ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలా! అయితే ఇలా చేయండి... | Always Look Young But Do This Beauty Tips | Sakshi
Sakshi News home page

ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలా! అయితే ఇలా చేయండి...

Published Sun, Aug 11 2024 5:08 AM | Last Updated on Sun, Aug 11 2024 5:08 AM

Always Look Young But Do This Beauty Tips

కొందరు ఏ వయసులోనైనా సహజత్వాన్నే కోరుకుంటారు. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలని తహతహలాడతారు. అలాంటి వారికి ఈ ఫేషియల్‌ టోనర్‌ చక్కగా పని చేస్తుంది. దీన్ని చాలా సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు.

చీక్‌ బోన్స్‌స కోసం ప్రత్యేకంగా రూపొందిన ఈ ఫేషియల్‌ టోనర్‌.. ముఖంలో సహజ సౌందర్యాన్ని, యవ్వన రూపాన్ని మెరుగుపరచడానికి.. ఎంతగానో సహకరిస్తుంది. ఇది.. సహజమైన, సౌకర్యవంతమైన గాడ్జెట్‌గా.. మార్కెట్‌లో మాంచి డిమాండ్‌ను అందుకుంటోంది. ఇందులో 3 ప్రోగ్రామ్స్‌ను మార్చిమార్చి సెట్‌ చేసుకోవచ్చు. పది నిమిషాలు, పదిహేను నిమిషాలు, ఇరవై నిమిషాల టైమింగ్‌తో.. వేరియబుల్‌ ట్రీట్‌మెంట్‌ లెవెల్స్‌తో ఉన్న ఈ డివైస్‌.. హ్యాండ్‌ హోల్డ్‌ కంట్రోలర్‌గా పని చేస్తుంది.

హెడ్‌సెట్‌ బేస్డ్‌ డెలివరీ సిస్టమ్‌తో తయారైన ఈ డివైస్‌ని.. తల వెనుక నుంచి ముఖానికి అటాచ్‌ చేసుకోవచ్చు. చార్జ్‌ చేసుకుని వాడుకునే వీలు ఉండటంతో.. దీన్ని ఎక్కడైనా సులభంగా వినియోగించుకోవచ్చు. ఈ టోనర్‌ ముఖ కండరాలను దృఢంగా మార్చేస్తుంది. ముఖాన్ని నాజూగ్గా చేసేస్తుంది. వారానికి ఐదుసార్లు దీనితో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే.. ఫలితం ఉంటుంది. అయితే ప్రతి ట్రీట్‌మెంట్‌ 20 నిమిషాల వరకు ఉండేలా చూసుకోవాలి. సుమారు 12 వారాలు ఈ టోనర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే.. 40 దాటినవారు కూడా 20లా కనిపిస్తారట.

డివైస్‌కి ఉండే రెండు జెల్‌ ప్యాడ్స్‌ని ముఖ చర్మానికి ఆనించి.. చిత్రంలో ఉన్న విధంగా పెట్టాలి. ప్యాడ్స్‌ పెట్టుకునే ముందు.. ఆ భాగంలో లోషన్  లేదా క్రీమ్‌ అప్లై చేసుకోవాలి. ఇక ఈ మెషిన్ ని ముఖానికి పెట్టుకునేప్పుడు ఖాళీగా ఉండాల్సిన పనిలేదు. ల్యాప్‌ టాప్‌ వర్క్‌ కానీ.. వ్యాయామాలు కానీ.. ఇంటి పని కానీ ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఈ మోడల్స్‌లో బ్లాక్, వైట్‌ కలర్స్‌ అందుబాటులో ఉన్నాయి. దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement