చల్వాయి పరిసరాల్లో పుకార్లు
సామాజిక మాద్యమాల్లో ఓ ఫొటో చక్కర్లు
గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయి వట్టెవాగులో దెయ్యం సంచరిస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఐదారులు నెలల నుంచి వట్టెవాగులో దెయ్యం తిరుగుతుందంటూ ప్రచారం సాగుతోంది. అయితే దెయ్యం ఫొటోఅని చెబుతూ ఓ చిత్రాన్ని సామాజిక మాద్యమాల్లో పోస్టు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి 5కిలోమీటర్ల దూరంలో ఉన్న వట్టెవాగుకు పరిసరాల్లోని పంటపొలాలకు రైతులు రేయింబవళ్లు పనులకు వెళ్తుంటారు.
కొందరు జంతువేటకు వెళ్తోండగా.. మరికొందరు వట్టెవాగులో ఇసుక దందా చెస్తుంటారు. దీనికి తోడు ఈ మధ్యకాలంలో కొంతమంది వట్టెవాగు పరిసర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని చుట్టుపక్కల గ్రామాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో వీరిలో ఎవరో ఒకరు తమ పని సులభంగా ఏఆటంకం లేకుండా జరిగేందుకు ఇలా దెయ్యం ఉందని ప్రచారం చేస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనప్పటికీ స్థానికంగా ప్రభుత్వ అధికారులు ఇలాంటి ప్రచారంపై అవగాహన కల్పించి ప్రజల్లోని అభద్రతాభావాన్ని పోగొట్టాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment