mulugu agency
-
కుట్రలతో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు: సీతక్క ఆవేదన
సాక్షి, ములుగు: రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల కౌంటింగ్ జరుగనుంది. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటిక ఎగ్జిట్‌పోల్స్ ఆసక్తికర వివరాలను వెల్లడించాయి. దీంతో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, సీతక్క శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే. ప్రతి ఇంటా వెలుగులే. బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు, కుట్ర రాజకీయాలతో చాలా ఇబ్బంది పెట్టారు. నన్ను ఆడబిడ్డగా ములుగు ప్రజలు ఆదిరించారు. చిన్న పిల్లలు కూడా నాకే మద్దతు ఇచ్చి అక్కున చేర్చుకున్నారు. నా జీవితానికి ఇంకేం కావాలి. నా గెలుపుకోసం కష్టపడ్డ అందరికీ ధన్యవాదాలు. నేనెప్పుడూ మీ సేవకురాలినే. నేను ములుగు ప్రజల వెంటే ఉంటాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమంతో అభివృద్ధి చేస్తాను. నన్ను రీల్ అన్నారు. నేను కష్టకాలంలో ప్రజల వెంటే ఉన్నాను. వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పారు. వారికి ఆడబిడ్డ ఉసురు తగులుతుంది. నన్ను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. నా కార్యకర్తలను డబ్బులతో కొనుగోలు చేసి తప్పుడు ప్రకటనలు ఇప్పించారు. ఏ కష్టం వచ్చినా జనం వెంటే ఉంటాను. పార్లమెంట్ ఎన్నికల్లో రాహూల్ ప్రధాని అయ్యేలా కృషి చేస్తాను. ఎన్నికల్లో కష్టపడ్డ అందరికీ కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేశారు. -
Birthday Politics: ఆ బర్త్‌డే వేడుకల వెనుక రహస్యం ఏంటి?
ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో పొలిటికల్ బర్త్‌డే పార్టీలు జోరందుకున్నాయి. రెండు పార్టీలు..ఇద్దరు గిరిజన నేతలు..మరో బీసీ నేత పుట్టిన రోజు వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించుకున్నారు. గిరిజన నేతలిద్దరూ స్వపక్షంలోనే ప్రతిపక్షంలా మారిపోయారు. సొంత పార్టీలోని ప్రత్యర్థులపై పై చేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు గజమాలల బర్త్‌డే వేడుకల వెనుక రహస్యం ఏంటి? మానుకోటలో ఏం జరిగింది? పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లులో పార్టీల మధ్య..ఒకే పార్టీలోని ప్రత్యర్థుల మధ్య పోరు తీవ్రమవుతోంది. అంతర్గత విభేదాలతో రగిలిపోతున్న కొందరు నేతలు రాజకీయంగా పంతం నెగ్గించుకునేందుకు.. ఎదుటివారిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తమ సత్తా చాటేందుకు సరికొత్త వ్యూహాలతో జనంలోకి వెళ్తున్నారు. అవకాశం దొరికితే చాలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు బర్త్ డే వేడుకలను వేదికగా చేసుకొని బలనిరూపణకు దిగుతున్నారు. మానుకోటలో అధికార పార్టీ ఎంపీ మాలోతు కవిత, ములుగు జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య నిర్వహించిన బర్త్ డే వేడుకలు ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇద్దరు నేతలు సృష్టించిన హంగామా చర్చనీయాంశంగా మారింది. చదవండి: (TS: కాంగ్రెస్‌లో ఎవరిగోల వారిదే.. ఠాక్రే ముందున్న సవాళ్లేంటీ?) గజమాల వెనక రాజకీయం పోటాపోటీ కార్యక్రమాలకు అధికార, విపక్ష పార్టీలనే తేడా లేదు. కొత్త సంవత్సరం తొలిరోజున మహబూబాబాద్ ఎంపీ, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత పుట్టినరోజు. ఆరోజు కవిత, ఆమె అనుచరులు సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. భారీ క్రేన్ సహాయంతో గజమాల వేసుకుని మానుకోటలో జనసందోహంతో ఊరేగింపు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అనుచరులతో రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. కవిత ఆమె అనుచరులు సృష్టించిన హంగామా వెనుక అసలు రాజకీయం వేరే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. రాబోయే ఎన్నికల్లో మహబూబాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న కవిత సిట్టింగ్ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకే బర్త్ డే వేడుకలతో సత్తా చాటే ప్రయత్నం చేశారని ప్రచారం సాగుతోంది. రైతు దీక్ష, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధనకై బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎంపీ కవిత నుంచి మైక్ లాక్కుని అవమానపరిచేలా వ్యవహరించారు. ఈ వ్యవహారంతో రగిలిపోతున్న కవిత వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ టార్గెట్ గా పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. నేనూ లైన్లో ఉన్నాను..! రాజకీయాల్లోకి వచ్చాక ఏనాడూ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోని భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఈసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ లో జనవరి 2న బర్త్ డే వేడుకలతో హంగామా చేశారు. భారీ క్రేన్ సహాయంతో గజమాల ధరించి వెంకటాపూర్‌లో ఊరేగింపు మొదలుపెట్టి నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాల్లో పర్యటించారు. పోదెం వీరయ్య పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన నిర్వహించుకున్న బర్త్‌డే వేడుకలు జరుగుతున్న ప్రచారం నిజమే అనిపిస్తున్నాయని అంటున్నారు. వీరయ్య హస్తానికి హ్మాండిచ్చి కారెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కారు ఎక్కడానికి సిద్ధమవుతున్న వీరయ్య, అక్కడా ఉంటా.. ఇక్కడ ఉంటా అంటున్నారట. భద్రాచలం, ములుగు రెండు నియోజకవర్గాలు తనవే అని నిరూపించుకునేందుకు బల ప్రదర్శన నిర్వహించినట్లు ప్రచారం సాగుతుంది. వీరయ్య వ్యూహమేంటీ? ములుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీతక్కకు చెక్ పెట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన పోదెం వీరయ్యకు గులాబీ పార్టీ గాలం వేసినట్లు తెలుస్తుంది. ముందుగా సీతక్కనే గులాబీ గూటిలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు యత్నించినప్పటికీ రేవంత్ రెడ్డి నమ్మిన బంటులా ఉన్న సీతక్క పార్టీ మారేందుకు ససేమిరా అనడంతో పోదెం వీరయ్యతో సీతక్కకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే వీరయ్య గులాబీ బాస్ ముందు కొన్ని షరతులు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్లో చేరి ములుగులో తాను పోటీలో నిలిచినా.. భద్రాచలంలో మాత్రం తాను సూచించిన వ్యక్తికే టికెట్ ఇవ్వాలని ప్రతిపాదన పెట్టినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎన్నడు లేని విధంగా బర్త్ డే సెలబ్రేషన్ పేరుతో ములుగు నియోజకవర్గంలో భారీ ఊరేగింపు నిర్వహించి అక్కడా ఉంటా.. ఇక్కడ ఉంటానని చాటి చెప్పినట్లు జనం భావిస్తున్నారు. వీరయ్య వ్యూహం జనానికి అవగతం అవుతున్నా.. గులాబీ బాస్ మదిలో ఏముందో తేట తెల్లం కావాలంటే మరి కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే. తగ్గేదేలే..! బర్త్ డే రాజకీయం ములుగు, మహబూబాబాద్‌లోనే కాదు అటు భూపాలపల్లిలో సైతం సాగుతోంది. మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి బర్త్ డే సందర్భంగా ఇటీవల గ్రాండ్ గా వేడుకలు నిర్వహించి అనుచరుల్లో కొత్త ఊపును తీసుకొచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి చెక్ పెట్టి వచ్చే ఎన్నికల్లో టికెట్ సాధించడమే లక్ష్యంగా చారీ సాబ్ బర్త్ డే పార్టీతో సత్తా చాటే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బర్త్ డే వేడుకలు.. విందు భోజనాలతో రాజకీయాలను మలుపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు ఓరుగల్లు నేతలు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ఎన్నికల ఎత్తుగడలతో నాయకులంతా ముందుకు సాగుతున్నారు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పరిస్థితి ఆందోళనకరం.. వారిలో 75 శాతం రక్తహీనత
ములుగు(వరంగల్): ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణుల్లో 75 శాతం మందికి రక్తహీనత (హిమోగ్లోబిన్ సమస్య) ఉండడం ఆందోళనకరమని సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. శుక్రవారం ఏటూరునాగారం, భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, కలెక్టర్లతో ములుగు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సి పల్ సెక్రటరీ క్రిస్టియానా జñడ్ ఛోంగ్తూ, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్యదేవరాజన్, సీఎం ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్‌లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లాలోని మంగపేట మండలం బ్రాహ్మణపల్లి పీహెచ్సీ, ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి వెల్నెస్ సెంటర్, ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు తనిఖీ చేశారు. అనంతరం సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గర్భిణులకు 75శాతం హిమోగ్లోబిన్ సమస్య ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో 2,309, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6,348, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,897, ఖమ్మంలో 4,431 మంది తీవ్ర పోషణలోపానికి గురైన పిల్లలు ఉండడం బాధాకరమన్నారు. ఆయా ఐటీడీఏల పరిధిలో మూడు లక్షల మంది చిన్నారులు వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. వచ్చే మూడు నెలల్లో పరిస్థితిలో మార్పు రావాలని, ఐసీడీఎస్, వైద్యశాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంగా ముందుకు సాగాలని సూచించారు. ఐటీడీఏ ప్రాంతాల్లో బాలామృతం, గుడ్లు, పాలు వంటి పోషకాహా రాలను అందిస్తున్నా.. ఎక్కడ లోపం ఏర్పడుతుందో అర్థం కావడం లేదన్నారు. లక్షమంది చిన్నారులకు 84 మంది మృత్యువాత పడుతున్నారని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వెల్నెస్ సెంటర్లలో పాముకాటు, కుక్కకాటు ఇంజక్షన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆరు నెలల్లో మిల్క్ బ్యాంకుల ఏర్పాటు.. వచ్చే ఆరు నెలల్లో మిల్క్ బ్యాంకులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. కేరళ రాష్ట్రంలో పరిస్థితిని పరిశీలించిన తర్వాత రాష్ట్రంలో కేసీఆర్ కిట్, ఇమ్యూనైజేషన్ కార్యక్రమాలను బలోపేతం చేశారన్నారు. కేరళలో ప్రతి గ్రామపంచాయతీలు పోటీపడి పోషకాహారాన్ని అందించడాన్ని గమనించి సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించామని తెలిపారు. ఐటీడీఏ పరిధిలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, అసిఫాబాద్ జిల్లాలను పైలట్ ప్రాజెక్టులుగా తీసుకొని 8 నెలలపాటు రెండో వంతు పోషకాహారాన్ని అందిస్తామన్నారు. విజయవంతం అయితే అన్ని ప్రాంతాల్లో అమలు చేస్తామన్నారు. 37శాతమే ముర్రుపాలు తాగిస్తున్నారు... రాష్ట్రంలో ప్రసవం అయ్యాక కేవలం 37శాతం మంది మాత్రమే పిల్లలకు ముర్రుపాలు తాగిస్తున్నారని, ఇది ఆందోళన కరమైన విషయమని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు ఈ విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టియానా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో గిరి పోషణ పథకం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అదనపు పౌష్టికాహారం అందిస్తామన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ మాట్లాడుతూ గ్రోత్‌మానిటరింగ్ డ్రైవ్ ద్వారా తక్కువ బరువుతో, పౌష్టికాహార లోపంతో గుర్తించిన పిల్లలు ములుగు జిల్లాలో 16శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10.5శాతం, ఖమ్మం జిల్లాలో 6.2శాతం ఉన్నారని తెలిపారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఐటీడీఏ ఏటూరునాగారం పరిధిలో చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. తాడ్వాయి అంగన్వాడీ కేంద్రంలో 100శాతం చిన్నారులు సరైన బరువుతో ఆరోగ్యవంతంగా పెరిగేలా పౌష్టికాహారం అందించిన అంగన్వాడీ టీచర్ భాగ్యలక్షి్మని అధికారులు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌పాటిల్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనిరుధ్, భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏ పీఓలు గౌతమ్ పోత్రు, బ్రవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, భూపాలపల్లి అదనపు కలెక్టర్ టీఎస్.దివాకర్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అల్లెం అప్పయ్య, పీహెచ్సీ వైద్యాధికారి నిఖిత, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, భూపాలపల్లి సంక్షేమ అధికారి శామ్యూల్, డీఆర్డీఓ పురుషోత్తం, ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్వైజర్లు, ఐటీడీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: అదో వెరైటీ విలేజ్.. పురుషులకో భాష, మహిళలకు మరో భాష -
పడవలో వెళ్లి.. దుప్పట్లు మోసి..
సాక్షి, ఏటూరునాగారం: ములుగు ఎమ్మెల్యే సీతక్క వరద ముంపు బాధితులకు చేయూత అందించారు. రోడ్డు మార్గం లేకపోవడంతో పడవలో వెళ్లిన ఎమ్మెల్యే.. స్వయంగా దుప్పట్లను తలపై పెట్టుకొని తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సీతక్క పేదలపై తనకున్న మమకారాన్ని మరోసారి చాటిచెప్పారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి, ఓడవాడ, ఆచార్య నగర్, నందమూరి నగర్ తదితర ప్రాంతాలు ఇటీవల వరద ముంపునకు గురయ్యాయి. ఈ మేరకు రాబిన్ ఉడ్ ఆర్మీ బాధ్యులు రమ – దామోదర్ ఆధ్వర్యాన ఆయా ప్రాంతాల్లో బాధితులకు మంగళవారం చీరలు, దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సీతక్క.. ఎలిశెట్టిపల్లికి వెళ్లే క్రమంలో రోడ్డు మార్గం లేకపోవడంతో పడవపై జంపన్న వాగు దాటారు. అక్కడ దిగాక కొద్దిదూరం నడవాల్సి ఉండటంతో ఇతరులతో కలసి సీతక్క స్వయంగా దుప్పట్లను మోశారు. అనంతరం బాధితులకు సరుకులు పంపిణీ చేసి ధైర్యం చెప్పారు. -
చెలిమనీరే దిక్కు..
సాక్షి, ఏటూరునాగారం: గిరిజనులకు చెలిమల నీరే తాగునీరు. వేసవి కాలం కావడంతో వాగుల్లో నీరు ఎండిపోయి కాల్వలను తలపిస్తున్నాయి. దీంతో గిరిపుత్రులు దప్పిక తీర్చుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ప్రస్తుత వేసవిలో ములుగు జిల్లా ఏజెన్సీ పరిధి 7 మండలాల ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడంలేదు. ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం, గోవిందరావుపేటతోపాటు వాజేడు, వెంకటాపురం మండలాల్లోని అటవీ ప్రాంతంలో సుమారు 50 గొత్తికోయగూడేలు ఉండగా.. వాటిలో 3 వేల మంది జనాభా నివాసం ఉంటోంది. వీరికి సరైన తాగునీటి వసతి లేక సమీపంలోని వాగులు, తోగుల నుంచి నీటిని తెచ్చుకుని తాగడానికి వినియోగిస్తున్నారు. ఎండలకు వాగుల్లో నీరు లేకపోవడంతో చెలిమలు తీసీ ఊటగా వచ్చిన నీటిని బిందెల్లో వడబోసి ఇళ్లకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి నీటిని తాగడం వల్ల ఒంటిపై దద్దుర్లు, చర్మవ్యాధులు, ఇతర జబ్బులు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. పటికబెల్లంతో నీటి శుద్ధి.. వాగులు, చెలిమల నుంచి తెచ్చిన నీరు మురికిగా ఉంటుంది. ఆ నీటిలో పటికబెల్లం వేసి రెండు గంటల పాటు ఉంచితే శుద్ధి అయి తేటగా మారిన తర్వాత తాగడానికి ఉపయోగిస్తుంటా రు. దీనికితోడు చిల్లిగిజ్జలను సైతం బిందెలో వేస్తే నీటిలో ఉన్న మలినాలు అడుగుకుపోయి తేటగా మారతాయి. నీటిని శుద్ధి చేయడానికి గిరిజనులు ఈ పద్ధతులను అవలంభిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ఇది పూర్తి స్థాయి రక్షిత విధానం కాకపోవడంతో రోగాలపాలవుతున్నారు. గిరిజనులకు తాగునీటి కోసం ఐటీడీఏ నుంచి ఎలాంటి స దుపాయం ఏర్పాటు చేయడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ములుగు ఏజెన్సీలో పోలీసుల తనిఖీలు
జయశంకర్‌జిల్లా: మావోయిస్టులు గురువారం బంద్‌కు పిలపునిచ్చిన సందర్భంగా.. పోలీసులు అప్రమత్తమయ్యారు. జయశంకర్ జిల్లా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో బంద్ ప్రకటన దృష్ట్యా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నరు. తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని వాజేడు మండలం కృష్ణాపురం శివారులో బుధవారం తెల్లవారుజాము నుంచి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఆదుకోవాలి గోదావరి ఉధృతి మరింత పెరగనుంది ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాసాలకు తరలించాలి నిత్యావసర వస్తువులు, మందులు అందుబాటులో ఉంచాలి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశం ఏటూరునాగారంలో అధికారులతో సమీక్ష ఏటూరునాగారం : ఏజెన్సీలోని తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం మండల్లోని ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే అందించే విధంగా ఉండాలని, అన్ని శాఖల అధికారులు మండల కేంద్రాల్లో ఉండాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశించారు. గోదావరి వరద పరిస్థితిపై సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వర్షాలు ఎక్కువగా ఉన్నాయని, గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఏజెన్సీలోని మూడు మండలాల్లో నిత్యావసర సరుకులు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సరిపడా నిల్వలు గ్రామాల్లో ఉంచాలని ఆర్డీఓ మహేందర్‌జీని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ సేవలను విస్తృతం చేసి ప్రజలకు అనునిత్యం సేవలు అందించాలని డీఎంహెచ్ఓ సాంబశివరావును ఆదేశించారు. 104, 108 వాహనాలను మండలానికి గ్రామాలకు మధ్యలోని ప్రాథమిక కేంద్రాలకు అందుబాటులో ఉంచితే రోగులకు తిప్పలు ఉండవన్నారు. ఐటీడీఏ పరిధిలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు సరిపడా ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 28 వేల కుటుంబాలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశామని, దీంతో రోగాల తీవ్రత తగ్గిందని కలెక్టర్ కరుణ ఉప ముఖ్యమంత్రికి వివరించారు. 11 మీటర్లకు వస్తే ముంపు ప్రాంతాలను గుర్తించాలి గోదావరి నది 11 మీటర్ల స్థాయికి వస్తే నీటితో మునిగే ప్రాంతాలను గుర్తించాలని ఇరిగేష¯ŒS ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డిని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాంటి కుటుంబాలను గుర్తించి డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరయ్యే విధంగా చూస్తామన్నారు. ముందుగా కుటుంబాల వివరాల తర్వాత ప్రభుత్వ స్థలాల ఎంపిక అనంతరం ఇళ్ల నిర్మాణాలను చేపట్టాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం లోతట్టు గ్రామాల ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏటూరునాగారం మండలంలో 93 కుటుంబాలకు చెందిన 210 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని, నీరు, భోజనం, వసతి సౌకర్యం కల్పించామని, మంగపేట పొదుమూరులో 12 కుటుంబాలకు చెందిన 48 మంది ప్రజలను జెడ్పీహెచ్‌ఎస్‌కు తరలించినట్లు ఆర్డీఓ ఉప ముఖ్యమంత్రికి వివరించారు. రామన్నగూడెం, రాంనగర్ గ్రామాల మధ్యలోని లోలెవల్‌కాజ్‌వే పై నుంచి గోదావరి ప్రవహించడంతో రాంనగర్, లంబాడీతండా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని ఆర్డీఓ వెల్లడించారు. ప్రజలకు నిత్యావసర సరుకులు, కావాల్సిన వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ తెలిపారు. పోలీసులు, ఎ¯ŒSడీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడే ఉంటారని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని శ్రీహరి అన్నారు. ముఖ్యంగా రోడ్లను మరమ్మతు చేయాలని, ఆర్అండ్బీ ఎస్ఈ నర్సింహకు ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏటూరునాగారం నుంచి తుపాకులగూడెం వెళ్లే ప్రధాన రోడ్డు బురదమయంగా మారిందని, ఇసుక లారీలను నిలిపివేశామని, 15 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారని ఇందు కోసం రోడ్డు మరమ్మతులు చేసి రవాణా సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ఎస్ఈని ఆదేశించారు. రోడ్డు పనులు వేగంగా చేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పుర ప్రముఖుల సలహాలను పాటిస్తాం గ్రామ పెద్దల ఇచ్చే సూచనలు, సలహాలను పాటిస్తామని కడియం శ్రీహరి అన్నారు. మంగపేట, ఏటూరునాగారం మండలాలకు చెందిన గ్రామ పెద్ద మనుషులను సమీక్షకు పిలిపించారు. గోదావరి చుట్టూ నిర్మించిన కరకట్టకు అమర్చిన గేట్ల ద్వారా వరద నీరు గ్రామాల్లో రావడం వల్ల పంటలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చక్రధర్‌రావు, నూతి కృష్ణ, ఇర్సవడ్ల వెంకన్న, చిటమట రఘు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. కరకట్టకు ఉన్న గేట్లు ఎందుకు సరిగ్గా బిగించలేదని ఎస్ఈ శ్రీనివాసరెడ్డి ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు. బీడింగ్ సరిగ్గా లేదని ఎస్ఈ చెప్పగా వెంటనే చేయించాలని ఆదేశించారు. అలాగే మండల కేంద్రంలో సుమారు 200ల కుటుంబాలు వరద వల్ల ముంపు గురవుతున్నాయని జెడ్పీటీసీ వలియాబీ అన్నారు. వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని పీఓను డిప్యూటీ సీఎం ఆదేశించారు. గ్రామంలో సహాయక చర్యలు చేపట్టినందుకు కాంగ్రెస్ పార్టీ ఇర్సవడ్ల వెంకన్నను కలెక్టర్ అభినందించారు. మంగపేట మండలం అకినేపల్లి మల్లారంలో బ్యాక్‌వాటర్ వల్ల ప్రమాదం ఉందని, మంగపేట పుష్కరఘాట్ కోతకు గురికావడం వల్ల 60 ఎకరాలు నీట మునిగి నష్టపోయాయని శ్రీధర్ వివరించారు. ఒడ్డు కోతకు గురికాకుండా నాపరాయి, ఇసుక బస్తాలు, కాంక్రీట్‌తో రక్షణ చర్యలు చేపట్టాలని పీఓ, ఆర్డీఓలను డిప్యూటీ సీఎం ఆదేశించారు. అలాగే ఐలాపురం గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని టీఆర్ఎస్ నాయకుడు చంద్రం శ్రీహరికి విన్నవించారు. రోడ్డు నిర్మాణం జరిగే విధంగా చూస్తామన్నారు. హెల్ప్‌లై¯ŒS సెల్ ఏర్పాటు ఐటీడీఏ కార్యాలయంలో వరద బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లై¯ŒS సెల్ ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ తెలిపారు. ఎవరికైనా ఏ అవసరం వచ్చినా, ఆపదలో ఉన్నా 08717–231246, సెల్ 94909 57006కు కాల్ చేయాలన్నారు. సమీక్షలో ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, ఓఎస్డీ శ్వేతారెడ్డి, ఏఎస్పీ విశ్వజిత్కాంపాటి, ఏపీఓ వసంతరావు, ఈఈ కోటిరెడ్డి, ఎంపీపీ మెహరున్నీసా, తహశీల్దార్ నరేందర్, ఎంపీడీ ప్రవీణ్ పాల్గొన్నారు.