ఈరోజుల్లో సౌందర్యాభిలాషులకు తమ వయసును దాచే అద్భుతమైన పరికరాలు మార్కెట్‌లోకి చాలానే వస్తున్నాయి. ముడతలు, మచ్చలు, గీతలు లేకుండా చర్మానికి నిగారింపునిచ్చి, యవ్వనంతో కళకళలాడేలా మార్చే ఇలాంటి డివైస్‌లు వెంట ఉంటే, అందాన్ని కాపాడుకోవడం చాలా తేలిక. చిత్రంలోని ఈ మైక్రోకరెంట్ ఫేస్ లిఫ్ట్ మెషిన్ అధునాతన రేడియో ఫ్రీక్వెన్సీ, ఎలక్ట్రికల్ మజిల్ స్టిములేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది.
ఈ ప్రొఫెషనల్ ఫేషియల్ మసాజర్ వడలిపోయిన చర్మాన్ని బిగుతుగా మార్చడానికి, చర్మానికి ఉండే సహజ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి, చర్మం నిగారింపును పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఈ పోర్టబుల్ మెషిన్ చూడటానికి టార్చ్‌లైట్‌లా కనిపిస్తుంది. రీచార్జ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది.
ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనిలోని రెడ్ లైట్ థెరపీ చర్మాన్ని బిగుతుగా మార్చడంతో పాటు దెబ్బతిన్న కొలాజెన్ పొరను సరిదిద్దడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలోని బ్లూ కలర్ లైట్ థెరపీ మొటిమలను, మొటిమల వల్ల ఏర్పడే మచ్చలను తొలగిస్తుంది. దీనిలోని రెండు రకాల లైట్ థెరపీలకు మూడు స్థాయిల్లో వైబ్రేషన్ స్పీడ్‌ను కోరుకున్న విధంగా మార్చుకోవచ్చు. ఈ మెషిన్ ఆన్ అయిన ఆరు నిమిషాల్లో ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. దీని ధర 84 డాలర్లు (రూ.7,044) మాత్రమే!
ఇవి చదవండి: అందాలొలికే ఈ బొమ్మలు.. సుమనోహరం!
Comments
Please login to add a commentAdd a comment