T-shirt
-
కోహ్లి చేతికి కొత్త లగ్జరీ వాచ్, అదరిపోయే టీ-షర్ట్, ధర ఎంతంటే?
ప్రతిష్టాత్మక ఐపీఎల్ 2024 సమరం శుక్రవారం షురూ అయింది. తొలి మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, విరాట్ కోహ్లీ ఓ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో 12 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఈ ఘనతను అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈసందర్బంగా కోహ్లీ కొత్త లుక్, కొత్త టీషర్ట్, లగ్జరీ వాచ్ ఇవన్నీ క్రికెట్ ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఐపీఎల్ 2024 సిరీస్కోసం సిద్దమైన కోహ్లీ కొత్త హెయిర్ కట్, గడ్డంతో ముంబై విమానాశ్రయంలో చమక్‌మని మెరిసాడు. కోహ్లీ కొత్త లుక్ చూసిన ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. దీనికి సంబంధించి ఫోటోలు ఇప్పటికీ నెట్టింట్ చక్కర్లు అవుతున్నాయి. అంతేకాదు ఇటీవల రెండో బిడ్డకు తండ్రి అయిన కోహ్లి తెల్లటి టీ-షర్టులో మరింత అందంగా కనిపించాడు. దీనిపై యానిమేషన్ క్యారెక్టర్ బొమ్మతోపాటు, డాడ్(DAD) 'డక్ డక్ గూస్' అని రాసి ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది తన పిల్లలపై ఉన్న ప్రేమను నిదర్శనమంటూ కమెంట్స్ వినిపించాయి. ఈ టీ-షర్టు ధర రూ.2,076(24.95 డాలర్స్) అని సమాచారం. అంతేనా లగ్జరీ వాచ్ కలెక్షన్‌ను సొంతం చేసుకున్న కోహ్లీ మరో లగ్జరీ వాచ్ కూడా హాట్ టాపిక్‌గా నిలిచింది. దీని ధర 38.77 లక్షల అని అంచనా. కుడి చేతికి ధరించి ఈ సొగసైన వాచ్ లగ్జరీ రోలెక్స్ బ్రాండ్‌ది. బ్లాక్ డయల్, మరో మూడు సిల్వర్ కలర్ డయల్స్, బ్లాక్ బెల్ట్‌తో రోలెక్స్ డేటోనా బేబీ లే మాన్స్ ఓస్టెర్ఫ్లెక్స్ సూపర్ లావిష్ వాచ్ ఇది. కోహ్లి భయ్యా..సూపర్ కూల్ అవుట్‌ఫిట్ అంటూ క్రికెట్ అభిమానులు మురిసి పోయారు. కాగా కోహ్లీ, భార్య బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతులకు ఈ ఏడాది ఫిబ్రవరి 15న లండన్‌లో కుమారుడు అకాయ్ జన్మించాడు. వీరికి ఇప్పటికే వామిక అనే పాపకూడా ఉంది. -
కాపాడే టీ–షర్ట్లు
ఫ్రెంచ్ కంపెనీ ‘ఫ్లోటీ’ పద్దెనిమిది నెలల నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల కోసం యాంటీ–డ్రౌనింగ్ టీ–షర్ట్‌లను రూపొందించింది. పిల్లలు ప్రమాదవశాత్తు నీటిలో పడితే మునిగిపోకుండా ఈ టీ–షర్ట్లు కాపాడుతాయి. టీ–షర్ట్‌లో అమర్చిన విజిల్ పెద్దగా సౌండ్ చేస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తుంది. స్టైలీష్‌గా, సౌకర్యవంతంగా ఉండే ఈ టీ–షర్ట్ ఎలా పనిచేస్తుంది...అనేదానిపై రూపొందించిన డెమో వీడియోను పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘ఇది నోబెల్ బహుమతి పొందిన ఆవిష్కరణ కంటే గొప్పది. ఒక తాతగా పిల్లల భద్రత అనేది నాకు అత్యంత ముఖ్యమైనది’ అని ట్విట్ చేశాడు. -
ఆ ముగ్గుర్నీ కలిశాకే ఈ నిర్ణయం తీసుకున్నా!..ఎప్పటికీ స్వెటర్స్ వేసుకోను
భారత్ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ టీషర్ట్స్ ధరించడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదీ కూడా శీతాకాలంలో ఇంత భయంకరమైన చలిలో సైతం రాహుల్ ఎందుకు టీషర్ట్స్ వేసుకుంటున్నారంటూ మీడియాతో సహా సర్వత్ర ఇదే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయమై స్పందించారు. తాను ముగ్గురు బాలికలను కలిసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ ఆ చర్చలకు తెరదించారు. వారిని కలిసిన తర్వాత నుంచే టీ షర్టులు ధరించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందరూ ఈ టీ షర్ట్ ఎందుకు ధరిస్తున్నారు చలిగా అనిపించడం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. "ఐతే నేను కేరళలో ప్రవేశించినప్పుడూ కాస్త వేడిగ, తేమగా ఉంది. కానీ మధ్యప్రదేశ్‌లోకి వచ్చేటప్పటికీ కాస్త చల్లగా ఉంది. అప్పుడే అక్కడకి చిరిగిన బట్లతో ముగ్గురు పేద బాలికలు నా దగ్గరికి వచ్చారు. సరైన దుస్తులు ధరించకపోవడంతో చలికి గజగజ వణకుతున్నారు. దీంతో ఆరోజు నేను నిర్ణయించుకున్నా వారికి చలి అనిపించేంత వరకు(వారు స్వెటర్లు ధరించేంత వరకు) తనకు చలి అనిపించదు. అప్పటి వరకు నేను కూడా స్వెటర్స్ ధరించను. అంతేకాదు ఆ ముగ్గురు బాలికలకు చలి అనిపిస్తే రాహుల్‌కి కూడా చలి అనిపిస్తుందని ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పారు. అయినా తాను టీషర్ట్స్ వేసుకోవడం అనేది ప్రధానాంశం కాదని, ఈ యాత్రలో తన వెంట వస్తున్న పేద రైతులు, కూలీలపై దృష్టి పెట్టండని మీడియాకి చురకలంటించారు. పేద రైతులు, కార్మికులు, వారి పిల్లలు చిరిగిని బట్టలు, టీషర్ట్లు, స్వెటర్లు ధరించకుండా ఎందుకు ఉన్నారో అనేది ప్రధానం, దాని గురించే ఆలోచించండి." అని చెప్పారు రాహుల్. కాగా జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో జరిగింది. జనవరి 30 కల్లా జమ్ము కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కి చేరుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుంది. इस टी-शर्ट से बस इतना इज़हार कर रहा हूं, थोड़ा दर्द आपसे उधार ले रहा हूं। pic.twitter.com/soVmiyvjqA — Rahul Gandhi (@RahulGandhi) January 9, 2023 (చదవండి: ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్ గాంధీ) -
టీ షర్ట్‌కి కొత్తరూపు
న్యూలుక్ ఈ కాలపు అమ్మాయిల వార్డ్‌రోబ్‌లో లెక్కకుమించి టీషర్ట్లు.వాటిలో ఎన్నో మోడల్స్! వాటిలో కొన్ని కొటేషన్లతో అదరగొట్టేవి, ఇంకొన్ని రంగు డిజైన్లతో ఆకట్టుకునేవి, మరికొన్ని ప్లెయిన్‌గా మనసుకు హత్తుకునేవి. వీటికి కొన్ని హంగులు చేర్చితే... ‘కొత్త డిజైన్ టీ షర్ట్ ఎక్కడకొన్నావ్?’ అనే ప్రశ్న మిమ్మల్ని పలకరించాల్సిందే! ముందుగా కాలర్ లేని ప్లెయిన్ టీ షర్ట్‌ని ఎంచుకోవాలి. దానికి అదే రంగు బనియన్ క్లాత్‌ని ఎంచుకోవాలి. ఫొటోలో చూపిన విధంగా చిన్న చిన్న డిజైన్ ముక్కలుగా కట్ చేయాలి. వాటిని ప్లెయిన్ టీ షర్ట్‌కి ఛాతీ భాగంలో కుట్టాలి. దీంతో కొత్త టీ షర్ట్ రెడీ అవుతుంది. కాంట్రాస్ట్ బనియన్ క్లాత్ ఎంచుకోవాలి. పువ్వు డిజైన్‌కి అనుకూలంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. వాటిని టీ షర్ట్‌కి ఛాతీ భాగంలో పువ్వు డిజైన్ వచ్చేలా మిషన్ మీద కుట్టేయాలి. అక్కడక్కడా తెల్లని లేదా రంగు పూసలను కుడితే ఇలా చూడముచ్చటైన టీ షర్ట్ మీదవుతుంది. టీ షర్ట్‌కి టాప్ భాగం అంటే చేతులు, నెక్ భాగాన్ని కత్తిరించాలి. ఈ ప్లేస్‌లో ఎంపిక చేసుకున్న లేస్‌ను కుట్టాలి. మరో ముచ్చటైన టీ షర్ట్ సిద్ధం అవుతుంది. -
టాప్స్.. రీ ఫ్యాషన్
న్యూలుక్ ఎప్పుడూ వేసుకునే టాప్సే.. ఎప్పుడూ వేసుకునే ట్యునిక్సే.. ఎప్పుడూ వేసుకునే షర్ట్లే.. ఎప్పుడూ వేసుకునే టీ షర్ట్లే.. కొత్తగా మార్చేదెలా? సింపుల్‌గా ఇలా!! లేత రంగులో ఉన్న ప్లెయిన్ టీ షర్ట్‌కు గాఢమైన కలర్ క్లాత్‌ను ఇలా జత చేస్తే ఓ కొత్త మోడల్ టాప్ రెడీ. పొడవు చేతుల షర్ట్ అయినా, పొట్టి చేతుల చొక్కా అయినా వీపు భాగంలో త్రికోణాకృతిలో కట్ చేయాలి. దీనికి మరో కాంట్రాస్ట్ కలర్ క్లాత్ లేదా, లేస్‌ను జత చేయాలి. ఇలా చూడముచ్చటైన మరో టాప్ స్టైల్‌గా మీ ముందు సిద్ధం అవుతుంది. క్యాజువల్ వేర్లో ఓ స్టైల్‌ని క్రియేట్ చేస్తుంది. మిడ్ స్లీవ్స్ ప్లెయిన్ ట్యునిక్కి ఛాతి భాగం నుంచి ప్రింట్ మెటీరియల్‌తో స్కర్ట్‌లా కుట్టి, జత చేయాలి. ఇలా మరో అందమైన టాప్ సిద్ధం. ఈవెనింగ్ వెస్ట్రన్ పార్టీలకు స్టైల్‌గా కనువిందుచేస్తుంది. ప్లెయిన్ టీ షర్ట్ లేదా కుర్తీ అయినా తీసుకోండి. భుజం మీద నుంచి చేతుల భాగం వరకు కట్ చేయండి. కట్ చేసిన భాగాన్ని జత చేస్తూ అందమైన లేస్ వేస్తే సరి. మరో అందమైన టాప్ వేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఉన్న డ్రెస్‌లనే రీ మోడల్ చేస్తే ఇలాంటి స్టైలిష్ టాప్స్ మీ వార్డ్‌రోబ్‌లో చేరిపోతాయి. వాటిని ధరిస్తే నలుగురిలో మీకో ప్రత్యేకతను తెచ్చిపెడతారు. -
కట్ చేస్తే... బుట్ట బొమ్మ!
న్యూలుక్ ‘పొడవు చేతులున్న టీ షర్ట్ మోడల్ బాగోలేదు, అంతగా నప్పలేదు, ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి..’ ఇలా మీ వార్డ్రోబ్ను చూసిన ప్రతీసారీ అనిపిస్తే.. వాటిని పాత బట్టల ప్లేస్‌లోకి చేర్చనక్కర్లేదు. టీనేజ్గర్ల్ మెచ్చే అందమైన డిజైనర్ టీ-షర్ట్‌ను మీరే స్వయంగా రూపొందించుకోవచ్చు. * పొడవు చేతులున్న టీ షర్ట్‌ను తీసుకోవాలి. దాని రెండు చేతులను సమాన కొలత తీసుకొని కట్ చేయాలి. * పొట్టి చేతులున్న టీ షర్ట్ అవుతుంది. ఇప్పుడు షర్ట్ కలర్ దారం తీసుకొని సూదితో చేతుల భాగంలో మధ్యన సన్నగా కుచ్చులు పెట్టాలి. దీంతో బుట్ట చేతుల్లా మారిపోతాయి. * కట్ చేసిన చేతుల భాగాలను చిన్న చిన్న ముక్కలు చేయాలి. * ఫొటోలో చూపిన విధంగా పువ్వుల్లా అమర్చి, కుట్లు వేయాలి. * ఇలా తయారుచేసుకున్న అన్నింటినీ ‘నెక్’ భాగంలో పెట్టి కుట్టాలి. * అన్నింటినీ ఒక క్రమపద్ధతిలో అమర్చి కుట్టువేస్తే ఒక హారంలా వస్తుంది. * మీ పిల్లలు మెచ్చే అందమైన బుట్టచేతుల డిజైనర్ టీ షర్ట్ కొత్తగా కనువిందుచేస్తుంది. * ప్లెయిన్ టీ షర్ట్‌లను ఇలా ఎన్నో విధాలుగా నూతనంగా రూపొందించుకోవచ్చు. కొత్త డ్రెస్ వేసుకున్నామన్న ఆనందం పిల్లల్లో కలుగుతుంది. డబ్బూ ఆదా అవుతుంది. -
అనుష్కతో బ్రేకప్ను ఇలా చెప్పాడా?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల సోషల్ మీడియాలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కంటే పాపులర్ అయ్యాడు. టి-20 ప్రపంచ కప్‌లో విరాట్ బ్యాటింగ్ మెరుపులను నెటిజన్లు తెగ ప్రశంసించారు. ఇక సోషల్ మీడియాలో విరాట్ ఆటతీరుతో పాటు అతని ప్రేమాయణం కూడా హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మతో రెండున్నరేళ్ల బంధాన్ని టి-20 ప్రపంచ కప్‌నకు ముందు విరాట్ తెగదెంపులు చేసుకున్నాడు. కోహ్లీ చేసిన పెళ్లి ప్రతిపాదనను అనుష్క ఒప్పుకోకపోవడం వల్లే వీరి బంధం తెగిపోయిందని వదంతులు షికారు చేశాయి. విరాట్ ఆడుతుంటే స్టేడియంలోని గ్యాలరీలో సందడి చేసే అనుష్క టి-20 ప్రపంచ కప్ సందర్భంగా ఎక్కడా కనిపించలేదు. అయితే గతవారం ఇద్దరూ కలసి మళ్లీ కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. గత బుధవారం ముంబై బాంద్రాలోని రాయల్టీ క్లబ్లో ఈ ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. దీంతో వీరి ప్రేమ మళ్లీ చిగురించిందంటూ బాలీవుడ్లో ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విరాట్ కొత్త ఫొటో బాగా పాపులరయింది. ఆ ఫొటోలో విరాట్ టీ షర్ట్ వేసుకున్నాడు. దానిపై 'వు వర్ ఆన్ ఏ బ్రేక్' అని రాసి ఉంది. అనుష్కతో బంధాన్ని తెగదెంపులు చేసుకున్నట్టు ఇలా టీ షర్ట్ ద్వారా వెల్లడించాడా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పోస్ట్ చేశారు. ఇంతకీ అనుష్కతో బంధాన్ని బ్రేకప్ చేసుకున్నాడా? లేక మళ్లీ కలసిపోయారా అన్నది కోహ్లీకే తెలియాలి! -
అమ్మీకోసం ఓ ఇల్లు!
ఆమిర్ ఖాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. ఇది సినిమా లెక్క కాదు. ఈ మిస్టర్ పర్ఫెక్ట్ వయసు లెక్క. సోమవారం ఆయన 51లోకి అడుగుపెట్టారు. పుట్టినరోజునాడు మీడియాను కలవడం ఆమిర్‌కి ఇష్టం. విదేశాల్లో ఉంటేనో, వేరే ఏదైనా బలమైన కారణం ఉంటేనో మాత్రమే మీడియాని కలవరు. ఈసారి ఎప్పటిలానే ఉదయం తన స్వగృహంలో మీడియా సమక్షంలో బర్త్‌డే కేక్ కట్ చేసి, కొన్ని విశేషాలు పంచుకున్నారు. ‘‘మా అమ్మీ (అమ్మ) కోసం ఓ ఇల్లు కొనాలనుకుంటున్నా’’ అని ఆమిర్ చెప్పడం ముచ్చటగా అనిపించింది. ఆమిర్ మాట్లాడుతూ -‘‘మా అమ్మీ తన చిన్నతనాన్ని వారణాసిలోని మా పూర్వీకుల ఇంట్లో గడిపింది. ఆ ఇంటిని నేను కూడా చూశాను. మా అమ్మీ పెరిగిన ఆ ఇంటిని కొనాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బర్త్‌డేకి నాకు ఉన్న అతి పెద్ద కోరిక ఏదంటే.. ఆ ఇల్లు కొనడమే. ప్రస్తుతం ఆ ఇంట్లో ఉంటున్నవాళ్లను రిక్వెస్ట్ చేశాను. వాళ్లు కనికరిస్తే, మళ్లీ మా పూర్వీకుల ఇంటిని సొంతం చేసుకుని, అమ్మీకి గిఫ్ట్‌గా ఇస్తా’’ అని చెప్పారు. ఇంకా తన భార్య కిరణ్ రావ్, కొడుకు అజాద్ గురించి ఆమిర్ చెబుతూ.. ‘‘ఈరోజు నాకు ముందుగా శుభాకాంక్షలు చెప్పింది మా అబ్బాయే. ఇదిగో ఇప్పుడు నేను వేసుకున్న టీ-షర్ట్ మా అబ్బాయి తయారు చేసినదే. కిరణే ఈ టీ-షర్ట్‌ని ప్రింట్ చేయించింది’’ అని ఆమిర్ మురిపెంగా చెప్పారు. -
షాపింగ్‌కి వెళితే అవి కొనకుండా ఉండలేను!
శ్రుతీహాసన్ ఫిజిక్ చాలా బాగుంటుంది. మోడ్రన్ దుస్తుల్లోనూ బాగుంటారు.. సంప్రదాయ దుస్తుల్లోనూ లవ్లీగా ఉంటారు. ఫ్యాషన్ ప్రపంచంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అందుకు అనుగుణంగా డ్రెస్సులు సెలక్ట్ చేసుకుంటారామె. ఆ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ - ‘‘నాకు తెలిసి బట్టలు, నగలు ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. నగల సంగతెలా ఉన్నా డ్రెస్సులంటే నాకు పిచ్చి. షాపింగ్ మాల్‌లోకి అడుగుపెట్టానంటే బట్టలు కొనకుండా ఉండలేను. జనరల్‌గా నాకు జీన్స్, టీ-షర్ట్ ఇష్టం. అవే సౌకర్యవంతంగా అనిపిస్తాయి. అయినప్పటికీ వేరే డ్రెస్సులు కూడా కొంటుంటాను. బట్టల పిచ్చి మాత్రమే కాదు.. నాకు పాదరక్షల పిచ్చి కూడా ఉంది. షాపింగ్‌కి వెళ్లినప్పుడు షూస్ కొనకుండా ఉండలేను. ఇప్పటివరకూ నా దగ్గర యాభై, అరవై షూస్ ఉన్నాయి. అన్నేం చేసుకుంటావని ఫ్రెండ్స్ అడుగుతుంటారు. నవ్వేసి ఊరుకుంటాను. సీజన్‌కి తగ్గట్టుగా, వేసుకున్న డ్రెస్‌కి మ్యాచింగ్‌గా షూలు వేసుకుంటాను’’ అని చెప్పారు. -
హన్నా.. నాన్న..
అమ్మాయిల వెంట పోకిరీలు పడటం.. ఈవ్‌టీజింగ్ వంటివి సాధారణమైపోయాయి. మరి దీనికి పరిష్కారమెలా? ఈ చిత్రంలోని వ్యక్తి వీటికో వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నాడు. ఓ టీ షర్ట్‌పై తన ఫొటోతో పాటు ‘బాయ్స్ జాగ్రత్త.. వీడు మా నాన్న’ అన్న వాక్యాలు ప్రింట్ చేయించి.. తన కుమార్తెకు వేసుకోమని ఇచ్చాడు. వాళ్ల నాన్న ఫొటో చూశారుగా.. ఒక్క గుద్దుకే చంపేసేటట్లున్నాడు. అబ్బాయిలు వెంట పడటం సంగతి అలా ఉంచితే.. కన్నెత్తి చూడ్డానికే భయపడేలా ఉందా బాడీ.. వీరు ఎక్కడివారు అన్న విషయం తెలియకపోయినా.. ప్రస్తుతం ఈ ఫొటో ఫేస్బుక్లో హల్చల్ చేస్తోంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన జుజిట్సూ(ఇదో మార్షల్ ఆర్ట్) ప్రపంచ చాంపియన్ కిట్ డేల్ తొలిసారిగా ఈ చిత్రాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తెలివైన నాన్న అంటూ కామెంట్ పెట్టారు. అక్కడ్నుంచి ఇది లక్షలాది లైకులు, కామెంట్లతో దూసుకుపోతోంది. -
టీ షర్ట్ ఖరీదు నాలుగు లక్షలు!
మానవత్వానికి చిరునామా టేలర్ స్విఫ్ట్ అని హాలీవుడ్లో అంటుంటారు. గాయనిగా, రచయిత్రిగా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్విఫ్ట్ సేవా కార్యక్రమాల ద్వారా మంచి మనిషి అనిపించుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే.. సహాయం చేయడానికి ముందుంటారామె. ఎంతోమంది పేద పిల్లలను చదివిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలకు భారీ ఎత్తున విరాళాలు ఇస్తుంటారు. ఇటీవల ఎయిడ్స్ బాధితుల సహాయార్థం జరిగిన ఓ వేలం పాట కార్యక్రమంలో పాల్గొన్నారు స్విఫ్ట్. నటుడు, నిర్మాత హగ్ జాక్మాన్ వాడిన టీ షర్ట్, బెల్ట్‌తో పాటు మరికొన్ని వస్తువులను వేలానికి పెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, జాక్మాన్ టీ షర్ట్‌ని నాలుగు లక్షలకు కొన్నారు స్విఫ్ట్. ఆ నాలుగు లక్షలకు అదనంగా ఇంకొంత డబ్బు చేర్చి, ఎయిడ్స్ బాధితుల సహాయార్థం ఇచ్చేశారు. ఇలా సేవా కార్యక్రమల కోసమే బోల్డంత డబ్బు ఖర్చుపెడుతుంటారట. అందుకే రెండేళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడి సతీమణి మిచెలీ ఒబామా ‘డెడికేషన్ టు హెల్పింగ్ అదర్స్’ అనే అవార్డుని టేలర్ స్విఫ్ట్‌కి ఇచ్చారు. -
ఫ్యాషన్ బ్రాండ్‌నేమ్!
సత్వం ఎవరో గల్లీకుర్రాడు వేసుకున్న టీ షర్ట్ మీద మీకు ఈ పేరు కనిపించివుండొచ్చు: క్యాల్విన్ క్లెయిన్! సంక్షిప్తంగా సి.కె. అదేమిటో కూడా తెలియకుండానే, ఒప్పందం కుదుర్చుకోని మోడల్‌గా మారిపోయాడు కుర్రాడు. ‘ఫ్యాషన్ బిజినెస్ ఇక ఎంతమాత్రమూ స్థానికమైనది కాదు; అది ప్రపంచ వ్యాపారం’ అని చెప్పే అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ క్యాల్విన్ క్లెయిన్... ప్రపంచం మీదకు చొచ్చుకువచ్చిన తీరుకు ఇది అద్దం పడుతుంది. పచారీ కొట్టు నడిపే తండ్రికి 1942 నవంబరు 19న జన్మించిన క్లెయిన్... ఐదేళ్లప్పుడు వాళ్ల చెల్లెలి బొమ్మలకు బట్టలు కుట్టాడు. నెమ్మదిగా అది ఆడవాళ్ల దుస్తుల మీద ప్రత్యేక ఆసక్తికి కారణమైంది. 60ల చివర్లో సొంత స్టోర్ ప్రారంభించాడు. ర్యాంగ్లర్, లీవై, లీ లాంటి ‘సంప్రదాయ జీన్సు తయారీదార్ల’ కు పోటీగా, ‘మా ఉత్పత్తులకు మాదైన తంత్రం, మాదైన తత్వం అద్దుతాం,’ అని బరిలోకి దిగాడు. ‘నాకూ క్యాల్విన్స్‌కు మధ్యన ఏముందో తెలుసుకోవాలనుందా? ఏమీలేదు’ అంటూ తొలియౌవనంలో ఉన్న బ్రూక్ షీల్డ్స్‌తో ఊహకు అవకాశమిచ్చేలా డైలాగ్ చెప్పించాడు. ‘నీకు పూర్తిగా తగినది కనుక్కో’మని ఊరిస్తూ, కౌమారంలోకి అడుగిడుతున్న అమ్మాయిలను ఆకట్టుకున్నాడు. ‘ఇంతకుముందుకంటే మనుషులు మరింత చక్కటి ఆకృతుల్లో ఉంటున్నారు. కొంచెం శ్రద్ధ పెడితే మీరు బాగా కనబడతారు. దుస్తులు ధరించినప్పుడు యౌవనపు అనుభూతి కలగాలి. అవి మీ ధోరణిని ప్రతిబింబిస్తాయి’ అని చెప్పాడు. ‘ఆధునిక సొగసు’కు మాస్టర్ డిజైనర్‌గా పేరొందిన సి.కె. తన పేరునే బ్రాండ్‌నేమ్ చేసుకున్నాడు. కోట్లు, జీన్సు, అండర్వేర్, స్పోర్ట్స్ వేర్, హ్యాండ్ బ్యాగ్స్, పెర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్, బెడ్ షీట్స్, డైనింగ్ టేబుల్స్, డిషెస్, గ్లాస్‌వేర్... ఇలా అన్నింటా విస్తరిస్తూ వచ్చాడు. ‘ఎంతకాలం మన్నుతుంది, అనేదాన్నిబట్టి జీన్సు ధర నిర్ణయమవదు; దాన్ని ఉత్పత్తి చేయడంలో ఎంత శ్రమ దాగుంది? డిజైన్ సామర్థ్యం, వాష్ ఎంత అసలైనది... ఇలాంటివి ధరను నిర్ణయిస్తాయి’ అంటాడు. క్యాల్విన్ అన్ని సందర్భాల్లోనూ ఉత్పత్తిదారు కాదు. తన స్పెసిఫికేషన్స్‌కు తగ్గట్టుగా ఉత్పత్తుల్ని రూపొందించేలా ఇతర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. అమ్మకాల మీద రాయల్టీలు పొందుతాడు. ఎన్ని రకాల డిజైన్లు చేసినప్పటికీ, తనను తాను తొలుత ఉమెన్ డిజైనర్‌గా భావిస్తాడు. మహిళల శరీరాలు, వాటి ధర్మాలు, వారి కోరికలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ‘వాళ్లకు సంబంధించిన ప్రతిదీ, ఇన్నర్‌వేర్, ఔటర్వేర్ ఏదైనా తేడా లేదు’; వాళ్లు అన్నీ అందంగానే ఉండాలని కోరుకుంటారంటాడు. ‘ఉత్పత్తికి సంబంధించిన ప్యాకేజింగ్, దాని వాణిజ్య ప్రకటన అన్నీ ఆ ఉత్పత్తిని ప్రతిబింబించాలి... అయితే, సెలబ్రిటీలకు నా బ్రాండ్ దుస్తులను తొడిగించడంలో ఏనాడూ ఆసక్తిలేదు; ఆధునిక అమెరికా మహిళ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడ్రన్ వర్కింగ్ వుమెన్... ఆమె యాక్టివ్, యంగ్, తనకో కుటుంబం ఉంటుంది, బిజీగా ఉంటుంది... స్త్రీగా ఉండటాన్ని ఆనందిస్తూనే కేవలం ఫ్యాషన్ బొమ్మగా పరిగణించడాన్ని సహించదు... వాళ్లు సోషలైట్స్ కానక్కర్లేదు... అలాంటివాళ్లకు డిజైన్ చేయడం’లో తనకు ఆనందం ఉందంటాడు. అయితే వాణిజ్య ప్రకటనల్ని‘సెక్సీ’గా రూపొందించడం ద్వారా చాలాసార్లు విమర్శల పాలయ్యాడు. అలాగే, సౌష్టవమైన దేహంకన్నా బక్కపలుచటి మోడల్ కేట్‌మాస్‌ను వినియోగించినప్పుడు కూడా, ‘అస్తవ్యస్త పోషణ’కు కారణమయ్యాడంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, చక్కటి ఆకృతిలో ఉండటానికిగానూ వ్యాయామం చేసేలా ప్రేరేపిస్తోందికదా, అని నవ్వేస్తాడు. మద్యపానం, మాదకద్రవ్యాలు, బై సెక్సువల్ ఇమేజీ కూడా ఆయన్ని చాలాకాలం ప్రతికూల వార్తల్లో ఉంచాయి. తన ఉత్పత్తులకు తరచూ మోడళ్లను రిపీట్ చేస్తాడు క్యాల్విన్. దానిలో ఉన్న సానుకూల అంశం ఏమిటంటే, ‘అది ఉత్పత్తికి సంబంధించిన కొనసాగింపు’ను సూచిస్తుందంటాడు. తన ఉత్పత్తులకు మోడళ్లనే ఎక్కువగా వినియోగించడానికి కారణం, ‘మోడల్ ఎంతో చెప్పగలుగుతుంది. అదే సెలబ్రిటీలు, నటులు వారిదైన మనుషులు’ అంటాడు. అందుకే, ప్రయాణిస్తున్నప్పుడు దారిలో కనబడిన మనిషి దగ్గర తన కారు ఆపుకొని అతణ్ని ఎంపిక చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి(ఉదా: టామ్ హింట్‌నౌస్). తనను మరొకరు కాపీ కొట్టడం సంతోషమేనని చెబుతాడు. ‘ఫ్యాషన్ పరిశ్రమ అనేది కొత్తది కనుక్కోవడం కాదు’, ఉన్నదాన్ని మెరుగుపరుచుకుంటూ వెళ్లేదే! ‘అసలు ఎవరైనా మనల్ని కాపీ కొట్టకపోతేనే సమస్య. మనం సరైనది ఇవ్వనట్టు లెక్క’ అంటాడు. ఫ్యాషన్ గురించి చక్కటి ముక్తాయింపు ఇస్తాడు. ‘ఒకరిని అందంగా కనిపింపజేయడంలో సహాయపడటానికి మించిన ఉత్సాహవంతమైన పని ఇంకేముంటుంది?’ - ఆర్.ఆర్. ఒకరిని అందంగా కనిపింపజేయడంలో సహాయపడటానికి మించిన ఉత్సాహవంతమైన పని ఇంకేముంటుంది?’ - క్యాల్విన్ క్లెయిన్, ఫ్యాషన్ డిజైనర్ -
అత్తయ్య ఐతేనేం?కత్తుల రత్తయ్య ఐతేనేం?
