కట్ చేస్తే... బుట్ట బొమ్మ!
న్యూలుక్
‘పొడవు చేతులున్న టీ షర్ట్ మోడల్ బాగోలేదు, అంతగా నప్పలేదు, ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి..’ ఇలా మీ వార్డ్రోబ్‌ను చూసిన ప్రతీసారీ అనిపిస్తే.. వాటిని పాత బట్టల ప్లేస్‌లోకి చేర్చనక్కర్లేదు. టీనేజ్‌గర్ల్ మెచ్చే అందమైన డిజైనర్ టీ-షర్ట్‌ను మీరే స్వయంగా రూపొందించుకోవచ్చు.
* పొడవు చేతులున్న టీ షర్ట్‌ను తీసుకోవాలి. దాని రెండు చేతులను సమాన కొలత తీసుకొని కట్ చేయాలి.
* పొట్టి చేతులున్న టీ షర్ట్ అవుతుంది. ఇప్పుడు షర్ట్ కలర్ దారం తీసుకొని సూదితో చేతుల భాగంలో మధ్యన సన్నగా కుచ్చులు పెట్టాలి. దీంతో బుట్ట చేతుల్లా మారిపోతాయి.
* కట్ చేసిన చేతుల భాగాలను చిన్న చిన్న ముక్కలు చేయాలి.
* ఫొటోలో చూపిన విధంగా పువ్వుల్లా అమర్చి, కుట్లు వేయాలి.
* ఇలా తయారుచేసుకున్న అన్నింటినీ ‘నెక్’ భాగంలో పెట్టి కుట్టాలి.
* అన్నింటినీ ఒక క్రమపద్ధతిలో అమర్చి కుట్టువేస్తే ఒక హారంలా వస్తుంది.
* మీ పిల్లలు మెచ్చే అందమైన బుట్టచేతుల డిజైనర్ టీ షర్ట్ కొత్తగా కనువిందుచేస్తుంది.
* ప్లెయిన్ టీ షర్ట్‌లను ఇలా ఎన్నో విధాలుగా నూతనంగా రూపొందించుకోవచ్చు. కొత్త డ్రెస్ వేసుకున్నామన్న ఆనందం పిల్లల్లో కలుగుతుంది. డబ్బూ ఆదా అవుతుంది.