Nail Art Designs
-
Christmas 2024 : బెస్ట్ నెయిల్ ఆర్ట్ డిజైన్స్..ఇదిగో ఇలా!
యేసుక్రీస్తు పుట్టుకే మానవాళికి గొప్ప శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ భక్తులు క్రీస్తు పుట్టుకను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు ఆయన కారణజన్ముడు. చారిత్రాత్మక పురుషుడు అని విశ్వసిస్తారు. ఈ సందర్భంగా బంధుమిత్ర సపరివారంగా సంబరాలు చేసుకుంటారు. పవిత్ర ఏసును కీర్తిస్తూ చర్చ్‌లలో ప్రార్థనలు చేస్తారు. క్రైస్తవ భక్తులకు క్రిస్మస్ వచ్చిందంటే ఆ సంబరమే వేరు. విద్యుద్దీప కాంతులతో గృహాలను అలంకరించు కుంటారు. ముఖ్యంగా క్రిస్మస్ ట్రీని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఇంటిల్లిపాదీ కొత్త బట్టలు, రకరకాల పిండివంటలతో ఉత్సాహంగా గడుపుతారు. గృహిణులు, కన్నెపిల్లలు అందంగా ముస్తాబవుతారు. మరి పవిత్ర క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ నెయిల్ పెయింట్ క్రియేటివ్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దేమా. మాసిమో (@రెయిన్‌మేకర్1973) ట్విటర్ ఖాతా షేర్ చేసిన వీడియో మీకోసం..Christmas nail art🎄 [📹 the_nail_mannn]pic.twitter.com/9ieWpRXlnn— Massimo (@Rainmaker1973) December 25, 2024 -
Christmas 2024: శాంటా లవ్, ఈ నైల్ ఆర్ట్ చూశారా? (ఫోటోలు)
-
Nail Rings Photos: ఇది నెయిల్ ఆర్ట్ కాదు.. నెయిల్ రింగ్స్ (ఫోటోలు)
-
క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ ఇవి..
నెయిల్ ఆర్ట్ గురించి మనకు తెలిసిందే. ఎన్నో డిజైన్లు మన చూపు తిప్పుకోనివ్వవు. ఆర్టిఫిషియల్ నెయిల్స్ని అతికించి మరీ చూడచక్కని డిజైన్లతో చేసే ఆ అలంకారం వేలి కొసలలో మెరుపులుగా కనువిందు చేస్తుంది. ఇప్పుడు వాటి స్థానాన్ని నెయిల్ జువెలరీ ఆక్రమిస్తోంది. ఫింగర్ క్లారింగ్స్గా ఈ నెయిల్ జ్యువెలరీ ఆధునికమైన టచ్‌తో అందంగా రూపుకడుతుంది. ప్రాచీనకాలంలో రక్షణలో భాగంగా చేరిన ఈ ఆభరణం ఇప్పుడు సొగసైన అలంకార జాబితాలో చేరి ప్రత్యేకతను చాటుతోంది. బంగారు, వెండి, ఇతర లోహాలలోనూ ఈ నెయిల్ జ్యువెలరీ అందుబాటులో ఉంది. సంప్రదాయం, ఆధునికం ఏ వేడుకైనా కొత్తగా వెలిగిపోవాలని కోరుకునే వారికి ఈ నెయిల్ రింగ్స్ సరైన ఎంపిక అవుతాయి. లోహపు డిజైన్లలో ముత్యాలు, రత్నాలు, ఎనామిల్.. వంటివి జతచేసిన డిజైన్ల ఎంపిక మనదైన ప్రత్యేకతను చాటుతుంటుంది. లోహాన్ని బట్టి, డిజైన్‌ను బట్టి ధరలు వందల రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి. చరిత్రలో నెయిల్ జువెలరీ.. ప్రాచీన చైనా, ఈజిప్ట్ రాజులు, రాణుల ఈ నెయిల్ క్లా జ్యువెలరీ విరివిగా ధరించేవారు. పొడవాటి గోర్లు సంపదకు చిహ్నంగా భావించేవారు. వాటి వల్ల శారీర శ్రమæ చేయవలసి అవసరం లేదు. అలా శ్రమ చేయాల్సిన అవసరం లేని