర టీ స్పూన్;నీరు – 3 కప్పులు;మొక్క జొన్న గింజలు – 300 గ్రాములు (స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న లేత గింజలు);ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;ఉల్లికాడల ముక్కలు – 3 టేబుల్ స్పూన్లు;సెలెరీ లేదా కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు;క్యాప్సికమ్ తరుగు – పావు కప్పు;మిరియాల పొడి– టీ స్పూన్;సోయాసాస్– టేబుల్ స్పూన్;ఉప్పు – ఒకటిన్నర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నెయ్యి లేదా నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు.తయారీ..– బియ్యాన్ని కడిగి 20 నిమిషాల సేపు నానబెట్టి నీటిని వంపేసి పక్కన పెట్టాలి.– ఒక పాత్రలో మూడు కప్పుల నీరు పోసి వేడి చేసి మరిగేటప్పుడు అందులో పావు టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ ఆయిల్, కడిగి పెట్టిన బియ్యం వేయాలి.– అన్నం ఉడికిన తర్వాత వార్చి అన్నాన్ని ఒక పళ్లెంలో పోసి పక్కన పెట్టాలి.– అన్నం ఉడికేలోపు మరొక స్టవ్ మీద పాత్ర పెట్టి మొక్కజొన్న గింజలను ఉడికించాలి.– ఇప్పుడు స్టవ్ మీద వెడల్పు పాత్ర లేదా పెద్ద బాణలి పెట్టి నెయ్యి లేదా నువ్వుల నూనె వేడి చేయాలి.– అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడల ముక్కలు వేసి దోరగా వేయించాలి.– తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, సెలెరీ తరుగు వేసి అవి వేగిన తర్వాత ఉడికించిన మొక్కజొన్న గింజలు, సోయాసాస్ వేసి దోరగా వేయించాలి.– అందులో మిరియాలపొడి, ఉప్పు వేసి కలిపి ఇప్పుడు అందులో సగం అన్నం వేసి అన్నం మెతుకులు నలగనంత సున్నితంగా ఒక నిమిషం పాటు వేయించాలి.– ఇప్పుడు మిగిలిన అన్నాన్ని కూడా వేసి అంతా కలిసేటట్లు బాణలిని కదిలించి మూత పెట్టి స్టవ్ మీద నుంచి దించేయాలి. -
ఇవి.. పొరుగింటి దోసెలు!
వారం మెనూలో దోసె ఉండాల్సిందే... దోసె కూడా బోర్ కొట్టేస్తుంటే ఏం చేద్దాం? పక్క రాష్ట్రాల వాళ్ల వంటింట్లోకి తొంగిచూద్దాం. కేరళ వాళ్లు మనదోనెనే కొద్దిగా మార్చి ఆపం చేస్తారు. కన్నడిగులు చిరుతీయటి నీర్‌దోసె వేస్తారు.కన్నడ నీర్ దోసె.. కావలసినవి..బియ్యం – 2 కప్పులు;కొబ్బరి తురుము – కప్పు;ఉప్పు – చిటికెడు;నూనె – టేబుల్ స్పూన్;తయారీ..– బియ్యాన్ని నాలుగైదు గంటల సేపు లేదా రాత్రంతా నానబెట్టాలి.– బియ్యం, కొబ్బరి తురుము, ఉప్పు కలిపి మిక్సీలో మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం గరుకుగా గ్రైండ్ చేయాలి.– పిండిలో తగినంత నీటిని కలిపి గరిటె జారుడుగా ఉండాలి.– పెనం వేడి చేసి దోసె వేసి కొద్దిగా నూనె వేయాలి. రెండువైపులా కాల్చి వేడిగా వడ్డించాలి.గమనిక: కన్నడ నీర్ దోసెకు పిండిని పులియబెట్టాలిన అవసరం లేదు. రాత్రి నానబెట్టి ఉదయం గ్రైండ్ చేసి వెంటనే దోసెలు వేసుకోవచ్చు. దీనికి సాంబార్, ఆవకాయ– పెరుగు కలిపిన రైతా మంచి కాంబినేషన్.కేరళ పాలాపం..కావలసినవి..బియ్యం– పావు కేజీ;పచ్చి కొబ్బరి తురుము – యాభై గ్రాములు;చక్కెర – అర స్పూన్;ఉప్పు – అర స్పూన్;బేకింగ్ సోడా – చిటికెడు.తయారీ..– బియ్యాన్ని కడిగి మంచినీటిలో ఐదు గంటల సేపు నానబెట్టాలి.– మిక్సీలో బియ్యం, కొబ్బరి తురుము వేసి తగినంత నీటిని చేరుస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి.– బాణలిలో నీటిని ΄ోసి, అందులో పై మిశ్రమాన్ని ఒక కప్పు వేసి గరిటెతో కలుపుతూ మరిగించి దించేయాలి.– మిశ్రమం చల్లారిన తర్వాత ఆపం పిండిలో వేసి కలపాలి.– ఈ పిండిని ఎనిమిది గంటల సేపు కదిలించకుండా ఉంచాలి.– ఉదయం ఇందులో చక్కెర, ఉప్పు, బేకింగ్ సోడా వేసి గరిటెతో కలపాలి.– మిశ్రమం గరిటె జారుడుగా ఉండాలి.– ఆపం పెనం వేడి చేసి ఒక గరిటె పిండి వేసి పెనం అంచులు పట్టుకుని వలయాకారంగా తిప్పితే పిండి దోశెలాగ విస్తరిస్తుంది.– మీడియం మంట మీద కాల్చాలి. కాలే కొద్దీ అంచులు పైకి లేస్తాయి.– అట్లకాడతో తీసి ప్లేట్లో పెట్టాలి. దీనిని రెండవ వైపు కాల్చాల్సిన పని లేదు, కాబట్టి తిరగేయకూడదు.– అంచులు ఎర్రగా కరకరలాడుతూ మధ్యలో దూదిలా మెత్తగా ఉంటుంది.– ఇందులో నూనె వేయాల్సిన పని లేదు.– ఆపం పెనం లేక΄ోతే దోశె పెనం (ఫ్లాట్‌గా కాకుండా కొంచెం గుంటగా ఉండే పెనం) మీద ప్రయత్నించవచ్చు. -
Varalakshmi Vratham 2024: ఏ పూజ అయినా 'పూర్ణం'తోనే పరిపూర్ణం!
వరలక్ష్మీ వ్రతం అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది పూర్ణాలూ బొబ్బట్లే. ఆ తర్వాతే తక్కినవన్నీ. ఎందుకంటే ఏ పూజ అయినా పూర్ణంతోనే పరిపూర్ణం అవుతుందని పెద్దలు చెబుతారు. ఈ వేళ అమ్మవారికి పూర్ణాలు, భక్ష్యాలను నివేదిద్దాం.పూర్ణాలు..కావలసినవి..పచ్చిశనగ పప్పు – అర కేజీ,బెల్లం – అరకేజీ,యాలక్కాయలు – పది,బియ్యం – రెండు కప్పులు,పొట్టుతీసిన మినప గుళ్లు – కప్పు,ఉప్పు – రుచికి సరిపడా,ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా.తయారీ..– ముందుగా మినప పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి.– శనగ పప్పుని కూడా కడిగి గంట పాటు నానబెట్టాలి.– నానిన బియ్యం, మినప పప్పులని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.– నానిన శనగపప్పుని కుకర్‌లో వేసి రెండు గ్లాసులు నీళ్లు΄ోసి మూడు విజిల్స్ రానివ్వాలి.– ఉడికిన శనగ పప్పులో బెల్లం వేసి మెత్తగా గరిటతో తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించి, యాలుక్కాయల పొడి వేసి తిప్పి దించేయాలి.– శనగపప్పు మిశ్రమం చల్లారాక, ఉండలుగా చుట్టుకోవాలి.– బియ్యం, మినపగుళ్ల పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు శనగ పప్పు ఉండలను ఈ పిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి.– మీడియం మంట మీద బంగారు రంగులోకి మారేంత వరకు వేయిస్తే తియ్యని పూర్ణాలు రెడీ.భక్ష్యాలు..కావలసినవి..పచ్చిశనగ పప్పు – రెండు కప్పులు,బెల్లం తురుము – రెండు కప్పులు,యాలకుల పొడి – రెండు టేబుల్ స్పూన్లు,మైదా – రెండు కప్పులు,గోధుమ పిండి – మూడు టేబుల్ స్పూన్లు,నెయ్యి – అరకప్పు, నీళ్లు – కప్పు,ఉప్పు – చిటికెడు.తయారీ..– ముందుగా శనగ పప్పుని శుభ్రంగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టాలి. – నానిన పప్పుని కుకర్‌లో వేసి, రెండు కప్పుల నీళ్లు ΄ోసి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. ఇంతకు మించి ఉడికించకూడదు.– ఉడికిన తరువాత నీళ్లు తీసేసి పప్పుని పక్కన పెట్టుకోవాలి.– మైదాలో గోధుమ పిండి, టేబుల్ స్పూను నెయ్యి, కప్పు నీళ్లు΄ోసి పిండిని ముద్దలా కలుపుకోని పక్కనపెట్టుకోవాలి.– శనగ పప్పుని కూడా మెత్తగా రుబ్బుకోవాలి.– మందపాటి పాత్రలో బెల్లం తురుము, అరకప్పు నీళ్లు ΄ోసి సన్నని మంట మీద ఉడికించాలి.– మధ్య మధ్యలో కలియ తిప్పుతూ రుబ్బుకున్న శనగపప్పు, యాలకుల పొడి వేసి కలిపి, పదినిమిషాల పాటు ఉడికించాలి.– ఉడికిన మిశ్రమాన్ని నిమ్మకాయ సైజు పరిమాణంలో ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి.– అల్యూమినియం ఫాయిల్‌పైన కొద్దిగా నెయ్యి రాసుకుని కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా చేత్తో వత్తుకోవాలి.– ఈ చపాతీలో శనగపప్పు ఉండని పెట్టి చపాతీ మొత్తం చుట్టి పూరీలా వత్తుకోవాలి.– పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా బంగారు రంగులోకి మారేంత వరకు కాల్చితే భక్ష్యాలు రెడీ. -
కేన్ క్రాఫ్ట్! ఆకట్టుకునే ఆకృతులు.. పర్యావరణ స్నేహితులు!
సాక్షి, సిటీబ్యూరో: నడిరోడ్డుపైన కొలువుదీరిన ఉత్పత్తులు చేతి వృత్తుల నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. కాదేదీ సృజనకు అనర్హం అన్నట్టు వెదురు, కేన్లను ఉపయోగించి వివిధ రకాల ఆకృతుల్లో ఉత్పత్తులను తీర్చిదిద్దుతున్నారు. ఈ ఉత్పత్తులు అందానికీ, వైవిధ్యానికి పట్టం గడుతున్నాయి. ఖరీదైన మాల్స్‌లో మాత్రమే కాదు కచ్చా రోడ్లపై కూడా షాపింగ్ ప్రియుల్ని కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా వెదురు, కేన్‌తో తయారు చేసిన బుట్టలు, బ్యాగ్‌లు, ఇతర ఉత్పత్తులు నగరవాసుల మది దోచుకుంటున్నాయి. తయారీ నైపుణ్యంతో పాటు అందుబాటు ధరల్లో ఉండటంతో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.రూ.200 నుంచి రూ.25 వేల వరకూ..ఒకొక్కటీ సుమారుగా రూ.200 నుంచి గరిష్టంగా రూ.25 వేల వరకూ ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు. ఎన్ని మార్కెట్లు ఉన్నా మా వినియోగదారులు మాకున్నారంటున్నారు. చేసే పనిలో నైపుణ్యం ఉండాలే గాని ప్లాస్టిక్, ఫ్యాబ్రిక్, ఫైబర్, వంటివి ఎన్ని మోడల్స్ వచి్చనా సంప్రదాయ కళలకు ప్రజాదరణ ఉంటుందని ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.ఇదే జీవనాధారం.. పశ్చిమగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్ వచి్చన ఓ కుటుంబం సంప్రదాయ హస్తకళనే జీవనాధారంగా చేసుకుంది. రామానాయుడు స్టూడియో నుంచి కిందికి వెళ్లే రోడ్డులో ఫుట్‌పాత్‌పై ఈ ఉత్పత్తులు మన ముందే తయారు చేసి విక్రయిస్తున్నారు. పూలు, పండ్లు, ఇతర పూజా సామాగ్రి తీసుకెళ్లేందుకు వినియోగించే బుట్టల నుంచి గార్డెన్లో విద్యుత్తులైట్లు అమర్చుకునేందుకు వివిధ ఆకృతుల్లో బుట్టలు, లాంతరు లైట్లు, తయారుచేస్తున్నారు. లాంతరు లైట్లు, మూత ఉన్న బుట్టలు, గంపలు, పెద్దపెద్ద హాల్స్‌లో అలంకరణ కోసం పెట్టుకునే పలు రకాల వస్తువులను అక్కడికక్కడే తయారుచేసి అందిస్తున్నారు. వీటిని విభిన్నమైన రంగులతో అందంగా తీర్చిదిద్దుతున్నారు.పర్యావరణ హితం కోసం.. వెదురుతో పర్యావరణ హితమైన వస్తువులను తయారు చేస్తున్నాం. మా కుటుంబానికి వంశపారంపర్యంగా వస్తున్న కళ ఇది. మాకు ఇదే జీవనాధారం. వివిధ ఆకృతుల్లో అందంగా, ఆకట్టుకునే వస్తువులను తీర్చిదిద్దుతున్నాం. వస్తువు తయారీకి ఉపయోగించిన ముడిసరుకును బట్టి దాని ధర నిర్ణయిస్తాం. పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. కూలి గిట్టుబాటు అయితే చాలనుకుంటాం. ఫలితంగా అందరికీ అందుబాటైన ధరలోనే వస్తువులు లభిస్తాయి. రోజు పదుల సంఖ్యలో వస్తువులు అమ్మకాలు జరుగుతున్నాయి. – రమేష్, తయారీదారుడు, జూబ్లిహిల్స్ -
మెనూ.. కొద్దిగా మారుద్దాం! అప్పుడే హ్యాపీగా తింటాం!!
బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ చేస్తే... ‘అమ్మో! డెడ్లీ’ అంటారు పిల్లలు. కూరగాయలతో కూరలు వండితే... ‘అన్నీ పిచ్చి కూరలే’ అంటారు. అందుకే... జస్ట్ ఫర్ చేంజ్. కూరగాయలతో బ్రేక్‌ఫాస్ట్... ఇడ్లీతో ఈవెనింగ్ స్నాక్ చేద్దాం. హ్యాపీగా తినకపోతే అడగండి.వీట్ వెజిటబుల్ దోసె..కావలసినవి..గోధుమపిండి – ఒకటిన్నర కప్పులు;ఉప్పు – పావు టీ స్పూన్;నీరు – పావు కప్పు;టొమాటో ముక్కలు – పావు కప్పు;ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు;క్యారట్ తురుము – పావు కప్పు;పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు– 2 టేబుల్ స్పూన్లు;నూనె – 6 టీ స్పూన్లు.తయారీ..– ఒక పాత్రలో గోధుమపిండి, ఉప్పు, నీరు పోసి ఉండలు లేకుండా కలపాలి.– ఇందులో నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలపాలి.– ఇప్పుడు పెనం వేడి చేసి దోసెలు పోసుకోవడమే. ఈ దోసెలు ఊతప్పంలా మందంగా ఉండాలి.– మీడియం మంట మీద కాలనిస్తే కూరగాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి.– ఒకవైపు దోరగా కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కాల్చి తీస్తే హోల్ వీట్ వెజిటబుల్ దోసె రెడీ.చిల్లీ ఇడ్లీ..కావలసినవి..ఇడ్లీ ముక్కలు – 2 కప్పులు;రెడ్ చిల్లీ సాస్ – 2 టీ స్పూన్లు;తరిగిన అల్లం – 2 టీ స్పూన్లు;తరిగిన వెల్లుల్లి– 2 టీ స్పూన్లు;తరిగిన పచ్చి మిర్చి – 2 టీ స్పూన్లు;ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు;టొమాటో కెచప్ – 2 టేబుల్ స్పూన్లు;చక్కెర– అర టీ స్పూన్;వినెగర్– టీ స్పూన్;సోయాసాస్ – టీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నూనె – 3 టేబుల్ స్పూన్లు.తయారీ..– పెనంలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఇడ్లీ ముక్కలు వేసి అంచులు రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టాలి.– ఇప్పుడు అదే పెనంలో మిగిలిన నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు, వేసి వేయించాలి.– ఇప్పుడు టొమాటో కెచప్, చక్కెర, వినెగర్, సోయాసాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించాలి.– ఉల్లిపాయ, క్యాప్సికమ్ బాగా మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేసి కలిపితే చిల్లీ ఇడ్లీ రెడీ. దీనిని వేడిగా సర్వ్ చేయాలి.ఇవి చదవండి: ‘కౌసల్య–క్వీన్ ఆఫ్ హార్ట్స్’.. ఇతిహాసాల్లో స్త్రీ పాత్రలకు ఉన్నప్రాధాన్యత ఎంత?! -
ఫ్లఫ్ఫీ పూరీ.. వెజిటబుల్ కాజు సాగ్ కాంబినేషన్‌తో.. ఆరోగ్యం!
ఫ్లఫ్ఫీ పూరీ ఇందులోకి వెజిటబుల్ కాజు సాగ్ హెల్దీ కాంబినేషన్. దీనిని ఎలా చేయాలో చూద్దాం.కావలసినవి..గోధుమపిండి– కప్పు;నీరు– పావు కప్పు లేదా అవసరాన్ని బట్టి;చక్కెర – పావు టీ స్పూన్;నెయ్యి– 2 టీ స్పూన్లు;నూనె – వేయించడానికి తగినంత.తయారీ..– నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ ఒక పాత్రలో వేసి పూరీల పిండిని కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు పక్కన పెట్టాలి.– ఈ పిండిని ఎనిమిది భాగలుగా చేసి పూరీలు వత్తి ఫ్లవర్ మౌల్డ్‌తో వత్తాలి.– బాణలిలో నూనె వేడి చేసి పూరీలను రెండు వైపులా కాల్చి తీస్తే ఫ్లఫ్ఫీ పూరీలు రెడీ.వెజిటబుల్ కాజు సాగ్..కావలసినవి..జీడిపప్పు – 10;పచ్చి కొబ్బరి తురుము– టేబుల్ స్పూన్;కొత్తిమీర తరుగు– టీ స్పూన్;పుదీన ఆకులు– 8;ధనియాల సొడి– పావు టీ స్పూన్;పచ్చిమిర్చి – అర కాయ;ఉడికించిన కూరగాయలు – కప్పు (క్యారట్, బీన్స్, బంగాళదుంప, మొక్కజొన్న, పచ్చి బఠాణీలు కలిపి);అల్లం తరుగు– అర టీ స్పూన్;ఉల్లిపాయ ముక్కలు– 2 టేబుల్ స్పూన్లు;ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నిమ్మరసం– టీ స్పూన్; నూనె – టీ స్పూన్.తయారీ..కూరగాయ ముక్కలను ఉడికించి పక్కన పెట్టాలి. జీడిపప్పు, కొబ్బరితురుము, కొత్తిమీర, ధనియాల సొడి, అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తని పేస్ట్ చేయాలి ∙బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయించి అందులో జీడిపప్పుతోపాటు గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు, కొద్దిగా నీటిని వేసి ఐదు నిమిషాల సేపు ఉడికిస్తే వెజిటబుల్ కాజు సాగ్ రెడీ.పోషకాలు: పూరీలో... ఫ్యాట్ – 9.8 గ్రాములు, ్రసొటీన్ – 2.3 గ్రాములు, కార్బొహైడ్రేట్లు – 12 గ్రాములు. కర్రీలో... ్రసొటీన్– 4 గ్రాములు, కార్బొహైడ్రేట్లు – 13 గ్రాములు, ఫైబర్– 5 గ్రాములు.– డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ -
ఈ వెరైటీ వంటకాలను.. ఎప్పుడైనా ట్రై చేశారా..!?
హనీ– మిల్క్ పౌడర్ కప్ కేక్..కావలసినవి..తేనె– 1 కప్పు;మిల్క్ పౌడర్– 1 కప్పు;మైదా పిండి– అర కప్పు;పంచదార– పావు కప్పు (పొడి చేసుకోవాలి, అభిరుచి బట్టి కాస్త పెంచుకోవచ్చు);నెయ్యి, కొబ్బరి కోరు– అర కప్పు చొప్పున;గుడ్లు– 4, చిక్కటి పాలు– 2 టేబుల్ స్పూన్లు;తినే సోడా, వెనీలా ఎసెన్స్– అర టీ స్పూన్ చొప్పున;తయారీ..ముందుగా ఒక బౌల్లో గుడ్లు కొట్టి, పాలు పోసి క్రీమీగా అయ్యేలా బాగా గిలకొట్టుకోవాలి.ఆ మిశ్రమంలో తేనె, మైదా, మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకుని పేస్ట్‌లా కలుపుకోవాలి. తర్వాత తినే సోడా, సగం నెయ్యి, వెనీలా ఎసెన్ ్స వేసుకుని బాగా కలుపుకోవాలి.ఈలోపు మిగిలిన నేతిలో కొబ్బరి కోరు, పంచదార పొడి వేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు మినీ కేక్ బౌల్స్ తీసుకుని, వాటికి నెయ్యి రాసి పెట్టుకోవాలి.తర్వాత వాటిలో కొద్దిగా గుడ్ల మిశ్రమం వేసుకుని మధ్యలో కొద్దిగా కొబ్బరికోరు మిశ్రమం నింపుకుని, మళ్లీ పైన గుడ్ల మిశ్రమాన్ని వేసుకుని నింపుకుని ఓవెన్లో బేక్ చేసుకోవాలి.చల్లారాక క్రీమ్‌తో గార్నిష్ చేసుకుని, పైన గార్నిష్ కోసం.. కొద్దిగా తేనె పోసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఎగ్ – బాదం హల్వా..కావలసినవి..గుడ్లు– 8, బాదం పాలు– 1 కప్పు;కస్టర్డ్ మిల్క్– పావు కప్పు;పంచదార– 1 టేబుల్ స్పూన్ (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు);ఏలకుల పొడి– 1 టీ స్పూన్;నెయ్యి– 4 టేబుల్ స్పూన్లు;కుంకుమ పువ్వు– చిటికెడు;వెనీలా ఎసెన్ ్స– 1 టీ స్పూన్;బాదంపప్పు– 2 టేబుల్ స్పూన్లు (దోరగా నేతిలో వేయించాలి, అభిరుచిని బట్టి జీడిపప్పు, కిస్మిస్ వంటివి జోడించుకోవచ్చు);తయారీ..ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో గుడ్లలోని పసుపు సొనను మాత్రమే తీసుకుని, బాగా గిలకొట్టాలి.అందులో కస్టర్డ్ మిల్క్, బాదం పాలు, పంచదార, ఏలకుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని, పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని, అందులో ఈ మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద ఉడికించుకోవాలి.మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మిశ్రమం సగానికి తగ్గుతున్నప్పుడు కుంకుమ పువ్వు వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి.మళ్లీ మధ్యమధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడుతున్నప్పుడు వెనీలా ఎసెన్ ్స వేసుకుని మరోసారి కలపాలి.ఆ మిశ్రమం మరింత దగ్గర పడుతున్న సమయంలో నేతిలో వేయించిన బాదం పప్పు వంటి వేసుకుని, కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్వీట్‌కార్న్ ఇడియాప్పం..కావలసినవి..స్వీట్ కార్న్ జ్యూస్ (వడకట్టుకోవాలి);బియ్యప్పిండి– 3 కప్పులు చొప్పున;జొన్న పిండి, ఓట్స్ పౌడర్– పావు కప్పు చొప్పున:జీలకర్ర పొడి– పావు టీ స్పూన్;చిక్కటి కొబ్బరి పాలు– పావు కప్పు;నీళ్లు– కొద్దిగా, నెయ్యి– 1 టీ స్పూన్;ఎల్లో ఫుడ్ కలర్– కొద్దిగా (అభిరుచి బట్టి);తయారీ..ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, జీలకర్ర పొడి, స్వీట్‌కార్న్ జ్యూస్, కొబ్బరి పాలు వేసుకుని కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుని, మరోసారి బాగా కలుపుకోవాలి.తర్వాత ఇడ్లీ పాన్ లేదా పెద్ద బౌల్‌కి బ్రష్‌తో నెయ్యి పూసుకోవాలి.అనంతరం మురుకుల మేకర్‌కి సన్నని హోల్స్ ఉండే ప్లేట్‌ని అమర్చి, అందులో ఈ మిశ్రమాన్ని సగానికి నింపుకుని, ఇడ్లీ పాన్ లో లేదా పెద్ద బౌల్లో నూడుల్స్‌లా ఒత్తుకుని ఆవిరిపై ఉడికించాలి.అభిరుచిని బట్టి ఆవాలు, కరివేపాకు, కొత్తిమీరలతో తాళింపు వేసి, కలుపుకుని.. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఇవి చదవండి: ఈ 'తియా శిలాఫలకాలు'.. ఏ కాలంనాటివో తెలుసా!? -
కోళ్ల దాణా.. బీర్ల తయారీ!
కరీంనగర్: రేషన్ బియ్యం దందా ఆగడం లేదు. రూపం.. దారులు మారాయే తప్ప అక్రమ వ్యాపారం ఆగడం లేదు. ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు చెందిన ఓ బియ్యం డాన్ పేరును ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ–పొస్) ద్వారా రేషన్ తీసుకోని కార్డుదారుల సరుకు నల్లబజారుకు తరలకుండా అడ్డుకట్టపడగా ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూరింది.కార్డుదారులు తీసుకునే బియ్యం కోళ్లకు దాణాగా మారడం ఆందోళనకర పరిణామం. పేద ప్రజల కడుపు నింపాల్సిన రేషన్‌బియ్యం కోళ్లకు ఆహారంగా.. బీర్ల తయారీకి వినియోగించడం విడ్డూరం. పీడీ యాక్టు అమలులో తాత్సారం.. కఠినంగా వ్యవహరించకపోవడం అక్రమ దందాకు వరంగా మా రింది. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించే వారితో కొందరు అధికారుల ఉదాసీన వైఖరి, మామూళ్ల మాటున ప్రోత్సహించడం యథేచ్ఛగా దందా సాగడానికి ప్రధాన కారణం. పలువురు రేషన్ డీలర్లు కార్డుదారుల వేలిముద్ర తీసుకుని బియ్యం ఇచ్చినట్లు ఆన్లైన్ ప్రక్రియ చేపట్టడం, తీసుకున్న బియ్యాన్ని కార్డుదారులు దళారులకు విక్రయించడం అప్రతిహాతంగా సాగుతోంది.కిరాణా, రేషన్ దుకాణాలే అడ్డాలు..జిల్లాకేంద్రం నుంచి కుగ్రామం వరకు రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం విరాజిల్లుతోంది. రేషన్ దుకాణాల్లో క్లోజింగ్ బ్యాలెన్స్(సీబీ) చూపించే వరకు బియ్యం నిల్వ చేసుకునే అవకాశముండగా సీబీలోపు పక్కదారి పట్టిస్తున్నారు. వేలిముద్ర వేసి వెళ్లినవారి బియ్యానికి ప్రత్యేక రిజిష్టర్ ఏర్పాటు చేసుకుని లెక్కలు వేసుకున్న అనంతరం దళారులు, మిల్లర్లకు అంటగడుతున్నారు. దళారులు కొనుగోలు చేసే బియ్యాన్ని రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తుండగా పలువురు నేరుగా ఇతర ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కిరాణ దుకాణ నిర్వాహకులు కూడ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తుండగా అనుకూల సమయాల్లో దళారులకు విక్రయిస్తున్నారు.దళారులు పుట్టుకొస్తున్నారు..చోటామోటా బియ్యం డాన్లతో పాటు భారీ డాన్ల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గకపోవడం సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్న తీరు, వట్టి కేసులే కారణమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దందా చేసే అక్రమార్కులపై పదుల సంఖ్యలో కేసులున్నప్పటికి కఠినశిక్షలు లేకపోవడంతో మళ్లీ అదే దందా సాగిస్తున్నారు. పీడీయాక్టు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించినా తదనుగుణ చర్యలకు నిబంధనలు ప్రతికూలమనే కుంటిసాకులతో 6ఏ కేసులతోనే సరిపుచ్చుతున్నారన్న ఆరోపణలు కోకొల్లలు. కాగా రేషన్ బియ్యం పక్కదారి పట్టించేవారెవరైనా వదిలేదిలేదని పౌరసరఫరాలశాఖ, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.అక్రమ ఆదాయానికి అనేక మార్గాలు..సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు పలుదారుల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వానాకాలం, యాసంగి సీజన్లలో సీఎంఆర్ విధానం కొనసాగడం పరిపాటి. ఇదే సమయంలో పలువురు మిల్లర్లు దళారులను ఏర్పా టు చేసుకుని బియ్యం కొనుగోలు చేసి సీఎంఆర్‌గా ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ఎవరైనా తనిఖీలకు వస్తే తమకున్న సంబంధంతో బయటకు పొక్కకుండా చూస్తున్నారు.తినుబండారాల తయారీ కేంద్రాలకు బియ్యం తరలుతోంది. తక్కువ ధరకు లభ్యమవడంతో వీటికే మొగ్గు చూపుతున్నారు.కాలక్రమేణ టిఫిన్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తుండగా సదరు కేంద్రాలకు ఇవే బియ్యం సరఫరా చేస్తున్నారు. దోశ, ఇడ్లీ, వడ ఇతర వాటిలో వీటినే కలిపేస్తుండగా పలువురు నిర్వాహకులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం గడిస్తున్నారు.కోళ్ల ఫారాలకు తరలింపు ఎక్కువైంది. మక్కల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది యజమానులు తక్కువ ధరకు వస్తున్న బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.బీర్లు తయారీ చేసే పరిశ్రమలకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. గతంలో పట్టుబడిన కేసుల్లో 20కి పైగా ఇలాంటి రవాణానేనని పౌరసరఫరాలశాఖలోని ఓ అధికారి వివరించారు.సన్నరకాల దిగుబడి తక్కువగా ఉండటం సన్నబియ్యం ఆశించినస్థాయిలో లేకపోవడం రేషన్ బియ్యాన్నే ఫాలిష్ చేసి కలుపుతున్నారని సమాచారం. అనుకూల అధికారుల సహకారంతో బియ్యాన్ని మçహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడి ప్రజలు దొడ్డుబియ్యాన్ని అమితంగా ఇష్టపడుతారు. అక్కడ కిలో రూ.26–30 వరకు ధర పలుకుతుండటంతో భారీగా ఆదాయం గడిస్తున్నారు.ఇవి చదవండి: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు -
ఆవురావురుగా... కమ్మని ఆవకాయ!
ఎండాకాలం... మే నెల సగం అయిపోయింది. మామిడి కాయలు టెంక కట్టి ఎదురు చూస్తున్నాయి. జాడీలు స్నానాలు చేసి ఎండలో సేదదీరుతుంటాయి. ఇంట్లో మిక్సీలు గిర్ర్ర్ అంటూ గోల చేస్తుంటాయి. మామిడి కాయలు కొట్టే కత్తి పుల్లబారి పదునుదేలింది. ముక్కలు కొట్టండి... పళ్లెంలో వేయండి... కారం కలపండి. జాడీలకెత్తండి... పళ్లెంలో వేడి వేడి అన్నం వేసి కలపండి. ఇంటిల్లిపాదీ ఆవురావురుమని తినకపోతే అడగండి.ఆంధ్రా ఆవకాయ..కావలసినవి..పచ్చి మామిడి ముక్కలు – కేజీ;పచ్చి శనగలు – 50 గ్రాములు;సన్న ఆవాలు –పావు కేజీ;మెంతులు – రెండు టేబుల్ స్పూన్లు;గుంటూరు మిరపపొడి –పావు కేజీ;ఉప్పు – నూట యాభై గ్రాములు;పసుపు – టేబుల్ స్పూన్;నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె –పావు కేజీ.తయారీ..ఆవకాయ పెట్టడానికి ముందు రోజు మిరపకాయలు, ఆవాలు, మెంతులను విడిగా ఎండబెట్టాలి. మరునాడు ఉదయం ఆవాలను మిక్సీలో పొడి చేయాలి. మిరపపొడి రెడీమేడ్ది కూడా తీసుకోవచ్చు. కానీ ఆవాలు స్వయంగా చేసుకోవాలి.మామిడి కాయలను కడిగి తేమపోయే వరకు తుడిచి ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత కాయలకున్న తొడిమ తొలగించాలి.అప్పటికీ సొన కారుతుంటే శుభ్రమైన నూలు వస్త్రంతో తుడిచేయాలి. ఇలా సిద్ధం చేసుకున్న మామిడికాయలను టెంకతో సహా చిన్న ముక్కలు చేసుకోవాలి.శనగలను శుభ్రమైన వస్త్రంతో తుడిచి పక్కన పెట్టాలి.వెడల్పుగా ఉన్న పెద్దపాత్రలో మామిడి ముక్కలు వేయాలి. అందులో శనగలు, ఆవాల పొడి, మిరపపొడి, ఉప్పు, పసుపు వేసి అట్లకాడతో బాగా కలపాలి.మెంతులు కూడా వేసి బాగా కలపాలి. చివరగా నూనెపోసి ముక్కలకు ఒత్తిడికి కలగకుండా అడుగు నుంచి కలిపితే ఆవకాయ రెడీ. దీనిని పింగాణి జాడీలో పెట్టి అంచులకు తెల్లని శుభ్రమైన నూలు వస్త్రాన్ని కట్టాలి.ఆ పైన మూత పెట్టాలి. ఈ జాడీలోని ఆవకాయను రోజూ మూత తీయకూడదు. రోజువారీ వాడుకకు అవసరమైనంత చిన్న జాడీలోకి తీసుకుంటూ ఉంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.బెల్లం ఆవకాయ..కావలసినవి..మామిడి ముక్కలు – అర కేజీ; బెల్లం – అర కేజీ;మిరపపొడి– 200 గ్రాములు;ఉప్పు – 200 గ్రాములు;ఆవపిండి– 100 గ్రాములు;నూనె – 200 గ్రాములు.తయారీ..మామిడి కాయలను శుభ్రంగా కడిగి తుడిచి టెంకతో సహా ముక్కలు చేసుకోవాలి.బెల్లాన్ని తురిమి వెడల్పుపాత్రలో వేసి అందులో మామిడికాయ ముక్కలు, ఆవపిండి, మిరపపొడి, ఉప్పు, కప్పు నూనె వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని రెండు రోజులపాటు ఎండలో పెట్టాలి. బెల్లం కరిగిపాకంలా జిగురుగా వచ్చినట్లనిపిస్తే సరే, లేకపోతే మూడవ రోజు కూడా ఎండలో పెట్టాలి.పాకం వచ్చిన తర్వాత మిగిలిన నూనె కూడా వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి.ఈ బెల్లం ఆవకాయను పిల్లలు బాగా ఇష్టపడతారు. ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి మహిళలు రోజూ తీసుకోవచ్చు.నువ్వుల ఆవకాయ..కావలసినవి..మామిడి కాయ ముక్కలు – 3 కప్పులు;నువ్వులు – ఒకటిన్నర కప్పులు;మిరపపొడి– ముప్పావు కప్పు;ఉప్పు–పావు కప్పు;పసుపు – అర టీ స్పూన్;వేరు శనగ నూనె – ఒకటిన్నర కప్పులు.తయారీ..నువ్వులను తయారీ దోరగా వేయించి చల్లారిన పొడి చేయాలి.మామిడి ముక్కలను వెడల్పుపాత్రలో వేసి అందులో నువ్వుల పొడి, మిరపపొడి, ఉప్పు, పసుపు వేసి అట్లకాడతో బాగా కలపాలి.ఉప్పు, కారం, నువ్వుపిండి సమంగా కలిసిన తర్వాత కప్పు నూనెపోసి మళ్లీ కలపాలి.ఈ మిశ్రమాన్ని జాడీలోకి తీసుకుని, మిగిలిన నూనెను పైన తేలేటట్లుపోయాలి.ఇందులో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెల్లుల్లి ఆవకాయ..కావలసినవి..మామిడి కాయ ముక్కలు –పావు కేజీ లేదా (మీడియం సైజు కాయలు 3);వెల్లుల్లి – 200 గ్రాములు;ఉప్పు – 100 గ్రాములు;మిరపపొడి– 200 గ్రాములు;ఆవాలు – 150 గ్రాములు (ఎండబెట్టి పొడి చేయాలి);పసుపు – టీ స్పూన్;మెంతులు – టేబుల్ స్పూన్;నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె – కిలో.తయారీ..ఒకపాత్రలో నూనెపోసి మామిడి ముక్కలను వస్త్రంతో తుడిచి నూనెలో వేయాలి.వెల్లుల్లిపాయలను పొట్టు వలిచి ఒక ప్లేట్లో వేసి గాలికి ఆరనివ్వాలి.మరొకపాత్రలో మిరపపొడి, ఆవపిండి, ఉప్పు, పసుపు, మెంతులు వేసి సమంగా కలిసేవరకు కలపాలి. ఇప్పుడు వెల్లుల్లి రేకలను వేసి కలపాలి.మామిడి ముక్కల లోని నూనెను ఒక జాడీలోకి వంపాలి. ఇప్పుడు మామిడి ముక్కలలో ముందుగా కలిపి సిద్ధంగా ఉంచిన ఉప్పు, వెల్లుల్లి ఇతర పొడుల మిశ్రమాన్ని వేసి పొడులన్నీ మామిడి ముక్కలకు పట్టేలా కలపాలి.మామిడి ముక్కలను పట్టి ఉన్న నూనె ఈ పొడులను పీల్చుకుని కొంత తడి పొడిగా మారుతుంది.ఈ మిశ్రమాన్ని నూనె వంపుకున్న జాడీలో వేసి అదమాలి.నూనె పైకి తేలుతుంది. వెల్లుల్లి బ్లడ్ థిన్నర్. రక్తాన్ని పలచబరిచి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా నివారిస్తుంది. కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ హాయిగా తినవచ్చు. -
ఈ సమ్మర్ సీజన్లో.. నేరుగా 'చల్లని పెరుగుతోనే వెరైటీ కర్రీలు'!
మే నెల వచ్చేసింది... ఎండలు మండుతున్నాయి. భోజనం చేయాలంటే చెమటలు పడుతున్నాయి. కూరలను చూస్తేనే ఆకలి పోయి దాహం వేస్తోంది. నేరుగా మజ్జిగలోకి వెళ్లాలనిపించేంత దాహం అది. అందుకే పెరుగుతోనే కూరలు చేసుకుందాం. ఇవన్నీ నాలుకకు హితవుగా ఉంటాయి. తిన్న తర్వాత పొట్టను చల్లగా ఉంచుతాయి.దహీ బైంగాన్..కావలసినవి.. వంకాయ – 1 (మీడియం సైజు); నూనె – టేబుల్ స్పూన్ (వంటకు ఉపయోగించే నూనె ఏదైనా) ; ఆవనూనె – టేబుల్ స్పూన్ (పోపు కోసం) ; యాలకులు – 2 ; లవంగాలు – 2 ; పెరుగు – పావు లీటరు (చిలకాలి). గ్రేవీ కోసం: మెంతిపిండి – టేబుల్ స్పూన్ ;అల్లం పేస్ట్ – టేబుల్ స్పూన్ ; కశ్మీర్ మిర్చిపౌడర్ – టేబుల్ స్పూన్ ; నీరు – కప్పు (పై వన్నీ కలపడానికి) ; ఇంగువ– చిటికెడు ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; పసుపు – టీ స్పూన్.తయారీ..ఒక పాత్రలో కప్పు నీరు పోసి అందులో మెంతిపిండి, మిర్చిపౌడర్, అల్లం పేస్టు వేసి కలపాలి.వంకాయను మందపాటి చక్రాల్లా తరిగి ఉప్పు రాయాలి.నూనె వేడి చేసి వంకాయ ముక్కలను వేయించి పక్కన పెట్టాలి(ఎయిర్ ఫ్రయర్ ఉంటే నూనె లేకుండా ఫ్రై చేసుకోవచ్చు)అదే బాణలిలో మిగిలిన నూనెలో ఆవ నూనె వేసి వేడెక్కిన తర్వాత లవంగాలు, యాలకులు, ఇంగువ వేయాలిఇందులో మెంతిపిండి, అల్లం, మిరప్పొడి కలిపిన మిశ్రమం, పసుపు వేసి కలిపి సన్న మంట మీద మరిగించాలిఆ మిశ్రమం వేడెక్కిన తర్వాత పెరుగు వేసి గరిటెతో కలుపుతూ ఐదారు నిమిషాల పాటు మరిగించాలిమిశ్రమం మరగడం మొదలైన తర్వాత మరో కప్పు నీటిని పోసి కలిపితే చిక్కటి గ్రేవీ తయారవుతుందిఇప్పుడు ఉప్పు కలిపి గ్రేవీ చిక్కదనాన్ని సరిచూసుకుని అవసరమైతే మరికొన్ని నీటిని పోసి మరగనివ్వాలిఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి కలిపి వడ్డించాలిఇది అన్నంలోకి రోటీకి కూడా మంచి కాంబినేషన్.పులిస్సెరి..కావలసినవి.. పెరుగు – పావు లీటరు ; పసుపు – పావు టీ స్పూన్ ; నీరు – పావు లీటరు. కొబ్బరి పేస్టు కోసం: పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు ; పచ్చిమిర్చి– 3 ; జీలకర్ర– టీ స్పూన్; నీరు – కప్పు లేదా కొబ్బరి పేస్టు చేయడానికి తగినంత.పోపు కోసం: నూనె – 2 టేబుల్ స్పూన్లు (వంటకు ఉపయోగించే కొబ్బరి నూనె లేదా ఇతర వంట నూనె) ; ఆవాలు – అర టీ స్పూన్ ; కరివేపాకు – 2 రెమ్మలు ; మెంతులు– పావు టీ స్పూన్ ; ఎండుమిర్చి– 2 ; ఉల్లిపాయ ముక్కలు– పావు కప్పు ; అల్లం – అర అంగుళం ముక్క (సన్నగా తరగాలి) ; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీలో గ్రైండ్ చేయాలి. తగినంత నీటిని వేస్తూ మెత్తగా చేసుకోవాలిఒక పాత్రలో పెరుగు, పసుపు, నీరు కలిపి చిలికి అందులో ఉప్పు, కొబ్బరి పేస్టు వేసి కలపాలిఈ పాత్రను స్టవ్ మీద పెట్టి మీడియం మంటమీద మధ్యలో గరిటెతో కలుపుతూ వేడిచేయాలి.దీనిని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. మరగడం మొదలైన వెంటనే దించేయాలిబాణలిలో నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి వేగిన తర్వాత మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు వేసి చిన్న మంట మీద మగ్గనివ్వాలిఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత పోపును ముందుగా వేడి చేసి సిద్ధంగా ఉంచిన పెరుగు– కొబ్బరి పేస్టు మిశ్రమంలో కలిపి, కొత్తిమీర చల్లి మూత పెట్టాలి. ఈ కేరళ వంట అన్నంలోకి రుచిగా ఉంటుంది.గుజరాతీ కడీ..కావలసినవి: శనగపిండి– 4 టేబుల్ స్పూన్లు; అల్లం పచ్చిమిర్చి పేస్ట్– అర టేబుల్ స్పూన్ (అల్లం అంగుళం ముక్క, రెండు పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేయాలి); తాజా పెరుగు – కప్పు ; బెల్లం లేదా చక్కెర – టేబుల్ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నీరు – రెండున్నర కప్పులు. పోపు కోసం: నూనె – టీ స్పూన్ ; ఆవాలు – అర టీ స్పూన్ ; జీలకర్ర– అర టీ స్పూన్ ; దాల్చిన చెక్క – అంగుళం ముక్క ; లవంగాలు – 2 ; కరివేపాకు – ఒక రెమ్మ ; ఎండు మిర్చి – 2; మెంతులు – పావు టీ స్పూన్ ; ఇంగువ – చిటికెడు ; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..ఒక పాత్రలో శనగపిండి, అల్లం–పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, బెల్లం, ఉప్పు వేసి బాగా చిలకాలిబాణలిలో నూనె వేడిచేసి ఆవాలు వేయాలిఅవి పేలిన తర్వాత జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు, ఎండు మిర్చి (విరిచి వేయాలి), మెంతులు, ఇంగువ వేసి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆపేయాలిఈ పోపును ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగు – శనగపిండి మిశ్రమంలో వేసి కలపాలిఇప్పుడు ఆ పాత్రను మీడియం మంట మీద ఉంచి మిశ్రమం అడుగుకు అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలిమిశ్రమం మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి కలుపుతూ మాడకుండా చూసుకోవాలిశనగపిండి పచ్చి వాసన పోయిన తర్వాత మిశ్రమం మంచి రుచికరమైన వాసన వస్తుంటుంది. అప్పుడు కొత్తిమీర చల్లి దించేయాలిగుజరాతీ కడీని సూప్లాగ భోజనానికి ముందు తాగవచ్చు. అన్నంలో కలుపుకోవచ్చు, రోటీలోకి కూడా తినవచ్చు. ఇది వేసవి, శీతాకాలాల్లో కూడా ఆరోగ్యకరమైన ఆహారం.గుజరాతీ కడీ, కుకురార్కుకురార్..కావలసినవి.. చికెన్ – అర కేజీ ; చిక్కటి పెరుగు – 5 టేబుల్ స్పూన్లు ; బంగాళదుంప – 2 (ముక్కలుగా తరగాలి) ; అల్లం వెల్లుల్లి తరుగు – 2 టేబుల్ స్పూన్లు ; ఉల్లిపాయలు – 3 (తరగాలి) ; ఆవ నూనె లేదా సాధారణ వంటనూనె – 5 టేబుల్ స్పూన్లు ; చక్కెర – చిటికెడు ; ఉప్పు – 2 టీ స్పూన్లు లేదా రుచిని బట్టి ; ఎండు మిర్చి– 5 ; పచ్చిమిర్చి– 3 (నిలువుగా చీరాలి) ; పసుపు – టీ స్పూన్ ; మిరప్పొడి– 2 టీ స్పూన్లు ; గరం మసాలా పొడి – టీ స్పూన్ ; చికెన్ మసాలా పొడి– టీ స్పూన్ ; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..చికెన్‌ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేయాలి.అందులో పసుపు, చికెన్ మసాలా పొడి, మిరప్పొడి వేసి మసాలా పొడులు చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్లు కలిపి 20 నిమిషాల పాటు పక్కన ఉంచాలిఈ లోపు ఒక బాణలిలో నూనె వేడి చేసి అందులో ఇంగువ, చక్కెర, ఎండు మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలిఇవి చల్లారిన తరవాత మిక్సీలో గ్రైండ్ చేయాలి.అందులోనే పెరుగు కూడా వేసి సమంగా కలిసేటట్లు ఒకసారి తిప్పి ఒక పాత్రలోకి తీసుకుని పక్కన పెట్టాలిఉల్లిపాయలు వేయించిన బాణలిలో మిగిలిన నూనెలో బంగాళాదుంప ముక్కలు వేయించి ఒక పాత్రలోకి తీసుకుని పక్కన ఉంచాలిఅదే బాణలిలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయించి తీసి పెట్టుకోవాలిఇప్పుడు మిగిలిన నూనెలో మారినేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి మీడియం మంట మీద వేయించాలిచికెన్ ముక్కలు ఎర్రగా వచ్చేవరకు వేయించి అప్పుడు ఉప్పు వేసి ముక్కలకు పట్టేటట్లు కలపాలిచికెన్ ముక్కల నుంచి నూనె వేరవుతున్న సమయంలో బంగాళాదుంప ముక్కలను వేయాలిఈ రెండింటినీ కలిపి పది నిమిషాల పాటు వేయించిన తర్వాత అందులో రెండు కప్పుల నీరు పోసి కలిపి మంట పెంచి ఉడకనివ్వాలిచికెన్ ఉడికేటప్పుడు అందులో ముందుగా వేయించి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చితోపాటు గరం మసాలా పొడి, చిలికిన పెరుగు మిశ్రమాన్ని వేయాలిఇవన్నీ కలిసి ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. ఈ కుకురార్ అస్సాం వాళ్ల వంట. అన్నం, రోటీల్లోకి రుచిగా ఉంటుంది.ఇవి చదవండి: Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు.. -
సమ్మర్ సీజన్ కదా అని.. తొందరపడి పచ్చళ్లు పెట్టేస్తున్నారా!
మామిడి కాయల సీజన్ కదా.. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మామిడి కాయలు కనిపిస్తున్నాయి. అలాగని తొందరపడి ఆవకాయ, మాగాయ పెట్టేయకూడదు. ఎందుకంటే ఎండలు ఇంకాస్త ముదరాలి. ఎండలతోపాటే మామిడి కాయలు కూడా బాగా టెంకపట్టాలి. అప్పుడయితేనే ఏడాదంతా నిల్వ ఉంటుంది ఆవకాయ. అయితే అప్పటిదాకా చూస్తూ ఊరుకోవాలా? ఏమక్కరలేదు. ఆవకాయ పెట్టేలోగా రెండు మూడు వారాల నుంచి నెలరోజుల దాకా తాజాగా ఉండే ఈ పచ్చళ్లు ట్రై చేద్దామా మరి! మ్యాంగో ఇన్స్టంట్ పికిల్.. కావలసినవి: పచ్చి మామిడికాయ – ఒకటి; కశ్మీర్ మిరప్పొడి – టేబుల్ స్పూన్; నువ్వుల నూనె– 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు– టీ స్పూన్; మెంతులు – అర టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఇంగువ – పావు టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్. తయారీ.. మామిడికాయను శుభ్రంగా కడిగి తుడిచి, సొన పోయేటట్లు తొడిమను తొలగించాలి. గింజను తొలగించి, తొక్కతో సహా ముక్కలు తరగాలి. ముక్కలకు ఉప్పు కలిపి పక్కన పెట్టాలి. సుమారు ఒక కప్పు ముక్కలు వస్తాయి. బాణలిలో మెంతులు వేసి (నూనె లేకుండా) దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అదే బాణలిలో నువ్వుల నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఇంగువ, మెంతిపొడి, మిరప్పొడి, పసుపు వేసి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత ఈ పోపును మామిడి ముక్కల్లో వేసి కలపాలి. అరగంట సేపటికి ఉప్పు, కారం, మసాలా దినుసుల రుచి ముక్కలకు పడుతుంది. ఈ పచ్చడిని తేమ లేని పాత్రలో నిల్వ చేసుకుంటే నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటుంది. చనా మేథీ మ్యాంగో పికిల్.. కావలసినవి: పచ్చి మామిడి ముక్కలు – కప్పు; మామిడి తురుము – కప్పు; పచ్చి శనగలు – అర కప్పు; మెంతులు – అర కప్పు; ఆవాలు›– అర కప్పు; ఉప్పు – అర కప్పు; మిరప్పొడి– అర కప్పు, నూనె – కప్పు. తయారీ.. మందపాటి బాణలి వేడి చేసి పచ్చి శనగపప్పును దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత మెంతులు, ఆవాలను (నూనె లేకుండా) వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో మామిడి ముక్కలు, మామిడి తురుమును వేయాలి. అందులో శనగలు, మెంతిపొడి, ఆవపిండి, మిరప్పొడి, ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తడిలేని సీసాలో కూరినట్లు పెట్టి గట్టిగా మూతపెట్టాలి. మూడు రోజుల తర్వాత నూనెను మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నూనెను సీసాలో ఉన్న మిశ్రమం పై నుంచి పోయాలి. ఈ పచ్చడిని మూడు రోజుల తర్వాత తినవచ్చు. నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇది గుజరాతీ శైలి మామిడి పచ్చడి. మామిడి తురుము పచ్చడి.. కావలసినవి: మామిడి తురుము – 2 కప్పులు; మిరప్పొడి– పావు కప్పు; ఉప్పు – పావు కప్పు; ఆవ పిండి– టేబుల్ స్పూన్; మెంతిపిండి– టేబుల్ స్పూన్; వెల్లుల్లి రేకల తురుము – టేబుల్ స్పూన్; నల్లజీలకర్ర (కలోంజి) – అర టీ స్పూన్; మెంతులు – టీ స్పూన్; ఇంగువ – అర టీ స్పూన్; ఆవ నూనె – పావు కప్పు; పసుపు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్. తయారీ.. మామిడి తురుములో పసుపు, ఉప్పు, వెల్లుల్లి, కలోంజి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. బాణలి వేడి చేసి (నూనె లేకుండా) మెంతులు, జీలకర్ర వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేసి మామిడి తురుములో వేసి కలపాలి. ఇప్పుడు మామిడి తురుములో ఆవపిండి, మెంతిపిండి, మిరప్పొడి, నూనె వేసి కలిపి ఉప్పు సరి చూసుకోవాలి. అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవచ్చు. ఇది నాలుగు రోజుల నుంచి వారం వరకు తాజాగా ఉంటుంది. మామిడి తురుమును పలుచని వస్త్రంలో కట్టి నీరు పోయేటట్లు చేసిన తర్వాత మసాలా దినుసులు కలిపి, నూనె పైకి తేలేటంత మోతాదులో పోసినట్లయితే ఆ పచ్చడి నెలలపాటు నిల్వ ఉంటుంది. -
చూడడానికి పాములా భయపెడుతుంది.. కానీ చల్లగా కాపాడుతుంది..
పొట్లకాయ.. స్నేక్‌గార్డ్. చూడడానికి పాములా భయపెడుతుంది. కానీ.. ధైర్యంగా నమిలి మింగేస్తే సరి. పొట్టలోకి వెళ్లి చల్లగా కాపాడుతుంది. సమ్మర్ గార్డ్ ఫ్యామిలీలో ఇదీ ఒకటి. పొట్టను కాపాడే కాయ.. పొట్లకాయ. వేడి నుంచి రక్షించే.. కూరగాయ ఇది. దీనినే ఎన్నో రకాలుగా వండవచ్చు. ఎంతో రుచిగా మార్చవచ్చు. అలాగే పచ్చడి చేసి నిల్వ చేయవచ్చు కూడా. మరి ఈ పొట్లకాయ రుచుల తీరేంటో తెలుసుకుందాం.. పొట్లకాయ పెసరపప్పు.. కావలసినవి.. పొట్లకాయ ముక్కలు– 2 కప్పులు; పెసరపప్పు – అర కప్పు ; కొబ్బరి తురుము – అర కప్పు ; ఆవాలు – టీ స్పూన్ ; మినప్పప్పు – 2 టీ స్పూన్లు ; ఎండుమిర్చి – 2 ; కరివేపాకు – 2 రెమ్మలు ; ఇంగువ– పావు టీ స్పూన్ ; నూనె లేదా నెయ్యి – టేబుల్ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; చక్కెర – టీ స్పూన్. తయారీ.. బంగాళాదుంపను శుభ్రం చేసి నిలువుగా కోసి గింజలను తొలగించిన తర్వాత ముక్కలు చేయాలి. పెసరపప్పు కడిగి పక్కన పెట్టాలి. పాత్రలో రెండు కప్పుల నీటిని పోసి మరిగేటప్పుడు పొట్లకాయ ముక్కలు, పెసరపప్పు వేసి ఉడికించాలి. పప్పు ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత ఉప్పు కలిపి పొట్లకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. ముక్కలు ఉడకడానికి నీరు సరిపోకపోతే మరికొంత నీటిని చిలకరించి ఉడికించాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి ఆవాలు వేయాలి. అవి వేగిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. మినప్పప్పు వేగిన తర్వాత చక్కెర, ఉడికించి సిద్ధంగా ఉంచిన పొట్లకాయ – పెసరపప్పును వేసి కలపాలి. తేమ ఆవిరి అయ్యే వరకు కలియబెడుతూ వేయించి చివరగా కొబ్బరి తురుము వేసి కలపాలి. కొబ్బరి రుచి కూరగాయ ముక్కలకు పట్టడం కోసం ఓ నిమిషం పాటు గరిటెతో కలియబెడుతూ వేయించి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గే కొద్దీ కూర రుచి ఇనుమడిస్తుంది. ఇది సాంబార్, రసం అన్నంలోకి సైడ్ డిష్‌గా రుచిగా ఉంటుంది. పొట్లకాయ పెసరపప్పు, పొట్లకాయ పొరిచ్చ కొళంబు పొట్లకాయ పొరిచ్చ కొళంబు.. కావలసినవి: కందిపప్పు – అరకప్పు; పొట్లకాయ ముక్కలు – 3 కప్పులు ; సాంబారు పొడి – టీ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నిమ్మకాయ రసం – ఒక టేబుల్ స్పూన్. పొడి కోసం: ధనియాలు – 2 టీ స్పూన్లు; పచ్చి శనగపప్పు – 2 టీ స్పూన్లు ; ఎండుమిర్చి – 2; మినపప్పు– టీ స్పూన్ ; ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు ; ఇంగువ – చిటికెడు ; నూనె – టీ స్పూన్. పోపు కోసం: నూనె – టీ స్పూన్ ;ఆవాలు – టీ స్పూన్ ; మినప్పప్పు – టీ స్పూన్ ; కరివేపాకు– 2 రెమ్మలు. తయారీ.. కందిపప్పును శుభ్రంగా కడిగి ప్రెషర్ కుకర్‌లో వేసి తగినంత నీటిని పోసి ఉడికించి పక్కన ఉంచాలి. పొడి కోసం తీసుకున్న దినుసులను వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. పొట్లకాయను శుభ్రంగా కడిగి తరిగి గింజలు తొలగించి ముక్కలను సిద్ధం చేసుకోవాలి. ఒక పాత్రలో ఉప్పు, సాంబారు, పొట్లకాయ ముక్కలు వేయాలి. ముక్కలు మునిగేటట్లు నీటిని పోసి మెత్తగా ఉడికించాలి. ఉడికిన కందిపప్పు చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇందులో ఉడికించిన పొట్లకాయ ముక్కలను, మసాలా పొడి వేసి నీరు పోసి కలిపి ఉడికించాలి. పప్పు, కూరగాయ ముక్కలు, మసాలా పొడి అన్నింటి రుచి కలిసే వరకు ఉడికించి, నిమ్మరసం కలిపి దించేయాలి. రుచి చూసి అవసరమైతే ఉప్పు, నిమ్మరసం మరికొంత చేర్చుకోవచ్చు పోపు కోసం మందపాటి పాత్ర తీసుకోవాలి. పాత్రలో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత మినప్పప్పు వేయించి కరివేపాకు వేసి ముందుగా ఉడికించి సిద్ధంగా ఉంచిన కందిపప్పు కూరగాయ ముక్కల మిశ్రమాన్ని పోసి కలిపి దించేయాలి. ఘుమఘుమలాడే పొట్లకాయ పొరిచ్చ కొళంబు రెడీ. ఇది అన్నంలోకి బాగుంటుంది. పొట్లకాయ పచ్చడి కావలసినవి: పొట్లకాయ ముక్కలు – కప్పు; ఎండుమిర్చి –3 ; మినప్పప్పు – టేబుల్ స్పూన్ ; పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్ ; వేరు శనగపప్పు లేదా నువ్వులు లేదా కొబ్బరి తురుము – పావు కప్పు ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నెయ్యి లేదా నూనె – టేబుల్ స్పూన్; చింతపండు– అంగుళం ముక్క ; బెల్లం పొడి– టీ స్పూన్ (ఇష్టమైతేనే). పోపు కోసం: నూనె– టేబుల్ స్పూన్ ; ఆవాలు– టీ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్ ; ఎండుమిర్చి– ఒకటి; ఇంగువ– చిటికెడు ; కరివేపాకు– 2 రెమ్మలు. తయారీ.. మందపాటి బాణలిలో నెయ్యి లేదా నూనె వేడి చేసి మినప్పప్పు, పచ్చి శనగపప్పు, నువ్వులు, ఎండుమిర్చిని దోరగా వేయించి మరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాలి. అదే బాణలిలో పొట్లకాయ ముక్కలను వేసి పచ్చిదనం తగ్గేవరకు వేడి చేసి ఆపేయాలి. చల్లారిన తరవాత మిక్సీలో గ్రైండ్ చేయాలి, అందులోనే చింతపండు, బెల్లం, ఉప్పు కలిపి మరో రౌండ్ తిప్పాలి. ఇప్పుడు పొట్లకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసి మరొక పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు వేసి వేగిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి దోరగా వేయించి పచ్కడిలో వేసి కలపాలి. ఇది అన్నంలోకి ఇడ్లీ, దోసెల్లోకి కూడా రుచిగా ఉంటుంది. పొట్లకాయ పచ్చడి, పొట్లకాయ వేపుడుకూర పొట్లకాయ వేపుడుకూర.. కావలసినవి: పొట్లకాయ ముక్కలు – పావుకేజీ ; ధనియాల పొడి– టీ స్పూన్ ; జీలకర్ర– టీ స్పూన్ ; పసుపు– పావు టీ స్పూన్ ; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; ఇంగువ– చిటికెడు ; కారం – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నెయ్యి– టేబుల్ స్పూన్ ; నీరు– పావు కప్పు ; వేరుశనగ పప్పుల పొడి లేదా శనగపిండి– టేబుల్ స్పూన్. తయారీ.. బాణలిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ధనియాలపొడి, కారం పొడి, పసుపు, ఇంగువ వేసి కలపాలి. పచ్చిదనం పోయిన తర్వాత ఇందులో ఉప్పువేసి, కొద్దిగా నీటిని పోసి కలపాలి. మసాలా పొడులన్నీ సమంగా కలుస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి బాణలిలో పొట్లకాయ ముక్కలు వేసి మసాలా సమంగా పట్టేటట్లు కలపాలి. ముక్కలకు మసాలా సమంగా పట్టిన తర్వాత స్టవ్ వెలిగించి ముక్కల్లో నీటిని పోసి కలిపి మంట తగ్గించి మూత పెట్టాలి. రెండు నిమిషాలకోసారి మూత తీసి గరిటెతో ముక్కలను కలిపి మళ్లీ మూత పెడుతుండాలి. పది నిమిషాలకు ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి. ముక్కలు ఉడకలేదనిపిస్తే కొద్దిగా నీటిని చిలకరించి మళ్లీ మూత పెట్టి ఉడికించాలి. చివరగా వేరుశనగపప్పు పొడి లేదా శనగపిండి చల్లి బాగా కలిపి దించేయాలి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి రుచిగా ఉంటుంది. ఇవి చదవండి: Beauty Tips: చర్మం మృదువుగా.. ముడతలు లేకుండా ఉండాలంటే..? -
'ఇఫ్తార్' విందుకై.. ఇంట్లోనే సులువుగా చేయండిలా..
పగలంతా రోజాతో అల్లా ధ్యానం. రాత్రికి ఇఫ్తార్‌తో ఆరోగ్యధ్యానం. నీరసించిన దేహానికి శక్తి కావాలి. ఆ శక్తి దేహానికి తక్షణం అందాలి. ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. గార్నిషింగ్తో పదార్థం రుచి పెరగాలి. రుచి.. ఆరోగ్యానికి మేళవింపు కావాలి. ఇఫ్తార్ కోసం పొరుగు దేశాలు ఏం వండుతున్నాయి? దహీ చికెన్‌ను బ్రెడ్‌లో పార్సిల్ చేశాయి. నాలుగు పప్పులు.. రెండు ధాన్యాలు.. కలిపి హలీమ్ వండుతున్నాయి. అచ్చం మనలాగే. చికెన్ బ్రెడ్ పార్సిల్.. కావలసినవి: చికెన్ బోన్‌లెస్ – 200 గ్రా. మారినేషన్ కోసం.. మిరియాల పొడి – టీ స్పూన్; మిరపొ్పడి – టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – అర టీ స్పూన్; వెనిగర్ – టేబుల్ స్పూన్; వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; తందూరీ మసాలా పొడి – టేబుల్ స్పూన్; పెరుగు– అర కప్పు. పోపు కోసం.. నూనె – టేబుల్ స్పూన్; ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు; క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు. పార్సిల్ కోసం.. మిల్క్ బ్రెడ్ – 10 స్లయిస్‌లు; మైదా – టేబుల్ స్పూన్; కోడిగుడ్లు – 2; లెట్యూస్ – నాలుగు ఆకులు (క్యాబేజ్‌ని పోలి ఉంటుంది); నూనె – వేయించడానికి తగినంత. తయారీ.. చికెన్‌ను శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పాత్రలో వేసి మారినేషన్ కోసం తీసుకున్న దినుసులన్నింటినీ వేసి సమంగా కలిసే వరకు కలిపి (మారినేషన్) అరగంట సేపు కదిలించకుండా పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేడి చేసి మారినేట్ చేసిన చికెన్ వేసి కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికించాలి. మూత తీసి చికెన్ ముక్క ఉడికిందో లేదో చూసుకుని అవసరమైతే మరికొంత సేపు చిన్న మంట మీద ఉంచాలి. ఉప్పు కూడా సరి చూసుకుని అవసరాన్ని బట్టి మరికొంత వేసుకోవచ్చు. చికెన్ ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలిపి రెండు నిమిషాల సేపు (తేమ పోయే వరకు) వేయించి స్టవ్ ఆపేయాలి ఒక కప్పులో మైదా పిండి తీసుకుని తగినంత నీటితో గరిట జారుడుగా కలుపుకోవాలి కోడిగుడ్లను పగుల గొట్టి ఒక పాత్రలో వేసి, అందులో మిరియాల పొడి వేసి చిలికి సిద్ధంగా ఉంచుకోవాలి బ్రెడ్ స్లయిస్ల అంచులు చాకుతో కట్ చేసి తీసేయాలి. బ్రెడ్‌ను అప్పడాల కర్రతో వత్తాలి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ పొడి పొడిగా రాలిపోకుండా చికెన్ స్టఫ్ పెట్టి నూనెలో వేయించడానికి అనువుగా మారుతుంది. ఇలా చేసుకున్న బ్రెడ్ స్లయిస్లో ఒక స్పూన్ చికెన్ స్టఫ్ పెట్టి, కర్రీ బయటకు రాకుండా బ్రెడ్ అంచులకు మైదా పిండి ద్రవం రాసి అతికించాలి. నలుచదరంగా ఉండే బ్రెడ్ స్లయిస్ సాండ్విచ్లాగ త్రిభుజాకారపు పార్సిల్ తయారవుతుంది. ఇలా అన్నింటినీ చేసుకుని పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఒక్కో బ్రెడ్ పార్సిల్‌ను కోడిగుడ్డు సొనలో ముంచి నూనెలో వేసి రెండు వైపులా దోరగా వేయించి తీసి టిష్యూ పేపర్ మీద వేయాలి. నూనె వదిలిన తరవాత ఈ బ్రెడ్ పార్సిళ్లను, టొమాటో కెచప్, లెట్యూస్‌తో కలిపి సర్వ్ చేయాలి. చికెన్ హలీమ్.. కావలసినవి: ఎర్ర కందిపప్పు – టేబుల్ స్పూన్; బాసుమతి బియ్యం– టేబుల్ స్పూన్; గోధుమలు– టేబుల్ స్పూన్; బార్లీ– టేబుల్ స్పూన్; కందిపప్పు– టేబుల్ స్పూన్; పచ్చి శనగపప్పు– టేబుల్ స్పూన్; అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌లు– ఒక్కొక్కటి టేబుల్ స్పూన్; చికెన్ (బోన్‌లెస్)– పావు కేజీ; చికెన్ స్టాక్ – అరకప్పు; హలీమ్ మసాలా పొడి– టేబుల్ స్పూన్; ఉల్లిపాయ ముక్కలు – కప్పు; మిరప్పొడి – అర టీ స్పూన్; పసుపు– అర టీ స్పూన్; పెరుగు – అర కప్పు; ఉప్పు – అర టీ స్పూన్. పోపు కోసం.. నెయ్యి– అర కప్పు; జీలకర్ర– టీ స్పూన్; వెల్లుల్లి– 10 రేకలు; పుదీన ఆకులు – టేబుల్ స్పూన్. గార్నిషింగ్ కోసం.. జీడిపప్పు – పావు కప్పు; నిమ్మకాయ– ఒకటి (పలుచగా తరగాలి); అల్లం తరుగు– టేబుల్ స్పూన్; కొత్తిమీర తరుగు – కప్పు. తయారీ.. బియ్యం, కందిపప్పులు, పచ్చి శనగపప్పు, బార్లీ, గోధుమలను ఒక పెద్ద పాత్రలో వేసి శుభ్రంగా కడిగి, మూడింతలు మంచి నీటిని పోసి పది నిమిషాలసేపు నానబెట్టాలి. ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్టులు వేసి కలిపి, పప్పులు, ధాన్యాలు మెత్తబడే వరకు ఉడికించాలి. వేడి తగ్గిన తర్వాత వీటిని మెత్తగా మెదపాలి. గింజలు ఉడికేలోపు బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించి తీసి పక్కన సిద్ధంగా ఉంచుకోవాలి చికెన్‌ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేసి అందులో హలీమ్ మసాలా పొడి, మిరప్పొడి, పసుపు, ఉప్పు, పెరుగు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, చికెన్ స్టాక్‌ను (చికెన్ స్టాక్ లేకపోతే మంచి నీటిని పోయాలి) వేసి ఉడికించాలి. చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత అందులోని నీటిని పప్పులు, ధాన్యాలు ఉడికించిన మిశ్రమంలోకి వంపి చికెన్ ముక్కలను మాత్రమే పాత్రలో ఉంచి ఆ ముక్కలను మెదపాలి. మెదిపిన చికెన్‌ను కూడా ధాన్యాలు, పప్పులు ఉడికించిన మిశ్రమంలో వేసి కలిపి మంట తగ్గించి అన్నింటి రుచి కలవడం కోసం మళ్లీ ఉడికించాలి ఉల్లిపాయ ముక్కలు వేయించిన బాణలిలో మిగిలిన నేతిలో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పుదీన వేసి అర నిమిషం పాటు వేయించి ఈ పోపును చిన్నమంట మీద ఉడుకుతున్న చికెన్, పప్పులు, ధాన్యాల మిశ్రమంలో వేసి కలిపితే హలీమ్ రెడీ గార్నిష్ చేయడానికి ఒక పాత్రలో కొత్తిమీర తరుగు, అల్లం తరుగు, జీడిపప్పులు, ఎర్రగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పులో వేడి వేడి హలీమ్ వేసి పై గార్నిష్ కోసం సిద్ధం చేసిన మిశ్రమాన్ని కొద్దిగా చల్లి, నిమ్మకాయ ముక్క పెట్టి సర్వ్ చేయాలి. ఇవి చదవండి: కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? ఈ వీడియో చూడండి! -
ఇంట్లో వాడే పాత్రల వెనుక ఇంత కష్టం ఉంటుందా?
మనం నిత్యం ఎలా పడితే అలవాడే పాత్రలు ఎలా తయారవ్వుతాయో వింటే షాకవ్వుతారు. ఇంత శ్రమ ఉంటుందా! అనుకుంటారు. మనం పాత సామాన్లను అమ్మేస్తుంటాం. ఎంతో కొంత డబ్బులు తీసుకుని పనికిరాని సామాన్లను పాత సామాన్ల వాడికి ఇచ్చేస్తుంటాం. అలా వచ్చిన వాటిని వాళ్లు ఏం చేస్తారో తెలుసా..? మనం నిత్యం కూరలు వండేది అల్యూమినియం పాత్రల్లోనే. వాటిల్లో వండొద్దని హెచ్చరిస్తున్నా.. మనం వాటిల్లోనే వండేస్తుంటాం. అవే అయితే కడగడం ఈజీ. పైగా అంత బరువు ఉండవు. వాడుకునేందుకు సౌలభ్యంగా ఉండటంతో ప్రజలు ఆ పాత్రలకే అలవాటు పడిపోయారు. అదీగాక పెద్ద హోటల్స్, రెస్టారెంట్లలో కూడా వీటిని వాడుతుంటారు. కడిగేందుక వీలుగానూ, ఎక్కువ మొత్తంలో వండే కూరకు ఈ గిన్ని కాస్త వెసులుబాటుగా ఉంటుంది. బరువు కూడా ఓ మోస్తారుగా ఉంటుంది. అలాంటి ఈ అల్యూమినియం పాత్రలను మనం ఎలా తయారు చేస్తారో చూస్తే మాత్రం వీటి వెనుక ఇంత కష్టం ఉంటుందా? అని నోరెళ్లబెడతారు. వాడిపడేసిన అల్యూమినయం చెత్తను బొగ్గుల వేడిపై కరిగించి వాటిని మంచిగా మరిగించి ఓ పాత్ర రూపంలో ఉన్న బట్టిలో వేసి అల్యూమినియం గిన్నెలను తయారు చేస్తారు. అవి అందంగా ఉండేలా మంచి పాలిష్ పెట్టడం ఒక వంతు. ఆ తర్వాత ఆ గిన్నెలను పట్టుకునేలా హ్యాండిల్స్ బిగించి చక్కగా గిన్నె తయారయ్యిందని నిర్థారించుకున్నాక కంపెనీ స్టిక్కర్ వేసి పొద్దికగా పెట్టడం ఒక ఎత్తు. ఇంత తతంగం అయితే గానీ ఒక గిన్నే తయారవ్వదు. అయితే ఇలా తయారయ్యిన గిన్నెలు తక్కువ స్వచ్ఛతను కలిగి ఉంటాయని అంటున్నారు నిపుణులు. వీటిలో సీసం, ఆర్సెనిక్, కాడ్మియం తదితర మెటల్ మలినాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వంట ప్రకియలో ఆయా కూరలు తయారు చేసేటప్పుడూ ఉప్పు, పులుపు వంటివి ఉంటాయని, వాటితో ఈ అల్యూమినియం రియాక్షన్ చెంది రంధ్రాలను ఏర్పరచటం లేదా అల్యూమినయంలోని విషపదార్థాలు ఈ కూరలో కలవడం జరుగుతుందని అన్నారు. ఇది ఆహారంగా తీసుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తయాని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. Using recycled aluminium to make pans What issues immediately stick out here? pic.twitter.com/i0QceNsTgx — Science girl (@gunsnrosesgirl3) March 13, 2024 (చదవండి: మసాలా ఎక్కువై కూర పాడవ్వకూడదంటే ఇలా చేయండి!) -
మలేరియా వ్యాక్సిన్ తయారీపై ‘సీరమ్’ దృష్టి!
ప్రముఖ వ్యాక్సిన్ తయారీ కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(పూణె) మలేరియా వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తర్వాత తమ సంస్థ మలేరియా వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించిందని తెలిపారు. మలేరియా వ్యాక్సిన్ తయారు చేసేందుకు కంపెనీ తన తయారీ సామర్థ్యాన్ని పెంచుకుందని అదార్ పూనావాలా తెలిపారు. సంస్థకు పది కోట్ల డోసుల మలేరియా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా దీనిని మరింత పెంచవచ్చన్నారు. మలేరియా వ్యాక్సిన్ తయారీలో టెక్నాలజీ బదిలీ ఒప్పందంతో పాటు వ్యాక్సిన్ల ఎగుమతిపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. డెంగ్యూ వ్యాక్సిన్ తయారీపై కూడా దృష్టిపెట్టామన్నారు. ఏటా లక్షల మంది డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ గతంలో కరోనా నివారణకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారుచేసింది. ఇప్పుడు దీనికి డిమాండ్ తగ్గడంతో తక్కువ స్థాయిలో యాంటీ కరోనావైరస్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. -
స్వీట్ పొటాటో బన్స్.. క్షణాలలో ఇలా రెడీ చెయొచ్చు!
కావలసినవి: చిలగడదుంపలు – 2 (మెత్తగా ఉడికించుకుని, తొక్క తీసి, చిన్నచిన్న ముక్కలు చేసుకోవాలి) ఉల్లిపాయ – 1(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) కొబ్బరి తురుము – అర కప్పు కారం – అర టీ స్పూన్ కొత్తిమీర తరుగు – 1 టీ స్పూన్ జీలకర్ర పొడి – అర టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ – అర టీ స్పూన్ గోధుమ పిండి – 2 కప్పులు పంచదార – 2 టేబుల్ స్పూన్లు నూనె, గోరువెచ్చని నీళ్లు – కొద్దికొద్దిగా ఉప్పు – తగినంత నువ్వులు – కొద్దిగా తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల నూనె, పంచదార, కొద్దిగా ఉప్పు.. వేసుకుని కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లు కలుపుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. పాన్ పెట్టుకుని.. 1 టేబుల్ స్పూన్ నూనెలో ఉల్లిపాయ ముక్కలు, చిలగడదుంపల ముక్కలు, కొబ్బరి తురుము, కారం, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. గరిటెతో తిప్పుతూ.. బాగా వేయించాలి. అనంతరం గోధుమ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని.. అప్పడాల్లా ఒత్తి.. అందులో చిలగడదుంపల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఉంచి.. తిరిగి మళ్లీ బాల్స్‌లా చేసుకోవాలి. అనంతరం వాటిపైన నువ్వులు అద్ది.. ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. ఇవి చదవండి: ఈ స్టీమర్ కుకింగ్ ఎలక్ట్రికల్ పాట్.. గురించి విన్నారా..! -
చెట్టినాడు ఘుమఘుమలు!
'చెట్టినాడు రుచుల్లో కరివేపాకు ప్రధానం. తోడుగా కొబ్బరి కూడా ఉంటుంది. అన్నంలోకి అధరవుగానూ ఉంటాయి. సాయంత్రాలకు స్నాక్‌గా కుదురుతాయి. కడుపు నిండుగా ఆరోగ్యం మెండుగా ఉంటాయి.' ఉర్లయ్ రోస్ట్.. కావలసినవి: బేబీ పొటాటోలు – అరకిలో; మసాలా పొడి కోసం: ఎండుమిర్చి – 4; ధనియాలు – టీ స్పూన్; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; యాలక్కాయ – 1; లవంగం– 1; సోంపు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; మిరియాల పొడి– టీ స్పూన్; కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు. పోపు కోసం: వేరుశనగ నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూన్; మినప్పప్పు – అర టీ స్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు; ఉల్లిపాయలు – 2 (మీడియం సైజువి, తరగాలి); పచ్చిమిర్చి – 2 (చీరాలి); అల్లంవెల్లుల్లి తరుగు – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – అర టీ స్పూన్; మిరపొ్పడి– టీ స్పూన్; ధనియాల పొడి – రెండు టీ స్పూన్లు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్. తయారీ: తయారీ.. బంగాళాదుంపలను ఉడికించి తొక్క తీసి పక్కన పెట్టాలి బాణలి వేడి చేసి మసాలా పొడి కోసం తీసుకున్న దినుసులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా వేసి వేగి చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టాలి బాణలిలో ఆయిల్ వేడి చేసి ఆవాలు వేయాలి వేగిన తర్వాత మినప్పప్పు, కరివేపాకు వేయాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి తరుగు వేసి వేగిన తర్వాత మసాలా పొడిని చల్లాలి ఆ తరవాత మిరప్పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి కలిపి ఉడికించి తొక్క తీసి సిద్ధంగా ఉంచిన బంగాళాదుంపలను వేసి మసాలా సమంగా పట్టేవరకు వేయించాలి చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి దీనిని ఈవెనింగ్ స్నాక్‌గానూ, అన్నంలోకి సైడ్ డిష్‌గానూ తినవచ్చు. గమనిక: ఉర్లయ్ అంటే బంగాళాదుంప. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల బంగాళాదుంపను ఉర్లగడ్డ అంటారు. చెట్టినాడు ఫిష్ ఫ్రై.. కావలసినవి: చేప ముక్కలు – నాలుగు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; టొమాటో ముక్కలు – పావు కప్పు; కరివేపాకు – 2 రెమ్మలు; చింతపండు రసం– టేబుల్ స్పూన్; ఆవాలు – టీ స్పూన్; వెల్లుల్లి రేకలు – 8 (తరగాలి); అల్లం తరుగు – టీ స్పూన్; ధనియాలు – టీ స్పూన్; సోంపు గింజలు– టీ స్పూన్; మిరియాలు – పది; మిరపొ్పడి– టీ స్పూన్; పసుపు– టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి. తయారీ.. చేప ముక్కలను శుభ్రం చేసి పక్కన పెట్టాలి బాణలి వేడి చేసి కరివేపాకు, వెల్లుల్లి, ధనియాలు, సోంపు, మిరియాలు వేయించి చల్లారిన తర్వాత పొడి చేయాలి పొడి చేసేటప్పుడు కొద్దిగా నూనె వేయాలి ఇప్పుడు చింతపండు రసం, టొమాటో ముక్కలు, అల్లం, పసుపు, మిరపొ్పడి, ఉప్పు కలిపి గ్రైండ్ చేయాలి ఈ పేస్ట్‌ను ఒకసారి రుచి చూసి అవసరమైతే ఉప్పు మరికొంత కలుపుకోవాలి ఇందులో మసాలా పొడిని కూడా కలిపి ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు పట్టించాలి ఇరవై నిమిషాల తర్వాత బాణలిలో నూనె వేడి చేసి చేప ముక్కలను నూనెలో అమరేటట్లు ఒకదాని పక్కన ఒకటిగా పెట్టాలి ఐదు నిమిషాల సేపు మీడియం మంట మీద కాలిన తర్వాత ముక్కలను జాగ్రత్తగా తిరగేయాలి చేప ముక్కల అంచులు కరకరలాడే వరకు వేగిన తర్వాత తీసి నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. నారియల్ సోయా పనీర్ వడ.. కావలసినవి: తురిమిన పనీర్– 4 కప్పులు; తురిమిన టోఫూ – 2 కప్పులు; అల్లం తరుగు – 3 టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి తరుగు – టేబుల్ స్పూన్; వెల్లుల్లి తరుగు – 3 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; గరం మసాలా పొడి– టీ స్పూన్; దాల్చిన చెక్క పొడి– టీ స్పూన్; మిరియాల పొడి– టీ స్పూన్; కొబ్బరి పొడి– 5 టేబుల్ స్పూన్లు; మైదా లేదా కార్న్‌ఫ్లోర్ – 4 టేబుల్ స్పూన్లు; బ్రెడ్ పొడి– 10 టేబుల్ స్పూన్లు; నూనె – వేయించడానికి తగినంత. తయారీ.. టోఫూ, పనీర్లను పలుచని క్లాత్‌లో కట్టి నీరు కారిపోవడానికి కనీసం ఓ అరగంట సేపు ఉంచాలి ఇప్పుడు పనీర్, టోఫూ తురుముని ఒక పాత్రలో వేసి మెత్తగా చిదమాలి అందులో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, గరం మసాలా, దాల్చినచెక్క పొడి, మిరియాల పొడి, కొబ్బరి పొడి వేసి కలపాలి ఈ మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత గోళీలుగా చేసుకుని పక్కన పెట్టాలి మైదా లేదా కార్న్‌ఫ్లోర్‌లో తగినంత నీటిని పోసి జారుడుగా కలుపుకోవాలి పనీర్ మిశ్రమం గోళీలను వడల్లా వత్తి కార్న్‌ప్లోర్ లో ముంచి ఆ తర్వాత బ్రెడ్ పొడిలో వేసి వడ అంతటికీ బ్రెడ్ పొడి పట్టేటట్లు రోల్ చేయాలి ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఒక్కో వడను జాగ్రత్తగా నూనెలో వేసి తిరగేస్తూ రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత తీసి టిస్యూ పేపర్ మీద వేయాలి నూనె వదిలిన తర్వాత సర్వ్ చేయాలి. ఇవి చదవండి: కలిసి మీరూ రాయండి -
టేస్టీగా..కూల్..కూల్‌గా, ఐస్ క్రీమ్స్ ఇలా చేస్తే పిల్లలు ఫిదా!
ఇంకా మార్చి నెల రాకముందే ఎండ సుర్రుమంటోంది. దీనికి తోడు పిల్లలకు గుర్తు రాకపోయినా సరే... మనింట్లో ఇడియట్స్‌బాక్స్ అదేనండీ.. టీవీ, రకరకాల ఐస్ క్రీమ్‌ల యాడ్స్‌తో ఊరిస్తూ ఉంటుంది. ఇక పిల్లలు ఊరుకుంటారా? అందుకే పిల్లలను పార్లర్‌కు పరుగు పెట్ట నివ్వకుండా.. ఇంట్లోనే కూల్ కూల్‌గా.. టేస్టీగా ఈజీగా ఐస్ క్రీమ్స్ తయారు చేసేద్దాం..! ఇంట్లోనే హెల్దీగా ఇలా ట్రై చేయండి ఆరెంజ్ ఐస్ క్రీమ్ కావలసినవి: చల్లటి పాలు – అర లీటరు (ఫుల్ క్రీమ్ టిన్డ్ మిల్క్); చక్కెర – 100 గ్రాములు; కార్న్‌ఫ్లోర్ – టేబుల్ స్పూన్; ట్యాంగ్ పౌడర్ – 3 టేబుల్ స్పూన్లు (ఆరెంజ్ ఫ్లేవర్); మీగడ – వంద గ్రాములు; ఆరెంజ్ ఎసెన్స్ – నాలుగు చుక్కలు. తయారీ: అర కప్పు పాలలో కార్న్‌ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బీటర్ లేదా ఫోర్క్‌తో బాగా కలపాలి. మరో పాత్రలో మిగిలిన పాలను పోసి చక్కెర వేసి అడుగు పట్టకుండా గరిటతో కలుపుతూ ఐదు నిమిషాల సేపు మరిగించాలి. ఇప్పుడు కార్న్‌ఫ్లోర్ కలిపిన పాలను వేసి కలుపుతూ మీడియం మంట మీద మరో ఐదు నిమిషాల సేపు మరిగించి దించేయాలి. పాలు చల్లారిన తర్వాత అందులో ట్యాంగ్ పౌడర్, క్రీమ్ వేసి బీటర్‌తో బాగా చిలకాలి. మృదువుగా తయారైన మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. ఆరు గంటల తర్వాత తీసి మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసి తిరిగి అదే పాత్రలో పోసి మళ్లీ అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. పది గంటల సేపు ఉంచితే ఐస్‌క్రీమ్ గట్టిగా సెట్ అయి ఉంటుంది. ఇప్పుడు కప్పులో వేసి సర్వ్ చేయాలి. చాక్లెట్ చిప్ ఐస్ క్రీమ్ కావలసినవి: మీగడ 2 కప్పులు; పాలు 3 టేబుల్ స్పూన్లు; కోకో పౌడర్-3 టేబుల్ స్పూన్లు; కండెన్స్డ్ మిల్క్- అర కప్పు; చాకొలెట్ చిప్స్ -కప్పు; బ్రౌన్ షుగర్-కప్పులో మూడవ వంతు (బ్లీచ్ చేయని చక్కెర, అది లేకపోతే మామూలు చక్కెర తీసుకోవచ్చు) తయారీ: ∙మీగడను పన్నెండు గంటల సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ∙వెడల్పుగా ఉన్నపాత్రలో పాలు పోసి చిన్న మంట మీద వేడి చేయాలి. పాలు మరగాల్సిన అవసరం లేదు, వేడయితే చాలు (పాశ్చరైజేషన్ జరగని పాలయితే మరిగించి వేడి తగ్గే వరకు పక్కన ఉంచి గోరువెచ్చగా ఉన్నప్పుడు వాడాలి). అందులో కోకో పౌడర్ వేసి బీటర్‌తో కలపాలి. ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేసి మొత్తం కలిసే వరకు బీటర్‌తో చిలకాలి. ఇప్పుడు చక్కెర వేసి చిన్న మంట మీద వేడి చేస్తూ కరిగే వరకు చిలకాలి. చక్కెర కరిగిన తర్వాత దించేసి చల్లారే వరకు మిశ్రమాన్ని పక్కన ఉంచాలి. ఫ్రిజ్‌లో ఉన్న మీగడను బయటకు తీసి సమంగా కలిసే వరకు చిలకాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసుకుని పక్కన ఉంచిన కోకో మిశ్రమాన్ని మీగడలో వేసి చిలికినట్లు కాకుండా నిదానంగా కలపాలి. ఇప్పుడు చాకొలెట్ చిప్స్ వేసి ఒకసారి కలిపి (చాకొలెట్ చిప్స్ అన్నీ ఐస్‌క్రీమ్‌లో ఒకచోట చేరకుండా అక్కడొకటి అక్కడొకటి వచ్చేటట్లు కలిపితే చాలు) మిశ్రమం మొత్తాన్ని ఒక ట్రేలో పోసి అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. పది గంటల తర్వాత ట్రేని బయటకు తీసి ఐదారు నిమిషాల తర్వాత అల్యూమినియం ఫాయిల్ తొలగించి ఐస్‌క్రీమ్‌ని కప్పుల్లో వేసి సర్వ్ చేయాలి. వెనీలా ఐస్ క్రీమ్ కావలసినవి: కండెన్స్డ్ మిల్క్ -400 గ్రా; చిక్కటి మీగడ – 200 గ్రా; వెనీలా ఎక్స్ట్రాక్ట్ - 2 టీ స్పూన్లు. తయారీ: ఐస్‌క్రీమ్ తయారు చేయడానికి ముందు రోజు రాత్రి మీగడను ఫ్రీజర్‌లో పెట్టాలి. అలాగే ఒక ఖాళీ పాత్రను కూడా ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరచాలి. కనీసం పది లేదా పన్నెండు గంటలసేపు ఉంచాలి. ∙ఫ్రిజ్‌లో నుంచి తీసిన తరవాత మీగడను ఫ్రిజ్‌లో చల్లబరిచిన పాత్రలో వేసి ఏడు లేదా ఎనిమిది నిమిషాల సేపు చిలకాలి. చిలికేటప్పుడు మొదట మెల్లగా చిలుకుతూ క్రమంగా వేగం పెంచాలి. ఆ తరవాత అందులో కండెన్స్డ్ మిల్క్ వేసి మెల్లగా చిలకాలి. ఈ మిశ్రమాన్ని ఒక ట్రేలో పోసి సమంగా సర్ది అల్యూమినియం ఫాయిల్ పేపర్ అమర్చి అంచులకు క్లిప్ పెట్టాలి. పేపర్ ఐస్ క్రీమ్ మిశ్రమంలోకి జారి పోకుండా ఈ ఏర్పాటు. ఈ ట్రేని పన్నెండు గంటల సేపు ఫ్రీజర్‌లో ఉంచాలి. ఫ్రీజర్‌లో నుంచి బయటకు తీసిన తర్వాత ఐదారు నిమిషాల సేపు కదిలించకూడదు. ఆ తర్వాత ట్రే మీద కవర్ చేసిన అల్యూమినియం ఫాయిల్‌ని తొలగించి ఐస్‌క్రీమ్‌ని పెద్ద స్పూన్‌తో తీసి కప్పుల్లో వేసి సర్వ్ చేయాలి. ఈ ఐస్ క్రీమ్ కోసం స్టవ్ వెలిగించే పనే లేదు. కావలసిన వస్తువులన్నీ రెడీమేడ్‌గా దొరికేవే కాబట్టి పిల్లలు కూడా పెద్దవాళ్ల సహాయం లేకుండా సొంతంగా చేసుకోవచ్చు. -
దినుసులన్నీ కలిపితే.. ఈ రకరకాల 'రుచి కారము పొడులు' మీకే!
'సంక్రాంతి రుచుల తియ్యటి రుచి బయటపడాలనిపిస్తోందా! నోటికి కారంగా, పొట్టకు తేలిగ్గా ఉండే ఆహారం తినాలనిపిస్తోందా! ఉన్నది ఆరు రుచులే.. కానీ జిహ్వ మరింత రుచిని కోరుకుంటుంది. నాలుకకు మమకారం మాత్రమే కాదు రుచి కారమూ ఇష్టమే. పోపుల పెట్టెలో దినుసులన్నీ కలిపి రకరకాల కారం పొడులు చేద్దాం.' నువ్వుల పొడి.. కావలసినవి: తెల్ల నువ్వులు – వంద గ్రాములు; ఎండు మిర్చి– 10; మినప్పప్పు – అర టేబుల్ స్పూన్; పచ్చి శనగపప్పు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; ఇంగువ – అర టీ స్పూన్; ఉప్పు– రుచికి తగినంత. తయారీ.. మందపాటి బాణలిలో నువ్వులు వేసి మీడియం మంట మీద దోరగా వేయించి పక్కన పెట్టాలి. మరొక బాణలిలో ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేయించి చివరగా జీలకర్ర వేసి దించేయాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో నువ్వులు, పోపు దినుసులు, ఇంగువ, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఈ పొడిని అన్నం, ఇడ్లీ, ఉప్మాల్లో తినవచ్చు. కూరల్లో కలుపుకోవచ్చు. వేపుళ్లలో పైన చల్లుకోవచ్చు. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి వారంలో కనీసం మూడు రోజులు ఆహారంలో ఈ పొడి ఉండేలా చూసుకోవడం మంచిది. కొబ్బరి పొడి.. కావలసినవి: ఎండుకొబ్బరి తురుము – వంద గ్రాములు; పచ్చి శనగపప్పు – టీ స్పూన్; వేయించిన శనగపప్పు – టీ స్పూన్; మిరప్పొడి– టేబుల్ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; వెల్లుల్లి రేకలు – 4; ఇంగువ – అర టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి. తయారీ.. బాణలిలో పచ్చి శనగపప్పు వేసి దోరగా వేగిన తర్వాత వేయించిన శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంగువ, కొబ్బరి తురుము వేసి కలిపి దించేయాలి. వేడి తగ్గిన తర్వాత అన్నింటినీ మిక్సీ జార్లో వేసి మిరప్పొడి, ఉప్పు కలిపి పొడి చేయాలి. ఇడ్లీ, దోశెలు, అన్నంలోకి బాగుంటుంది. వేపుళ్లలో ఒక టేబుల్ స్పూన్ పొడి కలిపితే రుచి ఇనుమడిస్తుంది. కరివేపాకు పొడి.. కావలసినవి: కరివేపాకు– వందగ్రాములు (మంచి నీటిలో శుభ్రం చేసి ఆరబెట్టి ఈనెలు తీసిన ఆకులు); ఎండు మిర్చి– పది; ఆవాలు– అర టీ స్పూన్; పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్; మినప్పప్పు – టేబుల్ స్పూన్; వేరుశనగపప్పు – అర టేబుల్ స్పూన్; ధనియాలు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; మిరియాలు – అర టీ స్పూన్; చింతపండు – అర అంగుళం పాయ; వెల్లుల్లి రేకలు – 4; ఇంగువ పొడి– పావు టీ స్పూన్; నూనె – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత. తయారీ.. బాణలిలో నూనె వేడి చేసి వేరు శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ధనియాలు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు దోరగా వేయించాలి. అవి వేగిన తర్వాత మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఆకులో పచ్చిదనం పోయే వరకు చిన్న మంట మీద వేయించాలి. ఆకు వేగిన తర్వాత చింతపండు, ఇంగువ, వెల్లుల్లిరేకలు, ఉప్పు వేసి దించేయాలి. చల్లారే కొద్దీ ఆకు పెళపెళలాడుతుంది. పూర్తిగా చల్లారిన వెంటనే మిక్సీలో వేసి పొడి చేయాలి. రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవాలి. ఈ పొడి వేడి అన్నం, ఇడ్లీ, దోశెల్లోకి రుచిగా ఉంటుంది. ఆకలి మందగించినప్పుడు, నోటికి ఏదీ రుచించనప్పుడు ఈ పొడి తింటే జీర్ణవ్యవస్థ క్రమబద్ధమవుతుంది. గమనిక: చల్లారిన వెంటనే పొడి చేయకపోతే ఆలస్యమయ్యే కొద్దీ ఆకు మెత్తబడి పోతుంది. సరిగ్గా మెదగదు. అవిశె గింజల పొడి.. కావలసినవి: అవిశె గింజలు – వందగ్రాములు; ఎండు మిర్చి – పది; ఆవాలు – అర టీ స్పూన్; మిరియాలు– అర టీ స్పూన్; పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; వేరు శనగపప్పు – అర టేబుల్ స్పూన్; ధనియాలు – టీ స్పూన్; ఇంగువ– అర టీ స్పూన్; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి. తయారీ.. బాణలిలో అవిశె గింజలను మీడియం మంట మీద వేయించి పక్కన పెట్టుకోవాలి. మరొక బాణలిలో ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, వేరు శనగపప్పు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, కరివేపాకు వేసి వేయించాలి. దినుసులన్నీ చక్కగా వేగి మంచి వాసన వచ్చేటప్పుడు అవిశె గింజలు, ఇంగువ వేసి కలిపి దించేయాలి. వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఉప్పు కలిపి పొడి చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆరోగ్యకారకం. గుండె వ్యాధుల నివారణ, డయాబెటిస్ నియంత్రణకు డాక్టర్లు అవిశె గింజలను సూచిస్తున్నారు. రుచి కోసం చూడకుండా రోజూ ఒక స్పూన్ అన్నంలో లేదా బ్రేక్‌ఫాస్ట్‌లలో ఏదో ఒకరకంగా తీసుకోవడం మంచిది. ఇవి చదవండి: ఏక్ 'మసాలా చాయ్'తో భారత్ డెవలప్‌మెంట్‌ని చూపించిన ప్రదాని మోదీ! -
'చాయ్'ని ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా?
రోజువారీ జీవితంలో ఒకటి లేదా రెండు సార్లు చాయ్‌ని ఆస్వాదించకుండా ఉండం. కొందరూ అంతకు మించి తాగేవాళ్లు ఉన్నారు. అందుకోసమే కాబోలు పని ప్రదేశాల్లో టీ బ్రేక్ అని వచ్చేసింది. కొద్దిగా అలా బయటకు వెళ్లి కొంచెం టీ తాగి రిలాక్స్ అయితే చాలు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. అలాంటి టీ మన ఇండియాలో చాలా విభిన్న పద్ధతుల్లో చేస్తారు. వాటి పేర్లు కూడా చాలా వెరైటీగా ఉంటాయి. ముఖ్యంగా ఎన్ని రకాల చాయ్‌లు ఉన్నాయో తెలసిందే. అలాంటి చాయ్‌ని ఓ మహిళ చాలా వెరైటీగా తయారు చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అందులో ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టి అందులో టీ పోడి, కొంచెం షుగర్ వేసి కాసేపు వేయించింది. ఇంతలో షుగర్ కరిగి మిశ్రమం దగ్గరకు వస్తుందనంగా యాలకులు, అల్లం, కొంచెం నీళ్లు వేశారు. కాపేపటికి పాలు వేసి కాసేపు మరగించి సర్వ్ చేశారు. 'టీ' ఇలా కూడా చేయొచ్చా అన్నంత వెరైటీగా చేసిందామె. చూస్తే మాత్రం 'చాయ్' మంచి రంగులో, చిక్కదనంతో అందంగా కనిపించింది. ఈ వీడియోని వీక్షించిన నెటిజన్లు 'ఏం చేశార్ మేడమ్' అని కొందరూ ప్రశంసిస్తే. మరికొందరూ మాత్రం ఇలానే చేసేదీ అని ఫైర్ అయ్యారు. I strongly condemn this new way to make chai. Should we file a petition in SC to stop this nonsense? pic.twitter.com/jy4BMgR472 — Monica Jasuja (@jasuja) November 25, 2023 (చదవండి: ఫ్రూట్ ఇడ్లీ గురించి విన్నారా? తయారీ విధానం చూస్తే..షాకవ్వుతారు!) -
నోరూరించే.. ఈ గరం గరం సమోసాల తయారీ ఎలాగో తెలుసా?
స్వీట్ కోవా సమోసా.. కావలసినవి: మైదా – రెండు టీస్పూన్లు; సమోసా పట్టి షీట్లు – పన్నెండు(రెడీమేడ్); వేరు శనగ నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా; పిస్తా – గార్నిష్‌కు సరిపడా. స్టఫింగ్: నెయ్యి – టీస్పూను; జీడిపప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు; పిస్తా పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు; పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు; పంచదార – పావు కప్పు; యాలకుల పొడి – పావు టీస్పూను; ఉప్పు – ముప్పావు టీస్పూను; కోవా తురుము – కప్పు. సిరప్: పంచదార – అరకప్పు; యాలకుల పొడి – పావు టీస్పూను; నీళ్లు – అరకప్పు; కుంకుమ పువ్వు– చిటికెడు. తయారీ: జీడిపప్పుని నెయ్యిలో వేసి బంగారు వర్ణంలోకి మారేంత వరకు వేయించాలి. జీడిపప్పు వేగిన తరువాత పిస్తా, కొబ్బరి తరుము, పంచదార, కోవా తురుము వేయాలి. ఇవన్నీ దోరగా వేగిన తరువాత రుచికి సరిపడా ఉప్పు, యాలకులపొడి వేసి కలిపి దించేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత అరగంట రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙బాణలిలో కుంకుమ పువ్వును దోరగా వేయించాలి. ఇది వేగిన తరువాత పంచదార, అరకప్పు నీళ్లు, యాలకుల పొడి వేసి, సిరప్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. మైదాలో కొద్దిగా నీళ్లుపోసి గమ్‌లా తయార చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన మిశ్రమాన్ని.. సమోసా పట్టి షీట్‌పైన టేబుల్ స్పూను వేసి సమోసాలా చుట్టుకోవాలి. లోపల స్టఫింగ్ బయటకు రాకుండా ఉండేలా మైదా గమ్‌ను రాసుకుంటూ సమోసాను చుట్టుకోవాలి. సమోసాలన్నీ రెడీ అయ్యాక బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు డీప్‌ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన వేడివేడి సమోసాలను సుగర్ సిరప్‌లో అరనిమిషం ఉంచాలి. సుగర్ సిరప్ నుంచి తీసిన సమోసాపై పిస్తా పప్పు తురుము వేస్తే స్వీట్ సమోసా రెడీ. చికెన్ సమోసా.. కావలసినవి: మైదా – కప్పు; వాము – చిటికెడు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు. ఖీమా ఫిల్లింగ్: నెయ్యి – టేబుల్ స్పూను; ఇంగువ – చిటికెడు; జీలకర్ర – టీస్పూను; క్యారట్ ముక్కలు – అరకప్పు (చిన్నముక్కలు); వెల్లుల్లి రెబ్బలు – రెండు; అల్లం – అంగుళం ముక్క; చికెన్ ఖీమా – పావు కేజీ; కారం – అర టీస్పూను; ధనియాల పొడి – టీస్పూను; గరం మసాలా – అర టీస్పూను; పసుపు – పావు టీస్పూను; పచ్చిబఠాణి – అరకప్పు; స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు – పావు కప్పు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: మైదాలో వాము, రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కలిపాక, నీళ్లు పోసి ముద్ద చేయాలి. ఈ పిండి ముద్దపైన తడి వస్త్రాన్ని కప్పి అరగంట నానబెట్టుకోవాలి. టేబుల్ స్పూను నెయ్యిలో జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. జీలకర్ర వేగిన తరువాత అల్లం, వెల్లుల్లిని సన్నగా తరగి వేయాలి. వీటితోపాటే క్యారట్ ముక్కలు వేసి వేయించాలి. క్యారట్ వేగిన తరువాత చికెన్ ఖీమా వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి గరిటతో కలిపి, మూతపెట్టి మగ్గనివ్వాలి. ఆరు నిమిషాల తరువాత స్ప్రింగ్ ఆనియన్ తరుగు, పచ్చిబఠాణి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాలు వేయించి దించేయాలి. మైదాముద్దను చిన్న ఉండలుగా చేసి, చపాతీలా వత్తుకోవాలి. చపాతీని కోన్ ఆకారంలో మడిచి, మధ్యలో చికెన్ ఖీమా మిశ్రమంతో నింపాలి. మిశ్రమం బయటకు రాకుండా కోన్‌ను మూసివేయాలి. ఇలా అన్ని సమోసాలు రెడీ అయిన తరువాత బేకింగ్ ట్రేలో పెట్టాలి. ఈ ట్రేను అవెన్‌లో పెట్టి 350 ఫారిన్ హీట్స్ వద్ద ఇరవై నిమిషాల పాటు బేక్ చేస్తే చికెన్ సమోసా రెడీ. ఎగ్ సమోసా.. కావలసినవి: గుడ్లు – ఆరు; పచ్చి బంగాళ దుంపల తురుము – కప్పు; క్యారట్ ముక్కలు – అరకప్పు; ఉల్లిపాయలు – నాలుగు; పచ్చిమిర్చి – మూడు; నూనె – ఐదు టేబుల్æస్పూన్లు; వంటసోడా – అరటీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; వాము – అరటీస్పూను; కొత్తి మీర – చిన్న కట్ట; మైదా – రెండున్నర కప్పులు; రిఫైన్డ్ నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీ: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకోవాలి ∙మైదాలో వంటసోడా, వాము, అరటీస్పూను ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కలపాలి. నీళ్లుపోసి ముద్దచేసి గంటపాటు నానపెట్టుకోవాలి. మూడు టేబుల్ స్పూన్ల నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత క్యారట్ ముక్కలు, బంగాళ దుంప తురుము వేసి వేయించాలి. నిమిషం తరువాత కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. మిశ్రమం మెత్తబడిన తరువాత గుడ్ల సొన వేసి వేయించాలి. గుడ్ల సొన వేగిన తరువాత దించేసి చల్లారనివ్వాలి. మైదా ముద్దను చిన్న ఉండలుగా చేసి, చపాతీల్లా వత్తుకోవాలి. ఈ చపాతీలను త్రికోణాకృతిలో మడతపెట్టి మధ్యలో ఒక టీ స్పూన్ గుడ్డు మిశ్రమాన్ని పెట్టి మిశ్రమం బయటకు రాకుండా అంచులకు కొద్దిగా తడిచేసి అతుక్కునేటట్లు వేళ్లతో మెల్లగా నొక్కాలి ఇలా అన్ని తయారయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేస్తే ఎగ్ సమోసా రెడీ. ఇవి కూడా చదవండి: క్యాబేజ్‌తో ఎగ్ భుర్జి.. ఎప్పుడైనా ట్రై చేశారా? చపాతీలో బావుంటుంది -
Bhargavi Pappuri: నా రోల్‌మోడల్ నేనే!
భార్గవి పప్పూరి... మన కళలను ఇష్టపడ్డారు. మన కళాకారులకు అండగా నిలవాలనుకున్నారు. అందుకోసం కళాత్మకమైన వేదికను నేశారు. అది తన సృజనాత్మకతకే వేదికవుతుందనుకోలేదామె. ఆర్ట్ఎన్ వీవ్స్... కృషి ఆమెదే... కళ ఆమెదే. ఆర్ట్ అండ్ వీవ్స్ స్థాపించడానికి ముందు నా జర్నీ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే... అది సరదాగా సాగిపోయే ఓ సినిమాని తలపిస్తుంది. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్, వనస్థలి పురం దగ్గర ఆర్కే పురంలో. నాన్న పోస్ట్ మాస్టర్‌గా రిటైరయ్యారు. అమ్మ గృహిణి. బికామ్ చదివి చాలా కామ్‌గా ఉండేదాన్ని. కొత్త వాళ్లతో మాట్లాడాలంటే నోరు పెగిలేది కాదు. పెళ్లయిన తర్వాత మా వారు నన్ను మార్కెటింగ్ వైపు నడిపించారు. ఆయనది కూడా అదే ఫీల్డ్ కావడంతో నాకు మెళకువలు నేరి్పంచారు. మొదట క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్లు మార్కెట్ చేశాను. మా వారికి కోల్‌కతాకి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ కార్ లోన్ మార్కెటింగ్ చేశాను. కాలి నడకన కోల్‌కతా మొత్తం తిరిగాను. మళ్లీ బదలీ కోల్‌కతాలో మార్కెటింగ్ మీద పట్టు వచ్చేటప్పటికి మా వారికి మళ్లీ బదలీ. ఈ సారి విజయవాడ. అప్పుడు బాబు పుట్టడంతో నా కెరీర్లో విరామం తీసుకున్నాను. మళ్లీ బదలీలు. మొత్తానికి బాబు స్కూల్‌కెళ్లే వయసు వచ్చేటప్పటికి హైదరాబాద్‌కొచ్చాం. బాబు పెద్దయ్యాడు కాబట్టి ఉద్యోగం చేద్దామనుకున్నప్పటికీ ఇక ఆ వయసుకు ఎవరూ ఉద్యోగం ఇవ్వరని ఫ్రెండ్‌తో కలిసి క్రెష్ నడిపించాను. కొంతకాలానికి ఇంట్లోనే ఉంటూ కేటరింగ్ మొదలుపెట్టాను. మేముండే వెస్ట్ మారేడ్‌పల్లిలో ఎక్కువ మంది వయసు మళ్లిన దంపతులే. పిల్లలు విదేశాలకు వెళ్లిన తర్వాత పెద్ద దంపతులు విశ్రాంత జీవితాన్ని గడుపుతుంటారు. వాళ్లను దృష్టిలో పెట్టుకుని లంచ్, డిన్నర్ పంపించే ఏర్పాటు చేశాను. ఉదయం తొమ్మిదిలోపు ఆర్డర్ చేస్తే భోజనం సమయానికి ఒక బాయ్ సహాయంతో క్యారియర్ చేర్చాను. మా వారికి తరచూ బదలీలు, ఆయన కష్టమంతా ఎన్నో కంపెనీల అభివృద్ధికి దోహదం అవుతున్నాయి. మాకు మాత్రం ఒక చోట స్థిరంగా ఉండే అవకాశం లేదు. మంచి జీతం వస్తోంది. కానీ మనకు మనంగా సాధించింది ఏమిటని చూసుకుంటే వెలితి కనిపించసాగింది. అప్పుడు పంథా మార్చుకున్నాం. ఇదంతా ఆర్డ్ అండ్ వీవ్స్ ప్రారంభానికి ముందు నా జీవితం. కళాకృతుల సేకరణ ఆర్ట్ అండ్ వీవ్స్ అనే ప్రాజెక్ట్ రూపొందించుకుని, దేశంలో ఏడెనిమిది రాష్ట్రాల్లో çకళలు, కళాకారులు, చేనేతకారులను స్వయంగా కలిశాం. భారతీయ కళలు ఒకదానికి మరొకటి పూర్తిగా భిన్నం. దేనికదే ప్రత్యేకం. అంతటి వైవిధ్యతను ఒక వేదిక మీదకు తీసుకురావడం ద్వారా ఆ కళారూపాలను అభిరుచి ఉన్నవారికి దగ్గర చేయడం, కళాకృతుల తయారీదారులకు పని కలి్పంచడం మా ఉద్దేశం. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్‌గా రిజిస్టర్ చేయించాం. ఒడిశా, రాజస్థాన్, బీహార్, కర్నాటక, తమిళనాడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూపుదిద్దుకునే కళాకృతుల ఫొటోలను మా వెబ్సైట్లో పెట్టాం. మధుబని, బిద్రీ వంటి కళాఖండాలకు ఆదరణ బాగా వచ్చింది, ఆర్డర్లు కూడా వచ్చాయి. కానీ తయారీదారుల దగ్గర ఆ సమయానికి కస్టమర్ కోరుకున్న మధుబని ఆర్ట్ కానీ, చేనేత చీర కానీ ఉండేది కాదు. ఇవన్నీ చాలా సమయం తీసుకునే కళాకృతులు. అంత సమయం వేచి చూసే ఓపిక కస్టమర్లకు ఉండేది కాదు. కస్టమర్‌కి సకాలంలో అందించాలంటే తయారీదారులం మనమే అయి ఉండాలనుకున్నాను. టెర్రకోట కళాకృతులు నేర్చుకోవడానికి ప్రయతి్నంచాను. కానీ కుదరలేదు. అదే సమయంలో ఖాదీ గ్రామోద్యోగ్ వాళ్లు హ్యాండ్ మేడ్ సోప్ మేకింగ్ వారం రోజుల కోర్సు ప్రకటించారు. నేర్చుకోవడం, ఇంట్లో ప్రాక్టీస్ చేయడం, పొరపాట్లను సరిదిద్దుకుంటూ 54 రకాల సబ్బుల తయారీలో నైపుణ్యం సాధించాను. నా ఉత్పత్తులకు ఆయుష్ లైసెన్స్ వచ్చింది. ఆర్గానిక్ హోమ్మేడ్ సబ్బులు, షాంపూ, బాత్ జెల్స్ చేస్తున్నాను. మా బ్రాండ్‌కు మౌత్ పబ్లిసిటీ వచి్చంది. విదేశాలకు వెళ్లే వాళ్లు తమ పిల్లల కోసం పచ్చళ్లు, పొడులతోపాటు మా దగ్గర నుంచి ఏడాదికి సరిపడిన సబ్బులు, షాంపూలు కూడా తీసుకెళ్తున్నారు. నా వర్క్ యూనిట్, ఆఫీస్, ఇల్లు ఒకే బిల్డింగ్‌లో. ఆర్డర్లు ఎక్కువున్నప్పుడు ఎక్కువ గంటలు పని చేస్తాను. సాధారణంగా మధ్యాహ్నం రెండు వరకు పని చేస్తాను. ఓ గంట ధ్యానం, గార్డెనింగ్ నా డైలీ రొటీన్లో భాగం. ప్రకృతి సహకారం నా క్రియేటివిటీని నా బ్రాండ్ కోసమే ఉపయోగిస్తున్నాను. మరో నలుగురికి జీతం ఇవ్వగలుగుతున్నాను. మన సంకల్పం మంచిదై ఉండి, నిబద్ధతతో పని చేస్తే ప్రకృతి తన వంతుగా సహకారం అందిస్తుందని, అదే మనల్ని ఓ మార్గంలో నడిపిస్తుందని నమ్ముతాను. ఎమ్ఎస్ఎమ్ఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్)తో అనుసంధానమయ్యాను. ముద్ర లోన్ వచి్చంది. ఈ రోజు నేనిలా నాకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం ఏ పనికి గౌరవం ఎక్కువ, ఏ పనికి గౌరవం తక్కువ అని ఆలోచించకపోవడమే. అన్ని పనులూ గౌరవంతో కూడినవే. మహిళలకు నేను చెప్పగలిగిన మాట ఒక్కటే. గొప్పవాళ్లు ప్రత్యేకంగా పుట్టరు. నిజాయితీగా కష్టపడే తత్వమే మనల్ని ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలుపుతుంది. నాకు రోల్‌మోడల్ ఎవరూ లేరు. నాకు నేనే రోల్మోడల్ని. అలాగే నాకు నేనే కాంపిటీటర్ని. ఈ రోజు చేసిన పనిని రేపు మరింత మెరుగ్గా చేయాలనే లక్ష్యాన్ని మనకు మనమే నిర్దేశించుకోవాలి. జీవితం మనకు రెండే రెండు ఆప్షన్లనిస్తుంది. ఒకటి సంతోషంగా జీవించడం, మరొకటి దిగులుగా జీవించడం. కష్టాల్లేని వాళ్లెవరూ ఉండరు. ఆర్థిక సవాళ్లతోపాటు ఆరోగ్యం పెట్టే పరీక్షలూ ఉంటాయి. అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగడమే మన ఏకైక కర్తవ్యం. సంతోషంగా జీవించాలా దిగాలుగా రోజులు గడపాలా అని నిర్ణయించుకోవాల్సింది మనమే. మనసు బాగాలేకపోతే ఇష్టమైన వ్యాపకంతో రిలాక్స్ కావడం అనే చాయిస్ ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది’’ అన్నారు భార్గవి. జీవితం మనకు రెండే రెండు ఆప్షన్లనిస్తుంది. ఒకటి సంతోషంగా జీవించడం, మరొకటి దిగులుగా జీవించడం. కష్టాల్లేని వాళ్లెవరూ ఉండరు. సంతోషంగా జీవించాలా.. దిగాలుగా రోజులు గడపాలా అనేది నిర్ణయించుకోవాల్సింది మనమే. – భార్గవి పప్పూరి – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
కొత్త టెక్నిక్ తో రుచికరమైన వంటలు..
ఉదయం నుంచి రాత్రి వరకు కావాల్సిన రుచులను తయారు చేసుకోవడంలో ఈ న్యూ టెక్నాలజీ బర్నర్ భలే చక్కగా పనిచేస్తుంది. ఇది సౌకర్యవంతమైనదే కాదు.. సురక్షితమైనది కూడా. సాధారణ హాట్ ప్లేట్ బర్నర్‌తో పోలిస్తే ఇది ఫార్–ఇన్ఫ్రారెడ్ ఎనర్జీ అసెంబ్లింగ్ టెక్నాలజీతో తరచుగా ఉపయోగించడానికి, ఉష్టోగ్రతను తట్టుకునేందుకు వీలుగా రూపొందింది. ఐరన్ పాన్, స్టెయిన్ లెస్ స్టీల్, సిరామిక్, అల్యూమినియం.. ఇలా అన్ని రకాల పాత్రలనూ దీనిపై పెట్టి, కావల్సిన వెరైటీలను సిద్ధం చేసుకోవచ్చు. ఈ బర్నర్ చాలా తేలిగ్గా ఉండటంతో.. క్యాంపింగ్‌లకు తీసుకుని వెళ్లడం, చిన్నగా ఉండటంతో.. వంటగదిలో స్టోర్ చెయ్యడమూ చాలా ఈజీ. అలాగే కుకింగ్ బౌల్స్ ఉంచే క్రిస్టల్ గ్లాస్ ప్లేట్‌ను తడి వస్త్రంతో క్లీన్ చేయొచ్చు. వేరియబుల్ హీట్ సెట్టింగ్స్ కలిగిన ఈ గాడ్జెట్పైన ఫ్రై, డీప్ ఫ్రై, బాయిలింగ్, కుకింగ్ ఇలా చాలానే చేసుకోవచ్చు. హైక్వాలిటీ టెక్నాలజీ కారణంగా ఎలాంటి ప్రమాదాలూ తలెత్తవు. ఇదే మోడల్లో రెండు మూడు బర్నర్స్ ఉన్న డివైస్‌లు కూడా మార్కెట్లో అమ్ముడు పోతున్నాయి. అయితే ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. (చదవండి: Dried Prawns Pickle Recipe: నోరూరించే రొయ్యల పచ్చడి ఇలా చేస్తే..చక్కగా లాగించేస్తారు! ) -
ఓట్స్ – యాపిల్ లడ్డూలు
కావలసినవి: యాపిల్ – 3 మీడియం సైజ్ (తొక్క, గింజలు తీసి గుజ్జులా చేసుకోవాలి) ఓట్స్ పౌడర్ – అర కప్పు (నెయ్యితో దోరగా వేయించుకోవాలి) కొబ్బరి కోరు – 2 కప్పులు, పంచదార – 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్– 3 టేబుల్ స్పూన్లు కొబ్బరి పాలు – 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి – అర టీ స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ – గార్నిష్‌కి కొద్దిగా (అభిరుచిని బట్టి) నెయ్యి – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో యాపిల్ గుజ్జు, కొబ్బరి కోరు, పంచదార, మిల్క్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు, ఓట్స్ పౌడర్, యాలకుల పొడి, నెయ్యి వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న లడ్డూలు తయారు చేసుకోవాలి. వాటిపైన డ్రై ఫ్రూట్స్ పౌడర్ కొద్దికొద్దిగా పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి. (చదవండి: పొటాటో పాప్ కార్న్.. ఇలా చేస్తే భలే రుచిగా ఉంటాయి) -
ఈ కేక్ చాలా హెల్తీ.. మిల్లెట్స్‌తో చేసుకోండి ఇలా
ఫింగర్ మిల్లెట్ కేక్ తయారీకి కావల్సినవి: ఫింగర్ మిల్లెట్ (రాగి) పౌడర్ – 80 గ్రాములు, గుడ్లు – 8 గడ్డపెరుగు – 800 గ్రాములు (నీళ్లు పోయకుండానే.. ఒక బాటిల్లో వేసి.. 1 నిమిషం పాటు బాగా గిలకొట్టాలి) పంచదార – అర కప్పు, నెయ్యి – కొద్దిగా ఫింగర్ మిల్లెట్ కేక్ తయారీ విధానమిలా ముందుగా ఒక బౌల్లో గిలకొట్టుకున్న పెరుగు, రాగి పౌడర్, పంచదార వేసుకుని హ్యాండ్ బ్లెండర్తో పంచదార కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో గుడ్లు కూడా వేసుకుని మరోసారి మొత్తం కలుపుకోవాలి. చివరిగా కేక్ బౌల్‌కి నెయ్యి పూసి.. అందులో ఈ మిశ్రమాన్ని వేసి.. ఓవెన్లో పెట్టుకుని బేక్ చేసుకోవాలి. అనంతరం నచ్చిన విధంగా కేక్‌ని గార్నిష్ చేసుకుని, ముక్కలు కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. -
వీడియో: కొండాపూర్ ఐస్‌క్రీం పార్లర్లో విజయ్ దేవరకొండ సందడి
-
అబ్బో.. గాల్లో చపాతి చేసిన మాస్టర్ చెఫ్!
-
వీడియో వైరల్ చిట్టి చేతులతో చపాతీ చేస్తున్న చిన్నారి
-
Nori Ratnamala: బొమ్మలకు జీవం పోసే టీచరమ్మ
ఆమె ఊహల్లో కథ అల్లుకుపోతే అవి బొమ్మలై మన ముందు కదలాడతాయి. చూసే పిల్లల మొహాల్లో ఆశ్చర్యానందాలను పెద్దల మెదళ్లలో ఆలోచనలను కొత్తగా వికసింపజేస్తాయి. ముప్పైఏళ్లుగా పప్పెట్రీతో స్నేహం చేస్తూ ‘మా బొమ్మల టీచర్’ అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే పేరు నోరి రత్నమాల. హైదరాబాద్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కాలనీలో ఉంటున్న ఈ విశ్రాంత టీచరమ్మను కలిస్తే ఎన్నో అందమైన కథల మాలను మన ముందుంచుతారు. ‘విష్ణుశర్మ అడవి గుండా ప్రయాణిస్తుంటాడు. దారిలో బావిలోనుంచి మమ్మల్ని కాపాడండీ.. అని కేకలు విని అక్కడకు వెళ్లి లోపలకు చూస్తాడు. అందులో ఒక పులి, కోతి, పాముతో పాటు మనిషి ఉంటాడు. వారందరినీ కాపాడే సమయంలో ‘మనిషిని మాత్రం కాపాడవద్దు’ అని చెబుతాయి మిగతా జంతువులు...’ అంటూ మనిషిలో ఉండే స్వార్థం ప్రాణాపాయం ఎలా కలిగిస్తుందో చెబుతూనే నేటి సాయంత్రం హైదరాబాద్‌లో ప్రదర్శించబోతున్న కథనాన్ని, అందుకోసం చేసుకున్న ఏర్పాట్ల గురించి చెబుతూనే తనలో ఈ కళ పట్ల ఆసక్తి కలగడానికి దారి తీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్నారు ఈ టీచరమ్మ. ‘‘హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఫైన్ ఆర్ట్స్ టీచర్‌గా వర్క్ చేశాను. పిల్లలకు ఆసక్తి గొలిపేలా సృజనాత్మకతను పరిచయం చేసే ఆ సబ్జెక్ట్ నాకెంతగానో రచ్చింది, ఎప్పటికప్పుడు నన్ను నేను కొత్తగా సిద్ధం చేసుకోవడం ఎలా అని ఆలోచించినప్పుడు చిన్నప్పుడు నేను నేర్చుకున్న పప్పెట్రీ గురించి గుర్తొచ్చింది, నా చిన్నతనంలో మా నాయనమ్మ నన్ను తోలుబొమ్మలాటకు తీసుకెళ్లేది. అందులో రామాయణ భారత కథలను తెల్లవార్లూ ప్రదర్శించేవారు. బాల్యంలో నా మనసులో నాటుకుపోయిన ఆ కళ ఆ తర్వాత నాకు విద్యార్థులకు పరిచయం చేయడానికి తోడ్పడింది. స్కూల్ నుంచి మొదలు సంప్రదాయ తోలుబొమ్మల తయారీ అంటే అంత సులువు కాదు. అందుకని కాగితం, క్లాత్, ఇతర వేస్ట్ మెటీరియల్‌ను ఉపయోగించి పప్పెట్రీ బొమ్మలు తయారుచేసేదాన్ని. వాటిద్వారా పిల్లలకు పంచతంత్ర వంటి ఎన్నో కథలు చెప్పేదాన్ని. పిల్లలు కూడా ఈ బొమ్మల ద్వారా తమ ఆసక్తులను కనబరిచేవారు. అక్కడ నుంచి ఇతర టీచర్లకు శిక్షణ, రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. దూరదర్శన్లోనూ బాలల వికాసానికి పప్పెట్రీతో కార్యక్రమాలు చేశాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో సామాజిక అవగాహన కలిగించే అంశాలెన్నో కథలుగా రూపొందించి, ప్రదర్శించాను. కదిలించే కథనాలు.. స్వాతంత్య్రానికి ముందు మనకున్న అవగాహన కార్యక్రమాలలో ప్రధానమైనది తోలుబొమ్మలాటనే. ఇది దేశవ్యాప్త కళ. బొమ్మలను తెరముందు కదిలిస్తూ, దీపం వెలుతురు సాయంతో ప్రదర్శన ఉండేది. సంప్రదాయ బొమ్మల తయారీ ఇప్పుడు కొంచెం కష్టమే. ఇక ప్రదర్శన ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. అలాగని నేర్చుకున్న కళను మన దగ్గరే ఉంచలేం. పదిమందికి తెలిసినప్పుడే ఆ కళ బతుకుతుంది. సామాజిక అవగాహనకు నా భాగస్వామ్యమూ ఉండాలి. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రాజెక్టులు వచ్చాయి. సంగీత నాటక అకాడమీ నుంచి ఇన్నేళ్లలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. విదేశాలలోనూ పప్పెట్రీ ప్రదర్శన చేయడం, అభినందనలు, అవార్డులు, మరచిపోలేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టీమ్ వర్క్ విజయం బొమ్మల తయారీ, బొమ్మలు కదల్చడానికి, మంచి కథనానికి, పాటలకు, నేపథ్య సంగీతానికి.. ఇలా ఇదంతా టీమ్ వర్క్‌తో కూడుకున్నది. ఇందుకోసం మావారితోపాటు పిల్లలనూ ఆ తర్వాత వారి పిల్లలనూ ఈ పనిలో భాగస్థులను చేశాను. దీనివల్ల వారి లోపల ఉన్న వారికే తెలియని కళ బయటకు వచ్చింది. ఇప్పుడు అమెరికాలో ఉన్న మా పిల్లలు కూడా కథనానికి తగ్గ వాయిస్ డబ్బింగ్‌ను క్లిప్పింగ్స్ ద్వారా నాకు పంపిస్తుంటారు. ఇందులో నా కుటుంబ సభ్యులే కాదు స్నేహితులు, కొందరు స్వచ్ఛందంగానూ మేం చేసే పనిలో భాగమవుతుంటారు. ఈ కళ బతికుంది అనడానికి ఇంతకుమించి నిదర్శనాన్ని చూపలేం. డిజిటల్ మీడియాలోనూ.. కరోనా సమయంలో నోరి ఆర్ట్ అండ్ పప్పెట్రీ పేరుతో యూ ట్యూబ్‌లో ఛానెల్ స్టార్ట్ చేశాను. పిల్లల కోసం పప్పెట్రీ ద్వారా కొన్ని వందల కథలను పరిచయం చేశాను. అవన్నీ ఒక్కదాన్నే చేశాను. పెద్దవాళ్లూ ఆస్వాదించారు. ఎంతోమంది అభినందనలు తెలియజేశారు. ఏ దేశానికి లేనన్ని సంప్రదాయ కళలు మన దగ్గర ఉన్నాయి. వాటికి పునరుజ్జీవం కలగాలంటే ప్రభుత్వాలు, సంస్థలు, ఆసక్తి కలవారు ముందుకు రావాలి. పిల్లల్లో ఈ కళలను బతికిస్తే చాలు– ముందు తరాలకు అవి వారసత్వంగా ప్రయాణిస్తాయి. ఏ దేశంలో ఉన్నా మన ప్రత్యేకతను ఈ కళలే చాటుతాయి. అందుకే ప్రాచీన కళలకు ప్రోత్సాహమిద్దాం’’ అని వివరించారు ఈ పప్పెట్రీ హార్టిస్ట్. – నిర్మలారెడ్డి -
నోరూరించే కోనసీమ రుచుల ప్రత్యేకతలు ఇవే..
-
కోడి ఈకలతో కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు
-
చిన్నారుల చేతుల్లో మట్టి గణేశుడు (ఫొటోలు)
-
చిన్నారుల చేతుల్లో మట్టి గణపతి (ఫొటోలు)
-
స్పృహ: పర్యావరణ రక్షాబంధన్
ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు? అని గట్టిగా అనుకోవచ్చు. అయితే ముంజేతి రాఖీకి అద్దం అక్కర లేకపోవచ్చుగానీ... అర్థం మాత్రం ఉంటుంది. బంధాల గురించి రాఖీ ఎన్నో మాటలు చెప్పకనే చెబుతుంది. ఇప్పుడది పర్యావరణహిత వచనాలు కూడా అందంగా చెబుతోంది. ‘మమ్మల్ని చల్లగా చూడు తల్లీ’ అంటూ చెట్లకు రాఖీ కట్టే ఆచారం ఉంది. ‘అయితే మనం చల్లగా ఉండాలంటే చెట్టు చల్లగా ఉండాలి. పర్యావరణం బాగుండాలి’ అంటున్నారు హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన మహిళలు. పైన్ చెట్ల పత్రాలతో ఎకో–ఫ్రెండ్లీ రాఖీలు తయారుచేస్తూ పర్యావరణహిత సందేశాన్ని ఊరూరు తీసుకువెళుతున్నారు.... పైన్ చెట్ల నుంచి నేల రాలిన పత్రాల వలన ఉపయోగం ఏమిటి? అనే ప్రశ్నకు ఉపయోగపడే సమాధానం ఒకప్పుడు ఒక్కటి కూడా వినిపించేది కాదు. ఇప్పుడు మాత్రం అలా కాదు. బోలెడు సమాధానాలు సిద్ధంగా ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిఫామ్స్ ప్రయోగాత్మకంగా 22 మంది మహిళలకు పైన్ పత్రాలతో రాఖీల తయారీ నేర్పించింది. ఆ తరువాత సిమ్లా, సోలన్ జిల్లాలో 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. దీనివల్ల పేద మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఒక కోణం అయితే, పర్యావరణానికి మేలు జరగడం మరో కోణం. ఎండిపోయిన పైన్ పత్రాల వల్ల అడవుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుండేవి. ఇప్పుడు ఆ ప్రమాదాల సంఖ్య చాలావరకు తగ్గింది. ‘గతంలో పైన్ పత్రాలపై దృష్టి ఉండేది కాదు. అయితే ఇప్పుడు అవి మాకు ఉపాధి కల్పించడంతోపాటు పర్యావరణ ప్రయోజన కార్యక్రమాల్లో భాగం అయ్యేలా చేస్తున్నాయి’ అంటుంది ప్రియదర్శిని కుమారి. రకరకాల మొక్కల విత్తనాలు కూర్చి ఈ రాఖీలను తయారు చేయడం ప్రత్యేకతగా నిలుస్తుంది. ‘హిమాచల్‌ప్రదేశ్ గ్రామీణప్రాంతాల్లో చిన్నస్థాయిలో అయినా ఉపాధి దొరకడం కష్టం అయ్యేది. ఈ రాఖీల తయారీ వల్ల ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. పర్యావరణానికి సంబంధించిన మంచి విషయాలను జనాలలో ప్రచారం చేయగలుగుతున్నాం’ అంటుంది 42 సంవత్సరాల హేమావతి. ట్రైనర్‌గా ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన హేమావతి నెలకు ముప్పై వేలకు పైగా సంపాదిస్తుంది. ‘పర్యావరణ స్పృహ పెరిగిన తరువాత ఎకో–ఫ్రెండ్లీ రాఖీలకు డిమాండ్ పెరిగింది. రెగ్యులర్ రాఖీల కంటే భిన్నంగా ఉండడం కూడా వీటి డిమాండ్‌కు మరో కారణం’ అంటుంది నేహా. ఊరూరూ తిరిగి ఎకో–ఫ్రెండ్లీ రాఖీలను అమ్మడమే కాదు పర్యావరణ స్పృహకు సంబంధించిన అంశాలను ప్రజా బాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకు వెళుతున్నారు. ‘ఈ సంవత్సరం నా సోదరులకు ఎకో ఫ్రెండ్లీ రాఖీలు కట్టాలని నిర్ణయించుకున్నాను. నా స్నేహితులకు కూడా వీటి ప్రత్యేకతను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది కాలేజి స్టూడెంట్ శ్వేత. దిల్లీకి చెందిన తోరాని బ్రాండ్ రాఖీలు కూడా పర్యావరణ స్పృహతో తయారుచేయబడుతున్నాయి. పాత దుస్తులు, బట్టలతో తయారుచేసిన పాతబ్యాగులు... మొదలైన వాటిని ఉపయోగించి అందమైన రాఖీలు తయారు చేస్తున్నారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మంగళూరు(కర్నాటక)లోని ‘పేపర్‌సీడ్ కో’ అనే సామాజిక సంస్థ రకరకాల మొక్కల విత్తనాలను కూర్చి పర్యావరణహిత రాఖీలను తయారు చేస్తుంది. పండగ తరువాత చేతికి ఉన్న రాఖీలోని విత్తనాలు భూమిలోకి వెళ్లి పచ్చటి భవిష్యత్‌ను ఇస్తాయి. ఈ రాఖీల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను ‘పేపర్‌సీడ్ విలేజి’ కోసం కేటాయిస్తున్నారు. ఇది మహిళలకు పర్యావరణహిత బొమ్మల తయారీలో శిక్షణ ఇచ్చే సంస్థ. ఎకో–ఫ్రెండ్లీ రాఖీల గురించి సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారు. -
కొండపల్లి బొమ్మ.. తరతరాల జ్ఞాపకం
‘కొండపల్లి కొయ్యబొమ్మ... కోటగట్టి కూచుందమ్మ...’ అని పాడుకోవడానికే కాదు.. కొండపల్లి బొమ్మ పాటకు తగ్గట్టే తరతరాలకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది కూడా. అమ్మకు చిన్నప్పుడు తిరునాళ్లలో తాతయ్య కొనిచ్చిన ‘అమ్మాయి– అబ్బాయి’ బొమ్మ ఉంటుంది. అన్నయ్య కొనిపించుకున్న ఎడ్లబండి అదే షెల్ఫ్‌లో చోటు చేసుకుంటుంది. నానమ్మ ముచ్చటపడి తెచ్చుకున్న దశావతారాల బొమ్మ ఉండనే ఉంటుంది. కొండపల్లి బొమ్మ ఒకసారి ఇంట్లో షోకేస్‌లోకి వచ్చిందంటే ఇక తరాలు మారినా ఆ బొమ్మ చెక్కు చెదరదు. బొమ్మ చెక్కు చెదరదు... కానీ ఇటీవల బొమ్మలు చేసే వాళ్లు కనుమరుగైపోతున్నారు. వందలాది కుటుంబాలు ఈ కళను కొనసాగించలేక ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయాయి. ఈ దశలో కళను బతికించుకోవడానికి, కళతోనే తమ బతుకును నిర్మించుకోవడానికి ముందుకు వచ్చారు మహిళలు. బావుదరి పట్టారు! నలభై ఏళ్ల కిందట కొండపల్లి కళాకారుల చేతిలో 84 రకాల కళాఖండాలు రూపుదిద్దుకునేవి. ఇప్పుడా సంఖ్య ఐదారుకు మించడం లేదు. ఈ కళ మీద ఆధారపడి ఉపాధి పొందే పరిస్థితులు సన్నగిల్లడంతో ఈ తరం యువకులు ఎవరూ ముందుకు రావడం లేదు. కళ అంతరించిపోవడానికి ఎంతోకాలం పట్టదనే పరిస్థితి పదేళ్ల కిందటే మొదలైంది. ఈ దశలో మహిళలు ముందుకు వచ్చారు. ఇంతవరకు మగవాళ్లు బొమ్మలు చేస్తుంటే, మహిళలు ఆ బొమ్మలకు రంగులు వేయడం, ప్యాకింగ్ వంటి సహాయక బాధ్యతలకే పరిమితమయ్యారు. ఇప్పుడు మహిళలే కలప కొట్టడం, రంపంతో కోసి చిన్న దిమ్మలు చేయడం, ఆ దిమ్మలను కుంపటి మీద ఆరబెట్టడం నుంచి బొమ్మను చెక్కి రంగులు వేయడం వరకు అన్ని పనులూ చేస్తున్నారు. ‘ఈ బొమ్మల తయారీలో ఉపయోగించే మెటీరియల్ మొత్తం సహజమైనదే. చెట్ల బెరళ్లు, కాయల పై తొక్కలు, గింజల పొడులతో రంగులు తయారు చేస్తారు. ఈ కలప మెత్తగా ఉంటుంది. కాబట్టి పిల్లలు నోట్లో పెట్టుకున్నా, ఒకరి మీద ఒకరు విసురుకున్నా అంతగా దెబ్బ తగలదు. కాబట్టి స్కూల్ కిట్ల కోసం ప్రైవేట్ స్కూళ్ల నుంచి కూడా మంచి డిమాండ్ రావచ్చ’ని ఆశాభావం వ్యక్తం చేశారు అభిహార స్వచ్ఛంద సంస్థ నిర్వహకురాలు సుధారాణి. అంతర్జాతీయ వేదికల మీద మన కొండపల్లి బొమ్మలు కనిపించాలనేది ఆమె ఆకాంక్ష. ఇన్నాళ్లూ బావుదరికి దూరంగా ఉన్న మహిళలు ఇప్పుడు తమ కెరీర్‌ని స్వయంగా చెక్కుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ల దృష్టి కార్లలో వేళ్లాడే నారింజ రంగు హనుమాన్ బొమ్మ మీద పడింది. కొండపల్లి హనుమాన్ రూపకల్పనలో మునిగిపోయారు. కార్లలో షోపీస్‌లుగా కొండపల్లి బొమ్మలు కనిపించే రోజు ఎంతో దూరం ఉండకపోవచ్చు. ఇప్పుడు మేమే చెక్కుతున్నాం! నేను ముప్పై ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు అన్ని పనులూ నేర్చుకున్నాను. కలపను ముక్కలు చేయడం, ఆరబెట్టడం వంటివి పది బొమ్మలకు సరిపడిన మెటీరియల్ ఒకేసారి సిద్ధం చేసుకుంటాం. ఆకారాలు చెక్కడం రెండు రోజుల్లో పూర్తవుతుంది. ఈ బొమ్మల్లో మనిషి దేహం చెక్కేటప్పుడు పాదాల నుంచి తల వరకు ఒకే ముక్కలో చెక్కుతాం. చేతులను విడిగా చెక్కి అతికిస్తాం. ఆ తర్వాత తల మీద కిరీటం వంటి అలంకరణ చేసి రంగులు వేస్తాం. అడుగు ఎత్తున్న బొమ్మల జత ధర నాలుగు నుంచి ఆరువేలవుతుంది. మొదట్లో మేము లేపాక్షి హస్తకళల ఎంపోరియమ్‌కి ఇచ్చేవాళ్లం. ఇప్పుడు అభిహార సంస్థ వాళ్లు మాకు మరికొన్ని కొత్త వస్తువులు చేయడంలో కూడా శిక్షణ ఇస్తున్నారు. మేము చేసిన బొమ్మలను మార్కెట్ చేయడానికి వాళ్లకే ఇస్తున్నాం. ఇప్పుడు రోజూ పని ఉంటోంది. కొండపల్లి బొమ్మ చేయడానికి తెల్ల పొణికి చెక్క వాడతాం. ఎన్నేళ్లయినా ఈ చెక్కలో పగుళ్లు రావు. అందుకే బొమ్మలు కలకాలం అంత అందంగా ఉంటాయి. – చందూరి స్వరాజ్యం, కొండపల్లి బొమ్మల కళాకారిణి ‘చెక్క’ని విప్లవం కొండపల్లి బొమ్మల తయారీలో మహిళల శ్రమ చిన్నది కాదు. కానీ ఆ శ్రమ ప్రధాన బొమ్మ తయారీ కాకపోవడంతో వాళ్లకు ఆర్టిజాన్ గుర్తింపు కార్డు వచ్చేది కాదు. నాలుగు నెలల శిక్షణలో ఇప్పుడు మహిళలు ఎవరి సహాయమూ లేకుండా స్వయంగా బొమ్మ చేయగలుగుతున్నారు. ఇప్పుడు మహిళలు కూడా హక్కుగా ఆర్టిజాన్ కార్డు పొందవచ్చు. ఇప్పటి వరకు మహిళలకు కళాకారులుగా గుర్తింపు లేకపోవడంతో కళాఖండాల ప్రదర్శన, కళాకారుల అవార్డుల విషయంలో మహిళలు కనిపించేవాళ్లు కాదు. ఇప్పుడు ఈ మహిళలు ఆ పరిధిని చెరిపివేశారు. – సుధారాణి, అభిహార సంస్థ నిర్వహకురాలు బొమ్మల బడి! కొండపల్లి బొమ్మలు చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఈ కళాకారుల చేతిలో చెక్క చక్కని బొమ్మగా ఎంత లాలిత్యంగా రూపుదిద్దుకుంటుందో వర్ణించడం సాధ్యం కాదు. ఇంత గొప్ప కళ అంతరించిపోతుంటే చూస్తూ ఊరుకోకూడదు. ఆ కళ తరతరాలకు అందాలి, ఈ కళాకారులు సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలి. అందుకే మాకు వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెడుతున్నాం. స్కూల్ కిట్‌కు ఐడియా ఇచ్చాం. ఆ కిట్‌లో తెలుగు, ఇంగ్లిష్ అక్షరమాల ఉంటాయి. అలాగే పిల్లలు లాయర్, టీచర్, డాక్టర్, రైతు, జాలరి వంటి వృత్తులను తెలుసుకోవడానికి వీలుగా ఆ బొమ్మలు చేయించాం. ఆఫీస్‌లో ఉపయోగించే ట్రే, పెన్ స్టాండ్, ఇళ్లలో ఉపయోగించే వస్తువులను కూడా ఈ మెటీరియల్‌తో చేయవచ్చు. ఇలాంటి మార్పును స్వాగతిస్తే కళాకారులకు చేతినిండా పని ఉంటుంది. ఈ కళాకారుల కోసం బీటూబీ మీటింగ్ వంటి మార్కెట్ వేదికల గురించి ఆలోచిస్తున్నాం. – విజయశారదారెడ్డి, వైస్ చైర్పర్సన్, ఏపీఎస్‌ఈఆర్‌ఎమ్‌సీ కొండపల్లి కృష్ణుడు నేను చేసిన తొలి బొమ్మ గోపికల మధ్య కృష్ణుడు. బావుదరి మీద పట్టు రావడానికి నెల రోజులు పట్టింది. అది వస్తే ఇక బొమ్మలు చేయడం ఏ మాత్రం కష్టం కాదు. మా బ్యాచ్ ట్రైనింగ్ పూర్తి కావస్తోంది. తర్వాత బ్యాచ్‌కి మరో పది మంది సిద్ధంగా ఉన్నారు. – పద్మావతి వెన్నవల్లి, శిక్షణలో ఉన్న విద్యార్థి – వాకా మంజులారెడ్డి ఫొటోలు : ఎ. బాబు, సాక్షి, ఇబ్రహీంపట్నం -
పరమ పవిత్రం మల్లన్న దివ్య పరిమళ ‘విభూది’
సాక్షి, శ్రీశైలం: విభూది సంపదను ప్రసాదిస్తుంది. పవిత్రతను కలిగిస్తుంది. పాపాలను భస్మం చేస్తుంది. అరిష్టాలన్నింటిని తొలగిస్తుంది. సమస్త శుభాలను కలిగిస్తుంది. సర్వసంపదలను చేకూరుస్తుంది. తేజస్సును కలిగిస్తుంది. మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. అటువంటి సద్గుణాలను ప్రసాదించే విభూదిని ధరించడం శుభప్రదమని పురాణాలు పెర్కొంటున్నాయి. అంతటి సుగుణాలను, పవిత్రతను కలిగిన విభూదిని శ్రీశైల దేవస్థానం తయారు చేస్తుంది. విభూది విక్రయాల ద్వారా దేవస్థానానికి ఏటా రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతుంది. చదవండి: (రాకెట్ ఇంధనం తణుకు నుంచే...) శ్రీశైల మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు స్వామి విభూదిని పరమ పవిత్రంగా భావిస్తారు. దేవస్థానం కూడా గోమయంతో స్థానిక గోశాలలో నిష్టగా తయారు చేయించి విక్రయిస్తుంది. విభూది విక్రయాల ద్వారా దేవస్థానానికి ఏటా రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. విభూది భక్తితో పాటు క్షేత్రానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగా మారింది. క్షేత్రానికి వచ్చే భక్తులకు దేవస్థానం స్వచ్చమైన గోమయంతో తయారు చేసిన దివ్యపరిమళ విభూదిని అందుబాటులో ఉంచింది. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో విభూదిని తయారు చేస్తుంది. తయారీలో శాస్త్రోక్తంగా, ప్రమాణాలు పాటిస్తున్నారు. విభూది తయారీ ఇలా.. దేవస్థానం గోశాల నుంచి లభించే గోమయం(ఆవుపేడ)ను పిడకలుగా చేసి ఎండలో ఆరబెడతారు. ఎండిన వాటిని కాల్చి తద్వారా వచ్చిన బూడిద(భస్మం)ను వడపోసి ప్రత్యేక యంత్రంలో వేస్తారు. వచ్చిన మిశ్రమాన్ని కేకులాగా తయారు చేసి మళ్లీ కాల్చుతారు. తద్వారా వచ్చే భస్మాన్ని విడతల వారీగా వడపోసి చివరికి విభూదిని తయారు చేస్తారు. అలాగే ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో రుద్రయాగం, చండీయాగంలోని భస్మాన్ని కూడా విభూది తయారులో వినియోగిస్తుండడంతో పవిత్రత చేకూరుతుంది. విభూది తయారు చేయడానికి 17మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. చదవండి: (వరుస సర్వీసులతో దూసుకుపోతున్న విశాఖ ఎయిర్పోర్ట్) ఆదాయ వనరు.. దివ్య పరిమళ విభూదిని ప్యాకెట్లు, డబ్బాల్లో దేవస్థానం విక్రయిస్తుంది. 10గ్రాముల విభూది డబ్బా రూ.10, 50గ్రాముల విభూది డబ్బా రూ.20, 75గ్రాముల విభూది డబ్బా రూ.30, 100గ్రాముల విభూది డబ్బా రూ.40, 50గ్రాముల విభూది ఉండా రూ.10, విభూది ప్యాకెట్లను రూ.10గా విక్రయిస్తున్నారు. కిలో విభూది ధర రూ.300గా నిర్ణయించారు. దీంతో ఆలయానికి విభూది విక్రయాల ద్వారా ఏటా రూ.లక్షల్లో ఆదాయం లభిస్తుంది. -
టీటీడీ ఆధ్వర్యంలో అగరబత్తీల తయారీ కేంద్రం
-
15 ఏళ్లుగా బాలాపూర్ లడ్డు తయారు చేస్తున్న ఉమామహేశ్వరరావు
-
‘ప్రకృతి’కి పట్టుగొమ్మ జీవామృతం
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలను రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా సాగు చేయటం ద్వారా మనుషుల ఆరోగ్యంతోపాటు భూమి, పర్యావరణం, పశుపక్ష్యాదుల ఆరోగ్యం కూడా కుదుట పడుతుందని ఇప్పటికే రుజువైన విషయం. స్థానికంగా గ్రామాల్లో అందుబాటులో ఉండే ప్రకృతి వనరులతోనే స్థానిక ప్రజలకు అవసరమైన చక్కని ఆరోగ్యదాయకమైన పంట ఉత్పత్తులను పండించుకోవటం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంతో ఆవశ్యకమైన అంశంగా అందరి గ్రహింపునకు వస్తుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగం జీవామృతాన్ని అందుబాటులో ఉన్న వనరులతోనే తయారు చేసుకోవటంతోపాటు, పంటలకు జీవామృతాన్ని వాడుకునే పద్ధతులను రైతులకు సూచిస్తోంది. జీవామృతం తయారు చేసుకునే విధానం, కావలసిన పదార్ధాలు: 1. దేశీ ఆవుపేడ – 10 కేజీలు 2. దేశీ ఆవు మూత్రం – 5 నుండి 10 లీటర్లు 3. బెల్లం – 2 కేజీలు (నల్ల బెల్లం అయితే మరీ మంచిది) లేదా చెరుకు రసం 2 లీటర్లు 4. పప్పుల (ద్విదళాల) పిండి – 2 కేజీలు (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా వాడవచ్చు. వేరుశనగ, సోయా పిండి మాత్రం వాడకూడదు) 5). బావి/బోరు/నది నీరు – 200 లీటర్లు 6). పుట్ట మన్ను లేదా పొలంగట్టు మన్ను దోసెడు పెద్ద సిమెంటు తొట్లలో జీవామృతం తయారీ జీవామృతాన్ని తయారు చేసే విధానం: తొట్టిలో గానీ, డ్రమ్ములో గానీ 200 లీటర్ల నీటిలో ఈ పదార్థాలన్నింటినీ కలిపి నీడలో 48 గంటల పాటు ఉంచాలి. ప్రతి రోజూ రెండు, మూడు సార్లు కర్రతో కుడి వైపునకు తిప్పాలి. 200 లీటర్ల జీవామృతం ఎకరానికి సరిపోతుంది. ఇలా కలిపిన జీవామృతం 48 గంటల తర్వాత వాడకానికి సిద్ధమవుతుంది, అప్పట్నుంచి 9 నుంచి 12 రోజుల మధ్య సూక్ష్మజీవుల వృద్ధి అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు అధికంగా వృద్ధి చెందుతాయి. నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములు చైతన్యవంతం అవుతాయి. తద్వారా భూసారం పెరగడానికి దోహదపడుతుంది. రైతులు వరి, మొక్కజొన్న, వేరుసెనగ, కూరగాయలు, పండ్ల తోటల దగ్గరే జీవామృతం తయారు చేసుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. ప్లాస్టిక్ డ్రమ్ములు, శాశ్వత సిమెంట్ వరలతో లేదా ఇటుకలతో నిర్మించే సిమెంటు తొట్లు, అవేవీ లేకపోతే ప్లాస్టిక్ కవర్లను మూడు ఊత కర్రల సాయంతో నిలబెట్టి అందులో కూడా ద్రవ జీవామృతాన్ని తయారు చేసుకోవచ్చు. పంటలకు నీటి ద్వారా పారించవచ్చు. లేదా పిచికారీ చేయవచ్చు. పొలం గట్లపైనే జీవామృతం సిద్ధం చేసుకునే పద్ధతులు 1. 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ము ఎక్కువ మంది రైతులు జీవామృతం తయారీ కోసం 200 లీటర్లు పట్టే ప్లాస్టిక్ డ్రమ్ములను ఉపయోగిస్తుంటారు. ఈ డ్రమ్ము ఖరీదు సుమారుగా రూ. 800 వరకు ఉంటుంది. కొందరు రైతులు 100 లీటర్ల సామర్ధ్యం గల చిన్న ప్లాస్టిక్ డ్రమ్ములను ఉపయోగిస్తుంటారు. ఈ ప్లాస్టిక్ డ్రమ్ములను రైతులు పొలం గట్ల పైన లేదా పాకలు / షెడ్లలో పెట్టుకొని జీవామృతాన్ని తయారు చేసుకుంటూ వాడుతూ ఉంటారు. ప్లాస్టిక్ డ్రమ్ములతో సులువుగా పంటలకు కావలసిన జీవామృతాన్ని అందించగలుగుతున్నారు. 2. ప్లాస్టిక్ కవర్ పిట్ డ్రమ్ములు కొనలేని చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు 100 లీటర్ల ప్లాస్టిక్ కవర్లను జీవామృతం తయారీ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ కవరు ఖరీదు రూ. 20 వరకు ఉంటుంది. మూడు ఊత కర్రలను భూమి లోపలికి దిగేసి నిలబెట్టి, వాటి మధ్య ఈ ప్లాస్టిక్ కవర్‌ను ఉంచి పొలం గట్ల పైన లేదా పాకలలో జీవామృతం తయారు చేసుకొని వాడుతున్నారు. 3. సిమెంట్ వరలతో జీవామృతం పిట్ సిమెంటు వరల (నందల)తో పిట్లను నిర్మించుకొని కొందరు రైతులు జీవామృతాన్ని ఉపయోగిస్తున్నారు. ఇవి శాశ్వతంగా ఉండిపోతాయి. సిమెంట్ వరల పిట్ ఏర్పాటుకు సుమారు రూ. 500ల నుంచి రూ.750 వరకు ఖర్చవుతుంది. పండ్ల తోటల రైతులు వీటిని ఎక్కువగా నిర్మించుకొని ఏడాది పొడవునా జీవామృతం తయారీకి ఉపయోగిస్తున్నారు. 4. పెద్ద సైజు సిమెంటు తొట్లు సొంత భూముల్లో వ్యవసాయం చేసే రైతులు, పండ్ల తోటల రైతులు పొలంలోనే సిమెంటుతో పెద్ద తొట్లు నిర్మించుకొని, వాటిలో జీవామృతం తయారు చేసుకోవటమే కాకుండా ఫిల్టర్ చేసుకునే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. జీవామృతం పంటలకు వాడే పద్ధతులు : నీటి తడులతో పారించటం వరి, మొక్కజొన్న, చెరకు తదితర పంటలకు నీటి తడులను అందించేటప్పుడు నీటితో పాటుగా జీవామృతాన్ని ఎకరాకు ఒక దఫా 200 లీటర్లు చొప్పున అందిస్తున్నారు. పంటల వివిధ దశల్లో 3 నుండి 4 సార్లు నీటితోపాటు పారిస్తున్నారు జీవామృతం పిచికారీ పద్ధతి వరి, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలకు జీవామృతాన్ని బాగా వడగట్టి, నీటితో పాటుగా ఎకరాకు ఒక దఫాకు 200 లీటర్లు పంటల వివిధ దశల్లో 3 నుంచి 4 సార్లు రైతులు పొలాల్లో పిచికారీ చేస్తున్నారు. డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా జీవామృతం పారించటం పండ్ల తోటలు, కూరగాయ తోటలకు కొన్ని చోట్ల ఆరుతడి వరికి సైతం జీవామృతాన్ని జాగ్రత్తగా వడకట్టి డ్రిప్ ద్వారా లేదా స్ప్రింక్లర్ల ద్వారా రైతులు అందిస్తున్నారు. పైపాటుగా పంటలపై పోయటం చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు లేదా పెరట్లో కూరగాయలు పండించుకునే వారు పంటలపై జీవామృతాన్ని చెంబులు, మగ్గులతో విరజిమ్ముతున్నారు. (మరిన్ని వివరాలకు.. ప్రకృతి వ్యవసాయ విభాగం విజయనగరం జిల్లా మేనేజర్ ప్రకాశ్ (91211 47885)ను సంప్రదింవచ్చు) ఏ యే పంటలకు ఎంత జీవామృతం? వరి, మొక్కజొన్న, వేరుసెనగ, కూరగాయ పంటలకు నీరు పారించే సమయంలో నీటితో కలిపి పారేలా చేసి పొలం మొత్తానికి జీవామృతం అందేలా చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి 200 లీటర్ల జీవామృతాన్ని నీటితోపాటు భూమికి అందించాలి. అలాగే పండ్ల తోటల్లో ఒక సంవత్సరం వయసున్న మొక్కకు అర లీటరు చొప్పున, రెండు సంవత్సరం మొక్కలకు ఒక లీటరు చొప్పున.. ప్రతి 15 రోజులకు ఒకసారి నేలకు అందించాలి. తద్వారా భూమిలో సుక్ష్మజీవరాశి పెంపొంది, నేల ఆరోగ్యవంతమవుతుంది. ఆరోగ్యవంతమైన భూమి మొక్కలకు సకల పోషకాలను అందిస్తుంది. -
ఇంట్లో మద్యం తయారు చేసుకోవచ్చా?
