Apple Polishing Cloth: ప్రపంచంలోని ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ ఏ కొత్త ప్రొడక్ట్ తీసుకొచ్చిన అది చాలా యూనిక్‌గా ఉంటుంది. ధర కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. అయితే, నిన్న జరిగిన ఆపిల్ లాంచ్ ఈవెంట్‌లో తన కొత్త మాక్ బుక్ ప్రోస్, ఎమ్1 ప్రో, మ్యాక్స్ చిప్స్, మూడవ తరం ఎయిర్ పాడ్స్‌తో పాటు అదనంగా ఈవెంట్ తర్వాత ఒక పాలిషింగ్ వస్త్రాన్ని విడుదల చేసింది. ఈ వస్త్రంతో మీరు మీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను క్లీన్ చేసుకోవచ్చు. అయితే, దీని ధర తెలిస్తే మాత్రం మీరు తప్పకుండా నోరెళ్లబెడతారు.
నాన్ రాపిడి మెటీరియల్స్‌తో తయారు చేసిన ఈ ఆపిల్ బ్రాండెడ్ క్లాత్ విడిగా పోర్టల్‌లో కొనుక్కోవచ్చు. దీనిపై ఆపిల్ లోగో స్టాంప్ కూడా ఉంది. సాధారణ మైక్రోఫైబర్ వస్త్రం కంటే ఇది ఏ విధంగా భిన్నం అనేది వాడే వారికి మాత్రమే తెలుస్తుంది. మీ ఆపిల్ ఉత్పత్తులను శుభ్రం చేసేటప్పుడు "మృదువైన లింట్-ఫ్రీ క్లాత్" ఉపయోగించాలని "రాపిడి బట్టలు, టవల్స్, పేపర్ టవల్స్ లేదా ఇలాంటి వస్తువులను" వాడుకూడదని ఆపిల్ సిఫార్సు చేస్తుంది. ఈ ఆపిల్ పాలిషింగ్ క్లాత్ ధర మన దేశంలో రూ.1900లుగా ఉంది.
(చదవండి: రెండేళ్లలోనే లక్ష కోట్ల రూపాయలు... ఇవి షేర్లా అల్లాఉద్దీన్ అద్భుత దీపమా?)
Comments
Please login to add a commentAdd a comment