ఈ ఎలక్ట్రిక్‌ రెడ్‌ లైట్‌ థెరపీతో.. చాలా ప్రయోజనాలు పొందవచ్చు! | With This Electric Red Light Therapy Many Benefits Can Be Obtained | Sakshi
Sakshi News home page

ఈ ఎలక్ట్రిక్‌ రెడ్‌ లైట్‌ థెరపీతో.. చాలా ప్రయోజనాలు పొందవచ్చు!

Published Sun, Aug 4 2024 6:07 AM | Last Updated on Sun, Aug 4 2024 6:07 AM

With This Electric Red Light Therapy Many Benefits Can Be Obtained

అందాలను అందించే గాడ్జెట్స్‌ కోసం సౌందర్యాభిలాషులు నిరంతరం అన్వేషిస్తుంటారు. అలాంటి వారికి ఈ మసాజర్‌ ఒక మంత్రదండం లాంటిది. ఇది అందించే ఎలక్ట్రిక్‌ రెడ్‌ లైట్‌ థెరపీతో చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఈ హీటెడ్‌ అండ్‌ వైబ్రేషన్‌ ఫేస్‌ మసాజర్‌ వయసుని ఇట్టే తగ్గించేసి, ముఖానికి నవయవ్వన కాంతినిస్తుంది. చేతిలో ఇట్టే ఇమిడిపోయే ఈ పరికరం చర్మం మీదనున్న ముడతలు, గీతలను పోగొట్టి, మృదువుగా మారుస్తుంది.

ఈ ఫేషియల్‌ మసాజర్‌ 3 లెవెల్‌ హీటింగ్‌ మోడ్‌తో, వైబ్రేషన్‌ మోడ్‌తో ప్రత్యేకంగా రూపొందింది. చర్మానికి పైపైనే కాకుండా లోతుగా ట్రీట్‌మెంట్‌ అందించి, చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా ముఖం, మెడ, వీపు, పొట్ట, నడుము, కాళ్లు, చేతులు ఇలా ప్రతిభాగాన్నీ అందంగా మలచుకోవచ్చు.

ఈ పరికరం శరీరంలోని ఆక్యుపాయింట్‌లను ఉత్తేజపరుస్తుంది. దీన్ని ఎవరికి వారు స్వయంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇది ఎల్‌ఈడీ డిస్‌ప్లే స్క్రీ¯Œ తో ఉంటుంది. ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి కూడా ఇది చాలా బాగుంటుంది.

ఈ ఫేస్‌ లిఫ్టర్‌ మసాజర్‌ చూడటానికి చిన్నగా, క్యూట్‌గా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. ఏ సమయంలోనైనా దీనితో సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అలాగే చర్మానికి ఆయిల్‌ లేదా నచ్చిన లోష¯Œ  అప్లై చేసుకుని, అనంతరం దీనితో మసాజ్‌ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీని ధర 37 డాలర్లు. అంటే 3,097 రూపాయలు. ఇలాంటి మోడల్స్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ వెర్షన్స్‌ అందుబాటులోకి రావడంతో వీటికి డిమాండ్‌ బాగా పెరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement