డయల్ యువర్ ఎస్పీకి 14 ఫిర్యాదులు
Published Mon, Oct 10 2016 9:34 PM | Last Updated on Mon, Sep 4 2017 4:54 PM
నిజామాబాద్ క్రైం :
ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి 14 ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి సోమవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తుండగా ఈ వారం 10 నుంచి 10.45 గంటల వరకు నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ సబ్ డివిజన్ల పరిధిలో నుంచి వచ్చిన ఈ ఫిర్యాదులపై ఎస్పీ విశ్వప్రసాద్ సానుకూలంగా స్పందించారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల్లో పరిష్కరించదగిన ఫిర్యాదులను వారం రోజుల్లో, మిగతావి విచారించి పరిష్కరించాలని కిందిస్థాయి పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ మునీ పాల్గొన్నారు.
Advertisement
Advertisement