పొడవైన, అందమైన గోళ్లు సైతం ఆడవాళ్లకు అలంకరణే! అందుకే సౌందర్యపిపాసులైన కోమలులు.. గోళ్లను ప్రత్యేకంగా పెంచుకుని.. అంతే ప్రత్యేకంగా వాటిని సంరక్షించుకుంటూ ఉంటారు. ఏరోజుకారోజు వేసుకున్న డ్రెస్‌కి తగ్గట్టుగా నెయిల్ పాలిష్ మారుస్తూ ఉంటారు. ట్రెండ్‌ని అనుసరిస్తూ గోళ్ల మీద రకరకాల రంగుల్లో డిజైన్స్ వేస్తూ గోళ్లకు ఎనలేని వన్నెను అద్దుతుంటారు. అలాంటి వారికి ఈ ‘డై జెల్ నెయిల్ కిట్’ భలే ఉపయోగపడుతుంది.
సాధారణంగా గోళ్లకు నెయిల్ పాలిష్ వేసిన తర్వాత, ఆరే వరకూ ఏ పనీ చేయలేం. నెయిల్ పాలిష్ వేసుకోగానే చల్లటి నీళ్లల్లో వేళ్లు ముంచడం, ఫ్యా గాలికి ఆరబెట్టుకోవడం.. ఇలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. తడి ఆరే వరకూ ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటి సమస్యలకు చెక్ పెడుతుందీ డివైస్. ఈ మెషిన్ తో పాటు రెండు ప్రత్యేకమైన మినీ టూల్స్ లభిస్తాయి. వాటిలో ఒకటి క్యూటికల్ స్టిక్. దీని సాయంతో గోళ్ల వైశాల్యాన్ని పెంచడానికి గోళ్లకు, చర్మానికి మధ్య ఉండే భాగాన్ని లోపలికి నొక్కుకోవచ్చు. రెండవది ఫైల్ నెయిల్ స్టిక్. దీని సాయంతో గోళ్ల పగుళ్లు, గరుకుతనం పోగొట్టుకోవచ్చు.
ఆ స్టిక్స్‌ని సక్రమంగా వినియోగించిన అనంతరం ఈ డివైస్‌ని ఆన్ చేసుకుని.. నెయిల్ పాలిష్ వేసుకుని.. ఈ టూల్‌లో ఒక్కో గోరు ఉంచుకోవాలి. దీనిలోని ఎల్‌ఈడీ లైట్ వెలుగుతూ.. 30 సెకన్ల పాటు ఆన్ లో ఉంటుంది. ఆ సమయంలో నెయిల్ పాలిష్ ఆరిపోతుంది. మరోవైపు 30 సెకన్స్‌లో ఇది ఆటోమెటిక్‌గా ఆఫ్ అవుతుంది. దీన్ని చిన్న టాయిలెట్ బ్యాగ్‌లో పెట్టుకుని, ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఈ కిట్‌తో పాటు 10 నెయిల్ పాలిష్ రిమూవర్ ప్యాడ్‌లు లభిస్తాయి. ఇందులో డైరెక్ట్ చార్జింగ్ పెట్టుకుని వైర్‌లెస్‌గా వాడుకునే డివైస్‌లు కూడా మార్కెట్‌లో అమ్ముడవుతున్నాయి.
నెయిల్ పాలిష్‌తో వచ్చే సమస్యలన్నింటికి ఈ డివైస్‌తో చెక్
Published Tue, Sep 5 2023 4:56 PM | Last Updated on Tue, Sep 5 2023 5:21 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment