Doll
-
పసుపు చీరలో ముద్దబంతిలా మెరిసిపోతున్న కావ్య థాపర్ (ఫొటోలు)
-
అనుపమ్ ఖేర్ బొమ్మ కరెన్సీతో బురిడీ
అహ్మదాబాద్: వీళ్లు అలాంటిలాంటి మోసగాళ్లు కాదు.. దొంగనోట్ల కట్టలు. అవీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మతో ఉన్నవి అక్షరాలా రూ.1.30 కోట్లు..ఓ బడా బంగారం వ్యాపారికి అంటగట్టి ఏకంగా 2.1 కిలోల బంగారంతో ఉడాయించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా వాళ్లు ఓ నకిలీ హవాలా ఆఫీసును సైతం ఏర్పాటు చేసుకున్నారు. మోసం తెలుసుకునేలోపే పత్తా లేకుండా పోయారు. బాలీవుడ్‌ను సైతం తలదన్నే ట్విస్టులున్న ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అహ్మదాబాద్‌కు చెందిన బంగారం వ్యాపారి మెహుల్ ఠక్కర్‌కు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు ప్రశాంత్ పటేల్ అని, స్థానికంగా ఉన్న ఫలానా నగల దుకాణం మేనేజర్‌ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ దుకాణం మెహుల్‌కు తెలిసిందే కావడంతో ఆయన నిజమేననుకున్నాడు. పటేల్ 2.1 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపగా, కొంత బేరసారాల తర్వాత రూ.1.60 కోట్లకు డీల్ కుదిరింది. అతడిచి్చన సమాచారం మేరకు సెప్టెంబర్ 24వ తేదీన ఠక్కర్ తన మనుషులకు 2.1 కిలోల బంగారమిచ్చి పంపించారు. చెప్పిన ప్రకారం వాళ్లు ఓ హవాలా దుకాణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వీరి కోసం ముగ్గురు వ్యక్తులున్నారు. దుకాణంలోని నోట్ల లెక్కింపు మిషన్‌తో తీసుకువచి్చన 26 బండిళ్లలో ఉన్న నోట్లను లెక్కించడం మొదలైంది. తాము రూ.1.30 కోట్లే తెచ్చామని, మిగతా రూ.30 లక్షలు పక్కనే మరో దుకాణం నుంచి తెస్తామంటూ ముగ్గురిలో ఇద్దరు బంగారం బిస్కెట్లను తీసుకుని వెళ్లారు. అయితే, ఆ నోట్లపై మహాత్మా గాం«దీకి బదులు నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉంది. రిజర్వు బ్యాంక్ ఇండియా స్థానంలో తప్పుగా ‘రెసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’అని ఉంది. ఠక్కర్ సిబ్బంది ఇదంతా గమనించి, అనుమానించారు. ఇదేమని, అక్కడే ఉన్న మూడో వ్యక్తిని ప్రశ్నించారు. కౌంటింగ్ మిషన్ తెమ్మంటే తెచ్చానే తప్ప, వారెవరో, ఆ నోట్ల విషయమేంటో నాకూ తెలియదు’అంటూ అతడు చావు కబురు చల్లగా చెప్పాడు. బంగారం బిస్కెట్లతో వెళ్లిన పెద్దమనుషులు తిరిగి రాలేదు. దీంతో, సిబ్బంది ఆ విషయాన్ని ఠక్కర్ చెవిన వేశారు. ఆయన గుండె ఆగినంత పనైంది..! ఇదేమిటని ఆరా తీయగా ఆ హవాలా దుకాణాన్ని రెండు రోజుల క్రితమే ఎవరో తెరిచారని తేలింది. దీంతో, మెహుల్ ఠక్కర్ తననెవరో బకరాను చేశారని గ్రహించి, నవ్‌రంగ్‌పుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
చీరలో కుందనపు బొమ్మలా బిగ్ బాస్ ప్రియాంక సింగ్ (ఫొటోలు)
-
ఆమె అందం అలాంటిది, జవహర్ లాల్ నెహ్రూ కూడా ఆమె స్నేహం కోసం..
అమృత షేర్గిల్. 20వ శతాబ్దపు గొప్ప చిత్రకారిణి. 1941లో 28 ఏళ్ల చిన్న వయసులో మరణించినా ఆమె చిత్రాలు ఇప్పటికీ వార్తలు సృష్టిస్తూనే ఉన్నాయి. అమ్మలక్కల కబుర్లను ‘ది స్టోరీ టెల్లర్’ పేరుతో ఆమె బొమ్మ గీస్తే ఇప్పటివరకూ భారతదేశంలో ఏ చిత్రకారుడికీ పలకనంత వెల– 61.8 కోట్లు పలికింది. ఆ చిత్రం గురించి...ఆ గొప్ప చిత్రకారిణి గురించి. అమృత షేర్గిల్ తన జీవిత కాలంలో 200 లోపు చిత్రాలను గీసింది. అన్నీ కళాఖండాలే. వాటిలో చాలామటుకు ప్రఖ్యాత మ్యూజియమ్‌లలో ఉన్నాయి. కొన్ని మాత్రమే ఆమె చెల్లెలి (ఇందిర) కుమారుడు వివాన్ సుందరం, కుమార్తె నవీనల దగ్గర ఉన్నాయి. 1937లో తను గీసిన ‘ది స్టోరీ టెల్లర్’ చిత్రాన్ని అప్పటి లాహోర్‌లో మొదటిసారి ప్రదర్శనకు పెట్టింది అమృత. అప్పటి నుంచి ఆ చిత్రం చేతులు మారుతూ తాజాగా ఢిల్లీలో జరిగిన వేలంలో 61.8 కోట్లు పలికింది. ఇప్పటివరకూ భారతీయ చిత్రకారుల ఏ పెయింటింగ్‌కూ ఇంత రేటు పలకలేదు. ఆ విధంగా చనిపొయిన ఇన్నాళ్లకు కూడా అమృత రికార్డు స్థాపించ గలిగింది. దీనికంటే ముందు గతంలో సయ్యద్ హైదర్ రజా గీసిన ‘జెస్టెషన్’ అనే చిత్రం 51.75 కోట్లకు పలికి రికార్డు స్థాపించింది. దానిని అమృత బద్దలు కొట్టింది. రూ.61.8 కోట్లు ధర పలికిన ‘ది స్టోరీ టెల్లర్’ చిత్రం గొప్ప చిత్రకారిణి అమృత షేర్గిల్ భారతీయ సిక్కు తండ్రి ఉమ్రావ్ సింగ్‌కి, హంగేరియన్ తల్లి ఎంటొనెట్కు జన్మించింది. బాల్యం నుంచి గొప్ప లావణ్యరాశిగా ఉండేది. ఐదేళ్ల నుంచి బొమ్మలు గీయడం మొదలు పెట్టింది. వీరి కుటుంబం సిమ్లాలో కొంత కాలం ఉన్నా అమృత బొమ్మల్లోని గొప్పదనాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెకు 16 ఏళ్ల వయసున్నప్పుడు పారిస్‌కు తీసుకెళ్లి ఐదేళ్ల పాటు చిత్రకళలో శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత అమృత గొప్ప చిత్రాలు గీస్తూ వెళ్లింది. అవన్నీ కూడా భారతీయ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేవే. ఇప్పుడు అత్యధిక రేటు పలికిన ‘ది స్టోరీ టెల్లర్’– పల్లెల్లో నలుగురు అమ్మలక్కలు కూచుని కబుర్లు చెప్పుకునే సన్నివేశం. ఇది కాకుండా ‘వధువు అలంకరణ’, ‘ఒంటెలు’, ‘యంగ్ బాయ్ విత్ త్రీ యాపిల్స్’, ‘జిప్సీ గర్ల్స్’, ‘యంగ్ గర్ల్స్’ ఆమె ప్రఖ్యాత చిత్రాలు. ఆమె తన సెల్ఫ్ పొర్ట్రయిట్ను కూడా గీసుకుంది. అకాల మరణం అమృత షేర్గిల్ తన హంగేరియన్ కజిన్ విక్టర్‌ను వివాహం చేసుకుంది. వారు లాహోర్‌లో ఉన్న సమయంలో కేవలం 28 ఏళ్ల వయసులో 1941లో మరణించింది. అందుకు కారణం కలుషిత ఆహారంతో వచ్చిన వాంతులు, విరేచనాలు అని చెప్తారు. మరో కారణం ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉందని సంప్రదాయ డాక్టర్‌గా ఉన్న విక్టర్ ఆమెకు రహస్యంగా, అశాస్త్రీయంగా అబార్షన్ చేయబోయాడని, అందువల్ల తీవ్రమైన బ్లీడింగ్ జరిగి మరణించిందని అంటారు. ఆకర్షణాజాలం అమృత షేర్గిల్ ఆ రోజుల్లో సంపన్న వర్గాల్లో గొప్ప ఆకర్షణ కలిగిన వ్యక్తిగా కీర్తి గడించింది. జవహర్లాల్ నెహ్రూ ఆమె స్నేహం కోసం అనేక లేఖలు రాశాడు. ఢిల్లీలో జరిగిన అమృత ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు హాజరయ్యాడు. ‘అమృత ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఉన్నవారందరూ చేష్టలుడిగి ఆమెను చూస్తూ ఉండిపొయేవారు’ అని అనేకమంది రాశారు. ‘ఆమె జీవించి ఉంటే ప్రపంచం మొత్తం ఎన్నదగిన గొప్ప చిత్రకారిణి అయి ఉండేది’ అని ఆర్ట్ క్రిటిక్స్ అంటారు.ఆమె లేదు. కాని ఆమె చిత్రాలు ఆమెను సజీవంగా ఉంచుతూనే ఉన్నాయి. -
ఏఐతో వ్యాపారాల్లో శరవేగంగా మార్పులు
ముంబై: కొత్త తరం జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ఏఐ) టెక్నాలజీలు వ్యాపార స్వరూపాలను శరవేగంగా మార్చేస్తున్నాయి. చాట్‌జీపీటీ నుంచి డాల్–ఈ తదితర సాంకేతికతలు పని ప్రదేశాల్లో చూపే సానుకూల ప్రభావాలపై దేశీయంగా మెజారిటీ కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 18 దేశాల్లో పలు పరిశ్రమలకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు మొదలుకుని ముందు వరుసలో పని చేసే సిబ్బంది వరకూ 12,800 మంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. జెన్ఏఐ రంగం శరవేగంగా మారుతోందని, ప్రపంచవ్యాప్తంగా పని ప్రదేశాల్లో దానికి సంబంధించిన పరివర్తన ప్రభావాలు స్పష్టంగా తెలుస్తున్నాయని బీసీజీ ఎక్స్ (ఏఐ, సాఫ్ట్వేర్ విభాగం) గ్లోబల్ లీడర్ నికొలస్ డి బెల్ఫాండ్స్ తెలిపారు. సర్వేలో పాల్గొన్న దేశాలన్నింటిలోనూ భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు ఏఐ ప్రభావాలపై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు బీసీజీ ఎక్స్ ఇండియా హెడ్ నిపుణ్ కల్రా చెప్పారు. సర్వేలోని ముఖ్యాంశాలు.. ► పని ప్రదేశాల్లో జెన్ఏఐ ప్రభావాలపై బ్రెజిల్ అత్యంత (71%) ఆశావహంగా ఉండగా, భారత్ (60%), మధ్యప్రాచ్యం (58%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అమెరికా (46%), నెదర్లాండ్స్ (44%), జపాన్ (40%) దేశాల్లో అత్యంత తక్కువ స్థాయిలో ఆశావహ భావం నెలకొంది. ► ఏఐ గురించి ఆందోళనగా ఉన్న దేశాల్లో నెదర్లాండ్స్ (42 శాతం), ఫ్రాన్స్ (41 శాతం), జపాన్ (38 శాతం) ఉన్నాయి. పెద్దగా పట్టించుకోని ప్రాంతాల్లో మధ్యప్రాచ్యం (25 శాతం), బ్రెజిల్ (19 శాతం), భారత్ (14 శాతం) ఉన్నాయి. ► పని విషయంలో ఏఐ ప్రభావాలపై 2018లో 35 శాతం మంది సానుకూలంగా ఉండగా ప్రస్తుతం అది 52 శాతానికి చేరింది. ► భారత్ నుంచి సర్వేలో పాల్గొన్న 1,000 మంది ఉద్యోగుల్లో 61 శాతం మంది జెన్ఏఐ సాధనాలపై ఆశావహంగా ఉన్నారు. జెన్ఏఐతో పొంచి ఉన్న రిస్కులతో పోలిస్తే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని 72.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఏఐతో తమ ఉద్యోగ విధుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని దాదాపు 88 శాతం మంది భావించగా, ఏఐకి సంబంధించి నిర్దిష్ట నిబంధనలు అవసరమని 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► సీనియర్ లీడర్లు మరింత తరచుగా జెన్ఏఐని ఉపయోగిస్తున్నారు. మిగతా ఉద్యోగులతో పోలిస్తే మరింత ఆశావహంగా ఉన్నారు. జెన్ఏఐపై వారిలో పెద్దగా ఆందోళన లేదు. 62 శాతం మంది లీడర్లు ఏఐ విషయంలో ఆశావహంగా ఉండగా, ముందు వరుసలో పని చేసే సిబ్బందిలో 42 శాతం మంది మాత్రమే సానుకూలంగా ఉన్నారు. మెజారిటీ లీడర్లు (80 శాతం) మంది తాము జెన్ఏఐ టూల్స్‌ను తరచుగా వినియోగిస్తున్నామని తెలపగా, ఇతర సిబ్బందిలో ఇది కేవలం 20 శాతంగానే ఉంది. ► జెన్ఏఐని తరచుగా ఉపయోగించే వారిలో 62 శాతం మంది దానిపై ఆశావహంగా ఉండగా, నాన్–యూజర్లలో ఇది 36 శాతంగా ఉంది. జెన్ఏఐని ఉపయోగించని వారిలో ఎక్కువగా ఫ్రంట్‌లైన్ సిబ్బందే (60 శాతం) ఉన్నారు. ► ఏఐ వల్ల తమ ఉద్యోగాలు పోతాయని భావిస్తున్నట్లు అంతర్జాతీయంగా 36% మంది తెలపగా, తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని విశ్వసిస్తున్నట్లు 86% మంది అభిప్రాయపడ్డారు. -
ఆస్కార్ నాటునాటుకు తీగల ‘బొమ్మ’ డాన్స్ అదుర్స్! ఆనంద్ మహింద్రా ఫిదా!
-
బొమ్మల కొలువు
పండుగకు బొమ్మలను కొలువుదీర్చడం లేదామె. బొమ్మల తయారీ ‘కొలువు’ను పండగ చేస్తున్నారు. బొమ్మలతో ‘చక్కటి కొలువు’కు మార్గం వేస్తున్నారు. మన బొమ్మల నుంచి మన చేనేతల వరకు... సంప్రదాయ కళల పురోగతికి బాట వేస్తున్నారామె. ‘‘కళకు రాజపోషణ అవసరమే. కానీ కళ జీవించాల్సింది కేవలం దాతల దయాదాక్షిణ్యాల మీద మాత్రమే కాదు. కళ స్వయంసమృద్ధి సాధించాలి. అప్పుడే ఆ కళకు గుర్తింపు, కళాకారులకు గౌరవం లభిస్తాయి’’ అన్నారు చిత్రాసూద్. ఆమె హైదరాబాద్‌లో కార్పొరేట్రంగంలో ఉన్నతస్థాయిలో ఉద్యోగం చేస్తున్నారు. సమాజానికి చేయాలనుకున్న పనులను ఒక సుమహారంగా మలుచుకున్నారు. తన ప్రవృత్తిలో భాగంగా గొల్లభామ చీరలు, బొబ్బిలి నేత, ఇకత్ లక్ష వత్తుల చీర వంటి తెలుగు వారి సిగ్నేచర్ వీవింగ్‌కు సహజ రంగులను మేళవిస్తున్నారు. కొండపల్లి బొమ్మల కళాకారులు వృత్తిని వదిలి ఇతర ఉపాధి మార్గాల వైపు మరలుతున్న పరిస్థితిని గమనించి ఆ కళను పరిరక్షించే పనిలో పడ్డారామె. ఆ వివరాలతోపాటు తాను ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రభావితం చేసిన పరిస్థితులను సాక్షితో పంచుకున్నారు చిత్రాసూద్. తమిళనాడు నుంచి తెలంగాణకు ‘‘మా పూర్వికులది పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి. అమ్మవైపు విశాఖపట్నం. ఇరువైపుల కుటుంబాలూ తమిళనాడులో స్థిరపడ్డాయి. నాన్న కుటుంబం చెన్నైలో, అమ్మ వాళ్లు మధురైలో. అలా నేను పుట్టిన ప్రదేశం మధురై, పెరిగింది చెన్నై. నా చిన్నప్పుడే నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కి వచ్చేశాం. ఆ తర్వాత స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్థిరపడ్డారు. అలా నా చదువు సింగరేణిలో, పాల్వంచలో సాగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... నేను నా బాల్యంలోనే నాగరక భారతాన్ని, గ్రామీణ భారతాన్ని దగ్గరగా చూడగలిగాను. అప్పట్లో తలెత్తిన అనేక సందేహాలే ఇప్పుడు నేను చేస్తున్న పనుల కారకాలు. గ్రామీణ మహిళలు, పిల్లల్లో చైతన్యం లేకపోవడం, చదువు లేకపోవడం, అవకాశాలు లేకపోవడం అప్పట్లో నాలో ఆలోచనను రేకెత్తించేవి, కానీ వాటిని ఎలా పరిష్కరించాలో తెలియదు. అలాగే నా తొలి ఉద్యోగంలో నేను చూసిన పరిస్థితులు కూడా ఆందోళనకరమైనవే. అది హైదరాబాద్ శివారులో ఉన్న కెమికల్ ఇండస్ట్రీ. ఆ జిలెటిన్ తయారీ పరిశ్రమలో ఏడెనిమిదేళ్ల పిల్లలు పని చేసేవాళ్లు. పొడులను జల్లెడ పట్టడం వంటి పనిని ఆటలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్లు. తామెంత విపత్కరమైన పని చేస్తున్నారనేది తెలియని అమాయకత్వం వారిది. నా చదువు నా ఉన్నతికి మాత్రమే పరిమితం కాకూడదు, ఇంకా ఏదైనా చేయాలని గట్టిగా అనిపించిన సందర్భం కూడా అదే. నాలో అస్పష్టంగా ఉన్న ఆలోచనలకు ఒక రూపాన్ని ఇవ్వడం పదేళ్ల కిందట మొదలైంది. చదువులో రాణిస్తూ ఉన్నత చదువులకు కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించని విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడంతో సమాజానికి మా వంతు చారిటీ మొదలు పెట్టాం. ఆ టాస్క్‌లో మా హస్బెండ్ అనిల్ సూద్ సహకరిస్తున్నారు. చేనేతల్లో నాచురల్ కలర్స్ వాడకం, కొండపల్లి బొమ్మల కళ పరిరక్షణలో ‘అభిహార’ సంస్థ నిర్వాహకురాలు చిత్ర అనుభవాన్ని కలుపుకుని ముందుకుపోతున్నాను. కళలో సామాజిక మార్పు! ఏ కళలనైనా దాతల సహకారంతో ఎంతకాలమని పరిరక్షించగలం? కళ తనకు తానుగా స్వయంసమృద్ధి సాధించాలి. అప్పుడే కళకు, కళాకారులకు గౌరవం. అందుకే మహిళలకు శిక్షణ ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇవ్వడంతోపాటు మార్కెట్ సౌలభ్యత కోసం పని చేస్తున్నాను. కొండపల్లిలో ఉండే మహిళలను తీసుకువచ్చి హైదరాబాద్‌లోని సప్తపర్ణిలో ఎగ్జిబిషన్ పెట్టించడంలో నా ఉద్దేశాలు రెండు నెరవేరాయి. ఒకటి గ్రామీణ మహిళలకు తమ బొమ్మలకు ప్రపంచంలో ఉన్న ఆదరణ ఎలాంటిదో తెలియాలి, అలాగే కొనేవాళ్లు ఏం కోరుకుంటున్నారో అర్థం కావాలి. అలాగే ఒక అద్భుతమైన కళను సంపన్నుల లోగిళ్లను చేరగలిగితే ఆ కళకు రాజపోషణకు దారి వేసినట్లే. ఈ రెండూ సాధ్యమయ్యాయి. ఎప్పుడూ చేసే దశావతారాలు, ఎడ్లబండ్ల నుంచి కళాకారుల నైపుణ్యాన్ని టేబుల్ టాప్స్, మొబైల్ ఫోన్ స్టాండ్ వంటి రోజువారీ వాడుక వస్తువుల తయారీకి విస్తరించగలిగాం. అలాగే ఒక కళ ఆవిర్భవించినప్పుడు అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఒక రూపం సంతరించుకుని ఉంటుంది. ఆ రూపాలను కాలానుగుణంగా మార్చుకోవాలి. అందుకే కళను ధార్మికత పరిధి నుంచి సామాజిక పరిధికి విస్తరించాల్సిన అవసరాన్ని నేర్పిస్తున్నాం. ఈ బొమ్మలను లాంకో కంపెనీ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వ హస్తకళాకృతుల సంస్థలు లేపాక్షి, గోల్కొండలు పెద్ద ఆర్డర్లతో ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడ నేను నమ్మే సిద్ధాంతం ఏమిటంటే... కళను పరిరక్షించడం అనేది పెద్దమాట. కళ ద్వారా ఉపాధి పొందడం ప్రధానం. అప్పుడే కళ కలకాలం నిలుస్తుంది, కళాకారులు తమ ఉనికిని గర్వంగా చాటుకోగలుగుతారు. నా సర్వీస్‌తో ఎన్ని కుటుంబాలు, ఎన్ని కళారూపాలు స్వయంసమృద్ధి సాధించాయనేది నాకు మిగిలే సంతృప్తి’’ అన్నారు చిత్రాసూద్. వృత్తులకు, కళలకు ఇల్లే యూనివర్సిటీగా ఉండేది. పుస్తకం–కలం లేకుండానే విస్తృతమైన జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అయ్యేది. కాలం మారింది, ప్రపంచీకరణ మన సంప్రదాయ వృత్తులను కాలగర్భంలో కలిపేస్తున్న తరుణంలో మన కళల జ్ఞానాన్ని గ్రంథస్థం చేయాల్సిన అవసరం ఉంది. దానికి శాస్త్రబద్ధత కల్పించాల్సిన అవసరం వచ్చింది. ఈ సైన్స్ ఏ పుస్తకంలోనూ లేదు! కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రానికి అనుబంధంగా సహజ రంగుల తయారీ పరిశ్రమను కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సొరకాయ ఆకులతో చెక్కకు రంగు అద్దవచ్చని ఇంతవరకు ఏ పుస్తకమూ చెప్పలేదు. కొండపల్లి బొమ్మల కళాకారులకు మాత్రమే తెలిసిన సైన్స్ అది. ఇక చేనేతల్లో గొల్లభామ, బొబ్బిలి, ఇకత్ చీరల్లలోనూ నేచురల్ కలర్స్ ప్రయోగం మొదలైంది. ఈ రంగాల్లో ఉన్న జ్ఞానాన్ని నిక్షిప్తం చేయడం కూడా మా తదుపరి ప్రాజెక్టుల్లో ఒకటి. భూమండలాన్ని ప్రమాదం అంచుల్లోకి నెట్టివేస్తున్న కారకాల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ కాలుష్యం ప్రధానమైనది. అందుకే మనవంతుగా కొన్ని అడుగులు వేయగలిగితే, మరికొందరి చేత వేయించగలిగితే... ఆ తర్వాత ఈ నేచర్ మూవ్మెంట్ దానంతట అదే ముందుకు సాగుతుంది. – చిత్రాసూద్, యాక్టివిస్ట్, రివైవల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కో – ఫౌండర్, అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ చాయిసెస్ ‘మహిళ’ శ్రమ చర్చకే రాదు! మహిళ స్థితిగతులు మారాలంటే ఆర్థిక స్వావలంబన సాధించాలనేది జగమెరిగిన సత్యం. మన వ్యవస్థలన్నింటిలోనూ మహిళలను సహాయక పనులకే పరిమితం చేయడంతో వారి శ్రమ గుర్తింపునకు నోచుకోవడం లేదు. మహిళలకు కూడా ఆర్టిజన్ కార్డ్ ఇప్పించడానికి పని చేస్తున్నాను. అలాగే వేతనపెంపు విషయంలో మహిళల పని గురించి చర్చ కూడా ఉండడం లేదు. ఎంతగా శ్రమించినప్పటికీ మహిళకు గుర్తింపు ఉండదు, ఆదాయం తక్కువ. ఈ పరిస్థితిని మార్చడానికి ‘అభిహార’ అనే వేదిక ద్వారా పని చేస్తున్నాను. కొండపల్లి బొమ్మలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి సహకారం అందిస్తోంది. ఏపీ ప్రాథమిక పాఠశాలల్లో బోధన పరికరాలు కొండపల్లి కళాకృతులే. నేను హార్టికల్చర్ విద్యార్థిని కావడంతో నాకు తెలిసిన సైన్స్‌ని హస్తకళల రంగానికి మేళవిస్తున్నాను. హస్తకళల రంగంలో విశేషమైన కృషి చేస్తున్న ఉజ్రమ్మ, సురయ్యా హసన్బోస్, జగదరాజప్పలు నాకు గురువులు. నా ఆకాంక్షలు, చిత్ర ఆలోచనలు ఒకే తీరుగా సాగడంతో మా ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. – సుధారాణి ముళ్లపూడి, సీఈవో, అభిహార సోషల్ ఎంటర్ప్రైజ్ – వాకా మంజులారెడ్డి -
కదల్లేని స్థితిలో మహిళ.. డోర్ పగలగొట్టి వెళ్లిన పోలీసులు షాక్..!
లండన్: ఓ మహిళ కుర్చీలో కూర్చొని టేబుల్‌పై తలెపెట్టి రెండు గంటలుగా అపస్మారక స్థితిలో ఉంది. రోడ్డుపై వెళ్లే ఓ వ్యక్తి ఆమెను గమనించి వెంటనే పోలీసులకు సమచారం అందించాడు. దీంతో హుటాహుటిన అక్కడకు వెళ్లిన పోలీసులు ఆ మహిళను కాపాడేందుకు డోర్లు పగలగొట్టారు. దగ్గరకు వెళ్లి ఆమెను చూశాక షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె మహిళ కాదు.. ఓ కళాకారుడు చెక్కిన శిల్పం. అసలు విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. ఆర్ట్ గ్యాలరీలో ఉన్న ఆ బొమ్మ అచ్చం నిజమైన మహిళ లాగానే ఉండటం చూసి నమ్మలేకపోయారు. పసుపు రంగు స్వెటర్, నల్ల రంగు ప్యాంటు వేసుకున్న ఈ బొమ్మను చూస్తే ఎవరైనా నిజంగా మహిళే అనుకుంటారు. లండన్ సోహోలోని లాజ్ ఎంపోరియం ఆర్ట్ గ్యాలరీలో భద్రపరిచిన ఈ శిల్పాన్ని అమెరికాకు చెందిన ఓ శిల్పి చెక్కాడు. ప్యాకింగ్ టేప్, ఫోమ్‌ను ఉపయోగించి ఈ బొమ్మను తీర్చిదిద్దాడు. గ్యాలరీ ఓనర్ స్టీవ్ లాజారైడ్స్ దీన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఈ బొమ్మకు క్రిస్టినా అనే పేరు కూడా పెట్టారు. అయితే నవంబర్ 25న ఎంపోరియంలో పనిచేసే మహిళ గ్యాలరీకి తాళం వేసి టీ పెట్టుకునేందుకు పైకి వెళ్లింది. ఈ సమయంలోనే ఓ వ్యక్తి బొమ్మను చూసి అమ్మాయి అనుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వాళ్లు వచ్చి డోర్‌ను పగలగొట్టారు. టీ కోసం పైకి వెళ్లిన మహిళ.. శబ్దాలు విని కిందకు వచ్చింది. పోలీసులను చూసి అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక షాక్ అయింది. గతంలోనూ ఓసారి ఈ బొమ్మను చూసి నిజమైన మహిళ అనుకుని వైద్య విద్యార్థులు సాయం చేసేందుకు ప్రయత్నించారు. తీరా అది శిల్పం అని తెలిసి నవ్వుకున్నారు. చదవండి: 165 ఏళ్లనాటి జీన్స్.. జస్ట్ రూ.94 లక్షలే -
కొత్తరాతి యుగానికి చెందిన మట్టిబొమ్మ
సాక్షి, హైదరాబాద్: కొత్త రాతి యుగానికి చెందిన అరుదైన మట్టిబొమ్మ సిద్దిపేటలో దొరికింది. నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామ శివారు పాటిగడ్డలో కొలిపాక శ్రీనివాస్ ఈ బొమ్మను గుర్తించారు. ఆదిమానవులకు సంబంధించిన అనేక ఆధారాలను అందించిన నర్మెట్టలోనే ఇదీ దొరకటం విశేషం. క్రీ.పూ.6500 నుంచి క్రీ.పూ.1800 మధ్య కాలానికి చెందినదిగా భావిస్తున్న ఈ మట్టి బొమ్మ కొంతమేర విరిగి ఉంది. 6సెం.మీ. పొడవున్న ఈ బొమ్మకు ఎంతో ప్రాధాన్యం ఉందని అంతర్జాతీయ పురావస్తు పరిశోధకులు కర్ణాటకకు చెందిన రవి కొరిసెట్టర్ చెప్పారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కనీ్వనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న మెహర్‌ఘర్ ప్రాంతంలో గతంలో జరిపిన తవ్వకాల్లో దొరికిన బొమ్మలను ఇది పోలి ఉందన్నారు. నంగునూరు–నర్మెట్ట మధ్య 6కి.మీ. పరిధిలో ఆదిమానవుల మనుగడను రూఢీ చేసే ఆధారాలు విస్తారంగా వెలుగు చూస్తున్నాయని, ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. చదవండి: వచ్చేస్తున్నాయ్.. కల్యాణ ఘడియలు -
ప్రెగ్నెంట్ అంటూ... ప్లాస్టిక్ బొమ్మతో షాకిచ్చిన మహిళ!
దంపతులకు పిల్లలు లేకపోతే పడే బాధ అంతా ఇంతా కాదు. నలుగురిలోనూ ఇబ్బందిగా ఉండి ఎక్కడికి వెళ్లలేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అచ్చం అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న ఒక మహిళ ఆ బాధ నుంచి తప్పించుకునే క్రమంలో ఆడిన నాటకమే ఆమెను పట్టుబడేలా చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...40 ఏళ్ల మాహిళ పెళ్లై 18 ఏళ్లు అయినా పిల్లలు లేరు. చుట్టుపక్కల సూటిపోటీ మాటలకు బాధపడి తాను ప్రెగ్నెంట్ అని నాటకం ఆడింది. ఈ మేరకు ఆమె ప్రతి నెల స్థానిక ఆస్పత్రిలో చెకప్ చేయించుకునేందుకు వెళ్తుండేది. ఆ తర్వాత ఒకరోజు కడుపులో నొప్పిగా ఉందంటూ చెప్పి హడావిడి చేసి...నెలలు నిండకుండా బిడ్డ పుట్టిందంటూ ఒక ప్లాస్టిక్ బొమ్మను చూపించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ బిడ్డను ఒక గుడ్డలో చుట్టి చెకప్ కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఉన్న వైద్యులు చెక్ చేసి ఇది బిడ్డ కాదని ఒక ప్లాస్టిక్ బొమ్మ అని తేల్చి చెప్పారు. అంతేకాదు వైద్యులు ఆమె హెల్త్ రిపోర్టులు తీసుకురమ్మని కుటుంబ సభ్యులకు చెప్పారు. వైద్యులు తీసుకువచ్చిన ఆ ఎక్స్‌రే రిపోర్టులన్ని నకిలీవని తేల్చారు. ఆమె ప్రతినెల చెకప్‌కి వెళ్తున్న ఆస్పత్రిని సైతం విచారించగా.....ఆమె కడుపులో ఇన్ఫక్షన్ ఉందంటూ ఆస్పత్రికి వచ్చేదని, ఆమె గర్భవతి కాదని చెప్పారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. పెళ్లి అయ్యి చాలా ఏళ్లైన పిల్లలు లేరంటూ తిడుతుంటే తట్టుకోలేక ఇలా కట్టుకథ అల్లానని చెప్పుకొచ్చింది సదరు మహిళ. (చదవండి: నిందితుడు అరెస్టు కాకూడదని..కారుతో సెక్యూరిటీ గార్డుని ఢీ కొట్టి...) -
48 ఏళ్లుగా.. అంతుచిక్కని ‘దెయ్యపు’ బొమ్మ!!
ఒక బొమ్మ.. దానిని ఇష్టపడే వ్యక్తులు. కానీ, అన్యాయంగా చనిపోయిన ఓ వ్యక్తి ఆత్మ అందులో దూరి.. అందరికీ వణుకు పుట్టిస్తూ ఉంటుంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా.. అన్ని భాషల్లో ఈ స్టోరీ లైన్‌తో బొమ్మల్ని బేస్ చేసుకుని బోలెడన్ని సినిమాలు వచ్చాయి. అయితే నిజజీవితంలోనూ అమ్మో బొమ్మ తరహా కథలు ప్రచారంలో ఉండడం మీరెప్పుడైనా విన్నారా? రాబర్ట్.. హాంటెడ్ డాల్. అలా ఇలా కాదు.. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన బొమ్మ అదట. 1994 నుంచి యూఎస్ స్టేట్ ఫ్లోరిడా కీ వెస్ట్‌లోని ఫోర్ట్ ఈస్ట్ మార్టెల్లో మ్యూజియంలో అది ఉంటోంది. ఒక చిన్నారికి నావికుడి గెటప్ వేసినట్లు ఉండే ఆ బొమ్మ.. చేతిలో మరో బొమ్మను పట్టుకున్నట్లు ఉంటుంది. అయితే ఈ బొమ్మ వల్లే ఎన్నో అనర్థాలు జరిగాయనే ప్రచారం.. ఇదొక దెయ్యం బొమ్మనే ముద్రను వేశాయి. 1904 సంవత్సరంలో కీ వెస్ట్‌కి చెందిన రాబర్ట్ ఎయుజెనె ఒట్టో అనే చిన్నారికి బర్త్‌డే గిఫ్ట్‌గా.. అతని తాత జర్మనీ నుంచి తీసుకొచ్చి మరీ ఈ బొమ్మను కానుకగా తీసుకొచ్చాడు. రాబర్ట్ ఆ బొమ్మను ఎంతగా ప్రేమించాడంటే.. దానికి కూడా తన పేరే పెట్టుకున్నాడు. పెద్దయ్యాక కూడా దాన్ని అతను వదల్లేదట. చివరికి ప్రాణం పోయే సమయంలోనూ ఆయన హత్తుకుని పడుకున్నాడని ఆ బొమ్మ హిస్టరీ నోట్లో పేర్కొని ఉంటుంది. అయితే.. 118 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ బొమ్మ ఆ తర్వాత వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లింది. కానీ.. రాబర్ట్ బొమ్మ వేరే వాళ్ల పర్యవేక్షణలో ఉన్నప్పుడు.. ఏదో ఒక అపశ్రుతి జరిగేదన్న వాదన ఒకటి ఉంది. ప్రమాదాలు జరగడం, గాయాలు, ఎముకలు విరిగిపోవడాలు, విడాకులు.. ఇలా ఏదో ఒక చెడు జరిగేదన్న నమ్మకం ముద్రపడిపోయింది. 1974లో రాబర్ట్ ఒట్టో కన్నుమూశాడు. రెండేళ్ల తర్వాత అతని భార్య సైతం చనిపోయింది. ఆ తర్వాత కీవెస్ట్ ఈయేటన్ స్ట్రీట్‌లోని వాళ్ల ఇంట్లో ఆ బొమ్మ అలాగే ఉండిపోయింది. మైర్టెల్ రూటర్ అనే వ్యక్తి 20 ఏళ్ల పాటు ఆ ఇంటిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఆపై మరొకరికి దానిని అమ్మేయగా.. ప్రస్తుతం ఆ ఇంటిని ఓ గెస్ట్ హౌజ్‌గా మార్చేశారు. అయితే.. ఇన్నేళ్లలో ఆ ఇంట్లో ఉన్న బొమ్మ.. జనాలకు చుక్కలు చూపించిందట. ఇన్నేళ్లలో ఆ ఇంట్లో ఉన్న బొమ్మ.. జనాలకు చుక్కలు చూపించిందట. రాబర్ట్ మరణం తర్వాతే ఈ అనుభవాలు ఎదురయ్యాయని చాలా మంది అంటున్నారు. అదీ దానిని సరిగ్గా పట్టించుకోని తరుణంలోనేనట. దీంతో దానికి అతీత శక్తులు ఉన్నాయని, దాని వల్ల ఏదో ఒక అనర్థం జరిగేదన్న నమ్మకం బలంగా స్థిరపడింది స్థానికుల్లో. దీంతో 1994లో ఆ బొమ్మను భద్రంగా ఉంచేందుకు కీ వెస్ట్‌లో ఉన్న మ్యూజియానికి అప్పజెప్పారు. అప్పటి నుంచి అదొక టూరిస్ట్ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. అయితే అక్టోబర్‌లో మాత్రం దీనికి ఓల్డ్ పోస్టాఫీస్‌కు తరలిస్తుంటారు ఎందుకనో!. రకరకాల కథలు.. రాబర్ట్ బొమ్మ గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. దానిలో ఏదో శక్తి దాగి ఉందని, అప్పుడప్పుడు ముఖకవళికలు మారుస్తుందని, ఒక్కోసారి విచిత్రమైన శబ్దాలు చేస్తుందని కొందరు చెప్తుంటారు. అంతేకాదు.. గతంలో అది మాయమై .. మరొచోట ప్రత్యక్షమైన సందర్భాలు కూడా ఉన్నాయట. ఏదేమైనా ఆ బొమ్మకు మంచి స్థానం కల్పించకపోతే కోపం వచ్చి ఏదో ఒక చెడు చేస్తుందనే నమ్మకం బలంగా ముద్రపడడంతో.. ఇప్పటికీ దానిని భద్రంగా చూసుకుంటున్నారు. ఈ బొమ్మ కథను ఆసరాగా చేసుకునే రాబర్ట్ సిరీస్‌లో నాలుగు సినిమాలొచ్చాయి కూడా. అలా ఓ సాధారణ బొమ్మ.. దెయ్యపు బొమ్మగా మ్యూజియంలో సకల మర్యాదలు అందుకుంటోంది. -
సరికొత్తగా రానున్న 'స్క్విడ్ గేమ్ 2'.. మరబొమ్మకు బాయ్‌ఫ్రెండ్ అట..
Squid Game Season 2 Official Announcement And Doll Has Boyfriend: ప్రముఖ కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' వినడానికి చిన్న పిల్లల ఆటల ఉన్నా చూసే ఆడియెన్స్‌ను ప్రతిక్షణం థ్రిల్లింగ్‌కు గురిచేసింది. సెప్టెంబర్ 17, 2021న ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై నెంబర్ వన్ సిరీస్‌గా నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే రికార్డు సాధించింది. రిలీజైన 28 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. కొరియన్ భాషలో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు సుమారు 900 మిలియన్ డాలర్లు లాభం వచ్చినట్లు సమాచారం. మొత్తం 8 గంటల 12 నిమిషాలు ఉండే ఈ సిరీస్‌లో 9 ఎపిసోడ్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సిరీస్‌కు రెండో సీజన్ వస్తున్నట్లుగా డైరెక్టర్ హ్వాంగ్ డాంగ్ హ్యూక్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో రౌండ్స్ మరింత కొత్తగా, ప్రతిక్షణం ఉత్కంఠకు గురిచేసేలా ఉండన్నున్నట్లు తెలిపారు. 'గతేడాది స్క్విడ్ గేమ్‌కు ప్రాణం పోసి ఓ సిరీస్ రూపంలో ఒకటో సీజన్‌గా తీసుకురావడానికి 12 ఏళ్లు పట్టింది. కానీ మోస్ట్ పాపులర్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌గా అవతరించేందుకు 12 రోజులు మాత్రమే పట్టింది. స్క్విడ్ గేమ్‌ను ఇంతగా ఆదరించి ఘన విజయాన్ని అందించిన వరల్డ్‌వైడ్‌గా ఉన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇక ఇప్పుడు జీ-హన్ రిటర్న్స్.. ది ఫ్రంట్ మ్యాన్ రిటర్న్స్.. సీజన్-2 వచ్చేస్తోంది. ఆ సూట్ ధరించి మేమ్ ప్రారంభించేందుకు డీడాగ్జి మళ్లీ తిరిగి రావొచ్చు. ఈసారి యంగ్ హీ (మరబొమ్మ)కి బాయ్‌ఫ్రెండ్‌గా 'కియోల్-సు' రానున్నాడు.' అని డైరెక్టర్ తెలిపారు. Hwang Dong-Hyuk writer, director, producer, and creator of @squidgame has a message for the fans: pic.twitter.com/DxF0AS5tMM — Netflix (@netflix) June 12, 2022 అయితే ఇందులో ఉన్న మరబొమ్మ (రోబోట్)కు బాయ్‌ఫ్రెండ్ ఉండటం అనే విషయంపై నెటిజన్స్ ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. 'ఈ బొమ్మకు (రోబోట్) కూడా బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా ? నమ్మలేకపోతున్నాను. నేను ఇంకా సింగిల్‌గానే ఉన్నా' అంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ రెండో సీజన్ ఎప్పుడు వస్తుందనేది ఇంకా వెల్లడించలేదు. Red light… GREENLIGHT! Squid Game is officially coming back for Season 2! pic.twitter.com/4usO2Zld39 — Netflix (@netflix) June 12, 2022 how come the doll in squid game has a boyfriend but im single https://t.co/ST4RFRhv77 — xin 🌱 FL!P that (@nagumowife) June 12, 2022 the squid games doll has a boyfriend & some of you guys are still single lol just saying https://t.co/gzJg971Swa — brooke (@brookeab) June 12, 2022 now??? imagine the squid game robot got a boo and ur still single 😭 https://t.co/jlA69DdFDc — jimin connoisseur ⁷ (@sunflowrmemory) June 12, 2022 Girlie got a boyfriend~ 💃🏽 pic.twitter.com/BNsyn4dGv7 — shera || (@ddiddirere) June 12, 2022 -
పగటి పూట బొమ్మ.. రాత్రి కాగానే ‘దెయ్యం’లా హైవేపై..
దెయ్యం కథలు.. నమ్మకం ఉన్నా.. ‘ఛస్’ అని ఛీదరించుకున్నా వీటి గురించి ఆసక్తి కలగక మానదు. ఎందుకంటే ఆ కథల్లోని నేరేషన్ అలా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చెప్పుకోబోయే యూకే ‘బెట్టీ బైపాస్’ కొంత క్యూరియాసిటీని రేకెత్తించడం ఖాయం!. ఎందుకంటే ఈ దెయ్యం ఈమధ్యే పదేళ్లు పూర్తి చేసుకుంది కాబట్టి!. బర్మింగ్హమ్-వోర్‌సెయిస్టర్ సరిహద్దు. హైవే కావడంతో వాహనాల రద్దీ ఎక్కువే!. చెక్‌పోస్ట్‌కి దగ్గర్లో ఒక శాండ్విచ్ ట్రక్ ఉంటుంది. ఆ నిర్వాహకులు ఏర్పాటు చేసిన బెంచ్ మీద కనిపించే ఒక రూపాన్ని చూసి ఎవరైనా వణికిపోతుంటారు. కారణం.. గత పదేళ్లుగా ఆ రూపం అక్కడక్కడే తిరుగుతోంది. ఆ రూపం పేరు ‘బెట్టీ’.. పక్కనే పిల్లల్ని వేసుకుని తిరిగే ఓ వీల్ ఊయల కూడా ఉంటుంది. పగలు బెంచ్ మీద కనిపించే ఆ రూపం.. రాత్రిపూట దెయ్యంగా మారుతుందనే ప్రచారం నడుస్తుంది. అందుకే ఈ దారికి కూడా ‘బెట్టీ బైపాస్’ అని పేరొచ్చింది. బిడ్డను కోల్పోయిన ఆ తల్లి దెయ్యంగా మారి.. అలా హైవేపై తిరుగుతోందని, ఎవరో ఆమెను యాక్సిడెంట్ చేసి చంపేశారని, కాదు కాదు.. ఆమె భర్తే ఆమెను చంపేశాడని.. ఇలా రకరకాల ప్రచారాలు వినిపిస్తుంటాయి. బెట్టీ మీద సింపథీ ఉన్నా.. దెయ్యం అనే ఊహ మాత్రం చాలామందిని వణికించేది. దీంతో ఈ మిస్టరీని చేధించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా.. ఆ ఘోస్ట్ లేడీ వ్యవహారాన్ని ఎవరూ తేల్చలేకపోయారు. ఈలోపు ఆ నోటా ఈ నోటా పాకి ఈ దెయ్యం కథ.. దెయ్యాల మీద అన్వేషణ చేసే వాళ్లకు, అంతర్జాతీయ మీడియా హౌజ్ దృష్టికి చేరింది. ఎవరికి వాళ్లు ఈ మిస్టరీని చేధించాలని ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో పగలబడి నవ్వుకున్నారు. కారణం.. అదొక ప్రాక్టికల్ జోక్ కాబట్టి! బెట్టీ ఒక షోకేజ్ బొమ్మ. దానిని అక్కడ తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి పేరు నిక్ హజ్బెండ్. ఆయన ఆ శాండ్విచ్ ట్రక్ యజమాని. ఓ ఛారిటీ షాప్ నుంచి ఆ షోకేజ్ బొమ్మను కొనుక్కొచ్చి.. దానికి బెట్టీ అనే పేరు పెట్టి రోజూ దానిని రకరకాల యాంగిల్స్‌లో అక్కడి బెంచ్‌ల మీద కూర్చోబెడుతున్నాడు. అలా పదేళ్లు గడిచిపోయింది. ఈలోపు హైవే మీద వెళ్లే చాలామంది.. ప్రత్యేకించి రాత్రిళ్లు ఆ బొమ్మను చూసి వణికిపోయేవాళ్లట. పైగా అది అక్కడక్కడే ఉండడం, నిక్ చెప్పిన కల్పిత కథలతో అదొక దెయ్యం అని బలంగా ఫిక్స్ అయిపోయారు. అలా బెట్టీ కథ చుట్టుపక్కల పాకేసింది. పాపం అనుకున్నారట.. ప్రాక్టికల్ జోక్స్‌తో ఇంట్లో వాళ్లను ఫూల్స్ చేసే నిక్.. జనాలందరినీ భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేశాడు. అయితే పగటిపూట ఆ ఫుడ్ ట్రక్ దగ్గర ఆగిన కొందరు.. బెట్టీ గురించి అడిగినప్పుడు వాళ్లకు రకరకాల కథలు చెప్పేవాడు. ఆమె భర్త చేతిలో మోసపోయినా ఒక అనాథ అని, అందుకే బిడ్డతో అక్కడ అలా కూర్చుంటుందని(సజీవంగా ఉందని నమ్మించాడు కూడా!) చెప్పడంతో చాలామంది ‘పాపం’ అని సాయం చేసేందుకు ముందుకు వచ్చేవాళ్లట. తీరా అదొక బొమ్మ అని తెలిశాక నిక్‌ను తిట్టుకుంటూ.. సరదాగా ఫొటోలు తీసుకుని వెళ్లిపోయేవాళ్లట. కొన్నాళ్ల తర్వాత నిక్, ఆ ప్రమ్(తిప్పే ఊయల)ని మాయం చేయడంతో బిడ్డ గురించి ఆరా తీసేవాళ్లట. వాళ్లకు ఆ బిడ్డ పెరిగి.. స్కూల్‌కు వెళ్తోందని చెప్పేవాడట. ఇలా జనాలందరికీ ఒక్కో రకమైన కథ చెప్పి బురిడీ కొట్టించేవాడు ఆ ట్రక్కు యజమాని. ఒకానొక టైంలో కౌన్సిల్ ఆఫీసర్లు సైతం ఆ అనాథ మహిళకు సాయం చేయాలని ముందుకొచ్చారట. కానీ, అదొక బొమ్మ అని తెలిశాక.. నిక్కు వార్నింగ్ఇచ్చి మరీ బెట్టీతో ఫొటోలు దిగి వెళ్లిపోయారట. మొత్తానికి బెట్టీ తన కుటుంబంలో ఒక భాగం అయ్యిందని, ఆ బొమ్మకు చేసిన 20 పౌండ్ల ఖర్చు తన వ్యాపారానికి ఎంతో సాయం ఇప్పుడు చేస్తోందని సంతోషపడుతున్నాడు నిక్. మొత్తానికి పదేళ్లపాటు జనాలను బురిడీ కొట్టించాడు ఈ పెద్దాయన. -
అయ్! బాబోయ్!.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది కదరా!
మన స్నేహితులు లేక మన బంధువులో మనల్ని భయపెట్టేలే చేసే పనులు ఒక్కోసారి మనల్ని చాలా భయభ్రాంతులకు గురిచేస్తాయి. పైగా ఆ సంఘటన నుంచి మనకు తేరుకోవడానికి కూడా చాలా టైమ్ పడుతుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తన స్నేహితుడినిఅచ్చం బొమ్మలా ప్రాంక్ చేసి భయాందోళనకు గురిచేశాడు. (చదవండి: జీతం అడిగితే... సారీ అంటూ ఎర్ర జెండా చూపిస్తున్నాడు...) అసలు విషయంలోకెళ్లితే...పాల్కీన్ అనే వ్యక్తి తన స్నేహితుడు పాల్ వుడ్‌ని ఆటపట్టించాలనే ఉద్దేశంతో బొమ్మ మాదిరిగా దుస్తులు ధరించి ఒక గదిలో మూలన ఉన్న బొమ్మల మధ్య దాక్కొని ఉంటాడు. ఆ తర్వాత కాసేపటికి అతని స్నేహితుడు పాల్వుడ్ ఆ గదిలోకి వచ్చి మూలన పడి ఉన్న బొమ్మను తరలించే నిమిత్తం ఒక్కో బొమ్మను ఎత్తకుంటాడు. అంతే పాల్వుడ్ క్లీన్‌ని తాకిన వెంటనే వుడ్‌ని భయపెట్టేలా క్లీన్ లేచి నుంచుంటాడు. దీంతో వుడ్ ఒక్కసారిగా భయపడి కింద పడిపోతాడు. పైగా తాను చాలాసేపు ఇలా పడుకుని ఉన్నానంటూ క్లీన్ చెప్పుకొస్తాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో గత ఏప్రిల్‌లో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ తాజాగా ఆ వీడియో మళ్లీ నెట్టింట తెగ సందడి చేస్తోంది. దీంతో నెటిజన్లు ‘ఆ వ్యక్తికి గుండె ఆగినంత పనైంది కదరా! తమాషాలకు కూడా అద్దూ అదుపు ఉండాలి. నీ ప్రాంక్ తగలెయ్య’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో దోస్తాన్లో ఇవన్నీ కామన్ అని కొట్టిపడేస్తున్నారు. వీడియో చూసి ఎంజాయ్ చేశామని అంటున్నారు. (చదవండి: ప్రపంచంలో ఇంత మంచివాళ్లు కూడా ఉంటారా...!) View this post on Instagram A post shared by YouTube (@youtube) -
బొమ్మతో పెళ్లి: అమ్మాయిల కంటే బెటర్ అంటూ
హాంకాంగ్: గతేడాది నవంబర్‌లో కజకిస్తాన్‌కు చెందిన ఓ బాడీ బిల్డర్ సెక్స్ డాల్‌తో డేటింగ్ చేసి దానినే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ బొమ్మను పెళ్లి చేసుకున్న వీడియో అతడు షేర్ చేయడంతో బాగా వైరల్ అయ్యింది. తాజాగా అతడి బాటలోనే హాంకాంగ్‌కు చెందిన ఓ 36 ఏళ్ల వ్యక్తి నడిచాడు. ఎందుకంటే నిజమైన అమ్మాయి కంటే ఈ బొమ్మతోనే డేటింగ్ నచ్చిందని, అందుకే దానినే పెళ్లి చేసుకున్నానని చెబుతున్నాడు. అతని పేరు జీ తియాన్‌రాంగ్. సెక్స్ డాల్ ఇటీవల పెళ్లి చేసుకుని దానితో కొత్త జీవితం ప్రారంభించాడు. ఈ బొమ్మ పేరు మోచీ. తనే నిజమైన జీవితా బాగస్వామి అంటూ తరచూ మోచీకి గిఫ్టులు ఇస్తూ మురిసిపోతున్నాడు. అందులో యాపిల్ ఐఫోన్ 12 కూడా ఉంది. ఇప్పటి వరకు తన భార్య మోచీకి 20 జతల ఖరీదైన బట్టలు, 10 జతల షూలు కొన్నాడంట. అయితే మోచీకి ఇప్పటి కనీసం ముద్దు కూడా పెట్టలేదంట. (చదవండి: అరుదైన మంచు గుడ్లగూబ ఫొటోలు!) ఎందుకంటే తన సెన్సీటీవ్ స్కీన్ పాడైపోతుందని అందుకే తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు చెబుతున్నాడు. ఈ బొమ్మ తనకు మంచి కంపెని ఇస్తుందని, మోచీతో తను చాలా ఆనందంగా ఉంటున్నట్లు చెబుతున్నాడు జీ. కేవలం తన కంపెని కోసమే మోచీ కొనుక్కున్నానని, అందుకే పెళ్లి చేసుకున్నట్లు అతడు పేర్కొన్నాడు. కాగా పదేళ్ల కిందటే హాంకాంగ్‌లోని ఓ రిటైల్ స్టోర్‌లో ఈ సెక్స్ డాల్‌ను చూసి ప్రేమలో పడ్డాంట.. దాని ఖరీదు 9 లక్షల రూపాయలని చెప్పడంతో కొనలేకపోయాడంట. దీంతో 2019లో అలాంటి బొమ్మనే ఇంటర్నెట్లో చూసి లక్ష రూపాయలకు కొనుక్కున్నాడు. ఆ తర్వాత దానితో డేటింగ్ చేస్తున్న సమయంలో డాల్‌కు మోచీ అని పేరు పెట్టుకున్నాడు. అయితే ఇదివరకు అతడికి చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారంట. వారితో డేటింగ్ చేస్తున్న సమయంలో ఎక్కువ సేపు వారంత మొబైళ్లతోనే గడిపేవారని, దాంతో చిరాకొచ్చిన జీ నిజమైన అమ్మాయిల కంటే ఈ సెక్స్ డాల్ చాలా బెటరని తెలిపాడు. ఎందుకంటే తను మోచీతో ఉన్నప్పుడు అది తననే చూస్తూ ఉంటుందట. (చదవండి: పెళ్లిలో భర్త పర్మిషన్తో లవర్ని..) -
ఆ దెయ్యం బొమ్మ తిరిగి వచ్చేసిందా?
చారడేసి కళ్లు, నిండైన ముఖం, నున్నటి కురులు.. చదువుతుంటే బాగానే ఉన్నప్పటికీ దేని కోసం వర్ణిస్తున్నామో చెప్తే మాత్రం ఒక్కసారిగా అదిరిపడటం ఖాయం. అవును, ఈ వర్ణన అంతా భయంకరమైన "అనబెల్లె" బొమ్మ గురించి. చూడటానికి కొంచెం ముద్దుగా ఎంతో భయంగా కనిపించే అనబెల్లె ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. అనబెల్లె సిరీస్‌లో ఆ బొమ్మ మనుషులకు ఎలాంటి హాని తలపెట్టకుండా మ్యూజియంలోని అద్దపు గదిలో బందీ చేస్తారు. సినిమాలోని అనబెల్లె నిజ జీవితంలోనూ ఉంది. (రూపాయి ఖర్చు లేకుండా ఆడిలో షికారు!) me, laughing at Anabelle's memes knowing that she's escaped from the museum and that she's probably under my bed trying to kill me. pic.twitter.com/LhlU0fLMN5 — 𝘱𝘶𝘴𝘴𝘺 𝘦𝘯𝘰𝘫𝘢𝘥𝘢 (@anticondones) August 14, 2020 రెండు పైకి తేలిన కళ్లు, ఎర్ర జుట్టుతో ఉన్న ఓ దెయ్యం బొమ్మ ఆధారంగా అనబెల్లె తెరకెక్కింది. 1970లో నర్సింగ్ కాలేజీ విద్యార్థి ఈ బొమ్మను బహుమతిగా అందుకుంది. కానీ అతీంద్రియ శక్తులు ఉన్న ఆ బొమ్మ వల్ల ఎన్నో భయంకర ఘటనలు వెలుగు చూశాయి. దీంతో దాన్ని ఎలాగోలా అమెరికాలోని కనెక్టికట్‌లో వారెన్స్ ఆక్లట్ మ్యూజియమ్‌లో ఉంచారు. Now who is spreading rumors Anabelle escaped from Warren's museum and is now haunting in Human form !! 🤷♂️ pic.twitter.com/QmKNCsxChR — Soum Jaiswal (@_JaiswalSoum_) August 14, 2020 అయితే ఇన్నేళ్ల తర్వాత ఆ బొమ్మ మ్యూజియంలో నుంచి బయటపడిందని, ఇంతకాలం దాన్ని బంధించినందుకు ఎవరినీ వదిలిపెట్టదంటూ నెటిజన్లు హడలిపోతున్నారు. ఆ బొమ్మలోని ఆత్మ ఎంతమందిని వెంటాడనుందో అని గజగజ వణికిపోతున్నారు. 2020లో ఇంతకన్నా ఘోరం ఇంకోటి లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం అనబెల్లె పారిపోయి వచ్చినా బయట పరిస్థితి చూసి మళ్లీ మ్యూజియంలోకి పరుగు పెడుతుందంటూ జోకులు పేల్చుతున్నారు. వాస్తవానికి అనబెల్లె బొమ్మ మ్యూజియంలోనే ఉంది. కానీ కొందరు కావాలని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ఆ బొమ్మ బయటకు వచ్చిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. (చూస్తుండగానే పేలిపోయిన పెట్రోల్ బంక్) Of course she escaped. This doll has been building supernatural power up for decades. Example: Kills a dude on a motorcycle for tapping her glass. #anabelle pic.twitter.com/QVqCA4JCph — Trik (@TrikLive) August 14, 2020 You’re telling me this raggy ass dirty ass old ass doll escaped. #anabelle Annabelle said : 🏃♀️🏃♀️🏃♀️🏃♀️🏃♀️🏃♀️🏃♀️🏃♀️ pic.twitter.com/QRam9zXiYH — 🇬🇹🦂SAKURA! (@dababychapina) August 14, 2020 anabelle going back to the museum after seeing the state of the world pic.twitter.com/b1kFPdduQM — sal (@aripjnk) August 14, 2020 me staring at the pile of clothes on my chair trying to figure out whether it’s anabelle or just clothes pic.twitter.com/b9CxRl2C1j — emma ᶜ (@WlLDFLOWERLFTV) August 14, 2020 Anabelle if you reading this.. I have love for you bro! I didn’t mean anything I said about you! I was just hangry #anabelle pic.twitter.com/4GkngtEIJG — QueenBeast (@QueenBeast88) August 14, 2020 rt this or else Anabelle will sleep beside you at 3am pic.twitter.com/1qLmlOhZ4h — pretty eerie (@hanhyojooo) August 14, 2020 -
లాక్డౌన్: పాప కాని పాపకు సీరియస్
సాక్షి, విశాఖపట్నం: లాక్డౌన్ కష్టాలు అన్నిన్ని కావు.. ఓ జంట తన బంధువు ఇంటికి వెళ్లడం కోసం బొమ్మను పాపాయిగా మార్చి పోలీసులనే బురిడీ కొట్టించబోయింది. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. భార్యాభర్తలిద్దరూ బుధవారం ఉదయం గోపాలపట్నం నుంచి బైకుపై బయలు దేరారు. చెక్ పోస్టుల దగ్గర పోలీసులు ఆపితే బైక్‌పై కూర్చున్న మహిళ తన బిడ్డకు సీరియస్‌గా ఉందని చెప్పడంతో వారు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పంపించివేశారు. అలా కొంతదూరం ప్రయాణించిన అనంతరం న్యాడ్ జంక్షన్ దగ్గర పోలీసులు ఆపారు. (ఆన్లైన్ పెళ్లి; ఫోన్‌కు తాళి కట్టాడు) ముందుగా అనుకున్న అబద్ధాన్నే మరోసారి పూస గుచ్చినట్లు చెప్పారు. కానీ అనుమానం వచ్చిన ఓ కానిస్టేబుల్ పాపను పరీక్షించాలంటూ మహిళ దగ్గరకు వెళ్లి చూడగా ఆ దృశ్యం చూసి ఖంగు తిన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది కేవలం బొమ్మ మాత్రమే. దీంతో సదరు మహిళ తమ బంధువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అసలు విషయం చెప్పింది. దయచేసి ఈ ఒక్కసారికి వదిలేయండి అని పోలీసులను వేడుకొంది. దీంతో కనికరించిన పోలీసులు మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకండని హెచ్చరించి సదరు జంటను విడిచిపెట్టారు. (అమ్మ కోసం ఆమాత్రం చేయలేనా: దర్శకుడు) -
కరాచీ మ్యూజియంలో అభినందన్ బొమ్మ
ఇస్లామాబాద్ : బాలాకోట్ వైమానిక దాడి అనంతరం జరిగిన పరిణామాల్లో పాక్ యుద్ధ విమానాలను తరుముకుంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్లో పట్టుబడిన వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ బొమ్మను పాకిస్తాన్ వైమానిక దళ కేంద్ర స్థానమైన కరాచీలోని మ్యూజియంలో పెట్టుకున్నారు. ఈ విషయాన్ని పాక్ జర్నలిస్టు అన్వర్ లోధీ శనివారం అర్ధరాత్రి తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అభినందన్ బొమ్మ పెట్టడం గమనార్హం. అయితే బొమ్మను ఏ ఉద్దేశ్యంతో పెట్టారో అన్వర్ వెల్లడించలేదు. అంతేకాక, అభినందన్ బొమ్మ చేతిలో టీ కప్పు పెడితే ఇంకా బాగుండేదని సరదాగా వ్యాఖ్యానించారు. -
వాట్ ఎన్ ఐడియా.. ఈ ట్రీట్మెంట్ భలే భలే..
సాక్షి, న్యూఢిల్లీ : చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కుప్పలు కుప్పలుగా బొమ్మలు ఉండడం సర్వసాధారణం. వాటితో ఆటలే చిన్నారులకు కాలక్షేపం. కొందరు పిల్లలకు బొమ్మలతో ఉండే అనుబంధం మాటల్లో చెప్పలేనిది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకూ వాటితోనే ఆడతారు. తమకు ఇష్టమైన బొమ్మ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. పై ఫోటోలో ఉన్న చిన్నారి కూడా అలాంటిదే. తన బొమ్మ అంటే ఎంత ఇష్టమంటే.. ఆ బొమ్మకు ట్రీట్మెంట్ చేస్తేనే ఆమె కూడా బుద్ధిగా ట్రీట్మెంట్ చేయించుకుంటోంది. దీంతో చేసేది ఏమి లేక చిన్నారి బొమ్మను... పాపతో పాటే బెడ్‌పై పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేశారు డాక్టర్లు. ఈ విచిత్ర ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన ఆ చిన్నారి పేరు జిక్రా మాలిక్. వయసు 11 నెలలు. జిక్రా దగ్గర ఓ అందమైన బొమ్మ ఉంది. పేరు పారీ. పారీ అంటే జిక్రాకు ఎంతో ఇష్టం. అది లేనిదే ఏ పనీ చేయదు. బొమ్మకు పాలు పడితేనే జిక్రా పాలు తాగుతుంది. బొమ్మకు గోరుముద్దలు పెడితేనే జిక్రా తింటుంది. అదీ ఆ బొమ్మతో చిన్నారికి ఉన్న అనుబంధం. కాగా, ఆగస్టు 17న బెడ్‌పై నిద్రిస్తున్న సమయంలో అనుకోకుండా జిక్రా కిందపడింది. ఈ ఘటనలో ఆమె కాళ్లకు గాయాలు అయ్యాయి. దీంతో ట్రీట్మెంట్ కోసం ఆ చిన్నారిని ఢిల్లీలోని లోక్‌నాయక్ ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి మాత్రం వైద్యం చేయించుకోకుండా ఏడ్వడం మొదలెట్టింది. తల్లిదండ్రులు, డాక్టర్లు ఎంత సముదాయించినా ఆమె ఊరుకోలేదు. దీంతో జిక్రా తల్లికి ఓ ఆలోచన వచ్చింది. జిక్రాకు ఇష్టమైన బొమ్మను తీసుకొచ్చి మరో బెడ్ ఉంచి ట్రీట్మెంట్ చేసినట్లు నటించారు. దీంతో చిన్నారికి కూడా ట్రీట్మెంట్ తీసుకుంది. ఏడుపు ఆపేసి కామ్‌గా చికిత్సకు సహకరించింది. చిన్నారికి మందులు వేయాలన్నా, ఇంజెక్షన్ చేయాలన్న మొదటగా బొమ్మకు చేసినట్లు నటించి తర్వాత ఆమెకు చేస్తున్నారు. ‘జిక్రా ఇంట్లో కూడా బొమ్మను వదిలేది కాదు. ఎక్కడికి వెళ్లినా బొమ్మను తీసుకెళ్లేది. నిద్రపోయేటప్పడు కూడా బొమ్మను పక్కలోనే పడుకోబెట్టుకునేది. ఆస్సత్రికి వచ్చాకా ట్రీట్మెంట్కు సహకరించలేదు. దీంతో నాకు బొమ్మ తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. వెంటనే మా ఆయనతో బొమ్మను తెప్పించి డాక్టర్లకు ఈ సలహా ఇచ్చాను. తన కాళ్లను ట్రీట్మెంట్ ఇచ్చేందుకు బొమ్మ కాళ్లును కూడా పైకి వేలాడదీసి కట్టేశాం. దీంతో జిక్రా కూడా కాళ్లను పైకి కట్టేస్తే బొమ్మలాగే ఉంది. ఏడుపు కూడా ఆపేసి ట్రీట్మెంట్కు సహకరిస్తుంది’ అని జిక్రా తల్లి మీడియాకు తెలిపారు. కాగా లోక్ నాయక్ ఆస్పత్రితో ఉన్న ఈ బుజ్ఞాయి ప్రస్తుతం సెలబ్రెటీగా మారిపోయింది. -
బొమ్మకు భయపడి నరకం అనుభవించిన మహిళ
న్యూజెర్సీ : చిన్న బొమ్మ కారణంగా ఓ మహిళ 24 గంటల పాటు నరకం అనుభవించింది. భయం గుప్పిట్లో విలవిలలాడింది. ఈ సంఘటన అమెరికాలోని న్యూజెర్సీలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూజెర్సీ హ్యారింగ్టన్ పార్క్‌కు చెందిన 42ఏళ్ల రీనీ జెన్సన్ అనే మహిళ భర్తతో విడాకులు తీసుకుని వేరుగా ఉంటోంది. గత కొన్నినెలలుగా అలెక్స్ పాపజియాన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. శనివారం ఇద్దరూ రీనీ ఇంట్లో ఉన్న సమయంలో అక్కడ ఏదో తేడాగా జరుగుతున్నట్లు వారికి అనిపించింది. హఠాత్తుగా ఇంటి పెరట్లోని చెట్టుపైనుంచి ఓ బొమ్మ నేరుగా నేలపై పడింది. ఆ బొమ్మ అచ్చం తను గతంలో చదివిన హర్రర్ నవల ‘‘ఇట్’’ లోని భయంకరమైన బొమ్మలాగా అనిపించింది. అప్పుడు అమెకు పెన్నివైస్ అనే కార్టూన్ బొమ్మ గుర్తుకువచ్చింది. అంతే! ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. ఆ బొమ్మ బట్టతో తయారుచేయబడి, పెదవుల దగ్గర కృత్తిమ రక్తంతో, తలపై మంత్రాల లాంటి సంఖ్యలతో భయంకరంగా కనపడింది ఆమెకు. ఆ వెంటనే రీనీ పోలీసులకు సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ఇంటిని పరీక్షించి అక్కడ ఎలాంటి అనుమానిత వస్తువులు, మనుషులు లేరని ధ్రువీకరించారు. వారు వెళ్లిపోయే సమయంలో ఆ బొమ్మను తీసుకుపోవాల్సిందిగా ఆమె కోరింది. అయితే వారు అందుకు ఒప్పుకోలేదు. పోలీసులు అక్కడినుంచి వెళ్లిపోయిన తర్వాత రీనీ, అలెక్స్ ఆ బొమ్మను నాశనం చేయాలనుకున్నారు. మొదటదాన్ని ఆలివ్ ఆయిల్లో ముంచి అంటించడానికి ప్రయత్నించినా అది కాలలేదు. చివరకు పాతపేపర్లలో దాన్ని చుట్టి తగబెట్టేశారు. ఆ సాయంత్రం అలెక్స్ ఓ పని మీద బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఆమె ఆ ఇంట్లో ఒంటరిగా గడపాల్సి వచ్చింది. బొమ్మను కాల్చి బూడిద చేసినప్పటికి ఆమెలో భయం మాత్రం చావలేదు. ఒంటరిగా ఉండటంతో భయంకారణంగా ఆమెకు ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తారేమోనన్న భయంతో కత్తిని తన వద్ద ఉంచుకుంది. అలసట కారణంగా తెల్లవారిన తర్వాత నిద్రలోకి జారుకుంది. ఈ ఘటనపై రీనీ మాట్లాడుతూ.. ‘‘ ఆ బొమ్మ నన్నెందుకు ఎంచుకుందో అర్థంకావటంలేదు. ఆకాశంలోనుంచో, చెట్టుపైనుంచో అది మా ఇంట్లోకి పడలేదు. చెట్టుమీద నుంచి పాకుతూ వచ్చింది. నాకు హర్రర్ సినిమాలంటే ఇష్టం ఉండదు. అంతేకాదు అలాంటి బొమ్మలతో చచ్చేంత భయంనాకు. ఆ రోజు కూడా భయంకరమైన కలలు వచ్చాయ’’ని తెలిపింది. -
‘నీలం కళ్లు, ఉంగరాల జుట్టు ఉంటే తైమూరేనా’
బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్ - కరీనా కపూర్ కుమారుడు తైమూర్ అలీ ఖాన్‌కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీడియా నిత్యం తైమూర్ ఎక్కడికి వెళ్లాడు? ఎలాంటి దుస్తులు వేసుకున్నాడు? ఎలాంటి ఆటలు ఆడుతున్నాడు? అంటూ చిన్న నవాబ్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేస్తుంటుంది. ఈ క్రేజ్ ఎంతలా పెరిగిందంటే.. కొన్ని రోజుల క్రితం కేరళలోని ఓ బొమ్మల షాప్‌లో తైమూర్‌ను పోలి ఉన్న బొమ్మలను అమ్మాకానికి పెడితే అవి కూడా హాట్‌కేకుల్లాగా అమ్ముడయినట్లు సమాచారం. తైమూర్‌ను పోలిన బొమ్మకు కూడా ఇంతటి క్రేజ్ రావడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. కరీనా కపూర్ మాత్రం మండిపడుతున్నారు. ఈ విషయం గురించి కరీనా మాట్లాడుతూ.. ‘ఇలా చెబుతున్నందుకు సారీ. తైమూర్‌పై మీడియా నిఘా ఎక్కువగా ఉంది. ఎక్కడికి వెళ్లినా ‘తైమూర్’.. ‘తైమూర్’ అంటూ పిలుస్తారు. తనకు ఇవేం తెలియవు కాబట్టి వాడు సంతోషంతో కేరింతలు కొడతాడు. కానీ నా కొడుకును మామూలు పిల్లలానే పెంచాలనుకుంటున్నాను. మా అబ్బాయిని మీడియా నుంచి దూరంగా ఉంచడానికి మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం. నా కుమారుడిని బయటికి పంపించకుండా, ఆడుకోనివ్వకుండా అదుపుచేయలేను. కానీ తైమూర్ ఫొటోలు తీయొద్దని మీడియా వర్గాలకు మాత్రం చెప్పగలను. ఇక బొమ్మ విషయానికొస్తే.. నీలం కళ్లు, రింగుల జుట్టు ఉన్నంత మాత్రాన ఆ బొమ్మ నా కుమారుడి ప్రతి రూపం అవ్వదు’ అని పేర్కొన్నారు కరీనా. -
బొమ్మ కొనివ్వు నాన్నా
ఒకరోజు ఒక పిల్లాడు తన తండ్రితో కలిసి జాతరకు వెళ్లాడు. కొడుకును జాతరంతా తిప్పి చూపించి సంతోషపరచాలని తండ్రి తపన. జాతరలో బోల్డన్ని బొమ్మలు, వస్తువులు కొనుక్కుని తన స్నేహితులకు చూపించుకుని మురిసిపోవాలని కొడుకు ఆలోచన. పిల్లవాడికి కబుర్లు చెబుతూ మెల్లగా నడుస్తున్నాడు తండ్రి. ఇంకా తనకి బొమ్మలేమీ కొనిపెట్టలేదని ఆందోళన పడుతున్నాడు పిల్లాడు. ఇంతలో పిల్లాడికి ఒక బొమ్మ నచ్చింది. ఆ బొమ్మ కొనిమ్మన్నాడు. ఆ బొమ్మవంకా, దాని పైన ఉన్న ధర వంకా చూశాడు తండ్రి. ఆ తర్వాత జేబులో ఉన్న డబ్బును చూసుకున్నాడు.‘‘ఇది వద్దులే’’ అంటూ ముందుకు నడిపించాడు కొడుకుని. డబ్బంతా పిల్లాడి బొమ్మలకు ఖర్చు పెడితే ఇంట్లో భార్య తీసుకుని రమ్మని చెప్పిన సరుకుల మాటేమిటి అని ఆలోచిస్తూనే, ఏదైనా బొమ్మ కొని కొడుకును సంతోషపెట్టాలనుకున్నాడు తండ్రి. ఇంతలో ఎవరో తండ్రిని పలకరించారు. కొడుకు చేయి వదిలి వారితో మాట్లాడుతున్నాడు. జాతరలో జనం పెరిగారు. పిల్లాడు తండ్రిని గమనించకుండా ముందుకెళ్లిపోయాడు. కాసేపయ్యాక వెనక్కి తిరిగి చూస్తే తండ్రి కనిపించలేదు. భయమేసింది. దిగులుతో ఏడుపు మొదలైంది. ఏడుస్తున్న ఆ పిల్లాణ్ణి చూసి అందరూ పోగయ్యారు. ‘‘నీకు బోలెడన్ని బొమ్మలిస్తాము. ఏడవకు’’ అన్నారెవరో.‘‘నాకు నాన్న కావాలి’’ అన్నాడు పిల్లాడు వెక్కుతూ. ఇంకెవరో రకరకాల తినుబండారాలు తీసుకొచ్చి పిల్లాడి చేతిలో పెట్టారు. ‘‘నాకు నాన్న కావాలి’’ అని వెక్కిళ్లు పెట్టాడు. ఆశ్చర్యం! ఆ పిల్లాడికిప్పుడు బొమ్మల గురించిన ఆలోచనే లేదు. ‘నాన్న కావాలి’ అంతే! ఇంతలో కొడుకును వెదుక్కుంటూ అక్కడికొచ్చాడు నాన్న. వెలిగిపోతున్న ముఖంతో తండ్రిని అతుక్కుపోయాడు ఆ పిల్లాడు.తెలిసిన వాళ్లెవరో కనిపిస్తే చేబదులు తీసుకొచ్చిన తండ్రి ‘‘బొమ్మలు కొందాం పద’’ అన్నాడు.‘‘నాకు బొమ్మలేమీ వద్దు. ఇంటికెళదాం’’ అన్నాడు కొడుకు! దేవుణ్ణి అవి కావాలి, ఇవి కావాలి అని కోరుకుంటాం. అడిగిందల్లా ఇవ్వలేదని బాధపడతాం. ఇంతలో ఏదో జరుగుతుంది. అప్పుడు మనమే వేడుకుంటాం దేవుణ్ణి.. కనీసం ఇలాగైనా ఉంచు స్వామీ’’ అని. దేవుడు గీసిన పెద్దగీత ముందు మన కోరికలనే చిన్న గీతలు చిన్నబోతాయన్నమాట. – డి.వి.ఆర్. -
కొత్త బార్బీ డాడీ!
బార్బీ కొత్త వెర్షన్.. లండన్, ప్యారిస్, న్యూయార్క్ అండ్ ఇంకొన్ని సెలెక్టెడ్ రీటెయిల్ దుకాణాల్లో ప్రపంచమంతా నిన్న సాయంత్రమే విడుదలయింది. ఇంకా కొన్నిచోట్ల ఇవాళ విడుదల అవబోతోంది. ఈ కొత్త బార్బీ పేరు జీజీ హాదీద్. ప్రఖ్యాత అమెరికన్ మోడల్ జీజీ హాదీద్ (22)ను ఈ బార్బీ తయారీకి మోడల్‌గా తీసుకున్నారు. మనదేశంలో కూడా కొన్నేళ్ల క్రితం ఐశ్వర్యారాయ్ లాంటి బార్బీ డాల్ని కూడా లాంచ్ చేశారు. ఇలా ఎప్పటికప్పుడు కొన్ని దేశాలల్లో ఉన్న అందగత్తెల ఫాలోయింగ్‌ని బట్టి బార్బీ డాల్ మోడల్స్ ప్రపంచమంతటా విడుదల అవుతుంటాయి. బార్బీ.. అందమైన అమ్మాయి. ఆత్మవిశ్వాసం గల అమ్మాయి. అందుకే ఇంటింటా అమ్మాయిలకు బార్బీ అంటే అంత ఆకర్షణ, ఆరాధన. బార్బీ డాక్టర్, బార్బీ ఆస్ట్రోనాట్, బార్బీ ఫైర్‌ఫైటర్, బార్బీ ఫిల్మ్‌స్టార్, బార్బీ పాప్ సింగర్.. ఇలా మోడళ్లతోనే అమ్మాయిలు ఎక్కువగా తమని తాము పోల్చుకుంటారట! రూత్ హ్యాండ్లర్ (1916–2002) అమెరికన్ మహిళ తొలిసారి 1959లో ఈ బార్బీ కాన్సెప్ట్‌కు పురుడు పోశారు. -
పరిశ్రమలతోనే అభివృద్ధి
కొత్తపల్లి : పరిశ్రమలతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ కార్తికేయ మిశ్ర అన్నారు. కొత్తపల్లి మండలం కేఎస్‌ఈజెడ్‌లో ఉన్న పాల్స్‌ప్లస్ (చైనా బొమ్మల తయారీ) కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. యాజమాన్యంలో కంపెనీ విధి వి«ధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్మికుల సమస్యలను అడిగి వారి స్థితిగతులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ట్రైనీ కలెక్టర్ ఆనంద్‌కు ఈ పరిశ్రమ చూపించడం కోసం వచ్చామన్నారు. అనంతరం కలెక్టర్, ట్రైనీ కలెక్టర్ ప్రాంగణంలో మొక్కలను నాటారు. పరిశ్రమ సీఓఓ లాలన్ మిశ్ర మాట్లాడుతూ తయారు చేసిన బొమ్మలను విదేశాల్లో మాత్రమే అమ్మడం జరుగుతుంది. ఒక్క బొమ్మ కూడా ఇండియాలో అమ్మడం జరగదు. తయారు చేసిన ప్రతి ఒక్కరూ చైనా వెళ్లి అక్కడ ట్రాగ్ వేసిన తర్వాత ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఇప్పటి వరకు పది లక్షల అమెరికన్ డాలర్ల విలువ చేసే బొమ్మలను ఎగుమతి జరిగింది. మొత్తం ఈ పరిశ్రమలో 600 కార్మికులు పరిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి పీఎఫ్, ఈఎస్ అమలు చేస్తున్నారు. ప్రతి నెలా తమ బ్యాంక్ ఖాతాలోనికి జీతాలను జమ చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఇటువంటి ప్రాంతాల్లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందన్నారు. కాకినాడ సిటీ : జిల్లాలో ప్రమాదాలకు ఆస్కారం ఉండే అన్ని పరిశ్రమల్లో పర్యావరణం, కార్మికులు, పరిసర జనావాసాల రక్షణకు చట్టపరంగా నిర్ధేశించిన భద్రతా చర్యలను ఖచ్చిత ప్రమాణాలతో అమలు చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఫ్యాక్టరీస్, ఫిషరీస్, ఫైర్, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్స్, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలోని ఆక్వా పరిశ్రమలు, ప్రమాదకర రసాయనాలు, వాయువులతో పనిచేసే పరిశ్రమలో రక్షణ, భద్రతా చర్యల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన 10 సంవత్సరాల్లో జిల్లాలో జరిగిన పారిశ్రామిక ప్రమాదాలు, వాటికి కారణాలను విశ్లేషించాలని ఆదేశించారు. ఈ ప్రమాదాలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు చేపట్టవలసిన జాగ్రత్తలు, చట్టప్రకారం పరిశ్రమల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన భద్రతా వ్యవస్థలు, ప్రమాణాలతో చెక్‌లిస్ట్ రూపొందించాలన్నారు. పరిశ్రమల్లో చేపట్టిన భద్రతా చర్యలు, వాటి ప్రమాణాలను ఆయా శాఖల అధికారులు నిశితంగా తనిఖీచేసి, పాటించని యూనిట్లపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇటీవల కొన్ని ఆక్వా పరిశ్రమలలో జరిగిన ప్రమాదాల్లో విద్యుత్ సరఫరా లేనప్పుడు ఏసీలు పనిచేయక కార్మికులు అస్వస్థతకు లోనైనట్లు గుర్తించినందున, అన్ని ఫ్యాక్టరీల్లో ప్లాంట్ రన్నింగ్‌తో పాటు, కార్మికుల రక్షణకు ఏర్పాటు చేసిన ప్రతి సేఫ్టీ వ్యవస్థకు కూడా విద్యుత్ అందించే సామర్ధ్యం ఉన్న జనరేటర్లునే విధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో బాయిలర్‌తో పనిచేస్తున్న సుమారు 416 పరిశ్రమల్లో బాయిలర్ల ప్రమాణాలు, ప్రమాద నివారణ, రక్షణ కోసం చేపట్టిన చర్యలను రెగ్యులర్‌గా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. గాలిలోకి ఫ్లైయాష్వదులుతూ ప్రజలను ఇబ్బందులకు, ఆరోగ్య సమస్యలకు గురిచేస్తున్న పరిశ్రమలు కాలుష్య నివారణకు ట్రీట్మెంట్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివçశంకర్‌రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి ఉదయ్‌కుమార్, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి రాఘవరెడ్డి, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, శాంతారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కట్ చేస్తే... బుట్ట బొమ్మ!
న్యూలుక్ ‘పొడవు చేతులున్న టీ షర్ట్ మోడల్ బాగోలేదు, అంతగా నప్పలేదు, ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి..’ ఇలా మీ వార్డ్రోబ్ను చూసిన ప్రతీసారీ అనిపిస్తే.. వాటిని పాత బట్టల ప్లేస్‌లోకి చేర్చనక్కర్లేదు. టీనేజ్గర్ల్ మెచ్చే అందమైన డిజైనర్ టీ-షర్ట్‌ను మీరే స్వయంగా రూపొందించుకోవచ్చు. * పొడవు చేతులున్న టీ షర్ట్‌ను తీసుకోవాలి. దాని రెండు చేతులను సమాన కొలత తీసుకొని కట్ చేయాలి. * పొట్టి చేతులున్న టీ షర్ట్ అవుతుంది. ఇప్పుడు షర్ట్ కలర్ దారం తీసుకొని సూదితో చేతుల భాగంలో మధ్యన సన్నగా కుచ్చులు పెట్టాలి. దీంతో బుట్ట చేతుల్లా మారిపోతాయి. * కట్ చేసిన చేతుల భాగాలను చిన్న చిన్న ముక్కలు చేయాలి. * ఫొటోలో చూపిన విధంగా పువ్వుల్లా అమర్చి, కుట్లు వేయాలి. * ఇలా తయారుచేసుకున్న అన్నింటినీ ‘నెక్’ భాగంలో పెట్టి కుట్టాలి. * అన్నింటినీ ఒక క్రమపద్ధతిలో అమర్చి కుట్టువేస్తే ఒక హారంలా వస్తుంది. * మీ పిల్లలు మెచ్చే అందమైన బుట్టచేతుల డిజైనర్ టీ షర్ట్ కొత్తగా కనువిందుచేస్తుంది. * ప్లెయిన్ టీ షర్ట్‌లను ఇలా ఎన్నో విధాలుగా నూతనంగా రూపొందించుకోవచ్చు. కొత్త డ్రెస్ వేసుకున్నామన్న ఆనందం పిల్లల్లో కలుగుతుంది. డబ్బూ ఆదా అవుతుంది.