polishing
-
‘జగనన్న భూహక్కు –భూరక్ష’కు సర్వే రాళ్లు సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 305 గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లకే జగనన్న భూహక్కు–భూరక్ష పథకం కోసం వినియోగించే సర్వే రాళ్ల ఆర్డర్లిస్తున్నామని రాష్ట్ర గనులు, ఇంధన, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. మూడో దశలో అక్టోబర్ 15 నాటికి 25.42 లక్షల సర్వే రాళ్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులతో సర్వే రాళ్ల సరఫరాపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రానైట్ ఫ్యాక్టరీలకు అండగా నిలిచేందుకు సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని, సంక్షోభంలో కూరుకుపోయిన గ్రానైట్ ఫ్యాక్టరీలకు చేయూతనిస్తూ స్లాబ్ సిస్టమ్ తెచ్చారని, విద్యుత్ రాయితీలు కల్పించారని తెలిపారు. సర్వే రాళ్ల తయారీ ఆర్డర్లను గ్రానైట్ ఫ్యాక్టరీలకే ఇవ్వడం వల్ల ఆయా కర్మాగారాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, వీటిపై ఆధారపడ్డ వారికి ఉపాధి లభిస్తోందన్నారు. ఇప్పటి వరకు 44.03 లక్షల సర్వే రాళ్లు సరఫరా చేశామని, ఇందుకు రూ.1,153.2 కోట్లను సరఫరాదారులకు, రాళ్ల రవాణా కోసం రూ.63.8 కోట్లు చెల్లించామన్నారు. రీసర్వే కోసం గతంలో గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్ల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో రోజుకు లక్ష సర్వే రాళ్లు కావాలని కోరామన్నారు. యూనిట్లకు రా మెటీరియల్‌ను కూడా గనుల శాఖ అధికారులు సమకూర్చారని, మొదట రూ.270 ఉన్న రేటును రూ.300కి పెంచామన్నారు. ఇంత చేస్తున్నా ఫ్యాక్టరీలకు బదులు బయటి నుంచి ట్రేడర్లు సర్వే రాళ్లు సరఫరా చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల ఫ్యాక్టరీలకు నష్టం జరుగుతోందని, దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. -
యాపిల్ పరువు తీసి పడేశాడు.. కొత్తేం కాదుగా!
అమెరికా కంపెనీలన్నా.. వాటి ఉత్పత్తులన్నా టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కి ఎనలేని మంట. ఛాన్స్ దొరికినప్పుడల్లా వాటి మీద తన శైలిలో సెటైర్లు వేస్తుంటాడు కూడా. ఈ తరుణంలో టెక్ దిగ్గజ కంపెనీ ‘యాపిల్’ మీద తాజాగా ట్విటర్లో వెటకారం ప్రదర్శించాడు. టెస్లా కంపెనీ తెచ్చిన ‘సైబర్‌విజిల్’ను ఎలన్ మస్క్ తాజాగా ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు. 50 డాలర్ల (రూ.3,747) విలువ చేసే ఈ విజిల్‌ను కొనుగోలు చేసి ‘విజిల్ వేయండి’ అంటూ ట్విటర్లో సరదాగా ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పటిదాకా బాగానే ఉన్నా.. తన తర్వాతి పోస్టులో ఆరున్నర కోట్ల మంది ఫాలోవర్స్‌ను ఉద్దేశిస్తూ ఓ విజ్ఞప్తి చేశాడు మస్క్. Don’t waste your money on that silly Apple Cloth, buy our whistle instead! — Elon Musk (@elonmusk) December 1, 2021 యాపిల్ కంపెనీ అక్టోబర్ నెలలో 19 డాలర్లతో ఓ క్లాత్‌ను తీసుకొచ్చింది. ఈ క్లాత్‌ను సిల్లీగా కొనేసి డబ్బులు వృధా చేసుకోవద్దంటూ జనాలకు సూచనలు కూడా చేశాడు మస్క్. ఇక టెస్లా తీసుకొచ్చిన సైబర్ విజిల్ అచ్చం టెస్లా తీసుకురాబోయే ‘సైబర్‌ట్రక్’ ఆకారాన్ని పోలి ఉంది. ఇది సీరియస్ ప్రొడక్టేనా? లేదంటే యాపిల్‌కు కౌంటరా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక యాపిల్ తన గ్యాడ్జెట్స్‌ను క్లీన్ చేసుకోవడానికి వీలుగా యాపిల్ క్లాత్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏ విషయాన్ని అయినా తనకు అనుకూలంగా మార్చేసుకుని ప్రమోట్ చేసుకునే ఎలన్ మస్క్.. యాపిల్ క్లాత్ విషయంలో గతంలోనూ ఇలాగే స్పందించాడు. యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఇస్తాంబుల్‌లో కొత్త స్టోర్ గురించి ఓ ట్వీట్ చేయగా.. ఆ స్టోర్‌ను యాపిల్ క్లాత్ కోసమే సందర్శించాలంటూ వెటకారం ప్రదర్శించాడు ఎలన్ మస్క్. Come see the Apple Cloth ™️ — Elon Musk (@elonmusk) October 22, 2021 క్లిక్ చేయండి: ఎలన్ మస్క్ స్టార్‌లింక్‌పై క్రిమినల్ కేసు పెట్టండి ఇది చదవండి: యాపిల్ సీఈవోగా మస్క్!!.. బూతులు తిట్టేసిన టిమ్ కుక్ -
కంప్యూటర్ క్లీన్ చేసే ఈ క్లాత్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Apple Polishing Cloth: ప్రపంచంలోని ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ ఏ కొత్త ప్రొడక్ట్ తీసుకొచ్చిన అది చాలా యూనిక్‌గా ఉంటుంది. ధర కూడా అదే రేంజ్లో ఉంటుంది. అయితే, నిన్న జరిగిన ఆపిల్ లాంచ్ ఈవెంట్లో తన కొత్త మాక్ బుక్ ప్రోస్, ఎమ్1 ప్రో, మ్యాక్స్ చిప్స్, మూడవ తరం ఎయిర్ పాడ్స్‌తో పాటు అదనంగా ఈవెంట్ తర్వాత ఒక పాలిషింగ్ వస్త్రాన్ని విడుదల చేసింది. ఈ వస్త్రంతో మీరు మీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను క్లీన్ చేసుకోవచ్చు. అయితే, దీని ధర తెలిస్తే మాత్రం మీరు తప్పకుండా నోరెళ్లబెడతారు. నాన్ రాపిడి మెటీరియల్స్‌తో తయారు చేసిన ఈ ఆపిల్ బ్రాండెడ్ క్లాత్ విడిగా పోర్టల్‌లో కొనుక్కోవచ్చు. దీనిపై ఆపిల్ లోగో స్టాంప్ కూడా ఉంది. సాధారణ మైక్రోఫైబర్ వస్త్రం కంటే ఇది ఏ విధంగా భిన్నం అనేది వాడే వారికి మాత్రమే తెలుస్తుంది. మీ ఆపిల్ ఉత్పత్తులను శుభ్రం చేసేటప్పుడు "మృదువైన లింట్-ఫ్రీ క్లాత్" ఉపయోగించాలని "రాపిడి బట్టలు, టవల్స్, పేపర్ టవల్స్ లేదా ఇలాంటి వస్తువులను" వాడుకూడదని ఆపిల్ సిఫార్సు చేస్తుంది. ఈ ఆపిల్ పాలిషింగ్ క్లాత్ ధర మన దేశంలో రూ.1900లుగా ఉంది. (చదవండి: రెండేళ్లలోనే లక్ష కోట్ల రూపాయలు... ఇవి షేర్లా అల్లాఉద్దీన్ అద్భుత దీపమా?) -
నెయిల్ ఆర్ట్ డిజైన్స్
క్రిస్మస్కి సిద్ధమైపోయారా?! లేదంటే, ఫ్యాషనబుల్‌గా అదీ పండగ కళతో కనిపించాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా?! అయితే నిమిషాల్లో క్రిస్మస్ కళ తీసుకురావడం మీ ‘చేతు’ల్లోనే ఉంది. అదే నెయిల్ ఆర్ట్. ..:: ఎన్.ఆర్ ప్రపంచం మొత్తమ్మీద అతివల మునివేళ్లలో క్రిస్మస్ వెలుగులు నింపడానికి డిజైనర్లు చాలా ఉత్సాహం చూపుతున్నారు. సింపుల్‌గా అనిపిస్తూనే కళ తెచ్చే ఈ యేడాది నెయిల్ ఆర్ట్ డిజైన్స్ ఇవి... ముందుగా... ఇప్పటికే ఉన్న గోళ్ల రంగును రిమూవర్‌తో తుడిచేయాలి. శుభ్రపడిన గోళ్ల మీద క్లియర్ బేస్ కోట్ని {పతి గోరుకు వేయాలి. బేస్‌కోట్ ఆరిన తర్వాత రెండు, మూడు రంగుల నెయిల్ పాలిష్‌లను ఎంచుకోవాలి. నెయిల్ ఆర్ట్ బ్రష్‌ల సాయంతో మంచు తునకలు, శాంతా క్లాజ్, శాంతా జింక, క్రిస్మస్ ట్రీ, స్టార్స్.. వంటివి గోళ్ల మీద తీర్చి దిద్దుకోవాలి. డిజైన్ ఆరిన తర్వాత ట్రాన్సపరెంట్ పాలిష్‌ని ప్రతి గోరుమీద వేస్తే నెయిల్ పాలిష్ త్వరగా పోదు. డిజైన్ అందంగా కనపడుతుంది. నెయిల్‌పాలిష్ డిజైన్లు అనుకున్నంత బాగా రావడం లేదనుకుంటే రెడీమేడ్‌గా నెయిల్ స్టిక్కర్స్ కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. వీటితో మీ గోళ్లను అందంగా వేడుకగా అలంకరించుకోవచ్చు. సీజన్‌ను బట్టి డిజైన్ సందర్భానికి తగ్గట్టు తయారవ్వడం ఇప్పుడు అందరూ చేస్తున్నారు. దీంట్లో భాగంగా నెయిల్స్నూ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటున్నారు. పెళ్లిళ్లకు సంప్రదాయ డిజైన్లు ఎలా డిజైన్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారో.. అలాగే క్రిస్మస్, న్యూ ఇయర్, నైట్ పార్టీలకు ప్రత్యేక నెయిల్ ఆర్ట్ డిజైన్స్ ఉన్నాయి. డిజైన్‌ను బట్టి ఖరీదు ఉంటుంది. - సాయిప్రియ, నెయిల్ ఆర్ట్ డిజైనర్