న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత (Rahul Gandhi)రాహుల్ గాంధీ సామాన్యులకు హక్కుల సాధనే లక్ష్యంగా ఆదివారం , (white T-shirt)‘వైట్ టీ–షర్ట్’ఉద్యమం ప్రారంభించారు. తన ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీ ఆదివారం ‘ఎక్స్’లో..‘ఆర్థిక న్యాయం కోరుకునే వారు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలను నిరసించేవారు, సామాజిక సమానత్వం కోసం పోరాడేవారు, అన్ని వివక్షలను వ్యతిరేకించేవారు, దేశంలో శాంతి స్థిరతలను కోరుకునే వారు తెల్ల టీ–షర్ట్‌లను ధరించండి. ఉద్యమంలో పాల్గొనండి’అని కోరుతూ ఓ వీడియో షేర్ చేశారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలు, ఉద్యోగులను పట్టించుకోవడం మానేసింది. ప్రభుత్వం దృష్టంతా కేవలం కొందరు పెట్టుబడిదారులను మరింత ధనవంతులను చేయడంపైనే ఉంది. అందుకే, అసమానతలు పెరుగుతూ పోతున్నాయి. తమ రక్తం, స్వేదంతో దేశం కోసం కృషి చేస్తున్న సామాన్యుల పరిస్థితి మరింత దిగజారుతోంది.
వారు అనేక అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురి కావాల్సి వస్తోంది’అని రాహుల్ పేర్కొన్నారు. ‘ఇటువంటి పరిస్థితుల్లో, వారికి న్యాయం, హక్కులు దక్కేందుకు గట్టిగా నినదించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఇందుకు వైట్ టీ–షర్ట్ ఉద్యమం చేపట్టామన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొనాలనుకునే వారు, ఇందుకు సంబంధించిన మరింత సమాచారం కావాలనుకునే వారు https://whitetshirt.in/home/hin అనే లింకును తెరవాలని, లేదా 9999812024 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment