పొడవు కఫ్తాన్‌ని కుట్టేస్తే పగలే కాదు రాత్రి పూట ధరించడానికి వీలుగా నైట్ వేర్ అవుతుంది. అంటే మ్యాక్సీ కఫ్తాన్ అన్నమాట. ,టర్కీలో కొన్నేళ్ల క్రితమే మొదలైన ఈ స్టైల్ ఇప్పుడు మన దగ్గర కొత్తగా రూపుకట్టింది. అతివలకు సౌకర్యవంతమైన డ్రెస్‌గా పేరొందింది. అందంలో అన్నింటా తానే ముందుంటా నంటోంది కఫ్తాన్!
డ్రెస్ స్టైలిష్‌గా ఉండాలి. అదే సమయంలో సౌకర్యంగా ఉండాలి. ఈ రెండు కఫ్తాన్ సొంతం. అందుకే యంగేజ్ వాళ్లే కాదు అమ్మలు కూడా కఫ్తాన్‌ని ఇష్టపడి ధరిస్తున్నారు. క్యాజువల్ వేర్ నుంచి కలర్‌ఫుల్ పార్టీ వరకు కఫ్తాన్ రాణిస్తుంది.
అటో కుట్టు... ఇటో కుట్టు...సింపుల్‌గా కట్టు... స్టైల్‌కి... నిండుతనానికి.. నిలువెత్తు అందం తాను.
♦ ధరించడంలోనే కాదు నచ్చిన క్లాత్‌తో కఫ్తాన్‌ని ఎవరికి వారు డిజైన్ చేసుకోవడం చాలా సులువు. దీనికి పెద్ద పెద్ద ప్రణాళికలు, డ్రాఫ్టింగ్‌లు అస్సలు అవసరం లేదు
♦ చతురస్త్రం లేదా దీర్గచతురస్త్రం కొలతతో ఎంచుకున్న ఫ్యాబ్రిక్‌ని రెండు మడతలుగా వేసి, చేతుల వద్ద (లాంగ్, షార్ట్ స్లీవ్స్) తగినంత వదిలేసి, రెండు వైపులా కుట్టేస్తే చాలు
♦ నడుము, ఛాతీ, హిప్ దగ్గర కొంత కొలత తీసుకొని మార్క్ చేసి కూడా కుట్టేయవచ్చు.
♦ ఈ కుట్టు వల్ల సల్వార్ కమీజ్ లుక్ వస్తుంది
♦ కఫ్తాన్ టైట్ ఫిట్ ఉండదు. రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. ఇండోవెస్ట్రన్ కాక్‌టెయిల్ పార్టీస్‌కి బాగా నప్పుతుంది
♦ రేయాన్, కాటన్ సిల్క్ మిక్స్‌డ్ ఫ్యాబ్రిక్ కూడా కఫ్తాన్స్‌కి బాగుంటుంది. పొట్టి కఫ్తాన్ జీన్స్ మీదకు బాగుంటుంది
♦ దూరప్రయాణాలలోనూ కఫ్తాన్ చాలా సౌకర్యంగా ఉంటుంది. దీనికి ప్రత్యేకించి దుపట్టా, స్కార్ఫ్ వంటివి అదనంగా వాడనవసరం లేదు. బాటమ్‌గా పలాజో సరైన ఎంపిక
♦ గర్భవతులకు కూడా సౌకర్యవంతమైన డ్రెస్ ఇది.
♦ ధోతీ మీదకు కఫ్తాన్ ధరిస్తే ఇండో వెస్ట్రన్ స్టైల్ ఆకట్టుకుంటుంది. పార్టీలో ప్రత్యేకతను చాటుతుంది.
♦ సిల్క్, క్రాప్ కాటన్స్, జార్జెట్స్, షిఫాన్స్.. కఫ్తాన్స్‌కి బాగా సూటవుతాయి. స్టిప్‌గా ఉండే ఫ్యాబ్రిక్ దీనికి సూట్ అవదు.
♦కఫ్తాన్ చుట్టూ అంచు, నెక్ పార్ట్‌లోనూ చిన్న చిన్న బుటీ వచ్చేలా డిజిటల్ ప్రింట్ వేసుకోవచ్చు. లేదంటే ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. మగ్గం వర్క్‌తోనూ డిజైన్ చేసుకోవచ్చు. పార్టీకి వెలుతున్నప్పుడు కఫ్తాన్‌కి బాటమ్‌గా స్లిమ్ సూట్ ట్రౌజర్ ధరిస్తే అందంగా కనిపిస్తారు.
♦నలుచదరంగా ఉండే క్లాత్ మీద డిజిటల్ ప్రింట్ వేశారు. ఈ ప్రింట్ లేదంటే లైట్ బార్డర్ వేసుకొని కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు.
♦ ఏ ఆభరణమైనా బాగుంటుంది. అయితే, ధరించి కఫ్తాన్ స్టైల్, సందర్భాన్ని బట్టి ఆభరణాల ఎంపిక ఉండాలి. సల్వార్ కమీజ్ లాంటి కఫ్తాన్ వేసుకుంటే బుట్టలు ట్రెడిషనల్ జువెల్రీ కూడా వాడచ్చు. పాదర క్షల విషయంలోనూ ప్రత్యేకతలు అవసరం లేదు. బాటమ్‌ని బట్టి ప్లాట్స్, హీల్స్ ఎంచుకోవచ్చు.
♦ క్యాజువల్ వేర్ లుక్ రావాలంటే మోకాలి వరకు ఉన్న కఫ్తాన్ ధరించాలి. బాటమ్‌గా చుడీ వేసుకుంటే సల్వార్ కమీజ్ డ్రెస్‌లా ఉంటుంది. నీ లెంగ్త్ కన్నా కిందకు వేసుకుంటే చుడీ వేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment