పన్నుపోటుండదు దేనికీ లోటుండదు | Tax Free Countries in the World | Sakshi
Sakshi News home page

పన్నుపోటుండదు దేనికీ లోటుండదు

Published Sun, Feb 16 2025 1:12 AM | Last Updated on Sun, Feb 16 2025 1:12 AM

Tax Free Countries in the World

ఆ దేశాలలో ప్రజలకు ఆదాయపు ‘పన్ను’పోటు ఉండదు.అయినా అభివృద్ధికి, సంక్షేమానికి లోటు ఉండదు.పన్నులు లేకున్నా, ఖజానా నిండుగానే ఉంటుంది.అన్ని వర్గాల పౌరులకు సామాజిక భద్రత ఉంటుంది.

పన్యాల జగన్నాథదాసు
మన దేశంలో కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ఏటేటా బడ్జెట్‌ ప్రవేశపెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీల్లో బడ్జెట్‌ ప్రవేశపెడతాయి. బడ్జెట్‌ వెలువడటానికి కొన్నాళ్ల ముందు నుంచి ‘పన్ను’పోటుపై జనాల్లో భయాలు మొదలవుతాయి. బడ్జెట్‌ వెలువడిన కొన్నాళ్ల వరకు ‘పన్ను’పోటుకు గురైన వర్గాలకు సలపరింత తప్పదు. 

రకరకాల వస్తువుల కొనుగోళ్ల మీద, అమ్మకాల మీద, రకరకాల సేవల మీద, ఆస్తుల లావాదేవీల మీద ‘పన్ను’పోటు తప్పదు. వీటికి తోడు ఆదాయం మీద కూడా ‘పన్ను’ చెల్లించాల్సి రావడం చాలామందిని బాధించే విషయం. భారత్‌ సహా పలుదేశాలు జనాల నుంచి ‘పన్ను’లూడగొడుతుంటే, అసలు ఆదాయపు పన్ను లేని దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ‘పన్ను’పోటు బెడదలేని ఆ దేశాల గురించి తెలుసుకుందాం.

‘పన్ను’పోటు గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి; చాలా వెటకారాలు ఉన్నాయి; ‘పన్ను’పోటు ఆవశ్యకతను బోధించే ఉపదేశాలు కూడా ఉన్నాయి. ‘ఈ ప్రపంచంలో నిశ్చయమైనవేవీ లేవు; పన్నులు, మరణం తప్ప’ అన్నాడు అమెరికన్‌ రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞశాలి బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌. ఏటా బడ్జెట్‌ వచ్చేటప్పుడల్లా ఈ సంగతి జనాలకు బాగానే అర్థమవుతూ ఉంటుంది.

‘రాజకీయ నాయకుల నిన్నటి వాగ్దానాలే నేటి పన్నులు’ అన్నాడు కెనడా మాజీ ప్రధాని విలియమ్‌ లైయన్‌ మెకంజీ కింగ్‌. అలవిమాలిన వాగ్దానాలతో ప్రజలను ఊరించి, అరచేతిలో వైకుంఠాన్ని చూపించే నాయకులు అన్నిచోట్లా ఉంటారు. వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే, ‘పన్ను’లూడగొట్టి మరీ పరిపాలిస్తారు. ప్రపంచంలో ‘పన్ను’పోటుతో విలవిలలాడే దేశాలు ఎక్కువగానే ఉన్నా, అసలు ‘పన్ను’పోటు లేని దేశాలు ఈ ప్రపంచంలో ఉండటం విశేషం. వాటిలో కొన్ని దేశాలు ఆర్థికాభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుండటం ఇంకా విశేషం. ప్రజల ఆదాయం మీద కన్నేసి, దాని మీద పన్ను వేయకుండా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయంటే, ఎంత విడ్డూరం!

ఆదాయపు పన్నులేని దేశాలు
ఆదాయపు పన్నులేని దేశాల్లో కొన్ని ప్రముఖ దేశాలు ఉన్నాయి. ఇంకొన్ని చిన్నా చితకా అనామక దేశాలు కూడా ఉన్నాయి. ఆదాయపు పన్నులేని దేశాల్లో ముఖ్యంగా గల్ఫ్‌ దేశాలను చెప్పుకోవాలి. గల్ఫ్‌లోని చాలా దేశాలు ప్రజల ఆదాయంపై పన్నులు విధించవు. వాటిలో సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, కువైట్, ఖతర్, ఒమన్, బహ్రెయిన్‌ దేశాలు ఉన్నాయి. ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల పరిధిలోని కేమన్‌ ఐలండ్స్, బెర్ముడా, బహామాస్, ఆంగ్విలా, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నీవిస్, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలండ్స్, టర్క్స్‌ అండ్‌ కేకోస్, ఆంటిగ్వా అండ్‌ బార్బుడా, సెయింట్‌ బార్తెలమీ దేశాలు; ఆసియాలోని బ్రూనై, ఉత్తర కొరియా దేశాలు; యూరోప్‌లోని వాటికన్‌ సిటీ, మొనాకో దేశాలు; ఒషియానా ప్రాంతంలోని వాలిస్‌ అండ్‌ ఫుటునా, వనువాటు, నౌరు దేశాలలోని ప్రజలకు ఆదాయంపై ఎలాంటి పన్నుపోటూ ఉండదు.

‘పన్ను’పోటు లేని సంక్షేమం
ప్రభుత్వ ఆదాయానికి పన్నులే కీలకమని; పన్నుల రాబడి లేకుండా దేశ ఆర్థిక పురోగతి సాధ్యం కాదని; అభివృద్ధి పనులు చేపట్టాలన్నా; సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నా; ప్రజల నుంచి పన్నులు వసూలు చేయక తప్పదని చాలా ప్రభుత్వాలు చెబుతుంటాయి. ప్రజల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకపోయినా, అభివృద్ధిలో ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్న దేశాల్లో గల్ఫ్‌ దేశాలే ముందు వరుసలో నిలుస్తాయి. ఈ దేశాలు ఖజానాకు పన్నుల రాబడి లేకున్నా, అవి ఎలా అభివృద్ధి సాధిస్తున్నాయో, భారీ స్థాయిలో సామాజిక సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తున్నాయో చూద్దాం.

బహ్రెయిన్‌: గల్ఫ్‌ ప్రాంతంలో చమురు నిల్వలను గుర్తించిన తొలి దేశాల్లో బహ్రెయిన్‌ ఒకటి. చమురు ఎగుమతుల ఆదాయంతో ఈ దేశం సుసంపన్న దేశంగా మారింది. చమురు వ్యాపారాన్ని ఇక్కడి ప్రభుత్వమే పూర్తిగా నియంత్రిస్తుంది. ఇబ్బడి ముబ్బడిగా వచ్చే చమురు ఎగుమతుల ఆదాయాన్ని పౌరుల సంక్షేమం కోసం వినియోగిస్తుంది. బహ్రెయిన్‌ ప్రభుత్వం తన పౌరులకు, వారి పిల్లలకు విద్య, వైద్యం, గృహ వసతి, వృద్ధులకు సామాజిక భద్రత, అంగవైకల్యం లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి పునరావాసం వంటి సౌకర్యాలను పూర్తి ఉచితంగా కల్పిస్తోంది. ఇతర దేశాల వారు ఇక్కడకు ఉద్యోగాల కోసం వస్తుంటారు. విదేశీయులు ఎవరైనా ఇక్కడ శాశ్వత నివాస హక్కును పొందాలనుకుంటే, వారు ఇక్కడ స్థిరాస్తుల్లో 50 వేల దినార్లు (రూ.1.15 కోట్లు) లేదా వ్యాపారాల్లో లక్ష దినార్లు (రూ.2.30 కోట్లు) పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.

కువైట్‌: కువైట్‌ ప్రభుత్వ ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. కువైట్‌లో వ్యాపారాలు సాగిస్తున్న విదేశీ కంపెనీల ద్వారా కూడా ఇక్కడి ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకుండానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. కువైట్‌ ప్రభుత్వం తన పౌరులకు అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం కల్పిస్తోంది. విదేశాల్లో చికిత్స పొందాల్సిన అవసరం ఏర్పడితే, ప్రభుత్వమే ఆ ఖర్చులను భరిస్తుంది. తక్కువ ఆదాయం ఉన్నవారికి చౌక ధరలకు ఇళ్లు, సొంత వ్యాపారాలు చేసుకోవాలనుకునే వికలాంగులకు తక్కువ వడ్డీ రుణాలు, పేదలకు ఆర్థిక సహాయం సహా పలురకాల సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది.

ఒమన్‌: ఒమన్‌ ప్రభుత్వానికి కూడా చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. తీర ప్రాంతం ఉండటంతో మత్స్య సంపద ద్వారా కూడా కొద్దిపాటి ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుంది. పౌరులపై ఆదాయపు పన్ను విధించకపోయినా, ఒమన్‌ ప్రభుత్వం పలు సంక్షేమ, సామాజిక భద్రత కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. ఒమన్‌ ప్రభుత్వం తన పౌరులందరికీ ఉచిత వైద్యం కల్పిస్తోంది. కంటిచూపు సమస్యలు ఉన్నవారికి ఉచిత ప్రజారవాణా కల్పిస్తోంది. శారీరక వైకల్యాలు ఉన్నవారికి ఉచితంగా కృత్రిమ అవయవాలను అందిస్తోంది. ఉన్నత విద్య, పరిశోధనలు కొనసాగించే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు సహా పౌరులకు పలు సౌకర్యాలను అందిస్తోంది.

ఖతర్‌: మిగిలిన గల్ఫ్‌ దేశాల మాదిరిగానే ఖరత్‌ ప్రభుత్వ ఖజానాకు చేరే ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. ప్రజలపై ఆదాయపు పన్ను భారం మోపకున్నా, ఖతర్‌ ప్రపంచంలోనే అత్యధిక తలసరి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గల దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఖతర్‌ ప్రభుత్వం అమ్మకపు పన్ను, విదేశీ కంపెనీల నుంచి ఇతర పన్నులు కూడా వసూలు చేయదు. అయినప్పటికీ పౌరులకు గరిష్ఠ స్థాయిలో సకల సౌకర్యాలను సమకూరుస్తోంది.

ఖతర్‌ ప్రభుత్వం తన పౌరులకు విద్య, వైద్యం, సామాజిక భద్రత సేవలను ఉచితంగా కల్పిస్తోంది. వితంతువులకు, విడాకులు పొందిన మహిళలకు, పిల్లలకు పలు సేవలను ఉచితంగా అందిస్తోంది. యువకులు ఏర్పాటు చేసుకునే సాంస్కృతిక వినోద సంఘాలకు ప్రభుత్వం నిధులు చెల్లిస్తోంది. అలాగే పౌరుల గృహావసరాలకు ఉచిత విద్యుత్తు, ఇళ్లు కట్టుకోవడానికి ఉచితంగా స్థలాలను కూడా సమకూరుస్తోంది. 

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఏఈ): యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఏడు ఎమిరేట్స్‌ ఉన్నాయి. చమురు ఎగుమతులు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయినా, పర్యాటకం, పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా కూడా భారీగానే ఆదాయం ఉంటుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకపోయినా, అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగించగలుగుతోంది. యూఏఈ ప్రభుత్వం పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయదు గాని, కార్పొరేట్‌ సంస్థల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేస్తుంది.

యుఏఈలోని ఏడు ఎమిరేట్స్‌లో అక్కడి ప్రభుత్వం 47 ఫ్రీ ట్రేడ్‌ జోన్స్‌ ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకునే విదేశీ సంస్థలకు భారీగా పన్ను రాయితీలు కూడా ఇస్తోంది. యూఏఈ ప్రభుత్వం తన పౌరుల్లో అర్హులకు ఉచితంగా ఇళ్లు ఇస్తోంది. అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు భృతి, ఉచిత వసతి, తక్కువ ఆదాయం ఉన్న పౌరులకు, వృద్ధులకు పలు సామాజిక భద్రత పథకాలను అమలు చేస్తోంది.

పౌరుల్లో 45 ఏళ్ల వయసు పైబడిన నిరుద్యోగులకు ప్రతి నెలా 5 వేల దినార్లు (సుమారు రూ.1.18 లక్షలు), ఇంటి అలవెన్సు 2500 దినార్లు (సుమారు రూ.59 వేలు) చెల్లిస్తోంది. యూనివర్సిటీల్లో చదువుకునే మెరిట్‌ విద్యార్థులకు నెలకు 3200 దినార్లు (సుమారు రూ.75 వేలు) అలవెన్స్‌ చెల్లిస్తోంది.

సౌదీ అరేబియా: గల్ఫ్‌లోని అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. ప్రపంచంలో అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న దేశం కూడా ఇదే! సౌదీ ఆదాయంలో చమురు ఎగుమతులదే సింహభాగం అయినా, పర్యాటకం, విద్యుదుత్పాదన, టెలికం, పారిశ్రామిక విస్తరణల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. ముస్లింల పవిత్ర క్షేత్రాలైన మక్కా, మదీనాలు సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వీటిని దర్శించుకోవడానికి ఏటా పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఇతర విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు పెద్దసంఖ్యలోనే వస్తుంటారు.

సౌదీ అరేబియా తన పౌరులకు భారీ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఉచితంగా మందులు సహా అన్ని స్థాయుల్లోనూ ఉచిత వైద్యసేవలను అందిస్తోంది. హైస్కూలు స్థాయి వరకు అందరికీ ఉచిత విద్య అందిస్తోంది. ఉన్నత విద్య కోసం సౌదీలో ప్రైవేటు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. అవి ఫీజులు వసూలు చేస్తాయి. అయితే, పూర్తిగా ప్రభుత్వ అధీనంలో నడిచే యూనివర్సిటీల్లో మాత్రం ఉన్నత విద్య కూడా ఉచితమే! వీటిలో చదువుకునే మెరిట్‌ విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు కూడా చెల్లిస్తోంది.

సౌదీ ప్రభుత్వం పౌరులకు ఉచితంగా ఇళ్ల స్థలాలను, నిర్మించిన ఇళ్లను కూడా అందిస్తోంది. రానున్న ఐదేళ్లల్లో పౌరులందరికీ ఉచిత ఇళ్లు సమకూర్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, భారీస్థాయిలో గృహనిర్మాణాలను కొనసాగిస్తోంది. ఇంతే కాకుండా, వృద్ధులకు, నిరుద్యోగులకు కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.

ఉత్తర కొరియా రూటే సెపరేటు!
పౌరులపై కొన్ని దేశాలు ఆదాయపు పన్ను విధించకపోయినా, ఇతరేతర పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. ప్రపంచంలోని మిగిలిన దేశాలన్నీ ఒక ఎత్తయితే, ఉత్తర కొరియా రూటే సెపరేటు! ఉత్తర కొరియా ప్రభుత్వం ఆదాయపు పన్నునే కాదు, అన్ని రకాల పన్నులనూ 1974లోనే రద్దు చేసింది. నరకానికి నకలుగా పేరుమోసిన ఉత్తర కొరియాలో పౌరులకు ‘పన్ను’పోటు లేదు గాని, ప్రభుత్వం కోరుకున్నప్పుడు పౌరులు ఉచితంగా సేవలందించాల్సి ఉంటుంది. అణ్వాయుధాల తయారీలోను, క్షిపణి ప్రయోగాల్లోను తలమునకలుగా ఉంటూ తరచు వార్తలకెక్కే ఉత్తర కొరియాలో ప్రజాసంక్షేమం మృగ్యం.

మన దేశంలో కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ఏటేటా బడ్జెట్‌ ప్రవేశపెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీల్లో బడ్జెట్‌ ప్రవేశపెడతాయి. బడ్జెట్‌ వెలువడటానికి కొన్నాళ్ల ముందు నుంచి ‘పన్ను’పోటుపై జనాల్లో భయాలు మొదలవుతాయి. బడ్జెట్‌ వెలువడిన కొన్నాళ్ల వరకు ‘పన్ను’పోటుకు గురైన వర్గాలకు సలపరింత తప్పదు. రకరకాల వస్తువుల కొనుగోళ్ల మీద, అమ్మకాల మీద, రకరకాల సేవల మీద, ఆస్తుల లావాదేవీల మీద ‘పన్ను’పోటు తప్పదు. వీటికి తోడు ఆదాయం మీద కూడా ‘పన్ను’ చెల్లించాల్సి రావడం చాలామందిని బాధించే విషయం. భారత్‌ సహా పలుదేశాలు జనాల నుంచి ‘పన్ను’లూడగొడుతుంటే, అసలు ఆదాయపు పన్ను లేని దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ‘పన్ను’పోటు బెడదలేని ఆ దేశాల గురించి తెలుసుకుందాం.

‘పన్ను’పోటు గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి; చాలా వెటకారాలు ఉన్నాయి; ‘పన్ను’పోటు ఆవశ్యకతను బోధించే ఉపదేశాలు కూడా ఉన్నాయి. ‘ఈ ప్రపంచంలో నిశ్చయమైనవేవీ లేవు; పన్నులు, మరణం తప్ప’ అన్నాడు అమెరికన్‌ రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞశాలి బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌. ఏటా బడ్జెట్‌ వచ్చేటప్పుడల్లా ఈ సంగతి జనాలకు బాగానే అర్థమవుతూ ఉంటుంది.

‘రాజకీయ నాయకుల నిన్నటి వాగ్దానాలే నేటి పన్నులు’ అన్నాడు కెనడా మాజీ ప్రధాని విలియమ్‌ లైయన్‌ మెకంజీ కింగ్‌. అలవిమాలిన వాగ్దానాలతో ప్రజలను ఊరించి, అరచేతిలో వైకుంఠాన్ని చూపించే నాయకులు అన్నిచోట్లా ఉంటారు. వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే, ‘పన్ను’లూడగొట్టి మరీ పరిపాలిస్తారు. ప్రపంచంలో ‘పన్ను’పోటుతో విలవిలలాడే దేశాలు ఎక్కువగానే ఉన్నా, అసలు ‘పన్ను’పోటు లేని దేశాలు ఈ ప్రపంచంలో ఉండటం విశేషం. వాటిలో కొన్ని దేశాలు ఆర్థికాభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుండటం ఇంకా విశేషం. ప్రజల ఆదాయం మీద కన్నేసి, దాని మీద పన్ను వేయకుండా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయంటే, ఎంత విడ్డూరం!

ఆదాయపు పన్నులేని దేశాలు
ఆదాయపు పన్నులేని దేశాల్లో కొన్ని ప్రముఖ దేశాలు ఉన్నాయి. ఇంకొన్ని చిన్నా చితకా అనామక దేశాలు కూడా ఉన్నాయి. ఆదాయపు పన్నులేని దేశాల్లో ముఖ్యంగా గల్ఫ్‌ దేశాలను చెప్పుకోవాలి. గల్ఫ్‌లోని చాలా దేశాలు ప్రజల ఆదాయంపై పన్నులు విధించవు. వాటిలో సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, కువైట్, ఖతర్, ఒమన్, బహ్రెయిన్‌ దేశాలు ఉన్నాయి. ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల పరిధిలోని కేమన్‌ ఐలండ్స్, బెర్ముడా, బహామాస్, ఆంగ్విలా, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నీవిస్, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలండ్స్, టర్క్స్‌ అండ్‌ కేకోస్, ఆంటిగ్వా అండ్‌ బార్బుడా, సెయింట్‌ బార్తెలమీ దేశాలు; ఆసియాలోని బ్రూనై, ఉత్తర కొరియా దేశాలు; యూరోప్‌లోని వాటికన్‌ సిటీ, మొనాకో దేశాలు; ఒషియానా ప్రాంతంలోని వాలిస్‌ అండ్‌ ఫుటునా, వనువాటు, నౌరు దేశాలలోని ప్రజలకు ఆదాయంపై ఎలాంటి పన్నుపోటూ ఉండదు.

‘పన్ను’పోటు లేని సంక్షేమం
ప్రభుత్వ ఆదాయానికి పన్నులే కీలకమని; పన్నుల రాబడి లేకుండా దేశ ఆర్థిక పురోగతి సాధ్యం కాదని; అభివృద్ధి పనులు చేపట్టాలన్నా; సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నా; ప్రజల నుంచి పన్నులు వసూలు చేయక తప్పదని చాలా ప్రభుత్వాలు చెబుతుంటాయి. ప్రజల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకపోయినా, అభివృద్ధిలో ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్న దేశాల్లో గల్ఫ్‌ దేశాలే ముందు వరుసలో నిలుస్తాయి. ఈ దేశాలు ఖజానాకు పన్నుల రాబడి లేకున్నా, అవి ఎలా అభివృద్ధి సాధిస్తున్నాయో, భారీ స్థాయిలో సామాజిక సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తున్నాయో చూద్దాం.

బహ్రెయిన్‌: గల్ఫ్‌ ప్రాంతంలో చమురు నిల్వలను గుర్తించిన తొలి దేశాల్లో బహ్రెయిన్‌ ఒకటి. చమురు ఎగుమతుల ఆదాయంతో ఈ దేశం సుసంపన్న దేశంగా మారింది. చమురు వ్యాపారాన్ని ఇక్కడి ప్రభుత్వమే పూర్తిగా నియంత్రిస్తుంది. ఇబ్బడి ముబ్బడిగా వచ్చే చమురు ఎగుమతుల ఆదాయాన్ని పౌరుల సంక్షేమం కోసం వినియోగిస్తుంది.

బహ్రెయిన్‌ ప్రభుత్వం తన పౌరులకు, వారి పిల్లలకు విద్య, వైద్యం, గృహ వసతి, వృద్ధులకు సామాజిక భద్రత, అంగవైకల్యం లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి పునరావాసం వంటి సౌకర్యాలను పూర్తి ఉచితంగా కల్పిస్తోంది. ఇతర దేశాల వారు ఇక్కడకు ఉద్యోగాల కోసం వస్తుంటారు. విదేశీయులు ఎవరైనా ఇక్కడ శాశ్వత నివాస హక్కును పొందాలనుకుంటే, వారు ఇక్కడ స్థిరాస్తుల్లో 50 వేల దినార్లు (రూ.1.15 కోట్లు) లేదా వ్యాపారాల్లో లక్ష దినార్లు (రూ.2.30 కోట్లు) పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.

కువైట్‌: కువైట్‌ ప్రభుత్వ ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. కువైట్‌లో వ్యాపారాలు సాగిస్తున్న విదేశీ కంపెనీల ద్వారా కూడా ఇక్కడి ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకుండానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. కువైట్‌ ప్రభుత్వం తన పౌరులకు అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం కల్పిస్తోంది.

విదేశాల్లో చికిత్స పొందాల్సిన అవసరం ఏర్పడితే, ప్రభుత్వమే ఆ ఖర్చులను భరిస్తుంది. తక్కువ ఆదాయం ఉన్నవారికి చౌక ధరలకు ఇళ్లు, సొంత వ్యాపారాలు చేసుకోవాలనుకునే వికలాంగులకు తక్కువ వడ్డీ రుణాలు, పేదలకు ఆర్థిక సహాయం సహా పలురకాల సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. 

ఒమన్‌: ఒమన్‌ ప్రభుత్వానికి కూడా చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. తీర ప్రాంతం ఉండటంతో మత్స్య సంపద ద్వారా కూడా కొద్దిపాటి ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుంది. పౌరులపై ఆదాయపు పన్ను విధించకపోయినా, ఒమన్‌ ప్రభుత్వం పలు సంక్షేమ, సామాజిక భద్రత కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. ఒమన్‌ ప్రభుత్వం తన పౌరులందరికీ ఉచిత వైద్యం కల్పిస్తోంది. కంటిచూపు సమస్యలు ఉన్నవారికి ఉచిత ప్రజారవాణా కల్పిస్తోంది.

శారీరక వైకల్యాలు ఉన్నవారికి ఉచితంగా కృత్రిమ అవయవాలను అందిస్తోంది. ఉన్నత విద్య, పరిశోధనలు కొనసాగించే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు సహా పౌరులకు పలు సౌకర్యాలను అందిస్తోంది. 

ఖతర్‌: మిగిలిన గల్ఫ్‌ దేశాల మాదిరిగానే ఖరత్‌ ప్రభుత్వ ఖజానాకు చేరే ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. ప్రజలపై ఆదాయపు పన్ను భారం మోపకున్నా, ఖతర్‌ ప్రపంచంలోనే అత్యధిక తలసరి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గల దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఖతర్‌ ప్రభుత్వం అమ్మకపు పన్ను, విదేశీ కంపెనీల నుంచి ఇతర పన్నులు కూడా వసూలు చేయదు.

అయినప్పటికీ పౌరులకు గరిష్ఠ స్థాయిలో సకల సౌకర్యాలను సమకూరుస్తోంది. ఖతర్‌ ప్రభుత్వం తన పౌరులకు విద్య, వైద్యం, సామాజిక భద్రత సేవలను ఉచితంగా కల్పిస్తోంది. వితంతువులకు, విడాకులు పొందిన మహిళలకు, పిల్లలకు పలు సేవలను ఉచితంగా అందిస్తోంది. యువకులు ఏర్పాటు చేసుకునే సాంస్కృతిక వినోద సంఘాలకు ప్రభుత్వం నిధులు చెల్లిస్తోంది. అలాగే పౌరుల గృహావసరాలకు ఉచిత విద్యుత్తు, ఇళ్లు కట్టుకోవడానికి ఉచితంగా స్థలాలను కూడా సమకూరుస్తోంది. 

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఏఈ): యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఏడు ఎమిరేట్స్‌ ఉన్నాయి. చమురు ఎగుమతులు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయినా, పర్యాటకం, పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా కూడా భారీగానే ఆదాయం ఉంటుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకపోయినా, అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగించగలుగుతోంది. యూఏఈ ప్రభుత్వం పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయదు గాని, కార్పొరేట్‌ సంస్థల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేస్తుంది.\

యుఏఈలోని ఏడు ఎమిరేట్స్‌లో అక్కడి ప్రభుత్వం 47 ఫ్రీ ట్రేడ్‌ జోన్స్‌ ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకునే విదేశీ సంస్థలకు భారీగా పన్ను రాయితీలు కూడా ఇస్తోంది. యూఏఈ ప్రభుత్వం తన పౌరుల్లో అర్హులకు ఉచితంగా ఇళ్లు ఇస్తోంది. అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు భృతి, ఉచిత వసతి, తక్కువ ఆదాయం ఉన్న పౌరులకు, వృద్ధులకు పలు సామాజిక భద్రత పథకాలను అమలు చేస్తోంది.

పౌరుల్లో 45 ఏళ్ల వయసు పైబడిన నిరుద్యోగులకు ప్రతి నెలా 5 వేల దినార్లు (సుమారు రూ.1.18 లక్షలు), ఇంటి అలవెన్సు 2500 దినార్లు (సుమారు రూ.59 వేలు) చెల్లిస్తోంది. యూనివర్సిటీల్లో చదువుకునే మెరిట్‌ విద్యార్థులకు నెలకు 3200 దినార్లు (సుమారు రూ.75 వేలు) అలవెన్స్‌ చెల్లిస్తోంది.

సౌదీ అరేబియా: గల్ఫ్‌లోని అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. ప్రపంచంలో అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న దేశం కూడా ఇదే! సౌదీ ఆదాయంలో చమురు ఎగుమతులదే సింహభాగం అయినా, పర్యాటకం, విద్యుదుత్పాదన, టెలికం, పారిశ్రామిక విస్తరణల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. ముస్లింల పవిత్ర క్షేత్రాలైన మక్కా, మదీనాలు సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వీటిని దర్శించుకోవడానికి ఏటా పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఇతర విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు పెద్దసంఖ్యలోనే వస్తుంటారు.

సౌదీ అరేబియా తన పౌరులకు భారీ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఉచితంగా మందులు సహా అన్ని స్థాయుల్లోనూ ఉచిత వైద్యసేవలను అందిస్తోంది. హైస్కూలు స్థాయి వరకు అందరికీ ఉచిత విద్య అందిస్తోంది. ఉన్నత విద్య కోసం సౌదీలో ప్రైవేటు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. అవి ఫీజులు వసూలు చేస్తాయి. అయితే, పూర్తిగా ప్రభుత్వ అధీనంలో నడిచే యూనివర్సిటీల్లో మాత్రం ఉన్నత విద్య కూడా ఉచితమే! వీటిలో చదువుకునే మెరిట్‌ విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు కూడా చెల్లిస్తోంది.

సౌదీ ప్రభుత్వం పౌరులకు ఉచితంగా ఇళ్ల స్థలాలను, నిర్మించిన ఇళ్లను కూడా అందిస్తోంది. రానున్న ఐదేళ్లల్లో పౌరులందరికీ ఉచిత ఇళ్లు సమకూర్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, భారీస్థాయిలో గృహనిర్మాణాలను కొనసాగిస్తోంది. ఇంతే కాకుండా, వృద్ధులకు, నిరుద్యోగులకు కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.

‘పన్ను’పోటు లేని గల్ఫ్‌ దేశాలు
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌
ఖతర్‌
బహ్రెయిన్‌
సౌదీ అరేబియా
కువైట్‌
ఒమన్‌

‘పన్ను’పోటు లేని చిన్న దేశాలు
చమురు ఎగుమతుల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడే గల్ఫ్‌ దేశాలు పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. కాని, ప్రపంచంలోని అత్యంత చిన్న దేశాల్లోని మొదటి మూడు దేశాలైన వాటికన్‌ సిటీ, మొనాకో, నౌరు కూడా పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకుండానే మనుగడ సాగిస్తుండటం ఆశ్చర్యకరమైన విషయం. ఆదాయపు పన్ను ద్వారా ఖజానాకు రాబడి లేకపోయినా, ఈ దేశాలు ఎలా మనుగడ సాగిస్తున్నాయో చూద్దాం.

వాటికన్‌ సిటీ: పోప్‌ పాలనలో ఉండే వాటికన్‌ సిటీ క్రైస్తవులకు ప్రధాన కేంద్రం. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఇక్కడ పౌరులెవరూ ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వాటికన్‌ సిటీకి ప్రపంచవ్యాప్తంగా ఉండే రోమన్‌ కేథలిక్‌ క్రైస్తవుల ద్వారా వచ్చే స్వచ్ఛంద విరాళాలు, నగరంలో ప్రవేశానికి విదేశీయులకు విక్రయించే టికెట్లు, స్టాంపులు, నాణేలు, జ్ఞాపికల విక్రయాలు, పెట్టుబడులపై వడ్డీల ద్వారా భారీగా ఈ దేశానికి ఆదాయం వస్తుంది. వాటికన్‌ బ్యాంకు ప్రపంచవ్యాప్తంగా జరిపే ఆర్థిక లావాదేవీల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం వస్తుంది.

మొనాకో: ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో రెండోస్థానంలో నిలిచే దేశం మొనాకో. ఇక్కడి పౌరులు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పర్యాటకం, ఆర్థిక సేవలు, రియల్‌ ఎస్టేట్, శాస్త్ర సాంకేతిక కార్యకలాపాల ద్వారా మొనాకోకు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తుంది. తమ తమ దేశాల్లోని ‘పన్ను’పోటు తప్పించుకోవడానికి చాలామంది విదేశీయులు ఇక్కడి బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటుంటారు.

ఇక్కడి క్యాసినోలు భారీ స్థాయిలో విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. వివిధ మార్గాల్లో గణనీయంగా ఆదాయం వస్తుండటంతో ప్రజల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకపోయినా, మొనాకో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించగలుగుతోంది. మొనాకో ప్రభుత్వం తన పౌరులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు మాతృత్వ, పితృత్వ భృతి, పనిచేయలేని స్థితిలో ఉన్నవారికి పింఛన్ల చెల్లింపు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది.

నౌరు: ఓషియానా ప్రాంతంలోని నౌరు ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో మూడో స్థానంలో నిలుస్తుంది. నౌరు ప్రభుత్వం తన పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయదు. చుట్టూ సముద్రం తప్ప మరే సహజ వనరులు లేకపోయినా, నౌరు ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా ఆదాయం పొందుతోంది.

చేపల వేటకు లైసెన్సులు, ఆశ్రయం కోరి వచ్చే శరణార్థుల నుంచి వీసా రుసుములు, కస్టమ్స్, ఎక్సైజ్‌ సుంకాలు, విదేశాలలో నిర్వహించే బ్యాంకింగ్‌ కార్యకలాపాల ద్వారా నౌరుకు గణనీయంగా ఆదాయం లభిస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి ఏటా ఆర్థిక సాయం కూడా లభిస్తుంది. నౌరు ప్రభుత్వం వార్ధక్య పింఛన్లు, వికలాంగ పింఛన్లు, జనన మరణాల భృతి, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి స్కాలర్‌షిప్‌లు వంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది. 

పౌరులపై ఆదాయపు పన్ను విధించని పలు చిన్నా చితకా దేశాలు ప్రధానంగా పర్యాటక ఆదాయంపై ఆధారపడుతున్నాయి. పౌరసత్వం కోరుకునే విదేశీయుల నుంచి పెట్టుబడుల సేకరణ, రియల్‌ ఎస్టేట్,  మత్స్యసంపద తదితర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. వివిధ మార్గాల ద్వారా సంపద సృష్టించుకుంటూ, ఇవి తమ పౌరులపై పన్నుభారం మోపకుండా మనుగడ సాగిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement