అందాల సోయగం | Nail Art Designs In Funday | Sakshi
Sakshi News home page

అందాల సోయగం

Published Sun, Jul 14 2019 12:10 PM | Last Updated on Sun, Jul 14 2019 12:24 PM

Nail Art Designs In Funday - Sakshi

అందమంటే ఇదేనని దేన్నీ పరిగణించలేం. చూపుని ఆకట్టునే ప్రతీదీ అందమే. మనసు మాయచేసే ప్రతీదీ సోయగమే. అలాంటి అందాల సోయగాలను బంధించాలనే ఉబలాటం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఆడవారికి మాత్రం ఆ అందాన్ని అలంకరణగా చేసుకుని.. మరింత అందంగా నలుగురికీ కనిపించాలనే ఆరాటం ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ నెయిల్‌ ఆర్ట్‌. వావ్‌ అనిపిస్తుంది కదూ.. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి.

ముందుగా నెయిల్స్‌ క్లీన్‌ చేసుకుని.. షేప్‌ చేసుకోవాలి. తర్వాత అన్ని నెయిల్స్‌కి ట్రాన్స్‌పరెంట్‌ కలర్‌ వేసుకుని ఆరిన తర్వాత...ఉంగరపు వేలు గోరుకి పింక్‌ కలర్‌.. చూపుడు వేలు, మధ్య వేలు గోర్లకు వైట్‌ కలర్‌ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చూపుడు వేలు గోరుపైన బ్లాక్‌ కలర్‌ నెయిల్‌ పాలిష్‌తో సన్నని బ్రష్‌ ఉపయోగించి.. సీతాకోకచిలుకలను చిత్రంలో ఉన్న విధంగా డిజైన్‌ చేసుకుని.. ఎల్లో కలర్, రెడ్‌ కలర్‌ నెయిల్‌ పాలిష్‌లతో.. చిత్రంలో ఉన్న విధంగా అప్లై చేసుకోవాలి.

ఇప్పుడు మధ్యవేలు గోరైన కూడా.. బ్లాక్, ఎల్లో, రెడ్‌ కలర్స్‌ ఉపయోగిస్తూ చిత్రంలో కనిపిస్తున్న డిజైన్‌ వేసుకోవాలి. తర్వాత చిటికెన వేలు గోరుపై గ్రీన్‌ కలర్‌ లేదా మీకు నచ్చిన కలర్‌ అప్లై చేసుకోవడంతో పాటుగా.. బొటన వేలు గోరుపైన కూడా గ్లోల్డ్‌ గ్లిటర్‌ లేదా సిల్వర్‌ గ్లిటర్‌ అప్లై చేసుకుంటే అదిరే లుక్‌ మీ సొంతమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement