పరిశ్రమలతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ కార్తికేయ మిశ్ర అన్నారు. కొత్తపల్లి మండలం కేఎస్‌ఈజెడ్‌లో ఉన్న పాల్స్‌ప్లస్ (చైనా బొమ్మల తయారీ) కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. యాజమాన్యంలో కంపెనీ విధి వి«ధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్మికుల సమస్యలను అడిగి వారి స్థితిగతులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ట్రైనీ కలెక్టర్ ఆనంద్‌కు ఈ పరిశ్రమ చూపించడం కోసం వచ్చామన్నారు. అనంతరం కలెక్టర్, ట్రైనీ కలెక్టర్ ప్రాంగణంలో మొక్కలను నాటారు. పరిశ్రమ సీఓఓ లాలన్ మిశ్ర మాట్లాడుతూ తయారు చేసిన బొమ్మలను విదేశాల్లో మాత్రమే అమ్మడం జరుగుతుంది. ఒక్క బొమ్మ కూడా ఇండియాలో అమ్మడం జరగదు. తయారు చేసిన ప్రతి ఒక్కరూ చైనా వెళ్లి అక్కడ ట్రాగ్ వేసిన తర్వాత ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఇప్పటి వరకు పది లక్షల అమెరికన్ డాలర్ల విలువ చేసే బొమ్మలను ఎగుమతి జరిగింది. మొత్తం ఈ పరిశ్రమలో 600 కార్మికులు పరిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి పీఎఫ్, ఈఎస్ అమలు చేస్తున్నారు. ప్రతి నెలా తమ బ్యాంక్ ఖాతాలోనికి జీతాలను జమ చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఇటువంటి ప్రాంతాల్లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందన్నారు.
కాకినాడ సిటీ : జిల్లాలో ప్రమాదాలకు ఆస్కారం ఉండే అన్ని పరిశ్రమల్లో పర్యావరణం, కార్మికులు, పరిసర జనావాసాల రక్షణకు చట్టపరంగా నిర్ధేశించిన భద్రతా చర్యలను ఖచ్చిత ప్రమాణాలతో అమలు చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఫ్యాక్టరీస్, ఫిషరీస్, ఫైర్, ఎలక్ట్రికల్ ఇన్స్‌పెక్షన్స్, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలోని ఆక్వా పరిశ్రమలు, ప్రమాదకర రసాయనాలు, వాయువులతో పనిచేసే పరిశ్రమలో రక్షణ, భద్రతా చర్యల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన 10 సంవత్సరాల్లో జిల్లాలో జరిగిన పారిశ్రామిక ప్రమాదాలు, వాటికి కారణాలను విశ్లేషించాలని ఆదేశించారు. ఈ ప్రమాదాలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు చేపట్టవలసిన జాగ్రత్తలు, చట్టప్రకారం పరిశ్రమల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన భద్రతా వ్యవస్థలు, ప్రమాణాలతో చెక్‌లిస్ట్ రూపొందించాలన్నారు. పరిశ్రమల్లో చేపట్టిన భద్రతా చర్యలు, వాటి ప్రమాణాలను ఆయా శాఖల అధికారులు నిశితంగా తనిఖీచేసి, పాటించని యూనిట్లపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇటీవల కొన్ని ఆక్వా పరిశ్రమలలో జరిగిన ప్రమాదాల్లో విద్యుత్ సరఫరా లేనప్పుడు ఏసీలు పనిచేయక కార్మికులు అస్వస్థతకు లోనైనట్లు గుర్తించినందున, అన్ని ఫ్యాక్టరీల్లో ప్లాంట్ రన్నింగ్‌తో పాటు, కార్మికుల రక్షణకు ఏర్పాటు చేసిన ప్రతి సేఫ్టీ వ్యవస్థకు కూడా విద్యుత్ అందించే సామర్ధ్యం ఉన్న జనరేటర్లునే విధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో బాయిలర్‌తో పనిచేస్తున్న సుమారు 416 పరిశ్రమల్లో బాయిలర్‌ల ప్రమాణాలు, ప్రమాద నివారణ, రక్షణ కోసం చేపట్టిన చర్యలను రెగ్యులర్‌గా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. గాలిలోకి ఫ్లైయాష్‌వదులుతూ ప్రజలను ఇబ్బందులకు, ఆరోగ్య సమస్యలకు గురిచేస్తున్న పరిశ్రమలు కాలుష్య నివారణకు ట్రీట్‌మెంట్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివçశంకర్‌రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి ఉదయ్‌కుమార్, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి రాఘవరెడ్డి, ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్, శాంతారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.