-
వెదురు వస్తువులు అదిరే
ఎదులాపురం: కర్ర.. ప్లాస్టిక్.. ఇనుము.. ఇతరాత్రలో చేసిన గృహోపకరణాలు, వస్తు సా మగ్రిని చూసి ఉంటాం.. కాని వెదురు బొంగుతో తయారు చేసిన పలు వస్తు సామగ్రి సైతం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. స్థానిక చేతివృత్తి కళాకారులు వెదురుతో ని త్యం ఇంట్లో ఉపయోగించే పలు రకాల వస్తువులను తయారు చేసి విక్రయిస్తున్నాయి. అంకురార్పణ.. ఆలోచన.. పట్టణానికి చెందిన జి.కిరణ్ వెదురుతో గృహోపకరణాలు తయారు చేస్తున్నాడు. పట్టణంలోని రైతు మార్కెట్లో షాపు ఏర్పాటు చేసుకొని విక్రయిస్తున్నాడు. మొదట్లో జొన్నకర్రను వినియోగించి చిన్న చిన్న గృహోపకరణాలు తయారు చేసే వాడు. వెదురుతో చేయాలనే ఆలోచన రాగా, అందుబాటులో ఉండే వెదురుతో చిన్న చిన్న వస్తు సామగ్రి తయారు చేయడం మొదలు పెట్టాడు. అస్సాంకు చెందిన వెదురును హైదరాబాద్ నుంచి తెప్పించుకుని గృహోపకరణాలు తయారు చేస్తున్నాడు. త్రిపుర, అగర్తలా, కేరళ, పుణే, నాగ్‌పూర్, రాజమండ్రి, విజయవాడ, వరంగల్ స్వయం సహాయ సంఘాల కు వీటి తయారీపై శిక్షణ ఇస్తున్నాడు. వస్తు సామగ్రి, గృహోపకరణాలు.. టేబుల్ ల్యాంప్ సెట్ రూ. 3, 500, వాల్ ల్యాంప్ సెట్ రూ. 500 నుంచి 600, ప్లవర్ బోకేలు రూ. 500 నుంచి 700, వాటర్ బాలిల్ లీటరుది రూ.350, అర లీటరుది రూ.250, టీ కప్పులు ఒక్కోటి రూ.50 నుంచి 60, ట్రే రూ. 350, త్రిపుల్ యాంగిల్ లెటర్ బాక్స్‌లు రూ.300, మేల్, ఫీమేల్ పికాక్స్ రూ.1500, డస్టిబిన్ రూ.350, సింగల్ చేయిర్ రూ.1200, సోఫాసెట్ రూ.20 వేలు, గాజుల స్టాంట్ రూ.150, దుర్గామాత విగ్రహం రూ. 10 వేలుగా విక్రయిస్తున్నాడు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి వెదురుతో చేసిన దుర్గామాత కళాఖండాన్ని గోల్కొండలో ఏర్పాటు చేసిన చేతి వృత్తుల కళాఖండాల ప్రదర్శనలో ప్రదర్శనకు ఉంచాం. ఇందుకు రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి అందుకున్నాం. జి.కిరణ్, శాంతినగర్, ఆదిలాబాద్ తయారు చేస్తున్న మహిళలు దుర్గామాత నౌక కళాఖండం -
పతంగ్ మేడిన్ ధూల్‌పేట్
-
మ్యాగీని.. ఇలా కూడా తయారు చేస్తారా..!
సాధారణంగా బాగా ఆకలి వేసినప్పుడూ.. వంట చేసుకొని తినే ఓపిక లేనప్పడు క్షణాల్లో తయారయ్యే మ్యాగీని చేసుకుంటారు. అందరికీ మ్యాగీ అంటే.. నూడిల్స్‌లా ఉండి.. అందులో వేసుకోవడానికి మసాలాతో కూడిన ప్యాకెట్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అదేవిధంగా మ్యాగీని అందరూ నీటితో చేస్తారన్న సంగతి విధితమే. మ్యాగీని ఒకేలా చేసుకొని తినడం బోర్ కొట్టిన ఓ మహిళా భిన్నంగా ఆలోచించి.. కొత్త తరహాలో తయారు చేశారు. అందులో నీటికి బదులుగా పాలను పోసీ కొంత చక్కెరను కూడా కలిపి తయారు చేశారు. ఆ వంటకానికి ‘స్వీట్ మ్యాగీ’ అనే పేరును కూడా జోడించారు. అంతటితో ఆగకుండా ఆ మహిళా ‘స్వీట్ మ్యాగీ’ తయారి విధానాన్ని వీడియో తీసి ట్విటర్ పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్లో కామెంట్లు చేస్తున్నారు.‘మీరు వదిలేసిన మసాలా ప్యాకెట్ నాకు ఇవ్వగలరా.. నేను ఎక్కువ మసాలా ఉపయోగిస్తానను’ అని ఒకరు, ‘చాలా సృజనాత్మకంగా ఉంది. కానీ తయారు చేయడానికి ప్రయత్నిస్తా అనుకోవడం లేదు’ అని మరొకరు, ‘ఓ దేవుడా.. మ్యాగీని ఇలా కూడా తయారు చేస్తారా.. నేను ఎక్కడా చూడలేదు’ అని ఇంకొకరు కామెంట్ చేశారు. -
మ్యాగీని.. ఇలా కూడా తయారు చేస్తారా..!
-
ద్వాదశాదిత్యుడు సిద్ధమవుతుండు సిద్ధమవుతుండు
సాక్షి, హైదరాబాద్: : 65 ఏళ్ల ఖైరతాబాద్ చరిత్రలోనే ఈసారి తయారు చేస్తున్న ద్వాదశాదిత్య మహాగణపతిని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఏకంగా 61 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు, 12 ముఖాలు, 24 చేతులతో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ప్రతి ఏటా మూడు నెలల ముందు నుంచే ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులు ప్రారంభిస్తారు. విగ్రహ తయారీలో 150 మంది పని చేస్తారు. శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో విగ్రహ తయారీ పనులు ఇప్పటికే 80శాతం పూర్తయ్యాయి. ఈ నెల 27 వరకు పనులన్నీ పూర్తవుతాయి. వీరే పాత్రధారులు... షెడ్డు పనులు: ఆదిలాబాద్‌కు చెందిన సుధాకర్ ఆధ్వర్యంలోని 20 మంది బృందం. వెల్డింగ్ పనులు: మచిలీపట్నంకు చెందిన జి.నాగబాబు ఆధ్వర్యంలోని 20 మంది. క్లే వర్క్: చెన్నైకి చెందిన గురుమూర్తి ఆధ్వర్యంలోని 25 మంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్: మహారాష్ట్రకు చెందిన సుభాష్ ఆధ్వర్యంలోని 23 మంది. మోల్డింగ్ పనులు: హైదరాబాద్‌కు చెందిన కోఠి ఆధ్వర్యంలోని 22 మంది బృందం. ఫినిషింగ్ పనులు: బిహార్, బెంగాల్‌కు చెందిన గోపాల్, సంతోష్‌ల ఆధ్వర్యంలోని 15 మంది. పెయింటింగ్: కాకినాడకు చెందిన భీమేశ్ ఆధ్వర్యంలోని 25 మంది బృందం. విగ్రహం వివరాలివీ... పేరు: ద్వాదశాదిత్య మహాగణపతి తలలు 12 సర్పాలు 12 చేతులు 24 24 చేతుల్లో 24 ఆయుధాలు ఉంటాయి. అవి అభయహస్తం, లడ్డూ, శంఖం, చక్రం, గద, పరశు, పాశం, శూలం, అంకుశం, కత్తి, రుద్రాక్షలు, పుష్పశరం, పద్మం, చెరుకుగడ ధనస్సు, బాణం, నాగం, వీణ, దండం, కమండలం, సుల్లా, గ్రంథం, గొడ్డలి, భగ్న దంతం, ధ్వజం. సామగ్రి, ఖర్చులు ఇలా.. సర్వీ కర్రలు 80 టన్నులు, వ్యయం రూ.3 లక్షలు. షెడ్డు నిర్మాణానికి లేబర్ రూ.లక్ష గోవా తాడు 100 బెండళ్లు, రూ.11 వేలు స్టీల్ 30 టన్నులు, ఖర్చు రూ.20 లక్షలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ 45 టన్నులు (మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఉచితంగా అందజేసింది) కొబ్బరి నార 60 బెండళ్లు, రూ.90 వేలు గోనె క్లాల్ 2వేల మీటర్లు, రూ.60 వేలు బంకమట్టి 600 బ్యాగులు, రూ.1.25 లక్షలు ఫ్రెంచ్ పాలిస్ రూ.11 వేలు వాటర్ పెయింట్స్ 120 లీటర్లు, రూ.80 వేలు వెల్డింగ్, మోల్డింగ్, డిజైన్ వర్క్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సెక్యూరిటీ ఇతరత్రా లేబర్ చార్జీలు రూ.35 లక్షలు ప్రతిరోజు లేబర్‌కు భోజనం రూ.10 లక్షలు ట్రాన్స్పోర్ట్, ఇతరత్రా ఖర్చులు రూ.3 లక్షలు 1954లో స్వాతంత్ర సమరయోధుడు సింగరి శంకరయ్య ఒక్క అడుగుతో ప్రారంభించిన ఖైరతాబాద్ గణపతి ఎత్తు ఏటా ఒక అడుగు పెరుగుతూ వస్తోంది. సింగరి శంకరయ్య 1994లో మరణించిగా... ఆయన తమ్ముడు సింగరి సుదర్శన్ బాధ్యతలు తీసుకున్నారు. ఈయన బావమరిది సందీప్‌రాజ్, కుమారుడు రాజ్‌కుమార్‌ల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. నమూనాలో మార్పులు.. మహాగణపతి ప్రధాన తలపై మూడు తలలు ఉండేలా తొలుత శిల్పి నమూనా సిద్ధం చేశారు. అయితే తయారీ సమయంలో 12 తలలను సెట్ చేసేందుకు ప్రధాన తలపై మూడు తలలకు బదులుగా ఐదు తలలను పెట్టి డిజైన్ ఫైనల్ చేశారు. దీంతో నమూనాను రెండుసార్లు మార్చారు. 12 తలలు, 12 సర్పాలు, 24 చేతులతో మహాగణపతిని తయారు చేయాలంటే తప్పనిసరిగా 61 అడుగులు ఉండాలని... ఈ నేపథ్యంలో ఎత్తు పెంచాల్సి వచ్చిందని శిల్పి రాజేంద్రన్ తెలిపారు. -
దోశెడు రుచులు
ఎట్ల చేసినా అట్లు బాగుంటాయి. ఏం టైమ్‌లో అయినా మనసు దోశేస్తాయి. రొటీన్‌ని పక్కన పెట్టండి. బ్రేక్ ఫాస్ట్‌లో ఛీజ్‌ను, బ్రెడ్‌ను దోశెతో కలిపి కొత్త రుచిని లాగించండి. అట్ల తద్ది నోముకు దోశెడు రుచులు కలపండి. బ్రెడ్ దోశె కావలసినవి: బ్రెడ్ స్లైసులు – 10; బియ్యప్పిండి – పావు కప్పు; సెనగ పిండి – 2 టేబుల్ స్పూన్లు; పెరుగు – పావు కప్పు; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని; తినే సోడా – అర టీ స్పూను; నూనె – తగినంత పోపు కోసం: నూనె – ఒక టీ స్పూను; ఆవాలు – పావు టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; కరివేపాకు తరుగు – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు తయారీ: ♦ ముందుగా బ్రెడ్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ♦ బియ్యప్పిండి, సెనగ పిండి, పెరుగు, నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి, పిండి మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి ♦ తగినంత ఉప్పు (బ్రెడ్ ఉంటుంది కనుక ఉప్పు తగ్గించి వేసుకోవడం మంచిది) జత చేయాలి ♦ ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి జత చేసి మరోమారు బాగా కలపాలి. పోపు తయారీ : ♦ స్టౌ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ♦ జీలకర్ర జత చేసి మరోమారు వేయించాక, చివరగా కరివేపాకు తరుగు, ఇంగువ వేసి బాగా వేయించి దోశెపిండి మిశ్రమంలో వేసి కలపాలి ♦ చివరగా తినే సోడా జత చేసి బాగా కలపాలి. దోశె తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి సమానంగా పరవాలి ∙గరిటెతో దోశె పిండి తీసుకుని పెనం మీద పల్చగా వేయాలి ∙బాగా కాలిన తరవాత తిరగేసి మరికాస్త నూనె వేసి కాల్చాలి ∙రెండువైపులా కాలిన తరవాత ప్లేట్లోకి తీసుకుని కొబ్బరి చట్నీతో అందించాలి. ముంబై స్టయిల్ మసాలా దోశె కావలసినవి: దోశె పిండి – 3 కప్పులు; ఉల్లి తరుగు – అర కప్పు; కొత్తిమీర తరుగు – పావు కప్పు; సాల్టెడ్ బటర్ – తగినంత; గరం మసాలా పొడి లేదా పావ్ భాజీ మసాలా పొడి – తగినంత; మిరప కారం – తగినంత; పొటాటో: మసాలా కోసం కావలసినవి: బంగాళ దుంపలు – 3 (ఉడికించి తొక్కతీసి మెత్తగా మెదపాలి); నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు (పొట్టుతో) – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; ఉల్లి తరుగు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 1 (చిన్న ముక్కలు చేయాలి); అల్లం తురుము – అర టీ స్పూను; నీళ్లు – తగినన్ని; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ♦ ఒక పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి ♦ పచ్చి సెనగ పప్పును శుభ్రంగా కడిగి వేడి నీళ్లలో వేసి మూత పెట్టి సుమారు గంట సేపు నానబెట్టాక, నీళ్లు వడకట్టేసి, సెనగపప్పును పక్కన ఉంచాలి ♦ బంగాళ దుంపలను ఉడికించి తొక్క తీసి గరిటెతో మెత్తగా మెదిపి పక్కన ఉంచాలి ♦ స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ♦ జీలకర్ర జత చేసి మరోమారు వేయించాలి ♦ వడకట్టిన సెనగ పప్పు జత చే సి బంగారు రంగులోకి మారేవరకు ఆపకుండా వేయించాలి ♦ అల్లం తురుము జత చేసి మరోమారు వేయించాలి ♦ ఉల్లి తరుగు జత చేసి బాగా ♦ కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, పసుపు, ఇంగువ జత చేసి మరోమారు వేయించాలి ♦ ఉడికించిన బంగాళదుంప ముద్ద జత చేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి ♦ ఉప్పు, పంచదార, కొద్దిగా నీళ్లు పోసి మసాలా మెత్తగా వచ్చేలా బాగా కలియబెట్టి, సుమారు ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మసాలా దోసె తయారీ: ♦ స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి కాలనివ్వాలి ♦ గరిటెడు దోసె పిండి తీసుకుని పెనం పల్చగా దోసె వేయాలి ∙దోశె బాగా కాలుతుండగా మసాలాను ఉల్లితరుగు, కొత్తిమీర తరుగు, మిరప కారం లేదా గరం మసాలా వేసి సమానంగా పరవాలి ♦ ఆ పైన కొద్దిగా బటర్ వేయాలి ♦ చివరగా పొటాటో మసాలా మిశ్రమం కొద్దిగా తీసుకుని దోశె పైన ఉంచి దోశెను రెండు పక్కల నుంచి మధ్యకు మడిచి ప్లేట్లోకి తీసుకోవాలి ♦ పిజ్జా కటర్‌తో కట్ చేసుకుని కొబ్బరి చట్నీ, సాంబారులతో వేడివేడిగా అందించాలి. చీజ్ దోశె కావలసినవి: దోశెపిండి – రెండు కప్పులు; ఉల్లితరుగు – అరకప్పు; టొమాటో తరుగు – అర కప్పు; మిరియాల పొడి – పావు టీ స్పూను; చీజ్ తురుము – అర కప్పు; బటర్ – తగినంత తయారీ: ♦ స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, కొద్దిగా బటర్ వేసి సమానంగా పరిచి, మంట బాగా తగ్గించాలి ♦ గరిటెతో దోశె పిండి తీసుకుని పెనం మీద దోశెలా వేయాలి ♦ దోశె కొద్దిగా కాలిన తరవాత ఉల్లి తరుగు, టొమాటో తరుగు, మిరియాల పొడి వేసి అట్లకాడతో సరిచేయాలి ♦ చివరగా చీజ్ తురుము వేసి సరిచేయాలి ♦ అదే సమయంలో దోశె చుట్టూ బటర్ వేయాలి ♦ సన్న మంట మీద దోశె కాలుతుండగా, చీజ్, బటర్ రెండూ కరిగిపోతాయి ∙దోశె బంగారు రంగులోకి వచ్చేవరకు కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి ♦ కొబ్బరి చట్నీ, సాంబారుతో అందించాలి ♦ టొమాటో చట్నీ, ఉల్లి చట్నీ కూడా రుచిగా ఉంటాయి. పెరుగు దోశె కావలసినవి: బియ్యం – ఒక కప్పు; గట్టి అటుకులు – పావు కప్పు; మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; నీళ్లు – నానబెట్టడానికి తగినన్ని; తాజా పెరుగు – అర కప్పు; పంచదార – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి – తగినంత తయారీ: ♦ బియ్యం, మినప్పప్పు, మెంతులను విడివిడిగా కడిగి, ఒకపాత్రలో వేసి తగినన్ని నీళ్లు, పెరుగు జత చేసి సుమారు ఐదు గంటలపాటు నానబెట్టాలి ♦ వేరొక పాత్రలో అటుకులు వేసి తగినన్ని నీళ్లు జత చేసి విడిగా నానబెట్టాలి ♦ నీరంతా ఒంపేసి అటుకులు, బియ్యం, మినప్పప్పు, మెంతులు గ్రైండర్లో వేసి మెత్తగా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ♦ పంచదార, ఉప్పు జత చేసి రాత్రంతా నాననివ్వాలి ♦ స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేయాలి ♦ గరిటెడు పిండి తీసుకుని పెనం మీద వేసి కొద్దిగా మందంగా ఉండేలా చూసుకోవాలి ♦ పైన మూత ఉంచి, మీడియం మంట మీద కాలనివ్వాలి ♦ దోశె పై భాగం బాగా కాలిన తర్వాత రెండవ వైపుకి తిప్పి చుట్టూ నెయ్యి వేసి కాలిన తరవాత ప్లేట్లోకి తీసుకోవాలి ♦ కొబ్బరి చట్నీ/ కొత్తిమీర చట్నీతో అందించాలి. షెజ్వాన్ దోశె కావలసినవి: ఉల్లికాడల తరుగు – పావు కప్పు; దోశె పిండి – 3 కప్పులు; కొత్తిమీర తరుగు – పావు కప్పు; ఉల్లి తరుగు – పావుకప్పు; క్యాప్పికమ్ తరుగు – పావుకప్పు; క్యారట్ తురుము – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; షెజ్వాన్ సాస్ – తగినంత; బటర్ – తగినంత తయారీ: ♦ స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, అడ్డంగా సగానికి కోసిన ఉల్లిపాయను నూనెలో ముంచి పెనం మీద నూనె పూయాలి ♦ గరిటెతో దోశెపిండి తీసుకుని పెనం మీద దోశె వేయాలి ♦ సన్నటి మంట మీద దోశెను కాలనివ్వాలి ♦ పై భాగం బాగా కాలగానే రెండు టీ స్పూన్ల బటర్, ఒక టీ స్పూను షెజవాన్ సాస్ వేసి, దోశె మీద సమానంగా పరవాలి ♦ ఆ పైన కూరగాయల తరుగు వేసి పరవాలి ♦ బాగా కాలిన తరవాత దోశెను మధ్యకు మడిచి ప్లేట్లోకి తీసుకుని పిజ్జా కటర్‌తో నచ్చినట్లుగా కట్ చేయాలి ♦ ఇలా తయారు చేసుకున్నాక కొబ్బరి చట్నీ, సాంబారుతో వేడివేడిగా అందించాలి. దోశె పిండి కావలసినవి: మినప్పప్పు – ఒక కప్పు; బియ్యం – రెండున్నర కప్పులు; మెంతులు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత తయారీ: ♦ ముందు రోజు రాత్రి ఒక పెద్ద పాత్రలో మినప్పప్పు, బియ్యప్పిండి, మెంతులు వేసి, తగినన్ని నీళ్లు జతచేసి నానబెట్టాలి మరుసటిరోజు ఉదయం నీళ్లన్నీ వడకట్టేసి, మినప్పప్పు, బియ్యం, మెంతులు మిశ్రమాన్ని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ♦ ఉప్పు జత చేసి బాగా కలిపి, మూత పెట్టి, రెండు మూడు గంటలు బాగా నాననివ్వాలి. ఆ తరవాత దోశెలు వేసుకుంటే మెత్తగా వస్తాయి. టిప్స్ దోసె కరకరలాడుతూ, రుచిగా ఉండాలంటే... ♦ ఒక భాగం మినప్పప్పుకు 3 భాగాల బియ్యం నానబెట్టాలి. సగం కప్పు మరమరాలు లేదా అన్నం పేలాలు విడిగా నానబెట్టాలి. నాలుగు గంటలు వీటిని నానబెట్టిన తర్వాత అన్నీ కలిపి మెత్తగా రుబ్బాలి. ♦ కొందరు 2–3 రోజుల వరకు పిండిని ఫ్రిజ్‌లో ఉంచి వాడుతుంటారు. ఇలాంటప్పుడు స్టీలు గిన్నెలో ఉంచితే పిండి కొద్దిగా రంగు మారుతుంది. అలా కాకుండా ప్లాస్టిక్ లేదా సెరామిక్ పాత్రలో పిండిని పోసి ఫ్రిజ్‌లో భద్రపరచాలి. ♦ దోసె వేయడానికి ఫ్రిజ్‌లో పిండి వాడాలంటే కనీసం 15 నిమిషాలు ఆ పిండిని బయట ఉంచాలి. ♦ చట్నీతో పాటు తురిమిన ఛీజ్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇడ్లీ పొడి వంటివి దోసెకు కాంబినేషన్‌గా వడ్డించవచ్చు. -
ఐస్‌క్రీమ్ తింటున్నారా ? జాగ్రత్త.. !
చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ఐస్‌క్రీములను ఇష్టపడనివారు ఉండరు. వేసవిలో అయితే అందరూ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఐస్‌క్రీములు తినాల్సిందే. అయితే మనం తినే ఐస్‌క్రీముల వెనుక అనేక చేదు నిజాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఐస్‌క్రీముల్లో విపరీతంగా రంగులు వాడుతున్నారని, వీటివల్ల ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మోతాదుకు మించి రంగులు వాడటం, అనుమతి లేని కల్తీ రంగులు వినియోగిస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటున్నారు. సాక్షి, అమరావతి : ఈ వేసవిని ఐస్‌క్రీమ్ తయారీ ఫ్యాక్టరీలు సొమ్ము చేసుకుంటున్నాయి. అనేక రంగులతో ఆకర్షణీయంగా కనిపించే ఈ ఐస్‌క్రీముల్లో కల్తీ జరుగుతున్నట్టు ఆహార భద్రతా అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ప్రతి ఐస్క్రీములోనూ నాసిరకం రంగులే వాడుతున్నారని తేలింది. అంతేకాకుండా ఐస్‌క్రీముల్లో వాడే ప్రతి పదార్థం నాసిరకమైందేనని లేదా కల్తీ జరుగుతున్నదేనని స్పష్టమైంది. రాష్ట్రంలో మూడు వేలకుపైగా చిన్నాపెద్ద ఐస్క్రీము ఫ్యాక్టరీలు ఉండగా వాటిలో 90 శాతం ఫ్యాక్టరీలకు అనుమతి లేదు. లైసెన్స్ ఉందా? లేదా? అని అడిగే అధికారులూ లేరు. దీంతో వేసవిలో నాలుగు నెలలపాటు ఐస్‌క్రీముల వ్యాపారం కోట్ల రూపాయల్లో జరుగుతోంది. ఈ స్థాయిలో వ్యాపారం జరుగుతున్నా ఐస్‌క్రీముల్లో నాణ్యత ఉందా? లేదా?, ఆహార భద్రతా ప్రమాణాల మేరకే ఇవి తయారవుతున్నాయా వంటి విషయాలపై అటు ప్రభుత్వం, ఇటు అధికారులు దృష్టి సారించడం లేదు. లక్షలాది మంది నిత్యం ఐస్‌క్రీములను తింటూ అనారోగ్యం పాలవుతున్నా ప్రభుత్వ యంత్రాంగానికి చీమకుట్టినట్టు కూడా లేదు. ప్రధానంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారులు కల్తీ పదార్థాలతో కూడిన ఐస్‌క్రీములు తినడం వల్ల శ్వాసకోశ, గొంతువాపు, జీర్ణకోశ వ్యాధులకు గురవుతున్నారు. అన్నింటా అనుమతి లేని రంగులే.. ఎక్కువ శాతం ఐస్‌క్రీముల్లో అనుమతి లేని రంగులు వాడుతున్నారు. దీంతోపాటు తయారీ కంపెనీలకు లైసెన్సులు లేవు. అత్యంత హాని కలిగించే శాక్రిన్ను మోతాదుకు మించి వాడుతున్నట్టు తేలింది. దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. డ్రమ్ముల్లో నీళ్లు నింపి వారం పది రోజుల తర్వాత కూడా అవే నీటిని ఐస్‌క్రీముల తయారీకి వినియోగిస్తున్నారు. సాధారణంగా ఐస్‌క్రీముల్లో హై ఫ్యాట్, మీడియం ఫ్యాట్, లో ఫ్యాట్ రకాలు వాడతారు. కానీ ఈ ఫ్యాట్ మోతాదు సరైన స్థాయిలో ఉండకపోవడంతో ఐస్‌క్రీమ్ నిల్వలో తేడా వస్తుంది. అదేవిధంగా ప్యాకింగ్ లేబుళ్లపై తయారీ తేదీ, ఎక్స్‌పెయిరీ తేదీ ఉండటం లేదు. ఆయా ఫ్యాక్టరీల్లో పారిశుధ్యం అత్యంత ఘోరంగా ఉన్నట్టు తేలింది. విజయవాడ, గుంటూరు కల్తీ ఐస్‌క్రీములకు అడ్డాగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా నెలకు రూ.200 కోట్లకుపైనే ఐస్‌క్రీముల వ్యాపారం జరుగుతున్నట్టు అధికారుల అంచనా. తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నాం ఐస్‌క్రీముల్లో అనుమతి లేని రంగులు వాడుతుంది నిజమే. కొద్దిరోజుల క్రితం తనిఖీలు నిర్వహించి కొన్ని కేసులు కూడా నమోదు చేశాం. తిరిగి తనిఖీలు నిర్వహిస్తాం. ఎలాంటి లోపాలున్నా ఆయా కంపెనీలను సీజ్ చేసి, వారిపై కేసులు నమోదు చేస్తాం. లైసెన్సు లేకపోయినా ఆయా ఫ్యాక్టరీలు సీజ్ చేస్తాం. – పూర్ణచంద్రరావు, ఆహార భద్రతా నియంత్రణాధికారి -
గుంటూరులో గుట్కా తయారీ ముఠా అరెస్ట్
-
పరిశ్రమలతోనే అభివృద్ధి
కొత్తపల్లి : పరిశ్రమలతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ కార్తికేయ మిశ్ర అన్నారు. కొత్తపల్లి మండలం కేఎస్‌ఈజెడ్‌లో ఉన్న పాల్స్‌ప్లస్ (చైనా బొమ్మల తయారీ) కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. యాజమాన్యంలో కంపెనీ విధి వి«ధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్మికుల సమస్యలను అడిగి వారి స్థితిగతులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ట్రైనీ కలెక్టర్ ఆనంద్‌కు ఈ పరిశ్రమ చూపించడం కోసం వచ్చామన్నారు. అనంతరం కలెక్టర్, ట్రైనీ కలెక్టర్ ప్రాంగణంలో మొక్కలను నాటారు. పరిశ్రమ సీఓఓ లాలన్ మిశ్ర మాట్లాడుతూ తయారు చేసిన బొమ్మలను విదేశాల్లో మాత్రమే అమ్మడం జరుగుతుంది. ఒక్క బొమ్మ కూడా ఇండియాలో అమ్మడం జరగదు. తయారు చేసిన ప్రతి ఒక్కరూ చైనా వెళ్లి అక్కడ ట్రాగ్ వేసిన తర్వాత ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఇప్పటి వరకు పది లక్షల అమెరికన్ డాలర్ల విలువ చేసే బొమ్మలను ఎగుమతి జరిగింది. మొత్తం ఈ పరిశ్రమలో 600 కార్మికులు పరిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి పీఎఫ్, ఈఎస్ అమలు చేస్తున్నారు. ప్రతి నెలా తమ బ్యాంక్ ఖాతాలోనికి జీతాలను జమ చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఇటువంటి ప్రాంతాల్లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందన్నారు. కాకినాడ సిటీ : జిల్లాలో ప్రమాదాలకు ఆస్కారం ఉండే అన్ని పరిశ్రమల్లో పర్యావరణం, కార్మికులు, పరిసర జనావాసాల రక్షణకు చట్టపరంగా నిర్ధేశించిన భద్రతా చర్యలను ఖచ్చిత ప్రమాణాలతో అమలు చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఫ్యాక్టరీస్, ఫిషరీస్, ఫైర్, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్స్, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలోని ఆక్వా పరిశ్రమలు, ప్రమాదకర రసాయనాలు, వాయువులతో పనిచేసే పరిశ్రమలో రక్షణ, భద్రతా చర్యల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన 10 సంవత్సరాల్లో జిల్లాలో జరిగిన పారిశ్రామిక ప్రమాదాలు, వాటికి కారణాలను విశ్లేషించాలని ఆదేశించారు. ఈ ప్రమాదాలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు చేపట్టవలసిన జాగ్రత్తలు, చట్టప్రకారం పరిశ్రమల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన భద్రతా వ్యవస్థలు, ప్రమాణాలతో చెక్‌లిస్ట్ రూపొందించాలన్నారు. పరిశ్రమల్లో చేపట్టిన భద్రతా చర్యలు, వాటి ప్రమాణాలను ఆయా శాఖల అధికారులు నిశితంగా తనిఖీచేసి, పాటించని యూనిట్లపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇటీవల కొన్ని ఆక్వా పరిశ్రమలలో జరిగిన ప్రమాదాల్లో విద్యుత్ సరఫరా లేనప్పుడు ఏసీలు పనిచేయక కార్మికులు అస్వస్థతకు లోనైనట్లు గుర్తించినందున, అన్ని ఫ్యాక్టరీల్లో ప్లాంట్ రన్నింగ్‌తో పాటు, కార్మికుల రక్షణకు ఏర్పాటు చేసిన ప్రతి సేఫ్టీ వ్యవస్థకు కూడా విద్యుత్ అందించే సామర్ధ్యం ఉన్న జనరేటర్లునే విధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో బాయిలర్‌తో పనిచేస్తున్న సుమారు 416 పరిశ్రమల్లో బాయిలర్ల ప్రమాణాలు, ప్రమాద నివారణ, రక్షణ కోసం చేపట్టిన చర్యలను రెగ్యులర్‌గా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. గాలిలోకి ఫ్లైయాష్వదులుతూ ప్రజలను ఇబ్బందులకు, ఆరోగ్య సమస్యలకు గురిచేస్తున్న పరిశ్రమలు కాలుష్య నివారణకు ట్రీట్మెంట్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివçశంకర్‌రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి ఉదయ్‌కుమార్, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి రాఘవరెడ్డి, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, శాంతారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కల్పరసకు తొలి అడుగు
తీతకు నడుంకట్టిన కొబ్బరి రైతులు ప్రభుత్వ అనుమతిపై ఉప ముఖ్యమంత్రి రాజప్పకు కృతజ్ఞతలు అమలాపురం : కొబ్బరి రైతుల దశ మార్చనున్న కొబ్బరి కల్పరస (కొబ్బరినీరా)కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దాని సేకరణకు కోనసీమ రైతులు నడుంకట్టారు. కొబ్బరి చెట్టు నుంచి శాస్త్రీయ పద్ధతిలో దానిని సేకరించేందుకు తొలి అడుగు వేశారు. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీపీసీఆర్‌ఐ) అందుబాటులోకి తెచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో కల్పరస సేకరణకు అమలాపురం రూరల్ మండలం చిందాడగరువుకు చెందిన రైతు మట్ట నాగేశ్వరరావు బుధవారం తన తోటలో శ్రీకారం చుట్టారు. కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ (కేసీఎఫ్పీవో) సభ్యుడైరన నాగేశ్వరరావు తన తోటలో మొదటిగా మూడుచెట్ల నుంచి కల్పరససేకరణ ప్రారంభించారు. ఇందులో భాగంగా పొత్తులకు నైలాన్ తాడుకట్టి, పొత్తును మసాజ్ చేస్తున్నారు. ఇలా వారం రోజులు చేసి తరువాత దీని నుంచి కల్పరసను సేకరిస్తామని నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. 2015లో కేరళలోని కాసరఘోడ్లో సీపీసీఆర్‌ఐ కల్పరస సేకరణపై ఇచ్చిన శిక్షణలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రక్రియను రైతుమిత్ర రూరల్ టెక్నాలజీ పార్కు కన్వీనర్ అడ్డాల గోపాలకృష్ణ, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మట్టా మహాలక్ష్మి ప్రభాకర్ పర్యవేక్షించారు. -
నిలిచిన ఎండుకొబ్బరి తయారీ
కొబ్బరి ధర పెరుగుదల రైతులకు సంతోషాన్ని ఇస్తుంటే.. కొబ్బరి కార్మికులకు, తయారీ కొబ్బరి వ్యాపారులను మాత్రం కష్టాల్లోకి నెట్టుతోంది. పచ్చికొబ్బరి కాయ ధర పెరగడంతో కొత్తకొబ్బరి (తయారీ కొబ్బరి).. కొబ్బరినూనె తయారీ దాదాపు నిలిచిపోయింది. దీంతో ఇటు వ్యాపారులకు... అటు కార్మికులకు చేతిలో పనిలేకుండా పోతోంది. – అమలాపురం/అంబాజీపేట ప్రస్తుతం మార్కెట్లో పచ్చికాయ, ముక్కుడు కాయ వెయ్యి కాయల ధర రూ.7,500 వేల వరకూ ఉంది. పది, పదిహేను రోజుల క్రితం రూ.పది వేలు ఈ ధర పలికింది. కాయ ధర ఎక్కువగా ఉండడంతో రైతులు, కొబ్బరి వ్యాపారులు నేరుగా కొబ్బరిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంత ధరకు కొనుగోలు చేసి.. తయారీ కొబ్బరి (కొత్తకొబ్బరి, ఎండుకొబ్బరి)ని స్థానికంగా తయారుచేసే అవకాశం లేదు. తయారీ కొబ్బరి కన్నా పచ్చికొబ్బరి ధర ఎక్కువగా ఉంది. తయారీ కొబ్బరి క్వింటాల్ ధర రూ.8 వేలు ఉండగా, పచ్చికొబ్బరి ధర రూ.7,500లే ఉంది. ఎండు కొబ్బరి చేస్తే నష్టమే.. వెయ్యి కొబ్బరికాయల నుంచి 90 కేజీల ఎండు కొబ్బరి తయారవుతుంది. క్వింటాల్ ఎండుకొబ్బరి తయారు చేయాలంటే 1,110 కాయలు అవసరం. మార్కెట్ ధరను బట్టి చేస్తే అయ్యే ఖర్చు రూ.8,325. వలుపు, తయారీ కార్మికులకు, రవాణా ఖర్చులు కలుపుకుంటే క్వింటాల్ ఎండు కొబ్బరి ఉత్పత్తికి అయ్చే ఖర్చు రూ.వెయ్యికిపైనే. అంటే క్వింటాల్ ఎండుకొబ్బరి తయారీ పెట్టుబడి రూ.9,500ల వరకూ అవుతున్నట్టు లెక్క. మార్కెట్ ధర మాత్రం రూ.8,200లే. దేవాలయాలు, ఇతర ప్రాంతాల్లో కొబ్బరి చిప్పలను వేలంలో పొందినవారే ఎండు కొబ్బరి తయారు చేస్తున్నారు. సీజ¯ŒSలో అంబాజీపేట మార్కెట్ నుంచి ఇప్పుడు 10 టన్నులు కూడా ఎగుమతి కావడం లేదు. ఉపాధి కోల్పోయిన కార్మికులు పచ్చికొబ్బరి ఎగుమతి కన్నా ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె ఎగుమతులపైనే అంబాజీపేట మార్కెట్లో ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నెల రోజులుగా ఉత్పత్తి నిలిచిపోవడంతో సుమారు 3 వేల మంది ఉపాధి కోల్పోతున్నారు. నిండా ముంచేస్తున్న వ్యాపారులు తక్కువ ధర ఉన్నప్పుడు భారీగా నిల్వ చేసిన వ్యాపారులు ఇప్పుడు ఎగుమతి చేసే పనిలో పడ్డారు. నిల్వలు పూర్తయ్యేవరకూ ధర తగ్గించేశారని రైతుల ఆరోపణ. నిల్వలు పూర్తయ్యాకా తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేసి, తరువాత ధరలు పెంచి లాభపడాలనే వ్యాపారుల వ్యూహానికి బలవుతున్నామని రైతులు వాపోతున్నారు. కొంతమంది రైతులు మాత్రం ధర పెరిగిన తరువాత అమ్మకాలు చేయాలని కొబ్బరికాయలను నిల్వ చేస్తున్నారు. -
జర్మనీ మొదటి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్!
చెన్నైః ఒడిషాలోని భువనేశ్వర్, కేరళలోని కొచ్చి, తమిళనాడులోని కోయంబత్తూర్ లను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు సాయం అందిస్తామని గతంలో జర్మనీ హామీ ఇచ్చింది. అందులో భాగంగా ముందుగా తమ ప్రాజెక్టును కోయంబత్తూరు నుంచి ప్రారంభించేందుకు జర్మనీ సంసిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇండియాకు వచ్చిన జర్మన్ అంబాసిడర్ మార్టిన్ నే.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో సమావేశం అయ్యారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టును ముందుగా కోయంబత్తూర్ లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. భారత్ లో మూడు నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు సాయం అందిస్తామని జర్మనీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో ఇండియాకు వచ్చిన జర్మన్ అంబాసిడర్ మార్టిన్ నే తమిళనాడు ముఖ్యంత్రి జయలలితను స్టేట్ సెక్రెటేరియల్ లో కలిసినట్లు తమిళనాడు ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు సహాయం అందించేందుకు సంసిద్ధంగా ఉన్న జర్మనీ.. ముందుగా కోయంబత్తూర్ నుంచి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్లు జర్మన్ అంబాసిడర్ నే.. తెలిపారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్తల ప్రాతినిథ్యంతో కూడిన ఓ బృదం జూలై 20న కోయంబత్తూర్ సందర్శించి, కోయంబత్తూర్ నగర మేయర్, ఇతర అధికారులతో మిగిలిన చర్చలు జరపనున్నట్లు తెలిపింది. ప్రాజెక్టులకు తమవంతు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నజర్మన్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమిళనాడులో బ్యాంకింగ్ గ్రూప్ కెఎఫ్ డబ్ల్యూ సహా.. మరిన్ని జర్మన్ కంపెనీలు పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు. -
సంక్రాంతి వంటలు
-
ఫోటో హల్చల్!
-
ప్రశంసలు మిన్న ప్రోత్సాహం సున్నా
-
జూన్ 12 టూ సెప్టెంబర్ 10
మేకింగ్ ఆఫ్ మహాగణపతి 91 రోజుల ప్రతిమ ప్రస్థానం ఖైరతాబాద్: ఎన్నో ఆలోచనలు.. మరెన్నో అంచనాలు.. సిద్ధహస్తులైన శిల్పులు.. చేయి తిరిగిన కళాకారులు.. వెరసి 59 అడుగుల భారీ గణపయ్య విగ్రహం. అదే ఖైరతాబాద్ మహా గణపతి. భక్తుల కంటికి ఇంపైన రూపం. ఈ ఏడాది త్రిశక్తిమయ మోక్ష గణపతి స్వరూపం. భక్తుల అంచనాలకు అనుగుణంగా ప్రధాన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ఊహకు రూపమిచ్చారు. జూన్ 12న భూమి పూజతో మొదలై సెప్టెంబర్ 10 నాటికి నేత్రాలను దిద్దే స్థాయికి చేరుకుంది ఈ ప్రతిమ ప్రస్థానం. 91రోజుల పాటు ఎలా సాగిందో వివరించే స‘చిత్ర’ కథనం.. జూన్ 12: భూమిపూజ ఆ రోజు నుంచే ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రధాన శిల్పి రాజేంద్రన్‌తో ఈ ఏడాది రూపంపై కసరత్తు ప్రారంభించారు. ఎన్నో సలహాలు, మార్పులతో గణపయ్య రూపు తయారీ మొదలైంది. కంప్యూటర్ డిజైనర్ ప్రవీణ్ సహకారంతో శిల్పి రాజేంద్రన్ రెండు రోజుల పాటు శ్రమించి తుదిరూపును తయారు చేశారు. ‘త్రిశక్తిమయమోక్ష గణపతి’గా నామకరణం చేశారు. జూలై 2: నమూనా ఆవిష్కరణ ఆదిలాబాద్‌కు చెందిన సుధాకర్ అండ్ టీం (15 మంది) షెడ్డును నిర్మించారు. 22 టన్నుల సర్వే కర్రలు, 50 బండిళ్ల తాళ్లు వినియోగించారు. జూలై 15: వెల్డింగ్ పనులు షురూ కావలికి చెందిన శేషారెడ్డి బృందం (10 మంది) వెల్డింగ్ పనుల్ని ప్రారంభించింది. 20 టన్నుల స్టీల్‌ను వినియోగించారు. జూలై 28: 4 టన్నుల బరువైన 42 అడుగుల ఎత్తయిన సెంటర్ పోల్‌ను క్రేన్ సాయంతో అమర్చారు. ఆగస్ట్ 7: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పనులు.. చెన్నైకి చెందిన మూర్తి టీం(25 మంది), మహారాష్ట్ర సుభాష్ టీం పీఓపీ పనుల్ని ప్రారంభించాయి. ఇందుకు 34 టన్నుల పీఓపీ, 75 బండిళ్ల కొబ్బరి నార, బంకమట్టి 600 బ్యాగులు, ఫెవికాల్ 30 లీటర్లు, సబ్బులు 50, నూనె 40 లీటర్లు వినియోగించారు. సెప్టెంబర్ 2: పెయింటింగ్ పనులు ప్రారంభం కాకినాడకు చెందిన భీమేష్ టీం (20 మంది) విగ్రహానికి రంగులద్దే పనులకు శ్రీకారం చుట్టింది. 200 లీటర్ల రంగుల్ని వినియోగించారు. సెప్టెంబర్ 10: నేత్రాలను దిద్దారు 59 అడుగుల ఖైరతాబాద్ త్రిశక్తి మయ మోక్ష గణపతికి గురువారం ఉదయం 6.20 గంటలకు ప్రధాన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేత్రాలను దిద్దారు. మహాగణపతి కంటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు. విగ్రహాన్ని ఏ వైపు నుంచి చూసినా అటువైపు మహా గణపతి చూస్తున్నట్టు ఉండడం ఈ ఏడాది ప్రత్యేకత అని రాజేంద్రన్ అన్నారు. సిద్ధాంతి గౌరీభట్ల విఠల్‌శర్మ నిర్ణయించిన ముహూర్తానికే నేత్రాల ఏర్పాటు కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. విగ్రహ ప్రత్యేకతలివే.. 59 అడుగుల మహా గణపతి విగ్రహం కుడివైపు గజేంద్రమోక్షం ఎడమ వరంగల్ భద్రకాళి అమ్మవారు -
క్రికెటర్ కల్పనకు ACA సన్మానం
-
మేకింగ్ ఆఫ్ 'ఊహలు గుసగుసలాడే'
-
వెళ్లాల్సి వస్తే ...వలసవాది కేసీఆరే వెళ్లాలి