టాప్స్.. రీ ఫ్యాషన్
న్యూలుక్
ఎప్పుడూ వేసుకునే టాప్సే.. ఎప్పుడూ వేసుకునే ట్యునిక్సే..
ఎప్పుడూ వేసుకునే షర్ట్‌లే.. ఎప్పుడూ వేసుకునే టీ షర్ట్‌లే..
కొత్తగా మార్చేదెలా? సింపుల్‌గా ఇలా!!
లేత రంగులో ఉన్న ప్లెయిన్ టీ షర్ట్‌కు గాఢమైన కలర్ క్లాత్‌ను ఇలా జత చేస్తే ఓ కొత్త మోడల్ టాప్ రెడీ. పొడవు చేతుల షర్ట్ అయినా, పొట్టి చేతుల చొక్కా అయినా వీపు భాగంలో త్రికోణాకృతిలో కట్ చేయాలి. దీనికి మరో కాంట్రాస్ట్ కలర్ క్లాత్ లేదా, లేస్‌ను జత చేయాలి. ఇలా చూడముచ్చటైన మరో టాప్ స్టైల్‌గా మీ ముందు సిద్ధం అవుతుంది. క్యాజువల్ వేర్‌లో ఓ స్టైల్‌ని క్రియేట్ చేస్తుంది. మిడ్ స్లీవ్స్ ప్లెయిన్ ట్యునిక్‌కి ఛాతి భాగం నుంచి ప్రింట్ మెటీరియల్‌తో స్కర్ట్‌లా కుట్టి, జత చేయాలి. ఇలా మరో అందమైన టాప్ సిద్ధం. ఈవెనింగ్ వెస్ట్రన్ పార్టీలకు స్టైల్‌గా కనువిందుచేస్తుంది.
ప్లెయిన్ టీ షర్ట్ లేదా కుర్తీ అయినా తీసుకోండి. భుజం మీద నుంచి చేతుల భాగం వరకు కట్ చేయండి. కట్ చేసిన భాగాన్ని జత చేస్తూ అందమైన లేస్ వేస్తే సరి. మరో అందమైన టాప్ వేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఉన్న డ్రెస్‌లనే రీ మోడల్ చేస్తే ఇలాంటి స్టైలిష్ టాప్స్ మీ వార్డ్రోబ్‌లో చేరిపోతాయి. వాటిని ధరిస్తే నలుగురిలో మీకో ప్రత్యేకతను తెచ్చిపెడతారు.