
యేసుక్రీస్తు పుట్టుకే మానవాళికి గొప్ప శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ భక్తులు క్రీస్తు పుట్టుకను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు ఆయన కారణజన్ముడు. చారిత్రాత్మక పురుషుడు అని విశ్వసిస్తారు. ఈ సందర్భంగా బంధుమిత్ర సపరివారంగా సంబరాలు చేసుకుంటారు. పవిత్ర ఏసును కీర్తిస్తూ చర్చ్‌లలో ప్రార్థనలు చేస్తారు.
క్రైస్తవ భక్తులకు క్రిస్మస్ వచ్చిందంటే ఆ సంబరమే వేరు. విద్యుద్దీప కాంతులతో గృహాలను అలంకరించు కుంటారు. ముఖ్యంగా క్రిస్మస్ ట్రీని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఇంటిల్లిపాదీ కొత్త బట్టలు, రకరకాల పిండివంటలతో ఉత్సాహంగా గడుపుతారు. గృహిణులు, కన్నెపిల్లలు అందంగా ముస్తాబవుతారు. మరి పవిత్ర క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ నెయిల్ పెయింట్ క్రియేటివ్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దేమా. మాసిమో (@రెయిన్‌మేకర్1973) ట్విటర్ ఖాతా షేర్ చేసిన వీడియో మీకోసం..
Christmas nail art🎄
[📹 the_nail_mannn]pic.twitter.com/9ieWpRXlnn— Massimo (@Rainmaker1973) December 25, 2024