వారు, స్థితిమంతులుగా జాబితాలో ఉండేవారు. అంతేకాదు, నెయిల్ గార్డ్‌గా పిలిచే ఈ ఆభరణాన్ని ధరించడం ప్రాచీన చైనీస్ మహిళలు శక్తికి, అందానికి చిహ్నంగా భావించేవారు. నెయిల్ క్లా లేదా గార్డుల తయారీలో సాధారణంగా లోహాలు లేదా సముద్ర తీరాల్లో లభించే ఆల్చిప్పల పెంకులను కూడా ఉపయోగించేవారు. అయితే, ఎక్కువగా బంగారం, వెండి, కాంస్య లేదా పోత పోసిన లోహంతో తయారు చేస్తారు. ముత్యాలు, విలువైన రాళ్లను వాటిలో పొదుగుతారు. వేలిగోళ్ల గార్డు ధరించిన వారి సామాజిక స్థితిని తెలియజేసేది. 3సెం.మీ నుండి దాదాపు 15 సెంటీ మీటర్ల వరకు ఉండేలా డిజైన్ చేయించేవారు. కొన్నిసార్లు చిటికెన వేలు, ఉంగరపు వేలికి సరిపోయేలా డిజైన్ చేయించుకునేవారు. కుడిచేతి, ఎడమ చేతి డిజైన్లు భిన్నంగా ఉండేవి. తమ దేశ సంప్రదాయ ఆభరణాలలో భాగంగా ఉన్నా, రక్షణ కోసం ఉపయోగించేవిగా పేరొందాయి. వారి వారి దేశాల్లోని నాణేలు, జంతువులు, పక్షులు, మొక్కల బొమ్మలను నెయిల్ గార్డ్స్‌పైన డిజైన్ చేయించేవారు. మహారాణి కళ.. జువెలరీ డిజైన్ సృష్టి, ఎంపిక అనేవి మన భావ వ్యక్తీకరణ పట్ల నుండి పుట్టుకు వచ్చిన ఆలోచన. నా డిజైన్స్ ఎక్కువగా బంజారా సంస్కృతికి అద్దం పడతాయి. ఎన్నో ఏళ్లుగా చూసిన వివిధ జాతుల సంస్కృతి, కళలు నా డిజైన్స్‌లో కనిపిస్తాయి. క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ అలంకరణ మహారాణి కళను తీసుకువస్తుంది. – భవ్య రమేష్, జ్యువెలరీ డిజైనర్ -
నెయిల్ పాలిష్‌తో వచ్చే సమస్యలన్నింటికి ఈ డివైస్‌తో చెక్
పొడవైన, అందమైన గోళ్లు సైతం ఆడవాళ్లకు అలంకరణే! అందుకే సౌందర్యపిపాసులైన కోమలులు.. గోళ్లను ప్రత్యేకంగా పెంచుకుని.. అంతే ప్రత్యేకంగా వాటిని సంరక్షించుకుంటూ ఉంటారు. ఏరోజుకారోజు వేసుకున్న డ్రెస్‌కి తగ్గట్టుగా నెయిల్ పాలిష్ మారుస్తూ ఉంటారు. ట్రెండ్‌ని అనుసరిస్తూ గోళ్ల మీద రకరకాల రంగుల్లో డిజైన్స్ వేస్తూ గోళ్లకు ఎనలేని వన్నెను అద్దుతుంటారు. అలాంటి వారికి ఈ ‘డై జెల్ నెయిల్ కిట్’ భలే ఉపయోగపడుతుంది. సాధారణంగా గోళ్లకు నెయిల్ పాలిష్ వేసిన తర్వాత, ఆరే వరకూ ఏ పనీ చేయలేం. నెయిల్ పాలిష్ వేసుకోగానే చల్లటి నీళ్లల్లో వేళ్లు ముంచడం, ఫ్యా గాలికి ఆరబెట్టుకోవడం.. ఇలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. తడి ఆరే వరకూ ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటి సమస్యలకు చెక్ పెడుతుందీ డివైస్. ఈ మెషిన్ తో పాటు రెండు ప్రత్యేకమైన మినీ టూల్స్ లభిస్తాయి. వాటిలో ఒకటి క్యూటికల్ స్టిక్. దీని సాయంతో గోళ్ల వైశాల్యాన్ని పెంచడానికి గోళ్లకు, చర్మానికి మధ్య ఉండే భాగాన్ని లోపలికి నొక్కుకోవచ్చు. రెండవది ఫైల్ నెయిల్ స్టిక్. దీని సాయంతో గోళ్ల పగుళ్లు, గరుకుతనం పోగొట్టుకోవచ్చు. ఆ స్టిక్స్‌ని సక్రమంగా వినియోగించిన అనంతరం ఈ డివైస్‌ని ఆన్ చేసుకుని.. నెయిల్ పాలిష్ వేసుకుని.. ఈ టూల్లో ఒక్కో గోరు ఉంచుకోవాలి. దీనిలోని ఎల్ఈడీ లైట్ వెలుగుతూ.. 30 సెకన్ల పాటు ఆన్ లో ఉంటుంది. ఆ సమయంలో నెయిల్ పాలిష్ ఆరిపోతుంది. మరోవైపు 30 సెకన్స్‌లో ఇది ఆటోమెటిక్‌గా ఆఫ్ అవుతుంది. దీన్ని చిన్న టాయిలెట్ బ్యాగ్‌లో పెట్టుకుని, ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఈ కిట్‌తో పాటు 10 నెయిల్ పాలిష్ రిమూవర్ ప్యాడ్లు లభిస్తాయి. ఇందులో డైరెక్ట్ చార్జింగ్ పెట్టుకుని వైర్‌లెస్‌గా వాడుకునే డివైస్‌లు కూడా మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. -
Nail Art Designs : నెయిల్ ఆర్ట్‌లో నయా ట్రెండ్
-
థీమ్‌కి తగ్గట్లు నెయిల్ ఆర్ట్.. ఇంకెన్ని వెరైటీలు వస్తాయో
వేడుకలు సంప్రదాయమైనా పాశ్చాత్యమైనా టాప్ టు బాటమ్ స్పెషల్‌గా కనిపించాలనుకునేవారికి నెయిల్ ఆర్ట్ కూడా తనదైన ముద్ర వేస్తోంది.సందర్భానికి తగిన డిజైన్లతో నఖ శిఖ పర్యంతం ఆకట్టుకోవడానికి కొత్తగా ముస్తాబు అవుతోంది. వేడుకలకు తగినట్టుగా రెడీ అవడానికి తగిన డ్రెస్‌లను ఎంపికచేసుకుంటాం. అలాగే, వాటికి తగిన మ్యాచింగ్ పట్ల కూడా శ్రద్ధ పెడతాం. అయితే, మరింత ప్రత్యేకత చూపడానికి నెయిల్ ఆర్ట్ డిజైన్స్‌లోనూ శ్రద్ధ తీసుకుంటున్నారు నేటి యువత. ఫ్రెండ్షిప్ డే, ఇండిపెండెన్స్ డే, రక్షాబంధన్, కృష్ణాష్టమి.. వంటి రాబోయే వేడుకలను నెయిల్ ఆర్ట్ డిజైన్స్‌లో చూపుతూ సందర్భానికి తగినట్టుగా రెడీ అవుతున్నారు. కొనుగోరు చేయవచ్చు! ఎంత బాగా షేప్ చేసినా, గోళ్లు విరిగిపోవడం సహజంగా జరుగుతుంటుంది. నెయిల్ ఆర్ట్‌తో వేళ్లు అందంగా ఉండాలనుకునేవారు ఆర్టిఫిషియల్ నెయిల్స్‌తో సరికొత్తగా మార్చుకుంటున్నారు. ఈ మోడల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని మన నెయిల్ షేప్‌ను బట్టి, జెల్‌తో సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పాలిష్‌తో డిజైన్ చేసుకోవచ్చు. నచ్చిన డిజైన్ సరైన విధంగా రాదనుకునేవారు నిపుణుల సాయం తీసుకోవచ్చు. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ►చేతులకు పెడిక్యూర్‌లో భాగంగా వేలి కొసల్లో క్యుటికల్స్, డెడ్స్కిన్ అంతా క్లీన్ చేసి అప్పుడు మన వేళ్లను బట్టి ఏ షేప్‌లో కావాలో ఆ ఆర్టిఫిషియల్ నెయిల్స్ అమర్చుకోవాలి. (నెయిల్స్ పెరిగినప్పుడు, వీటిని మళ్లీ క్లియర్ చేసుకోవచ్చు). ►కొన్ని రంగుల నెయిల్ పాలిష్‌లు తెచ్చుకొని, డ్రెస్‌కు లేదా చీరకు మ్యాచ్ అయ్యే రంగును గోళ్లకు వేసుకోవడం మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు చీర లేదా డ్రెస్ రంగుతో పాటు ఆ డిజైన్‌కు మ్యాచ్ అయ్యే, పండగ థీమ్ ఆర్ట్‌ను నెయిల్స్‌పై ఎంచుకుంటున్నారు. అందుకు నెయిల్ ఆర్ట్ స్పా లు ప్రత్యేకంగా తోడ్పడుతున్నాయి. -
రొమాంటిక్ సింబల్స్
ఎన్ని ట్రెండ్స్ మారిపోతున్నా లవ్ సింబల్‌కి ఉన్న క్రేజే వేరు. అది ఎప్పటికీ హృదయాలను దోచే ఎవర్గ్రీన్ ట్రెండ్ అనే చెప్పుకోవాలి. చూడగానే వావ్ అనిపించే లవ్ సింబల్స్ ఏ కలర్లో ఉన్నా కళ్లను కట్టిపడేస్తాయి. ఇక ఆ సింబల్స్ రెడ్ కలర్లో ఉంటే వాటికి రొమాంటిక్ ఫ్లేవర్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ట్రై చెయ్యండి. మీ నాజూకైన గోళ్లకు మరింత అందాన్ని ఇవ్వండి. ముందుగా నెయిల్స్ క్లీన్ చేసుకుని.. షేప్ చేసుకోవాలి. తర్వాత అన్ని నెయిల్స్‌కి ట్రాన్స్పరెంట్ కలర్ వేసుకుని ఆరనివ్వాలి. ఇప్పుడు రెడ్ గ్లిట్టర్ నెయిల్ పాలిష్ తీసుకుని.. కుడి చేతి చూపుడు వేలు, ఉంగరపు వేలుతో పాటూ ఎడమ చేతి మధ్యవేలు, ఉంగరపు వేలు గోళ్లకు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ రెడ్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని.. కుడి చేతి మధ్య వేలుకి, బొటన వేలుకి, ఎడమ చేతి చూపుడు వేలుకి అప్లై చేసుకుని ఆరనివ్వాలి. ఇప్పుడు వైట్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని సన్నని బ్రష్‌తో.. కుడి చేతి మధ్యవేలు, ఎడమ చేతి చూపుడు వేలు గోళ్లపైన చిత్రంలో ఉన్న విధంగా లవ్ సింబల్స్ అప్లై చేసుకోవాలి. వాటి పక్కనే రెడ్ స్టోన్ అతికించుకోవాలి. తర్వాత కుడి చేతి చిటికెన వేలు గోరుతో పాటూ ఎడమ చేతి చిటికెన వేలు గోరుకి, బొటన వేలుకీ పింక్ కలర్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవాలి. మరింత క్రేజీ లుక్ కోసం.. కుడి చేతి మధ్యవేలు గోరు కింద ఉండే చర్మానికి.. ఎడమ చేతి చూపుడు వేలు గోరు కింద ఉండే చర్మానికి లవ్ సింబల్ స్టోన్స్ అతికించుకుంటే అదిరే లుక్ మీ సొంతమవుతుంది. న్యూ ఫేస్ ముఖం కాంతివంతంగా మారాలన్నా... మచ్చలు, మొటిమలు లేకుండా మృదువుగా మారాలన్నా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. బయటికి వెళ్లి రాగానే చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం, మేకప్ తొలగించి నిద్రపోవడం వంటివి చేయడంతో పాటు.. కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. మరింకెందుకు ఆలస్యం ఇలా ట్రై చెయ్యండి. న్యాచురల్ బ్యూటీ కావల్సినవి: క్లీనప్ : పచ్చిపాలు – 1 టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్ స్క్రబ్ : కొబ్బరి పాలు – 2 టీ స్పూన్లు, తేనె – 1 టీ స్పూన్, బియ్యప్పిండి – 1 టీ స్పూన్ మాస్క్: ఆరెంజ్ జ్యూస్ – 2 టీ స్పూన్లు, శనగపిండి – 1 టీ స్పూన్, ఖర్జూరం గుజ్జు – 1 టీ స్పూన్, అరటి పండు గుజ్జు – 1 టీ స్పూన్ తయారీ: ముందుగా పచ్చిపాలు, తేనె కలిపి.. ఆ మిశ్రమంతో ముఖంపై క్లీనప్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరిపాలు, తేనె, బియ్యప్పిండి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్‌లో శనగపిండి వేసుకుని బాగా కలుపుకుని.. అందులో ఖర్జూరం గుజ్జు, అరటిపండు గుజ్జు వేసుకుని బాగా కలుపుకుని ముఖానికి అపై్ల చేసుకోవాలి. ఇరవై ఐదు నిమిషాల పాటు ఆరనిచ్చి.. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్స్ వేసుకున్న తర్వాత ముఖానికి సబ్బు పెట్టకపోవడమే మంచిది. -
అందాల సోయగం
అందమంటే ఇదేనని దేన్నీ పరిగణించలేం. చూపుని ఆకట్టునే ప్రతీదీ అందమే. మనసు మాయచేసే ప్రతీదీ సోయగమే. అలాంటి అందాల సోయగాలను బంధించాలనే ఉబలాటం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఆడవారికి మాత్రం ఆ అందాన్ని అలంకరణగా చేసుకుని.. మరింత అందంగా నలుగురికీ కనిపించాలనే ఆరాటం ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ నెయిల్ ఆర్ట్. వావ్ అనిపిస్తుంది కదూ.. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి. ముందుగా నెయిల్స్ క్లీన్ చేసుకుని.. షేప్ చేసుకోవాలి. తర్వాత అన్ని నెయిల్స్‌కి ట్రాన్స్పరెంట్ కలర్ వేసుకుని ఆరిన తర్వాత...ఉంగరపు వేలు గోరుకి పింక్ కలర్.. చూపుడు వేలు, మధ్య వేలు గోర్లకు వైట్ కలర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చూపుడు వేలు గోరుపైన బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్‌తో సన్నని బ్రష్ ఉపయోగించి.. సీతాకోకచిలుకలను చిత్రంలో ఉన్న విధంగా డిజైన్ చేసుకుని.. ఎల్లో కలర్, రెడ్ కలర్ నెయిల్ పాలిష్‌లతో.. చిత్రంలో ఉన్న విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మధ్యవేలు గోరైన కూడా.. బ్లాక్, ఎల్లో, రెడ్ కలర్స్ ఉపయోగిస్తూ చిత్రంలో కనిపిస్తున్న డిజైన్ వేసుకోవాలి. తర్వాత చిటికెన వేలు గోరుపై గ్రీన్ కలర్ లేదా మీకు నచ్చిన కలర్ అప్లై చేసుకోవడంతో పాటుగా.. బొటన వేలు గోరుపైన కూడా గ్లోల్డ్ గ్లిటర్ లేదా సిల్వర్ గ్లిటర్ అప్లై చేసుకుంటే అదిరే లుక్ మీ సొంతమవుతుంది. -
ఆక్టోపస్ ఆర్ట్
నెయిల్ ఆర్ట్ అనగానే ఏవో నాలుగు గీతలు, వాటి చివర్లకు మూడు పువ్వులు అప్లై చేసుకుని మురిసిపోయే రోజులు ఎప్పుడో పోయాయి. ట్రెండ్ మారింది. ఎగిరే పక్షులు, ఈదే చేపలు ఇలా అన్నింటినీ ఆర్ట్‌గా మార్చి.. గోళ్లపై మెరిపిస్తున్నారు ఇప్పటి మగువలు. అందుకే మరి ఈ వారం సరికొత్తగా ఆక్టోపస్ నెయిల్ ఆర్ట్‌ని అందిస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి. చూపరుల చేత ‘అహో.. అద్భుతం’ అనిపించుకోండి. 1. ముందుగా నెయిల్స్ క్లీన్ చేసుకుని షేప్ చేసుకోవాలి. తరువాత అన్ని నెయిల్స్‌కి లైట్ బ్లూ కలర్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మధ్య వేలుకి రెడ్ కలర్ లేదా మీకు నచ్చిన డార్క్ కలర్‌తో (చిత్రంలో ఉన్న విధంగా) పెద్ద చుక్క పెట్టుకోవాలి. 2. తరువాత మధ్య వేలుకు ఉన్న చుక్కకు పై భాగానికి ఇరువైపులా (చిత్రాన్ని గమనిస్తూ) గీతలు పెట్టుకోవాలి. తరువాత చూపుడు వేలు, ఉంగరపు వేలుకు కూడా చిత్రాన్ని అనుసరిస్తూ కాస్త వాలుగా గీతలు అప్లై చేసుకోవాలి. 3. ఇప్పుడు ఆ గీతల చివరి భాగంలో అచ్చు చిత్రంలో ఉన్న విధంగా డిజైన్ చేసుకోవాలి. 4. ఇప్పుడు వైట్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని గీతలకు చిత్రాన్ని చూస్తూ చిన్న చిన్న చుక్కలు పెట్టుకోవాలి. 5. తరువాత మధ్య వేలుకి ఉన్న డిజైన్‌లో (చిత్రాన్ని అనుసరిస్తూ) రెండు వైట్ చుక్కలు పెట్టుకోవాలి. 6. ఇప్పుడు ఆ వైట్ చుక్కల్లో బ్లాక్ కలర్ చుక్కలు పెట్టుకోవాలి. తరువాత చిటికెన వేలు, బొటనవేళ్లకు ఇంతకు ముందు ఉపయోగించిన రెడ్ కలర్ లేదా మీరు ఎంచుకున్న డార్క్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని స్టార్స్ అప్లై చేసుకుని, వైట్ కలర్ నెయిల్ పాలిష్‌తో చిన్న చిన్న చుక్కలు పెట్టుకుంటే అదిరే నెయిల్ ఆర్ట్ మీ సొంతమవుతుంది. -
నెయిల్ ఆర్ట్ డిజైన్స్
క్రిస్మస్కి సిద్ధమైపోయారా?! లేదంటే, ఫ్యాషనబుల్‌గా అదీ పండగ కళతో కనిపించాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా?! అయితే నిమిషాల్లో క్రిస్మస్ కళ తీసుకురావడం మీ ‘చేతు’ల్లోనే ఉంది. అదే నెయిల్ ఆర్ట్. ..:: ఎన్.ఆర్ ప్రపంచం మొత్తమ్మీద అతివల మునివేళ్లలో క్రిస్మస్ వెలుగులు నింపడానికి డిజైనర్లు చాలా ఉత్సాహం చూపుతున్నారు. సింపుల్‌గా అనిపిస్తూనే కళ తెచ్చే ఈ యేడాది నెయిల్ ఆర్ట్ డిజైన్స్ ఇవి... ముందుగా... ఇప్పటికే ఉన్న గోళ్ల రంగును రిమూవర్‌తో తుడిచేయాలి. శుభ్రపడిన గోళ్ల మీద క్లియర్ బేస్ కోట్ని {పతి గోరుకు వేయాలి. బేస్‌కోట్ ఆరిన తర్వాత రెండు, మూడు రంగుల నెయిల్ పాలిష్‌లను ఎంచుకోవాలి. నెయిల్ ఆర్ట్ బ్రష్‌ల సాయంతో మంచు తునకలు, శాంతా క్లాజ్, శాంతా జింక, క్రిస్మస్ ట్రీ, స్టార్స్.. వంటివి గోళ్ల మీద తీర్చి దిద్దుకోవాలి. డిజైన్ ఆరిన తర్వాత ట్రాన్సపరెంట్ పాలిష్‌ని ప్రతి గోరుమీద వేస్తే నెయిల్ పాలిష్ త్వరగా పోదు. డిజైన్ అందంగా కనపడుతుంది. నెయిల్‌పాలిష్ డిజైన్లు అనుకున్నంత బాగా రావడం లేదనుకుంటే రెడీమేడ్‌గా నెయిల్ స్టిక్కర్స్ కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. వీటితో మీ గోళ్లను అందంగా వేడుకగా అలంకరించుకోవచ్చు. సీజన్‌ను బట్టి డిజైన్ సందర్భానికి తగ్గట్టు తయారవ్వడం ఇప్పుడు అందరూ చేస్తున్నారు. దీంట్లో భాగంగా నెయిల్స్నూ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటున్నారు. పెళ్లిళ్లకు సంప్రదాయ డిజైన్లు ఎలా డిజైన్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారో.. అలాగే క్రిస్మస్, న్యూ ఇయర్, నైట్ పార్టీలకు ప్రత్యేక నెయిల్ ఆర్ట్ డిజైన్స్ ఉన్నాయి. డిజైన్‌ను బట్టి ఖరీదు ఉంటుంది. - సాయిప్రియ, నెయిల్ ఆర్ట్ డిజైనర్ -
గోర్లపై అందమైన చిత్రాలు