
సాక్షి, ములుగు: ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో మరోసారి అలజడి నెలకొంది.
వివరాల ప్రకారం.. ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఈ సందర్బంగా మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో.. మృతులను పలుమార్లు హెచ్చరించినా వారు తీరు మార్చుకోలేదంటూ పేర్కొన్నారు.

ఇక, మృతిచెందిన వారిని ఉయిక రమేష్, ఉయిక అర్జున్‌గా గుర్తించారు. రమేష్.. పేరూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వీరిద్దరి హత్య నేపథ్యంలో ఏజెన్సీలో మళ్లీ అలజడి నెలకొంది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ దారుణ హత్యకు సంబంధించి సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Comments
Please login to add a commentAdd a comment