నెయిల్ ఆర్ట్ డిజైన్స్
క్రిస్మస్‌కి సిద్ధమైపోయారా?! లేదంటే, ఫ్యాషనబుల్‌గా అదీ పండగ కళతో కనిపించాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా?! అయితే నిమిషాల్లో క్రిస్మస్ కళ తీసుకురావడం మీ ‘చేతు’ల్లోనే ఉంది. అదే నెయిల్ ఆర్ట్.
..:: ఎన్.ఆర్
ప్రపంచం మొత్తమ్మీద అతివల మునివేళ్లలో క్రిస్మస్ వెలుగులు నింపడానికి డిజైనర్లు చాలా ఉత్సాహం చూపుతున్నారు. సింపుల్‌గా అనిపిస్తూనే కళ తెచ్చే ఈ యేడాది నెయిల్ ఆర్ట్ డిజైన్స్ ఇవి... ముందుగా...
ఇప్పటికే ఉన్న గోళ్ల రంగును రిమూవర్‌తో తుడిచేయాలి.
శుభ్రపడిన గోళ్ల మీద క్లియర్ బేస్ కోట్‌ని {పతి గోరుకు వేయాలి.
బేస్‌కోట్ ఆరిన తర్వాత రెండు, మూడు రంగుల నెయిల్ పాలిష్‌లను ఎంచుకోవాలి.
నెయిల్ ఆర్ట్ బ్రష్‌ల సాయంతో మంచు తునకలు, శాంతా క్లాజ్, శాంతా జింక,
క్రిస్మస్ ట్రీ, స్టార్స్.. వంటివి గోళ్ల మీద తీర్చి దిద్దుకోవాలి.
డిజైన్ ఆరిన తర్వాత ట్రాన్సపరెంట్ పాలిష్‌ని ప్రతి గోరుమీద వేస్తే నెయిల్ పాలిష్ త్వరగా పోదు. డిజైన్ అందంగా కనపడుతుంది.
నెయిల్‌పాలిష్ డిజైన్లు అనుకున్నంత బాగా రావడం లేదనుకుంటే రెడీమేడ్‌గా నెయిల్ స్టిక్కర్స్ కూడా మార్కెట్లో లభిస్తున్నాయి.
వీటితో మీ గోళ్లను అందంగా వేడుకగా అలంకరించుకోవచ్చు.
సీజన్‌ను బట్టి డిజైన్
సందర్భానికి తగ్గట్టు తయారవ్వడం ఇప్పుడు అందరూ చేస్తున్నారు. దీంట్లో భాగంగా నెయిల్స్‌నూ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటున్నారు. పెళ్లిళ్లకు సంప్రదాయ డిజైన్లు ఎలా డిజైన్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారో.. అలాగే క్రిస్మస్, న్యూ ఇయర్, నైట్ పార్టీలకు ప్రత్యేక నెయిల్ ఆర్ట్ డిజైన్స్ ఉన్నాయి. డిజైన్‌ను బట్టి ఖరీదు ఉంటుంది.
- సాయిప్రియ, నెయిల్ ఆర్ట్ డిజైనర్