Shocking: Doctors Leaves Cloth Inside Woman Stomach In Jagtial District, Details Inside - Sakshi
Sakshi News home page

Jagtial: 16 నెలల క్రితం మహిళ కడుపులో క్లాత్‌ వదిలేసిన వైద్యులు.. చివరికి ఏం జరిగిందంటే?

Published Tue, Apr 18 2023 10:59 AM | Last Updated on Tue, Apr 18 2023 1:13 PM

Doctors Leaves Cloth Inside Woman Stomach In Jagtial District - Sakshi

సాక్షి, జగిత్యాల జిల్లా: మేం చాలా గొప్పగా పనిచేస్తున్నామని చెప్పుకునే కొందరు తెలంగాణ మంత్రుల మాటలకు భిన్నంగా.. అడుగడుగునా నిర్లక్ష్యపు ఛాయలు బట్టబయలవుతూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిలువెత్తు నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.

కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన నవ్యశ్రీ అనే మహిళకు పదహారు నెలల క్రితం.. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయింది. అయితే ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు కడుపులోనే క్లాత్ వదిలేయడం కలకలం రేపుతోంది.

ఏడాది తర్వాత నవ్యశ్రీకి తీవ్ర కడుపు నొప్పి రావడంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకుంది. స్కానింగ్‌లో కడుపులో బట్ట ఉన్నట్టు గుర్తించగా.. వెంటనే ఆసుపత్రిలో సర్జరీ చేసి బట్ట తొలగించారు. ఈ మొత్తం విషయాన్ని లేఖలో పేర్కొంటూ నవ్యశ్రీ కుటుంబీకులు జగిత్యాల డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు.
చదవండి: తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement