camp
-
Deomali Hills: సినీ దర్శకుడు రాజమౌళి కారణంగా ఫేమస్ అయిన పర్యాటక ప్రాంతం ఇదే..!
ప్రపంచ పర్యాటక రంగంలో పేరు తెచ్చుకుంటున్న దేవమాలి పర్వత పరిరక్షణకు ప్రభుత్వం కఠిన ఆంక్షలు పెడుతోంది. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన నూతన చిత్రానికి సంబంధించి ఇక్కడ షూటింగ్ చేయడంతో ఈ ప్రాంతం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆయన షూటింగ్ ముగించుకుని వెళ్లిపోతూ ఈ పర్వతంపై పర్యాటకులు చెత్త వదిలి వెళ్లడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై అనేక విజ్ఞప్తులు వచ్చాయి. అప్పటి నుంచి ప్రభుత్వం ఈ పర్వత పరిరక్షణ పై తీవ్రంగా దృష్టి సారించింది. రాత్రిపూట రాకపోకలు నిషేధం దేవమాలి పర్వతం మీద సూర్యోదయం, సూర్యాస్తమయం చూడడానికి పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. అందుకే గుడారాలు వేసి రాత్రి బస చేస్తుంటారు. దీంతో రాత్రి ఇక్కడ పర్యవేక్షణ ఉండేది కాదు. ఈ క్యాంప్ ఫైర్ల వల్ల ఔషధ మొక్కలు కాలిపోయేవి. విందు వినోదాల కారణంగా చెత్త పేరుకుపోయేది. అందుకే రాత్రి 8 నుంచి ఉదయం 5 వరకు దేవమాలిపై పర్యాటకులు ఉండకూడదని నిషేధం విధించారు. 2023 నాటి భారతీయ నాగరిక సురక్ష సంహిత 163 ప్రకారం,1986 నాటి పర్యవరణ పరిరక్షణ చట్టం 15 ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేశారు. వ్యర్థాలపై కఠిన చర్యలు దేవమాలిపైకి వచ్చే పర్యాటకులు తాము తెచ్చే వ్యర్థాలు తామే తిరిగి తీసుకొని వెళ్లేటట్లు సంచులు తెచ్చుకోవాలని రాజమౌళి సూచించారు. దాన్నే ప్రభుత్వం కఠిన నిబంధనగా మార్చింది. ఇకపై పర్యాటకులు అక్కడ వ్యర్థాలు వదల రాదని, తిరిగి తీసుకొని వెళ్లడానికి సంచులు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు పైకి తీసుకురావద్దని హెచ్చరించింది. అధికారుల పర్యటనలు కొరాపుట్ కలెక్టర్ వీ.కీర్తి వాసన్ ఆదివారం దేవమాలి పర్వతంపై ఉన్నత స్థాయి అధికారులతో పర్యటించారు. రక్షణ చర్యల పై ఎస్పీ రోహిత్ వర్మ కూడా వెళ్లారు. ఇదే సమయంలో సీఎల్పీ నాయకుడు రామచంద్ర ఖడం కూడా అదే సమయంలో తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా అక్కడకే వెళ్లారు. వీరంతా అనుకోకుండా కలుసుకోవడంతో అక్కడే సమావేశమయ్యారు. దేవమాలి పై భారీ ఎత్తున పర్యాటక సదుపాయాలు కల్పించడానికి కలెక్టర్ సమీక్ష చేశారు. (చదవండి: ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట రామాలయం..) -
కుంకీలతో కట్టడి సాధ్యమేనా
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య(elephant problem) దశాబ్దాలుగా ఉంది. అడవిదాటి వచ్చి ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. మరోవైపు ఏనుగుల దాడుల్లో(elephant attack) జనాలు మృత్యువాత పడుతున్నారు. ఏనుగులు సైతం వివిధ కారణాలతో మరణిస్తున్నాయి. అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటివరకు అటవీశాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, కందకాల తవ్వకం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.కర్ణాటక టైప్ పేరిట గతంలో చేపట్టిన హ్యాంగింగ్ సోలార్ సిస్టం సైతం ప్రయోగాత్మకంగానే ముగిసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని ముసలిమొడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్(Kunki Elephant) ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ఇదే తరహాలో రామకుప్పం మండలంలో ననియాల క్యాంపును గతంలో ఏర్పాటు చేసినా ఈ ఏనుగులు కనీసం అడవిలోని ఓ ఏనుగును సైతం అదుపు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడికి రానున్న కుంకీ ఏనుగులు అడవి ఏనుగులను కట్టడి చేస్తాయా? అనే అనుమానం ఇక్కడి రైతుల్లో నెలకొంది. కౌండిన్యలో ఏనుగుల పరిస్థితి ఇదీ పలమనేరు, కుప్పం పరిధిలోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ మేర మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని అడవులకు ఆనుకొని ఉంది. కౌండిన్య అభయారణ్యంలో స్థిరంగా ఉన్న గుంపులు, వలస వచ్చిన గుంపులు కలిపి మొత్తం 120 వరకు ఏనుగులు సంచరిస్తున్నాయి. 1984లో ప్రభుత్వం ముసలిమొడుగు వద్ద కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీని ఏర్పాటు చేసింది. ఇందులోకి తమిళనాడులోని మోర్థన ఫారెస్ట్నుంచి, ననియాల, కర్ణాటకలోని బన్నేరుగట్ట, బంగారుపేట, కేజీఎఫ్, తమిళనాడులోని క్రిష్ణగిరి, హొసూరు, కావేరిపట్నం తదితర ప్రాంతాల నుంచి ఏనుగులు వస్తున్నాయి. ఏనుగులు అడవిని దాటి బయటకు రాకుండా ఉండేందుకు గతంలో రూ. 2.61 కోట్లతో బంగారుపాళ్యం మండలం నుంచి కుప్పం వరకు 142 కి.మీ మేర సోలార్‌ఫెన్సింగ్‌ను 40 కి.మీ మేర ట్రెంచ్‌లను ఏర్పాటుచేశారు. అయితే సోలార్‌ఫెన్సింగ్‌ను ఏనుగులు తొక్కి అడవిలోంచి బయటకువస్తున్నాయి. ఫెన్సింగ్ కోసం ఏర్పాటు చేసిన కమ్మీలు నాశిరకంగా ఉండటంతో వీటిని సులభంగా విరిచేస్తున్నాయి. ఇక ఎలిఫెంట్ ట్రెంచ్‌లను సైతం ఏనుగులు మట్టిని తోసి,రాళ్లున్న చోట సులభంగా అడవిని దాటి బయటికొస్తున్నాయి. ఈరెండూ విఫలమవడంతో గతేడాది కర్ణాటక మోడల్ పేరిట హ్యాంగింగ్ సోలార్‌ను పదికిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా చేపట్టి ఆపై దీన్నీ వదిలేశారు.కుంకీల కోసం కర్ణాటకతో ఎంవోయూ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కర్ణాటకతో ఎంవోయూ చేసుకొని అక్కడ శిక్షణపొందిన నాలుగు కుంకీ ఏనుగులను ఇక్కడికి తెప్పిస్తోంది. ఇందుకోసం రేంజి పరిధిలోని 20 మంది ఎలిఫెంట్ ట్రాకర్లను దుభారే ఎలిఫెంట్ క్యాంపునకు పంపి నెలరోజుల పాటు శిక్షణ ఇప్పించారు. దీనికోసం ముసలిమొడుగు వద్ద రూ.12లక్షల వ్యయంతో కుంకీ ఎలిఫెంట్ క్యాంపును 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఏనుగుల కోసం కర్రలకంచెతో విడిది, మేతను సిద్దం చేసుకునే గదులు, చిన్నపాటి చెరువు, శిక్షణాస్థలం. క్రాల్స్( మదపుటేనుగులను మచ్చిక చేసుకొనే చెక్క గది) పనులు జరుగుతున్నాయి.మరో రూ.27 లక్షలతో హ్యాంగింగ్ సోలార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇలా ఉండగా గతంతో రామకుప్పం వద్ద నినియాలో ఏర్పాటు చేసిన ఇలాంటి క్యాంపులో రెండు ఏనుగులున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు వెళుతున్నారేగానీ ఇవి అడవిలోని ఏనుగును కట్టడి చేసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. అదే రీతిలో ఇక్కడ కుంకీలతో సమస్య తెగుతుందా? లేదా అనే సందేహం మాత్రం ఇక్కడి రైతులకు పట్టుకుంది. అసలే ఇక్కడున్న మదపుటేనుగులు (రౌడీ ఏనుగులు,పుష్పా) కుంకీ ఏనుగులపై దాడులు చేసే అవకాశం లేకపోలేదు.గుబులు రేపుతున్న ఒంటరి ఏనుగు.... పలమనేరు కౌండిన్య అభయారణ్యంలో వందకు పైగా ఏనుగులు సంచరిస్తున్నా కేవలం ఓ ఒంటరి ఏనుగు రెండునెలలుగా జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేవలం వ్యవసాయపొలాల వద్ద ఉన్న ఇళ్ళను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేస్తోంది. ఆ ఇళ్ళలోని ధాన్యం, రాగులు హాయిగా ఆరగించి వెళుతోంది. దీంతోపాటు ఆఇళ్ల వద్ద ఉన్న మనుషులపై దాడులు చేస్తోంది.వారు దొరక్కపోతే ఆ ఇళ్ల వద్ద కట్టేసి ఉన్న ఆవులు, దూడలను చంపుతోంది. దీంతో అటవీ సమీప ప్రాంతాల్లో పొలాలవద్ద కాపురాలుంటున్న వారు ఈ ఏనుగు భారినుంచి ఎలా తప్పించుకోవాలో అర్థంగాక హడలిపోతున్నారు. కాగా గత పదేళ్లలో కరెంట్ షాక్‌లు, నీటిదొనల్లో పడి, మదపుటేనుగుల రభస కారణంగా 16 ఏనుగులు చనిపోయాయి. ఏనుగుల కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14మంది మృతి చెందగా 26 మందివరకు గాయపడ్డారు. అడవిని విడిచి ఎందుకొస్తున్నాయంటే... కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులకు అవరసమైన ఆహారం, నీటిలభ్యత తక్కువ. ఓ ఏనుగుకు రోజుకి 900లీటర్ల నీరు, 10 హెక్టార్లలో ఫీడింగ్ అవసరం. ఆహారం తిన్నాక ఇవి రోజుకు 5మైళ్లదాకా సంచరిస్తుంటాయి. అడవిలోని దట్టమైన మోర్ధనా అభయారణ్యంలోకి ఏనుగులు వెళితే తమిళనాడు అటవీశాఖ తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి వీటిని మళ్లీ కౌండిన్య వైపుకు మళ్లిస్తోంది. దీంతో ఏనుగులు దట్టమైన అడవిలో ఉండటంలేదు. పొలాల్లోని చెరుకు, కొబ్బరి, మామిడి లాంటి ఆహారం కోసం ఒక్కసారి వచ్చే ఏనుగు తరచూ అదే మార్గంలో వస్తూనే ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.క్యాంప్ పనులు సాగుతున్నాయి పలమనేరులో కుంకీ ఎలిఫెంట్ క్యాంపుకోసం ఇప్పటికే పనులు సాగుతున్నాయి. మైసూరు సమీపంలోని దుబరే నుంచి నాలుగు కుంకీ ఏనుగులు త్వరలో రానున్నాయి. ఎలిఫెంట్ ట్రాకర్లకు ఇప్పటికే కుంకీ ట్రైనింగ్ ఇప్పించాం. ముఖ్యంగా మదపుటేనుగులు దాడులు చేయకుండా వాటికి శిక్షణనిస్తాం. దీంతో ఏనుగులను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. – భరణి, డీఎఫ్‌వో, చిత్తూరుకుంకీలతోనైనా సమస్య తీరితే చాలు.. గతంలో ఏనుగులను కట్టడి చేసేందుకు చేసిన పనులన్నీ లాభం లేకుండా పోయాయి. ఇప్పుడు కుంకీ ఏనుగులంటున్నారు. వీటితోనైనా ఇక్కడ ఏనుగుల సమస్య పరిష్కారమైతే అదే పదివేలు. అయినా జనంపై దాడులు చేస్తూ యథేచ్ఛగా పంటపొలాలపై పడుతున్న మదపుటేనుగులను ఈ కుంకీ ఏనుగులు ఎంతవరకు అదుపు చేస్తాయనే విషయంపై అనుమానంగానే ఉంది. – ఉమాపతి, రైతుసంఘ నాయకులు, పలమనేరు -
సికింద్రాబాద్ బొల్లారంలో వేసవి శిబిరం
సికింద్రాబాద్ బొల్లారంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వేసవి శిబిరాన్ని ప్రారంభించారు సంఘం అధ్యక్షుడు పూస యోగేశ్వర్. విద్యార్థులందరికీ వేసవికాలం సెలవులు ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే.. వచ్చే విద్ఆయ సంవత్సరం వారికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుందన్నారు.వేసవి శిబిరంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవలే ఎన్నికైన కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. పిల్లలకు భరతనాట్యం, కర్ణాటక సంగీతం, సంస్కృత శ్లోకాలు, జానపద నృత్యకళల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఆయా రంగాల్లో అనుభవజ్ఞులను, గురువులను నియమించుకున్నారు.ఇవ్వాళ్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రియాంకను ఆహ్వనించగా.. వేసవి శిబిరాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సమ్మర్ క్యాంపులో పాల్గొనే విద్యార్థులను ఉద్దేశించి గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పూస యోగేశ్వరు మాట్లాడారు. క్రీడలు, వ్యాయామం, యోగను నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. సమ్మర్ క్యాంపులో నేర్చుకున్న అంశాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా శ్రద్ధ పెట్టాలన్నారు. -
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం
-
కీలక పరిణామం.. ఎన్సీపీలో మళ్లీ చీలిక..?
ముంబయి: మహారాష్ట్రలో రాజకీయాలు ఇటీవల కీలక మలుపులు తీసుకుంటున్నాయి. రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇటీవల రెండుగా చీలిన విషయం తెలిసిందే. కొంత మంది నేతలతో అజిత్ పవార్.. ఎన్సీపీని చీల్చి ఎన్సీయేతో కలిసి ఉపముఖ్యమంత్రి పదవి పొందారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఓ వర్గం కాగా.. శరద్ పవార్ నాయకుడిగా ఎన్సీపీ మరో వర్గంగా ఏర్పడ్డారు. అయితే.. తాజాగా శరద్ పవార్ అధినేతగా ఉన్న ఎన్సీపీలో జయంత్ పాటిల్ రూపంలో మళ్లీ తిరుగుబాటు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జయంత్ పాటిల్ తిరుగుబాటు చేయనున్నారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో జయంత్ పాటిల్ పార్టీ మారనున్నారని పుకార్లు ఎక్కువయ్యాయి. ఆదివారం ఉదయం జరిగిన భేటీలో ఒప్పందం కుదిరినట్లు సమాచారం. జయంత్ పాటిల్‌తో పాటు రాజేశ్ తోపే పేరు కూడా ఇందులో వినిపిస్తోంది. రాష్ట్రంలో సంగాలీ స్థానం నుంచి తనకు ఎంపీ టికెట్టు, తన కుమారునికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని జయంత్ పాటిల్ డిమాండ్ చేసినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే ఎన్డీయేలో కలుస్తారని రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో విజయం దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే పుణె జిల్లాల్లోని నాలుగు స్థానాలకు సంబంధించిన నాయకులతో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలోనే అమిత్ షాతో జయంత్ పాటిల్ కలిసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఊహాగానాలను జయంత్ పాటిల్ కొట్టిపారేశారు. తాను అమిత్ షాతో కలవలేదని స్పష్టం చేశారు. శరద్ పవార్‌కు విధేయుడిగానే ఉంటానని పేర్కొన్నారు. #WATCH | Maharashtra NCP (Sharad Pawar faction) President Jayant Patil on reports that he met Union Home Minister Amit Shah yesterday; says, "Who told you this? (that I met Amit Shah) You should ask those who are saying all this. Last evening I was there at the residence of… pic.twitter.com/CkJHnEFZIR — ANI (@ANI) August 6, 2023 ఇదీ చదవండి: దేశంలో 508 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్థాపన -
ఆస్కార్ విజేతలను కలిసిన ప్రధాని నరేంద్ర మోదీ
-
కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు
కౌలాలంపూర్: మలేసియా రాజధాని కౌలాలంపూర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. 50 మందికిపైగా ఆచూకీ గల్లంతైంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కౌలాలంపూర్‌కు సమీపంలోని సెలాంగోర్ రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. రోడ్డు పక్కన ఉన్న ఓ ఫామ్‌హౌజ్‌ను క్యాంప్ సౌకర్యాల కోసం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కార్మికులు, అధికారులు క్యాంపులో నిద్రపోతున్న సమయంలో కొండచరియలు విరిగిపడినట్లు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో మొత్తం 79 మంది క్యాంప్‌లో ఉండగా అందులో 23 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు మరణించారు. 51 మంది ఆచూకీ గల్లంతయ్యారు. క్యాంప్ వెనకాల ఉన్న కొండ సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ నరోజమ్ ఖామిస్ తెలిపారు. సుమారు ఒక ఎకరం విస్తీర్ణంలో క్యాంప్‌పై కొండచరియలు పడినట్లు చెప్పారు. ఏడాది క్రితం భారీ వర్షాల కారణంగా సుమారు 21వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఇదీ చదవండి: గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ పైనుంచి దూకి భారత సంతతి బాలుడు ఆత్మహత్య -
ఫలితాలు రాకముందే క్యాంపు రాజకీయాలు
-
టీడీపీ శిబిరాల్లోె ఉన్నవారంతా పెయిడ్ ఆర్టిస్ట్ లే
-
సదరం.. నరకం
సాక్షి, కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సదరం క్యాంపు నిర్వహణ తీరుపై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన సదరం క్యాంపులో దివ్యాంగులు, వృద్ధులు, మానసిక వికలాంగులు నరకం చూశారు. ఎండలో గంటల తరబడి భారీ క్యూలలో నిల్చున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేకపోయారు. కనీసం అక్కడ తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేరు. ప్రతి నెల మూడు, నాల్గో శుక్రవారాల్లో సదరం క్యాంపు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు కానీ ఇతరులు కానీ ఈ శిబిరానికే వచ్చి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో జిల్లాలోని పిట్లం, మద్నూర్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, నస్రుల్లాబాద్ తదితర దూర ప్రాంతాల నుంచి వచ్చి నానా తంటాలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కేవలం ఒకే సదరం క్యాంపు ఏరియా ఆస్పత్రిలో నిర్వహించడంతో సమస్య ఏర్పడుతోంది. శుక్రవారం నిర్వహించిన సదరం క్యాంపు కోసం కొందరు ఉదయం 7 గంటలకే వచ్చి ఉన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నా గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. కొందరు మహిళలు చంటి పిల్లలను ఎత్తుకుని ఎండలో క్యూలో నిల్చున్నారు. శిబిరం నిర్వహించే అధికారులు సౌకర్యలు ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఎండ తాకిడికి తట్టుకోలేక విలవిలలాడుతున్నామని, కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేరని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మండలాల్లో శిబిరం క్యాంపులను ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలుగుతాయని, తక్షణమే అధికారులు స్పందించి మండలానికో శిబిరం ఏర్పాటు చేయాలని దివ్యాంగులు కోరుతున్నారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆజయ్కుమార్ను వివరణ కోరగా డీఆర్డీఏ పీడీతో మాట్లాడానని తెలిపారు. ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపామన్నారు. అర్హులు మాత్రమే రావాలని, అనర్హులు కూడా వస్తున్నారని ఆయన తెలిపారు. నిర్లక్ష్యంగా క్యాంపు నిర్వహణ నేను పిట్లం నుంచి పొద్దున 7 గంటలకు మా తండ్రితో వచ్చా. ఎండలో చస్తున్నాం. క్యాంపు కనీస సౌకర్యాలు లేవు. తాగే నీరు కూడా లేదు. ప్రతి మండలంలో రెగ్యులర్‌గా క్యాంపులు నిర్వహిస్తే దివ్యాంగులకు ఇబ్బందులు తప్పుతాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. –శ్రీనివాస్, పిట్లంవాసి. -
మణిక్యాలారావు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
-
రోహింగ్యా శిబిరానికి నేనే నిప్పు పెట్టా!
సాక్షి, న్యూఢిల్లీ : రోహింగ్యా శిబిరం అగ్ని ప్రమాద ఘటనలో దిగ్భ్రాంతికి గురి చేసే విషయం వెలుగు చూశాయి. అది ప్రమాదం కాదని.. శిబిరానికి తానే నిప్పు పెట్టానంటూ బీజేపీ యువ విభాగం నేత మనీష్ చండేలా ప్రకటించటం కలకలం రేపింది. దీంతో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. మనీష్‌పై ఫిర్యాదు చేశారు. అసలేం జరిగింది... నైరుతి ఢిల్లీలోని సరితా విహార్ ప్రాంతంలో ఉన్న ఓ శిబిరంలో 50 రోహింగ్యా కుటుంబాలు(సుమారు 240 మంది) ఆశ్రయం పొందుతున్నాయి. ఇది రాజధానిలోని ఏకైక రోహింగ్యా శిబిరం. ఏప్రిల్ 15 ఆదివారం తెల్లవారుజామున ఈ శిబిరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. బట్టలు, పత్రాలు మరియు ఇతర వస్తువులు అన్ని కాలిపోయాయి. ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు దీనిని అగ్ని ప్రమాదంగానే భావించారు. చండేలా ట్వీట్లు... ఈ ఘటనపై స్పందిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నేత మనీష్ చండేలా తన ట్వీటర్లో చేసిన ట్వీట్ దుమారం రేపింది. ‘అవును.. ఆ పని చేసింది మేమే. ఇంకా చేస్తాం. రోహింగ్యాలు భారత్ వదిలి వెళ్లాల్సిందే’ అంటూ చండేలా ట్వీట్ చేశాడు. ఆపై ‘శభాష్.. మా హీరోలు మంచి పని చేశారు, ‘అవును.. రోహింగ్యా ఉగ్రవాదుల ఇళ్లను తగలబెట్టింది మేమే’ అంటూ వరుస ట్వీట్లు చేశాడు. క్షణాల్లో ఇవి వైరల్ కావటంతో ఏఐఎంఎంఎంతోపాటు పలు సంఘాల నుంచి బెదిరింపులు, విమర్శలు వచ్చాయి. దీంతో వెంటనే చండేలా ఆ ట్వీట్లను తొలగించాడు. అయితే అప్పటికే ఆ ట్వీట్ల స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. వీటి ఆధారంగా న్యాయవాది ప్రశాంత్ భూషణ్ క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. ‘మనీశ్ చండేలా అతని అనుచరులు రోహింగ్యా శిబిరాన్ని తగలబెట్టారు. పైగా ఆ విషయాన్ని గర్వంగా ట్వీటర్లో ప్రకటించాడు. ఢిల్లీ పోలీసులు ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బీజేపీ కూడా తమ సభ్యుడి నిర్వాకంపై స్పందించలేదు’ అని ట్వీట్ చేశారు. My criminal complaint against Manish Chandela of BJYM who proudly boasted on social media that he & his associates burnt down the Rohingya camp. No action yet by @DelhiPolice to register case & arrest him & no action by BJP to remove him from party. State of rule of law under BJP pic.twitter.com/aVd8LDSCUO — Prashant Bhushan (@pbhushan1) 19 April 2018 -
దయచేసి ఈసడించుకోవద్దు
సనత్‌నగర్: విధి ఆడిన నాటకంలో అగ్ని వారి దేహాన్ని దహిస్తే.. ఇది చాలదన్నట్టు సమాజం వారి గుండెల్లో ‘మంటలు’ రేపుతోంది. అది చాలదన్నట్టు ముద్దగా మారిన ఆ శరీరాన్ని చూపులతోనే వెలివేస్తోంది. బడిలో తోటి పిల్లలు.. కళాశాలలో సహ విద్యార్థులు.. హాస్టల్లో రూమ్మేట్స్.. ఉద్యోగానికి వెళ్లినా.. అన్నిచోట్లా ‘దూరం’గాచూసేవారే. ఇలా అవమానాల భారంతో బరువెక్కిన హృదయాలెన్నో. మానసికంగా కుంగి కృశించిపోతున్నఆ మనసులు ఆత్మీయత కోసం ఇంటి నాలుగు గోడల మధ్యే పరితపిస్తున్నాయి. అలాంటి వారికి నేనున్నానంటూ భరోసాగా నిలుస్తోంది ‘బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్’ సంస్థ. అలాంటి వారికి అండగా ఉంటున్నారు సంస్థనిర్వాహకురాలు నిహారి మండలి. ‘బర్న్స్ టు షైన్’ (కాలిన సంఘటన నుంచి ప్రకాశవంతమైన జీవితంలోకి)నినాదంతో చైతన్య స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కాలిన గాయాలకంటే.. సమాజం చేసిన/ చేస్తోన్న గాయాలకుఔషధమవుతున్నారు. గాయపడ్డ హృదయాల్లో అడుగంటిపోతోన్న ఆత్మవిశ్వాసానికి ఉపిరిలూదుతున్నారు. సంస్థ ఆవిర్భావం ఇలా.. కృష్ణాజిల్లా అవనిగడ్డ సమీపంలోని పులిగడ్డ ప్రాంతానికి చెందిన మండలి శేషగిరి, ఊర్మిల దంపతుల కుమార్తె నిహారికి ఇంటర్మీడియెట్ పూర్తికాగానే వివాహం చేశారు. కొద్ది కాలానికే తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలకు తీవ్ర మనస్తాపానికి గురైన ఇమె 2009లో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఆమె ఆ సమయంలో ప్రాణాలతో అయితే బయటపడింది గానీ, ఆమె శరీరం ముద్దలా మారిపోయింది. ఎందుకు బతికానా? అన్న దీనావస్థలో ఉన్న నిహారికి కుటుంబ సభ్యులు, స్నేహితులు ధైర్యాన్నిచ్చారు. జీవితంలో వచ్చిన కష్టాలకు చావే పరిష్కారం కాదని.. పోరాటమని తెలియజెప్పారు. ఆ తర్వాత వారిచ్చిన ధైర్యంతో డిగ్రీ పూర్తి చేసింది. తన జీవితంలో ఎదురైన అనుభావాన్నే దారంగా మార్చుకుని కాలిన గాయాలకు సంబంధించి ప్లాస్టిక్ సర్జరీ ట్రైనింగ్తీసుకుంది. ఈ క్రమంలో ఎక్కడికి వెళ్లినా చీదరింపులే ఎదురయ్యాయి. ఆఖరికి హాస్టల్లో ఉండే రూమ్మేట్స్ కూడా. ఉద్యోగం కోసం పలుచోట్ల ఇంటర్వ్యూలకు హాజరైతే ముఖాకృతిని చూసి తిరస్కరించిన వారే అందరూ. చివరకు దిల్సుఖ్నగర్ కొత్తపేట ప్రాంతంలోని రీడిఫైన్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ నిర్వాహకుడు, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ హరికిరణ్ చేకూరి ఆమెకు ఉద్యోగ అవకాశం కల్పించారు. సమాజం నుంచి ఎదురవుతున్న అవమానాలకు తనలాంటి వారు ఎవరూ కుంగిపోపోకుండా, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని సంకల్పించుకున్న నిహారి 2014లో ‘బర్న్స్ సర్వైవర్ మిషన్ సేవియర్’ సంస్థను నెలకొల్పారు. సంస్థ చేపట్టిన/చేపట్టేకార్యక్రమాలు.. గ్యాస్ పేలడం, చీరకొంగు పొయ్యిలో పడడం, ఎలక్ట్రికల్ షాక్, వేడి నీళ్లు, పాలు మీద పడ్డ సమయాల్లో దేహం/ అవయవాలు కాలిపోయి వికృతంగా తయారవుతాయి. ఈ సమయంలో వారు ఇంటి నుంచి సమజాంలోకి వచ్చేలా వివిధ రకాల అవగాహన కార్యక్రమాలను నిహారి తన సంస్థ ద్వారా చేపడుతున్నారు. ముఖ్యంగా కాలిన గాయాలతో అంగవైకల్యం పొందిన బాధితుల కోసం ఉచిత శస్త్ర చికిత్సా శిబిరాలను నిర్వహిస్తున్నారు. 2015లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాలికట్ బ్రాంచ్, కేరళ ప్లాస్టిక్ సర్జన్ అసోసియేషన్ సహకారంతో కేరళలో ఉచిత ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ నిర్వహించి 24 మందికి శస్త్ర చికిత్స చేశారు. కాలిన గాయాల కారణంగా వైకల్యంతో బాధపడుతున్న వారు సర్జరీ ద్వారా శరీరాకృతిని తిరిగి పొందవచ్చని తెలియని వారికి విస్తృతమైన అవగాహన కల్పించేందుకు సైకిల్ రైడింగ్, ఫ్యాషన్ షో, బైక్ రైడింగ్, బెలూన్స్ ఫ్లయింగ్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో బాధితులను సైతం భాగస్వాములను చేస్తున్నారు. తనలా ఎవరికీ పరిస్థితి రాకూడదని అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ ప్రమాదానికి గురైతే ధైర్యాన్నిచ్చి అందుబాటులో ఉన్న చికిత్స గురించి చెబుతున్నారు. కాలిన గాయాలకు చికిత్స చేసుకోని వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ఓ టీవీ ఛానల్లో ప్రసారమవుతున్న మంచులక్ష్మి షో ‘నేనుసైతం’ కార్యక్రమానికి ఇద్దరు బాధితులను తీసుకెళ్లి వారికి ఆర్థిక సాయం అందేలా చూశారు. బాధితులకు ఉచితంగా శస్త్రచికిత్సలు కాలిన గాయాలతో సమాజానికి దూరంగా ఉం టున్న వారికి సాయం చేసేందుకు నిహారి నడుం బిగించారు. ఈ నెల 23 నుంచి 28 వరకు మరోసారి ఉచిత శస్త్ర చికిత్స క్యాంప్ తలపెట్టారు. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల నుంచి రెండు వందలకు పైగా రిజిస్ట్రేషన్లు రాగా రీడిఫైన్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ డాక్టర్ హరికిరణ్ చేకూరి సహకారంతో 15 మందికి ఈ శస్త్ర చికిత్సలు చేసేందుకు నిర్ణయించారు. దాతలూ సహకరించండి.. శస్త్ర చికిత్స వరకు ఉచితంగా చేస్తున్నా.. చికిత్సకు అవసరమయ్యే పరికరాలు, మందులు ఇతర సర్జికల్ పరికరాలు ఖర్చుతో కూడుకున్నవి. అయినప్పటికీ పేదలకు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నామని నిహారి చెబుతున్నారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ. 30 వేల వరకు ఖర్చవుతుంది. ఇందుకోసం ఎవరైనా దాతలు ముందుకువచ్చి సహకారం అందిస్తారని ఆమె కోరుతున్నారు. అయితే శస్త్ర చికిత్సల కోసం నమోదు చేసుకున్న వారి సంఖ్యను బట్టి ఏడాదికి రెండు మూడు క్యాంప్‌లు నిర్వహించాలని భావిస్తున్నారు. దయచేసి ఈసడించుకోవద్దు విధివశాత్తూ కాలిన గాయాలతో వికృతంగా మారిన వారికి అండగా నిలవక పోయినా ఫర్వాలేదు.. కానీ దయజేసి ఈసడించుకోవద్దు. మాటలతో మానసికంగా బాధపెట్టొద్దు. బాధితులకు కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నాలుగు గోడల నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా బతకాలి. బర్న్స్ మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి బయటపడి వెలుగు దిశగా సాగాలన్నదే మా సంస్థ తాపత్రయం. అందుకోసం వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టి బాధితులకు అండగా నిలబడతాం. – నిహారి సాయం చేయాలనుకుంటే ఫోన్ 7680974918, neehaari.mandali@gmail.com మెయిల్లో సంప్రదించవచ్చు. -
నల్లమల జంగిల్ క్యాంప్ ప్రారంభం
ఆత్మకూరు: అటవీశాఖ ఆధ్వర్యంలో బైర్లూటీ చెక్‌పోస్టు వద్ద రూ. 92లక్షలతో నిర్మించిన నల్లమల జంగిల్ క్యాంప్‌ను ఈ నెల 29న ప్రారంభిస్తున్నట్లు బైర్లూటీ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నల్లమల జంగిల్ క్యాంప్ నల్లమలను వీక్షించాలనే పర్యాటకులకు ఎంతో అనువుగా ఉంటుందన్నారు. 1.34 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంప్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు మార్నింగ్ వాక్ ఉంటుందని, సిద్దాపురం చెరువు వరకు లేదా గంగిరేవు వాగు వరకు ఈ నడక ఉంటుందన్నారు. పర్యాటకులకు కాటేజీ, భోజన సదుపాయం కలి్పస్తున్నామన్నారు. ఈ క్యాంప్ ప్రారంభం సందర్భంగా 28, 29 తేదీల్లో బైర్లూటీ వద్ద ఆర్చరీ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నల్లమల జంగిల్ క్యాంప్‌ను ప్రారంభించేందుకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రానున్నట్లు తెలిపారు. -
డయల్ యువర్ ఎస్పీకి 14 ఫిర్యాదులు
నిజామాబాద్ క్రైం : ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి 14 ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి సోమవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తుండగా ఈ వారం 10 నుంచి 10.45 గంటల వరకు నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ సబ్ డివిజన్ల పరిధిలో నుంచి వచ్చిన ఈ ఫిర్యాదులపై ఎస్పీ విశ్వప్రసాద్ సానుకూలంగా స్పందించారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల్లో పరిష్కరించదగిన ఫిర్యాదులను వారం రోజుల్లో, మిగతావి విచారించి పరిష్కరించాలని కిందిస్థాయి పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ మునీ పాల్గొన్నారు. -
యురిలో సైన్యం విఫలమైంది: దిగ్విజయ్
న్యూఢిల్లీ: లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ)కి సమీపంలో ఉన్న ఆర్మీ క్యాంపును రక్షించుకోవడంలో సైన్యం విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. యూరిలో సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిలో 20 మంది జవాన్లు మృతి చెందిన నేపథ్యంలో ఆయన సోమవారం ట్విట్టర్లో స్పందించారు. గతంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ సందర్భంగా ఉగ్రవాది మసూద్ అజర్‌ను విడుదల చేసి.. ఎన్డీఏ ప్రభుత్వం భద్రత విషయంలో రాజీపడిందని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. యూరి ఉగ్రదాడి మసూద్ అజర్ నేతృత్వంలోని జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఆధ్వర్యంలో జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్న విషయం తెలిసిందే. పాక్ ప్రభుత్వ సహకారంతో జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఈ దాడికి పాల్పడి ఉండవచ్చు అని, అయితే తమ క్యాంప్‌ను రక్షించుకోవడంలో సైన్యం విఫలమైందనే విషయాన్ని కూడా చూడాలని దిగ్విజయ్ ట్వీట్ చేశారు. యురి అమరులకు నివాళులు అర్పించిన ఆయన.. అంతర్జాతీయంగా పాక్‌ను ఒంటరిని చేసేలా భారత ప్రభుత్వం కృషి చేయాలన్నారు. Masood Azhar's Jaish e Mohammad behind the attack. Of course with full connivance of Pakistan Establishment.— digvijaya singh (@digvijaya_28) September 19, 2016Should also look at the failure of the Army to protect its Army Camp near the LOC.— digvijaya singh (@digvijaya_28) September 19, 2016 -
రక్తనిధికి 30 శాతం రక్తం ఇవ్వాల్సిందే!
–ఏపీ శ్యాక్స్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి కర్నూలు(హాస్పిటల్): ప్రై వేటు రక్తనిధులు క్యాంపుల ద్వారా సేకరించే రక్తంలో 30శాతం రక్తాన్ని ప్రభుత్వ రక్తనిధులకు తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని ఏపీ శ్యాక్స్(ఎయిడ్స్ నియంత్రణ సంస్థ) జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఆదేశించారు. శుక్రవారం ఆమె కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని రక్తనిధిని పరిశీలించారు. రక్తనిధిలోని రక్త ప్యాకెట్ నిల్వలను పరిశీలించారు. రక్తం సేకరించిన తేది, ఎక్స్పైరీ తేదీలను చూశారు. ఇందులో రెండు ప్యాకెట్లు కాలం తీరిపోయి ఉండటాన్ని ఆమె గమనించి సిబ్బందిని మందలించారు. స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు అవసరం మేరకే నిర్వహించాలని, అవసరం లేకుండా చేసి ఇలా రక్తాన్ని వృథా చేయవద్దని సూచించారు. రక్తదాతకు పరీక్ష చేసేటప్పుడు హెచ్ఐవీ పాజిటివ్ వస్తే ఐసీటీసీలో లింక్ చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. మూడు నెలలకు ఒకసారి ఆసుపత్రిలోని హెచ్‌వోడీలతో సమావేశమై వారి రక్తం అవసరాలు ఎంత మేరకు ఉన్నాయో తెలుసుకుంటే డిమాండ్ ఎంత ఉందో తెలుస్తుందన్నారు. రెడ్‌క్రాస్ రక్తనిధి నుంచి 30 శాతం రక్తం ఇవ్వడం లేదని అక్కడున్న వైద్యులు జేడీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె వెంటనే రెడ్‌క్రాస్ మెడికల్ ఆఫీసర్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. తాము ఇప్పటికే నెలకు 100 మందికి పైగా తలసీమియా రోగులకు రక్తాన్ని ఉచితంగా ఇస్తున్నామని, అందుకే 30 శాతం రక్తాన్ని ఇవ్వడం లేదని సమాధానం ఇచ్చారు. తలసీమియా రోగులకు ఇచ్చినా నిబంధనల ప్రకారం ప్రభుత్వ రక్తనిధికి 30 శాతం రక్తాన్ని ఇచ్చి తీరాల్సిందేనని ఆమె ఆదేశించారు. అన్ని ప్రైవేటు రక్తనిధులు ఈ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ రూపశ్రీకి సూచించారు. అనంతరం ఆమె ఐసీటీసీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. వారానికి ఒకసారి ఏఆర్టీ సెంటర్‌కు రాని హెచ్ఐవీ బాధితుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించడం లేదని గుర్తించి మందలించారు. ఆమె వెంట ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డివిజనల్ అసిస్టెంట్ పీటర్ పాల్, జిల్లా మేనేజర్ అలీ హైదర్, బ్లడ్‌బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేవతి, ఐసీటీసీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఎస్సీలకు రూ.1100 కోట్ల రుణాలు
– రూ.2 వేల కోట్లతో సీసీ రోడ్ల అభివృద్ధి – పుష్కర నిర్వహణలో మనమే ఫస్ట్ – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కర్నూలు(అర్బన్):రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన ఎస్సీలకు రూ.1100 కోట్ల రుణాలను అందించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. గురువారం నగర శివారుల్లోని వీజేఆర్ కన్వెన్షన్ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్ అధ్యక్షతన ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు వై. ఐజయ్య, ఎస్వీ మోహన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి మారెప్ప హాజరయ్యారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి కేఈ, ప్రజా ప్రతినిధులు, అధికారులు డా.బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ఎస్సీలకు రూ.8 వేల కోట్లు, ఎస్టీలకు రూ.3 వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందిస్తుందన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద ఐఏఎస్, ఐపీఎస్ తదితర సివిల్ సర్వీస్ పరీక్షలకు సంసిద్దం అయ్యేందుకు శిక్షణను ఇప్పిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ పరంగా కూడా ఎస్సీ వర్గాలను అభివద్ధి చేసేందుకు పలు రకాల యాంత్రిక పరికరాలపై సబ్సిడీని అందిస్తున్నామన్నారు. – ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ దళిత, గిరిజనులకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులు సహకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. – శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో దొరవారి భూములు దాదాపు 1600 ఎకరాలు ఉన్నాయని, వాటిని ప్రస్తుతం సాగు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. – ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఈ వర్గాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. – జేసీ హరికిరణ్ మాట్లాడుతు జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేశామని ఇప్పటి వరకు వచ్చిన 900 ఫిర్యాదుల్లో 600 ఫిర్యాదులను పరిష్కరించామని, మిగిలినవి పరిష్కార దిశగా ఉన్నాయన్నారు. – కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, తెలుగుమహిళ నాయకురాలు అంకం విజయ, దళిత సంఘాలకు చెందిన నాయకులు బాలసుందరం, త్యాగరాజు, అశోకరత్నం, అనంతరత్నం మాదిగ, రాజ్‌కుమార్, కే వెంకటేష్, గడ్డం నాగముని, వేల్పుల జ్యోతి, డీవీఎంసీ సభ్యులు చిటికెల సలోమి, చిన్న లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే నెల 3న మెగా రక్తదాన శిబిరం
మోత్కూరు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యా ఫెడరేషన మోత్కూరు ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో వచ్చేనెల 3న మోత్కూరులోని శ్రీలక్ష్మీ ఫెట్రోల్ బంక్ ఆవరణలో మెగా రక్తశిబిరం నిర్వహిస్తున్నట్టు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మెతుకు సైదులు తెలిపారు. సోమవారం కార్యక్రమ కరపత్రాలను మండలకేంద్రంలో వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు సోమేశ్వర్, తొర్ర ఉప్పలయ్య, సుబ్రహ్మణ శర్మ, దొర్న వెంకన్న, మోత్కూరు రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు చింతల సత్యనారాయణరెడ్డి, సభ్యులు అనిల్, సత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రక్తదానం ప్రాణదానంతో సమానం
గుండాల : రక్తదాన శిబిరాల్లో మీరు ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు జీవం పోస్తుందని పశు గణాభివృద్ధి సంస్థ జిల్లా చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి అన్నారు. మంగళవారం మండల టీఆర్ఎస్ పార్టీ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వారు, ప్రభుత్వ విప్ సునీత 46వ జన్మ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన మాట్లాడారు. రక్తదానంపై అపోహలను వదిలి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రకాష్, ఎంపీపీ సంగి వేణుగోపాల్ యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణారెడ్డి, కాలె మల్లేషం, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మోత్కూరు శాఖ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, పశు గణాభివృద్ధి సంస్థ జిల్లా డైరక్టర్ ఇమ్మడి దశరథ, షర్ఫోద్ధిన్, మల్లయ్య, మాధవి, అనసూర్య, శ్రీనివాస్, రమేష్, పాండరి, రమేష్‌రెడ్డి, ఉప్పలయ్య, భిక్షం పాల్గొన్నారు. -
తాడువాయిలో ‘ఉచిత కంటి వైద్య శిబిరం
తాడువాయి(మునగాల): మండలంలోని తాడువాయిలో శుక్రవారం రేపాల అక్షర సామాజిక సేవా సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట లయిన్స్ క్లబ్ సహాకారంతో ఉచిత కంటివైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ జిల్లేపల్లి అరుణ ప్రారంభించారు. ఇందులో భాగంగా 80మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, వీరిలో 19మందికి ఆపరేషన్లు అవసరం ఉన్నట్టుగా నిర్ధారించి, ఆపరేషన్ నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. ఈ వైద్య శిబిరంలో లయిన్స్ క్లబ్ వైద్య సిబ్బంది పవన్‌కుమార్, శ్రీనివాసచారి, వెంకటాచారి, గ్రామపెద్దలు ఆర్.వెంకటరెడ్డి, జి.నర్సయ్య, అక్షర సామాజిక సేవాసంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాచెర్ల రమేశ్, శొంఠి శ్రీను, సభ్యులు గోపి, సురేష్, నరేష్, ఎం.నర్సయ్య, బి.సాయి, కె.కిరణ్ పాల్గొన్నారు. -
ఉచిత హెపటైటిస్ శిబిరం
ఖమ్మంవైద్య విభాగం : సాయిరాం గ్యాస్ట్రో లివర్ ఆస్పత్రి, రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి ఆధ్వర్యంలో గురువారం స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో ఉచిత హెపటైటిస్ శిబిరాన్ని నగర మేయర్ పాపాలాల్ ప్రారంభించారు. హెపటైటిస్ బీ,సీ పరీక్షలు నిర్వహించి, హెపటైటిస్ బీ వ్యాక్సినేషన్ చేపట్టారు. శిబిరంలో 521 మంది హాజరయ్యారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్, ఐఎంఏ కార్యదర్శి బొల్లికొండ శ్రీనివాసరావు, రోటరీక్లబ్ ఆఫ్ స్తంబాద్రి ప్రెసిడెంట్ వందనపు శ్రీనివాస్, జంగాల సునీల్ కుమార్ పాల్గొన్నారు. -
సీఎన్ఆర్ ఆధ్వర్యంలో గుండె పరీక్ష శిబిరం
జడ్చర్ల టౌన్ : సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టార్ హస్పిటల్స్ సహకారంతో హృదయ ఫౌండేషన్ ఆదివారం బాదేపల్లి జెడ్పీ హైస్కూల్లో చిన్నపిల్లల ఉచిత గుండె పరీక్ష శిబిరం నిర్వహించారు. శిబిరంలో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌లు నితిన్‌కుమార్, సుమన్ 150మంది చిన్నపిల్లలకు గుండె పరీక్షలు నిర్వహించారు. వారిలో 13మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. శిబిరంలో హృదయ ఫౌండేషన్ మేనేజర్ ట్రస్టీ మేక యుగంధర్, ఫౌండర్ ట్రస్టీ పద్మశ్రీ గోపిచంద్, డాక్టర్ జయరాజ్, డీఎంఅండ్‌హెచ్‌ఓ నాగారం, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ మల్లికార్జునప్ప, పిల్లల వైద్య నిపుణులు రమేష్‌బాబు, రవి, రమేష్‌చారి, నరేందర్, రాఘవేందర్, ఎంపీపీ లక్ష్మీశంకర్, జెడ్పీటీసీ జయప్రద, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బి.శివకుమార్, డీఎస్పీ కృష్ణమూర్తి, ఎస్ఎస్ఓ చందునాయక్, పీఎసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, కోడ్గల్‌యాదయ్య, మహ్మద్‌యూసూఫ్, శ్రీకాంత్, శంకర్‌నాయక్, తోటారెడ్డి, ఉమాశంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
23 నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు
కోరుట్ల పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహణ 29 వరకు రోజుకు రెండు గ్రామాల్లో సేవలు జగిత్యాల అగ్రికల్చర్ : ఎన్ఎస్ఎస్లో భాగంగా కోరుట్ల పశువైద్య కళాశాలలో ఆధ్వర్యంలో జగిత్యాల డివిజన్లోని పలు గ్రామాల్లో ఈ నెల 23 నుంచి 29 వరకు ఉచిత పశు వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ టి.రఘునందన్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ డి.కృష్ణ తెలిపారు. ఈ శిబిరాలను ఉదయం 7.30 గంటలకు ప్రారంభిస్తామని చెప్పారు. వ్యాధుల బారిన పడిన పశువులకు చికిత్స చేయడం, పశువుల్లో గర్భకోశ వ్యాధులకు చికిత్స–నిర్ధారణ, చూలు నిర్ధారణ పరీక్షలు, దూడలకు నట్టల నివారణ మందులు వేయడం, వ్యాధి నిరోధక టీకాలు వేయడం, పశు పోషణ–సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించడం, పశుగ్రాసాలపై చైతన్యం చేయడం వంటి తదితర కార్యాక్రమాలు ఉంటాయని వివరించారు. కార్యక్రమాల నిర్వహణ.. ఈ నెల 23న వెల్గటూర్ మండలంలోని పాత గూడూరు, ముంజంపల్లి గ్రామాలలో, 24న మల్యాల మండలంలోని మ్యాడంపెల్లి, తాటిపల్లి గ్రామాలలో, 25న పెగడపల్లి మండలంలోని రాములపల్లి, మద్దులపల్లి గ్రామాల్లో, 26న గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం, లోత్తునూర్ గ్రామాల్లో, 27న ధర్మపురి మండలంలోని సిరికొండ, బీర్సాని, 28న జగిత్యాల మండలంలోని తాటిపల్లి, రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామాలు, 29న జగిత్యాల మండలంలోని హబ్సీపూర్, గుట్రాజ్‌పల్లి గ్రామాల్లో వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరాల్లో కోర్సు చివరి సంవత్సరం విద్యార్థులతోపాటు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పశుసంవర్థక శాఖ అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. -
సమ్మర్ క్యాంప్ మొదలైంది!
ప్రతియేటా వేసవిలో ఆర్ఎస్ఎస్ నిర్వహించే ప్రత్యేక ట్రైనింగ్ కార్యక్రమం 'సంఘ్ శిక్షా వర్గ్' సమ్మర్ క్యాంప్ రేషింబాగ్ లో విజయవంతంగా ప్రారంభమైంది. భారత్ పై అవగాహనను, అనుభవాన్ని పెంచుకునే క్యాంప్ గా ఈ కార్యక్రమాన్ని ఆరెస్సెస్ సీనియర్ ప్రచారక్ దత్తాత్రేయ హోసబేల్ అభివర్ణించారు. 25 రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలనుంచి ఎనిమిది వందల మంది యువ స్వయం సేవక్ లు పాల్గొంటున్నారు. ఆరెస్సెస్ వేసవి శిక్షణా శిబిరంలో వివిధ భాషలు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణలు కలిగిన ఎనిమిది వందలమంది స్వయం సేవక్ లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలనుంచి పాల్గొంటున్నారు. వివిధ వాతావరణాలనుంచి వచ్చి 25 రోజులపాటు కలసి పాల్గొని ప్రత్యేక శిక్షణను పొందే ఈ శిక్షణా శిబిరం ఓ మినీ భారత్ ను తలపిస్తుంది. అయితే వీరంతా ఇలా కలసి శిక్షణ తీసుకోవడం నిజమైన భారత్ కు అర్థాన్ని చెప్తుందని దత్తాత్రేయ హోసబేల్ అన్నారు. ఆరెస్సెస్ అంటే కేవలం యూనిఫాం, ప్రార్థనలే కాదని, భిన్నత్వంలో ఏకత్వాన్నిసాధించే ప్రయత్నమని ఆయన తెలిపారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒక్కటిగా కలసి నిర్వహించే కార్యక్రమమే సంఘ్ శిక్షా వర్గ్ అని, దేశంలో మాట్లాడే ప్రతి భాషలోనూ ఆరెస్సెస్ సాహిత్యం అందుబాటులో ఉందని హోసబేల్ తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఉండే లక్షణాలను, విభిన్న విశేషాలను, వ్యత్యాసాలను తెలుసుకుని భారత్ పై సరైన అవగాన పెంచుకునేందుకు స్వయంసేవక్ లకు ఈ శిక్షణ ప్రోత్సహిస్తుందని విశ్వసంవాద్ కేంద్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక సందేశంతో జూన్ 9 న శిక్షణా కార్యక్రమం ముగుస్తుంది. -
బాత్రూం సైజు ఇళ్లలో వేలమంది నివాసం!
తీవ్రవాద చర్యలకు భయపడి పారిపోతున్న శరణార్థులు... సహాయ శిబిరాల్లోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న బాత్రూం పరిమాణంలో ఉన్న ఇళ్లలో వేలమంది నివసిస్తున్నారు. తాజాగా బయటపడ్డ కొన్ని ఫొటోలు అక్కడి పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ నుంచి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోయినవారంతా మఫ్ రాక్ నగరానికి దగ్గరలోని అల్ జతారి క్యాంప్‌లో తలదాచుకుంటున్నారు. జోర్డాన్‌లోని ఆ శిబిరాలే ఇప్పుడు అందరికీ విస్మయం కలిగిస్తున్నాయి. తీవ్రవాదానికి దూరంగా.. మెరుగైన జీవితం గడపడం కోసం సిరియా, ఇరాక్ దేశాల నుంచి పారిపోయి వచ్చిన శరణార్థులు సుమారు ఆరు లక్షల మంది జోర్డాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. లక్షల మంది ఈ అగ్గిపెట్టెల్లాంటి శిబిరాల్లో తల దాచుకొని కాలం వెళ్లదీస్తున్నారు. వీరికి అందుబాటులో కాఫీ, పిజ్జా, బార్బర్ షాప్‌లు కూడా వెలిశాయి. ఇప్పుడీ ప్రాంతం.. వారి సొంత నగరంగానే మారిపోయినా, సమస్యలు మాత్రం రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జోర్డాన్ రాజుకు శరణార్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ నివపిస్తున్నట్లు గుర్తింపు పొందిన మొత్తం 6 లక్షల మంది శరణార్థులకే కాక, లెక్కల్లో లేని సుమారు మరో 10 లక్షల మంది సిరియన్లకు కూడా సహాయం అందించాలని కోరుతున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా మాత్రం తమ విద్యావ్యవస్థ, ఆరోగ్య విషయాల్లో శరణార్థులకు హాని ఏమీ లేదని అంటున్నారు. అంతర్జాతీయ సమాజాన్ని నిర్మించడంలో తాము సహకరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ప్రతిరోజూ 15.5 టన్నుల బ్రెడ్‌ను శిబిరానికి పంపిణీ చేస్తున్నన్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో శరణార్థ శిబిరాల్లో రద్దీ తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం తీసుకురావాలని భావించినా.. సిరియాలో సంక్షోభం వల్ల అది సాధ్యం కావట్లేదు. ఇప్పటికైనా శరణార్థుల సమస్య తీరి.. యూరోపియన్ దేశాల్లో ప్రశాంత వాతావరణం ఏర్పడాలని అంతా కోరుకుంటున్నారు. -
లయన్ క్లబ్లో ఉచిత కంటిపరిక్షలు
-
రోగం బెంగతో బలవన్మరణం
హైదరాబాద్(పటాన్చెరు): నయంకాని రోగంతో బాధపడుతున్న వ్యక్తి పటాన్‌చెరులోని సాకి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు...కరీంనగర్ మిట్టపల్లికి చెందిన నాగేళ్ల జీరయ్య(55) పదేళ్లుగా పటాన్‌చెరులోని గొల్లబస్తీలో ఉంటున్నారు. పాషమైలారంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. పరిశ్రమలో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో నయంకాని వ్యాధిఉన్నట్లు తేలింది. అది తగ్గదని భావించి మనోవేదనకు గురై సాకిచెరువులో పడి మృతిచెందాడని పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆదివారం సాకిచెరువులో శవమై కనిపించారు. ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
'అనంత' కలెక్టరేట్ లో రుణమాఫీ సహాయక శిబిరం
అనంతపురం: ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకంలో అవకతవకలతో పాటు, రుణమాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేశారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో రుణమాఫీ సహాయక శిబిరాన్ని కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. దీంతో రుణమాఫీలో ఎదురైన సమస్యలను అధికారులకు చెప్పేందుకు రైతులు బారులు తీరారు. ఈ సారి అయిన ప్రభుత్వం ఎలాంటి సాకులు చెప్పకుండా పూర్తి స్థాయి రుణమాఫీ చేసి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
పుణ్యక్షేత్రాలు.. పర్యాటక కేంద్రాలు
- విహారయాత్రలో స్థానిక ప్రతినిధులు - అన్ని పార్టీలదీ క్యాంప్‌ల బాటే కరీంనగర్ సిటీ : పరోక్ష ఎన్నికలకు మరో మూడురోజులు గడువుండటంతో స్థానిక ప్రతినిధులంతా క్యాంప్‌ల బాటపట్టారు. చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడానికి, తమ మద్దతుదారులను కాపాడుకోవడానికి శిబిరాలకు తరలివెళ్లారు. మెజారిటీ మండలాల నుంచి ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆది, సోమవారాల్లో క్యాంప్‌లకు పయనమయ్యారు. సిరిసిల్ల మినహా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మెజారిటీ మండలాల, కార్పొరేషన్ల నుంచి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు క్యాంప్‌లకు వెళ్లారు. చైర్మన్ అభ్యర్థులు, ఆశావాహులు స్వకార్యం, స్వామి కార్యం సిద్ధిస్తుందని పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాల్లో క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. రామగుండం నగరపాలక సంస్థ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, టీఆర్ఎస్లు తమ క్యాంప్‌లను కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్ ఉత్తర భారతంలో ఉండగా, టీఆర్ఎస్ తమ కార్పొరేటర్లను షిర్డీ దర్శనానికి తీసుకెళ్లింది. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్లను హైదరాబాద్‌కు తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. కోరుట్ల మున్సిపల్ కౌన్సిలర్లతో టీఆర్ఎస్, కాంగ్రెస్ హైదరాబాద్‌లో వేర్వేరుగా క్యాంప్ వేశాయి. మెట్పల్లి చైర్మన్ పీఠాన్ని దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్ తమ కౌన్సిలర్లను షిర్డీకి తీసుకెళ్లగా, కాంగ్రెస్ హైదరాబాద్‌లో మకాం వేసింది. వేములవాడ నగరపంచాయతీపై కన్నేసిన బీజేపీ తన సభ్యులతో పాటు మద్దతిస్తున్న కౌన్సిలర్లతో హైదరాబాద్‌లో క్యాంప్ నిర్వహిస్తోంది. పెద్దపల్లి నగరపంచాయతీకి సంబంధించి టీఆర్ఎస్, కాంగ్రెస్ హైదరాబాద్‌లో వేర్వేరు క్యాంపులు కొనసాగిస్తున్నాయి. జమ్మికుంట నగరపంచాయతీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకొనేందుకు టీఆర్ఎస్ తన కౌన్సిలర్లతో హైదరాబాద్‌లో మకాం వేసింది. హుజూరాబాద్ నగరపంచాయతీ కౌన్సిలర్లతో టీఆర్ఎస్ యనాం చేరుకుంది. జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ సీట్లు రావడం, స్థానిక ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి సమీప బంధువు చైర్పర్సన్ కానుండటంతో అక్కడ క్యాంప్ జాడ లేదు. అయితే జగిత్యాల ఎంపీపీ కోసం కాంగ్రెస్ ఎంపీటీసీలంతా సోమవారం క్యాంప్‌నకు ప్రయాణమయ్యారు. ఈ క్యాంపులో మహిళా ఎంపీటీసీల స్థానంలో వారి భర్తలు షిర్డీకి తరలివెళ్లడం విశేషం. హుజూరాబాద్, రాయికల్ , కాల్వశ్రీరాంపూర్ ఎంపీటీసీలు వైజాగ్‌లో ఉండగా, జూలపల్లి, ధర్మపురి ఎంపీటీసీలు తిరుపతిలో మకాం వేశారు. కమాన్‌పూర్ ఎంపీటీసీలు ఊటీ, బెంగుళూరులో పర్యటిస్తున్నారు. మిగిలిన మండలాలకు చెందిన ఎంపీటీసీలు ఎక్కువగా హైదరాబాద్‌లో క్యాంప్‌లు వేయగా, మరికొంతమంది కరీంనగర్‌లోని వివిధ లాడ్జీల్లో మకాం వేశారు. క్యాంప్‌నకు దూరంగా సిరిసిల్ల సిరిసిల్ల నియోజకవర్గం క్యాంప్‌లకు దూరంగా ఉంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్థానికంగా ప్రాతినిథ్యం వహిస్తుండడమే కారణ ం. నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించిన ఆయన పరోక్ష ఎన్నికను తన కనుసన్నల్లో నడిపిస్తున్నాడు. ఆయన మాటే వేదం కావడంతో ఇక్కడి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు క్యాంప్ ఊసెత్తడం లేదు. ఎన్నికకు ముందు కేటీఆర్ ఎవరి పేరు చెబితే వారు మున్సిపల్ చైర్మన్, ఎంపీపీలు కానున్నారు. జెడ్పీటీసీలతో టీఆర్ఎస్ క్యాంప్? జిల్లా పరిషత్‌లో సంపూర్ణ మెజారిటీ సాధించినప్పటికీ జెడ్పీటీసీలతో క్యాంప్ వేయాలని టీఆర్ఎస్ యోచిస్తున్నట్లు సమాచారం. 57 జెడ్పీటీసీలకు 41 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ చైర్‌పర్సన్‌తో పాటు అన్ని పదవులు సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. 5న ఎన్నిక జరగనుండగా, కనీసం రెండు, మూడు రోజులైనా క్యాంప్ వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సోమవారం తిమ్మాపూర్‌లోని ఎల్ఎండీ అతిథిగృహంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పార్టీ నేతలు తుల ఉమ తదితరులతో మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. చర్చల్లో క్యాంప్‌నకు తీసుకెళ్లేందుకే మొగ్గుచూపినట్లు తెలిసింది. ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులపై కూడా చర్చించారు. ఇద్దరిలో ఒకరిని జగిత్యాల నుంచి ఎంపిక చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు వచ్చినట్లు సమాచారం. జగిత్యాలలో పార్టీ ప్రాతినిథ్యం లేనందున కో-ఆప్షన్ అయినా ఇవ్వాలని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
క్యాంప్ నుంచి జంప్
మావాడిని బడిలో చేర్చొస్తా ఇంటిముఖంపట్టిన కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు పనులు పూర్తయ్యూక మళ్లీ కొందరు శిబిరంలోకే నిర్వహణ భారం తడిసిమోపెడు రాజకీయ క్యాంపుల్లో ఖరీదైన జీవితం అనుభవిస్తున్న వారు ఒకటిరెండు రోజులైనా ఇంటికి పంపాలని నేతలను వేడుకుంటున్నారు. ఆ రకంగా కొంతమంది క్యాంపుల నుంచి బయటపడుతున్నారు. ఆ ఒకటి రెండు రోజులైనా విలాసాలను ఎందుకు వదులుకుంటున్నారంటే... తాము విలాసాల్లో మునిగితేలుతుంటే బిడ్డల భవిష్యత్తు నాశనమవుతుందనే ఆందోళనేననే విషయం స్పష్టమవుతోంది. కొందరు పనులు పూర్తరుున తరువాత తిరిగి క్యాంపులకు వెళుతున్నారు. సాక్షి, తిరుపతి: విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పిల్లలను బడులు, కళాశాలల్లో చేర్పించడం కోసం క్యాంపులు విడిచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా చైర్మన్, అధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగలేదు. రెండుమూడు స్థానాలు అటూఇటుగా గెలిచిన చోట్ల ప్రత్యర్థులు తమ సభ్యులను ఎగరేసుకుపోయే ప్రమాదాన్ని గుర్తించి ఆయా మండలాలు, మున్సిపాలిటీల ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లతో రాజకీయపార్టీల నాయకులు క్యాంపులు నిర్వహిస్తున్నారు. దాదాపు నెల రోజులుగా ఈ క్యాంపులు జరుగుతున్నాయి. బెంగళూరు, మైసూరు, ఊటీ, కొడెకైనాల్ తదితర శీతల ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఖరీదైన హోటళ్లలో వారిని ఉంచారు. గెలిచిన కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులే కాకుండా వారి కుటుంబసభ్యులను కూడా క్యాంపులకు తరలించారు. దీంతో క్యాంపులు నిర్వహించే నేతలకు ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నా వాటిని కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. చైర్మన్, అధ్యక్ష పదవులకు ఎన్నిక ఎప్పుడు జరుగుతుందనేది ఇంకా నిర్ణయం కానప్పటికీ ఖర్చులు భరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. క్యాంపుల్లో ఉన్న వారి పిల్లలకు వేసవి సెలవులు ముగియడంతో బడులు, కళాశాలల్లో చేర్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాము విలాసాలు చూసుకుంటే పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే ఆందోళనతో వారు ఇళ్లకు వెళ్లేందుకు మినహాయింపు తీసుకుని వస్తున్నారు. పలమనేరు, మదనపల్లె , తిరుపతి ప్రాంతాలకు చెందిన కొందరు ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు ఈ మినహాయింపుతో స్వస్థలాలకు తరలివచ్చారు. కొందరు పనులు ముగించుకుని మళ్లీ క్యాంపులకు వెళ్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తగినంత సంఖ్యా బలం లేనప్పటికీ ప్రత్యర్థి పార్టీ సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రలోభాలకు తెరలేపింది. దీంతో గత్యంతరం లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను కాపాడుకునేందుకు క్యాంపులు నిర్వహించాల్సి వస్తోంది. తలకు మించిన భారంగా పరిణమించినప్పటికీ పార్టీ ప్రతిష్ట కోసం వీటి నిర్వహణ వైపు మొగ్గు ప్రదర్శిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొన్ని చోట్ల ఇలా ఉంటే అధికారంలో ఉన్న టీడీపీకి తిరుపతి రూరల్ మండలంలో సొంతంగా అధ్యక్ష పదవి చేజిక్కించుకునేందుకు అవసరమైన బలం కంటే ఎక్కువ ఉంది. అయినా ఆ పదవికి ఇద్దరు పోటీ పడుతున్నారు. దీంతో రెండు వర్గాలు క్యాంపులు నిర్వహిస్తున్నాయి. క్యాంపుల్లో ఉన్న వారు జారిపోకుండా నిన్నటివరకు కాపాడుకున్నప్పటికీ వేసవి సెలవులు ముగియడంతో ఆ పార్టీ సభ్యులు కూడా ఇళ్లకు వెళ్లి వచ్చేందుకు మినహాయింపు కోరుతున్నారు. ఇంకొందరు ఆరోగ్య కారణాలతోనూ బయటపడుతున్నారు. దాదాపు నెలరోజులుగా ఇళ్లకు దూరంగా ఉండటంతో కొందరికి సొంత పనులు కుంటుపడ్డాయి. ఇటువంటి వారు కూడా ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి తీసుకుంటున్నారు. మొత్తం మీద కొందరికి క్యాంపుల నుంచి బయటకు వచ్చే అవకాశం కల్పిస్తున్నారు. నిర్వాహకులు మాత్రం ఈ భారం ఎప్పటికి తగ్గుతుందోనని బెంగ పెట్టుకున్నారు.