Cloth
-
మహాకాళేశ్వరునికి విశేష హారతి.. మువ్వన్నెల వస్త్రం
నేడు(పంద్రాగస్టు) దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్‌లోని జ్యోతిర్లింగ క్షేత్రం మహాకాళేశ్వర ఆలయంలో స్వామివారికి విశేష హారతి ఇవ్వడంతోపాటు మువ్వన్నెల వస్త్రాన్ని సమర్పించారు.ఈరోజు తెల్లవారుజామునే మహాకాళేశ్వరుని ముంగిట భస్మహారతి కూడా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భస్మహారతి అనంతరం మహాకాళేశ్వరునికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం మువ్వన్నెల వస్త్రాన్ని సమర్పించారు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి నుంచే ఆలయం అంతటా ఆకర్షణీయమైన లైట్లను అలంకరించారు. దీంతో ఆలయం మూడు రంగుల కాంతితో వెలుగొందింది. ఆలయం పైభాగంలో జాతీయ జెండాను కూడా ఎగురవేశారు. ఆలయ పూజారులు తెలిపిన వివరాల ప్రకారం అన్ని హిందూ పండుగలతో పాటు జాతీయ పండుగలను కూడా ఆలయంలో నిర్వహిస్తారు. కాగా భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. -
కూకట్‌పల్లిలో వస్త్ర దుకాణం ప్రారంభోత్సంలో మోడల్స్ సందడి (ఫొటోలు)
-
16 నెలల క్రితం మహిళ కడుపులో క్లాత్ వదిలేసిన వైద్యులు.. చివరికి ఏం జరిగిందంటే?
సాక్షి, జగిత్యాల జిల్లా: మేం చాలా గొప్పగా పనిచేస్తున్నామని చెప్పుకునే కొందరు తెలంగాణ మంత్రుల మాటలకు భిన్నంగా.. అడుగడుగునా నిర్లక్ష్యపు ఛాయలు బట్టబయలవుతూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిలువెత్తు నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన నవ్యశ్రీ అనే మహిళకు పదహారు నెలల క్రితం.. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయింది. అయితే ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు కడుపులోనే క్లాత్ వదిలేయడం కలకలం రేపుతోంది. ఏడాది తర్వాత నవ్యశ్రీకి తీవ్ర కడుపు నొప్పి రావడంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకుంది. స్కానింగ్‌లో కడుపులో బట్ట ఉన్నట్టు గుర్తించగా.. వెంటనే ఆసుపత్రిలో సర్జరీ చేసి బట్ట తొలగించారు. ఈ మొత్తం విషయాన్ని లేఖలో పేర్కొంటూ నవ్యశ్రీ కుటుంబీకులు జగిత్యాల డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. చదవండి: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు -
పేరుకే పెద్ద ఆస్పత్రి..కనీసం స్ట్రెచర్ లేక వృద్ధుడి పాట్లు: వీడియో వైరల్
కొన్ని ప్రభుత్వాస్పత్రులు పేరుకే పెద్ద ఆస్పత్రులు గానీ అందులో సౌకర్యాలు మాత్రం నిల్. దీంతో చికిత్స కోసం వచ్చే రోగులు పడే ఇబ్బందులు అంత ఇంత కాదు. చిన చితక పనులు చేసుకునే పేదలకు ఆ ఆస్పత్రులే గతి. దీంతో అక్కడ ప్రభుత్వోద్యోగులు వీళ్లపట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. అచ్చం అలాంటి పరిస్థితి ఓ ప్రభుత్వాస్పత్రిలో వృద్ధుడు ఎదుర్కొన్నాడు. కనీసం రోగిని తీసుకువెళ్లేందకు స్ట్రెచర్లు లేక అతని తీసుకువెళ్తున్న విధానం చూస్తే ఆ ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం రాక మానదు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్‌లోని గాల్వియర్‌లో సుమారు వెయ్యి పడకల ప్రభుత్వాస్పత్రికి ఓ వృద్ధుడు వచ్చాడు. అతని కాలు విరిగిపోవడంతో చికిత్స కోసం తన కోడలితో కలిసి ఆస్పత్రికి వచ్చాడు. ఐతే అక్కడ ఆర్థోపెడిక్ విభాగంలోని శ్రీకిషన్ ఓజా(65)ను ట్రామా విభాగానికి తరలించాలని సూచించారు. ఐతే అతన్ని తీసుకువెళ్లేందు కోసం స్ట్రెచర్ కోసం వెళ్లింది కానీ వాటికి చక్రాలు లేవు. దీంతో తన మామను ఒక తెల్లటి క్లాత్‌లో కూర్చొబెట్టి లాక్కుని వెళ్లింది. అక్కడ నుంచి ఆటో తీసుకుని ట్రామాకేర్ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఐతే అక్కడ రోగులు స్ట్రెచర్లు ఉన్నాయే కానీ పనిచేయనవని చెబతున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. Video: No Hospital Stretcher, Elderly Man With Broken Leg Dragged On Cloth In Gwalior Hospital https://t.co/2NAOIfdZ6W pic.twitter.com/F0uWTMiPk3 — NDTV (@ndtv) March 25, 2023 (చదవండి: మీ ఛాతీపై బీజేపీ బ్యాడ్జి పెట్టుకోండి అంటూ విలేకరిపై రాహుల్ ఫైర్) -
వైద్యుల నిర్వాకం.. పేషెంట్ కడుపులో సర్జికల్ క్లాత్ మరిచి..
మైలవరం(ఎన్టీఆర్ జిల్లా): ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. గర్భసంచి తొలగించేందుకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు కడుపులోనే సర్జికల్ క్లాత్ వదిలేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన కొరివిడి శివపార్వతి తరచూ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేది. ఆమె ఆరు నెలల కిందట ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని అను హాస్పటల్‌కు వెళ్లింది. ఆమెకు వైద్యులు గర్భసంచి తొలగించాలని చెప్పి ఆపరేషన్ చేశారు. అయినా కడుపునొప్పి తగ్గకపోవడంతో మళ్లీ పలుమార్లు అను ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. చివరికి 20 రోజుల కిందట విజయవాడలోని హరిణి ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు స్కానింగ్ చేసి కడుపులో గుడ్డ వంటి పదార్థం ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ చేయగా బాధితురాలి కడుపులో సర్జికల్ క్లాత్ ఉండటంతో తొలగించారు. శివపార్వతి డిశ్చార్జి అయిన అనంతరం మంగళవారం ఈ విషయంపై మాట్లాడేందుకు మైలవరంలోని అస్పత్రికి వచ్చి ఆమె బంధువులు... వైద్యులు సరిగా స్పందించలేదని ఆందోళన చేశారు. చదవండి: డేటా కేబుల్‌తో ప్రియురాలిని చంపి.. అదే రోజు మరో అమ్మాయితో పెళ్లి! -
నేతన్నలకు ‘జెండా’ పండుగ
పవర్‌లూమ్స్‌పై పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్న ఇతని పేరు మామిడాల సమ్మయ్య. సిరిసిల్లలోని విద్యానగర్‌కు చెందిన సమ్మయ్య నిత్యం 12 సాంచాలపై పనిచేస్తూ పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. సమ్మయ్యకు వారానికి రూ.2,500 కూలి వస్తుంది. ఇలా ఒక్క సమ్మయ్యనే కాదు.. సిరిసిల్లలో 5 వేల మంది కార్మికులు శ్రమిస్తున్నారు. జాతీయ జెండాల తయారీపని చేస్తున్న వీరు సిరిసిల్లకు చెందిన మహిళలు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అందుకు అవసరమైన జెండాలను సిరిసిల్లలో సిద్ధం చేస్తున్నారు. సిరిసిల్లలో జెండాలు తయారుచేసే పది మంది వ్యాపారులు ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాలకు జెండాలను సరఫరా చేస్తున్నారు. సిరిసిల్ల: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రజల్లో దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా.. మహనీయు ల త్యాగాలు.. పోరాటఫలాలు నేటి తరానికి తెలిసేలా ప్రతి ఇంటిపై జాతీయజెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15కి ముందు వారం, తరువాత మరో వారం రోజులు భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణవ్యాప్తంగా 1.20 కోట్ల జాతీయ జెండాలు అవసరం ఉండగా.. పాలిస్టర్ వస్త్రాన్ని టెస్కోద్వారా కొ నుగోలుచేసి, ఆ వస్త్రాన్ని ప్రాసెసింగ్ చేసి, మూడు రంగుల జెండాలను తయారుచే యాలని నిర్ణయించారు. ఈ మేరకు సిరిసిల్ల నేతన్నల వద్ద 30 లక్షల మీటర్ల వస్త్రాన్ని కొ నేందుకు టెస్కో ఆర్డర్లు ఇచ్చింది. సిరిసిల్లలో 30 లక్షల మీటర్ల వస్త్రం కొనుగోలు.. తెలంగాణవ్యాప్తంగా 38,588 పవర్‌లూమ్స్ ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 28,494 పవర్‌లూమ్స్ ఉన్నాయి. 4,116 సాంచాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. అతి తక్కువ సాంచాలతో (18) సంగారెడ్డి జిల్లా చివరిలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, వరంగల్, భువనగిరి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న పాలిస్టర్ వస్త్రాన్ని టెస్కో కొనుగోలు చేస్తోంది. సిరిసిల్లలోనే 30 లక్షల మీటర్లు కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వస్త్ర నాణ్యత, పొడవు, వెడల్పును బట్టి రూ.13 నుంచి రూ.16 వరకు ఒక్కో మీటరుకు చెల్లించాలని నిర్ణయించారు. సిద్ధమవుతున్న జెండాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి సిరిసిల్లకు ఆర్డర్లు వచ్చాయి. దీంతో జెండాలు తయారుచేసే వ్యాపారులు బిజీగా మారా రు. ఇక్కడి పది మంది వ్యాపారులకు 50 లక్షల జెండాల తయారీ ఆర్డర్లు వచ్చాయి. వీటి ద్వారా 1,200 మంది మహిళలు జెండాలు కుడుతూ ఉపాధి పొందుతున్నారు. ఇది అనుకోని ఆర్డర్ టెస్కో ద్వారా పాలిస్టర్ వస్త్రాన్ని కొనుగోలు చేస్తారని తెలియదు. ఇది అనుకోని ఆర్డర్. నాకు 52 సాంచాలు ఉన్నాయి. నా వద్ద నిల్వ ఉన్న 50 వేల మీటర్ల వస్త్రాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నా. టెస్కో కొనుగోలు చేయడం ఆనందంగా ఉంది. – కోడం విజయ్, వస్త్రోత్పత్తిదారుడు, సిరిసిల్ల ఢిల్లీకి 5 లక్షల జెండాలు ఇస్తున్నా.. నాకు ఢిల్లీ నుంచి జూలై 10న ఐదు లక్షల జెండాల ఆర్డర్లు వచ్చాయి. కొంచెం ముందుగా ఆర్డర్లు వస్తే ఇంకా బాగుండేది. ఇప్పుడు చాలా రాష్ట్రాల ఆర్డర్లు వస్తున్నాయి. కానీ సమయం సరిపోదు. నా వద్ద ఓ 50 మంది ఉపాధి పొందుతున్నారు. – ద్యావనపల్లి మురళి, వ్యాపారి, సిరిసిల్ల నెలకు రూ.6 వేలు సంపాదిస్తున్న నేను బీడీలు చేసిన. ఆ పని కష్టంగా ఉండటంతో జెండాలు కుట్టడం, ప్యాకింగ్ చేయడం చేస్తున్న. నెలకు రూ.6వేలు సంపాదిస్తున్న. మా ఆయన సాంబశివ సాంచాలు నడుపుతారు. మాకు ఇద్దరు పిల్లలు. ఈ పని బాగుంది. నాలాగే చాలా మంది ఈ పని చేస్తున్నారు. – వెల్దండి శైలజ, సిరిసిల్ల -
యాపిల్ పరువు తీసి పడేశాడు.. కొత్తేం కాదుగా!
అమెరికా కంపెనీలన్నా.. వాటి ఉత్పత్తులన్నా టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కి ఎనలేని మంట. ఛాన్స్ దొరికినప్పుడల్లా వాటి మీద తన శైలిలో సెటైర్లు వేస్తుంటాడు కూడా. ఈ తరుణంలో టెక్ దిగ్గజ కంపెనీ ‘యాపిల్’ మీద తాజాగా ట్విటర్లో వెటకారం ప్రదర్శించాడు. టెస్లా కంపెనీ తెచ్చిన ‘సైబర్‌విజిల్’ను ఎలన్ మస్క్ తాజాగా ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు. 50 డాలర్ల (రూ.3,747) విలువ చేసే ఈ విజిల్‌ను కొనుగోలు చేసి ‘విజిల్ వేయండి’ అంటూ ట్విటర్లో సరదాగా ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పటిదాకా బాగానే ఉన్నా.. తన తర్వాతి పోస్టులో ఆరున్నర కోట్ల మంది ఫాలోవర్స్‌ను ఉద్దేశిస్తూ ఓ విజ్ఞప్తి చేశాడు మస్క్. Don’t waste your money on that silly Apple Cloth, buy our whistle instead! — Elon Musk (@elonmusk) December 1, 2021 యాపిల్ కంపెనీ అక్టోబర్ నెలలో 19 డాలర్లతో ఓ క్లాత్‌ను తీసుకొచ్చింది. ఈ క్లాత్‌ను సిల్లీగా కొనేసి డబ్బులు వృధా చేసుకోవద్దంటూ జనాలకు సూచనలు కూడా చేశాడు మస్క్. ఇక టెస్లా తీసుకొచ్చిన సైబర్ విజిల్ అచ్చం టెస్లా తీసుకురాబోయే ‘సైబర్‌ట్రక్’ ఆకారాన్ని పోలి ఉంది. ఇది సీరియస్ ప్రొడక్టేనా? లేదంటే యాపిల్‌కు కౌంటరా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక యాపిల్ తన గ్యాడ్జెట్స్‌ను క్లీన్ చేసుకోవడానికి వీలుగా యాపిల్ క్లాత్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏ విషయాన్ని అయినా తనకు అనుకూలంగా మార్చేసుకుని ప్రమోట్ చేసుకునే ఎలన్ మస్క్.. యాపిల్ క్లాత్ విషయంలో గతంలోనూ ఇలాగే స్పందించాడు. యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఇస్తాంబుల్‌లో కొత్త స్టోర్ గురించి ఓ ట్వీట్ చేయగా.. ఆ స్టోర్‌ను యాపిల్ క్లాత్ కోసమే సందర్శించాలంటూ వెటకారం ప్రదర్శించాడు ఎలన్ మస్క్. Come see the Apple Cloth ™️ — Elon Musk (@elonmusk) October 22, 2021 క్లిక్ చేయండి: ఎలన్ మస్క్ స్టార్‌లింక్‌పై క్రిమినల్ కేసు పెట్టండి ఇది చదవండి: యాపిల్ సీఈవోగా మస్క్!!.. బూతులు తిట్టేసిన టిమ్ కుక్ -
కంప్యూటర్ క్లీన్ చేసే ఈ క్లాత్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Apple Polishing Cloth: ప్రపంచంలోని ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ ఏ కొత్త ప్రొడక్ట్ తీసుకొచ్చిన అది చాలా యూనిక్‌గా ఉంటుంది. ధర కూడా అదే రేంజ్లో ఉంటుంది. అయితే, నిన్న జరిగిన ఆపిల్ లాంచ్ ఈవెంట్లో తన కొత్త మాక్ బుక్ ప్రోస్, ఎమ్1 ప్రో, మ్యాక్స్ చిప్స్, మూడవ తరం ఎయిర్ పాడ్స్‌తో పాటు అదనంగా ఈవెంట్ తర్వాత ఒక పాలిషింగ్ వస్త్రాన్ని విడుదల చేసింది. ఈ వస్త్రంతో మీరు మీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను క్లీన్ చేసుకోవచ్చు. అయితే, దీని ధర తెలిస్తే మాత్రం మీరు తప్పకుండా నోరెళ్లబెడతారు. నాన్ రాపిడి మెటీరియల్స్‌తో తయారు చేసిన ఈ ఆపిల్ బ్రాండెడ్ క్లాత్ విడిగా పోర్టల్‌లో కొనుక్కోవచ్చు. దీనిపై ఆపిల్ లోగో స్టాంప్ కూడా ఉంది. సాధారణ మైక్రోఫైబర్ వస్త్రం కంటే ఇది ఏ విధంగా భిన్నం అనేది వాడే వారికి మాత్రమే తెలుస్తుంది. మీ ఆపిల్ ఉత్పత్తులను శుభ్రం చేసేటప్పుడు "మృదువైన లింట్-ఫ్రీ క్లాత్" ఉపయోగించాలని "రాపిడి బట్టలు, టవల్స్, పేపర్ టవల్స్ లేదా ఇలాంటి వస్తువులను" వాడుకూడదని ఆపిల్ సిఫార్సు చేస్తుంది. ఈ ఆపిల్ పాలిషింగ్ క్లాత్ ధర మన దేశంలో రూ.1900లుగా ఉంది. (చదవండి: రెండేళ్లలోనే లక్ష కోట్ల రూపాయలు... ఇవి షేర్లా అల్లాఉద్దీన్ అద్భుత దీపమా?) -
‘రాఖీ’కి బదులు వినూత్న వేడుక
సాక్షి, అచ్చంపేట(మహబూబ్‌నగర్): సాధారంగా అక్కా చెల్లెళ్లు, తమ సోదరులకు రాఖీలు కట్టి వేడుక చేసుకుంటారు. కానీ నియోజకవర్గంలో మాత్రం పద్మశాలీలు వినూత్నంగా రాఖీ పండుగను నూలు పుట్టిన పండుగగా నిర్వహిస్తారు. ఈ రోజు నూలు పుట్టిందని, నూలుతో తయారు చేసిన కంకణం కట్టుకుని చేపట్టే ప్రతి కార్యంలో సకల శుభాలు కలుగుతాయని పద్మశాలీల నమ్మకం. మార్కెట్లో ఎన్ని రకాల రాఖీలు వచ్చినా పద్మశాలీలు మాత్రం పత్తి నుంచి తయారు చేసిన నూలు కంకణాన్ని చేతికి కట్టుకోవడం ఆనవాయితీ. గాయత్రీ మాలధారణ.. పత్తితో తయారు చేసిన దారంతో కంకణం, జంధ్యం (గాయత్రిమాల) ధరిస్తారు. గాయత్రి హోమం నిర్వహించిన తరువాత పద్మశాలీలంతా నూలుతో తయారు చేసిన జంద్యాలను 41ఏళ్లు సామూహికంగా ధరిస్తారు. అనంతరం పూజలు నిర్వహిస్తారు. గతేడాది కరోనా వల్ల నిర్వహించలేకపోయారు. ఈసారి మళ్లీ నిర్వహించేందుకు భక్తమార్కడేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూలు పూర్ణిమకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వేడికి చల్లబడుతుంది...చలికి వెచ్చగామారుతుందిTEC
కాలానికి తగ్గట్టు దుస్తులు వేసుకోవాలని చెబుతూంటారుగానీ.. ఇంకొన్ని రోజులు పోతే ఏ కాలంలోనైనా వాడగలిగే దుస్తులు వచ్చేస్తాయనడంలో సందేహమే లేదు. ఎందుకంటారా? టెక్నాలజీ అంతగా పెరిగిపోతోంది మరి. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ శాస్త్రవేత్తలనే తీసుకుంటే.. వీరు ఓ వినూత్నమైన వస్త్రాన్ని అభివృద్ధి చేశారు. ఎండాకాలంలో చల్లగానూ.. చలికాలంలో వెచ్చగానూ మారిపోయే వస్త్రం ఇది. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ.. వివరాలు చూద్దాం. శరీరం వెచ్చగా ఉంటూ చెమట పడుతూ ఉందనుకోండి. ఈ వస్త్రం దాన్ని గుర్తిస్తుంది. ఆ వెంటనే పరారుణ కాంతి బయటి నుంచి లోపలికి ప్రసరించేలా చేస్తుంది.. శరీరం మొత్తం పొడిగా ఉన్నప్పుడు బయటకు వెళ్లే వేడిని అడ్డుకోవడం ద్వారా ఒళ్లు వెచ్చగా ఉండేలా చేస్తుందని వివరించారు యూహాంగ్ వాంగ్ అనే శాస్త్రవేత్త. నీటిని శోషించుకునే... వదిలించుకునే లక్షణాలున్న రెండు రకాల పోగులతో ఈ వస్త్రం తయారవుతుందని... వీటికి కార్బన్ నానోట్యూబుల పూత పూయడం ద్వారా అవి ప్రత్యేక లక్షణాలను కనబరుస్తాయని వివరించారు. ఒక రకమైన పోగు పరారుణ కాంతిని అడ్డుకుంటే.. ఇంకోటి బయటకు పంపేలా వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ వస్త్రాన్ని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని... రంగులద్దే సమయంలో కార్బన్ నానో ట్యూబులను జత చేయడం ద్వారా సులువుగా తయారు చేయవచ్చునని అన్నారు. -
ఫంగస్ ఫ్యాక్టరీలు వచ్చేస్తున్నాయి...
వస్త్రం మొదలుకొని రోజువారీ వ్యవహారాల్లో మనం వాడే కాస్మోటిక్స్, సబ్బుల వంటి అనేక వస్తువుల తయారీకి మూల పదార్థం ముడిచ మురు! ఈ చమురేమో పర్యావరణానికి హాని కలిగించేది. ఈ నేపథ్యంలో ఫ్రాన్హోఫర్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కేవలం ఫంగస్ సాయంతో వాణిజ్యస్థాయిలో ఇలాంటి ఉత్పత్తులన్నింటినీ సిద్ధం చేసేందుకు ఓ వినూత్న టెక్నాలజీని అభివద్ధి చేశారు. బ్రెడ్‌లాంటి వాటికి పట్టే బూజు గురించి మీకు తెలిసే ఉంటుంది. తెల, పచ్చ రంగుల్లో ఉండే ఈ బూజే ఫంగస్. ఆస్పెర్గిల్లస్ అనేది ఫంగస్ జాతిలో ఒకటి. వీటికున్న ప్రత్యేకత ఏమిటో తెలుసా? కార్బన్‌డైయాక్సైడ్ వంటి విషవాయువులేవీ విడుదల చేయకుండానే ఇవి అనేక రకాల రసాయనాలను తయారు చేయగలవు. కాకపోతే ఇప్పటివరకూ వీటిని వాణిజ్య స్థాయిలో తయారు చేయడం మాత్రం వీలు కాలేదు. ఈ నేపథ్యంలో ఫంగస్‌కు అవసరమైన ఆహారంలో మార్పులు చేయడం ద్వారా నిర్దిష్టమైన రసాయనాలను ఉత్పత్తి చేయవచ్చునని ఫ్రాన్హోఫర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. తగిన విధంగా వాడుకుంటే ఫంగస్ ద్వారా మాలిక్ ఆసిడ్ నుంచి పాలియేస్టర్ల వరకూ అనేక రసాయనాలను ఉత్పత్తి చేయవచ్చునని వీరు అంటున్నారు. -
కఫ్తాన్ అందమైన తాను
డ్రెస్ స్టైలిష్‌గా ఉండాలి. అదే సమయంలో సౌకర్యంగా ఉండాలి. ఈ రెండు కఫ్తాన్ సొంతం. అందుకే యంగేజ్ వాళ్లే కాదు అమ్మలు కూడా కఫ్తాన్ని ఇష్టపడి ధరిస్తున్నారు. క్యాజువల్ వేర్ నుంచి కలర్‌ఫుల్ పార్టీ వరకు కఫ్తాన్ రాణిస్తుంది. అటో కుట్టు... ఇటో కుట్టు...సింపుల్‌గా కట్టు... స్టైల్‌కి... నిండుతనానికి.. నిలువెత్తు అందం తాను. ♦ ధరించడంలోనే కాదు నచ్చిన క్లాత్‌తో కఫ్తాన్ని ఎవరికి వారు డిజైన్ చేసుకోవడం చాలా సులువు. దీనికి పెద్ద పెద్ద ప్రణాళికలు, డ్రాఫ్టింగ్లు అస్సలు అవసరం లేదు ♦ చతురస్త్రం లేదా దీర్గచతురస్త్రం కొలతతో ఎంచుకున్న ఫ్యాబ్రిక్‌ని రెండు మడతలుగా వేసి, చేతుల వద్ద (లాంగ్, షార్ట్ స్లీవ్స్) తగినంత వదిలేసి, రెండు వైపులా కుట్టేస్తే చాలు ♦ నడుము, ఛాతీ, హిప్ దగ్గర కొంత కొలత తీసుకొని మార్క్ చేసి కూడా కుట్టేయవచ్చు. ♦ ఈ కుట్టు వల్ల సల్వార్ కమీజ్ లుక్ వస్తుంది ♦ కఫ్తాన్ టైట్ ఫిట్ ఉండదు. రిలాక్స్డ్గా ఉంటుంది. ఇండోవెస్ట్రన్ కాక్టెయిల్ పార్టీస్‌కి బాగా నప్పుతుంది ♦ రేయాన్, కాటన్ సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ కూడా కఫ్తాన్స్కి బాగుంటుంది. పొట్టి కఫ్తాన్ జీన్స్ మీదకు బాగుంటుంది ♦ దూరప్రయాణాలలోనూ కఫ్తాన్ చాలా సౌకర్యంగా ఉంటుంది. దీనికి ప్రత్యేకించి దుపట్టా, స్కార్ఫ్ వంటివి అదనంగా వాడనవసరం లేదు. బాటమ్‌గా పలాజో సరైన ఎంపిక ♦ గర్భవతులకు కూడా సౌకర్యవంతమైన డ్రెస్ ఇది. ♦ ధోతీ మీదకు కఫ్తాన్ ధరిస్తే ఇండో వెస్ట్రన్ స్టైల్ ఆకట్టుకుంటుంది. పార్టీలో ప్రత్యేకతను చాటుతుంది. ♦ సిల్క్, క్రాప్ కాటన్స్, జార్జెట్స్, షిఫాన్స్.. కఫ్తాన్స్కి బాగా సూటవుతాయి. స్టిప్గా ఉండే ఫ్యాబ్రిక్ దీనికి సూట్ అవదు. ♦కఫ్తాన్ చుట్టూ అంచు, నెక్ పార్ట్‌లోనూ చిన్న చిన్న బుటీ వచ్చేలా డిజిటల్ ప్రింట్ వేసుకోవచ్చు. లేదంటే ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. మగ్గం వర్క్తోనూ డిజైన్ చేసుకోవచ్చు. పార్టీకి వెలుతున్నప్పుడు కఫ్తాన్కి బాటమ్‌గా స్లిమ్ సూట్ ట్రౌజర్ ధరిస్తే అందంగా కనిపిస్తారు. ♦నలుచదరంగా ఉండే క్లాత్ మీద డిజిటల్ ప్రింట్ వేశారు. ఈ ప్రింట్ లేదంటే లైట్ బార్డర్ వేసుకొని కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ♦ ఏ ఆభరణమైనా బాగుంటుంది. అయితే, ధరించి కఫ్తాన్ స్టైల్, సందర్భాన్ని బట్టి ఆభరణాల ఎంపిక ఉండాలి. సల్వార్ కమీజ్ లాంటి కఫ్తాన్ వేసుకుంటే బుట్టలు ట్రెడిషనల్ జువెల్రీ కూడా వాడచ్చు. పాదర క్షల విషయంలోనూ ప్రత్యేకతలు అవసరం లేదు. బాటమ్‌ని బట్టి ప్లాట్స్, హీల్స్ ఎంచుకోవచ్చు. ♦ క్యాజువల్ వేర్ లుక్ రావాలంటే మోకాలి వరకు ఉన్న కఫ్తాన్ ధరించాలి. బాటమ్‌గా చుడీ వేసుకుంటే సల్వార్ కమీజ్ డ్రెస్‌లా ఉంటుంది. నీ లెంగ్త్ కన్నా కిందకు వేసుకుంటే చుడీ వేసుకోవచ్చు. -
రైల్వేట్రాక్ డామేజ్.. గుడ్డ కట్టారు..
ముంబై : కుండపోత వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సబర్బన్ రైలు మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హార్బర్ సబర్బన్ మార్గంలో రైలు ట్రాక్ దెబ్బతినడంతో అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది దాన్ని పునరుద్ధరించారు. అయితే, ఇందుకు ఓ క్లాత్ ముక్కను ఉపయోగించారు. రైల్వే ఉద్యోగులు దెబ్బతిన్న పట్టాలకు గుడ్డ ముక్కను కడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సెంట్రల్ రైల్వే క్లారిటీ ఇచ్చింది. హార్బర్ లైన్‌లోని గోవండి, మన్‌ఖుర్ద్ స్టేషన్ల పట్టాలు దెబ్బతిన్నాయి. దీంతో దెబ్బతిన్న ప్రదేశాన్ని గుర్తించేందుకు వర్షంలో పెయింట్ వేస్తే నిలవదు గనుక గుడ్డ ముక్కను వినియోగించినట్లు వివరించింది. అంతేగానీ గుడ్డ ముక్క కట్టి అదే పట్టాలపై రైలును పంపలేదని పేర్కొంది. ప్రయాణీకుల భద్రతే రైల్వేకు ముఖ్యమని తేల్చి చెప్పింది. కాగా, ఈ ఘటనపై విచారణ జరగాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
కాగితం ఖాదీ
పత్తిని వడికి దారం చేసి మగ్గం మీద నేస్తే అది ఖాదీ. అదే రాట్నం, అదే మగ్గం మీద కాగితాన్ని వడికి వస్త్రాన్ని నేస్తే అది కాగితం ఖాదీ. ఆ ప్రయోగం చేసిన ఖాదీ ఇంటి అమ్మాయి పాలిశెట్టి నీరజ.. చేనేతలకు జీవాన్ని, పునరుజ్జీవాన్నీ ఇస్తోంది. ‘అహ నా పెళ్లంట’ సినిమాలో రాజేంద్రప్రసాద్ పెళ్లి కోసం పరమ పిసినారిగా నటిస్తుంటాడు. ఈ వెధవ దేహాన్ని కప్పుకోవడానికి దుస్తులెందుకు దండగ? కాగితంతో కప్పుకుంటే చాలదూ... అంటూ పేపర్ లుంగీ కట్టుకుంటాడు. అది చూసిన కోట శ్రీనివాసరావు (మామ పాత్ర) పేపర్ చీర ఎలా ఉంటుందో అని ఆలోచనలో పడతాడు. ఇది జంధ్యాల హాస్య చతురతకు పరాకాష్ట. ఆ సీన్‌కి హాలంతా పొట్టపట్టుకుని మరీ నవ్వేసింది. ఇప్పటికీ ఎప్పుడు టీవీలో ఆ సినిమా వచ్చినా ఆ సీన్ గుర్తొచ్చి... అప్పటి వరకు మునిగితేలుతున్న స్ట్రెస్‌ను చుట్టచుట్టి డస్ట్‌బిన్‌లో పడేసి, ఓ చిరునవ్వు నవ్వుతుంటాం. కాగితం నుంచి వస్త్రం అది సినిమా కోసం రాసుకున్న కామెడీ సీన్. అయితే ఆ ఫార్ములాతో క్లాత్ తయారవుతుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పుడు పాలిశెట్టి నీరజ అనే తెలుగమ్మాయి ఓ ప్రయోగం చేసింది. పేపర్ని సన్నని పోగులుగా చేసి రాట్నంలో వేసి వడుకుతోంది. మగ్గం మీద నేసి కంప్లీట్ క్లాత్‌ను తయారు చేస్తోంది. ఇలా ఎకో ఫ్రెండ్లీ టెక్స్‌టైల్‌తో ఓ చిన్న వ్యాపార సామ్రాజ్యానికి తొలి అడుగు వేసింది. ఇప్పుడామె వీవింగ్ స్టూడియోలో ఫొటో ఫ్రేమ్‌లు, కుషన్ కవర్లు, ఫోల్డర్లు, పెన్ స్టాండ్, ల్యాంప్ షేడ్, పౌచ్‌లు, హ్యాండ్ బ్యాగ్, రూమ్ పార్టిషన్స్, కర్టెన్స్, సోఫా కవర్ వంటివి తయారవుతున్నాయి. ఇవన్నీ హ్యాండ్‌మేడ్ ఉత్పత్తులే. వీటి తయారీలో కరెంట్ వాడకం తక్కువ. వేస్ట్ పేపర్, రీసైకిల్డ్ పేపరే వీటికి ముడిసరుకు. పొందూరు నుంచి జైపూర్ నీరజ పాలిశెట్టిది శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో చేనేతకారుల కుటుంబం. మగ్గం చప్పుళ్ల మధ్యనే పెరిగిందామె. నేతకారుల వారసులు కొత్త ఉపాధి మార్గాలను వెతుక్కుంటున్న నేపథ్యంలో ఆమె తన మూలాలను వదలకుండా అందులోనే కొత్త రూపాలను సృష్టిస్తోంది. మరి కొందరికి ఉపాధినిస్తోంది. టెక్స్టైల్ కోర్సులనే చదివింది. కానీ ప్రయోగాలు చేయడానికి చదువొక్కటే సరిపోదు కదా. ఆచరణలో ఎదురయ్యే కష్టాలు తెలియాలి. ఆ అనుభవం కోసం తమిళనాడు, తిర్పూర్ వస్త్ర వ్యాపార సంస్థలలో పనిచేశారు. కోయంబత్తూర్, జైపూర్లలో డిజైన్ ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పారు. మరోవైపు వస్త్ర ప్రపంచంలో కొత్తగా మరేదైనా చేయాలనే తపన ఆమెను వెంటాడుతూనే ఉంది. పొందూరు నేత నైపుణ్యాన్ని, జైపూర్ సూత్రకార చేనేతల కళాత్మకతను జోడించి ఓ ప్రయోగం చేశారు. తన ప్రయోగానికి జపాన్ టెక్నాలజీని అనుసంధానం చేశారు. పేపర్ వస్త్రం తయారైంది. పేపర్ క్లాత్ తయారీకి పేపర్ని రెండు నుంచి నాలుగు మిల్లీమీటర్ల పోగులుగా కత్తిరిస్తారు. వాటిని చరఖా మీద వడికి దారాన్ని తయారు చేస్తారు. ఆ దారాలతో వస్త్రాన్ని నేస్తారు. నేతకారులకు బతుకు ఇప్పుడు నీరజ దగ్గర నాలుగు మగ్గాల మీద పని జరుగుతోంది. ఉత్పత్తులు ఫేస్బుక్ ద్వారా మార్కెట్ అవుతున్నాయి. ‘నేత నిలవాలి. నేతకారులు బతకాలి. పర్యావరణానికి హాని కలగని రీతిలో ప్రయోగాలు జరగాలి. నేతకారులకు మేలు చేయడంతోపాటు భూమాతకు హాని చేయని మెథడ్ కోసం ప్రయత్నించాను. విజయవంతమయ్యాను కూడా. ఇప్పుడు దీనిలో వీలయినంత ఎక్కువ మందిని మమేకం చేయాలి. సమాజంలో వచ్చే మార్పులకు తగ్గట్టు మన ప్రొఫెషన్లో మార్పులు చేసుకుంటూ ప్రొఫెషన్ని బతికించుకోవాలి. అప్పుడే అది మనకు బతుకునిస్తుంది’’ అంటారు నీరజ. – మంజీర చేనేత చేతుల్లో పెరిగింది మా తాత మగ్గం మీద నేయడాన్ని చూశాను. స్కూల్‌డేస్‌లో ప్రాజెక్ట్ కోసం జ్యూట్‌తో స్వయంగా నేశాను కూడా. మా నాన్న టెక్స్టైల్ డిజైనింగ్‌లో కోర్సు చేశారు. అహ్మదాబాద్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ తొలి బ్యాచ్ స్టూడెంట్ ఆయన. చిన్నప్పుడు ఇంట్లో చూసిన వాతావరణం, నాన్న ప్రభావంతో నేను కూడా టెక్స్టైల్ రంగంలోకే రావాలనిపించింది. బరోడాలోని మహారాజా షాయాజీరావు యూనివర్సిటీలో క్లోతింగ్ అండ్ టెక్స్టైల్స్ కోర్సు చేశాను. పీజీ తర్వాత ఫ్యాషన్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ సెక్టార్లలో మొత్తం పదిహేడేళ్లు పనిచేశాను. ఈ రంగంలో మా తాత, నాన్నలకంటే ఎక్కువ పరిజ్ఞానాన్ని సంపాదించానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. – నీరజ పాలిశెట్టి, ఫౌండర్, సూత్రకార్ క్రియేషన్స్ -
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహిళ
దిబ్రుఘడ్ : తలుచుకుంటే మనిషి సాధించలేనిది ఏమీ లేదని మరోసారి రుజువైంది. భాష రాకపోయినా అస్సాంకు చెందిన ఓ మహిళ వస్త్రంపై భవద్గీతను నేసి వార్తల్లో నిలిచింది. గతేడాది డిసెంబర్లో దిబ్రుఘడ్కు చెందిన హేమప్రభ ఈ ప్రయత్నం మొదలుపెట్టారు. సంస్కతం భాషలో భవద్గీతలోని 500 శ్లోకాలు... ఆంగ్ల భాషలో ఓ అధ్యయనాన్ని ఆమె నేశారు. ఇందుకోసం ఆయా భాషల పండితుల సహకారం ఆమె తీసుకున్నారు. ఇంతకు ముందు ఆమె 80 అడుగుల పొడవు, 17 ఇంచుల వెడల్పు ఉన్న సిల్క్ క్లాత్ పై శంకర్‌దేవ్ గుణమాలను నేశారు. ఇందుకుగానూ ఆమెకు 9 నెలల సమయం పట్టిందంట. తన కళలతో ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో తాను ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఆమె చెబుతున్నారు. -
వస్త్ర వ్యాపారం బంద్
నిలిచిన రూ.5 కోట్ల మేర వ్యాపారం మరో మూడు రోజుల పాటు మూత రాజమహేంద్రవరం సిటీ : వస్తు,సేవల పన్ను చట్టం నుంచి వస్త్ర వ్యాపారాన్ని మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హోల్‌సేల్, రిటైల్ వస్త్ర వ్యాపారులు చేపట్టిన నాలుగు రోజుల బంద్ మంగళవారం ప్రారంభమైంది. వస్త్ర వ్యాపారంలో వస్తుసేవల పన్ను కలవడం వలన సామాన్యులు సైతం ఇబ్బంది పడే పరిస్ధితి ఏర్పడుతుందని తద్వారా వ్యాపారులపై అ«ధికారులు వత్తిడి లంచగొండి తనం ఎక్కువైపోతుందని వ్యాపార వర్గాలు వాపోతున్నాయి. నగరంలో మహాత్మాగాంధీ హోల్ సేల్ మార్కెట్లో 600 షాపులు, మెయిన్‌రోడ్లు 15 పెద్దషోరూమ్లు, మిగిలిన షాపులు వెరసి సుమారు 700 షాపుల వరకూ వస్త్ర వ్యాపారం సాగిస్తున్నాయి. జీఎస్టీ ప్రమేయాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా చేపట్టిన నాలుగురోజుల పాటు వస్త్ర వ్యాపారాన్ని నిలుపుదల చేస్తూ బంద్ పాటించేందుకు సిద్ధమయ్యాయి. ఈ బంద్‌తో మొదటి రోజు రూ.5 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు స్తంభించాయని వ్యాపారులు చెబుతున్నారు. నాలుగు రోజుల్లో రూ.20 కోట్ల మేర వ్యాపార లావాదేవీలకు అవాంతరం ఏర్పడనుందని వ్యాపారులు చెబుతున్నారు. ఏపీ వస్త్ర సమాఖ్య ఉపాధ్యక్షులు బొమ్మన రాజ్‌కుమార్ మాట్లాడుతూ వస్త్ర వ్యాపారంలో జీఎస్టీ ప్రవేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేంది లేదన్నారు. జీఎస్టీతో వస్త్ర వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. వస్త్ర వ్యాపారులు పన్నులకు వ్యతిరేకం కాదని, కేవలం జీఎస్టీ ప్రవేశాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. మూడు రోజుల పాటు 30వ తేదీ వరకూ వ్యాపారాలు బంద్ పాటిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం స్పందన లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు వస్త్ర హోల్‌సేల్ వర్తకుల సంఘం అధ్యక్షులు బిళ్లా రాజు పేర్కోన్నారు. ఈ బంద్‌లో పలు వస్త్ర వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వస్త్ర వ్యాపారులు స్థానిక మహాత్మాగాంధీ హోల్‌సేల్ క్లాత్ కాంప్లెక్స్ నుంచి మెయిన్ రోడ్డు వరకూ ర్యాలీ నిర్వహించారు. -
వస్త్రాలపై జీఎస్టీని అనుమతించబోం
27 నుంచి 30 వరకూ వస్త్రవాపార సంస్ధలు నిరవధిక బంద్ ఏపీ టెక్స్టైల్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు బొమ్మనరాజ్‌కుమార్ జీఎస్టీ రద్దు చేసే వరకూ పోరాటం– వ్యాపారులు రాజమహేంద్రవరం సిటీ : వస్త్ర వ్యాపారంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని, జీఎస్టీని నిరశిస్తూ మంగళవారం నుంచి శుక్రవారం (27 నుంచి 30) వరకూ వస్త్ర వ్యాపారాలను నిరవధిక బంద్ చేస్తున్నట్టు ఏపీ టెక్స్టైల్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు బొమ్మన రాజ్‌కుమార్ ప్రకటించారు. ఆదివారం తాడితోట మహాత్మాగాంధీ హోల్‌సేల్ క్లాత్ మార్కెట్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉభయ జిల్లాలకు చెందిన వస్త్ర వ్యాపారులు పాల్గొన్నారు. బొమ్మన రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల 18న ఢిల్లీలో జాతీయ వస్త్ర వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో సమావేశమై 24 లోపు జీఎస్టీ అమలు విషయంపై ప్రభుత్వానికి గడువు ఇచ్చారని, సమయం దాటినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదన్నారు. జీఎస్టీతో వస్త్ర వ్యాపారులు ఎదుర్కొనే విపత్తును దృష్టిలో ఉంచుకుని మంగళవారం నుంచి 30 వరకూ వస్త్ర వ్యాపారాలను నిరవధిక బంద్ పాటిస్తున్నట్టు ప్రకటించారు. జీఎస్టీతో అధికారుల వేధింపులు ఎక్కువై పోతాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులపై అధికారులు పెత్తనం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వాటిని ఎదుర్కొనేందుకు వ్యాపారులు సమష్టిగా ముందుకు రావాలన్నారు. పోకల సీతయ్య, బిళ్లారాజు, కాలేపు రామచంద్రరావు, తుమ్మిడి విజయకుమార్ ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వ్యాపారులు పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్‌తో బట్టల షాపులు దగ్ధం
తప్పిన పెనుముప్పు రూ.కోటి విలువైన వస్రా్తలు దగ్ధం ట్రాన్సఫార్మర్ హేవీ లోడ్‌తో మంటలు వ్యాప్తి రాజమహేంద్రవరం క్రైం : కరెంట్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో నగరంలోని తాడితోటలో వస్త్ర దుకాణాలు దగ్ధమైయ్యాయి. బుధవారం స్థానిక మహాత్మా గాంధీ హోల్ సేల్ క్లాత్ మార్కెట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల షాపు నెంబర్ 98, 113, 112 షాపులకు మంటలు వ్యాపించాయి. కింద షాపులో శ్రీదుర్గా హోమ్ డెకరేటర్స్ షాపు నిర్వహిస్తుండగా పైన ఉన్న షాపులను గౌడౌన్లుగా వినియోగిస్తున్నారు. ముందుగా మధ్య ఉన్న దుకాణానికి బయట ఏర్పాటు చేసిన ట్రాన్ సఫార్మర్లో హైలోడ్ రావడంతో వైర్ కాలుతూ మధ్య గోడౌ¯ŒSకు మంటలు వ్యాపించాయి. ఈ గొడౌన్ కు రెండు వైపులా షటర్లకు లోపల నుంచి తాళాలు వేసి ఉండడం వల్ల సకాలంలో తాళాలు తీయలేకపోయారు. దీనితో పండుగల కోసం నిల్వ చేసిన దుస్తులు బూడిదయ్యాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది కష్టపడాల్సి వచ్చింది. ఇతర షాపుల సిబ్బంది మిగిలి ఉన్న దస్తులను అక్కడ నుంచి తీసి ఆటోలో వేరే ప్రాంతాలకు తరలించారు. తప్పిన ముప్పు ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సభవించకపోవడం ఒకటైతే, మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని ఫైర్ ఆఫీసర్ పార్ధసారథి అన్నారు. ఈ ప్రమాదంలో కోటి రూపాయలు విలువైన వస్రా్తలు కాలిబూడిదయ్యాయని షాపుల యజమాని ములకల ఆనంద్ తెలిపారు. -
టాప్స్.. రీ ఫ్యాషన్
న్యూలుక్ ఎప్పుడూ వేసుకునే టాప్సే.. ఎప్పుడూ వేసుకునే ట్యునిక్సే.. ఎప్పుడూ వేసుకునే షర్ట్లే.. ఎప్పుడూ వేసుకునే టీ షర్ట్లే.. కొత్తగా మార్చేదెలా? సింపుల్‌గా ఇలా!! లేత రంగులో ఉన్న ప్లెయిన్ టీ షర్ట్‌కు గాఢమైన కలర్ క్లాత్‌ను ఇలా జత చేస్తే ఓ కొత్త మోడల్ టాప్ రెడీ. పొడవు చేతుల షర్ట్ అయినా, పొట్టి చేతుల చొక్కా అయినా వీపు భాగంలో త్రికోణాకృతిలో కట్ చేయాలి. దీనికి మరో కాంట్రాస్ట్ కలర్ క్లాత్ లేదా, లేస్‌ను జత చేయాలి. ఇలా చూడముచ్చటైన మరో టాప్ స్టైల్‌గా మీ ముందు సిద్ధం అవుతుంది. క్యాజువల్ వేర్లో ఓ స్టైల్‌ని క్రియేట్ చేస్తుంది. మిడ్ స్లీవ్స్ ప్లెయిన్ ట్యునిక్కి ఛాతి భాగం నుంచి ప్రింట్ మెటీరియల్‌తో స్కర్ట్‌లా కుట్టి, జత చేయాలి. ఇలా మరో అందమైన టాప్ సిద్ధం. ఈవెనింగ్ వెస్ట్రన్ పార్టీలకు స్టైల్‌గా కనువిందుచేస్తుంది. ప్లెయిన్ టీ షర్ట్ లేదా కుర్తీ అయినా తీసుకోండి. భుజం మీద నుంచి చేతుల భాగం వరకు కట్ చేయండి. కట్ చేసిన భాగాన్ని జత చేస్తూ అందమైన లేస్ వేస్తే సరి. మరో అందమైన టాప్ వేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఉన్న డ్రెస్‌లనే రీ మోడల్ చేస్తే ఇలాంటి స్టైలిష్ టాప్స్ మీ వార్డ్‌రోబ్‌లో చేరిపోతాయి. వాటిని ధరిస్తే నలుగురిలో మీకో ప్రత్యేకతను తెచ్చిపెడతారు. -
ఆర్వీఎంకు సిరిసిల్ల వస్త్రం
తొలి రోజు లక్షా 60 వేల మీటర్ల గుడ్డ కొనుగోలు సిరిసిల్లలలో పాతిక లక్షల మీటర్ల వస్త్రం సిద్ధం సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నలు ఉత్పత్తి చేసిన వస్త్రాన్ని చేనేత, జౌళిశాఖ అధికారులు కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాముల్లో లక్షా 60 వేల మీటర్ల వస్త్రాన్ని కొనుగోలు చేశారు. రెండు మ్యాక్స్ సొసైటీల ద్వారా ఈ వస్త్రాన్ని కొన్నారు. సిరిసిల్లలోని 51 మ్యాక్స్ సొసైటీల్లో ఉత్పత్తి అయిన గుడ్డను మాత్రమే కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం సిరిసిల్లలో 25 లక్షల మీటర్ల వస్త్రం సిద్ధంగా ఉంది. రోజు వారీగా ఈ వస్త్రాన్ని కొనుగోలు చేస్తామని జౌళిశాఖ ఆర్డీడీ రమణమూర్తి తెలిపారు. రాజీవ్ విద్యా మిషన్‌కు మొత్తం కోటి 35 లక్షల మీటర్ల వస్త్రం అవసరం ఉండగా.. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల కార్మికులకు ఈ అవకాశాన్ని కల్పించారు. రూ.45 కోట్లు విలువైన వస్త్రాన్ని సిరిసిల్ల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. మొదటి విడతగా 37 లక్షల మీటర్ల గుడ్డను కొనుగోలు చేసేందుకు సిరిసిల్ల మ్యాక్స్ సొసైటీలకు ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటి వరకు 25 లక్షల మీటర్ల వస్త్రం రెండువేల పవర్‌లూమ్స్‌పై పక్షం నెల రోజుల్లో ఉత్పత్తి అయింది. మిగితా ఆర్డర్‌ను పూర్తి చేసేందుకు వస్త్రోత్పత్తిదారులు సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమంలో జౌళిశాఖ అధికారులు పూర్ణచందర్రావు, ఏడీలు ఎం.వెంకటేశం, రతన్‌కుమార్, డి.వి.రావు, డీవో రశీద్, మ్యాక్స్ సొసైటీ అధ్యక్షులు బీమరి రామచంద్రం, జౌళిశాఖ టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
రేపటి నుంచి సిరిసిల్ల వస్త్రం కొనుగోళ్లు
కోటి మీటర్ల వస్త్రానికి 18 లక్షలే ఉత్పత్తి టెస్కో వీసీఎండీ శైలజారామయ్యర్ సిరిసిల్ల : కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న వస్త్రం నాణ్యత బాగుందని, ఆర్వీఎంకు వస్త్రం కొనుగోళ్లను శుక్రవారం నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర టెస్కో వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా రామయ్యర్ అన్నారు. బుధవారం ఆమె సిరిసిల్లలోని మ్యాక్స్ సొసైటీల నిర్వాహకులతో స్థానిక నేత బజారులో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్ అందించేందుకు అవసరమైన వస్త్రాన్ని సిరిసిల్లలోని మ్యాక్స్ సొసైటీల ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెుత్తం కోటి మీటర్ల వస్త్రం అవసరం ఉండగా.. ఇప్పటివరకు 18 లక్షల మీటర్ల వస్త్రాన్ని మాత్రమే ఉత్పత్తి చేశారని తెలిపారు. ఇలా చేస్తే విద్యాసంవత్సరం ముగిసినా పిల్లలకు యూనిఫామ్స్ అందివ్వలేమన్నారు. సకాలంలో వస్త్రాన్ని అందించేందుకు వస్త్రోత్పత్తి వేగాన్ని పెంచాలని, మగ్గాల సంఖ్యను పెంచి, కొత్త సభ్యులను చేర్చుకోవాలని సూచించారు. సొసైటీల్లో పనిచేస్తున్న కార్మికులు, రోజువారీ ఉత్పత్తి వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని, రికార్డులు లేకుండా వస్త్రం కొనుగోలు చేయలేమని ఆమె స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన వస్త్రానికి పది రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ ప్రీతిమీనా తెలిపారు. స్థానిక వెంకంపేటలోని మరమగ్గాల్లో వస్త్రోత్పత్తి తీరును తనిఖీ చేశారు. మంచె శ్రీనివాస్ అనే వ్యాపారి వద్ద నిల్వ ఉన్న ఐదు లక్షల మీటర్ల వస్త్రాన్ని పరిశీలించారు. వారివెంట ఆర్డీడీలు పూర్ణచందర్రావు, రాంగోపాల్, రమణమూర్తి, ఏడీ వెంకటేశం, మ్యాక్స్ సొసైటీ ప్రతినిధులు వేముల దామోదర్, గుంటుక కోటేశ్వర్, జిందం దేవదాస్, అంకారపు రవి, చిమ్మని ప్రకాశ్, వేముల వెంకటనర్సు, గౌడ శ్రీనివాస్ ఉన్నారు. -
నిన్నలా నువ్వులా!
అందరిలో ఫ్రాక్ ఉంటుంది చిన్నప్పుడు వేసుకున్న నాన్న కొనిపెట్టిన అమ్మ తొడిగించిన అన్నయ్య సవరించిన అందరూ మెచ్చిన ఫ్రాక్ ఉంటుంది. పెళ్లీడు వచ్చిన మేనకోడలిని చూసిన మేనమామ ‘ఏంట్రా! నిన్ననే నిన్ను ఫ్రాక్‌లో చూసినట్టు అనిపిస్తుంది’ అన్నమాట అందరిళ్లలో వినపడేదే! బాల్యానికి సీతాకోక చిలుక రెక్కలలాంటివి ఫ్రాక్‌లు. ఫ్రాక్ వేసుకుంటే నిన్నలా ఉంటావు. నువ్వులా ఉంటావు. నవ్వుతూ ఉంటావు. చిన్నపిల్లలే కాదు టీనేజ్, యంగేజ్ అతివల డ్రెస్ జాబితాలోనూ ఎప్పుడూ వింటూ ఉండే పేరు ఫ్రాక్. ముచ్చటగా పురివిప్పిన నెమలిలా నయనానందం చేసే పొట్టి డ్రెస్‌నే ఫ్రాక్గా చెబుతుంటాం. లాంగ్గా ఉండే ఫ్రాక్‌ని గౌన్‌గా పలుకుతుంటారు. అలాగే చైల్డ్ డ్రెస్ లేదా లైట్ ఓవర్ డ్రెస్ అని కూడా అంటుంటారు. 16వ శతాబ్దిలో ఈ డ్రెస్ పుట్టినప్పటికీ దశల వారీగా అడుగులు వేస్తూ ఇంత దూరం ప్రయాణించడానికి చాలానే కష్టపడింది ఫ్రాక్. 20వ శతాబ్దం వరకు ఉమెన్స్ గౌన్ లేదా ఫ్రాక్ అనే పేరు స్థిరపడటానికి రకరకాల రూపాలు మార్చుకుంది. 16-17వ శతాబ్దిలో ఫుల్ లెంగ్త్‌తో.. లూజ్ ఔటర్ గార్మెంట్‌గా ఫార్మ్ వర్కర్స్కోసం బ్రిటన్ లో పుట్టింది ఫ్రాక్. మందపాటి క్లాత్, పెద్ద కాలర్ నెక్‌తో భారంగా ఉండేది. దీనిని మగవారే వాడేవారు. 18వ శతాబ్దిలో బ్రిటన్, అమెరికాలో మెన్స్ కోసం అన్ఫిటెడ్ ఫ్రాక్స్ వచ్చాయి. 19వ శతాబ్ది నాటికి బ్రాడ్ కాలర్, వెయిస్ట్ పాకెట్స్.. వంటి అదనపు హంగులు చేరాయి. దీనిని ‘ఫ్రాక్ కోట్’గా పురుషులు ధరించేవారు. వీటి పొడవు మోకాళ్ల వరకు, ఇంకా కింది వరకు కూడా ఉండేవి. నావికులు, చేపలు పట్టేవాళ్లూ ఈ తరహా ఫ్రాక్ కోటును ఉపయోగించేవారు. 19 శతాబ్ది చివరలో 20 శతాబ్ది మొదట్లో సరైన ఫిటింగ్ అవసరం లేని, సౌకర్యంలో తిరుగులేని గార్మెంట్‌గా అతివల దుస్తులలో చేరింది. నాటి నుంచి ఎన్నో హంగులు దిద్దుకొని ఇలా అందంగా మగువల చేత మన్ననలు అందుకుంటూనే ఉంది. -
ఇంటిప్స్
పిల్లలు స్కెచ్ పెన్నులతో గోడల మీద గీసిన గీతల్ని పోగొట్టాలంటే... వాటి మీద బేకింగ్ సోడా వేసి, క్లాత్‌తో బాగా రుద్దాలి బెండకాయ వేపుడు జిగురుగా అనిపించకూడదంటే... వేయించేటప్పుడు కాసింత నిమ్మరసం కానీ పెరుగుకానీ వేయాలి. ప్లాస్టిక్ బాక్సులు వాసన వస్తుంటే... వాటిలో కాసిని కాఫీ గింజలు కానీ, ఓ చిన్న బొగ్గు ముక్క కానీ వేసి మూత పెట్టాలి. ఓ రాత్రంతా అలా ఉంచితే ఉదయానికి వాసన పోతుంది. పకోడీలు సాఫ్ట్‌గా రావాలంటే... వేసేముందు పిండిలో కాసింత వేడినూనె కలపాలి. -
పెద్దావిడను కొట్టి.. ఇస్లామిక్ స్టేట్ అని రాశారు
జైపూర్: రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. తన ఇంట్లో నిద్రపోతున్న ఓ 60 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఇస్లామిక్ స్టేట్ అని రాసి వెళ్లారు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు అక్కడ ఇస్లామిక్ స్టేట్ అనే పేరు రాసి ఓ గుడ్డ ఆ ఇంట్లో పడేసి వెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నతీదేవీ అనే బీమ్ అనే ప్రాంతంలోని తన నివాసంలో చంటి మనవడితో కలిసి నిద్రపోయింది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేశారు. బాగా కొట్టి పడేసి వెళ్లిపోయారు. తన భర్త చూసేసరికి ఆమె గాయాలతో అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికొచ్చిన పోలీసులు క్లూస్ కోసం పరిశీలించగా ఐఎస్ఐఎస్ అని రాసి ఉంచిన ఓ క్లాత్ ముక్క దొరికింది. అయితే, దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే వారు ఇలా చేసి ఉంటారని పోలీసులు చెప్తున్నారు. -
నిలవకు విలువైన సూత్రాలు
ఇంటిప్స్ సాంబారు, రసం పొడులను డీప్ ఫ్రీజర్‌లో నిలవ ఉంచితే ఎక్కువ రోజులు వాసన పోకుండా తాజాగా ఉంటాయి. పచ్చళ్ళు, ఊరగాయల్లో స్టీల్ స్పూన్లు వాడకూడదు.కోడిగుడ్డు పొరటు మెత్తగా రావాలంటే మూడు టీ స్పూన్ల పాలు కలపాలి.ఉల్లిపాయలను గ్రైండ్ చేసిన వెంటనే వాడాలి, ఆలస్యమైతే చేదవుతుంది. గ్రైండ్ చేసే ముందు ఉల్లిపాయలను కొద్దిగా నూనెలో వేయిస్తే ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది.క్యారట్ పైభాగాన్ని కోసేసి గాలి దూరని కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నల్లని కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే వారం రోజులైనా తాజాగా ఉంటాయి.క్యారట్ వండేటప్పుడు నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపితే రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. వంకాయలను కోసిన వెంటనే ఒక స్పూను పాలు కలిపిన నీళ్లలో వేస్తే ముక్కలు నల్లబడవు. పచ్చిమిరపకాయలు తరిగిన తర్వాత వేళ్ల మంట తగ్గాలంటే చల్లటి పాలలో కొద్దిగా చక్కెర వేసి అందులో వేళ్లను ముంచాలి. పుట్టగొడుగులు వాతావరణంలోని తేమ ను పీల్చుకుని ఉంటాయి. వండేటప్పుడు కడిగితే మరింతగా నీటిని పీల్చుకుంటాయి కాబట్టి కడగకుండా శుభ్రమైన పేపర్‌తో కాని వస్త్రంతో కాని తుడవాలి. బంగాళాదుంపలను వారం పాటు నిలవ చేస్తే మొగ్గలు వస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే బంగాళాదుంపలతో పాటు ఒక ఆపిల్‌ను ఉంచాలి.బెండకాయల జిగురు పోవాలంటే వండేటప్పుడు రెండు చుక్కల నిమ్మరసం కాని ఒక స్పూను పెరుగు కాని కలపాలి.కాఫీ కప్పులకు పట్టిన మరకలు పోవాలంటే సోడా నింపి మూడు గంటల తర్వాత కడగాలి. టొమాటోలను తొడిమ కింది వైపుకు వచ్చేటట్లుగా ఉంచితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి.