
సాక్షి, ములుగు జిల్లా: జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట 22 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగి పోయారు. లొంగి పోయిన వారిలో ముగ్గురు డిప్యూటీ దళ కమాండర్లు, ఒకరు పార్టీ దళ సభ్యులు ఉన్నారు. మిగతా 18 మంది మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు. డిప్యూటీ దళ కమాండర్‌కు నాలుగు లక్షల రివార్డు ఉంది. పోరు కన్నా ఊరు మిన్న.. ఊరికి తిరిగి రండి అంటూ పోలీసులు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, మావోయిస్ట్ పార్టీ, శాంత పేరున కర్రెగుట రక్షణ కోసం బాంబులు పెట్టామంటూ ప్రకటన చేయడాన్ని ములుగు ఎస్పీ శబరీష్ ఖండించిన సంగతి తెలిసిందే. నక్సల్స్.. అమాయక ఆదివాసులను బాంబులు పెట్టి హతమారుస్తూ ఇన్ఫార్మర్లు అనడం సమంజసం కాదన్నారు. ఆదివాసీలు ఎవరికి భయపడొద్దని.. పోలీసులు ఎల్లవేళలా రక్షణగా ఉంటారని ఎస్పీ తెలిపారు. నక్సల్స్ అడవులలో ఉండి సాధించేదేమీ లేదని.. లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలంటూ ఎస్పీ పిలుపునిచ్చారు.