treatement
-
ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలా! అయితే ఇలా చేయండి...
కొందరు ఏ వయసులోనైనా సహజత్వాన్నే కోరుకుంటారు. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలని తహతహలాడతారు. అలాంటి వారికి ఈ ఫేషియల్ టోనర్ చక్కగా పని చేస్తుంది. దీన్ని చాలా సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు.చీక్ బోన్స్స కోసం ప్రత్యేకంగా రూపొందిన ఈ ఫేషియల్ టోనర్.. ముఖంలో సహజ సౌందర్యాన్ని, యవ్వన రూపాన్ని మెరుగుపరచడానికి.. ఎంతగానో సహకరిస్తుంది. ఇది.. సహజమైన, సౌకర్యవంతమైన గాడ్జెట్‌గా.. మార్కెట్లో మాంచి డిమాండ్‌ను అందుకుంటోంది. ఇందులో 3 ప్రోగ్రామ్స్‌ను మార్చిమార్చి సెట్ చేసుకోవచ్చు. పది నిమిషాలు, పదిహేను నిమిషాలు, ఇరవై నిమిషాల టైమింగ్‌తో.. వేరియబుల్ ట్రీట్మెంట్ లెవెల్స్‌తో ఉన్న ఈ డివైస్.. హ్యాండ్ హోల్డ్ కంట్రోలర్‌గా పని చేస్తుంది.హెడ్సెట్ బేస్డ్ డెలివరీ సిస్టమ్‌తో తయారైన ఈ డివైస్‌ని.. తల వెనుక నుంచి ముఖానికి అటాచ్ చేసుకోవచ్చు. చార్జ్ చేసుకుని వాడుకునే వీలు ఉండటంతో.. దీన్ని ఎక్కడైనా సులభంగా వినియోగించుకోవచ్చు. ఈ టోనర్ ముఖ కండరాలను దృఢంగా మార్చేస్తుంది. ముఖాన్ని నాజూగ్గా చేసేస్తుంది. వారానికి ఐదుసార్లు దీనితో ట్రీట్మెంట్ తీసుకుంటే.. ఫలితం ఉంటుంది. అయితే ప్రతి ట్రీట్మెంట్ 20 నిమిషాల వరకు ఉండేలా చూసుకోవాలి. సుమారు 12 వారాలు ఈ టోనర్ ట్రీట్మెంట్ తీసుకుంటే.. 40 దాటినవారు కూడా 20లా కనిపిస్తారట.డివైస్‌కి ఉండే రెండు జెల్ ప్యాడ్స్‌ని ముఖ చర్మానికి ఆనించి.. చిత్రంలో ఉన్న విధంగా పెట్టాలి. ప్యాడ్స్ పెట్టుకునే ముందు.. ఆ భాగంలో లోషన్ లేదా క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇక ఈ మెషిన్ ని ముఖానికి పెట్టుకునేప్పుడు ఖాళీగా ఉండాల్సిన పనిలేదు. ల్యాప్ టాప్ వర్క్ కానీ.. వ్యాయామాలు కానీ.. ఇంటి పని కానీ ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఈ మోడల్స్‌లో బ్లాక్, వైట్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. -
క్యాన్సర్‌ను జయించే క్రమంలో... మీరు విజేత కావాలంటే..?
మునపటి జవజీవాలూ, జీవితం పట్ల అనురక్తి, బతికే క్షణాలను ఆస్వాదించడం లేకుండా ఓ వ్యక్తి జీవితాన్ని కొన్ని రోజులూ, కొన్నేళ్లూ అంటూ పొడిగించడం సబబేనా? ఓ జీవచ్ఛవంలా బాధితుడు తన బతుకును వెళ్లదీయడం సరైనదేనా? ఇలాంటిదే గతకాలపు చికిత్సల్లో చాలావరకు ఉండేది. దీన్ని దృష్టిలో పెట్టుకునే... బాధితుడి జీవితాన్ని కేవలం కొద్దికాలం పొడిగించడానికి బదులుగా... క్యాన్సర్‌ను జయించాక కూడా అతడు ఇంచుమించు ‘మునపటి జీవననాణ్యత’నే అనుభవించేలా చేయడమే మంచి చికిత్స లక్ష్యం. ఇలా జరిగేలా ఇటీవలి చికిత్స ప్రక్రియలను మెరుగుపరస్తున్నారు. దీన్ని బట్టి... క్యాన్సర్‌ను జయించడం లేదా అధిగమించడమంటే (ఇంగ్లిష్‌లో చెప్పాలంటే క్యాన్సర్ సర్వైవర్‌షిప్ అంటే) ‘‘క్యాన్సర్‌ను కనుగొన్ననాటి నుంచి అతడి జీవితపర్యంతమూ... బాధితుడికి మునపటి జీవితాన్నీ, ఒకప్పటి సంపూర్ణ ఆరోగ్యాన్నీ ఇచ్చేలా చేయడమే’’ క్యాన్సర్ వైద్యమంటూ ఈ చికిత్సను పునర్నిర్వచించారు. అలా జరిగే క్రమంలో రోగి ఏయే దశలు దాటాల్సి వస్తుందో తెలుసుకోవడం అవసరం. క్యాన్సర్ అంటే... అప్పట్లో తొలినాళ్లలో కేవలం 20 శాతం మంది మాత్రమే దాన్ని జయించేవారు. 80 శాతం మంది దాని బారినపడేవారు. కానీ వైద్యవిజ్ఞాన పురోగతితో అత్యాధునిక పరిశోధనల వల్ల ఇవాళ 85శాతం మంది దాన్ని పూర్తిగా జయిస్తున్నారు. కేవలం 15 శాతం మంది మాత్రమే దాని నుంచి తప్పించుకోలేకపోతున్నారు. అంటే... క్యాన్సర్ చికిత్స విషయానికి వస్తే... గతం తాలూకు సన్నటి నల్లమబ్బుల వెండి అంచు స్థానంలో... ఇప్పుడు చాలావరకు కాంతిమంతమైన వెలుగురేకలు వ్యాపించాయి. కానీ ఇంకా అక్కడా ఇక్కడా ఇంకా కొన్ని కారుమేఘాలు కప్పే ఉన్నాయి. ‘‘ముందే కనుగొంటే క్యాన్సర్ పూర్తిగా తగ్గుతుంద’’ని భరోసా ఇవ్వడం అందరూ చెప్పేదే. కానీ క్యాన్సర్ సోకాక ప్రతి దశలోనూ రోగి ఆవేదన, మనోభావాల గురించి ఇప్పటివరకు ఎవరూ పెద్దగా ఎవరూ చర్చించడంలేదు. చికిత్స సమయంలో బాధితులు క్యాన్సర్‌ను జయించే క్రమంలో కొన్ని మైలురాళ్లు దాటాల్సి వస్తుంటుంది. ఆ దశలెలా ఉంటాయి, మాజీ రోగుల గత అనుభవాలతో ప్రస్తుత బాధితులు ఆ వేదనను ఎలా అధిగమించవచ్చో, క్యాన్సర్నెలా జయించవచ్చో తెలిపే కథనమిది. క్యాన్సర్‌తో పోరాటం ఒకింత గమ్మత్తయినది. ఒక్కోసారి పూర్తిగా తగ్గుతుంది. కానీ గత కాలపు శిథిలాల గుర్తుల్లా కొంత వేదననూ మిగుల్చుతుంది. దీన్ని ఎలా చెప్పవచ్చంటే... ‘గాయం మానింది... గాటు మిగిలింది’ లాంటి అనుభవంతో మిగిలిపోయిన మచ్చ కనిపిస్తూ మనసును సలుపుతూ ఉంటుంది. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! క్యాన్సర్‌ను జయించే క్రమంలో దశలివి... క్యాన్సర్‌ను పూర్తిగా జయించి, మునపటి మంచి జీవితాన్ని పొందే క్రమంలో ఈ కింది నాలుగు దశలను బాధితుడు దాటాల్సివస్తుంది. ►క్యాన్సర్‌ను కనుగొనగానే (డయాగ్నోజ్ కాగానే) బాధితుడికి కలిగే షాక్ తొలిదశ. ఇందులో... క్యాన్సర్ అన్న మాట వినగానే ఎంతవారికైనా ఊహించని దెబ్బ తగిలినట్లవుతుంది. ►చికిత్సకూ... వ్యాధి నయమవడానికి మధ్యకాలపు సంధిదశ (ట్రాన్సిషనల్ సర్వైవర్‌షిప్): ఈ దశలో బాధితుడు జబ్బు నయమయ్యే దిశగా పురోగమిస్తున్నప్పటికీ ఎంతో కొంత ఉద్విగ్నతతో (యాంక్షియస్‌గా), వ్యాకులతతో, కుంగుబాటుకు లోనై (డిప్రెస్డ్గా) ఉంటాడు. ఈ దశలో వారినో సందేహం వేధిస్తుంటుంది. ఒకవేళ తగ్గినట్టే తగ్గినా ఇది మళ్లీ తిరగబెడుతుందా అన్న సంశయంలో ఉంటారు. ►జబ్బును అధిగమించాక దొరికిన జీవితం : (దీన్ని ఎక్స్టెండెడ్ సర్వైవర్షిప్గా చెప్పవచ్చు) మూడు రకాలుగా ఉంటుంది. అది (1) క్యాన్సర్ తగ్గిన దశ; (2)క్యాన్సర్ అంటూ ఉండదుగానీ... దానికోసం నిత్యం నిర్వహణ కార్యకలాపాలు (మెయింటెనెన్స్) ఉండాలి. ఆ మెయింటెనెన్స్ ఉన్నంతసేపూ క్యాన్సర్‌రహిత స్థితి ఉంటుంది. (3) క్యాన్సర్ ఉంటుంది గానీ... చివరి వరకూ కాస్త సాధారణ జీవితమే కొనసాగుతుంటుంది. ►క్యాన్సర్‌నుంచి సంపూర్ణ, శాశ్వత విముక్తి (పర్మనెంట్ సర్వైవర్‌షిప్): ఈ దశలోనూ మళ్లీ మూడు చిన్న చిన్న దశలుంటాయి. మొదటిది... క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోతుంది. దాని తాలూకు ఎలాంటి లక్షణాలూ లేకుండా మటుమాయమవుతుంది. రెండోది... క్యాన్సర్ పూర్తిగా తగ్గుతుంది. కానీ ఎవో కొన్ని అంశాలు మాత్రం దీర్ఘకాలం బాధిస్తుంటాయి. ఉదాహరణకు... కాస్తంత కుంగుబాటు (డిప్రెషన్) లేదా ఎప్పుడూ అలసటగా ఉండటం (ఫెటీగ్). మూడోది... అసలు క్యాన్సర్ తగ్గడం... కానీ దాని కారణంగా కొన్ని ఇతర అనుబంధ సమస్యలు బాధించడం. నాలుగోది... అసలు క్యాన్సర్ పూర్తిగా తగ్గుతుంది. కానీ అది ఇతర అవయవాలకు వ్యాపించి అనుబంధ క్యాన్సర్లకు కారణమవుతుంది. దాంతో మళ్లీ చికిత్స కొనసాగాల్సి వస్తుంటుంది. బాధితుడు ఈ నాలుగు దశలూ దాటక తప్పదని రోగులూ, వారి బంధువులూ, మిత్రులూ తెలుసుకోవాలి. అందుకు తగినట్టుగా అతడికి తగిన నైతిక మద్దతు అందిస్తే పూర్తిగా కోలుకోవడం తప్పక జరుగుతుంది. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. మరి రోగి, బంధువులు ఏం చేయాలి? ముందు చెప్పిన దశలన్నీ వచ్చే సమయంలో... అవి అనివార్యంగా రోగిపైనా, అతడి బంధుమిత్రులపైన కొంత ‘ఉద్వేగపూరితమైన’ భారాన్ని (ఎమోషనల్ బ్యాగేజ్‌ను) తప్పక మోపుతాయి. వాళ్లు ఆ బరువును ఎలా దించుకోవాలో తెలిపే సూచనలివి. ►వారు గతంలో అనుభవించని కొత్త కొత్త ఉద్విగ్నతలకు, భావనలకు లోనవుతుంటారు. అది ప్రతిరోజూ, ప్రతి గంటా, ప్రతి నిమిషమూ కావచ్చు. అది చికిత్స జరుగుతున్నప్పుడూ లేదా చికిత్స పూర్తయ్యాకా అనుభవంలోకి రావచ్చు. అతడికే కాదు. అతడి బంధుమిత్రులూ దీనికి గురికావచ్చు. ఇదంతా పూర్తిగా నార్మల్. ►అనేక భావోద్వేగాలు కమ్మేయవచ్చు. తెలియని ఆగ్రహాలు, భయాలు, ఆందోళనలు, ఒత్తిళ్లు, ఆవేదనలు, అపరాధభావనలు, ఒంటరిదనం... లాంటి ఎన్నో ఫీలింగ్స్ వచ్చేస్తుంటాయి. ఇవి బాధిస్తున్నాయనే దానికి బదులుగా... వాటి నుంచి బయటపడటం ఎలా అనే దాని గురించే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. ►అన్నిటికంటే ప్రధానమైనది ఏమిటంటే... బాధితుడు తనలోని భావాలూ, అనుభూతులూ, ఆవేదనలను వ్యక్తపరచడం చాలా ముఖ్యం. అలా చేయడం వల్ల వాటినుంచి దూరం కావడం చాలా తేలిక. ఈ పనిని అతడు తనకు తానుగానూ చేయవచ్చు. లేదా కొన్నిసార్లు ఒకేలాంటి క్యాన్సర్‌తో అలాంటి చికిత్సనే తీసుకుంటున్నవారంతా ఒక గ్రూప్‌గా కూడా మంచి ఫలితం ఇస్తుంది. సాధ్యమైతే ఒక్కోసారి తాము అనుభూతిస్తున్న భావనలను మంచి శైలిలో రాయడం కూడా మేలైన ఫలితాలిస్తుంది. ఇలా బాధితుడు తన భావనల వ్యక్తీకరణకు ఎలాంటి మార్గమైనా ఎంచుకోవచ్చు, కాకపోతే వ్యక్తీకరించడమే ముఖ్యం. ►ఈ క్రమంలో బాధితుడి అత్యంత వేదనాభరితమైన దశల్లో... కలిగింది చిన్నపాటి ప్రయోజనమైనా అది కొండంత అండ అవుతుంది. ఒకేమాటలో చెప్పాలంటే... ‘‘చిన్నపాటి మేలే తనకు చిరునవ్వు తెచ్చిపెడుతుంది’’. ►క్యాన్సర్ బాధితులు చాలామంది చేసే పని... తాము చేయని తప్పుకు తమను నిందించుకుంటూ ఉంటారు. ‘‘మేం అప్పట్లో చేసిన ఆ పనివల్లనే ఈ పర్యవసానం. అదే పనిచేసినా... చేస్తున్నవారు హాయిగానే ఉన్నారు. మేమేం పాపం చేశామని మాకీ శిక్ష’’అంటూ బాధపడుతూ ఉంటారు. కానీ ఇప్పటికీ క్యాన్సర్ ఎందుకు వస్తుందో వైద్యవిజ్ఞానానికీ తెలియదు. ఇందులో బాధితుడి తప్పేమీ లేదు. అతడికా అపరాధభావన అవసరమే లేదు. తమ గతకాలపు పనులకు తమను తాము నిందించుకోవడం కంటే... అన్నీ మరచి హాయిగా, ఆనందంగా ఉండటానికి ప్రయత్నించడమే మంచి జీవననాణ్యతకు మెరుగైన మార్గం. - డాక్టర్ సురేష్ ఏవీఎస్, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! -
చెవి రింగులతో ర్యాష్ వస్తోందా?
కొందరికి చెవి రింగులు లేదా దుద్దుల కారణంగా చెవి ప్రాంతం ఎర్రబడటం, ర్యాష్ రావడం జరుగుతుండవచ్చు. సాధారణంగా చాలావరకు కృత్రిమ ఆభరణాలలో నికెల్ అనే లోహం ఉంటుంది. దీనివల్ల ర్యాషెస్ వస్తాయి. ఇలాంటివి ఆభరణాల కారణంగా కొందరిలో చెవి వద్ద కాస్తంత దురద, చెవి రంధ్రం వద్ద ఎర్రబారడం వంటి లక్షణాలూ కనిపిస్తుంటాయి. ఈ దశలో దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత అక్కడి గాయం రేగిపోయి, రక్తస్రావం కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ టు నికెల్’ అంటారు. ఈ సమస్య ఉన్నవారు ఈ కింది సూచనలు పాటించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇలాంటివారు నికెల్‌తో చేసిన కృత్రిమ ఆభరణాలు, రింగులు, దిద్దులు ధరించడం సరికాదు. వీరు మొమెటజోన్ ఉన్న ఫ్యూసిడిక్ యాసిడ్ లాంటి కాస్త తక్కువ పాళ్లు కార్టికోస్టెరాయిడ్ కలిసి ఉన్న యాంటీబయాటిక్ కాంబినేషన్‌తో లభించే క్రీములను గాయం ఉన్నచోట రోజుకు రెండు సార్లు చొప్పున కనీసం 10 రోజులు రాయండి. ఇలాంటి క్రీములను సాధారణంగా డర్మటాలజిస్ట్ ల సూచనలతో వాడటమే మంచిది. -
వైద్యమందక ఎవరూ మరణించకూడదు
సాక్షి, హైదరాబాద్: పాము కాటు, ఇతర అత్యవసర వైద్యసేవలు అవసరమైన సందర్భాల్లో దురదృష్టకర మరణాలను నివారించడా నికి గ్రామీణ ప్రాథమిక వైద్య కేంద్రా (పీహెచ్సీ)ల్లో అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు, యాంటీవినం ఇంజెక్షన్లు, మెడికల్ కిట్లతోపాటు శిక్షణ పొందిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారులను ఆదేశించా రు. ‘పేదలు, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజల కు గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సదుపాయాలను నిరాకరించకూడదు. అవసరమైనప్పుడు అత్యవసర వైద్యం పొందడానికి ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం అడ్డు రాకూడదు’ అని ఆమె పేర్కొన్నారు. ఓ నిరుపేద దళిత వృద్ధురాలి దుస్థితిని తెలు సుకుని చలించిన గవర్నర్ .. ఆమెను బుధవారం రాజ్‌భవన్‌కు ఆహ్వానించి మధ్యా హ్న భోజనంతో ఆతిథ్యం ఇ చ్చారు. రెండు, మూడు నెలలకు సరిపడా నిత్యావసర వ స్తువులు, రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. నిలువ నీడలేక... జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామా నికి చెందిన బండిపెల్లి రాజమ్మ(75) నిలువ నీడలేక వీధుల్లో చెట్ల కింద నివాసముంటోంది. దివ్యాంగ కొడుకు ఆమెపై ఆధారపడి ఉన్నాడు. సకాలంలో సరైన వైద్య సదుపాయం లభించక అనారోగ్యంతో ఆమె కోడలు, పాము కాటుకు గురై మనవరాలు మృతి చెందారు. మనవరాలికి సకాలంలో పాముకాటుకు విరుగుడుగా ఇవ్వాల్సిన యాంటీవీనం ఇంజెక్షన్‌ను చేయకపోవడంతో ఆమె మరణించింది. అనారోగ్యానికి గురైన రాజమ్మ అల్లుడు కూడా సరైన వైద్యం అందక మరణించాడు. ఈ విషయాలు తెలుసుకుని గవర్నర్ తీవ్రంగా చలించారు. నిరుపేద వృద్ధ మహిళ, ఆమెపై ఆధారపడిన వికలాంగ కొడుకు బాగోగులను చూడాలని జనగామ జిల్లా అధికారులతోపాటు స్థానిక ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులను గవర్నర్ ఆదేశించారు. గవర్నర్ చొరవతో రాజ్‌భవన్‌లో భోజనం చేస్తున్నానని రాజమ్మ ఆనందంతో కంటనీరుపెట్టింది. రాజమ్మ కోసం ఇంటిని నిర్మించడానికి రూ.1.60 లక్షల విరాళాలను సేకరించడంతోపాటు తన వ్యక్తిగత సహాయంగా రూ.80 వేలు అందించిన పాలకుర్తి ఎస్ఐ గండ్రతి సతీశ్ చొరవను గవర్నర్ కొనియాడారు. రాజమ్మకు అండగా నిలిచిన ఆ గ్రామ మాజీ సర్పంచ్ మణెమ్మను గవర్నర్ సత్కరించారు. డాక్టర్ బి.కృష్ణ, స్వచ్ఛంద కార్యకర్త మహేందర్ల కృషిని గవర్నర్ ప్రశంసించారు. వీరిద్దరూ వృద్ధ మహిళకు తోడుగా రాజ్ భవన్‌కు వచ్చారు. వృద్ధురాలికి ఆర్థిక సాయం అందించిన ఎస్ఐకి ఆ మొత్తాన్ని గవర్నర్ తమిళిసై తిరిగి ఇచ్చేయడం విశేషం. -
కేన్సర్ చికిత్సలో తలనొప్పి మాత్ర...
తలనొప్పితోపాటు మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలకు వాడే ఆస్ప్రిన్ కొన్ని రకాల కేన్సర్ల చికిత్సకూ ఉపయోగపడుతుందని అంటున్నారు. శాస్త్రవేత్తలు. ఇప్పటి జరిగిన దాదాపు 71 అధ్యయనాలను పరిశీలించి మరీ తాము ఈ అంచనాకు వచ్చామని ఇందులో భాగంగా ఆస్ప్రిన్ తీసుకునే 12 లక్షల మందిని, తీసుకోని నాలుగు లక్షల మందిలో ఎవరు ఎక్కువ కాలం జీవించాలో పరిశీలించామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త పీటల్ ఎల్వుడ్ తెలిపారు. కార్డిఫ్ యూనివర్శిటీకి చెందిన ఈ శాస్త్రవేత్త అంచనా ప్రకారం.. కేన్సర్ వ్యాధి సోకినప్పటికీ ఆస్ప్రిన్ తీసుకునే వారు దాదాపు 30 శాతం మంది ఎక్కువ కాలం జీవిస్తారు. అతి తక్కువ పరిమాణంలో ఆస్ప్రిన్ తీసుకోవడం గుండెజబ్బులను నివారిస్తుందని, గుండెపోటు, కేన్సర్ల నివారణకూ ఉపయోగపడుతుందని చాలాకాలంగా తెలుసు. అయితే కేన్సర్ విషయంలో ఇది అదనపు చికిత్సగానూ ఉపయోగపడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. పేవు, కడుపు, రొమ్ము, ప్రొస్టేట్ కేన్సర్ల విషయంలో జరిగిన పలు అధ్యయనాలు ఆస్ప్రిన్ ప్రయోజనాల గురించి తెలిపాయని చెప్పారు. మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా ఈ పరిశీలనలను ధ్రుపరచుకోవాల్సి ఉందని, ఆ తరువాతే ఆస్ప్రిన్‌ను కేన్సర్‌కు ఓ మందుగా వైద్యులు పరిగణించేందుకు అవకాశముందని వివరించారు. -
మంచిర్యాలలో రోగులకు చికిత్స చేస్తున్న చాయ్‌వాలా
-
ఆసుపత్రిలో మహిళ మృతి
జంగారెడ్డిగూడెం : ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతిచెందడంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె బంధువులు సోమవారం ఆందోళనకు దిగారు. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. కామవరపుకోట మండలం కొండగూడెం గ్రామానికి చెందిన అందుగుల సరోజిని తన కుమార్తె బేబిరాణి అనారోగ్యానికి గురికావడంతో స్థానిక నిర్మలా ఆసుపత్రికి ఆదివారం తీసుకువచ్చింది. బేబిరాణికి వైద్యులు చికిత్స చేశారు. ఇంతలో సరోజినికి విరేచనాలు అయ్యాయి. దీంతో అదే ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు వైద్యం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సరోజిని మృతిచెందింది. విషయం తెలుసుకున్న సరోజిని బంధువులు , గ్రామస్తులు ఆసుపత్రికి చేరుకున్నారు. సరోజిని మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వైద్యులు ఆందోళనకారులను శాంతింపచేసే యత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం సీఐ జి.శ్రీనివాసయాదవ్, ఎస్సై ఎం.కేశవరావు సిబ్బందితో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆందోళన విరమించి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.అయినా ఆందోళనకారులు శాంతించలేదు. దీంతో పోలీసులు వారిని చెల్లాచెదురుచేశారు. దీంతో ఆందోళనకారులు మృతదేహాన్ని స్వగ్రామం తీసుకువెళ్లి ఆందోళన చేపడుతామని ప్రకటించారు. ఆసుపత్రి వైద్యులు, పోలీసులు కుమ్మక్కయ్యారని విమర్శించారు. ఇదిలా ఉంటే సరోజిని భర్త మూడేళ్ల క్రితం మృతిచెందారు. సరోజినికి బేబిరాణి, పూర్ణ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నాలుగు నెలల క్రితం బేబిరాణికి వివాహమైంది. తండ్రి ఎప్పుడో చనిపోగా, తల్లి కూడా మృతి చెందడంతో ఆడపిల్లలు దిక్కులేని వారయ్యారని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. -
అపోలోకు మళ్లీ వచ్చిన లండన్ వైద్యుడు రిచర్డ్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వైద్య చికిత్సలు అందించేందుకు లండన్ వైద్యుడు రిచర్డ్, ఎయిమ్స్ వైద్యుడు గిల్నాని ఆదివారం మళ్లీ అపోలో ఆస్పత్రికి వచ్చారు. వీరిద్దరితోపాటు సింగపూర్ వైద్యులు జయలలితకు కొన్ని రకాల వైద్య చికిత్సలందించారు.ఆమె అనారోగ్య సమస్యతో అపోలో ఆసుపత్రిలో చేరి నెల రోజులు దాటింది. డాక్టర్ రిచర్డ్ నేతృత్వంలో ముగ్గురితో కూడిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్య బృందం పర్యవేక్షణలో గత వారం వరకు చికిత్సలు అందిస్తూ వచ్చారు. వీరికి సింగపూర్ నుంచి ఇద్దరు మహిళా ఫిజియోథెరపీ వైద్య నిపుణులు తోడయ్యారు. దీంతో జయలలిత ఆరోగ్యం మరింత కుదుటపడ్డట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో లండన్ వైద్యుడు, ఎయిమ్స్ బృందం గత మంగళవారం వెళ్లిపోయారు. సింగపూర్‌కు చెందిన ఇద్దరు మహిళా వైద్యు నిపుణులు జయలలితకు ఫిజియో సంబంధిత చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో డాక్టర్ రిచర్డ్ ఆదివారం లండన్ నుంచి మళ్లీ చెన్నైకు వచ్చారు. ఆయనతోపాటు ఎయిమ్స్ ఊపిరిత్తుల సంబంధిత డాక్టర్ గిల్నాని కూడా వచ్చారు. కాగా, జయలలితను కేరళ మాజీ సీఎం ఉమన్‌చాంది, సీనియర్ నటి లత పరామర్శించారు. ఉమన్‌చాంది మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు, ఆస్పత్రి వర్గాలతో జయలలిత ఆరోగ్యం గురించి విచారించినట్టు తెలిపారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలు కావాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. నటి లత మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురైతో మాట్లాడానని, జయలలిత ఆరోగ్యం మెరుగుపడ్డట్టు చెప్పారని పేర్కొన్నారు. ఇక, అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి మాట్లాడుతూ అమ్మ ఆరోగ్యం మరింతగా మెరుగుపడిందని, త్వరలో ఇంటికి చేరుకుంటారని అన్నారు. జయలలిత క్షేమాన్ని కాంక్షిస్తూ తమిళనాడువ్యాప్తంగా ఆదివారం కూడా అన్నాడీఎంకే వర్గాలు పూజలు చేశారు. ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీ డాక్టర్ సునీల్ నేతృత్వంలో చెన్నై కీల్పాకంలోని అనాథాశ్రమంలో ప్రత్యేక ప్రార్థన జరిగింది. ఈ సందర్భంగా అక్కడి పిల్లలకు అన్నదానం చేశారు. -
మానవత్వం మరచిన వైద్యులు
అనారోగ్యతో ఆస్పత్రికి వస్తే చికిత్స చేసేందుకు నిరాకరణ నెల్లూరు(క్రైమ్) : ఊపిరి ఆడటం లేదంటూ ఓ మహిళ వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లింది. తక్షణమే వైద్యసేవలందించాల్సిన అక్కడి వైద్యసిబ్బంది నిరాకరించారు. ప్రాణాలు పోతున్నాయని ప్రాధేయపడినా పట్టించుకోలేదు. ఈ పరిస్థితి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శనివారం జరిగింది. నెల్లూరు రూరల్ మండలం గుడిపల్లిపాడుకు చెందిన ఓ వివాహిత కొంతకాలం కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆమెకు ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు చేయించారు. ఆమెకు నయంకాని జబ్బని పరీక్షల్లో తేలింది. జబ్బును నయం చేసేందుకు మందులు ఇచ్చి వాటిని క్రమం తప్పకుండా వాడాలని సూచించారు. మందులను వాడుతున్నా.. జబ్బునయం కాలేదు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించసాగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంతో వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువస్తే వారు సరిగా వైద్యసేవలు అందించలేదు. దీంతో ఆమెను జొన్నవాడలోని కామక్షితాయి దేవాలయం వద్ద వదిలి పెట్టారు. శనివారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమె స్థానికుల సహాయంతో చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. అప్పటికే ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. తన పరిస్థితిని అక్కడున్న వైద్యులు, వైద్య సిబ్బందికి చెప్పలేక చెప్పి చికిత్స అందించాలని అభ్యర్థించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటం చూసి వైద్యం అందించేందుకు వారు నిరాకరించారు. తన దయనీయస్థితిని అటుగా వెళ్లేవారికి చెప్పి వైద్యం అందించేందుకు సహకరించాలని కన్నీటి అభ్యర్థించింది. కొందరు సహచర రోగులు ఆమె పరిస్థితిని అక్కడున్న వైద్యసిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా వారు స్పందించిన పాపన పోలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆస్పత్రి ఆవరణలోనే వైద్యంకోసం పడిగాపులు కాయసాగింది. తాజా ఘటన మరోసారి ప్రభుత్వ వైద్యసిబ్బందిలో మానవత్వం మచ్చుకైనా లేదన్న విషయాన్ని మరోసారి రుజువుచేస్తోందని పలువురు రోగుల బందువులు వాపోతున్నారు. -
సీఎన్ఆర్ ఆధ్వర్యంలో గుండె పరీక్ష శిబిరం
జడ్చర్ల టౌన్ : సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టార్ హస్పిటల్స్ సహకారంతో హృదయ ఫౌండేషన్ ఆదివారం బాదేపల్లి జెడ్పీ హైస్కూల్లో చిన్నపిల్లల ఉచిత గుండె పరీక్ష శిబిరం నిర్వహించారు. శిబిరంలో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌లు నితిన్‌కుమార్, సుమన్ 150మంది చిన్నపిల్లలకు గుండె పరీక్షలు నిర్వహించారు. వారిలో 13మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. శిబిరంలో హృదయ ఫౌండేషన్ మేనేజర్ ట్రస్టీ మేక యుగంధర్, ఫౌండర్ ట్రస్టీ పద్మశ్రీ గోపిచంద్, డాక్టర్ జయరాజ్, డీఎంఅండ్‌హెచ్‌ఓ నాగారం, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ మల్లికార్జునప్ప, పిల్లల వైద్య నిపుణులు రమేష్‌బాబు, రవి, రమేష్‌చారి, నరేందర్, రాఘవేందర్, ఎంపీపీ లక్ష్మీశంకర్, జెడ్పీటీసీ జయప్రద, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బి.శివకుమార్, డీఎస్పీ కృష్ణమూర్తి, ఎస్ఎస్ఓ చందునాయక్, పీఎసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, కోడ్గల్‌యాదయ్య, మహ్మద్‌యూసూఫ్, శ్రీకాంత్, శంకర్‌నాయక్, తోటారెడ్డి, ఉమాశంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇదో వైద్య విధ్వంసం!
సర్కారీ ఆసుపత్రుల్లో చికిత్సకు దిక్కులేదు.. ప్రైవేటుకెళితే జేబులు గుల్ల ♦ గతేడాది వైద్యానికి భారతీయులు చేసిన ఖర్చు రూ. 6,00,000 కోట్లు ♦ వచ్చే ఏడాది ఖర్చు... 'మెకిన్సే' అంచనా రూ. 10,00,000కోట్లు ♦ ఏటా 30-40 శాతం పెరిగిపోతున్న వైద్య ఖర్చులు ♦ నాలుగేళ్లలో దేశ బడ్జెట్‌నూ దాటొచ్చని అంచనాలు ♦ ఖర్చులతో 30% మంది పేదరికంలోకి.. ♦ ఈ దుస్థితిపై 'సాక్షి' సమర శంఖం సాక్షి ప్రత్యేక బృందం: పాతికేళ్లకే గుండె బరువెక్కుతోంది.. పొత్తిళ్ల నుంచే మధుమేహం ఆక్రమిస్తోంది.. ముప్పై దాటకున్నా రక్తపోటు భయపెడుతోంది.. అరుదైన వ్యాధులు రొటీన్ రంగు పులుముకుంటున్నాయి. కొత్తకొత్త పేర్లతో జబ్బులు పుట్టుకొస్తున్నాయి. సీజనల్ వ్యాధులకైతే అడ్డూఅదుపూ లేదు. ఇవన్నీ కలిస్తే.. భారతీయులు వైద్యానికి పెడుతున్న ఖర్చు ఆకాశాన్నంటుతోంది. ఈ ఖర్చు గతేడాది రూ.6 లక్షల కోట్లు! వచ్చే ఏడాది రూ.10 లక్షల కోట్ల పైమాటే!! మరో నాలుగేళ్లు ఆగితే.. ఏకంగా దేశ బడ్జెట్‌తో పోటీపడుతుందని చెబుతోంది మెకిన్సే సంస్థ. ఎందుకంటే.. ఇప్పుడు రూ.17 లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్ ఏటా పెరుగుతున్నది లక్ష కోట్ల లోపే. కానీ భారతీయుల వైద్య ఖర్చులు ఏటా 30-40 శాతం వృద్ధితో భారీ అంగలేసుకుంటూ ఆర్థిక వ్యవస్థనే సవాల్ చేసే స్థాయికి చేరిపోతున్నాయి. జీతభత్యాలు, మౌలిక సదుపాయాలతో సహా ప్రజల క్షేమం కోసం ప్రభుత్వం ఏడాదిలో చేస్తున్న ఖర్చును.. ప్రజలు తమ ఆరోగ్యం కోసం సొంతంగా వెచ్చిస్తున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.దురదృష్టమేంటంటే ఇలా వైద్యానికి ఖర్చు చేస్తున్న వారిలో ఆరోగ్య బీమా భద్రత ఉన్నది కేవలం 5 శాతం మందికే. మిగిలిన వారంతా అప్పులు చేసి, తాకట్టులు పెట్టి తమను, తమ వాళ్లను కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నవారే. అలాంటి వారి జీవితాలను వైద్యం ఎంతలా విధ్వంసం చేస్తోందో తెలుసా...? ప్రభుత్వాసుపత్రికి వెళితే!: నిరుపేదకు సుస్తీ చేసి సర్కారీ ఆసుపత్రికెళితే డాక్టరుండటం కష్టం. ఒకవేళ ఉంటే ఆయన రాసిన చీటీలోని పరీక్షలు చేయడానికి అక్కడి సౌకర్యాలుండవు. పోనీ బయటికెళ్లి చేయించుకుందామంటే తన ఆర్థిక పరిస్థితి ససేమిరా అంటుంది. చేసేదేమీ లేక ఇంటికెళ్లి ముసుగు తన్నటం.. అయినా బాగులేకుంటే మరోసారి అదే దవాఖానాకు పోవటం. ఎందుకంటే తను చేయగలిగింది అదే!! ఇక సదరు ఆసుపత్రిలో అర్థం చేసుకునే డాక్టరు గనక ఉంటే నాలుగు గోళీలు రాస్తాడు. అవి వేసుకున్నాక దైవాధీనం. రోజులు బాగుంటే బతికిపోతాడు. లేకుంటే బతుకు పోతుంది. ఈ పరిస్థితి ఎందుకు దాపురిస్తోందంటే... నిబద్ధత నీడను కూడా సహించని ప్రభుత్వ వైద్యం వల్ల. ఎన్నాళ్లయినా ఈ పరిస్థితి మారదెందుకు? నిరుపేదకు సుస్తీ చేస్తే చావాల్సిందేనా...? మధ్య తరగతి సంగతో..? నిరుపేదలూ, నిరుద్యోగులే కాదు. కాస్తోకూస్తో స్థితిమంతులు, ముందు చూపుతో వైద్య బీమా చేయించుకున్నవారి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. కారణం.. నిజాయితీ కరువైన ప్రైవేటు వైద్యం!! కిందపడి చేయి బెణికిందని వెళితే... తక్షణం ప్లేట్లు వేసి సర్జరీ చేయాల్సిందేనంటాడొక పేరున్న ఎముకల డాక్టరు. కంగారుపడి మరో మంచి వైద్యుడి దగ్గరికెళితే... సర్జరీ కాదు కదా కనీసం కట్టు కూడా లేకుండా తగ్గించారాయన. ఇక మరో ఆసుపత్రయితే రోగి చనిపోయినా ఆ విషయం బంధువులకు చెప్పకుండా నాలుగు సర్జరీలు చేసేసింది. కడుపులో కాస్త మంటగా ఉందని వెళ్తే ఎమ్మారైతో సహా అన్ని స్కానింగ్లూ చేయించేస్తున్నాడు మరో వైద్య శిఖామణి. ఇవన్నీ పచ్చి నిజాలు. పరీక్షల నుంచి సర్జరీల వరకూ అడుగడుగునా దండుకోవటం, పిండుకోవటమే పరమార్థంగా మారిన కార్పొరేట్ వైద్యానికి లాభాల లెక్కలు తప్ప మనుషుల వేదన పట్టే పరిస్థితి లేదు. 'మీరు అడిగినంత డబ్బిస్తాం. మాకు అవసరమైన వైద్యం మాత్రమే చేయండి మొర్రో' అని అరిచినా వినిపించుకునే వైద్య నారాయణులు లేరక్కడ. ఎందుకంటే కన్సల్టేషన్, పరీక్షల నుంచి సర్జరీల వరకూ యాజమాన్యాలు పెట్టే టార్గెట్లే వారికి ముఖ్యం. పాడెక్కిన సంప్రదాయ వైద్యం ఎలాంటి ఊళ్లో ఉండాలో చెబుతూ సుమతీ శతకకారుడు 'అప్పిచ్చువాడు..'తర్వాత వైద్యుడికే ప్రాధాన్యం ఇచ్చాడు! ఆయన చెప్పినట్టుగానే పూర్వపు రోజుల్లో ప్రతి ఊళ్లో సంప్రదాయ వైద్యుడు ఉండేవాడు. ధన్వంతరి వేల ఏళ్ల కిందటే ఈ గడ్డపై మూలి కలతో ఔషధాలను తయారు చేశా డు. అష్ట విధ చికిత్సలతో ఆయుర్వేదాన్ని అందించాడు. ఆ పరంపర ఒక తరం నుంచి మరో తరానికి అందేది. ఊరికి ఏ ఆపద వచ్చినా మందు ఇచ్చి బాగుచేసే సంప్రదాయ వైద్యులుండేవారు. తృణమో పణమో.. ఏమీ లేకుంటే ఓ నమస్కారం మాత్రమే స్వీకరించి చిరునవ్వుతో జనం యోగక్షేమాలను వారు జాగ్రత్తగా చూసుకునేవారు. ఆప్యాయంగా పలకరించి సగం జబ్బు తగ్గించేవారు. గాయాలకు గడ్డి చేమంతి, ఉత్తరేణి వంటివి వేసి కట్టుకడితే అవి ఇట్టే మాయమయ్యేవి. జ్వరం, దగ్గు, జలుబు, అజీ ర్ణం.. ఇలా ఏ జబ్బు చేసినా మాత్రలిచ్చి మాన్పేసేవారు. పెద్ద జబ్బులు వస్తే తప్ప ఊరు దాటి పట్నం వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. మరి ఇప్పుడు..? రోజులు మారాయి. పాలకులు సంప్రదాయ వైద్యాన్ని పాడెక్కించారు. ఊళ్లల్లో నాటి వైద్యులు మచ్చుకైనా కన్పించడం లేదు. ఫలితంగా ప్రాణాంతక వ్యాధుల సంగతి అలా ఉంచితే ఏ చిన్న జబ్బు చేసినా ఊళ్లో పరిష్కారం దొరకడం లేదు! తరతరాల నుంచి వస్తున్న వైద్య విధానాలకు తిలోదకాలు ఇచ్చిన ప్రభుత్వాలు.. అంతకు మెరుగైన వైద్యాన్ని అందిస్తే మంచిదే. కానీ పల్లెల్లో సర్కారీ వైద్యం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యాధుల సీజన్ వచ్చిందంటే జనం పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకునే నాథుడు ఉండడు. ఆదుకునే ప్రభుత్వాసుపత్రి ఉండదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పడకేశాయి. ఎక్కడ చూసినా వసతుల లేమి.. మందుల కరువు.. వైద్యుల కొరత. ఫలితంగా ఏ జబ్బు చేసినా పట్నం పోవాల్సిందే. కార్పొరేట్ ఆసుపత్రుల తలుపు తట్టాల్సిందే. ఇక అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. కాసుల వేట తప్ప రోగానికి మందు దొరకదు. దొరికినా సామాన్యుడికి అందని దుస్థితి. ఇలా సంప్రదాయ ైవె ద్యానికి చరమగీతం పాడిన ప్రభుత్వాలు.. ప్రజల ఆరోగ్యాన్ని 'కార్పొరేట్' కు తాకట్టు పెట్టాయి. కదులుదాం.. కదిలిద్దాం.. నిత్యావసరాల్లో భాగమైన వైద్యం ఇప్పుడు... నిబద్ధత, నిజాయితీ లోపించి సంక్షోభంలో కూరుకుపోయింది. సంక్షోభాన్ని సైతం దాటిపోతోంది. ఖరీదైన వైద్యం చేయించుకోలేక 30 శాతం మంది మధ్యతరగతి నుంచి పేదరికంలోకి జారిపోతున్నారంటే ఆ తప్పు ఎవరిది? అందుబాటు ధరలో... అవసరమైన చికిత్స చేయని ప్రైవేటు వైద్యానిది కాదా? ఉచితంగా వైద్యసదుపాయం కల్పించ లేని సర్కారీ ఆసుపత్రులది కాదా? అవును! దీనికిపుడు చికిత్స కావాలి. ప్రజల వైద్య ఖర్చులు బడ్జెట్‌కు రెండింతలు కాకముందే ఈ చికిత్స ఎక్కడో ఒకచోట మొదలవ్వాలి. అందుకే ‘సాక్షి’ ఈ బాధ్యతను భుజాన వేసుకుంది. అందులో భాగంగానే వైద్యరంగం తీరుతెన్నులను విశ్లేషిస్తూ.. జరిగిన, జరుగుతున్న సంఘటనలను తెలియజేస్తూ వరుస కథనాలను అందించనుంది. 'సాక్షి' చేస్తున్న ఈ ప్రయత్నానికి మీరూ కలసి రావాలి. సర్కారీ, కార్పొరేట్ వైద్యంలో మీకెదురైన చేదు అనుభవాలను.. మీరు చూసిన మంచి డాక్టర్ల గురించి 'సాక్షి'తో పంచుకోండి. వైద్య దుస్థితిని మార్చడానికి సూచనలు కూడా తెలియజేయండి. వీటిని ప్రచురించటం ద్వారా నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశమిద్దాం. మీ అనుభవాలు, ఆలోచనలను ఈమెయిల్స్, లేఖల ద్వారా ‘'సాక్షి'కి పంపేటపుడు... మీ పేరు, మీకు చికిత్స చేసిన ఆసుపత్రి లేదా డాక్టరు పూర్తి పేరును, మొబైల్ నంబర్లను తప్పనిసరిగా తెలియజేయండి. మీ పేరు రహస్యంగా ఉంచాలని భావిస్తే అది కూడా రాయండి. లేఖలు పంపాల్సిన చిరునామా: ఎడిటర్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 sakshihealth15@gmail.com -
చికిత్సకు నిరాకరించిన స్వైన్‌ఫ్లూ బాధితురాలు
మహబూబ్‌నగర్: గద్వాల్ పట్టణంలో ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. సదురు బాధితురాలిని చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లమనగా ఆమె నిరాకరించి గద్వాల్‌లోనే ఉంటోంది. అధికారులు శనివారం బాధితురాలి ఇంటికి వెళ్లి చూడగా ఆమె భర్త, కుమారుడు కూడా జ్వరంతో బాధపడుతు కనిపించారు. వారికి కూడా స్వైన్‌ఫ్లూ సోకి ఉండవచ్చేమోనని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. (గద్వాల్)