రెక్కలు టపటపలాడించడానికి.. రివ్వున ఎగిరిపోడానికీ... కాలం కాదిది. చలి ఎలా ఉందో చూశారు కదా! కత్తుల రత్తయ్యలా తిరుగుతోంది. కొత్త కోడలి అత్తగారిలా వణికిస్తోంది. బయటికి బయల్దేరినవారెవరైనా... నిండా స్వెటర్ కప్పుకుని బుద్ధిగా చేతులు కట్టుకుని భుజాలను దగ్గరకు బిగించుకుని ‘కృష్ణా, రామా...’ అనుకుంటూ వెళ్లిన దారినే వచ్చేయడం క్షేమకరం. కానీ మగువలు ఊరుకుంటారా! చలి గాలులకు జడిసి నిలబడిపోతారా?! చలి కోట్ల కింద అందమైన డ్రెస్‌లను దాచేసుకుని వేడుకలను వెలవెలబోనిస్తారా! నో... వే..! ఊలుతోనే సల్వార్ కమీజ్‌లు, ఊలుతోనే లెగ్గింగ్స్ డిజైన్ చేయించుకుని... వింటర్లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు! మీరూ ఫాలో అవండి! అదే బెస్ట్. ఆల్ ది బెస్ట్. 1- లక్నో వర్క్ చేసిన జ్యూట్, కాటన్ మెటీరియల్‌తో తయారు చేసిన బ్లేజర్ చలిని ఆపుతుంది. దీనికి ఇన్నర్‌గా కాంట్రాస్ట్ స్పగెట్టి లేదా టీ షర్ట్ వేసుకొని, జీన్స్‌కి మ్యాచ్ అయ్యే బెల్ట్ వాడాలి. కార్పొరేట్ ఉద్యోగులు ఇలా రెడీ అయితే వింటర్లో సౌకర్యవంతంగానూ, స్టైల్‌గానూ కనిపిస్తారు. 2- లేత పచ్చపువ్వుల ప్రింట్ ఉన్న మందపు కాటన్ క్లాత్‌తో డిజైన్ చేసిన బ్లేజర్, లోపల స్పగెట్టి లేదా టీ షర్ట్ ధరించి బెల్ట్ వాడాలి. జెగ్గింగ్ లేదా జీన్స్ ధరిస్తే స్టైల్‌గా ఉంటుంది. ఈ డ్రెస్ చలిని తట్టుకునేవిధంగా ఉంటుంది. సింపుల్‌గా సౌకర్యవంతంగా అనిపించే ఇలాంటి స్టైల్స్‌ని మీరూ ట్రై చేయవచ్చు. 3- ఆరెంజ్ రా సిల్క్ టాప్ పైన వెల్వెట్ ఓవర్ కోట్ వాడాలి. వెల్వెట్ క్లాత్ మందంగా ఉంటుంది. చలి తట్టుకునే విధంగానూ, ఫ్యాషన్‌గానూ ఉంటుంది. టాప్‌కి వాడిన ముదురురంగు లైన్స్‌ను బట్టి జెగ్గింగ్ ఎంచుకుంటే పర్ఫెక్ట్ వింటర్ డ్రెస్ అవుతుంది. 4- జెగ్గింగ్ ధరించి, పైన టీ షర్ట్ వేసి ఆపైన ఊలు ఓవర్ కోట్‌ను వాడటంతో స్టైల్‌గా కనువిందుచేస్తోంది ఈ డ్రెస్. కాలేజీకెళ్లే అమ్మాయిలకు ఈ స్టైల్ బాగుంటుంది. 5- ఊలుతో డిజైన్ చేసిన డ్రెస్సులు చలిని ఆపుతాయి. అందుకని స్వెటర్స్ అల్లేవారితో సల్వార్ కమీజ్, లెగ్గింగ్స్ మన శరీర కొలతల ప్రకారం తయారుచేయించుకోవచ్చు. వంగపండు రంగు ఊలుతో డిజైన్ చేసిన ఈ సల్వార్ కమీజ్, నలుపు రంగు ఊలుతో తయారుచేసిన ఈ లెగ్గింగ్ అలా డిజైన్ చేసినవే! నెక్కి గోటా బార్డర్, బ్లాక్ అండ్ వైట్ వీవింగ్ వల్ల ఈ సల్వార్ కమీజ్ హైలైట్‌గా నిలిచింది. ఊలుకు సాగే గుణం ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ డ్రెస్ పైన రెగ్యులర్ యాక్సెసరీస్ ఏవైనా వాడుకోవచ్చు. ట్రెడిషనల్‌గా ఉండాలంటే డ్రెస్‌లోని రంగులను బట్టి ఇయర్ రింగ్స్, చెప్పులు ధరించాలి. మోడల్స్: అశ్విని, సొనాలి ఫొటోలు: శివమల్లాల మంగారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ www.mangareddy.com