చిన్నారికి పరీక్ష చేస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి
సీఎన్‌ఆర్ ఆధ్వర్యంలో గుండె పరీక్ష శిబిరం
Published Sun, Jul 24 2016 6:34 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
జడ్చర్ల టౌన్ : సీఎన్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టార్ హస్పిటల్స్ సహకారంతో హృదయ ఫౌండేషన్ ఆదివారం బాదేపల్లి జెడ్పీ హైస్కూల్‌లో చిన్నపిల్లల ఉచిత గుండె పరీక్ష శిబిరం నిర్వహించారు. శిబిరంలో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌లు నితిన్‌కుమార్, సుమన్ 150మంది చిన్నపిల్లలకు గుండె పరీక్షలు నిర్వహించారు. వారిలో 13మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. శిబిరంలో హృదయ ఫౌండేషన్ మేనేజర్ ట్రస్టీ మేక యుగంధర్, ఫౌండర్ ట్రస్టీ పద్మశ్రీ గోపిచంద్, డాక్టర్ జయరాజ్, డీఎంఅండ్‌హెచ్‌ఓ నాగారం, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ మల్లికార్జునప్ప, పిల్లల వైద్య నిపుణులు రమేష్‌బాబు, రవి, రమేష్‌చారి, నరేందర్, రాఘవేందర్, ఎంపీపీ లక్ష్మీశంకర్, జెడ్పీటీసీ జయప్రద, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బి.శివకుమార్, డీఎస్పీ కృష్ణమూర్తి, ఎస్‌ఎస్‌ఓ చందునాయక్, పీఎసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, కోడ్గల్‌యాదయ్య, మహ్మద్‌యూసూఫ్, శ్రీకాంత్, శంకర్‌నాయక్, తోటారెడ్డి, ఉమాశంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement