ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన
ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన
Published Mon, Sep 19 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
గుంటూరు : మంత్రి నియోజకవర్గంలో ఎస్సీలపై దాడి జరిగితే నిందితులను ఇంత వరకు అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ళ అరుణ్ కుమార్ ధ్వజమెత్తారు. యడ్లపాడులో ఈ నెల 11వ తేదీ ఎస్సీ కాలనీ వాసులపై టీడీపీ అనుచరులు దాడి చేసిన సంఘటనలో పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడం పట్ల సోమవారం ఎస్పీ కార్యాలయం మెయిన్ గేటు వెలుపల దళిత బహుజన ఫ్రంట్ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామం నడిబొడ్డున ఓ వ్యక్తిని టీడీపీ నాయకులు అన్యాయంగా కొడుతుంటే ఆపిన కారణంగా కక్ష పెట్టుకుని ఈనెల 11 వతేదీ టీడీపీకి చెందిన కల్లూరి శ్రీరాములు, కల్లూరి శ్రీను, నాగభైరవ, శివనాగేశ్వరరావు ఎస్సీ కాలనీవాసులపై దాడి చేసారన్నారు. ఎస్సీ కాలనీకి చెందిన తమ్మలపూడి మరియదాసు, కనకరాజు, ఏసురత్నం, మామిడి ఏలిషా తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పెళ్లి ఫంక్షన్‌లో ఉండగా నిందితులు అనుచరులతో వచ్చి దాడి చేసారని, అడ్డు వచ్చిన వారి కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించి కొట్టారన్నారు. పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసారని, నేటి వరకు నిందితులను అరెస్టు చేయక పోవడం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కార్యదర్శి రాచమంటి చింతారావు మాట్లాడుతూ నిందితులు మరో చుండూరు తరహాలో గ్రామంలో విధ్వంసం సష్టిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, పోలీసులు విచారణ వేగవంతం చేసి నిందితులను అరెస్టు చేయాలని కోరారు. గ్రామంలో గొడవలు పునరావతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో మాల మహానాడు నగర అధ్యక్షుడు నేలపాటి గోపీ కష్ణ, నాయకులు పాగళ్ళ ప్రకాశ్, యాజలి జోజిబాబు, జొన్నలగడ్డ శ్రీకాంత్, బొంతా ప్రభుదాస్, ఎం.ఏలిషా, తమ్ముపూడి రూత్, కారెంశెట్టి రమాదేవి, అనుసూర్య,పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement