న్యూడెస్టిక్ కన్సీలర్ పెన్సిల్
ఈరోజుల్లో చిన్నచిన్న పార్టీలకైనా.. పెద్దపెద్ద ఫంక్షన్స్‌కైనా వేసుకున్న డ్రెస్‌కి తగ్గట్టుగా.. మేకప్ చేసుకోవడం కామన్ అయిపోయింది. దాన్ని చక్కగా సరిదిద్దుతుంది ఈ న్యూడెస్టిక్స్ కన్సీలర్ పెన్సిల్.
వేగంగా మేకప్ వేసుకునేటప్పుడు.. ఐలైనర్స్, మస్కారా, ఐబ్రో పెన్సిల్ వంటివి పక్కకు అంటుకుని.. అందాన్ని చెడగొడుతుంటాయి. దాన్ని సరిచేయడానికి బోలెడు సమయం పడుతుంది. అలాంటి శ్రమను దూరం చేస్తుందీ పెన్సిల్. మేకప్ చెదిరిన చోట ఈ పెన్సిల్‌తో లైట్‌గా రుద్దుకుంటే చాలు.. మెరిసిపోతుంది ముఖం.
అంతేకాదు ముఖం మీది చిన్న చిన్న మచ్చల్ని, గీతల్నీ దీంతో పోగొట్టుకోవచ్చు. అలాగే కంటి కిందున్న నల్లటి వలయాలను కనిపించకుండా చేసుకోవచ్చు. ఇందులో స్కిన్ కలర్ షేడ్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. మన స్కిన్ టోన్‌కి సరిపడా పెన్సిల్‌ని ఎంచుకుంటే సరిపోతుంది. దీనితో అవసరం అయిన చోట.. ముందుకు వెనుకకు రుద్ది, పొడిగా ఉండేలా.. వేలికొనలతో ఒత్తినట్లుగా రుద్దుకోవాలి. ఈ పెన్సిల్‌కి ఒక షార్పెనర్ కూడా లభిస్తుంది. ఇదే మోడల్‌లో చాలా రంగుల్లో ఈ పెన్సిల్స్ అందుబాటులో ఉన్నాయి.
దీని తయారికీ.. విటమిన్ ఈ, నేచురల్ మాయిశ్చరైజర్, యాంటీ ఆక్సిడెంట్, షియా బటర్ వంటివి చాలానే వాడతారు. దాంతో దీన్ని డైరెక్ట్‌గా ఫేస్‌కి మేకప్‌లా అప్లై చేసుకోవచ్చు. ఇదే పెన్సిల్‌లో లిప్ స్టిక్స్ కలర్స్ కూడా లభిస్తున్నాయి. దీని ధర 24 డాలర్లు. అంటే 2,006 రూపాయలన్న మాట.
ఇవి చదవండి: ఈ బీచ్‌బబుల్ టెంట్లకి.. ప్రత్యేకత ఏంటో తెలుసా!?
Comments
Please login to add a commentAdd a comment