Beauty Tips: ముఖానికి మెరుపు.. చర్మానికి నునుపు! | It Is An Advanced Cosmetic Device That Rejuvenates The Skin | Sakshi
Sakshi News home page

Beauty Tips: ముఖానికి మెరుపు.. చర్మానికి నునుపు!

Published Sun, Aug 18 2024 4:47 AM | Last Updated on Sun, Aug 18 2024 4:47 AM

It Is An Advanced Cosmetic Device That Rejuvenates The Skin

ఇది చర్మానికి పునరుత్తేజం కలిగించే అధునాతన సౌందర్య పరికరం. ఇది ముఖాన్ని అందంగా మెరిపిస్తుంది. చక్కటి ఆక్సిజన్‌ ఫేషియల్‌ను అందజేస్తుంది. ఈ సొగసైన పరికరం చర్మం పైపొరపై పేరుకున్న మృతకణాలను తొలగించడంతో పాటు చర్మం లోలోతుల వరకు ఆక్సిజన్‌ ను అందిస్తుంది. ఈ పరికరం రక్తప్రసరణను మెరుగుపరచి, చర్మకణాలకు ఉత్తేజం కలిగిస్తుంది. వాడిపోయినట్లున్న చర్మానికి నునుపుదనం కలిగించి, కొత్త మెరుపునిస్తుంది.

ఇది ముఖంతో పాటు శరీరంపై చర్మమంతటికీ ఆక్సిజన్‌ ను అందిస్తూ, చర్మానికి పునరుజ్జీవం కలిగించి, ప్రకాశవంతంగా మారుస్తుంది. క్లెన్సింగ్, ఎక్స్‌ఫోలియేటింగ్, స్కిన్‌  కేర్‌ అప్లికేషన్‌  ఇలా ఎన్నో ప్రయోజనాలతో ఇది ఏమాత్రం నొప్పి లేకుండా చికిత్స చేస్తుంది. దీనిని ఉపయోగించుకోవడం చాలా సులభం. తక్కువ సమయంలోనే మన్నికైన ఫలితాలనిస్తుంది. ఈ పరికరాన్ని ఎక్కడికైనా సులువుగా తీసుకుపోవచ్చు. దీనికి చార్జింగ్‌ కోసం ప్రత్యేకమైన ట్రే విడిగా లభిస్తుంది. దానిలోనే ఈ పరికరానికి చార్జింగ్‌ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు బ్యూటీ క్యాప్సూల్స్, జెల్, క్రీమ్‌ వంటివి కూడా లభిస్తాయి. అవి అయిపోయినప్పుడు. వాటిని విడిగా కూడా ఆన్‌లైన్‌ లో కొనుగోలు చేసుకోవచ్చు.

ముందుగా ముఖాన్ని శుభ్రపరచుకుని, అనంతరం ఈ పరికరానికి ముందున్న చిన్న వలయాల్లో క్యాప్సూల్‌ అమర్చుకోవాలి. తర్వాత ముఖానికి జెల్‌ పట్టించి, ఈ పరికరాన్ని చర్మానికి ఆనించి 3 నిమిషాల పాటు గుండ్రంగా తిప్పుతూ చికిత్స తీసుకోవాలి. అనంతరం నీళ్లతో ముఖాన్ని కడిగి, క్రీమ్‌ రాసుకోవాలి. ఈ పరికరాన్ని ఎవరికి వారే వాడుకోవచ్చు. ఈ పరికరానికి ఒకవైపు క్లీనింగ్‌ బ్రష్‌ కూడా ఉంటుంది. దాన్ని విడిగా తీసి, శుభ్రం చేసుకోవచ్చు.

ఇవి చదవండి: పీసీఓఎస్‌ కట్టడికి మలేరియా మందు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement